వేద విద్య నేర్చుకుంటూనే.. ఇస్రో శాస్త్రవేత్త రేంజ్‌కి! | Govind Krishnan left conventional school for gurukula he became ISRO scientist | Sakshi
Sakshi News home page

వేద విద్య నేర్చుకుంటూనే.. ఇస్రో శాస్త్రవేత్త రేంజ్‌కి!

Sep 30 2026 11:50 AM | Updated on Sep 30 2026 12:04 PM

Govind Krishnan left conventional school for gurukula he became ISRO scientist

ఒక వ్యక్తి రెండు విభిన్న రంగాలను ఎంచుకుని రాణించడం అత్యంత అరుదు. పైగా రెండు పడవలపై ప్రయాణం ప్రమాదమనే అంటుంటారు. అలాంటిది రెండింటిని సమతుల్యం చేసుకుంటూ సాగిన విధం ఈ తరం యువతరానికి అతిపెద్ద స్ఫూర్తి. నిజనానికి ఇతరు ఎంచుకున్న ఒక రంగ అత్యంత కఠినతరమైన జీవన విధానం అయినా..ఆధునిక విద్యను కూడా జోడించి రెండింటిని విజయవంతంగా పూర్తి చేయడమే కాదు ప్రతిష్టాత్మక ఇస్రో సంస్థలో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు.

అతడే కన్నూర్‌కి చెందిన గోవింద్‌ కృష్ణన్‌. అతని దినచర్య పార్య పుసక్తాలు, తరగతి గదులతో కాకుండా వేద మంత్రోచ్ఛారణలు, ఆధ్యాత్మిక సాధనలు, క్రమశిక్షణతో కూడిన నిమయాలతో సాగింది. తన కుమారుడికి వేదవిద్య నేర్పించాలనే ఉద్దేశ్యంతోనే గోవింద్‌ తండ్రి నావికాదళ మాజీ అధికారి, హరీష్ కుమార్ 2009లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. కన్నూర్‌కి రాకముందు, ఆ కుటుంబం కొచ్చి, లోనావాలా, ముంబై వంటి నావికా స్థావరాల మధ్య మారుతూ ఉండేది.

వినూత్న విద్యా ప్రయాణం ..
పయ్యన్నూర్‌లోని కేంద్రీయ విద్యాలయంలో నాలుగవ తరగతి పూర్తి చేసిన తర్వాత నుంచే గోవింద్ వినూత్న విద్యా ప్రయాణం మొదలైంది. ఎందుకంటే నాల్గవ తరగతిలో ఉండగానే గోవింద్‌కి ఉపనయం చేశారు తల్లిదండ్రులు. ఆ వెంటనే, అతని గురుకుల ప్రయాణం ప్రారంభమైంది. అది ఐదేళ్ల కోర్సు, కానీ అతడు నాలుగేళ్లలోనే పూర్తి చేశాడు. గోవింద్‌ వేద అధ్యయనం చేస్తూనే సాధారణ విద్య కోసం గవర్నమెంట్‌ స్కూల్‌ పరీక్షలకు హాజరవ్వుతుండేవాడు. 

ఆ తర్వాత నడక్కావు లోని వివేకోదయం బాయ్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో 8 నుండి 10వ తరగతి చదివాడు. అప్పుడు కూడా గురుకులంలోనే ఉంటూ..ఉదయం 8.30 వరకు గురుకులం, తర్వాత స్కూల్, మళ్ళీ రాత్రి 9 వరకు గురుకులం, ఆ తర్వాత 11 వరకు స్కూల్ చదువు  ఇలా రెండింటిని సమతుల్యం చేసుకుంటూ రెండు విద్యలను అభ్యసించాడు. అయితే గోవింద్ 10వ తరగతిని పూర్తి A+ గ్రేడ్‌లతో పూర్తి చేశాడు. అతను గురుకులాన్ని విడిచిపెట్టిన తర్వాత, ఉన్నత మాధ్యమిక విద్య కోసం మంగళూరులోని మూడ్‌బిద్రిలో ఉన్న ఆల్వాస్ కాలేజీలో చేరాడు.

వేద మంత్రోచ్ఛారణల నుంచి ఇస్రో శాస్త్రవేత్తగా..
అతను ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు కూడా సిద్ధమై, జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ రెండింటినీ క్లియర్ చేసి..తిరువనంతపురంలోని వలియమలలో ఉన్న ఐఐఎస్‌టి (IIST)కి వెళ్లేందుకు దారితీసింది. అక్కడ బీటెక్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ప్రోగ్రామ్‌లో చేరాడు. ఆ తర్వాత 2025 నాటికి, గోవింద్ అసాధారణ విద్యా ప్రయాణం మరో మైలురాయిని చేరుకుంది. గోవింద్‌ ఇస్రో(ISRO) సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ICRB) ప్రక్రియ ద్వారా సైంటిస్ట్‌గా ఎంపికయ్యాడు. 

ప్రస్తుతం తిరువనంతపురంలోని తుంబాలో ఉన్న ఇస్రో ప్రధాన కేంద్రమైన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC)లో శాస్త్రవేత్తగా సేవలందిస్తున్నారు. ఇక గోవింద్‌ గురుకలంలో యజుర్వేదాన్ని అభ్యసించాడు. ఆయన ఇస్రోలో చేరాక కూడా తన వేద అధ్యయనంకి సంబంధించిన ఆధ్యాత్మిక సాధనను నియమానుసారంగా కొనసాగిస్తుండటం విశేషం. 

ఆధ్యాత్మిక సాధన తనకు జిమ్‌కు వెళ్లడం లాంటిదని, శారీరకంగా ఫిట్‌గా ఉండేందుకు జిమ్‌కి ఎలగైతే వెళ్తారో అలా తాను ఏకాగ్రత, మాససిక స్పష్టత, జ్ఞాపకశక్తి కోసం ఇదంతా చేస్తానని వివరించాడు. అలాగే గోవింద్‌ తోపాటు వేద అధ్యయనం చేసిన వాళ్లంతా పూజరులుగా సెటిల్‌ అవ్వగా అతడు మాత్రమే భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని..రెండు వేర్వేరు ప్రపంచాలను సమన్వయం చేయొచ్చని చెప్పాడు. 

ఇదీ చదవండి: ఐటీ ఉద్యోగం వదలి ఆటో డ్రైవర్‌గా మహిళా టెకీ..!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement