టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరో వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఆడిన తొలి బంతికే అత్యధికసార్లు సిక్సర్ బాదిన ప్లేయర్‌గా అభిషేక్ చరిత్ర సృష్టించాడు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో సిక్సర్‌తో తన పరుగుల ఖాతా తెరిచిన అభిషేక్.. ఈ అరుదైన ఫీట్‌ను సొంతం చేసుకున్నాడు.
ఈ పంజాబ్ బ్యాటర్ ఇప్పటివరకు తను ఆడిన తొలి బంతికే 7 సిక్సర్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు అఫ్గానిస్తాన్ ప్లేయర్ షఫికుల్లా షిన్వారీ(6) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో షిన్వారీ ఆల్‌టైమ్ రికార్డును అభిషేక్ బ్రేక్ చేశాడు.
కాగా పొట్టి క్రికెట్‌లో అభిషేక్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా కేవలం 12 బంతుల్లో 29 పరుగులు చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. అంతకుముందు విండీస్ సిరీస్‌లో కూడా అభిషేక్ సత్తాచాటాడు.
ఫిలిప్స్ విధ్వంసం
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ (36 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82 నాటౌట్) టాస్ స్కోరర్‌గా నిలవగా.. ఫిన్ అలెన్ (24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), బెవాన్ జాకబ్స్ (16 బంతుల్లో 31) రాణించారు.
భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. లక్ష్య చేధనలో భారత బ్యాటర్లు కూడా దూకుడుగా ఆడుతున్నారు. సంజూ శాంసన్ కేవలం 23 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను పూర్తి చేసుకున్నాడు.
చదవండి: IND vs NZ: రీఎంట్రీలో భువనేశ్వర్ కుమార్ చెత్త రికార్డు


