జూనియర్‌ సివిల్‌ జడ్జిగా అశ్విని | Ashwini as Junior Civil Judge In Jangaon District | Sakshi
Sakshi News home page

జూనియర్‌ సివిల్‌ జడ్జిగా అశ్విని

Sep 27 2026 1:49 PM | Updated on Sep 27 2026 2:01 PM

Ashwini as Junior Civil Judge In Jangaon District

తాము చదువుకోలేక ఎదుర్కొన్న కష్టాలు తమ బిడ్డ పడకూడదని ఆ తల్లిదండ్రులు అనుకున్నారు. తాము చిందించిన ప్రతీ చెమట చుక్కను కూతుళ్ల భవిష్యత్తుకు పునాదిగా మార్చారు. మరికొందరు తల్లిదండ్రులు కొడుకు లేడని బాధపడలేదు. కూతుళ్లనే  కుమారులుగా భావిస్తూ ఉన్నతస్థానాలకు వెళ్లాలని ఆశపడ్డారు. వారి నమ్మకాన్ని కూతుళ్లు నిలబెట్టారు. ఉన్నతస్థానాలకు ఎదిగి తల్లిదండ్రుల పేరు నిలబెట్టారు. నేడు (ఆదివారం) కూతుళ్ల దినోత్సవం (డాటర్స్‌ డే) సందర్భంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తల్లిదండ్రుల కల నెరవేర్చిన కూతుళ్లు, కూతుళ్ల కోసం కష్టపడిన తల్లిదండ్రులపై ప్రత్యేక కథనాలు.

కన్నవారి కలలు ఫలించాయి
జనగామ జిల్లా: జిల్లాలోని రఘునాథపల్లికి చెందిన నోముల పార్వతి–యాకయ్యది వ్యవసాయాధార కుటుంబం. సమాజంలో విద్య లేకపోతే ఎదురయ్యే ఇబ్బందులను స్వయంగా అనుభవించిన ఆ దంపతులు కూతురిని సమాజానికి ఉపయోగపడే ఉన్నత స్థానంలో చూడాలని కలలు కన్నారు. వారి కాష్టాన్ని, త్యాగాలను అర్దం చేసుకున్న అశ్విని ఆహర్నిశలు శ్రమించి ఏడాది క్రితం వనపర్తి జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. విజయవంతంగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ‘కూతురు న్యాయమూర్తి కావాలన్న మా అశను తను నెరవేర్చింది. ఏడాది కాలంగా జడ్జిగా సేవలు అందిస్తున్న మా బిడ్డను చూస్తేంటే కడుపు నిండిపోతుంది. కూతుర్ల దినోత్సం వేళ ఒక కూతురిగా తను మాకు ఇచ్చిన అతి పెద్ద బహుమతి’అని అశ్విని తల్లిదండ్రులు పార్వతి, యాకయ్య ఎంతో ఆనందంగా తెలిపారు.

తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు
మా పాప శ్రేష్ట ప్రవస్థి రెండో తరగతిలోనే ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొని వంద  పద్యాలు కంఠస్థం చేసి జూనియర్స్‌ విభాగంలో అందరి ముందు వినిపించింది. అప్పటి మంత్రి లక్ష్మారెడ్డితో ప్రశంసలు అందుకుంది. ఆరేళ్ల వయసులో 16 నిమిషాల్లో 100 పద్యాలు వినిపించి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఇంతవరకు ఈ రికార్డును రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ కూడా బ్రేక్‌ చేయలేదు. ఇంకా పలు రంగాల్లో తన ప్రతిభ చాటుతోంది. ప్రస్తుతం ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతోంది.
– శివగారి కిరణ్‌ కుమార్, జనగామ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement