మయన్మార్ సరిహద్దులోని అరుణాచల్ ప్రదేశ్‌లోని చంగ్లాంగ్ జిల్లాలో తిరుగుబాటులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో అస్సామ్ రైఫిల్స్ జవాన్ ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు గాయపడ్డారు.సరిహద్దు కంచె (border-fencing) పనులు జరుగుతున్న ప్రాంతంలో 21వ అస్సామ్ రైఫిల్స్ జవాన్లు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఉదయం 6:30 గంటలకు ఈ దాడి జరిగింది. వీర మరణం పొందిన సైనికుడిని ఏళ్ల హవిల్దార్ జంఖోకై కుకీ (42)గా గుర్తించారు. గాయపడిన సైనికులకు సైనిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం,ఈశాన్య భారతదేశం, యన్మార్ సరిహద్దు ప్రాంతాలలో క్రియాశీలంగా ఉన్న ఒక నిషేధిత నాగా వేర్పాటువాద సంస్థ ఎన్‌ఎస్‌సిఎన్ కే-వైఏ (NSCN K-YA) వర్గానికి చెందిన తిరుగుబాటుదారులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది.తిరుగుబాటుదారులను మట్టుబెట్టడానికి భద్రతా దళాలు ఆ ప్రాంతంలో ఆపరేషన్ ప్రారంభించాయని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో పనిచేస్తున్న తిరుగుబాటు గ్రూపుల కదలికల కారణంగా చాంగ్లాంగ్ జిల్లాలోని భారత్-మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో ఆందోళన నెలకొంది.
ఇదీ చదవండి: సియా మాజీ లవర్ వెలుగులోకి : ఫ్రెండ్ చెప్పిన షాకింగ్ విషయాలు
TRIBUTE TO OUR BRAVEHEART
Lt Gen Vikas Lakhera, AVSM, SM, Director General Assam Rifles & All Ranks of Assam Rifles pay solemn tribute to Hav Jangkhokai Kuki who made the supreme sacrifice in the line of duty at Changlang, Arunachal Pradesh on 29 Sep 2026 and offer deep… pic.twitter.com/tcNVm7p7H4— The Assam Rifles (@official_dgar) September 29, 2026


