కూటమికి బిగ్‌ షాక్‌.. బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు | Bolisetty Satyanarayana Serious Comments On CBN Govt | Sakshi
Sakshi News home page

కూటమికి బిగ్‌ షాక్‌.. బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు

Sep 29 2026 12:27 PM | Updated on Sep 29 2026 12:44 PM

Bolisetty Satyanarayana Serious Comments On CBN Govt

సాక్షి, విశాఖ: సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు డబ్బులు ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం చేసిన మంచిని మాత్రమే చెప్పి.. తప్పులను చెప్పకుండా ఉండేందుకు డబ్బులు ఇవ్వడం ఒక రకంగా లంచం ఇవ్వడమేనని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్న తప్పొప్పులను రెండింటినీ చెప్పే వారికి మాత్రమే డబ్బులు ఇవ్వాలని సూచించారు. మంచిని మాత్రమే ప్రచారం చేసి.. చెడును ప్రజలకు చెప్పకపోతే చివరికి ప్రజల్లో తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఉంటుందని బొలిశెట్టి అన్నారు. ప్రభుత్వ పనితీరుపై సోషల్ మీడియా వేదికల్లో వాస్తవాలను చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

కొండల పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు..
విశాఖలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని కాపాడాల్సిన బాధ్యత డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై ఉందని బొలిశెట్టి అన్నారు. కొండలను రక్షించేందుకు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఇష్టానుసారంగా కొండలను తవ్వడం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. ఇటీవల కూడా విశాఖలో పర్యావరణ అంశాలపై బొలిశెట్టి సత్యనారాయణ పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన గతంలో జనసేనలో పర్యావరణ విభాగం బాధ్యతల్లో ఉండగా.. 2026 మార్చిలో పార్టీ అధికారిక బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు జనసేన ప్రకటించింది.

ఎమ్మెల్యే వంశీపై విమర్శలు..
విశాఖకు చెందిన ఎమ్మెల్యే వంశీపై కూడా బొలిశెట్టి విమర్శలు చేశారు. ఎమ్మెల్యే వంశీకి జనసేన సిద్ధాంతాలు ఇంకా వంటపట్టలేదని ఘాటు విమర్శలు చేశారు. ఆయన ఇంకా వ్యాపారవేత్తగానే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పర్యావరణాన్ని కాపాడే వారికి ఓట్లు వేయాలని ప్రజలకు బొలిశెట్టి పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: కొత్త సెక్షన్లతో కేసులు.. సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement