నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమాలో పలు పాత్రలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇందులో సంపూర్ణేష్ బాబు భార్య ‘దేవి’ పాత్రలో విషిక తనదైన నటనతో మెప్పించింది.
గతంలో ‘కోర్ట్’, ‘పతంగ్’, ‘పురుషః’ వంటి సినిమాలు, సిరీస్‌లతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె..
‘ది ప్యారడైజ్’లో విభిన్నమైన లుక్‌లో కనిపించింది. సినిమా విడుదల తర్వాత విషిక పాత్రకు మంచి స్పందన లభిస్తోంది.


