ఐఐటీ జేఈఈ టాపర్‌..కానీ దోమల బ్రెయిన్‌పై స్టడీ..! | Nitin Gupta: who left computer science to study mosquito brains | Sakshi
Sakshi News home page

ఐఐటీ జేఈఈ టాపర్‌..కానీ దోమల బ్రెయిన్‌పై స్టడీ..!

Sep 30 2026 3:51 PM | Updated on Sep 30 2026 4:14 PM

Nitin Gupta: who left computer science to study mosquito brains

ఐఐటీ జేఈఈ టాపర్‌లు చాలమటుకు కార్పొరేట్‌ రంగంలో మంచి వేతనంతో స్థిరపడటం లేదా పారిశ్రామిక వేత్తలుగా ఎదగడం చూశాం. ఇంకొందరు ఏకంగా సివిల్స్‌ వైపుకి వచ్చి దేశ సేవ చేస్తున్నవాళ్లను చూశాం. ఇవేమి కాదని న్యూరోసైన్స్‌ వైపుకి వెళ్లి రీసెర్చ్‌ చేస్తున్న వ్యక్తి గురించి విన్నారా. ఔను అతడు ఇంజనీరింగ్‌ సబ్జెక్టు వద్దంటూ జీవశాస్త్రం వైపుకి మళ్లీ..వేటిపై అధ్యయనం చేస్తున్నాడో తెలిస్తే విస్తుపోతారు. ఇలాంటి పరిశోధనలు కూడా ఉంటాయా? అని ఆశ్చర్యం కలుగక మానదు.

ఆయనే నితిన్‌ గుప్తా. 2000లో ఐఐటీ జేఈఈలో టాపర్‌గా నిలిచి ఐఐటీ కాన్పూర్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ చదివారు. ఆ సమయంలోనే జీవశాస్త్రంపై ఆసక్తి కలిగింది. దాంతో అమెరికాకు పయనమై అక్కడ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ డియాగోలో చేరి, అక్కడ 2009లో బయోఇన్ఫర్మాటిక్స్ అండ్‌ సిస్టమ్స్ బయాలజీలో పిహెచ్‌డి పూర్తి చేశారు. ఆ తర్వాత  తొలి పరిశోధనలో ప్రోటీన్లు, జీనోమ్‌లపై పనిచేస్తూ, కంప్యూటర్లను- జీవశాస్త్రాన్ని అనుసంధానించారు. 

షారుఖ్ ఖాన్ మూవీ ప్రేరణతో..!
అలా అక్కడ నేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ హెల్త్‌లో పోస్ట్‌డాక్టోరల్‌ పరిశోధకుడిగా పనిచేసిన తర్వాత 2014లో భారత్‌కి తిరిగి వచ్చారు. ఆ తర్వాత తాను ఎక్కడైతే కంప్యూటర్‌ సైన్స్‌ని అభ్యసించారో అదే ఐఐటి కాన్పూర్‌కి వచ్చి బయోలాజికల్ సైన్సెస్ అండ్ బయోఇంజనీరింగ్ విభాగంలో అధ్యాపకుడిగా పనిచేయడం విశేషం. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయన ఉన్నపళంగా అమెరికా నుంచి తన మాతృభూమి భారత్‌కి తిరిగి రావడానికి ప్రధాన కారణం బాటీవుడ్‌ ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ మూవీ ‘స్వదేశీ’ మూవీ ప్రేరణతో భారత్‌కి తిరిగి వచ్చారట ఆయన. 

అలా భారత్‌కి రావడమే కాదు మళ్లీ తన అధ్యయన రంగాన్ని కూడా మార్చేశారు. ఈసారి జీవశాస్త్రం నుంచి న్యూరోసైన్సుకి మళ్లారు. ఆ ఐఐటీ కాన్పూర్‌లోనే ల్యాబ్‌లో నితిన్‌ మెదడు వాసనలను ఎలా గ్రహిస్తుంది, ఆ సమాచారాన్ని ప్రవర్తనకు ఎలా మార్గనిర్దేశం చేస్తుంది అనే దానిపై అధ్యయనం చేశారు. ఈ ప్రయోగశాల చీమలు, మిడతలు, దోమలపై అధ్యయనం చేస్తుంది. ఇక్కడ పరిశోధకులు ఎలక్ట్రోఫిజియాలజీ, హిస్టాలజీ, ప్రవర్తనా ప్రయోగాలు, జన్యు మార్పులు,  కంప్యూటేషనల్ మోడలింగ్ వంటి పద్ధతులను ఉపయోగిస్తారు.  

అందుకు దోమలే ఉపయుక్తంగా ఉంటాయట. ఎందుకంటే అవి పర్యావరణంలోని రసాయన సంకేతాలను గ్రహించి తమ అతిధేయి కణాన్ని వెతుక్కుంటాయి. ఆ విధంగా మానువులను ఆశ్రయిస్తాయట. మరికొన్ని.. ఇది ప్రమాదకరం అంటూ దోమలను దూరంగా జరిగేలా చేస్తాయట. ఈ కార్యకలాపాల్లో దోమ మెదడు ఏ విధంగా ఈ సంకేతాలను ఇస్తుంది..అది ఏవిధంగా ప్రవర్తనగా రూపాంతరం చెందుతుంది అనే వాటిపై ఆయన పరిశోధన చేస్తున్నారు. 

ప్రస్తుతం ఆయన దోమ మెదడులోని ఒక ప్రాంతమైన యాంటెనల్ లోబ్‌పై అధ్యయనం చేస్తున్నారు. అంతేగాదు ఆయన అధ్యయనాలు మానవ మానసిక సమస్యలకు పరిష్కారం చూపడం విశేషం. అంతేగాదు నితిని బృందం పరిశోధన ఫలితాలు కొంత వరకు డిప్రెషన్‌, ఆందోళనతో సతమతమవుతున్న వాళ్లను బాగు చేసేందుకు కూడా దారితీసిందట. 

అంటే ఇక్కడ నితిన్‌ నాడీ వ్యవస్థ సమాచారాన్ని ప్రవర్తనగా ఎలా మారుస్తుందో అర్థం చేసుకునే ప్రయత్నంలో, ఇలా కీటకాల సూక్ష్మమైన మెదళ్ళపై పరిశోధనలు చేస్తున్నారని తెలుస్తోంది. ఏదీ ఏమైనా ఒక ఇంజనీర్‌ కాస్త జీవశాస్త్రవేత్తగా అక్కడి నుంచి న్యూరో శాస్త్రవేత్తగా మారడం అంటే..అత్యంత అసాధారణమైన అరుదైన విషయం కదూ..!.

ఇదీ చదవండి: వేద విద్య నేర్చుకుంటూనే.. ఇస్రో శాస్త్రవేత్త రేంజ్‌కి!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement