రూ.75 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం | Daughte Gets Rs75 Lakh Package Job Success Story | Sakshi
Sakshi News home page

కూతురు సత్తాకు భారీ గుర్తింపు.. రూ.75 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం

Sep 27 2026 2:28 PM | Updated on Sep 27 2026 3:25 PM

Daughte Gets Rs75 Lakh Package Job Success Story

కూతురు సహనారెడ్డితో తల్లిదండ్రులు గోపు రేణుక, సమ్మిరెడ్డి

తాము చదువుకోలేక ఎదుర్కొన్న కష్టాలు తమ బిడ్డ పడకూడదని ఆ తల్లిదండ్రులు అనుకున్నారు. తాము చిందించిన ప్రతీ చెమట చుక్కను కూతుళ్ల భవిష్యత్తుకు పునాదిగా మార్చారు. మరికొందరు తల్లిదండ్రులు కొడుకు లేడని బాధపడలేదు. కూతుళ్లనే  కుమారులుగా భావిస్తూ ఉన్నతస్థానాలకు వెళ్లాలని ఆశపడ్డారు. వారి నమ్మకాన్ని కూతుళ్లు నిలబెట్టారు. ఉన్నతస్థానాలకు ఎదిగి తల్లిదండ్రుల పేరు నిలబెట్టారు. నేడు (ఆదివారం) కూతుళ్ల దినోత్సవం (డాటర్స్‌ డే) సందర్భంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తల్లిదండ్రుల కల నెరవేర్చిన కూతుళ్లు, కూతుళ్ల కోసం కష్టపడిన తల్లిదండ్రులపై ప్రత్యేక కథనాలు.  

కూతుర్ని చూసి గర్వపడుతున్నాం..
హన్మకొండ : నిన్నుచూసి మేము తల్లిదండ్రులుగా ఎంతో గర్వపడుతున్నాం. కూతురు సహనా రెడ్డి చిన్ననాటి నీ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటా ఆనందం పొందుతున్నాం. విద్య అనేది భవిష్యత్తును మార్చే శక్తి అని దృఢంగా నమ్మి మా కూతురును చదివించాం. కాకతీయ యూనివర్సిటీలో బీటెక్‌ పూర్తి చేసి, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ స్కూల్‌ ఎంబీఏ పూర్తి చేసింది. మల్టీ నేషనల్‌ ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ కంపెనీలో ఏడాదికి రూ.75 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేస్తూ సమాజంలో ఉన్నత స్థాయిలో నిలవడం మాకెంతో గర్వకారణం. మా ఆనందం.. ఆశలకు ప్రతీక అయిన నీవు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నతశిఖరాలను అధిరోహించాలని, నేటి సమాజానికి మార్గదర్శకురాలిగా నిలవాలని కోరుకుంటున్నాం.           –గోపు రేణుక, సమ్మిరెడ్డి, హనుమకొండ

కమర్షియల్‌ టాక్స్‌లో అసిస్టెంట్‌ కమిషనర్‌గా..
హన్మకొండ: జిల్లాలోని నర్మెట మండలం బొమ్మకూర్‌ తండాకు చెందిన గిరిజన రైతు నున్సావత్‌ హరిసింగ్‌–లత దంపతుల కుమార్తె దివ్య తన తండ్రి కోరికను నెరవేర్చారు. పూటగడవని పరిస్థితుల్లో తాను ఉన్నత స్థితికి చేరుకోవాలనే ఆశ నెరవేరలేదని కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు తరచూ తన కుమార్తెకు హరిసింగ్‌ చెబుతుండేవాడు. దీంతో తండ్రి ఆశయాలను నెరవేర్చాలనే దృఢ సంకల్పంతో కూతురు దివ్య గత ఏడాది గ్రూప్‌–1లో ర్యాంక్‌ సాధించి ప్రస్తుతం కమర్షియల్‌ టాక్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా హైదరాబాద్‌ మియాపూర్‌లో విధులు నిర్వహిస్తున్నారు ఆమె. దీంతో తల్లితండ్రులు తమ కూతురు సాధించిన విజయం చూసి గర్వపడుతున్నారు.  


కుటుంబ సభ్యులతో దివ్య  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement