బెంగళూరు: దొడ్డబళ్లాపుర పట్టణంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటర్‌ను కారు ఢీకొనడంతో దంపతులు దుర్మరణం పాలయ్యారు. దొడ్డ తాలూకా కత్తిహొసహళ్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య (55), అనిత (45), సోమశెట్టిహళ్లిలోని బంధువుల ఇంటిలో కార్యక్రమం చూసుకుని స్కూటర్‌లో తిరిగి వస్తున్నారు. శాటిలైట్ రింగ్ రోడ్డులో కూగేనహళ్లి సమీపంలో వేగంగా వచ్చిన కారు వీరిని ఢీకొంది. దీంతో దూరంగా ఎగిరిపడడంతో తీవ్రగాయాలై భార్యాభర్తలు అక్కడే కన్నుమూశారు. దొడ్డబెళవంగల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.


