T20 Cricket
-
26 బంతుల్లో సెంచరీ.. పొట్టి క్రికెట్లో పెను సంచలనం
ఐపీఎల్ మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్న వేల పొట్టి క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. యూరోపియన్ టీ10 లీగ్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో ఇటలీకి చెందిన జైన్ నఖ్వీ కేవలం 26 బంతుల్లోనే శతకొట్టాడు. పొట్టి క్రికెట్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. గతంలో ఈ రికార్డు ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట ఉండేది. సాహిల్ 2024లో సైప్రస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 27 బంతుల్లో సెంచరీ చేశాడు. సాహిల్ తర్వాత వేగవంతమైన సెంచరీ రికార్డు భారత ఆటగాళ్లు ఉర్విల్ పటేల్, అభిషేక్ శర్మ పేరిట సంయుక్తంగా ఉంది. ఉర్విల్, అభిషేక్ తలో 28 బంతుల్లో (టీ20ల్లో) సెంచరీలు చేశారు. వీరి తర్వాత అత్యంత వేగవంతమైన టీ20 సెంచరీ రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ 2013 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీకి ఆడుతూ పూణే వారియర్స్‌పై 30 బంతుల్లో శతక్కొట్టాడు.టాప్-10 ఫాస్టెస్ట్ సెంచరీలు..జైన్ నఖ్వీ- 26 బంతుల్లోసాహిల్ చౌహాన్- 27ఉర్విల్ పటేల్- 28అభిషేక్ శర్మ- 28క్రిస్ గేల్- 30రిషబ్ పంత్- 32లుబ్బే- 33నికోల్ లాఫ్టన్- 33సికందర్ రజా- 33ఆండ్రూ సైమండ్స్- 34నమ్మశక్యంకాని స్ట్రైక్‌రేట్‌తో..నఖ్వీ ఇన్నింగ్స్ విషయానికొస్తే.. ఈ ఇన్నింగ్స్‌లో అతను మొత్తం 37 బంతులు ఎదుర్కొని నమ్మశక్యంకాని 432.43 స్ట్రైక్ రేట్‌తో 24 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 160 పరుగులు చేశాడు. నఖ్వీ ఇన్నింగ్స్‌లో మరో విశేషమేమిటంటే.. రెండు సార్లు ఒకే ఓవర్లో అతను వరుసగా 6 సిక్సర్లు కొట్టాడు. టీ20ల్లో యువరాజ్ సింగ్, హజ్రతుల్లా జజాయ్, కీరన్ పోలార్డ్, తిసారా పెరీరా ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన వారిలో ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. యూరోపియన్ టీ10లో లీగ్‌లో భాగంగా టీమ్ సివిడేట్, మార్ఖోర్ మిలానో జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 23 ఏళ్ల జైన్ నఖ్వీ మార్ఖోర్ మిలానో తరఫున ఆడాడు. తొలుత బ్యాటింగ్ చేసిన మార్ఖోర్ మిలానో.. జైన్ నఖ్వీ విధ్వంసకర సెంచరీతో విరుచుకుపడటంతో 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. మార్ఖోర్ మిలానో ఇన్నింగ్స్‌లో జైన్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.అనంతరం 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సివిడేట్ జట్టు 9 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటై 104 పరుగుల తేడాతో ఘెర పరాజయాన్ని ఎదుర్కొంది. సివిడేట్ తరపున షాబాజ్ మసూద్ అత్యధికంగా 34 పరుగులు చేశాడు.నఖ్వీ కెరీర్ ఇలా..జైన్ నఖ్వీ అంతర్జాతీయ క్రికెట్లో ఇటలీ తరఫున ఆడుతున్నాడు. అతను ఇప్పటివరకు 4 టీ20 మ్యాచ్‌లు ఆడి కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. -
RR VS RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. మరో సెంచరీ
ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 13) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన విరాట్.. టీ20ల్లో 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన తొలి భారత్ మరియు ఆసియా ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఓవరాల్‌గా చూసినా డేవిడ్ వార్నర్ మాత్రమే విరాట్ కంటే ముందు టీ20ల్లో 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. వార్నర్ 400 టీ20 మ్యాచ్‌ల్లో 108 హాఫ్ సెంచరీలు చేయగా.. విరాట్ తన 388వ టీ20 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. టీ20ల్లో విరాట్ 388 ఇన్నింగ్స్‌లు ఆడి 9 సెంచరీలు, 100 హాఫ్ సెంచరీల సాయంతో 13100 పైచిలుకు పరుగులు చేశాడు.THE HISTORIC MOMENT - 100 FIFTIES FOR KING KOHLI IN T20 HISTORY 🎯 pic.twitter.com/e4uvnxh0Vd— Johns. (@CricCrazyJohns) April 13, 2025టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన టాప్-5 ప్లేయర్లువార్నర్- 108విరాట్- 100బాబర్ ఆజమ్- 90గేల్- 88బట్లర్- 86కాగా, రాయల్స్‌తో మ్యాచ్‌లో విరాట్ రికార్డు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (47 బంతుల్లో 75; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. ధృవ్ జురెల్ (35 నాటౌట్), రియాన్ పరాగ్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ సంజూ శాంసన్ (15) మరోసారి నిరాశపర్చగా.. ఆఖర్లో వచ్చిన హెట్‌మైర్ 9, నితీశ్ రాణా 4 (నాటౌట్) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, హాజిల్‌వుడ్, కృనాల్ తలో వికెట్ తీశారు.అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. 17.3 ఓవర్లలో ఫిల్ సాల్ట్ (33 బంతుల్లో 65; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. విరాట్ కోహ్లి (45 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయమైన అర్ద సెంచరీతో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. పడిక్కల్ (28 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) బౌండరీ కొట్టి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. విరాట్ హాఫ్ సెంచరీల సెంచరీని విరాట్ సిక్సర్‌తో అందుకోవడం విశేషం. ప్రస్తుత సీజన్లో విరాట్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ ఐదో స్థానానికి ఎగబాకాడు. ఈ సీజన్లో విరాట్ 6 మ్యాచ్‌ల్లో 62 సగటున, 143.35 స్ట్రయిక్ రేట్‌తో 248 పరుగులు చేశాడు. 6 మ్యాచ్‌ల్లో 349 పరుగులు చేసిన పూరన్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. -
RCB VS DC: మరో సెంచరీకి అడుగు దూరంలో ఉన్న విరాట్
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 10) ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ సీజన్లో ఢిల్లీ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి అజేయ జట్టుగా కొనసాగుతుండగా.. ఆర్సీబీ నాలుగింట మూడు గెలిచి, ఓ మ్యాచ్‌లో ఓడింది.నేటి మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ హాఫ్ సెంచరీ చేస్తే టీ20ల్లో 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుంటాడు. తద్వారా పొట్టి క్రికెట్లో ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. టీ20ల్లో ఇప్పటివరకు డేవిడ్ వార్నర్ ఒక్కడే 100 హాఫ్ సెంచరీలు (108) పూర్తి చేశాడు. గత మ్యాచ్‌లోనే టీ20ల్లో 13000 పరుగుల మార్కును తాకిన విరాట్ నేటి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధిస్తే మరోసారి రికార్డుల్లోకెక్కుతాడు. టీ20ల్లో విరాట్ 386 ఇన్నింగ్స్‌లు ఆడి 9 సెంచరీలు, 99 హాఫ్ సెంచరీల సాయంతో 13050 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ ఐదో స్థానంలో ఉన్నాడు.నేటి మ్యాచ్ విషయానికొస్తే.. గత రికార్డుల ప్రకారం ఢిల్లీపై ఆర్సీబీదే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 31 సార్లు తలపడగా ఆర్సీబీ 19, ఢిల్లీ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం రాలేదు. అయితే ప్రస్తుత సీజన్లో పరిస్థితి చూస్తే మాత్రం ఢిల్లీకే అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఢిల్లీ ఈ సీజన్లో గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉంది. కొత్త కెప్టెన్ అక్షర్ నేతృత్వంలో ఓటమెరుగని జట్టుగా దూసుకుపోతుంది. ఢిల్లీ ఈ సీజన్లో అన్ని విభాగాల్లో సత్తా చాటుతూ లక్నో, సన్‌రైజర్స్, సీఎస్‌కేలపై అద్భుత విజయాలు సాధించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 200కు పైగా లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన ఏకైక జట్టు ఢిల్లీ మాత్రమే. ఢిల్లీ జట్టులో డుప్లెసిస్, కేఎల్ రాహుల్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్ జేక్ ఫ్రేజర్ వరుస వైఫల్యాలే జట్టును కలవరపెడుతున్నాయి.మరోవైపు ఆర్సీబీ కూడా ఈ సీజన్లో గతంలో ఎన్నడూ లేనట్లుగా ఆది నుంచే అదరగొడుతుంది. తొలి మ్యాచ్‌లో కేకేఆర్, రెండో మ్యాచ్‌లో సీఎస్కేలకు షాకిచ్చిన ఈ జట్టు మూడో మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓడి ఆతర్వాతి మ్యాచ్‌లోనే మళ్లీ గెలుపు బాట (ముంబైపై విజయంతో) పట్టింది. ప్రస్తుత సీజన్లో ఆర్సీబీ ఆటగాళ్లు కూడా అద్భుత ఫామ్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌లో విరాట్, రజత్ పాటిదార్, టిమ్ డేవిడ్, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ.. బౌలింగ్‌లో హాజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ అదరగొడుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ, ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. తుది జట్లు (అంచనా)..ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్, రసిఖ్ సలామ్/సుయాష్ శర్మఢిల్లీ క్యాపిటల్స్: ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ/T నటరాజన్, ముఖేష్ కుమార్ -
న్యూజిలాండ్‌తో మూడో టీ20.. చరిత్ర సృష్టించిన పాకిస్తాన్
పాక్ క్రికెట్ జట్టు టీ20ల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 205 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 16 ఓవర్లలోనే ఊదేసి.. పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 200 ప్లస్ టార్గెట్‌ను ఛేదించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో 200 పైబడిన లక్ష్యాలను ఇంత తొందరగా ఏ జట్టూ ఛేదించలేదు. గతంలో ఈ రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉండేది. సౌతాఫ్రికా 2007లో వెస్టిండీస్ నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని 17.2 ఓవర్లలో ఛేదించింది. టీ20ల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 200 ప్లస్ లక్ష్యాలను ఛేదించిన జట్ల జాబితాలో మూడో స్థానంలో కూడా పాకిస్తానే ఉంది. 2021లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ 205 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలో ఛేదించింది.మ్యాచ్ విషయానికొస్తే.. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో టీ20లో పాకిస్తాన్ న్యూజిలాండ్‌పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 19.5 ఓవర్లలో 204 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. మార్క్ చాప్మన్ 44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో బ్రేస్‌వెల్ (18 బంతుల్లో 31), టిమ్ సీఫర్ట్ (19), డారిల్ మిచెల్ (17), ఐష్ సోధి (10) రెండంకెల స్కోర్లు చేయగా.. ఫిన్ అలెన్ 0, నీషమ్ 3, మిచెల్ హే 9, జేమీసన్ 0, డఫీ 2 పరుగులకు ఔటయ్యారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, అబ్బాస్ అఫ్రిది తలో 2, షాదాబ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ ఓపెనర్ హసన్ నవాజ్ (45 బంతుల్లో 105 నాటౌట్; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 16 ఓవర్లనే లక్ష్యాన్ని ఊదేసింది. నవాజ్‌కు మరో ఓపెనర్ మహ్మద్ హరీస్ (20 బంతుల్లో 41), కెప్టెన్ సల్మాన్ అఘా (31 బంతుల్లో 51 నాటౌట్) సహకరించడంతో పాక్ మరో 4 ఓవర్లు మిగిలుండగానే వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. పాక్ కోల్పోయిన ఏకైక వికెట్ డఫీకి దక్కింది. ఈ గెలుపుతో పాక్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు టీ20ల్లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నాలుగో టీ20 మార్చి 23న మౌంట్ మాంగనూయ్ వేదికగా జరుగనుంది. -
సంచలనం.. సూపర్ ఓవర్లో జీరో రన్స్! 16 ఏళ్ల చరిత్రలోనే?
మలేషియా- హాంకాంగ్-బహ్రెయిన్ మధ్య జరుగుతున్న టైసిరీస్లో సంచలనం నమోదైంది. ఈ సిరీస్‌లో భాగంగా శుక్రవారం బ్యూమాస్ క్రికెట్ ఓవల్ వేదికగా హాంకాంగ్, బహ్రెయిన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బహ్రెయిన్ అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. సూపర్ ఓవర్లో ఒక్క పరుగు కూడా సాధించని జట్టుగా బహ్రెయిన్ చెత్త రికార్డును నెలకొల్పింది. 16 ఏళ్ల సూపర్ ఓవర్ చరిత్రలో ఏ జట్టు కూడా ఈ చెత్త ఫీట్‌ను నమోదు చేయలేదు.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. హాంకాంగ్ బ్యాటర్లలో జీషన్ అలీ (29), షాహిద్ వాసిఫ్ (31), నస్రుల్లా రాణా (14) రాణించారు. అనంతరం స్వల్ప లక్ష్య చేధనలో ఓపెనర్ ప్రశాంత్ కురుప్ (37 బంతుల్లో 31) బహ్రెయిన్‌కు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.అయితే ఆ తర్వాత బహ్రెయిన్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో బహ్రెయిన్ విజయానికి చివరి ఓవర్లో 13 పరుగులు అవసరమయ్యాయి. ఆ జట్టు కెప్టెన్ అహ్మర్ బిన్ నాసిర్, మొదటి రెండు బంతుల్లో నాలుగు పరుగులు చేశాడు.తర్వాతి రెండు బంతుల్లో రెండు సింగిల్స్ వచ్చాయి. దీంతో బహ్రెయిన్ విజయసమీకరణం చివరి రెండు బంతుల్లో ఏడు పరుగులుగా మారింది. ఐదో బంతికి అహ్మర్ బిన్ సిక్సర్‌గా మలచి మ్యాచ్‌ను టై చేశాడు. అయితే ఆఖరి బంతికి బిన్ ఔట్ కావడంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో ఫలితాన్ని తేల్చేందుకు అంపైర్లు సూపర్ ఓవర్‌ను నిర్వహించారు.ఎహ్సాన్ అదుర్స్..ఈ క్రమంలో సూపర్ ఓవర్లో ఛేజింగ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. బహ్రెయిన్ కెప్టెన్ బిన్, సోహైల్ అహ్మద్ లు సూపర్ ఓవర్‌ను ఎదుర్కోనేందుకు వచ్చారు. అదేవిధంగా ప్రత్యర్ధి జట్టు కెప్టెన్ ఈ సూపర్ ఓవర్ వేసే బాధ్యతను స్పిన్నర్ ఎహ్సాన్ ఖాన్‌కు అప్పగించాడు.ఈ క్రమంలో ఎహ్సాన్ రెండవ బంతికి బిన్ ను, మూడవ బంతికి సోహైల్ అహ్మద్‌ను ఔట్ చేయడంతో పరుగులు ఏమి రాకుండా సూపర్ ఓవర్ ముగిసింది. దీంతో బహ్రెయిన్ ఈ చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. కాగా బ్యాటింగ్‌కు దిగిన జట్టు రెండు వికెట్లు కోల్పోతే సూపర్ ఓవర్ ముగుస్తుంది.చదవండి: IPL 2025: 'ఒకప్పుడు రోహిత్ వారసుడు.. కానీ సడన్‌గా ఏమైందో మరి' -
భళా బెంగళూరు...
వడోదర: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నిలో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) దూసుకుపోతోంది. టోర్నీ తొలి పోరులో గుజరాత్ జెయింట్స్‌ను అలవోకగా ఓడించిన ఆర్సీబీ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన పోరులో గత ఏడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. ముందుగా పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసిన ఆర్సీబీ... ఆ తర్వాత స్మృతి, వ్యాట్ దూకుడైన బ్యాటింగ్‌తో మరో 22 బంతులు మిగిలి ఉండగానే గెలుపు పూర్తి చేసుకుంది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 19.3 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. జెమీమా రోడ్రిగ్స్ (22 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, సారా బ్రైస్ (19 బంతుల్లో 23; 2 ఫోర్లు) కాస్త పోరాడింది. మిగతా బ్యాటర్లంతా విఫలం కావడంతో జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుకా సింగ్ (3/23), జార్జియా వేర్హామ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా...గార్త్, బిష్త్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం బెంగళూరు 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. స్మృతి మంధాన (47 బంతుల్లో 81; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), డానీ వ్యాట్ (33 బంతుల్లో 42; 7 ఫోర్లు) తొలి వికెట్‌కు 65 బంతుల్లోనే 107 పరుగులు జోడించి జట్టు విజయాన్ని సునాయాసం చేశారు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లానింగ్ (సి) పెరీ (బి) గార్త్ 17; షఫాలీ (సి) స్మృతి (బి) రేణుక 0; జెమీమా (స్టంప్డ్) రిచా (బి) వేర్హామ్ 34; నెదర్లాండ్ (సి) స్మృతి (బి) రేణుక 19; కాప్ (సి) వ్యాట్ (బి) బిష్త్ 12; జొనాసెన్ (సి) కనిక (బి) బిష్త్ 1; బ్రైస్ (స్టంప్డ్) రిచా (బి) వేర్హామ్ 23; శిఖా (సి) బిష్త్ (బి) రేణుక 14; రాధ (సి అండ్ బి) వేర్హామ్ 0; అరుంధతి రెడ్డి (సి) పెరీ (బి) గార్త్ 4; మిన్ను మణి (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 141. వికెట్ల పతనం: 1–1, 2–60, 3–62, 4–84, 5–87, 6–105, 7–130, 8–130, 9–132, 10–141. బౌలింగ్: రేణుక 4–0–23–3, కిమ్ గార్త్ 3.3–0–19–2, ఏక్తా బిష్త్ 4–0–35–2, జోషిత 2–0–21–0, వేర్హామ్ 4–0–25–3, కనిక 2–0–13–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (సి) అరుంధతి (బి) శిఖా 81; డానీ వ్యాట్ (సి) జెమీమా (బి) అరుంధతి 42; ఎలీస్ పెరీ (నాటౌట్) 7; రిచా (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (16.2 ఓవర్లలో 2 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1–107, 2–133. బౌలింగ్: కాప్ 2–0–27–0, శిఖా 4–0– 27–1, మిన్ను 1–0– 10–0, అరుంధతి 3.2–0–25–1, జొనాసెన్ 4–0–37–0, సదర్లాండ్ 2–0–18–0. -
టీ20ల్లో అరుదైన మైలురాయిని తాకిన టీమిండియా కెప్టెన్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్, మహిళల ఐపీఎల్లో (WPL) ముంబై ఇండియన్స్ సారధి అయిన హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) పొట్టి క్రికెట్లో (T20 Cricket) అరుదైన మైలురాయిని తాకింది. హర్మన్.. భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్, డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ సారధి అయిన స్మృతి మంధన తర్వాత టీ20ల్లో 8000 పరుగుల మైలురాయిని తాకిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. డబ్ల్యూపీఎల్-2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (ఫిబ్రవరి 15) జరిగిన ఉత్కంఠ పోరులో హర్మన్ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందు 8000 పరుగులు పూర్తి చేసేందుకు హర్మన్‌కు 37 పరుగులు అవసరమయ్యాయి. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో హర్మన్ 8000 పరుగుల మైలురాయిని చేరుకుంది. ఈ మ్యాచ్‌లో హర్మన్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడింది. 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసింది.అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు వివిధ టీ20 లీగ్‌ల్లో హర్మన్ చేసిన పరుగులుడబ్ల్యూపీఎల్- 591 పరుగులుమహిళల బిగ్‌బాష్ లీగ్- 1440 పరుగులుహండ్రెడ్ వుమెన్స్ లీగ్- 176 పరుగులుఅంతర్జాతీయ క్రికెట్- 3589 పరుగులు- వీటితో పాటు హర్మన్ దేశవాలీ టీ20 టోర్నీల్లో పంజాబ్ తరఫున మరిన్ని పరుగులు సాధించింది.టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్లు..స్మృతి మంధన- 8349హర్మన్‌ప్రీత్ కౌర్- 8005జెమీమా రోడ్రిగెజ్- 5826షఫాలీ వర్మ- 4542మిథాలీ రాజ్- 4329దీప్తి శర్మ- 3889ముంబై, ఢిల్లీ మ్యాచ్ విషయానికొస్తే.. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ సమరంలో ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ గెలుపుకు చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. అరుంధతి రెడ్డి చాలా ప్రయాసపడి రెండు పరుగులు పూర్తి చేసింది. తొలి పరుగును సునాయాసంగా పూర్తి చేసిన అరుంధతి.. రెండో పరుగు తీసే ప్రయత్నంలో డైవ్ చేయగా... కీపర్ వికెట్లను గిరాటేసింది. మూడో అంపైర్‌కు నివేదించగా... రీప్లేలో అరుంధతి బ్యాట్ క్రీజ్‌ను దాటినట్లు తేలింది. దీంతో రెండో పరుగొచ్చింది. ఫలితంగా ఢిల్లీ 2 వికెట్ల తేడాతో గెలిచింది. ఆఖరి బంతిదాకా చెమటోడ్చిన ముంబై ఇండియన్స్‌కు పరాభవం తప్పలేదు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 19.1 ఓవర్లలో 164 పరుగుల వద్ద ఆలౌటైంది. నాట్ సీవర్ బ్రంట్ (59 బంతుల్లో 80 నాటౌట్; 13 ఫోర్లు) చెలరేగింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (22 బంతుల్లో 42; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిపించింది. ఢిల్లీ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ 3, శిఖా పాండే 2 వికెట్లు తీశారు.అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు చేసి గెలిచింది. ఓపెనింగ్‌లో షఫాలీ వర్మ (18 బంతుల్లో 43; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేసింది. మిడిలార్డర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నికీ ప్రసాద్ (33 బంతుల్లో 35; 4 ఫోర్లు) ఢిల్లీ గెలుపుకు అవసరమైన పరుగుల్ని జతచేసింది. -
ధనాధన్ సమరం
క్రీడాభిమానులను అలరించేందుకు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మూడో సీజన్‌కు శుక్రవారం తెరలేవనుంది. నెల రోజుల పాటు సాగనున్న ఈ సమరంలో 5 జట్లు 22 మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. సీనియర్ ప్లేయర్లతో పాటు యువ ఆటగాళ్లు సత్తా చాటేందుకు సిద్ధమవుతుండగా... సీజన్ ఆరంభ పోరులో శుక్రవారం గుజరాత్ జెయింట్స్ జట్టుతో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఆడనుంది.వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీ మూడో సీజన్‌కు వేళయింది. తొలి రెండు సీజన్లలో మెరిపించిన పలువురు యువతారలు ఆ తర్వాత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో మరోసారి ఎమర్జింగ్ క్రికెటర్లకు తమ ప్రతిభను ప్రపంచానికి చాటేందుకు అవకాశం లభించనుంది. గత సీజన్ మాదిరిగానే ఈసారీ ఐదు జట్ల మధ్య లీగ్ మ్యాచ్‌లు ముగిశాక పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టుకు నేరుగా ఫైనల్ బెర్త్ లభిస్తుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ద్వారా రెండో ఫైనలిస్ట్‌ను నిర్ణయిస్తారు. » బెంగళూరుకు గాయాల బెడద వేధిస్తోంది. గతేడాది టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన సోఫీ డివైన్ తోపాటు కేట్ క్రాస్, స్పిన్నర్ ఆశ శోభన గాయాలతో టోర్నీ నుంచి వైదొలిగారు. » పేలవ ఫామ్‌తో జాతీయ జట్టులో చోటు కోల్పోయిన భారత ఓపెనర్ షఫాలీ వర్మ, పేసర్ అరుంధతి రెడ్డి డబ్ల్యూపీఎల్‌లో రాణించి తిరిగి టీమిండియాకు ఎంపిక కావాలని చూస్తున్నారు. వీరిద్దరు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నారు. » గత రెండు పర్యాయాలు రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ట్రోఫీ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. షఫాలీ వర్మ, మెగ్ లానింగ్, జెమీమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, మరిన్ కాప్, శిఖా పాండే, అరుంధతి రెడ్డి, టిటాస్ సాధు, జెస్ జాన్సన్, రాధ యాదవ్‌తో క్యాపిటల్స్ బలంగా ఉంది. » తొలి సీజన్లో విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహిస్తుండగా... హేలీ మాథ్యూస్, యస్తిక భాటియా, నటాలియా స్కీవర్ బ్రంట్, అమేలియా కెర్ కీలకం కానున్నారు. » గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి. అలీసా హీలీ అందుబాటులో లేకపోవడంతో యూపీ వారియర్స్ జట్టుకు భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కెపె్టన్‌గా వ్యవహరించనుంది. ఇక బెత్ మూనీ స్థానంలో ఆష్లీ గార్డ్నర్ గుజరాత్ జెయింట్స్ జట్టుకు సారథ్యం వహించనుంది. ఈ సీజన్లో మరో రెండు కొత్త (వడోదర, లక్నో) వేదికలపై కూడా మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. -
చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan) చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో (ఇంటర్నేషనల్ మరియు ఫ్రాంచైజీ క్రికెట్) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రషీద్ ఈ రికార్డును సాధించే క్రమంలో విండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో (Dwane Bravo) రికార్డును బద్దలు కొట్టాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో (SA20) భాగంగా పార్ల్ రాయల్స్‌తో నిన్న (ఫిబ్రవరి 4) జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో రషీద్ ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన రషీద్.. తన జట్టును (ఎంఐ కేప్‌టౌన్) తొలిసారి ఫైనల్స్‌కు (కెప్టెన్‌గా) చేర్చాడు.26 ఏళ్ల రషీద్ 461 టీ20ల్లో 633 వికెట్లు పడగొట్టగా.. అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న బ్రావో 582 మ్యాచ్‌ల్లో 631 వికెట్లు తీశాడు. రషీద్ ఆఫ్ఘనిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 161 వికెట్లు.. ఫ్రాంచైజీ మరియు దేశవాలీ క్రికెట్లో 472 వికెట్లు పడగొట్టాడు. రషీద్ తన టీ20 కెరీర్లో ఆఫ్ఘనిస్తాన్ సహా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, ఎంఐ కేప్‌టౌన్, అడిలైడ్ స్ట్రయికర్స్, గయానా అమెజాన్ వారియర్స్, ఎంఐ ఎమిరేట్స్, లాహోర్ ఖలందర్స్, ససెక్స్ షార్క్స్, ట్రెంట్ రాకెట్స్ తదితర జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు..రషీద్ ఖాన్-633డ్వేన్ బ్రావో-631సునీల్ నరైన్-574ఇమ్రాన్ తాహిర్-531షకీబ్ అల్ హసన్-492కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ తొలిసారి ఫైనల్‌కు చేరింది. నిన్న (ఫిబ్రవరి 4) జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ఎంఐ కేప్‌టౌన్ పార్ల్ రాయల్స్‌పై 39 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన రాయల్స్ 19.4 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది. రాణించిన బ్రెవిస్, రికెల్టన్ఈ మ్యాచ్‌లో ఎంఐ చేసిన స్కోర్.. ఈ సీజన్లో ఆ జట్టుకు మూడో అత్యధిక స్కోర్. ఎంఐ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (27 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), వాన్ డర్ డస్సెన్ (32 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సహా డెవాల్డ్ బ్రెవిస్ (30 బంతుల్లో 44 నాటౌట్; 4 సిక్సర్లు), జార్జ్ లిండే (14 బంతుల్లో 26; 3 సిక్సర్లు), డెలానో పోట్గెటర్ (17 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. రాయల్స్ బౌలర్లలో దునిత్ వెల్లలగే 2, ఫోర్టుయిన్, డేవిడ్ గేలియమ్ తలో వికెట్ పడగొట్టారు.తలో చేయి వేసిన బౌలర్లు200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్‌ను ఎంఐ బౌలర్లు తలో చేయి వేసి దెబ్బేశారు. ఎంఐ బౌలర్ల ధాటికి రాయల్స్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ట్రెంట్ బౌల్ట్, కగిసో రబాడ, కార్బిన్ బాష్, కెప్టెన్ రషీద్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్జ్ లిండే ఓ వికెట్ పడగొట్టి రాయల్స్ పతనాన్ని శాశించారు. రాయల్స్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ మిల్లర్ (45) టాప్ స్కోరర్‌గా నిలువగా.. దినేశ్ కార్తీక్ (31) ఓ మోస్తరు స్కోర్ చేశాడు.ఓడినా మరో ఛాన్స్ఈ మ్యాచ్‌లో ఓడినా ఫైనల్ చేరేందుకు రాయల్స్‌కు మరో అవకాశం ఉంది. రేపు (ఫిబ్రవరి 6) జరుగబోయే క్వాలిఫయర్-2లో రాయల్స్.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతతో తలపడుతుంది. ఇవాళ (ఫిబ్రవరి 5) జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్.. జోబర్గ్ సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. గత రెండు సీజన్లలో టేబుల్ లాస్ట్‌లో నిలిచిన ఎంఐ కేప్‌టౌన్ తొలిసారి ఫైనల్‌కు చేరింది. సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ సౌతాఫ్రికా టీ20 లీగ్ రెండు ఎడిషన్లలో విజేతగా నిలిచింది. -
ILT20 2025: చరిత్ర సృష్టించిన ఆండ్రీ రసెల్.. పొట్టి క్రికెట్లో అత్యంత వేగంగా..!
విండీస్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రసెల్ (Andre Russell) పొట్టి క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో (ILT20 2025) ఆడుతున్న రసెల్ (అబుదాబీ నైట్‌రైడర్స్).. నిన్న (ఫిబ్రవరి 1) గల్ఫ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. నిన్నటి మ్యాచ్‌లో టామ్ కర్రన్ బౌలింగ్‌లో బౌండరీ బాదడంతో రసెల్ పొట్టి క్రికెట్లో 9000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా టీ20ల్లో ఈ ఘనత సాధించిన 25వ ఆటగాడిగా నిలిచాడు. ఇక్కడ రికార్డు ఏంటంటే.. రసెల్ ఈ ఘనతను ప్రపంచంలో ఏ ఆటగాడు సాధించనంత వేగంగా (బంతుల పరంగా) సాధించాడు. రసెల్.. 9000 పరుగుల మార్కును కేవలం 5321 బంతుల్లో చేరుకున్నాడు. పొట్టి క్రికెట్లో అత్యంత వేగంగా 9000 పరుగులు పూర్తి చేసిన రికార్డు రసెల్ కంటే ముందు ఆసీస్ విధ్వంసకర వీరుడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ పేరిట ఉండేది. మ్యాక్సీ టీ20ల్లో 9000 పరుగులను 5915 బంతుల్లో పూర్తి చేశాడు. టీ20ల్లో 9000 పరుగులను అత్యంత వేగంగా పూర్తి చేసిన టాప్-5 ఆటగాళ్ల జాబితాలో రసెల్, మ్యాక్సీ తర్వాత ఏబీ డివిలియర్స్ (5985), కీరన్ పోలార్డ్ (5988), క్రిస్ గేల్ ఉన్నారు.టీ20ల్లో రసెల్ ఇప్పటివరకు 536 మ్యాచ్‌లు ఆడి 26.79 సగటున, 169.15 స్ట్రయిక్‌రేట్‌తో 9004 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పొట్టి క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత రసెల్ మాజీ సహచరుడు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ 463 మ్యాచ్‌ల్లో 144.75 స్ట్రయిక్‌రేట్‌తో 14562 పరుగులు చేశాడు. ఇందులో 22 శతకాలు, 88 అర్ద శతకాలు ఉన్నాయి.టీ20ల్లో రసెల్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అదిరిపోయే రికార్డు కలిగి ఉన్నాడు. రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలింగ్ వేసే రసెల్.. పొట్టి ఫార్మాట్లో 25.55 సగటున, 8.71 ఎకానమీతో 466 వికెట్లు పడగొట్టాడు.36 ఏళ్ల రసెల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇంకా రిటైర్ కానప్పటికీ ఎక్కువగా ఫ్రాంచైజీ క్రికెట్లోనే ఆడుతున్నాడు.రసెల్ ప్రస్తుత ILT20 ఎడిషన్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఈ సీజన్లో అతను 9 ఇన్నింగ్స్‌ల్లో 158.53 స్ట్రయిక్‌రేట్‌తో కేవలం 130 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. బౌలింగ్ విషయానికొస్తే.. రసెల్ ఈ సీజన్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు. ఇందులో అతని ఎకానమీ 11.42గా ఉంది.రసెల్ విషయాన్ని పక్కన పెడితే ఈ సీజన్లో అతని జట్టు అబుదాబీ నైట్‌రైడర్స్ చెత్త ప్రదర్శనలు చేస్తూ పాయింట్ల పట్టికలో చివరి నుంచి మొదటిస్థానంలో ఉంది. ఈ సీజన్లో నైట్‌రైడర్స్ నిన్నటి మ్యాచ్‌తో కలుపుకుని 9 మ్యాచ్‌లు ఆడి ఆరింట ఓడిపోయింది. ఏదైనా అద్భుతం జరిగితే కానీ నైట్‌రైడర్స్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు చేరలేదు. ఇప్పటికే డెజర్ట్ వైపర్స్, ఎంఐ ఎమిరేట్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి.నిన్నటి మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ గల్ఫ్ జెయింట్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో 9000 పరుగులు పూర్తి చేసిన రసెల్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ విల్లే (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జెయింట్స్.. గెర్హార్డ్ ఎరాస్మస్ (47), టామ్ కర్రన్ (38 నాటౌట్), హెట్‌మైర్ (20 నాటౌట్) రాణించడంతో 17.5 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. -
సౌతాఫ్రికా కెప్టెన్‌గా డివిలియర్స్.. టీ20 టోర్నీతో రీఎంట్రీ
సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్(AB De Villiers) పునరాగమనానికి రంగం సిద్ధమైంది. మరోసారి అతడు ప్రొటిస్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని డివిలియర్స్ మంగళవారం స్వయంగా ప్రకటించాడు. తాను రీఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించాడు.కాగా సౌతాఫ్రికా(South Africa) తరఫున 2004లో డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తనదైన బ్యాటింగ్ శైలితో లెజెండ్‌గా ఎదిగాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు సౌతాఫ్రికా జట్టు కెప్టెన్‌గానూ పనిచేసిన అనుభం ఉంది. ఇక ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. తన ఇంటర్నేషనల్ కెరీర్లో 114 టెస్టు మ్యాచ్‌లు ఆడి 8765 పరుగులు చేశాడు.అదే విధంగా 228 వన్డేల్లో కలిపి 9577 రన్స్ సాధించాడు. ఇక ప్రొటిస్ జట్టు తరఫున 78 టీ20 మ్యాచ్‌లు ఆడిన డివిలియర్స్ 1672 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో డివిలియర్స్ 22 టెస్టు సెంచరీలు, 25 వన్డే శతకాలు నమోదు చేశాడు.ఐపీఎల్‌లోనూ హవాఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో చాలా ఏళ్ల పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టుకు ఆడాడు ఏబీ డివిలియర్స్. ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో మొత్తంగా 184 మ్యాచ్‌లు ఆడి.. మూడు శతకాల సాయంతో 5162 పరుగులు చేశాడు.ఈ క్రమంలో నలభై ఏళ్ల ఏబీ డివిలియర్స్ 2021లో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. కుటుంబంతో కలిసి సమయం గడపడంతో పాటు.. సేవా కార్యక్రమాలు, బ్రాడ్‌కాస్టింగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. యూట్యూబర్‌గానూ అభిమానులకు ఎల్లప్పుడూ చేరువగా ఉంటున్న మిస్టర్ ‘360’.. కాంపిటేటివ్ క్రికెట్ ఆడాలని ఉందంటూ ఇటీవలే రీఎంట్రీ గురించి సంకేతాలు ఇచ్చాడు.తాజాగా తన పునరాగమనాన్ని ఖరారు చేస్తూ వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్(World Championship of Legends- WCL) బరిలో దిగనున్నట్లు ఏబీడీ ప్రకటించాడు. ‘‘నాలుగేళ్ల క్రితం నేను అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాను.ఇక నాలో క్రికెట్ ఆడే కోరిక మిగిలి లేదని భావించి నా నిర్ణయాన్ని వెల్లడించాను. కాలం గడిచింది. ఇప్పుడు నా కుమారులు నాలో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు. మళ్లీ క్రికెట్ ఆడేలా ప్రేరేపించారు. నా పిల్లలతో కలిసి ఆడిన ప్రతిసారి.. తిరిగి మైదానంలో దిగాలనే కోరిక బలపడింది. అందుకే జిమ్‌కు తరచుగా వెళ్లి వ్యాయామం చేయడంతో పాటు.. నెట్స్‌లోనూ ప్రాక్టీస్ చేస్తున్నా. జూలైలో జరిగే డబ్ల్యూసీఎల్ టోర్నీకి నేను సంసిద్ధంగా ఉన్నాను’’ అని డివిలియర్స్ తెలిపాడు.ఆరు జట్లుకాగా డబ్ల్యూసీఎల్ ఒక ప్రీమియర్ టీ20 టోర్నమెంట్. ఇందులో రిటైర్ అయిన, నాన్- కాంట్రాక్ట్ క్రికెట్ దిగ్గజాలు ఆడతారు. గతేడాది డబ్ల్యూసీఎల్ తొలి ఎడిషన్ జరిగింది. భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఇందులో పాల్గొనగా.. భారత్ మొట్టమొదటి చాంపియన్‌గా అవతరించింది. ‘సిక్సర్ల కింగ్’ యువరాజ్ సింగ్ సారథ్యంలో ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. ఇక ఈసారి ఈ లీగ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్‌గా ఏబీ డివిలియర్స్ బరిలోకి దిగనుండటం అదనపు ఆకర్షణ కానుంది. కాగా ఈ ఏడాది జూలై 18 నుంచి ఆగష్టు 2 వరకు ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 టోర్నీ జరుగనుంది. సౌతాఫ్రికా తరఫున గత సీజన్లో జాక్వెస్ కలిస్, హర్షల్ గిబ్స్, డేల్ స్టెయిన్, ఇమ్రాన్ తాహిర్ తదితరులు బరిలోకి దిగారు.చదవండి: Ind vs Pak: క్రికెట్ ప్రేమికులకు శుభవార్త.. డబ్ల్యూసీఎల్ షెడ్యూల్ విడుదల -
ధోనిని అధిగమించిన దినేశ్ కార్తీక్
టీమిండియా మాజీ వికెట్‌కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ టీ20ల్లో ఓ భారీ రికార్డును సాధించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని అధిగమించాడు. టీ20ల్లో ధోని 391 మ్యాచ్‌ల్లో 7432 పరుగులు చేయగా.. డీకే 409 మ్యాచ్‌ల్లో 7451 పరుగులు సాధించాడు. ఐపీఎల్ సహా భారత క్రికెట్ మొత్తానికి రిటైర్మెంట్ ప్రకటించిన డీకే ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (SA20 2025) ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో పార్ల్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న డీకే.. నిన్న (జనవరి 27) డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని రికార్డును అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో 15 బంతుల్లో 2 భారీ సిక్సర్ల సాయంతో 21 పరుగులు చేసిన కార్తీక్ మూడు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధోని రికార్డును బద్దలు కొట్టాడు.39 ఏళ్ల దినేశ్ కార్తీక్ పొట్టి ఫార్మాట్లో 26.99 సగటున, 136.84 స్ట్రయిక్‌రేట్‌తో 34 హాఫ్ సెంచరీల సాయంతో 7451 పరుగులు చేశాడు. ఇందులో 718 బౌండరీలు, 258 సిక్సర్లు ఉన్నాయి. ధోని విషయానికొస్తే.. ఈ మాజీ సీఎస్కే కెప్టెన్ తన టీ20 కెరీర్లో 38.11 సగటున, 135.64 స్ట్రయిక్‌రేట్‌తో 28 హాఫ్ సెంచరీల సాయంతో 7432 పరుగులు చేశాడు. ఇందులో 517 ఫోర్లు, 338 సిక్సర్లు ఉన్నాయి. 43 ఏళ్ల ధోనికి కార్తీక్ రికార్డును తిరిగి అధిగమించేందుకు మరో అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. తదుపరి ఐపీఎల్ సీజన్లో ధోని మరి కొన్ని పరుగులు చేసినా డీకేను అధిగమిస్తాడు.కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్ రెండో ఎడిషన్‌లో డీకేకు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశాలు రాలేదు. ఈ సీజన్లో అతను ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఐదుసార్లు మాత్రమే బ్యాటింగ్‌కు దిగాడు. ఈ ఐదు ఇన్నింగ్స్‌ల్లో కూడా నిన్న జరిగిన మ్యాచ్‌లో చేసిన స్కోరే అత్యధికం. కార్తీక్ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శనలు లేకపోయినా పార్ల్ రాయల్స్ ఈ సీజన్లో అదరగొట్టింది. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడింట విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. తాజా గెలుపుతో రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. రాయల్స్ చేతిలో ఓటమితో డర్బన్ సూపర్ జెయింట్స్ లీగ్ నుంచి నిష్క్రమించింది.నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. డర్బన్ సూపర్ జెయింట్స్‌పై పార్ల్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. సూపర్ జెయింట్స్ తరఫున మార్కస్ స్టోయినిస్ (40 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కేన్ విలియమ్సన్ (36 బంతుల్లో 45; 5 ఫోర్లు, సిక్స్) రాణించారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ మరో బంతి మిగిలుండగా 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్ జో రూట్ డకౌటై నిరాశపర్చగా.. డ్రి ప్రిటోరియస్ (43), రూబిన్ హెర్మన్ (59) రాయల్స్‌ను గెలిపించారు. చివర్లో దినేశ్ కార్తీక్ (15 బంతుల్లో 21) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. -
చరిత్ర సృష్టించిన హసరంగ.. ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ
శ్రీలంక స్టార్ స్పినర్ వనిందు హసరంగ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. హసరంగకు ముందు ఈ రికార్డు ఆండ్రూ టై పేరిట ఉండేది. టై 211 మ్యాచ్‌ల్లో 300 వికెట్లు తీయగా.. హసరంగ కేవలం 208 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని తాకాడు. టామ్ కొహ్లెర్ కాడ్మోర్ హసరంగకు 300వ వికెట్.టీ20ల్లో వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్లు..హసరంగ-208 మ్యాచ్ల్లోఆండ్రూ టై-211రషీద్ ఖాన్-213లసిత్ మలింగ-222ముస్తాఫిజుర్ రెహ్మాన్-243ఇమ్రాన్ తాహిర్-247 ప్రస్తుతం హసరంగ ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో ఆడుతున్నాడు. ఈ టోర్నీలో హసరంగ డెజర్ట్ వైపర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. శనివారం జరిగిన మ్యాచ్‌లో వైపర్స్ షార్జా వారియర్స్‌ను ఢీకొంది. ఈ మ్యాచ్‌లో వైపర్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. జేసన్ రాయ్ (38 బంతుల్లో 55; 9 ఫోర్లు) అర్ద సెంచరీతో రాణించాడు. కొహ్లెర్ కాడ్మోర్ 42 పరుగులు చేసి ఔటయ్యాడు.వీరిద్దరూ మినహా వారియర్స్ ఇన్నింగ్స్‌లో అంతా విఫలమయ్యారు. వైపర్స్ బౌలర్లలో ఖుజైమా తన్వీర్ 4 వికెట్లు పడగొట్టగా.. డేవిడ్ పేన్ 2, మొహమ్మద్ ఆమిర్, హసరంగ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వైపర్స్ 14.5 ఓవర్లలోనే (2 వికెట్లు కోల్పోయి) గెలుపు తీరాలకు చేరింది. అలెక్స్ హేల్స్ (42 బంతుల్లో 77; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), సామ్ కర్రన్ (34 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలు బాది వైపర్స్‌ను గెలిపించారు. వారియర్స్ బౌలర్లలో ఆడమ్ మిల్నేకు రెండు వికెట్లు లభించాయి. ఈ గెలుపుతో వైపర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ సీజన్లో వైపర్స్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఆరింట విజయాలు సాధించింది. -
చరిత్ర సృష్టించిన పార్ల్ రాయల్స్
సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫ్రాంచైజీ అయిన పార్ల్ రాయల్స్ చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్లో 20 ఓవర్లను స్పిన్నర్లతో వేయించిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. శనివారం ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ ఐదుగురు స్పిన్నర్లను ప్రయోగించింది. ఫోర్టుయిన్, వెల్లలగే, ముజీబ్,ఎన్ పీటర్, రూట్ తలో నాలుగు ఓవర్లు వేశారు. ఈ మ్యాచ్‌లో రాయల్స్ 11 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్లో రాయల్స్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఓపెనర్ జో రూట్ అజేయమైన అర్ద సెంచరీతో రాణించాడు. రూట్ 56 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు. ఆఖర్లో కెప్టెన్ డేవిడ్ మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిల్లర్ 18 బంతుల్లో బౌండరీ, 2 సిక్సర్ల సాయంతో 29 పరుగులు చేశాడు. రాయల్స్ ఆటగాళ్లలో ప్రిటోరియస్ (0), రూబిన్ హెర్మన్ (9), వాన్ బుర్రెన్ (5), దునిత్ వెల్లలగే (15) నిరాశపరిచారు. ప్రిటోరియా క్యాపిటల్స్ బౌలర్లలో విల్ జాక్స్, ఈథన్ బాష్, సెనూరన్ ముత్తుస్వామి, కైల్ సైమండ్స్ తలో వికెట్ పడగొట్టారు.141 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్యాపిటల్స్ రాయల్స్ బౌలర్లు రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులే చేయగలిగింది. ఓపెనర్ విల్ జాక్స్ అర్ద సెంచరీతో రాణించాడు. 53 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. కైల్ వెర్రిన్ (33 బంతుల్లో 30; 2 ఫోర్లు) పర్వాలేదనిపించాడు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో జాక్స్, వెర్రిన్ మినహా ఎవ్వరూ రాణించలేదు. రహ్మానుల్లా గుర్బాజ్ 6, మార్కస్ ఆకెర్మ్యాన్ 2, రిలీ రొస్సో 4, జేమ్స్ నీషమ్ 1, కీగన్ లయన్ 2 పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో ఫోర్టుయిన్, ముజీబ్ రెహ్మాన్, జో రూట్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. వెల్లలగే ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ సీజన్లో భీకరఫామ్‌లో ఉన్న రూట్ బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్.. ప్రపంచంలో తొలి ప్లేయర్‌గా
భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పర్యాటక ఇంగ్లండ్ జట్టు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. శనివారం చెపాక్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో రెండు వికెట్ల తేడాతో ఇంగ్లండ పరాజయం పాలైంది. తొలి టీ20లో బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయిన ఇంగ్లండ్.. రెండో టీ20లో మాత్రం గట్టి పోటీ ఇచ్చింది. ఆఖరి ఓవర్ ఉత్కంఠబరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ విరోచత పోరాటం వల్ల ఇంగ్లండ్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో కూడా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తన బ్యాట్‌కు పనిచెప్పాడు. 30 బంతుల్లో 3 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతో 45 పరుగులు చేసి మరోసారి తృటిలో హాఫ్ సెంచరీ అవకాశాన్ని జోస్ కోల్పోయాడు. అయితే బట్లర్ హాఫ్ సెంచరీ సాధించకపోయినప్పటికి ఓ అరుదైన రికార్డును మాత్రం తన పేరిట లిఖించుకున్నాడు.పూరన్ రికార్డు బద్దలు..భారత్‌పై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా జోస్ బట్లర్ రికార్డులకెక్కాడు. ఇంగ్లండ్ కెప్టెన్ టీ20ల్లో భారత్‌పై ఇప్పటివరకు 611 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ పేరిట ఉండేది.పూరన్ టీ20ల్లో టీమిండియాపై 592 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో పూరన్ ఆల్‌టైమ్ రికార్డును బట్లర్ బ్రేక్ చేశాడు. అవేవిధంగా బట్లర టీ20ల్లో భారత్‌పై అత్యధికంగా 50+ స్కోర్లు సాధించిన రికార్డును నికోలస్ పూరన్‌తో కలిసి సంయుక్తంగా కలిగి ఉన్నాడు.టీ20ల్లో భారత్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..జోస్ బట్లర్- 611నికోలస్ పూరన్- 592గ్లెన్ మాక్స్వెల్- 574డేవిడ్ మిల్లర్- 524ఆరోన్ ఫించ్- 500చదవండి: సంతోషంగా ఉంది.. అతడి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సూర్య -
టీ20ల్లో జోస్ బట్లర్ అరుదైన ఘనత
టీ20ల్లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్లో 12000 పరుగులు పూర్తి చేసిన ఏడో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. భారత్‌తో తొలి టీ20 సందర్భంగా జోస్ ఈ అరుదైన మైలురాయిని అధిగమించాడు. జోస్‌కు ముందు క్రిస్ గేల్ (14562), షోయబ్ మాలిక్ (13492), కీరన్ పోలార్డ్ (13429), అలెక్స్ హేల్స్ (13361), విరాట్ కోహ్లి (12886), డేవిడ్ వార్నర్ (12757) మాత్రమే టీ20ల్లో 12000 పరుగులు చేశారు.టీ20ల్లో అత్యంత వేగంగా 12000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో బట్లర్ నాలుగో స్థానంలో ఉన్నాడు. గేల్ (343 మ్యాచ్‌ల్లో), విరాట్, వార్నర్ బట్లర్ కంటే వేగంగా ఈ మైలురాయిని చేరుకున్నారు. బట్లర్ తన టీ20 కెరీర్లో ఇప్పటివరకు (భారత్‌తో తొలి టీ20 కలుపుకుని) 430 మ్యాచ్‌లు ఆడి 145.29 స్ట్రయిక్‌రేట్‌తో, 35.08 సగటున 12035 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 84 అర్ద సెంచరీలు ఉన్నాయి.బట్లర్ ఒక్క అంతర్జాతీయ క్రికెట్లోనే సెంచరీ, 26 అర్ద సెంచరీల సాయంతో 3457 పరుగులు చేశాడు. బట్లర్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ తరఫున 3000 టీ20 పరుగులు పూర్తి చేసిన ఏకైక బ్యాటర్ బట్లరే.భారత్, ఇంగ్లండ్ తొలి టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జోస్ బట్లర్ (44 బంతుల్లో 68; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. బట్లర్‌తో పాటు ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (17), జోఫ్రా ఆర్చర్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లు వరుణ్ చక్రవర్తి (4-0-23-3), అర్షదీప్ సింగ్ (4-0-17-2), అక్షర్ పటేల్ (4-1-22-2), హార్దిక్ పాండ్యా (4-0-42-2) అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టారు.133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. అభిషేక్ శర్మ (34 బంతుల్లో 79; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసిన అభిషేక్ కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అభిషేక్‌తో పాటు ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేసిన సంజూ శాంసన్ కూడా బ్యాట్‌ను ఝులిపించాడు. శాంసన్ 20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 26 పరుగులు చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కాగా.. తిలక్ వర్మ (19), హార్దిక్ పాండ్యా (3) భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2, ఆదిల్ రషీద్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లో తదుపరి టీ20 జనవరి 25న చెన్నై వేదికగా జరుగనుంది. -
చరిత్రపుటల్లోకెక్కిన పోలార్డ్
విండీస్ విధ్వంసకర వీరుడు కీరన్ పోలార్డ్ పొట్టి క్రికెట్లో ఓ అరుదైన ఘనత సాధించాడు. పోలీ టీ20 ఫార్మాట్లో 900 సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో పోలార్డ్‌కు ముందు క్రిస్ గేల్ మాత్రమే 900 సిక్సర్ల మార్కును తాకాడు. గేల్ 463 మ్యాచ్‌ల్లో 1056 సిక్సర్లు బాదగా.. పోలార్డ్ తన 690వ మ్యాచ్‌లో 900 సిక్సర్ల మార్కును తాకాడు.టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లు..క్రిస్ గేల్ 1056 (463 మ్యాచ్‌లు)కీరన్ పోలార్డ్ 901 (690 మ్యాచ్‌లు)ఆండ్రీ రసెల్ 727 (529 మ్యాచ్‌లు)నికోలస్ పూరన్ 593 (376 మ్యాచ్‌లు)కొలిన్ మున్రో 550 (434 మ్యాచ్‌లు)కాగా, ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో (ILT20 2025) భాగంగా డెసర్ట్ వైపర్స్‌తో నిన్న (జనవరి 16) జరిగిన మ్యాచ్‌లో పోలీ 900 సిక్సర్స్ క్లబ్లో చేరాడు. ఈ మ్యాచ్‌లో పోలార్డ్ (ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్) 23 బంతుల్లో 2 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. ఎంఐ ఎమిరేట్స్ ఇన్నింగ్స్‌లో పోలార్డే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో పోలార్డ్ మెరిసినా ఎంఐ ఎమిరేట్స్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది.తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఎమిరేట్స్ ఇన్నింగ్స్‌లో కుసాల్ పెరీరా 33, ముహమ్మద్ వసీం 18, టామ్ బాంటన్ 15, నికోలస్ పూరన్ 15, పోలార్డ్ 36, మౌస్లీ 15, రొమారియో షెపర్డ్ 16 (నాటౌట్), అకీల్ హొసేన్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. డెసర్ట్ వైపర్స్ బౌలర్లలో లోకీ ఫెర్గూసన్ 2, డేవిడ్ పేన్, వనిందు హసరంగ, డాన్ లారెన్స్ తలో వికెట్ పడగొట్టారు.160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వైపర్స్ మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ఫకర్ జమాన్ (52 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో రాణించి వైపర్స్‌ను గెలిపించాడు. ఆఖర్లో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (8 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అలెక్స్ హేల్స్ 34, సామ్ కర్రన్ 28 పరుగులు చేసి వైపర్స్ గెలుపులో తమవంతు పాత్ర పోషించారు. డాన్ లారెన్స్ (5), ఆజమ్ ఖాన్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్లలో జహూర్ ఖాన్, డాన్ మౌస్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. వకార్ సలామ్‌ఖీల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో వైపర్స్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించుకుంది. -
క్రికెట్ లీగ్‌లో పెట్టుబడులు పెట్టిన బాలీవుడ్ సూపర్ స్టార్
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) క్రికెట్ లీగ్‌లో పెట్టుబడులు పెట్టాడు. క్రీడా ఔత్సాహికుడైన బచ్చన్ యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL) సహ యజమానిగా వ్యవహరించనున్నాడు. ఇటీవలే ఐసీసీ అమోదం పొందిన ETPL ఈ ఏడాది లాంచ్ కానుంది. ఈ లీగ్‌లో ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ దేశాలకు చెందిన క్రికెటర్లతో పాటు అంతర్జాతీయ ఆటగాళ్లు పాల్గొంటారు. డబ్లిన్, బెల్ఫాస్ట్, ఆమ్స్టర్డామ్, రోట్టర్‌డామ్, ఎడిన్బర్గ్, గ్లాస్గో నగరాలకు చెందిన ప్రాంచైజీలు బరిలో ఉంటాయి. ఈ లీగ్ జులై 15 నుంచి ఆగస్ట్ 3 మధ్యలో జరుగుతుంది. ఫ్రాంచైజీ పేర్లు, ఓనర్ల వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.కాగా, అభిషేక్ బచ్చన్ ప్రో కబడ్డీ లీగ్ మరియు ఇండియన్ సూపర్ లీగ్‌లో (ఫుట్‌బల్) పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ రెండు లీగ్‌ల్లో బచ్చన్ ఫ్రాంచైజీలు కలిగి ఉన్నాడు. ETPLలో పెట్టుబడులు పెట్టిన సందర్భంగా అభిషేక్ మాట్లాడుతూ.. ఈ లీగ్ మూడు దేశాల (ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్) క్రికెట్ బోర్డుల సహకారంతో ముందుకు వస్తుందని అన్నాడు. ETPL ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఆకర్షిస్తుందని తెలిపాడు. క్రికెట్ కేవలం క్రీడ మాత్రమే కాదు, ఇది సరిహద్దులను అధిగమించే ఏకీకృత శక్తి అని బచ్చన్ చెప్పుకొచ్చాడు. ETPLలో అభిషేక్ చేరిక ప్రధాన పెట్టుబడులను ఆకర్శిస్తుంది. ETPL యూరోపియన్లకు క్రికెట్‌ను మరింత చేరువ చేస్తుంది.ఇదిలా ఉంటే, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఫ్రాంచైజీ క్రికెట్ నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రైవేట్ క్రికెట్ లీగ్‌ల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు విశ్వవ్యాప్త గుర్తింపు ఉంది. ఈ లీగ్ భారత్ వేదికగా జరుగుతుంది. ఐపీఎల్ తర్వాత సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL), బిగ్ బాష్ లీగ్(BBL) ఎక్కువ ప్రజాధరణ ఉంది. వివిధ దేశాల్లో జరిగే క్రికెట్ లీగ్‌లు..ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్బిగ్బాష్ లీగ్ (ఆస్ట్రేలియా)కరీబియన్ ప్రీమియర్ లీగ్ (వెస్టిండీస్)గ్లోబల్ టీ20 కెనడా (కెనడా)ఇండియన్ ప్రీమియర్ లీగ్ (భారత్)ఇంటర్నేషన్ లీగ్ టీ20 (దుబాయ్)లంక ప్రీమియర్ లీగ్మేజర్ లీగ్ క్రికెట్ (యూఎస్ఏ)నేపాల్ ప్రీమియర్ లీగ్పాకిస్తాన్ సూపర్ లీగ్SA20 (సౌతాఫ్రికా)సూపర్ స్మాష్ (న్యూజిలాండ్)టీ20 బ్లాస్ట్ (ఇంగ్లండ్) -
అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘనత.. డబుల్ హ్యాట్రిక్
అంతర్జాతీయ టీ20ల్లో డబుల్ హ్యాట్రిక్ నమోదైంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ సబ్ రీజియనల్ అమెరికా క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా కేమెన్ ఐలాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా పేస్ బౌలర్ హెర్నన్ ఫెన్నెల్ ఈ ఫీట్ సాధించాడు. ఫెన్నెల్.. కేమెన్ ఐలాండ్స్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో డబుల్ హ్యాట్రిక్ నమోదు చేసిన ఆరో బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.ఫెన్నెల్‌కు ముందు రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్) vs ఐర్లాండ్, 2019లసిత్ మలింగ (శ్రీలంక) vs న్యూజిలాండ్, 2019కర్టిస్ కాంఫర్ (ఐర్లాండ్) vs నెదర్లాండ్స్, 2021జాసన్ హోల్డర్ (వెస్టిండీస్) vs ఇంగ్లాండ్, 2022వసీమ్ యాకూబ్ర్ (లెసోతో) vs మాలి, 2024 ఈ ఘనత సాధించారు.కేమెన్ ఐలాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫెన్నెల్ డబుల్ హ్యాట్రిక్ సహా మొత్తం ఐదు వికెట్లు (5/14) తీశాడు. ట్రాయ్ టేలర్, అలిస్టర్ ఐఫిల్, రొనాల్డ్ ఈబ్యాంక్స్, అలెస్సాండ్రో మోరిస్ ఫెన్నెల్ డబుల్ హ్యాట్రిక్ బాధితులు.అంతర్జాతీయ టీ20ల్లో ఫెన్నెల్‌కు ఇది రెండో హ్యాట్రిక్ కావడం మరో విశేషం. 36 ఏళ్ల ఫెన్నెల్ 2021లో పనామాతో జరిగిన మ్యాచ్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఫెన్నెల్.. అంతర్జాతీయ టీ20ల్లో రెండు అంతకంటే ఎక్కువ హ్యాట్రిక్‌లు నమోదు చేసిన ఆరో బౌలర్‌గానూ రికార్డుల్లోకెక్కాడు.ఫెన్నెల్‌కు ముందు మాల్టాకు చెందిన వసీం అబ్బాస్,ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిన్స్సెర్బియాకు చెందిన మార్క్ పావ్లోవిక్న్యూజిలాండ్కు చెందిన టిమ్ సౌథీశ్రీలంకకు చెందిన లసిత్ మలింగ అంతర్జాతీయ టీ20ల్లో రెండు అంతకంటే ఎక్కువ హ్యాట్రిక్‌లు నమోదు చేశారు. -
బాబర్ ఆజం ప్రపంచ రికార్డు
టీ20 క్రికెట్ పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం సరికొత్త చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా పదకొండు వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్‌ను అధిగమించి.. ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.పాక్‌కు చేదు అనుభవంసౌతాఫ్రికాతో రెండో టీ20 సందర్భంగా బాబర్ ఆజం ఈ ఘనత సాధించాడు. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు పాకిస్తాన్ సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లింది. ఈ పర్యటన టీ20 సిరీస్‌తో మొదలుకగా.. పాక్‌కు చేదు అనుభవం ఎదురైంది.డర్బన్‌లో జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ప్రొటీస్ జట్టు చేతిలో 11 పరుగుల తేడాతో ఓడిన పాకిస్తాన్.. సెంచూరియన్‌లో శుక్రవారం నాటి రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. సౌతాఫ్రికా చేతిలో ఏడు వికెట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ టీ20లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది పాక్.సయీమ్ ఆయుబ్ ధనాధన్ ఇన్నింగ్స్ వృథాఓపెనర్ సయీమ్ ఆయుబ్(57 బంతుల్లో 98 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్‌కు తోడు.. బాబర్ ఆజం(20 బంతుల్లో 31), ఇర్ఫాన్ ఖాన్(16 బంతుల్లో 30) రాణించడంతో భారీ స్కోరు సాధించింది. అయితే, సౌతాఫ్రికా బ్యాటర్లలో రీజా హెండ్రిక్స్ సూపర్ సెంచరీ(63 బంతుల్లో 117), రాసీ వాన్ డెర్ డసెన్(38 బంతుల్లో 66) అద్భుత అర్ధ శతకం కారణంగా పాక్‌కు ఓటమి తప్పలేదు.ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఘనంగా(31, 3 ఫోర్లు, ఒక సిక్సర్)నే ఇన్నింగ్స్‌ను ఆరంభించినా.. దానిని భారీ స్కోరుగా మలుచుకోలేకపోయాడు. అయినప్పటికీ పొట్టి ఫార్మాట్లో అతడు అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.గేల్ ప్రపంచ రికార్డును బద్దలుసౌతాఫ్రికాతో రెండో టీ20 సందర్భంగా బాబర్ ఆజం షార్టెస్ట్ క్రికెట్లో ఓవరాల్‌గా 11,020 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో గేల్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. పదకొండు వేల పరుగుల మార్కును అందుకోవడానికి గేల్‌కు 314 ఇన్నింగ్స్ అవసరమైతే.. బాబర్ 298 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ అందుకున్నాడు. అయితే, ఓవరాల్‌గా మాత్రం అంతర్జాతీయ, ఫ్రాంఛైజీ టీ20 క్రికెట్లో గేల్ యూనివర్సల్ బాస్‌గా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో 14562 టీ20 రన్స్ ఉన్నాయి.టీ20 క్రికెట్లో తక్కువ ఇన్నింగ్స్‌లో 11000 పరుగులు సాధించిన ఆటగాళ్లు1. బాబర్ ఆజం- 298 ఇన్నింగ్స్2. క్రిస్ గేల్- 314 ఇన్నింగ్స్3. డేవిడ్ వార్నర్- 330 ఇన్నింగ్స్4. విరాట్ కోహ్లి- 337 ఇన్నింగ్స్.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
షమీ డబుల్ సెంచరీ
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ పొట్టి ఫార్మాట్లో 200 వికెట్ల అరుదైన మైలురాయిని అధిగమించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో షమీ ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో షమీ 4 ఓవర్లలో 43 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. టీ20ల్లో షమీ వికెట్ల సంఖ్య ప్రస్తుతం 201గా ఉంది. షమీ 165 టీ20 మ్యాచ్‌ల్లో వికెట్ల డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చహల్ పేరిట ఉంది. చహల్ పొట్టి ఫార్మాట్లో 364 వికెట్లు తీశాడు. చహల్ తర్వాత కింద పేర్కొన్న బౌలర్ల 200 అంతకంటే ఎక్కువ టీ20 వికెట్లు తీశారు.పియూశ్ చావ్లా- 319భువనేశ్వర్ కుమార్-310రవిచంద్రన్ అశ్విన్-310అమిత్ మిశ్రా-285హర్షల్ పటేల్-244హర్భజన్ సింగ్-235జయదేవ్ ఉనద్కత్-234అక్షర్ పటేల్-233రవీంద్ర జడేజా-225సందీప్ శర్మ-214అర్షదీప్ సింగ్-203ఉమేశ్ యాదవ్-202మహ్మద్ షమీ-201కుల్దీప్ యాదవ్-200ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఘనత డ్వేన్ బ్రావోకు దక్కుతుంది. ఈ విండీస్ ఆల్‌రౌండర్ పొట్టి ఫార్మాట్లో 631 వికెట్లు తీశాడు. బ్రావో తర్వాత రషీద్ ఖాన్ (615), సునీల్ నరైన్ (569) అత్యధిక టీ20 వికెట్లు తీసిన వారిలో ఉన్నారు.బరోడా, బెంగాల్ మ్యాచ్ విషయానికొస్తే.. నిన్న (డిసెంబర్ 11) జరిగిన క్వార్టర్ ఫైనల్-1లో బెంగాల్‌పై బరోడా 41 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన బెంగాల్ 18 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. బరోడా బౌలర్లు హార్దిక్ పాండ్యా (4-0-27-3), లుక్మన్ మేరీవాలా (3-0-17-3), అతీత్ సేథ్ (4-0-41-3) తలో చేయి వేసి బెంగాల్ పతనాన్ని శాశించారు. బెంగాల్‌కు గెలిపించేందుకు షాబాజ్ అహ్మద్ (55) విఫలయత్నం చేశాడు.కాగా, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో నిన్నటితో సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. బరోడా, ముంబై, ఢిల్లీ, మధ్యప్రదేశ్ సెమీస్‌కు చేరాయి. డిసెంబర్ 13న జరిగే తొలి సెమీఫైనల్లో బరోడా, ముంబై.. అదే రోజు జరిగే రెండో సెమీఫైనల్లో ఢిల్లీ, మధ్యప్రదేశ్ తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచి జట్లు డిసెంబర్ 15న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. -
అశ్విన్ రికార్డును సమం చేసిన భువీ
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో భువీ దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో వికెట్లు తీస్తున్నాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్లో కూడా భువీ రెండు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో రెండో వికెట్ తీసిన అనంతరం భువీ.. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డును సమం చేశాడు. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో అశ్విన్, భువీ సమంగా నిలిచారు. ప్రస్తుతం వీరిద్దరి ఖాతాలో 310 టీ20 వికెట్లు ఉన్నాయి. ఈ జాబితాలో యుజ్వేంద్ర చహల్ (364 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. పియూశ్ చావ్లా (319) రెండో స్థానంలో ఉన్నాడు. భువీ, అశ్విన్ సంయ్తుంగా మూడో స్థానంలో నిలిచారు.కాగా, ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భువీ (ఉత్తర్‌ప్రదేశ్ కెప్టెన్) ఇన్ ఫామ్ బ్యాటర్ కేఎస్ భరత్, త్రిపురణ విజయ్ వికెట్లు తీశాడు. భువీ బంతితో రాణించడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఏపీ ఇన్నింగ్స్‌లో ఎస్డీఎన్వీ ప్రసాద్ (34 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కేవీ శశికాంత్ (23 నాటౌట్), కెప్టెన్ రికీ భుయ్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. శ్రీకర్ భరత్ (4), అశ్విన్ హెబ్బర్ (11), షేక్ రషీద్ (18), పైలా అవినాశ్ (19), త్రిపురణ విజయ్ (16) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. యూపీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. మొహిసిన్ ఖాన్, శివమ్ మావి చెరో వికెట్ దక్కించుకున్నారు.157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఉత్తర్‌ప్రదేశ్.. మరో ఓవర్ మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కరణ్ శర్మ (48) టాప్ స్కోరర్‌గా నిలువగా.. రింకూ సింగ్ (22 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, సిక్సర్), విప్రాజ్ నిగమ్ (27 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి యూపీని గెలిపించారు. కే సుదర్శన్ (4-1-23-3), త్రిపురణ విజయ్ (4-0-21-2), సత్యనారాయణ రాజు (4-0-30-1) మెరుగ్గా బౌలింగ్ చేసినప్పటికీ ఏపీని గెలిపించలేకపోయారు. -
సూర్యకుమార్ యాదవ్ సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ భారత టీ20 జట్టు సారధి సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు. అభిషేక్ ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు (టీ20ల్లో) బాదిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉండేది. స్కై 2022లో 41 ఇన్నింగ్స్‌ల్లో 85 సిక్సర్లు (టీ20ల్లో) బాదగా.. అభిషేక్ ఈ ఏడాది కేవలం 38 ఇన్నింగ్స్‌ల్లోనే 87 సిక్సర్లు కొట్టాడు. టీ20ల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ అగ్రస్థానంలో ఉండగా.. స్కై వరుసగా రెండు, మూడు స్థానాల్లో (2023లో 71 సిక్సర్లు) ఉన్నాడు.క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 సిక్సర్లు బాదిన భారత ఆటగాళ్లుఅభిషేక్ శర్మ (38 ఇన్నింగ్స్‌ల్లో 87 సిక్సర్లు, 2024)సూర్యకుమార్ యాదవ్ (41 ఇన్నింగ్స్‌ల్లో 85 సిక్సర్లు, 2022)సూర్యకుమార్ యాదవ్ (33 ఇన్నింగ్స్‌ల్లో 71 సిక్సర్లు, 2023)రిషబ్ పంత్ (31 ఇన్నింగ్స్‌ల్లో 66 సిక్సర్లు, 2018)శ్రేయస్ అయ్యర్ (42 ఇన్నింగ్స్‌ల్లో 63 సిక్సర్లు, 2019)సంజూ శాంసన్ (32 ఇన్నింగ్స్‌ల్లో 60 సిక్సర్లు, 2024)సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ సూర్యకుమార్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ 11 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 28 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తద్వారా టీ20ల్లో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా ఉర్విల్ పటేల్ (గుజరాత్) రికార్డును సమం చేశాడు. ఉర్విల్ కూడా ఇదే సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఫాసెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన మేఘాలయ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. మేఘాలయ ఇన్నింగ్స్‌లో అర్పిత్ భటేవారా (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్.. అభిషేక్ సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో 9.3 ఓవరల్లోనే విజయతీరాలకు చేరింది. -
టీ20ల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ.. గేల్, పంత్ రికార్డులు బద్దలు
టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీ నమోదైంది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గుజరాత్ ఆటగాడు ఉర్విల్ పటేల్.. 28 బంతుల్లోనే (త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో) శతక్కొట్టాడు. పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఇది సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ కాగా.. భారత్ తరఫున పొట్టి ఫార్మాట్లో ఇది ఫాస్టెస్ట్ సెంచరీగా రికార్డైంది.గేల్, పంత్ రికార్డులు బద్దలుటీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీని చేరుకునే క్రమంలో ఉర్విల్.. క్రిస్ గేల్, రిషబ్ పంత్‌ల రికార్డులను బద్దలు కొట్టాడు. టీ20ల్లో గేల్ 30 బంతుల్లో శతక్కొట్టగా.. పంత్ 32 బంతుల్లో సెంచరీ బాదాడు.సాహిల్ చౌహాన్ పేరిట ఫాస్టెస్ట్ సెంచరీపొట్టి ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. చౌహాన్ ఈ ఏడాదే సైప్రస్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లో శతక్కొట్టాడు. ఉర్విల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కేవలం ఒక్క బంతితో మిస్ అయ్యాడు.భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీటీ20ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రిషబ్ పేరిట ఉండగా.. తాజాగా ఉర్విల్ పంత్ రికార్డును బద్దలు కొట్టాడు. త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో 35 బంతులు ఎదుర్కొన్న ఉర్విల్ 7 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.లిస్ట్-ఏ క్రికెట్లోనూ ఫాస్టెస్ట్ సెంచరీభారత్ తరఫున లిస్ట్-ఏ క్రికెట్లోనూ సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఉర్విల్ పేరిటే ఉంది. 2023 నవంబర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉర్విల్ 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు టీమిండియా మాజీ ఆటగాడు యూసఫ్ పఠాన్ పేరిట ఉంది. 2010లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో యూసఫ్ పఠాన్ 40 బంతుల్లో సెంచరీ బాదాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన త్రిపుర నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. శ్రీదమ్ పాల్ (57) అర్ద సెంచరీతో రాణించాడు. గుజరాత్ బౌలర్లలో నగస్వల్లా అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందకు బరిలోకి దిగిన గుజరాత్ 10.2 ఓవర్లలోనే (2 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. ఉర్విల్ సునామీ శతకంతో విరుచుకుపడగా.. ఆర్య దేశాయ్ (38) మరో ఎండ్ నుంచి ఉర్విల్‌కు సహకరించాడు.ఎవరీ ఉర్విల్ పటేల్..?26 ఏళ్ల ఉర్విల్ బరోడాలోని మెహసానాలో జన్మించాడు. 2018లో అతను బరోడా తరఫున టీ20 అరంగేట్రం చేశాడు. అదే ఏడాది అతను లిస్ట్-ఏ క్రికెట్లోకి కూడా అడుగుపెట్టాడు. అయితే ఆతర్వాత ఉర్విల్‌కు ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసేందుకు ఆరేళ్లు పట్టింది. ఉర్విల్ గతేడాదే రంజీల్లోకి అడుగుపెట్టాడు.గుజరాత్ టైటాన్స్ వదిలేసింది..!ఉర్విల్‌ను 2023 ఐపీఎల్ సీజన్ వేలంలో గుజరాత్ టైటాన్స్ 20 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. అయితే ఆ సీజన్లో ఉర్విల్‌కు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. ఉర్విల్‌ను గుజరాత్ టైటాన్స్ 2025 మెగా వేలానికి ముందు వదిలేసింది. రెండు రోజుల కిందట జరిగిన మెగా వేలంలో ఉర్విల్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ఉర్విల్‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. తాజా ఇన్నింగ్స్ నేపథ్యంలో ఫ్రాంచైజీలు మనసు మార్చుకుంటాయేమో వేచి చూడాలి. -
టీ20 క్రికెట్ లో హ్యాట్రిక్ సెంచరీలు.. తిలక్ వర్మ నయా రికార్డ్..!
-
చరిత్రపుటల్లోకెక్కిన మ్యాక్స్‌వెల్.. అత్యంత వేగంగా..!
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ చరిత్రపుటల్లకెక్కాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో 19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసిన మ్యాక్సీ.. టీ20ల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 10000 పరుగుల మైలురాయిని తాకిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. మ్యాక్సీకి ముందు ఈ రికార్డు కీరన్ పోలార్డ్ పేరిట ఉండేది. పోలీ 6640 బంతుల్లో 10000 పరుగుల మార్కును క్రాస్ చేయగా.. మ్యాక్సీ కేవలం 6505 బంతుల్లోనే ఈ అరుదైన మైలురాయిని అధిగమించాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా 10000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో మ్యాక్సీ, పోలీ తర్వాత క్రిస్ గేల్ (6705), అలెక్స్ హేల్స్ (6774), జోస్ బట్లర్ (6928) ఉన్నారు.పొట్టి ఫార్మాట్లో పది వేల పరుగులు పూర్తి చేసుకున్న మ్యాక్సీ.. పురుషుల క్రికెట్లో ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన పదహారో బ్యాటర్‌గా.. అదే విధంగా మూడో ఆసీస్ క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. మాక్సీ (10031) కంటే ముందు డేవిడ్ వార్నర్(12411), ఆరోన్ ఫించ్(11458) ఆస్ట్రేలియా తరఫున పదివేల పరుగుల క్లబ్లో ఉన్నారు. పొట్టి క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌కు దక్కుతుంది. గేల్ ఈ ఫార్మాట్లో 10060 బంతులు ఎదుర్కొని 14562 పరుగులు చేశాడు.కాగా, ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మధ్య ఇవాళ (నవంబర్ 16) రెండో టీ20 జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 13 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.సిడ్నీ వేదికగా జరిగిన ఇవాల్టి మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్ (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హరీస్ రౌఫ్ (4/22), అబ్బాస్ అఫ్రిది (3/17), సూఫియాన్ ముఖీమ్ (2/21) ఆసీస్ పతనాన్ని శాశించారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. 19.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటై, లక్ష్యానికి 14 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆసీస్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ ఐదు వికెట్లు తీసి పాక్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. ఆడమ్ జంపా రెండు, జేవియర్ బార్ట్లెట్ ఓ వికెట్ పడగొట్టారు. పాక్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖాన్ (52) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
మరో విజయం లక్ష్యంగా...
జిఖెబెర్హా (పోర్ట్ ఎలిజబెత్): టి20 క్రికెట్లో జోరు కొనసాగించాలని పట్టుదలగా ఉన్న భారత జట్టు మరో పోరుకు సన్నద్ధమైంది. నేడు దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టి20లో భారత్ తలపడుతుంది. తొలి మ్యాచ్‌లో నెగ్గిన టీమిండియా ఇక్కడా విజయం సాధిస్తే 2–0తో ముందంజ వేస్తుంది. నాలుగు మ్యాచ్‌ల ఈ సమరంలో ఆపై సిరీస్ కోల్పోయే అవకాశం మాత్రం ఉండదు. మరో వైపు స్వదేశంలో కూడా ప్రభావం చూపలేక సమష్టి వైఫల్యంతో చిత్తయిన దక్షిణాఫ్రికాపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తమ అవకాశాలు కాపాడుకోవాలని ఆ జట్టు భావిస్తోంది. ఇక్కడి పిచ్‌పై చక్కటి బౌన్స్ ఉండటంతో అటు బ్యాటింగ్‌కు, ఇటు పేస్ బౌలింగ్‌కు అనుకూలం కాబట్టి ఆసక్తికర పోరు జరగవచ్చు. మ్యాచ్ రోజున వర్షం పడే అవకాశం తక్కువ. అంతర్జాతీయ టి20ల్లో వరుసగా 11 మ్యాచ్‌లు గెలిచిన భారత్ ఈ సారి కూడా విజయం సాధిస్తే తమ రికార్డు (12 మ్యాచ్‌లు)నే సమం చేస్తుంది. అందరూ చెలరేగితే... తొలి టి20లో భారత్ బ్యాటింగ్ పదునేమిటో కనిపించింది. ఇన్నింగ్స్ చివర్లో కాస్త తడబాటుకు గురైనా స్కోరు 200 దాటడం విశేషం. సంజు సామ్సన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతుండటం సానుకూలాశం కాగా మరో ఓపెనర్ అభిషేక్ శర్మ అంచనాలను అందుకోవాల్సి ఉంది. వరుసగా విఫలమవుతున్న అతనికి ఇది చివరి అవకాశం కావచ్చు. సూర్యకుమార్ ఎప్పటిలాగే తనదైన శైలిలో బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించడం ఖాయం. తిలక్ వర్మ కూడా తొలి పోరులో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. చివరి ఓవర్లలో వేగంగా ఆడే క్రమంలో పాండ్యా, రింకూ సింగ్ తొందరగానే అవుటైనా వారు తమ స్థాయికి తగినట్లు ఆడితే భారత్‌కు తిరుగుండదు. ఏడో స్థానంలో అక్షర్ పటేల్ లాంటి ఆల్‌రౌండర్ అందుబాటులో ఉండటం జట్టు బ్యాటింగ్ లోతును చూపిస్తోంది. బౌలింగ్‌లో కూడా వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ స్పిన్‌ను అర్థం చేసుకోవడంతో సఫారీలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పేసర్ అర్‡్షదీప్ కూడా సత్తా చాటుతుండగా...పునరాగమనంలో అవేశ్ ఆకట్టుకున్నాడు. ఇలాంటి లైనప్ ఉన్న జట్టు మరోసారి చెలరేగితే వరుసగా రెండో విజయం జట్టు ఖాతాలో చేరడం ఖాయం. గెలిపించేది ఎవరు... సొంతగడ్డపై ఇటీవలే విండీస్ చేతిలో 0–3తో టి20 సిరీస్‌ను చేజార్చుకున్న దక్షిణాఫ్రికా ఈ ఫార్మాట్లో ఇంకా తడబడుతూనే ఉంది. తొలి పోరులో బౌలర్ల వైఫల్యంతో ముందుగా భారీగా పరుగులిచ్చుకున్న జట్టు...ఆ తర్వాత బ్యాటింగ్‌లో సాధారణ ప్రదర్శన కూడా చూపించలేదు. మార్క్రమ్ మళ్లీ విఫలం కాగా...రికెల్టన్, స్టబ్స్ కూడా నిలబడలేకపోయారు. క్లాసెన్, మిల్లర్ జోడీపై జట్టు అతిగా ఆధారపడుతున్నట్లు అనిపిస్తోంది. వీరిద్దరు వెనుదిరిగితే చాలు ప్రత్యర్థి చేతికి మ్యాచ్ అప్పగించినట్లే కనిపిస్తోంది. పేరుకే ఆల్‌రౌండర్ అయినా మార్కో జాన్సెన్ ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. కొయెట్జీతో పాటు ఇతర బౌలర్లు కూడా రాణిస్తేనే భారత్‌ను సఫారీలు నిలువరించగలరు. పీటర్, సిమ్‌లేన్ గత మ్యాచ్‌లో విఫలమైనా... మరో మ్యాచ్‌లో అవకాశం దక్కవచ్చు. స్పిన్నర్‌గా కేశవ్ మహరాజ్ కూడా రాణించాల్సి ఉంది. -
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. తొలి భారత క్రికెటర్‌గా
డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన శాంసన్ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. స్టేడియం నలుమూలలా బౌండరీల వర్షం కురిపిస్తూ అభిమానులను అలరించాడు.ఈ క్రమంలో కేవలం 47 బంతుల్లోనే తన రెండో అంతర్జాతీయ టీ20 సెంచరీని సంజూ అందుకున్నాడు. ఓవరాల్‌గా 50 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సంజూ 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 107 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన శాంసన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.శాంసన్ సాధించిన రికార్డులు ఇవే..👉అంతర్జాతీయ టీ20ల్లో వరుస ఇన్నింగ్స్‌లలో సెంచరీలు బాదిన తొలి భారత బ్యాటర్‌గా శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ కంటే ముందు హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో శాంసన్ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు.ఇప్పుడు అదే ఇన్నింగ్స్‌ను సఫారీ గడ్డపై రిపీట్ చేశాడు. తద్వారా ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా ప్రపంచక్రికెట్లో ఈ ఘనత సాధించిన నాలుగో ప్లేయర్‌గా సంజూ రికార్డులకెక్కాడు. గతంలో గుస్తావ్ మెక్‌కియాన్ (ఫ్రాన్స్), ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్), రిలీ రూసో (దక్షిణాఫ్రికా) ఈ ఘనత సాధించారు.👉అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డును శాంసన్ సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో సంజూ 10 సిక్స్‌లు నమోదు చేశాడు. గతంలో శ్రీలంకతో జరిగిన టీ20లో హిట్‌మ్యాన్ కూడా 10 సిక్స్‌లు బాదాడు.👉టీ20ల్లో దక్షిణాఫ్రికా గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత ఆటగాడిగా సంజూ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉండేది. గతేడాది డిసెంబర్లో జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో సూర్యకుమార్ 100 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో సూర్య రికార్డును ఈ కేరళ బ్యాటర్ బ్రేక్ చేశాడు.👉ప్రొఫెషనల్ టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 7000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆరో భారత బ్యాటర్‌గా శాంసన్ నిలిచాడు. కేవలం 269 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ను శాంసన్ సాధించాడు. ఈ క్రమంలో మహేంద్ర సింగ్ ధోనీని(365) అధిగమించాడు. ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో కేఎల్ రాహుల్(197) అగ్రస్ధానంలో ఉండగా.. విరాట్ కోహ్లి(212), శిఖర్ ధావన్(246), సూర్యకుమార్ యాదవ్(249), సురేశ్ రైనా(251) తర్వాతి స్ధానాల్లో ఉన్నారు.భారత్ ఘన విజయం..ఇక ఈ మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో దక్షిణాఫ్రిను భారత్ చిత్తు చేసింది. దీంతో నాలుగు టీ20ల సిరీస్‌లో1-0 ఆధిక్యంలోకి టీమిండియా దూసుకెళ్లింది. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో దక్షిణాఫ్రికా చతికలపడింది. భారత బౌలర్ల దాటికి సౌతాఫ్రికా కేవలం 141 పరుగులకే ఆలౌటైంది.చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన కేఎల్ రాహుల్ -
Ind vs NZ: టీ20 క్రికెట్ వల్లే బ్యాటర్లు విఫలం: గంభీర్
న్యూజిలాండ్‌తో తొలి రెండు టెస్టుల్లో టీమిండియా బ్యాటర్లు విఫలమైన తీరు మేనేజ్మెంట్ను కలవరపాటుకు గురిచేసింది. బెంగళూరు మ్యాచ్‌లో 46 పరుగులకే ఆలౌట్ కావడం సహా.. పుణెలోనూ నామమాత్రపు స్కోర్లు(156, 245) చేయడం విమర్శలకు తావిచ్చింది. మఖ్యంగా.. రెండో టెస్టులో కివీస్ బౌలర్ మిచెల్ సాంట్నర్‌ను ఎదుర్కోలేక చేతులెత్తేసిన భారత బ్యాటర్ల కారణంగా ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే.పరువు కోసం.. ఫైనల్ కోసంపన్నెండేళ్ల తర్వాత తొలిసారి టీమిండియా స్వదేశంలో టెస్టు సిరీస్‌లో ఓటమిపాలైంది. జూనియర్లతో పాటు సీనియర్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా లెఫ్టార్మ్ స్పిన్నర్ సాంట్నర్ బౌలింగ్‌లో తడబడ్డారు. భారత బ్యాటర్ల పుణ్యమా అని అతడు తన టెస్టు కెరీర్లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు(13/157) నమోదు చేశాడు.ఇక ఇప్పటికే సిరీస్ కోల్పోయినా.. కివీస్‌తో కనీసం ఆఖరి టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరుకునేందుకు మార్గం సుగమం చేసుకోవాలని కఠినంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ భారత బ్యాటర్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 క్రికెట్ వల్లే బ్యాటర్లు విఫలంముంబైలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రపంచ వ్యాప్తంగా టీ20 క్రికెట్‌కు ఆదరణ పెరిగింది. అందుకే చాలా మంది బ్యాటర్లు డిఫెండ్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. అయితే, విజయవంతమైన ఆటగాళ్లలో ఫార్మాట్లకు అతీతంగా మూడింటిలో స్ట్రాంగ్‌గా డిఫెన్స్ చేసుకునే వారే ఎక్కువ.వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడటానికి ఉన్న ప్రాధాన్యాన్ని మనం మరచిపోకూడదు. ప్రతిసారి ఆటగాళ్లకు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉండాలి. తద్వారా దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలు పొందవచ్చు’’ అని గంభీర్ పేర్కొన్నాడు. టెస్టుల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ దూకుడు తగ్గించి ఆచితూచి ఆడాలని పరోక్షంగా బ్యాటర్లకు హితవు పలికాడు.బుమ్రా ఆడకపోవచ్చుఅదే విధంగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా న్యూజిలాండ్‌తో మూడో టెస్టు ఆడకపోవచ్చని గంభీర్ సంకేతాలు ఇచ్చాడు. కివీస్ సిరీస్ తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లనున్న నేపథ్యంలోనే మేనేజ్మెంట్ అతడికి విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది. ఇక నవంబరు 1 నుంచి టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ముంబైలోని వాంఖడే వేదికగా నామమాత్రపు మూడో టెస్టు ఆరంభం కానుంది.చదవండి: Aus A vs Ind A: ముకేశ్ దెబ్బకు.. ‘జూనియర్ రికీ పాంటింగ్’ డకౌట్.. కానీ -
పరుగుల విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచరీ.. రోహిత్ రికార్డు బ్రేక్
-
సికిందర్ రజా ఊచకోత.. టీ20 క్రికెట్లో జింబాబ్వే ప్రపంచ రికార్డు
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో జింబాబ్వే పరుగుల విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 344 రన్స్ స్కోరు చేసింది. తద్వారా ఇంటర్నేషనల్ టీ20లలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ప్రపంచ రికార్డు సాధించింది.గాంబియా బౌలింగ్ ఊచకోతనైరోబిలోని రౌరాక స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్లో జింబాబ్వే గాంబియా(Gambia) జట్టుతో తలపడింది. టాస్ గెలిచిన సికందర్ రజా బృందం తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు బ్రియాన్ బెనెట్, తాడివాన్షే మరుమణి(Tadiwanashe Marumani) గాంబియా బౌలింగ్‌ను ఊచకోత కోశారు. బ్రియాన్ 26 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 50 పరుగులు రాబట్టగా.. మరుమణి కేవలం 19 బంతుల్లోనే 62 రన్స్ సాధించాడు.సికందర్ రజా ఒక్కడే 133 రన్స్వన్డౌన్ బ్యాటర్ డియాన్ మైర్స్(12) విఫలం కాగా.. కెప్టెన్ సికందర్ రజా పరుగుల సునామీ సృష్టించాడు. కేవలం 43 బంతుల్లోనే 7 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 133 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిగతావాళ్లలో రియాన్ బర్ల్ 11 బంతుల్లో 25, క్లైవ్ మడాండే కేవలం 17 బంతుల్లోనే 53(నాటౌట్) పరుగులు సాధించారు. చరిత్ర పుటల్లోకి జింబాబ్వే జట్టుఫలితంగా కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన జింబాబ్వే 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు స్కోరు చేసింది. తద్వారా నేపాల్ పేరిట ఉన్న టీ20 ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఆసియా క్రీడలు-2023లో భాగంగా నేపాల్ మంగోలియాపై 314 పరుగులు స్కోరు చేసింది. తాజాగా జింబాబ్వే ఆ రికార్డును బ్రేక్ చేసి అత్యధిక పరుగుల జట్టుగా తమ పేరును చరిత్రపుటల్లో లిఖించుకుంది. 290 పరుగుల భారీ తేడాతో విజయంజింబాబ్వే విధించిన కొండంత లక్ష్యాన్ని చూసి బెంబేలెత్తిన గాంబియా.. 54 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టు ఆటగాళ్ల స్కోర్లు వరుస(బ్యాటింగ్ ఆర్డర్)గా 5,0,7,4,7,1,2,2,0,12*,0. దీంతో జింబాబ్వే ఏకంగా 290 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగర్వా, బ్రాండన్ మవుతా మూడేసి వికెట్ల తీయగా.. వెస్లీ మధెవెరె రెండు, ర్యాన్ బర్ల్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: Asia Cup 2024: పాకిస్తాన్ భారీ విజయం.. భారత్‌తో పాటు సెమీస్‌లో! -
సౌతాఫ్రికా క్రికెటర్ షంసీ కీలక నిర్ణయం
సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ తబ్రేజ్ షంసీ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి వైదొలిగాడు. ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాంఛైజీ క్రికెట్లో భాగమయ్యేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అయితే, జాతీయ జట్టుకు తన సేవలు అవసరమైన వేళ తప్పకుండా అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ధారించింది.అందుకే ఈ నిర్ణయం‘‘సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. దేశవాళీ క్రికెట్ సీజన్ సమయంలో కాస్త విరామంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్ మ్యాచ్‌లు ఆడాలని కోరుటుకుంటున్నాను. నా కుటుంబానికి తగినంత సమయం కేటాయించాలని భావిస్తున్నాను.అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అయితే, ప్రొటిస్ జట్టుకు నా అవసరం ఉందనుకున్న సమయంలో బోర్డు పిలిస్తే కచ్చితంగా దేశానికి ఆడతా’’ అని తబ్రేజ్ షంసీ పేర్కొన్నాడు. కాగా 2016లో సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన తబ్రేజ్ షంసీ.. వన్డే, టీ20 జట్టలో ఫస్ట్ ఛాయిస్ స్పిన్నర్‌గా ఎదిగాడు.ఇప్పటి వరకు సౌతాఫ్రికా తరఫున 51 వన్డేలు, 70 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో 72, 89 వికెట్లు పడగొట్టాడు. అయితే, టెస్టుల్లో మాత్రం షంసీ నిలదొక్కుకోలేకపోయాడు. కేవలం రెండే మ్యాచ్‌లు ఆడి ఆరు వికెట్లు తీయగలిగాడు.సెంట్రల్ కాంట్రాక్టు లేకపోయినాఇక షంసీ నిర్ణయాన్ని తాము ఆమోదిస్తున్నట్లు క్రికెట్ సౌతాఫ్రికా డైరెక్టర్ ఎనోచ్ తెలిపాడు. సౌతాఫ్రికా పరిమిత ఓవర్ల క్రికెట్ జట్లలో షంసీ కీలక సభ్యుడని.. సెంట్రల్ కాంట్రాక్టు లేకపోయినా సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని చెప్పడం అతడి నిజాయితీకి నిదర్శనమని ప్రశంసించాడు. కాగా షంసీ ఐపీఎల్‌తో పాటు మరెన్నో టీ20లలో భాగమవుతున్నాడు. చివరగా.. ఈ ఏడాది కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్‌తో అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. చదవండి: ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్: భారత స్పిన్ దిగ్గజం -
ట్రావిస్ హెడ్‌ను మించినోడే లేడు..!
పొట్టి క్రికెట్లో ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. పవర్ ప్లేల్లో అతను పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది హెడ్ పవర్ ప్లేల్లో (టీ20 ఫార్మాట్లో) అత్యధిక స్ట్రయిర్రేట్తో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. హెడ్ ఈ ఏడాది ఇప్పటివరకు (పవర్ ప్లేల్లో) 192.32 స్ట్రయిర్రేట్తో 1027 పరుగులు చేశాడు. ఈ విభాగానికి సంబంధించి హెడ్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. హెడ్ తర్వాత పవర్ ప్లేల్లో ఫిల్ సాల్ట్ అత్యధిక పరుగులు చేశాడు. సాల్ట్ 173.73 స్ట్రయిక్‌రేట్‌తో 827 పరుగులు చేశాడు. సాల్ట్ తర్వాతి స్థానాల్లో డుప్లెసిస్ (156.09 స్ట్రయిక్‌రేట్‌తో 807 పరుగులు), అలెక్స్ హేల్స్ (136.08 స్ట్రయిక్‌రేట్‌తో 792 పరుగులు), జేమ్స్ విన్స్ (124.64 స్ట్రయిక్‌రేట్‌తో 703 పరుగులు) ఉన్నారు.హెడ్ తాజా ప్రదర్శన విషయానికొస్తే.. ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన టీ20లో చెలరేగిపోయాడు. కేవలం 23 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 59 పరుగులు చేశాడు. పవర్ ప్లేలో సామ్ కర్రన్ వేసిన ఓ ఓవర్లో హెడ్ ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. ఇందులో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా 28 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 19.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో హెడ్ (59), మాథ్యూ షార్ట్ (41), జోష్ ఇంగ్లిస్ (37) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో లివింగ్‌స్టోన్ 3, జోఫ్రా ఆర్చర్, సకీబ్ మహమూద్ తలో 2, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ పడగొట్టారు.180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆసీస్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 19.2 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. సీన్ అబాట్ 3, హాజిల్‌వుడ్, జంపా చెరో 2, బార్ట్లెట్, గ్రీన్, స్టోయినిస్ తలో వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో లివింగ్‌స్టోన్ (37), ఫిలిప్ సాల్ట్ (20), సామ్ కర్రన్(18), జోర్డన్ కాక్స్ (17), జేమీ ఓవర్టన్ (15), సాకిబ్ మహమూద్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 సెప్టెంబర్ 13న జరుగుతుంది. చదవండి: ఒకే ఓవర్లో 30 పరుగులు.. హెడ్ అరుదైన రికార్డు -
బ్రావో 'ది ఛాంపియన్'.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
వెస్టిండీస్ నుంచి ఎంతో మంది ఆటగాళ్లు క్రికెట్ ప్రపంచాన్ని జయించారు. అందులో ఒకడే దిగ్గజ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా పేరు గాంచాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు వీరుడుగా నిలిచాడు. తన విరోచిత పోరాటాలతో విండీస్‌కు రెండు వరల్డ్‌కప్‌లను అందిచాడు. తన ప్రదర్శనతో, డ్యాన్స్‌లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అతడు కరేబియన్ అయినప్పటకి భారత్‌లో కూడా ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నాడు.అయితే ఇకపై బ్రావో డ్యాన్స్‌లు మైదానంలో కన్పించవు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ వెస్టిండీస్ దిగ్గజం.. ఇప్పుడు ప్రొఫెషనల్ క్రికెట్‌కు కూడా గుడ్‌బై చెప్పేశాడు. ఎక్కడైతే తన కెరీర్ మొదలైందో అక్కడే ముగించనున్నాడు. సొంత ప్రజలముందే సగర్వంగా తనకు ఇష్టమైన ఆటనుంచి తప్పకోనున్నాడు. ఈ ఏడాది కరీబియన్ ప్రీమియర్ లీగ్‌తో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్లు బ్రావో వెల్లడించాడు. ఈ నేపథ్యంలో బ్రావో తన టీ20 క్రికెట్ జర్నీపై ఓ లుక్కే ద్దాం.టీ20 స్పెషలిస్టు.. విండీస్ హీరోబ్రావో ఒక టీ20 స్పెషలిస్టు. 2006లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బ్రావో.. తన బౌలింగ్, బ్యాటింగ్‌తో విండీస్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. మఖ్యంగా 2012, 2016 టీ20 ప్రపంచకప్‌లను వెస్టిండీస్ సొంతం చేసుకోవడంలో బ్రావోది కీలక పాత్ర. ఈ రెండు మెగా టోర్నీల్లో బ్రావో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు.విండీస్‌కే కాకుండా ఫ్రాంచైజీ క్రికెట్లో సైతం తన మార్క్ చూపించాడు. ఐపీఎల్లో కూడా దుమ్ములేపాడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలకు ఈ కరేబియన్ ధీరుడు ప్రాతినిథ్యం వహించాడు. సీఎస్కే తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డు ఇప్పటకీ బ్రావో(154) పేరిటే ఉంది.స్లోయర్ బాల్స్ స్పెషలిస్టు..బ్రావో హార్డ్ హిట్టింగ్ స్కిల్స్‌తో పాటు అద్బుతమైన బౌలింగ్ నైపుణ్యాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా స్లోయర్ బాల్స్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను బోల్తా కొట్టించడం బ్రావో స్పెషాలిటీ. అంతేకాకుండా డెత్ ఓవర్ స్పెషలిస్టుగా బ్రావో పేరు గాంచాడు. ఇవన్నీ అతడిని టీ20 క్రికెట్లో విలువైన ఆస్తిగా మార్చాయి.2021లో గుడ్బైబ్రావో తన కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2021 టీ20 వరల్డ్‌కప్ లో ఆస్ట్రేలియాపై ఆడాడు. అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. తన చివరి సహచర ఆటగాళ్లు, ఆసీస్ క్రికెటర్ల నుంచి బ్రావో గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించాడు. తన ఇంటర్ననేషనల్ కెరీర్లో 295 మ్యాచ్‌ల్లో విండీస్‌కు బ్రావో ప్రాతినిథ్యం వహించాడు. టీ20ల్లో రికార్డు అదుర్స్..టీ20 క్రికెట్ చరిత్రలో బ్రావోకు ఘనమైన రికార్డులు ఉన్నాయి. అంతర్జాతీయ మ్యాచ్‌లు, లీగ్‌లు సహా మొత్తం 578 టీ20 మ్యాచ్‌లు ఆడిన అతడు ఏకంగా 630 వికెట్లు పడగొట్టాడు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో బ్రావో అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. టీ20 క్రికెట్లో 630 వికెట్లతో పాటు అతడు 6,970 పరుగులు కూడా చేశాడు.ఛాంపియన్ డ్యాన్స్..బ్రావో "ఛాంపియన్ డ్యాన్స్ వరల్డ్ క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. వికెట్ తీసినా ప్రతీసారి మైదానంలో డ్యాన్స్ చేస్తూ బ్రావో సెలబ్రేషన్స్ చేసుకుంటాడు. ఇది 2016 టీ20 వరల్డ్‌కప్ నుంచి బ్రావో ఈ విధంగా డ్యాన్స్ సెలబ్రేషన్స్ చేస్తున్నాడు. -
మరో అత్యాచారం, హత్య జరిగేదాకా వేచి చూడలేం... కోల్‌కతా వైద్యురాలి హత్య ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం! ఇంకా ఇతర అప్డేట్స్..
-
ఒకే ఓవర్లో 39 పరుగులు
అపియా (సమోవా): అంతర్జాతీయ టి20 క్రికెట్లో మంగళవారం అద్భుతం చోటు చేసుకుంది. టి20 ప్రపంచకప్ ఈస్ట్ ఆసియా–పసిఫిక్ రీజియన్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా వనువాటు, సమోవా మధ్య జరిగిన పోరులో ఒకే ఓవర్లో 39 పరుగులు నమోదయ్యాయి. ఈ ఫార్మాట్లో గతంలో ఐదుసార్లు ఒకే ఓవర్లో 36 పరుగులు నమోదు కాగా... సమోవా దాన్ని అధిగమిస్తూ మొత్తం 39 పరుగులు రాబట్టింది. మిడిలార్డర్ బ్యాటర్ డారియస్ విసెర్ ఆరు సిక్సర్లతో అదరగొట్టాడు. క్వాలిఫయర్స్‌లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో వనువాటుపై సమోవా 10 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన సమోవా నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. విసెర్ (62 బంతుల్లో 132; 5 ఫోర్లు, 14 సిక్సర్లు) శతక్కొట్టగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. అనంతరం లక్ష్యఛేదనలో వనువాటు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. నళిన్ నిపికో (52 బంతుల్లో 73; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. ఆ ఓవర్ సాగిందిలా.. వనువాటు బౌలర్ నళిన్ నిపికో వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో డారియస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వరుసగా 6, 6, 6, 1నోబాల్, 6, 0, 1 నోబాల్, 6+1నోబాల్, 6 పరుగులు సాధించి ఒకే ఓవర్లో 39 పరుగులు పిండుకున్నాడు. గతంలో యువరాజ్ సింగ్ (భారత్; 2007లో ఇంగ్లండ్‌పై; స్టువర్ట్ బ్రాడ్), కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్; 2021లో శ్రీలంకపై; అఖిల ధనంజయ), నికోలస్ పూరన్ (వెస్టిండీస్; 2024లో అఫ్గానిస్తాన్‌పై; అజ్మతుల్లా ఓమర్జాయ్), దీపేంద్ర సింగ్ (నేపాల్;2024లో ఖతర్‌పై; కమ్రాన్ ఖాన్), రోహిత్ శర్మ–రింకూ సింగ్ (భారత్; 2024లో అఫ్గానిస్తాన్‌పై; కరీమ్ జన్నత్) కూడా ఒకే ఓవర్లో 36 పరుగులు సాధించారు. అయితే తాజా మ్యాచ్‌లో వనువాటు బౌలర్ అదనంగా మూడు నోబాల్స్ వేయడంతో... మొత్తం 39 పరుగులు వచ్చాయి. ఒక టి20 ఇన్నింగ్స్ జట్టు స్కోరులో అత్యధిక శాతం పరుగులు చేసిన ప్లేయర్‌గా విసెర్ రికార్డుల్లోకెక్కాడు. సమోవా జట్టు 20 ఓవర్లలో 174 పరుగులు చేయగా.. అందులో విసెర్ ఒక్కడే 132 పరుగులు సాధించాడు. అంటే జట్టు మొత్తం స్కోరులో 75.86 శాతం విసెర్ బ్యాట్ నుంచే వచ్చాయి. గతంలో ఆ్రస్టేలియా ప్లేయర్ ఆరోన్ ఫించ్ జట్టు స్కోరులో 75.01 శాతం పరుగులు సాధించాడు. -
టీ20 ఫార్మాట్ క్రికెట్‌ను నాశనం చేస్తోంది: పాక్ మాజీ క్రికెటర్
పొట్టి ఫార్మాట్ వల్ల క్రికెట్ నాశనమవడం ఖాయమని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల మెదళ్లలో టీ20 అనే విషం నిండిపోవడం వల్ల సంప్రదాయ క్రికెట్‌కు ఆదరణ తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. లీగ్ క్రికెట్ వల్ల ఆయా బోర్డులు, ఆటగాళ్లకు డబ్బులు వస్తాయని.. అయితే, ఆటకు మాత్రం నష్టం చేకూరుతుందని పేర్కొన్నాడు.కాగా ఇటీవలి కాలంలో లీగ్ క్రికెట్ ఆడేందుకు చాలా మంది ప్లేయర్లు సెంట్రల్ కాంట్రాక్టును వదులుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా న్యూజిలాండ్ క్రికెటర్లలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ సహా ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్ ఇప్పటికే కాంట్రాక్టును వదులుకోగా.. డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్ సైతం గురువారం ఇందుకు సంబంధించి తమ నిర్ణయాన్ని వెల్లడించారు.కాసుల వర్షం వల్లేఫ్రాంఛైజీ క్రికెట్ ఒప్పందాల దృష్ట్యా కాంట్రాక్ట్ రెన్యువల్‌పై సంతకం చేసేందుకు వీరిద్దరు నిరాకరించారని కివీస్ బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై స్పందించిన పాకిస్తాన్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘శ్రీలంకతో సిరీస్ సందర్భంగా న్యూజిలాండ్ జట్టుకు అందుబాటులో ఉండబోనని కాన్వే చెప్పాడు.మరో క్రికెటర్ కూడా ఇదే మాట అంటున్నాడు. ఇది కేవలం న్యూజిలాండ్ బోర్డు సమస్య మాత్రమే కాదు. క్రమక్రమంగా అన్ని దేశాల బోర్డులకు ఇలాంటి తలనొప్పులు వస్తాయి. పాకిస్తాన్ ప్లేయర్లు కూడా ఇదే బాటలో నడిచినా ఆశ్చర్యం లేదు. ఫ్రాంఛైజీ క్రికెట్ కురిపించే కాసుల వర్షం వల్లే ఆటగాళ్లు అటువైపు ఆకర్షితులవుతున్నారు.ఇండియా లక్కీనిజానికి ఈ విషయంలో ఇండియా లక్కీ అనే చెప్పాలి. ఎందుకంటే.. భారత ఆటగాళ్లు ఐపీఎల్ మినహా ఇతర టీ20 టోర్నమెంట్లు ఆడరు. ఏదేమైనా టీ20 పిచ్చి.. ఇక్కడితో ఆగదు. క్రికెట్‌ను.. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌ను నాశనం చేస్తుంది. గంటల తరబడి క్రీజులో నిలబడే బ్యాటర్ల పాలిట ఇదొక విషం లాంటిది. ఇండియా మినహా దాదాపు అన్ని దేశాల జట్లు టీ20 క్రికెట్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. డబ్బు వస్తోంది.. కానీ సంప్రదాయ క్రికెట్ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది’’ అని బసిత్ అలీ ఆందోళన వ్యక్తం చేశాడు.చదవండి: వీవీఎస్ లక్ష్మణ్ పదవీకాలం మరో ఏడాది పొడిగింపు -
చరిత్రపుటల్లోకెక్కిన రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆటగాడు, వరల్డ్ నంబర్ వన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ చరిత్రపుటల్లోకెక్కాడు. టీ20 ఫార్మాట్లో 600 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. హండ్రెడ్ లీగ్ 2024లో భాగంగా మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో నిన్న (జులై 29 జరిగిన మ్యాచ్‌లో రషీద్ 600 వికెట్ల క్లబ్లో చేరాడు. ఒరిజినల్స్ బ్యాటర్ పాల్ వాల్టర్ వికెట్ తీయడంతో 600 వికెట్ల మైలురాయిని తాకడు. టీ20ల్లో రషీద్‌కు ముందు విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో మాత్రమే 600 వికెట్లు తీశాడు. బ్రావో 578 మ్యాచ్‌ల్లో 630 వికెట్లు పడగొట్టగా.. రషీద్ కేవలం 441 మ్యాచ్‌ల్లో 600 వికెట్ల ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బ్రావో, రషీద్ తర్వాత సునీల్ నరైన్ (557), ఇమ్రాన్ తాహిర్ (502), షకీబ్ అల్ హసన్ (492), ఆండ్రీ రసెల్ (462) ఉన్నారు. భారత్ నుంచి అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్‌గా చహల్ ఉన్నాడు. చహల్ 305 మ్యాచ్‌ల్లో 354 వికెట్లు పడగొట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. హండ్రెడ్ లీగ్‌లో ట్రెంట్ రాకెట్స్‌కు ఆడుతున్న రషీద్ ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు. రషీద్‌తో పాటు ఇమాద్ వసీం (2/21), సామ్ కుక్ (2/37) రాణించడంతో రసవత్తర పోరులో ఒరిజినల్స్‌పై రాకెట్స్ పరుగు తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాకెట్స్ నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. టామ్ బాంటన్ (45), రోవ్‌మన్ పావెల్ (27), రషీద్ ఖాన్ (15 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మాంచెస్టర్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 3, సికందర్ రజా 2, పాల్ వాల్టర్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం ఛేదనలో మాంచెస్టర్ 100 బంతుల్లో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులకు పరిమితమైంది. ఫలితంగా రాకెట్స్ పరుగు తేడాతో విజయం సాధించింది. మాంచెస్టర్ ఇన్నింగ్స్‌లో హెల్డన్ (40) టాప్ స్కోరర్‌గా కాగా.. మ్యాడ్సన్ (28), వాల్టర్ (29), సికందర్ రజా (21) ఓ మోస్తరు పరుగులు చేశారు. రాకెట్స్ బౌలర్లలో ఇమాద్ వసీం, రషీద్ ఖాన్, సామ్ కుక్ తలో 2 వికెట్లు, థాంప్సన్ ఓ వికెట్ పడగొట్టారు. -
చమరి అటపట్టు సూపర్ సెంచరీ
ఆసియా కప్ మహిళల టి20 క్రికెట్ టోర్నీలో భాగంగా దంబుల్లాలో సోమవారం మలేసియాతో జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక 144 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా శ్రీలంక 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగులు చేసింది. కెప్టెన్ చమరి అటపట్టు (69 బంతుల్లో 119 నాటౌట్; 14 ఫోర్లు, 7 సిక్స్‌లు) తన టి20 కెరీర్లో మూడో సెంచరీ సాధించింది. మలేసియా 19.5 ఓవర్లలో 40 పరుగులకే కుప్పకూలింది. -
అభిషేక్ శర్మ ఆల్‌టైమ్ రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలోనే
జింబాబ్వే టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సత్తాచాటుతున్నాడు. తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటకి ఆ తర్వాత మ్యాచ్‌లోనే విధ్వంసకర సెంచరీతో మెరిశాడు.ఆ తర్వాత మూడో టీ20లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసిన అభిషేక్‌కు.. నాలుగో టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. బ్యాటింగ్‌లో ఛాన్స్ రానప్పటకి బౌలింగ్‌లో మాత్రం తన మార్క్ చూపించాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన అభిషేక్ కేవలం 20 పరుగులు మాత్రమే ఓ కీలక వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఓ టీ20 సిరీస్‌లో సెంచరీతో పాటు వికెట్ సాధించిన తొలి భారత ప్లేయర్‌గా అభిషేక్ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు ఏ భారత క్రికెటర్ కూడా ఈ ఘనత సాధించలేదు. కాగా, ఓ సిరీస్‌లో సెంచరీతో పాటు వికెట్ ఘనతను భారత్ తరఫున టెస్టు ఫార్మాట్లో లాల్ అమర్నాథ్ (1933), వన్డేల్లో కపిల్ దేవ్ (1983) తొలిసారి సాధించారు. ఇక నాలుగో టీ20లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్.. సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 3-1 తేడాతో సొంతం చేసుకుంది. -
చరిత్ర సృష్టించిన గిల్-జైశ్వాల్ జోడీ.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 3-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. 153 పరుగుల లక్ష్యాన్ని భారత ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, యశస్వీ జైశ్వాల్ ఊదిపడేశారు.జింబాబ్వే బౌలర్లను చొతక్కొట్టారు. యశస్వీ 53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 93 పరుగులు చేయగా.. గిల్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 156 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పిన గిల్-జైశ్వాల్ జోడీ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.టీ20 క్రికెట్లో ఛేజింగ్‌లో భారత తరపున రెండు సార్లు 150 ప్లస్ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తొలి జోడీగా గిల్-జైశ్వాల్ నిలిచారు. వీరిద్దరూ టీ20ల్లో 150 పైగా భాగస్వామ్యం నెలకొల్పడం ఇదే రెండో సారి.ఇంతకుముందు 2023లో వెస్టిండీస్‌తో జరిగిన టీ20లో జైస్వాల్, గిల్ ఇద్దరూ 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ రెండు భాగస్వామ్యాలు కూడా ఛేజింగ్‌లో నెలకొల్పినివే కావడం విశేషం. ఈ క్రమంలోనే ఈ అరుదైన ఫీట్‌ను గిల్, జైశ్వాల్ తమ ఖాతాలో వేసుకున్నారు.టీ20 చరిత్రలో భారత్ తరఫున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాలు ఇవే..165 - రోహిత్ శర్మ అండ్ కేఎల్ రాహుల్ వర్సెస్ శ్రీలంక, ఇండోర్, 2017165 - యశస్వి జైస్వాల్ అండ్ శుబ్‌మన్ గిల్ వర్సెస్ వెస్టిండీస్, లాడర్‌హిల్, 2023160 - రోహిత్ శర్మ అండ్ శిఖర్ ధావన్ వర్సెస్ ఐర్లాండ్, డబ్లిన్, 2018158 - రోహిత్ శర్మ అండ్ శిఖర్ ధావన్ వర్సెస్ న్యూజిలాండ్, ఢిల్లీ, 2017156* - యశస్వి జైస్వాల్ అండ్ శుబ్‌మన్ గిల్ వర్సెస్ జింబాబ్వే, హరారే, 2024 -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో 23 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-2 ఆధిక్యంలోకి టీమిండియా దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్(66) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రుతురాజ్ గైక్వాడ్(49) పరుగులతో రాణించాడు. జింబాబ్వే బౌలర్లలో ముజర్బానీ, రజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులకే పరిమితమైంది.జింబాబ్వే బ్యాటర్లలో మైర్స్(65) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మదండే(37) ఆఖరిలో మెరుపులు మెరిపించినప్పటికీ జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు పడగొట్టగా.. అవేష్ ఖాన్ రెండు, ఖాలీల్ ఆహ్మద్ ఒక్క వికెట్ సాధించారు.చరిత్ర సృష్టించిన భారత్..ఇక ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా ఓ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకుంది. భారత్‌కు ఇది పొట్టిఫార్మాట్లో 150వ విజయం కావడం విశేషం. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో 150 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది.టీమిండియా ఇప్పటవరకు 230 మ్యాచ్‌లు ఆడి 150 విజయాలు సాధించింది. కాగా టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో భారత్(150) అగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. పాకిస్తాన్(142), న్యూజిలాండ్(111) మూడో స్ధానంలో కొనసాగుతున్నాయి. -
ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క ఫిఫ్టి కూడా లేదు.. ఈ "గిల్" మనకు అవసరమా..?
టీ20 వరల్డ్‌కప్ విజయానంతరం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని కుర్ర జట్టును జింబాబ్వే పర్యటనకు పంపారు. ఈ పర్యటనను భారత్ ఘోర ఓటమితో ప్రారంభించి, ఆతర్వాతి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో సమంగా నిలిచింది.రెండో టీ20లో అంతా బాగుంది అనుకున్నా, ఒక్క విషయం మాత్రం టీమిండియాను తెగ కలవరపెడుతుంది. కెప్టెన్ గిల్ పేలవ ఫామ్ అభిమానులతో పాటు యాజమాన్యాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. గిల్ గత 10 టీ20 ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేసి తన టీ20 కెరీర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టుకున్నాడు. గిల్ ఆడిన గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో అయితే కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు.ఈ పేలవ ఫామ్ కారణంగానే అతను టీ20 వరల్డ్‌కప్ జట్టుకు కూడా ఎంపిక కాలేదు. గిల్.. జింబాబ్వే పర్యటనలో అయినా ఫామ్‌లో వస్తాడని యాజమాన్యం అతన్ని ఈ టూర్‌కు ఎంపిక చేసింది. గిల్ ఇదే పేలవ ఫామ్‌ను కొనసాగిస్తే భవిష్యత్తులో టీ20 జట్టు నుంచి కనుమరుగవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. జింబాబ్వే పర్యటనలో తదుపరి మ్యాచ్‌ల్లో రాణించకపోతే టీ20 జట్టు నుంచి శాశ్వతంగా తప్పించడం ఖాయమని వారు అభిప్రాయపడుతున్నారు. సోషల్‌మీడియాలో గిల్ విపరీతమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. ఈ గిల్ మనకు అవసరమా అని టీమిండియా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.రేసులో నిలబడగలడా..?రోహిత్, కోహ్లి టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినా ఓపెనింగ్ స్థానం కోసం చాలామంది రేసులో ఉన్నారు. రెండో టీ20లో సెంచరీతో విరుచుకుపడిన అభిషేక్ శర్మ కొత్తగా శుభ్‌మన్ గిల్‌కు పోటీగా వచ్చాడు. ఇప్పటికే యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ రేసులో ఉన్నారు. వీరందరి నుంచి పోటీని తట్టుకుని గిల్ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి.గత 10 టీ20 ఇన్నింగ్స్‌ల్లో గిల్ స్కోర్లు..జింబాబ్వేతో రెండో టీ20- 2 (4)జింబాబ్వేతో తొలి టీ20- 31 (29)ఆఫ్ఘనిస్తాన్‌తో తొలి టీ20- 23 (12)సౌతాఫ్రికాతో మూడో టీ20- 12 (6)సౌతాఫ్రికాతో రెండో టీ20- 0 (2)వెస్టిండీస్‌తో ఐదో టీ20- 9 (9)వెస్టిండీస్‌తో నాలుగో టీ20- 77 (47)వెస్టిండీస్‌తో మూడో టీ20- 6 (11)వెస్టిండీస్‌తో రెండో టీ20- 7 (9)వెస్టిండీస్‌తో తొలి టీ20- 3 (9) -
అభి"షేక్" శర్మ.. రసెల్, హెడ్ కూడా దిగదుడుపే..!
భారత యువ కెరటం అభిషేక్ శర్మ పొట్టి క్రికెట్లో సరికొత్త సంచలనంగా మారాడు. రెండ్రోజుల కిందట జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు సెంచరీ చేసిన శర్మ.. ఈ ఏడాది ఆరంభం నుంచే మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటం మొదలుపెట్టాడు.ఈ ఏడాది ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడిన శర్మ.. 200కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో 584 పరుగులు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా పొట్టి క్రికెట్లో ఈ ఏడాది ఇంత స్ట్రయిక్‌రేట్ ఎవ్వరికీ లేదు. అభిషేక ముందు ఆండ్రీ రసెల్ (199.47), జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (194.13), ట్రవిస్ హెడ్ (176.24), ఫిలిప్ సాల్ట్ (172.67) కూడా దిగదుడుపే.ఇదిలా ఉంటే, జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో అభిషేక్ శర్మ 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో శతక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్ (47 బంతుల్లో 77 నాటౌట్; 11 ఫోర్లు, సిక్సర్), రింకూ సింగ్ (22 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ (2 వికెట్ల నష్టానికి 234 పరుగులు) చేసింది. అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే.. ముకేశ్ కుమార్ (3.4-0-37-3), ఆవేశ్ ఖాన్ (3-0-15-3), రవి బిష్ణోయ్ (4-0-11-2), వాషింగ్టన్ సుందర్ (4-0-28-1) ధాటికి 18.4 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని (100 పరుగుల తేడాతో) మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్.. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్, జింబాబ్వే చెరో విజయంతో సమంగా ఉన్నాయి. మూడో మ్యాచ్ జులై 10న జరుగనుంది. -
IND vs ZIM: చరిత్ర సృష్టించిన జింబాబ్వే.. తొలి జట్టుగా
పసికూన జింబాబ్వే సంచలనం సృష్టించింది. హరారే వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టీ20లో జింబాబ్వే అద్భుత విజయం సాధించింది. వరల్డ్ ఛాంపియన్ భారత్‌ను 13 పరుగుల తేడాతో జింబాబ్వే చిత్తు చేసింది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని జింబాబ్వే బౌలర్లు కాపాడుకున్నారు. జింబాబ్వే బౌలర్ల దాటికి భారత్ 102 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ సికిందర్ రజా, చతరా తలా మూడు వికెట్లతో టీమిండియాను దెబ్బతీయగా.. బెన్నట్, మసకద్జా, జాంగ్వే తలా వికెట్ సాధించారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్(31) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. వాషింగ్టన్ సుందర్(27) తన వంతు ప్రయత్నం చేశాడు.చరిత్ర సృష్టించిన జింబాబ్వే..ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన జింబాబ్వే ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. టీ20ల్లో భారత్‌పై అత్యల్ప టోటల్‌ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా జింబాబ్వే నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది. 2016లో నాగ్‌పూర్ వేదికగా భారత్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 127 పరుగుల టార్గెట్‌ను కివీస్ డిఫెండ్ చేసుకుంది. తాజా మ్యాచ్‌తో కివీస్ ఆల్‌టైమ్ రికార్డును జింబాబ్వే బ్రేక్ చేసింది. -
టీమిండియాకు ఘోర పరాభవం .. జింబాబ్వే చేతిలో ఓటమి
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో13 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. స్వల్ప లక్ష్య చేధనలో భారత్.. జింబాబ్వే బౌలర్ల దాటికి కేవలం 102 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ సికిందర్ రజా, చతరా తలా మూడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించగా.. బెన్నట్, మసకద్జా, జాంగ్వే తలా వికెట్ సాధించారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్(31) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు వాషింగ్టన్ సుందర్(27) పోరాడనప్పటకి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. వీరిద్దరూ మినహా మిగితా భారత బ్యాటర్లంతా విఫలమయ్యారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన జింబాబ్వే భారత బౌలర్ల దాటికి 115 పరుగులకే జింబాబ్వే పరిమితమైంది. టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ 4 వికెట్లతో ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. బిష్ణోయ్‌తో పాటు మరో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు, అవేష్ ఖాన్,ముఖేష్ కుమార్ చెరో వికెట్ సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో మదండే(29), మైర్స్(23), బెన్నట్(23), పరుగులు చేశారు. కాగా టీ20ల్లో జింబాబ్వే చేతిలో భారత్ ఓటమి పాలవ్వడం 2016 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మరో టీమిండియా స్టార్
టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే మరో టీమిండియా స్టార్ ఆటగాడు పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టీ20 క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ఇన్‌స్టా వేదికగా ప్రకటించాడు. జడ్డూ మిగతా ఫార్మాట్లలో (వన్డే, టెస్ట్) కొనసాగుతానని స్పష్టం చేశాడు. పొట్టి ప్రపంచకప్ గెలవడంతో తన కల నిజమైందని అన్నాడు. టీ20 కెరీర్లో వరల్డ్‌కప్ గెలవడం అత్యుత్తమమని తెలిపాడు. కెరీర్లో తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలని పేర్కొన్నాడు. చివరిగా జై హింద్ అని రాసుకొచ్చాడు. 35 ఏళ్ల రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20ల్లో 74 మ్యాచ్‌లు ఆడి 127.2 స్టయిక్‌రేట్‌తో 515 పరుగులు చేసి 54 వికెట్లు పడగొట్టాడు.కాగా, సౌతాఫ్రికాతో నిన్న జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్లో భారత్‌కు ఇది రెండో ప్రపంచకప్. 2007లో (అరంగేట్రం ఎడిషన్) ధోని సారథ్యంలో పొట్టి ప్రపంచకప్ గెలిచిన భారత్... తాజాగా రోహిత్ శర్మ నేతృత్వంలో రెండోసారి జగజ్జేతగా నిలిచింది. నిన్న జరిగిన ఫైనల్లో విరాట్ కోహ్లి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. టీమిండియా వరల్డ్‌కప్ గెలిచిన అనంతరం కోహ్లి, రోహిత్ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు గుడ్ బై చెప్పారు. -
టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. కేవలం 27 బంతుల్లోనే.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు
టీ20 ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదైంది. సైప్రస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ 27 బంతుల్లోనే శతక్కొట్టాడు. పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఇది వేగవంతమైన శతకం. పురుషులు, మహిళలు, అంతర్జాతీయ స్థాయి.. ఇలా ఏ విభాగంలో చూసినా ఇదే వేగవంతమైన సెంచరీ. అంతర్జాతీయ టీ20ల్లో నమీబియా ఆటగాడు జాన్ నికోల్ లాప్టీ ఈటన్ నమోదు చేసిన ఫాస్టెస్ట్ సెంచరీని సాహిల్ చౌహాన్ కేవలం నాలుగు నెలల్లో బద్దలు కొట్టాడు. లాఫ్టీ ఈటన్ ఈ ఏడాది (2024) ఫిబ్రవరి 27న నేపాల్‌పై 33 బంతుల్లో శతక్కొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో సాహిల్ సెంచరీకి ముందు ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. టీ20 ఫార్మాట్ మొత్తంలో చూసినా ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. సాహిల్‌కు ముందు ఈ రికార్డు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ 2013 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరఫున ఆడుతూ పూణే వారియర్స్‌పై 30 బంతుల్లో శతక్కొట్టాడు. తాజాగా సాహిల్ గేల్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. సైప్రస్‌తో మ్యాచ్‌లో ఓవరాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న సాహిల్ 144 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 18 సిక్సర్లు ఉన్నాయి. పురుషుల అంతర్జాతీయ టీ20ల్లో (ఓ ఇన్నింగ్స్‌లో) ఓ బ్యాటర్ సాధించిన అత్యధిక సిక్సర్లు ఇవే. సాహిల్ సునామీ శతకంతో విరుచుకుపడటంతో సైప్రస్‌పై ఎస్టోనియా ఘన విజయం సాధించింది. -
2026 టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన జట్లు ఇవే..!
భారత్, శ్రీలంక వేదికగా 2026లో జరిగే టీ20 వరల్డ్‌కప్ అర్హత సాధించే జట్లేవో తేలిపోయాయి. 2026 టీ20 వరల్డ్‌కప్ కూడా ప్రస్తుత ఎడిషన్ (2024) లాగే 20 జట్లతో జరుగుతుంది. ఇందులో 12 జట్లు నేరుగా అర్హత సాధించనుండగా.. మిగతా ఎనిమిది బెర్త్‌లు వివిధ రీజియనల్ పోటీల ద్వారా ఖరారు కానున్నాయి.ప్రస్తుతం జరుగుతున్న 2024 ఎడిషన్‌లో సూపర్-8కు అర్హత సాధించిన జట్లు (భారత్, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్) నేరుగా తదుపరి ఎడిషన్‌కు అర్హత సాధించనుండగా.. ఆతిథ్య దేశ హోదాలో శ్రీలంక తొమ్మిదో జట్టుగా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది.మిగతా మూడు స్థానాలు జూన్ 30, 2024 నాటి ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా నిర్ణయించబడతాయి. ప్రస్తుతం వరల్డ్‌కప్ నడుస్తుండటంతో ఈ టోర్నీ ఫలితాలు ర్యాంకింగ్స్‌ను ప్రభావితం చేయవు కాబట్టి ప్రస్తుతమున్న ర్యాంకింగ్సే జూన్ 30 వరకు యధాతథంగా కొనసాగుతాయి. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో భారత్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ వరుసగా ఒకటి నుంచి పదకొండు స్థానాల్లో ఉన్నాయి.ఈ లెక్కన చూస్తే.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో సూపర్-8కు చేరకుండా నిష్క్రమించిన న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ తదుపరి వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే 10, 11, 12 జట్లవుతాయి. ఓవరాల్‌గా 2026 టీ20 వరల్డ్‌కప్‌కు భారత్, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ జట్లు అర్హత సాధిస్తాయి. మిగతా ఎనిమిది బెర్త్‌లు క్వాలిఫయర్ పోటీల ద్వారా నిర్ణయించబడతాయి. -
T20 World Cup 2024: బంగ్లాదేశ్ చెత్త రికార్డు
పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో బంగ్లాదేశ్ పేరిట ఓ చెత్త రికార్డు కొనసాగుతుంది. మెగా టోర్నీలో అత్యధిక పరాజయలు చవిచూసిన జట్టుగా ఘోర అపవాదును మూటగట్టుకుంది. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా నిన్న (జూన్ 10) సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కొన్న బంగ్లాదేశ్.. మెగా టోర్నీల్లో తమ పరాజయాల సంఖ్యను 29కి పెంచుకుని, అప్పటికే తమ పేరిట ఉన్న చెత్త రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. బంగ్లాదేశ్ తర్వాత అత్యధిక వరల్డ్‌కప్ పరాజయాలు చవిచూసిన జట్టుగా శ్రీలంక ఉంది. పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో శ్రీలంక ఇప్పటివరకు 21 అపజయాలను ఎదుర్కొంది. ఈ జాబితాలో బంగ్లాదేశ్, శ్రీలంక తర్వాత ఇంగ్లండ్ (20), పాకిస్తాన్ (19), న్యూజిలాండ్ (18), వెస్టిండీస్ (18), ఐర్లాండ్ (17), ఆఫ్ఘనిస్తాన్ (15), ఆస్ట్రేలియా (15), ఇండియా (15), సౌతాఫ్రికా (15) ఉన్నాయి.అంతర్జాతీయ టీ20ల మొత్తంలో చూసినా అత్యధిక పరాజయాల చెత్త రికార్డు బంగ్లాదేశ్ పేరిటే ఉంది. ఇప్పటివరకు 171 అంతర్జాతీయ టీ20లు ఆడిన ఆ జట్టు 101 మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొంది. అంతర్జాతీయ టీ20ల్లో బంగ్లాదేశ్ తర్వాత సెంచరీ అపజయాలు ఎదుర్కొన్న ఏకైక జట్టుగా శ్రీలంక ఉంది. శ్రీలంక ఇప్పటివరకు ఆడిన 191 టీ20ల్లో 100 పరాజయాలను నమోదు చేసింది.అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరాజయాలు నమోదు చేసిన టెస్ట్ ప్లేయింగ్ దేశాలు ఇవే..ఆఫ్ఘనిస్తాన్- 132 మ్యాచ్‌ల్లో 48 పరాజయాలుఆస్ట్రేలియా- 190 మ్యాచ్‌ల్లో 81 పరాజయాలుబంగ్లాదేశ్- 171 మ్యాచ్‌ల్లో 101 పరాజయాలుఇంగ్లండ్- 186 మ్యాచ్‌ల్లో 81 పరాజయాలుభారత్- 221 మ్యాచ్‌ల్లో 68 పరాజయాలుఐర్లాండ్- 168 మ్యాచ్‌ల్లో 88 పరాజయాలున్యూజిలాండ్- 217 మ్యాచ్‌ల్లో 91 పరాజయాలుపాకిస్తాన్- 243 మ్యాచ్‌ల్లో 92 పరాజయాలుసౌతాఫ్రికా-179 మ్యాచ్‌ల్లో 76 పరాజయాలుశ్రీలంక- 191 మ్యాచ్‌ల్లో 100 పరాజయాలువెస్టిండీస్- 197 మ్యాచ్‌ల్లో 99 పరాజయాలుజింబాబ్వే- 145 మ్యాచ్‌ల్లో 95 పరాజయాలుఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా సౌతాఫ్రికాతో నిన్న జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్ బంగ్లాదేశ్ 4 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన బంగ్లాదేశ్ లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. -
T20 World Cup 2024: అరుదైన క్లబ్లో చేరిన ఆసీస్ బౌలర్
ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్ ఆడమ్ జంపా అరుదైన క్లబ్లో చేరాడు. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఒమన్‌తో ఇవాళ (జూన్ 6) జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన జంపా.. టీ20ల్లో 300 వికెట్ల మైలురాయిని అధిగమించాడు. జంపా ఈ ఘనత సాధించిన రెండో ఆస్ట్రేలియన్ బౌలర్‌గా.. ఓవరాల్‌గా 28 ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. జంపాకు ముందు ఆండ్రూ టై టీ20ల్లో 300 వికెట్ల మార్కును అధిగమించాడు. టై 2014-24 మధ్యలో 332 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక టీ20 వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో టై 15వ స్థానంలో ఉన్నాడు. తన కెరీర్లో ఇప్పటివరకు 258 మ్యాచ్‌లు ఆడిన జంపా.. 3 ఐదు వికెట్ల ప్రదర్శనలతో 301 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలో విండీస్ బౌలర్ డ్వేన్ బ్రావో (625) అగ్రస్థానంలో ఉండగా.. రషీద్ ఖాన్ (576), సునీల్ నరైన్ (552), ఇమ్రాన్ తాహిర్ (502) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో భారత బౌలర్ చహల్ (354) 11వ స్థానంలో.. పియూశ్ చావ్లా (315) 22, అశ్విన్ (310) 25వ స్థానంలో కొనసాగుతున్నారు.కాగా, బార్బడోస్ వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. స్టోయినిస్ (36 బంతుల్లో 67 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), వార్నర్ (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆసీస్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తొలుత బ్యాట్‌తో చెలరేగిన స్టోయినిస్ బంతితోనూ (3-0-19-3) రాణించాడు. స్టోయినిస్‌తో పాటు జంపా (4-0-24-2), ఇల్లిస్ (4-0-28-2), స్టార్క్ (3-0-20-2) కూడా సత్తా చాటడంతో ఒమన్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 36 పరుగులు చేసిన అయాన్ ఖాన్ ఒమన్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
T20 World Cup 2024: క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన డేవిడ్ వార్నర్
ఆసీస్ వెటరన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్ చరమాంకంలో ఓ అద్భుత రికార్డు నెలకొల్పాడు. పొట్టి క్రికెట్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు (సెంచరీలు కలుపుకుని) చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఒమన్‌తో ఇవాళ (జూన్ 6) జరిగిన మ్యాచ్‌లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్సర్) మెరిసిన వార్నర్.. టీ20ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్ల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ రికార్డు సాధించే క్రమంలో వార్నర్ విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్‌ను అధిగమించాడు. ఒమన్‌పై హాఫ్ సెంచరీ కలుపుకుని వార్నర్ ఖాతాలో 111 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు ఉండగా.. గేల్ పేరిట 110 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు నమోదై ఉన్నాయి. వార్నర్ కేవలం 378 ఇన్నింగ్స్‌ల్లో 111 ఫిఫ్టి ప్లస్ స్కోర్ల మార్కు తాకగా.. గేల్‌కు 110 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసేందుకు 455 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఈ జాబితాలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి మూడో స్థానంలో (105), పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ నాలుగో స్థానంలో (101) ఉన్నారు.కాగా, బార్బడోస్ వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. స్టోయినిస్ (36 బంతుల్లో 67 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), వార్నర్ (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆసీస్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తొలుత బ్యాట్‌తో చెలరేగిన స్టోయినిస్ బంతితోనూ (3-0-19-3) రాణించాడు. స్టోయినిస్‌తో పాటు జంపా (4-0-24-2), ఇల్లిస్ (4-0-28-2), స్టార్క్ (3-0-20-2) కూడా సత్తా చాటడంతో ఒమన్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 36 పరుగులు చేసిన అయాన్ ఖాన్ ఒమన్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
ఐర్లాండ్‌తో మ్యాచ్.. అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
టీ20 వరల్డ్‌కప్-2024లో తొలి మ్యాచ్‌కు టీమిండియా సన్నద్దమవుతోంది. జూన్ 5న న్యూయర్క్ వేదికగా ఐర్లాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఐరీష్‌ను చిత్తు చేసి మెగా ఈవెంట్‌ను ఘనంగా ఆరంభించాలని టీమిండియా భావిస్తోంది.ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో 3 పరుగులు సాధిస్తే.. టీ20ల్లో ఐర్లాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా రికార్డులెక్కుతాడు.ఇప్పటివరకు ఐర్లాండ్‌పై రోహిత్ శర్మ 3 మ్యాచ్‌లు ఆడి 149 పరుగులు చేశాడు. కాగా ప్రస్తుతం ఈ రికార్డు టీమిండియా ఆల్‌రౌండర్ దీపక్ హుడా పేరిట ఉంది. దీపక్ హుడా ఇప్పటివరకు ఐర్లాండ్‌పై 2 మ్యాచ్‌లు ఆడి 151 పరుగులు చేశాడు.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ -
అరుదైన మైలురాయిని తాకిన బాబర్ ఆజమ్.. ప్రపంచ క్రికెట్లో ఇద్దరే ఇద్దరికి సాధ్యమైంది
ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20 సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 36 పరుగులు చేసిన బాబర్.. 13 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 4000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. ప్రపంచ క్రికెట్లో కేవలం ఇద్దరే ఇద్దరు ఈ మైలురాయిని తాకారు. బాబర్‌కు ముందు విరాట్ కోహ్లి మాత్రమే 4000 టీ20 పరుగులు పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ టాప్‌లో ఉండగా.. బాబర్ రెండో స్థానంలో నిలిచాడు. విరాట్ 117 మ్యాచ్‌ల్లో 4037 పరుగులు చేయగా.. బాబర్ 119 టీ20ల్లో 4023 పరుగులు చేశాడు. ఈ జాబితాలో విరాట్, బాబర్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్ 151 టీ20ల్లో 3974 పరుగులు చేసి మూడో స్థానంలో నిలిచాడు. ప్రస్తుత తరం ఆటగాళ్లలో విరాట్, బాబర్, రోహిత్ తర్వాత పాల్ స్టిర్లింగ్ (3589), మహ్మద్ రిజ్వాన్ (3203), జోస్ బట్లర్ (3050), కేన్ విలియమ్సన్ (2547) టాప్-10లో ఉన్నారు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌కు ముందు పాకిస్తాన్‌కు ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. ఓవల్ వేదికగా నిన్న జరిగిన నాలుగో టీ20లో పాక్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడింది. ఫలితంగా ఇంగ్లండ్ నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. ఆదిల్ రషీద్ (4-0-27-2), లివింగ్‌స్టోన్ (3-1-17-2), మార్క్ వుడ్ (4-0-35-2) పాక్‌ను దెబ్బకొట్టారు. పాక్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (36), ఉస్మాన్ ఖాన్ (38) ఓ మోస్తరుగా రాణించగా.. మొహమ్మద్ రిజ్వాన్ (23), ఇఫ్తికార్ అహ్మద్ (21), నసీం షా (16) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (45), జోస్ బట్లర్ (39) దూకుడుగా ఆడటంతో 15.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. విల్ జాక్స్ (20), జానీ బెయిర్‌స్టో (28 నాటౌట్), హ్యారీ బ్రూక్ (17 నాటౌట్) ఇంగ్లండ్ గెలుపుకు తమవంతు సహకారాన్నందించారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్‌కు మూడు వికెట్లు దక్కాయి. -
చరిత్ర సృష్టించిన బట్లర్.. తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ విధ్వంసం సృష్టించాడు. పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బట్లర్ కేవలం 51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 84 పరుగులు చేశాడు. ఈ క్రమంలో బట్లర్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 3000 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా బట్లర్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు 115 టీ20 మ్యాచ్‌లు ఆడిన బట్లర్.. 3011 పరుగులు చేశాడు.బట్లర్ అంతర్జాతీయ టీ20 కెరీర్లో 23 ఫిప్టీలు, ఒక సెంచరీ ఉన్నాయి. అదే విధంగా టీ20ల్లో ఇంగ్లండ్ కెప్టెన్‌గా 1000 పరుగుల మైలురాయిని కూడా బట్లర్ అందుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్(84)తో పాటు విల్ జాక్స్(37), బెయిర్ స్టో(21) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లో షాహీన్ షా అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా.. రవూఫ్, వసీం తలా రెండు వికెట్లు సాధించారు. -
KKR Vs MI: సునీల్ నరైన్ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు డకౌట్లగా వెనుదిరిగిన ప్లేయర్‌గా నరైన్ నిలిచాడు. ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌటైన నరైన్.. ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో నరైన్ ఇప్పటివరకు 44 సార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఇంతకుముందు ఈ చెత్త రికార్డు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ అలెక్స్ హెల్స్ పేరిట ఉండేది. హెల్స్ 43 సార్లు డకౌటయ్యాడు. తాజా మ్యాచ్‌తో హెల్స్‌ను నరైన్ అధిగమించాడు. అదే విధంగా ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన రెండో ఆటగాడిగా పియూష్ చావ్లా సరసన సునీల్ నరైన్ నిలిచాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 16 సార్లు ఈ కరేబియన్ ఆల్‌రౌండర్ డకౌటయ్యాడు. దీంతో పాటు మరో రికార్డును కూడా నరైన్ తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్( అంతర్జాతీయ, లీగ్‌లు)లో 550 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా సునీల్ నరైన్ నిలిచాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో 625 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత అఫ్గాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ 574 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. -
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
అంతర్జాతీయ టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్ నమోదైంది. ఏషియన్ గేమ్స్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల్లో భాగంగా జపాన్‌తో ఇవాళ (మే 8) జరిగిన మ్యాచ్‌లో మంగోలియా 12 పరుగులకే ఆలౌటైంది. పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్ గతేడాది ఫిబ్రవరి 26న నమోదైంది. స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐసిల్ ఆఫ్ మ్యాన్ జట్టు 10 పరుగులకే చాపచుట్టేసి చెత్త రికార్డు మూటగట్టుకుంది.మంగోలియాతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జపాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. జపాన్ ఇన్నింగ్స్‌లో శబరీష్ రవిచంద్రన్ (69) అర్దసెంచరీతో రాణించాడు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన మంగోలియా.. జపాన్ బౌలర్ల ధాటికి 8.2 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఫలితంగా జపాన్ 205 పరుగుల అతి భారీ తేడాతో విజయం సాధించింది. పొట్టి క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో భారీ విజయంగా నమోదైంది. 2023లో నేపాల్ ఇదే మంగోలియాపై సాధించిన 273 పరుగుల విజయం పొట్టి క్రికెట్ చరిత్రలోనే అతి భారీ విజయంగా నమోదైంది.ఈ మ్యాచ్‌లో జపాన్ బౌలర్ కజుమా కటో స్టాఫోర్డ్ 3.2 ఓవర్లు వేసి 7 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. మంగోలియా ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు డౌట్లయ్యారు. 4 పరుగులు చేసిన సుమియా టాప్ స్కోరర్ కాగా.. ఎక్స్‌ట్రాల రూపంలో మూడు పరుగులు వచ్చాయి. -
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీమిండియా స్పిన్నర్, రాజస్తాన్ రాయల్స్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్(అంతర్జాతీయ క్రికెట్, లీగ్‌లు)లో 350 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి భారత బౌలర్‌గా చాహల్ రికార్డులకెక్కాడు.ఐపీఎల్-2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ను ఔట్ చేసిన చాహల్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. చాహల్ ఇప్పటివరకు 350 వికెట్లు పడగొట్టాడు. చాహల్ తర్వాత స్ధానంలో భారత మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా 310 వికెట్లతో ఉన్నాడు.ఇక ఐపీఎల్లో సైతం అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా చాహల్(201) కొనసాగుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్లు జెక్ ఫ్రెజర్ మెక్ గర్క్(20 బంతుల్లో 50), అభిషేర్ పోరెల్(65) అదరగొట్టారు. వీరిద్దరితో పాటు ఆఖరిలో ట్రిస్టన్ స్టబ్స్ మెరుపులు మెరిపించాడు.20 బంతులు ఎదుర్కొన్న స్టబ్స్.. 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడువికెట్లు పడగొట్టగా.. చాహల్, బౌల్ట్, సందీప్ శర్మ తలా వికెట్ సాధించారు. -
IPL 2024 GT VS RCB: అత్యంత అరుదైన క్లబ్లో చేరిన ఫాఫ్ డుప్లెసిస్
ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ టీ20ల్లో అత్యంత అరుదైన క్లబ్లో చేరాడు. నిన్న (మే 4) గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్దసెంచరీతో ఇరగదీసిన ఇతను.. పొట్టి ఫార్మాట్లో 10000 పరుగులు పూర్తి చేసుకున్న 14వ బ్యాటర్‌గా, తొలి సౌతాఫ్రికన్ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. టీ20 కెరీర్లో 369 మ్యాచ్‌లు ఆడిన డుప్లెసిస్.. 134.30 స్ట్రయిక్‌రేట్‌తో 32.17 సగటున 10039 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో ఓవరాల్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. గేల్ 463 మ్యాచ్‌ల్లో 22 సెంచరీలు, 88 హాఫ్ సెంచరీల సాయంతో 14562 పరుగులు చేశాడు. ఈ జాబితాలో గేల్ తర్వాతి స్థానాల్లో షోయబ్ మాలిక్ (13360), పోలార్డ్ (12900), విరాట్ కోహ్లి (12536), అలెక్స్ హేల్స్ (12319), వార్నర్ (12232), రోహిత్ శర్మ (11482), జోస్ బట్లర్ (11465), ఆరోన్ ఫించ్ (11458), కొలిన్ మున్రో (10961), బాబర్ ఆజమ్ (10620), జేమ్స్ విన్స్ (10451), డేవిడ్ మిల్లర్ (10230), డుప్లెసిస్ ఉన్నారు.ఈ మ్యాచ్‌లో చేసిన పరుగులతో కలుపుకుని డుప్లెసిస్ మరో ఘనత సాధించాడు. డుప్లెసిస్ ఆర్సీబీ తరఫున నాలుగో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. ఆర్సీబీకి ముందు సీఎస్కేకు ఆడిన డుప్లెసిస్ ఆ ఫ్రాంచైజీ తరఫున మూడో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.మ్యాచ్ విషయానికొస్తే.. డుప్లెసిస్ మెరుపు అర్ద సెంచరీతో చెలరేగడంతో గుజరాత్‌పై ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఆర్సీబీ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో షారుక్ ఖాన్ (37), డేవిడ్ మిల్లర్ (30), రాహుల్ తెవాతియా (35) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మిగతా ప్లేయర్లంతా పెవిలియన్‌కు క్యూకట్టారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, యశ్ దయాల్, విజయ్‌కుమార్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కర్ణ్ శర్మ, గ్రీన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. పవర్ ప్లేలో పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోయింది. తొలి ఆరు ఓవర్లలో 92 పరుగులు చేసిన ఆర్సీబీ.. ఆతర్వాత ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయి ఆలౌటయ్యేలా కనిపించింది. అయితే దినేశ్ కార్తీక్ (21 నాటౌట్).. సప్నిల్ సింగ్ (15 నాటౌట్) సాయంతో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. గుజరాత్ బౌలర్లలో జాషువ లిటిల్ 4 వికెట్లతో విజృంభించగా.. నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో భారీ జంప్ కొట్టి చివరి స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. ఈ ఓటమితో గుజరాత్ తొమ్మిదో స్థానానికి పడిపోయింది. -
IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా నిన్న (మే 4) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లి రెండు భారీ రికార్డులు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసిన విరాట్.. పొట్టి క్రికెట్లో 12500 పరుగులు పూర్తి చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అలాగే ఐపీఎల్ గెలుపుల్లో అత్యధిక పరుగులు (4039) చేసిన బ్యాటర్‌గా.. నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.పొట్టి క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..క్రిస్ గేల్ (14562)షోయబ్ మాలిక్ (13360)కీరన్ పోలార్డ్ (12900)విరాట్ కోహ్లి (12536)అలెక్స్ హేల్స్ (12319)విజయాల్లో (ఐపీఎల్) అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..విరాట్ కోహ్లి (4039)శిఖర్ ధవన్ (3945)రోహిత్ శర్మ (3918)డేవిడ్ వార్నర్ (3710)సురేశ్ రైనా (3559)మ్యాచ్ విషయానికొస్తే.. విరాట్, డుప్లెసిస్ (23 బంతుల్లో 64; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఆర్సీబీ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 19.3 ఓవర్లలో 147 పరుగులకే చాపచుట్టేసింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో షారుక్ ఖాన్ (37), డేవిడ్ మిల్లర్ (30), రాహుల్ తెవాతియా (35) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మిగతా ప్లేయర్లంతా చేతులెత్తేశారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, యశ్ దయాల్, విజయ్‌కుమార్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కర్ణ్ శర్మ, గ్రీన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. పవర్ ప్లేలో పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోయింది. తొలి ఆరు ఓవర్లలో 92 పరుగులు చేసిన ఆర్సీబీ.. ఆతర్వాత ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయి ఆలౌటయ్యేలా కనిపించింది. అయితే దినేశ్ కార్తీక్ (21 నాటౌట్).. సప్నిల్ సింగ్ (15 నాటౌట్) సాయంతో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. గుజరాత్ బౌలర్లలో జాషువ లిటిల్ 4 వికెట్లతో విజృంభించగా.. నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో భారీ జంప్ కొట్టి చివరి స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. ఈ ఓటమితో గుజరాత్ తొమ్మిదో స్థానానికి పడిపోయింది. -
పొట్టి క్రికెట్లో పెను సంచలనం
పొట్టి క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. మహిళల టీ20ల్లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇండోనేషియా బౌలర్ రొహ్మాలియా రొహ్మాలియా పరుగులేమీ ఇవ్వకుండా ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టింది. అంతర్జాతీయ టీ20ల్లో (పురుషులు, మహిళలు) ఇవే అత్యుత్తమ గణాంకాలు. ఐసీసీ గుర్తింపు పొందిన ఏ జట్టు తరఫున ఇలాంటి గణాంకాలు నమోదు కాలేదు.పురుషుల క్రికెట్లో (టీ20ల్లో) అత్యుత్తమ గణాంకాలు స్యాజ్రుల్ ఇద్రుస్ (4-1-8-7) పేరిట ఉండగా.. మహిళల క్రికెట్లో రొహ్మాలియాకు ముందు ఈ రికార్డు నెదర్లాండ్స్ క్రికెటర్ ఫ్రెడ్రిక్ ఓవర్డిక్ (4-2-3-7) పేరిట ఉండింది. ప్రపంచ క్రికెట్లో ఇప్పటివరకు ఏ బౌలర్ పరుగులేమీ ఇవ్వకుండా 7 వికెట్లు తీసిన దాఖలాలు లేవు. రొహ్మాలియా తన కెరీర్లో రెండో టీ20 మ్యాచ్‌లోనే ఎవరికీ సాధ్యంకాని గణాంకాలు నమోదు చేయడం మరో విశేషం. మ్యాచ్ విషయానికొస్తే.. బాలీ బాష్‌గా పిలువబడే టోర్నీలో ఇండోనేషియా, మంగోలియా జట్లు తలపడ్డాయి. ఈ సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో రొహ్మాలియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండోనేషియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఇండోనేషియా ఇన్నింగ్స్‌లో నందా సకారిని (61) అర్దసెంచరీతో రాణించింది. మంగోలియా బౌలర్లలో ఎంక్జుల్ 4 వికెట్లు పడగొట్టింది. View this post on Instagram A post shared by Persatuan Cricket Indonesia (@cricket_ina) 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మంగోలియా.. రొహ్మాలియా (3.2-3-0-7) ధాటికి 16.2 ఓవర్లలో 24 పరుగులకే కుప్పకూలింది. మంగోలియా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా కనీసం రెండంకెల మార్కు తాకలేకపోగా.. ఎక్స్‌ట్రాలు టాప్ స్కోర్ (10) కావడం విశేషం. మంగోలియా ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు డకౌట్లు అయ్యారు. -
IPL 2024: 150 కొట్టిన సీఎస్కే.. ఇంకో రెండేస్తే ప్రపంచ రికార్డు
పొట్టి క్రికెట్లో చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన ఘనత సాధించింది. ఈ ఫార్మాట్లో సీఎస్కే 150 విజయాల మైలురాయిని తాకింది. ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్ 14) జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా టీ20ల్లో 150 విజయాలను పూర్తి చేసుకుంది. పొట్టి క్రికెట్ చరిత్రలో సీఎస్కేకు ముందు సహచర ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ మాత్రమే 150 విజయాల మైలురాయిని తాకింది. టీ20 ఫార్మాట్లో ముంబై ఇండియన్స్ 273 మ్యాచ్‌ల్లో 151 విజయాలు సాధించగా.. సీఎస్కే 255 మ్యాచ్‌ల్లో 150 విజయాలు నమోదు చేసింది. ఆసక్తికర మరో విషయం ఏంటంటే.. ముంబై, సీఎస్కే జట్లు ఇప్పటివరకు చెరి ఐదేసి ఐపీఎల్ టైటిళ్లు సాధించాయి. టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో ముంబై, సీఎస్కే తర్వాత టీమిండియా ఉంది. ఈ ఫార్మాట్లో భారత క్రికెట్ జట్టు 219 మ్యాచ్‌ల్లో 140 విజయాలు సాధించింది. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. రుతురాజ్ (40 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), శివమ్ దూబే (38 బంతుల్లో 66 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో ధోని సుడిగాలి ఇన్నింగ్స్‌తో శివాలెత్తిపోయాడు. ఇన్నింగ్స్‌లో చివరి నాలుగు బంతుల్లో హ్యాట్రిక్ సిక్సర్లు సహా 20 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో సీఎస్కే మొత్తంగా 26 పరుగులు రాబట్టింది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రోహిత్ శర్మ మెరుపు సెంచరీతో (63 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) కదం తొక్కినప్పటికీ లక్ష్యానికి 21 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. 4 వికెట్లు తీసిన పతిరణ సీఎస్కే గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. -
CSK Vs MI: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. తొలి భారత క్రికెటర్‌గా
టీ20 క్రికెట్లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 500 సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 3 సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఐదో బ్యాటర్‌గా రోహిత్ నిలిచాడు. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 1056 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా, కీరన్ పొలార్డ్ (860), ఆండ్రీ రస్సెల్ (678), కొలిన్ మున్రో (548) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా రోహిత్(597) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
ప్రపంచ రికార్డు నెలకొల్పిన ముంబై ఇండియన్స్.. క్రికెట్ చరిత్రలో తొలి జట్టుగా..!
ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్ పొట్టి ఫార్మాట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ఎంఐ టీమ్... పొట్టి క్రికెట్లో 150 విజయాలు సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృస్టించింది. ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (ఏప్రిల్ 7) జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ముంబై ఇండియన్స్ రికార్డుల్లోకెక్కింది. పొట్టి క్రికెట్ చరిత్రలో ఏ జట్టు ఇప్పటివరకు 150 విజయాల మార్కును తాకలేదు. ముంబై ఇండియన్స్ ఐపీఎల్, ప్రస్తుతం కనుమరుగైన ఛాంపియన్స్ టీ20 లీగ్‌లో కలిపి 273 మ్యాచ్‌లు ఆడి 150 విజయాలు సాధించింది. 117 మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొంది. రెండు మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగిసాయి. టీ20ల్లో ముంబై సాధించిన 150 విజయాలు సూపర్ ఓవర్ ఫలితాలు కలుపుకోకుండా సాధించినవి. సూపర్ ఓవర్లో ముంబై రెండు విజయాలు సాధించి, రెండు అపజయాలు ఎదుర్కొంది. WANKHEDE CROWD GETS A SUPERB MATCH. ⭐ pic.twitter.com/HOEAsTTFkH — Mufaddal Vohra (@mufaddal_vohra) April 7, 2024 టీ20ల్లో ముంబై తర్వాత అత్యధిక విజయాలు సాధించిన ఘనత చెన్నై సూపర్ కింగ్స్‌కు దక్కుతుంది. పొట్టి ఫార్మాట్లో సీఎస్కే 253 మ్యాచ్‌లు ఆడి 148 విజయాలు నమోదు చేసింది. 101 మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదర్కొంది. రెండు మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగియగా.. ఓ మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్ వరకు వెళ్లిన రెండు మ్యాచ్‌ల్లో చెన్నై అపజయాలను ఎదుర్కొంది. పొట్టి ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో టీమిండియా మూడో స్థానంలో ఉంది. భారత్ అన్ని జాతీయ జట్ల కంటే ఎక్కువగా 219 మ్యాచ్‌ల్లో 140 విజయాలు సాధించి, 68 మ్యాచ్‌ల్లో ఓడింది. 6 మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగియగా.. ఓ మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్ వరకు వెళ్లిన నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ విజయఢంకా మోగించింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. రోహిత్ శర్మ (27 బంతుల్లో 49; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), టిమ్ డేవిడ్ (21 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (10 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. 235 పరుగల భారీ లక్ష్య ఛేదనలో ట్రిస్టన్ స్టబ్స్ (25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 71 పరుగులు నాటౌట్), పృథ్వీ షా (40 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఢిల్లీని గెలిపించేందు విఫలయత్నం చేశారు. స్టబ్స్ చివరి వరకు పోరాడినప్పటికీ ఢిల్లీ లక్ష్యానికి 30 పరుగుల దూరంలో నిలిచిపోయింది. -
చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. టీ20ల్లో టాప్ స్కోర్
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 7) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. టీ20ల్లో ఒక్క వ్యక్తిగత హాఫ్ సెంచరీ కూడా లేకుండా అత్యధిక టీమ్ స్కోర్ సాధించిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. 21 ఏళ్ల పొట్టి క్రికెట్ చరిత్రలో ఏ జట్టు కనీసం హాఫ్ సెంచరీ కూడా లేకుండా ఇంత భారీ స్కోర్ చేయలేదు. నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకుండా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌కు ముందు టీ20ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకుండా అత్యధిక స్కోర్ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండింది. 2007లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకుండా 221 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్ 48 (గిల్‌క్రిస్ట్). MUMBAI INDIANS SCORED THE HIGHEST T20 TOTAL IN HISTORY WITHOUT AN INDIVIDUAL FIFTY...!!! 💥 pic.twitter.com/2i6RsQ1vr2 — Mufaddal Vohra (@mufaddal_vohra) April 7, 2024 ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక స్కోర్ రికార్డు నేపాల్ పేరిట ఉంది. ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో ఆ జట్టు మంగోలియాపై 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఐపీఎల్ విషయానికొస్తే.. క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉంది. ఆరెంజ్ ఆర్మీ ప్రస్తుత సీజన్లోనే ఈ రికార్డు తమ పేరిట లిఖించుకుంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ రికార్డు స్థాయిలో 277 పరుగులు స్కోర్ చేసింది. ఇదే సీజన్లో ఐపీఎల్లో రెండో భారీ స్కోర్ కూడా నమోదైంది. విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 272 పరుగులు స్కోర్ చేసింది. THE CRAZIEST FINAL OVER HITTING. 🤯 - Romario Shepherd smashed 4,6,6,6,4,6 against Nortje. 🔥 pic.twitter.com/8enitnQVVH — Mufaddal Vohra (@mufaddal_vohra) April 7, 2024 ఢిల్లీతో మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. రోహిత్ శర్మ (27 బంతుల్లో 49; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), టిమ్ డేవిడ్ (21 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (10 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. నోర్జే వేసిన ఆఖరి ఓవర్లో షెపర్డ్ విధ్వంసం సృష్టించాడు. 4 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేశాడు. -
చరిత్ర సృష్టించిన ధోని.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్కే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని అరుదైన మైలు రాయిని అందుకున్నాడు. టీ20 క్రికెట్లో 300 వికెట్లలో భాగమైన తొలి వికెట్ కీపర్‌గా ధోని నిలిచాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా క్యాచ్‌ను అందుకున్న ధోని.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ జాబితాలో మరే వికెట్ కీపర్ కూడా ధోనీకి దరిదాపుల్లో కూడా లేరు. ఈ జాబితాలో ధోనీ(300) అగ్రస్థానంలో ఉండగా.. కమ్రాన్ అక్మల్(274), దినేశ్ కార్తీక్(274) రెండో స్థానంలో కొనసాగుతున్నారు. క్వింటన్ డికాక్(270), జోస్ బట్లర్(209) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఢిల్లీ చేతిలో 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సీఎస్కే ఓటమిపాలైనప్పటికి.. ఎంఎస్ ధోని మాత్రం మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. 8వ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 16 బంతులు మాత్రమే ఎదుర్కొన్న మిస్టర్ కూల్.. 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. -
ఒకే గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్
దుబాయ్: ఈ ఏడాది మహిళల ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నమెంట్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. జూలై 19 నుంచి 28 వరకు దంబుల్లాలో ఈ టోర్నీ జరుగుతుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. చివరిసారి 2022లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ టోర్నిలో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఏడోసారి విజేతగా నిలిచింది. క్రితంసారి ఏడు జట్లు పాల్గొనగా... ఈసారి ఎనిమిది జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్ ‘ఎ’లో భారత్, పాకిస్తాన్, యూఏఈ, నేపాల్... గ్రూప్ ‘బి’లో శ్రీలంక, బంగ్లాదేశ్, మలేసియా, థాయ్‌లాండ్ జట్లున్నాయి. భారత్ తమ మూడు లీగ్ మ్యాచ్‌లను వరుసగా యూఏఈ (జూలై 19న), పాకిస్తాన్ (జూలై 21న), నేపాల్ (జూలై 23న) జట్లతో ఆడుతుంది. జూలై 26న సెమీఫైనల్స్... జూలై 28న ఫైనల్ జరుగుతాయి. -
#Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. తొలి క్రికెటర్‌గా రికార్డు
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. ఆర్సీబీ విజయంలో విరాట్ కోహ్లి, దినేష్ కార్తీక్‌లు కీలక పాత్ర పోషించారు. తొలుత విరాట్ కోహ్లి అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖరిలో కార్తీక్ మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆది నుంచే ప్రత్యర్ది బౌలర్లను ఊచకోత కోశాడు. సామ్ కుర్రాన్ వేసిన తొలి ఓవర్లోనే ఏకంగా 4 ఫోర్లతో 16 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత కూడా విరాట్ జోరు ఎక్కడ తగ్గలేదు. ఓవరాల్‌గా 49 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌ను ఆడిన కోహ్లి.. ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20ల్లో 100 సార్లు 50 ప్లస్ రన్స్ చేసిన మొదటి భారత క్రికెటర్‌గా విరాట్ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా వరల్డ్‌క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన జాబితాలో విరాట్ మూడో స్ధానంలోఉన్నాడు. తొలి స్ధానంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(110) ఉండగా.. ఆ తర్వాతి స్ధానంలో డేవిడ్ వార్నర్ (109) ఉన్నాడు. When Virat Kohli returns from break, you know he's lethal 🥵#RCBvsPBKS pic.twitter.com/H4zuHN9hxI — OneCricket (@OneCricketApp) March 25, 2024 -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్.. 147 యేళ్ల క్రికెట్ హిస్టరీలోనే
ఆఫ్రికన్ గేమ్స్ 2024లో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు బోణీ కొట్టింది. ఈ గేమ్స్‌లో ప్రోటీస్ తృతీయ శ్రేణి జట్టు పాల్గోంటుంది. ఈ ఈవెంట్లో భాగంగా ఘనాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ప్రోటీస్ బ్యాటర్లలో కెప్టెన్ జార్జ్ వాన్ హీర్డెన్(107) సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు హెన్రిచ్ పీటర్(62) రాణించాడు. అనంతరం 238 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఘనా కేవలం 103 పరుగులకే కుప్పకూలింది. ఇక మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ప్రోటీస్ కెప్టెన్ వాన్ హీర్డెన్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేసిన యంగెస్ట్ కెప్టెన్‌గా వాన్ హీర్డెన్ నిలిచాడు. వాన్ హీర్డెన్ 20 ఏళ్ల 188 రోజుల్లో ఈ ఘనత సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు జింబావ్వే మాజీ కెప్టెన్ టెటాండా టైబ్(21 ఏళ్ల 248 రోజులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో టైబ్ ఆల్‌టైమ్ రికార్డును వాన్ హీర్డన్ నిలిచాడు. చదవండి: WPL 2024: ఫైనల్లో 4 వికెట్లు.. ఆర్సీబీ క్వీన్! ఎవరీ శ్రేయాంక? -
టీ20 క్రికెట్లో సంచలనం.. కేవలం 16 పరుగలకే ఆలౌట్
జింబాబ్వే దేశవాళీ టీ20 టోర్నీ-2024లో సంచలనం నమోదైంది. శనివారం డర్హామ్ జట్టుతో జరిగిన ఫైనల్ పోరులో ఈగల్స్ కేవలం 16 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీ20 చరిత్రలో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన రెండో జట్టుగా ఈగల్స్ చెత్త రికార్డును నెలకొల్పింది. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో బిగ్‌బాష్ లీగ్ ఫ్రాంచైజీ సిడ్నీ థండర్స్ అగ్రస్ధానంలో ఉంది. బిగ్‌బాష్ లీగ్-2022లో సిడ్నీ థండర్స్ కేవలం 15 పరుగులకే ఆలౌటైంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన డర్హామ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోర్ సాధిచింది. డర్హామ్ బ్యాటర్లలో బాస్ డి లీడ్(58) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మస్టర్డ్(46), రాబిన్సన్(49) పరుగులతో అదరగొట్టారు. అనంతరం 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఈగల్స్ కేవలం 16 పరుగులకే కుప్పకూలింది. డర్హామ్ బౌలర్లలో కాఫ్లీన్, పార్కిన్సన్, లూక్ రాబిన్సన్ తలా రెండు వికెట్లతో డర్హామ్ పతనాన్ని శాసించగా.. బాస్ డీ లీడ్, సౌటర్ తలా వికెట్ సాధించారు. మిగితా రెండు వికెట్లు రనౌట్ రూపంలో దక్కాయి. ఈగల్స్ బ్యాటర్లలో చిబావా(4) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: IPL 2024: 'చెన్నై, ముంబై, సన్‌రైజర్స్ కాదు.. ఈ సారి ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే' -
రోహిత్ శర్మకు అరుదైన గౌరవం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు 11వ తరగతి మ్యాథ్స్ సిలబస్‌లో హిట్‌మ్యాన్ పేరిట ఉన్న 35 బంతుల టీ20 సెంచరీని పాఠ్యాంశంగా పొందుపరిచారు. రోహిత్ శతకాన్ని ఉదాహరణగా తీసుకుని గణిత శాస్త్రంలోని ఫంక్షన్స్ అండ్ రిలేషన్స్ కాన్సెప్ట్‌పై పలు ప్రశ్నలు అడిగారు. రోహిత్ క్రికెటింగ్ కెరీర్‌లోని ఘనతలను పాఠ్యాంశంగా పొందుపరచడం ఇది కొత్తేమీ కాదు. గతంలోనూ ఓ అప్పర్ ప్రైమరీ స్కూల్ పాఠ్యపుస్తకంలో ఇతనికి సంబంధించిన అంశాలను పాఠ్యాంశంగా చేర్చారు. Captain Rohit Sharma featured in the 11th Class Maths Text book. 👌 pic.twitter.com/mSgDnHm6Ye — Johns. (@CricCrazyJohns) February 26, 2024 కాగా, పాఠ్యాంశంగా మారిన రోహిత్ టీ20 సెంచరీ 2017 డిసెంబర్లో చేసింది. ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన నాటి మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 35 బంతుల్లో 10 ఫోర్, 12 సిక్సర్ల సాయంతో సెంచరీ చేశాడు. కొద్ది నెలల కిందటి వరకు ఇది అంతర్జాతీయ టీ20ల్లో జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీగా చలామణి అయ్యింది. గతేడాది చివర్లో జరిగిన ఆసియా క్రీడల్లో నేపాల్ బ్యాటర్ కుశాల్ మల్లా.. రోహిత్, డేవిడ్ మిల్లర్ పేరిట సంయుక్తంగా ఉండిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును చెరిపేశాడు. మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో కుశాల్ 34 బంతుల్లోనే సెంచరీని బాదాడు. అయితే, కుశాల్ పేరిట ఈ రికార్డు ఎక్కువ రోజులు నిలబడలేదు. ఇవాళ (ఫిబ్రవరి 27) నమీబియా ఆటగాడు జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ కుశాల్ రికార్డును బద్దలు కొట్టాడు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో లాఫ్టీ కేవలం 33 బంతుల్లోనే శతక్కొట్టి, టీ20 ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. -
Namibia: చిన్న జట్టే అయినా ఇరగదీసింది.. ఆస్ట్రేలియాకు సైతం సాధ్యం కాలేదు..!
అంతర్జాతీయ టీ20ల్లో పసికూన నమీబియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. పొట్టి ఫార్మాట్లో ఈ జట్టు వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. తాజాగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా మాజీ వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు సైతం సాధ్యంకాని తొమ్మిది వరస విజయాల రికార్డును సాధించింది. తద్వారా ప్రపంచ క్రికెట్లో ఈ ఘనత సాధించిన 18వ జట్టుగా రికార్డుల్లోకెక్కింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వరుస విజయాల రికార్డు మలేసియా పేరిట ఉంది. ఈ జట్టు జూన్ 2022-డిసెంబర్ 2022 మధ్యలో వరుసగా 13 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వరుస విజయాలు సాధించిన జట్లు.. మలేసియా (13 వరుస విజయాలు) బెర్ముడా (13) ఆఫ్ఘనిస్తాన్ (12) రొమేనియా (12) ఇండియా (12) ఆఫ్ఘనిస్తాన్ (11) ఉగాండ (11) పపువా న్యూ గినియా (11) నైజీరియా (11) జెర్సీ (10) టాంజానియా (10) ఉగాండ (10) ఉగాండ (10) పాకిస్తాన్ (10) న్యూజిలాండ్ (10) పోర్చుగల్ (9) సౌదీ అరేబియా (9) నమీబియా (9*) కాగా, ట్రై సిరీస్‌లో భాగంగా నేపాల్‌తో ఇవాళ (ఫిబ్రవరి 27) జరిగిన మ్యాచ్‌లో నమీబియా 20 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా.. లాఫ్టీ ఈటన్ (36 బంతుల్లో 101; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) ఫాస్టెస్ట్ సెంచరీతో (33 బంతుల్లో) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. నమీబియా ఇన్నింగ్స్‌లో ఈటన్‌తో పాటు మలాన్ క్రుగెర్ (59 నాటౌట్) రాణించాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్.. గెలుపు కోసం చివరి వరకు ప్రయత్నించినప్పటికీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఆ జట్టు 18.5 ఓవర్లలో 186 పరుగులకే పరిమితమై 20 పరగుల తేడాతో ఓటమిపాలైంది. రూబెన్ ట్రంపల్మెన్ (4/29) నేపాల్‌ను దెబ్బకొట్టాడు. నేపాల్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ పౌడెల్ (42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో రెండో మ్యాచ్ రేపు నేపాల్-నెదర్లాండ్స్ మధ్య జరుగనుంది. -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో భాగంగా కరాచీ కింగ్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 21) జరుగుతున్న మ్యాచ్‌లో బాబర్ (పెషావర్ జల్మీ) ఈ రికార్డును సాధించాడు. బాబర్‌కు ముందు ఈ రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ ఈ మార్కును తాకేందుకు 285 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. బాబర్ కేవలం 271 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అధిగమించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో బాబర్, గేల్ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి (299 మ్యాచ్‌లు), డేవిడ్ వార్నర్ (303), ఆరోన్ ఫించ్ (327) ఉన్నారు. ఓవరాల్‌గా టీ20ల్లో 10000 పరుగుల మార్కును ఇప్పటివరకు 12 మంది (బాబర్ సహా) క్రాస్ చేశారు. పాక్ తరఫున షోయబ్ మాలిక్, బాబర్ ఆజమ్ ఈ ఘనతను సాధించారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 10,000 పరుగుల మార్కును తాకిన బాబర్ 51 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 72 పరుగులు చేసి ఔటయ్యాడు. పెషావర్ ఇన్నింగ్స్‌లో బాబరే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్.. బాబర్ ఒక్కడే రాణించడంతో 154 పరుగులకు ఆలౌటైంది. బాబర్‌తో పాటు రోవ్‌మన్ పావెల్ (39), ఆసిఫ్ అలీ (23) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. పెషావర్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు (సైమ్ అయూబ్, జీషన్, సలాంకీల్) డకౌట్లయ్యారు. కరాచీ బౌలర్లలో మీర్ హమ్జా, హసన్ అలీ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. డేనియల్ సామ్స్ 2, షోయబ్ మాలిక్, మొహమ్మద్ నవాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్.. తొలి బౌలర్‌గా
అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంక కెప్టెన్ వనిందు హసరంగా 100 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్ జరిగిన రెండో టీ20లో 2 వికెట్లు పడగొట్టిన హసరంగా.. 100 వికెట్ల క్లబ్లో చేరాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను హసరంగా తన పేరిటి లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంతవేగంగా 100 వికెట్లు పడగొట్టిన శ్రీలంక బౌలర్‌గా వనిందూ రికార్డులకెక్కాడు. హసరంగా 63 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ(76 మ్యాచ్‌లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మలింగ ఆల్‌టైమ్ రికార్డును హసరంగా బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో అఫ్గాన్ స్టార్ రషీద్(53) ఖాన్ ఉన్నాడు. కాగా అంతర్జాతీయ టీ20ల్లో మలింగ తర్వాత 100 వికెట్లు తీసిన రెండో బౌలర్ కూడా హసరంగానే కావడం గమనార్హం. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో 11 స్ధానంలో వనిందూ నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 72 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌ను శ్రీలంక చిత్తు చేసింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే సిరీస్‌ను 2-0 తేడాతో శ్రీలంక కైవసం చేసుకుంది. చదవండి: Ranchi Test: టీమిండియాకు బిగ్ షాక్.. డబుల్ సెంచరీల వీరుడు దూరం!? -
టీ20ల్లో అత్యంత అరుదైన ఘనత సాధించిన సౌతాఫ్రికా బౌలర్
సౌతాఫ్రికా వెటరన్ బౌలర్ ఇమ్రాన్ తాహిర్ టీ20ల్లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్లో 500 వికెట్లు పడగొట్టిన నాలుగో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ప్రపంచ క్రికెట్లో తాహిర్‌కు ముందు డ్వేన్ బ్రావో (624 వికెట్లు), రషీద ఖాన్ (556), సునీల్ నరైన్ (532) 500 వికెట్ల మార్కును తాకారు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024లో రంగ్‌పూర్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న తాహిర్.. ఖుల్నా టైగర్స్‌తో నిన్న (ఫిబ్రవరి 13) జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో తాహిర్ ఐదు వికెట్ల ఘనత సాధించి, తన జట్టును ఒంటిచేత్తో గెలిచిపించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన రంగ్‌పూర్ రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. షకీబ్ అల్ హసన్ (69), మెహిది హసన్ (60) అర్దసెంచరీలతో రాణించగా.. నురుల్ హసన్ (32 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. షకీబ్ కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఖుల్నా టైగర్స్ బౌలర్లలో లూక్ వుడ్ 3, నహిద్ రాణా, నసుమ్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన టైగర్స్.. ఇమ్రాన్ తాహిర్ (4-0-26-5), షకీబ్ అల్ హసన్ (3.2-0-30-2), మెహిది హసన్ (1/13), హసన్ మహమూద్ (1/29), జేమ్స్ నీషమ్ (1/5) ధాటికి 18.2 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. టైగర్స్ బౌలర్లలో అలెక్స్ హేల్స్ (60) ఒక్కడే రాణించాడు. మిగతా బ్యాటర్లు కనీసం 20 పరుగులకు మించి చేయలేకపోయారు. -
సుడిగాలి శతకం.. మ్యాక్స్‌వెల్ అరుదైన రికార్డు
అడిలైడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఆసీస్ స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర శతకంతో (55 బంతుల్లో 120; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఈ శతకం మ్యాక్సీకి టీ20ల్లో ఐదవది. పొట్టి క్రికెట్ చరిత్రలో కేవలం రోహిత్ శర్మ మాత్రమే ఇన్ని సెంచరీలు చేశాడు. మ్యాక్సీ సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో టిమ్ డేవిడ్ (14 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (19 బంతుల్లో 22; 3 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ మిచెల్ మార్ష్ (12 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తమదైన శైలిలో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. జోష్ ఇంగ్లిస్ (4) విఫలం కాగా.. స్టోయినిస్ 15 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 16 పరుగులు చేశాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ ధాటిగానే ఆడుతున్నప్పటికీ ఇప్పటికే సగం వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు 10 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్ (5), జాన్సన్ చార్లెస్ (24), పూరన్ (18), హోప్ (0), రూథర్‌ఫోర్డ్ (0) ఔట్ కాగా.. రోవ్‌మన్ పావెల్ (13), రసెల్ (30) క్రీజ్‌లో ఉన్నారు. 13 బంతుల్లోనే 30 పరుగులు చేసిన రసెల్ మాంచి ఊపుమీదున్నాడు. ఆసీస్ బౌలర్లలో స్టోయినిస్, స్పెన్సర్ జాన్సన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. హాజిల్‌వుడ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. వారంతా ఒకవైపు.. మ్యాక్స్‌వెల్ ఒక్కడే ఒకవైపు టీ20ల్లో ఐదో సెంచరీ పూర్తి చేసిన మ్యాక్స్‌వెల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లంతా కలిసి సాధించినన్ని సెంచరీలను ఒక్కడే సింగిల్ హ్యాండెడ్‌గా చేశాడు. టీ20ల్లో ఆసీస్ క్రికెటర్లంతా కలిపి ఐదు శతకాలు చేయగా.. మ్యాక్సీ ఒక్కడే ఐదేశాడు. పొట్టి ఫార్మాట్లో ఆస్ట్రేలియా తరఫున మ్యాక్స్‌వెల్ తర్వాత ఆరోన్ ఫించ్ అత్యధికంగా రెండు సెంచరీలు చేయగా.. డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్, జోష్ ఇంగ్లిస్ తలో సెంచరీ బాదారు. టీ20ల్లో ఆస్ట్రేలియా తరఫున మొత్తం 95 మంది ఆటగాళ్లు ప్రాతినిథ్యం వహించగా.. కేవలం కేవలం ఐదుగురు మాత్రమే సెంచరీలు చేశారు. మిగతా నలుగురు చేసిన సెంచరీలను మ్యాక్సీ ఒక్కడే చేయడం విశేషం. అంతర్జాతీయ టీ20ల్లో మ్యాక్స్‌వెల్ చేసిన సెంచరీలు.. - 145 (65)vs శ్రీలంక - 120(55) vs వెస్టిండీస్ - 113(55) vs ఇండియా - 104(48) vs ఇండియా - 103(58) vs ఇంగ్లండ్ -
అర్ధ శతకాల్లో సెంచరీ! వార్నర్ రికార్డు!
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తన వందో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో వార్నర్.. కరేబియన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో వార్నర్ కేవలం 22 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 36 బంతులు ఎదుర్కొన్న డేవిడ్ భాయ్ 12 ఫోర్లు, ఒక సిక్స్‌తో 70 పరుగులు చేశాడు. కాగా వార్నర్‌కు ఇది టీ20ల్లో 100వ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ఓ అరుదైన ఘనతను వార్నర్ తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్లో వంద అర్ధశతకాల మార్క్‌ను అందుకున్న తొలి క్రికెటర్‌గా వార్నర్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఓవరాల్‌గా 367 టీ20లు ఆడిన వార్నర్ 100 హాఫ్ సెంచరీలను సాధించాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో వార్నర్ తర్వాతి స్ధానంలో విరాట్ కోహ్లి(91) ఉన్నాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌లో వార్నర్ మరో అరుదైన రికార్డును నమోదు చేశాడు. క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆస్ట్రేలియా క్రికెటర్‌గా వార్నర్ రికార్డులకెక్కాడు. అయితే ఓవరాల్‌గా ఈ రికార్డు సాధించిన మూడో ప్లేయర్‌గా వార్నర్ నిలిచాడు. ఈ జాబితాలో డేవిడ్ కంటే ముందు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్ ఉన్నాడు. చదవండి: 'ప్లీజ్.. నా కొడుకును జడేజాతో పోల్చవద్దు' -
చరిత్ర సృష్టించిన డేవిడ్ మిల్లర్.. తొలి సౌతాఫ్రికా క్రికెటర్‌గా
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో 10 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి సౌతాఫ్రికా క్రికెటర్‌గా మిల్లర్ రికార్డులకెక్కాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో భాగంగా బుధవారం జో బర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన ఎలిమేనిటర్ మ్యాచ్‌లో28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మిల్లర్.. ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ లీగ్‌లో పార్ల్ రాయల్స్ కెప్టెన్‌గా మిల్లర్ వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు 466 టీ20 మ్యాచ్‌లు ఆడిన మిల్లర్ 10019 పరుగులు చేశాడు. కాగా ఈ మైలు రాయిని సౌతాఫ్రికా దిగ్గజాలు ఏబీ డివిలియర్స్, ఫాప్ డుప్లెసిస్ కూడా అందుకోలేకపోయారు. ఇక ఓవరాల్‌గా ఈ అరుదైన మైలు రాయిని అందుకున్న జాబితాలో మిల్లర్ 12 స్ధానంలో నిలిచాడు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్(14562) తొలి స్ధానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. జో బర్గ్ సూపర్ కింగ్స్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైన పార్ల్ రాయల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 10 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న ఆటగాళ్లు వీరే? క్రిస్ గేల్ (14562) షోయబ్ మాలిక్ (13077) కీరన్ పొలార్డ్ (12577), అలెక్స్ హేల్స్ (12002), విరాట్ కోహ్లి (11994), డేవిడ్ వార్నర్ (11860), ఆరోన్ ఫించ్ (11458), రోహిత్ శర్మ (11156), జోస్ బట్లర్ 11146), కోలిన్ మున్రో (10602) జేమ్స్ విన్స్ (10019) డేవిడ్ మిల్లర్(10019) -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఆఫ్ఘనిస్తాన్పై మూడో టీ20లో గెలుపుతో హిట్‌మ్యాన్ ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. పొట్టి క్రికెట్లో 250 విజయాల్లో భాగమైన తొలి భారత క్రికెటర్‌గా హిట్‌మ్యాన్ రికార్డుల్లోకెక్కాడు. అంతర్జాతీయ టీ20లతో పాటు ఐపీఎల్ లాంటి పొట్టి ఫార్మాట్ టోర్నీల్లో పాల్గొన్న రోహిత్.. 390 పైచిలుకు మ్యాచ్‌ల్లో ఈ ఘతన సాధించాడు. రోహిత్ తర్వాత అత్యధిక టీ20 విజయాల్లో భాగమైన రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉంది. ధోని 220 టీ20 విజయాల్లో భాగమయ్యాడు. ఈ జాబితాలో రోహిత్, ధోనిల తర్వాత దినేశ్ కార్తీక్ (218), సురేశ్ రైనా (207), విరాట్ కోహ్లి (198) ఉన్నారు. Rohit Sharma Became the First Indian Cricketer to Achieve 250 Wins in T20 Cricket.#RohitSharma pic.twitter.com/dgUgRMyaln — Sportiqo (@sportiqomarket) January 18, 2024 ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో మెరుపు శతకంతో విరుచుకుపడిన రోహిత్.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు (5) చేసిన ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు. అలాగే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా (1648), అత్యధిక వ్యక్తిగత స్కోర్ (121) సాధించిన భారత కెప్టెన్‌గా, టీ20ల్లో అత్యధిక విజయాలు (42) సాధించిన భారత్ కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ రికార్డులు నెలకొల్పాడు. కాగా, ఆఫ్ఘనిస్తాన్పై మూడో టీ20లో గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. రసవత్తరంగా సాగిన నిన్నటి సమరంలో భారత్ రెండో సూపర్ ఓవర్లో విజయం సాధించింది. తొలుత రోహిత్ శర్మ మెరుపు శతకంతో విరుచుకుపడటంతో భారత్ 212 పరుగులు చేయగా.. ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే స్కోర్ చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో సైతం మరోసారి స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఈ సూపర్ ఓవర్లో భారత్ ఎట్టకేలకు విజయం సాధించింది. -
ఐపీఎల్ వేలం కాసేపట్లో.. అందలం ఎక్కేదెవరు?
విశ్వవ్యాప్త క్రికెట్ అభిమానాన్ని యేటికేడు పెంచుకుంటున్న ఐపీఎల్లో ఆటకు ముందు వేలం పాట జరగబోతోంది. దుబాయ్‌లో నేడు నిర్వహించే మినీ వేలానికి 333 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. 10 ఫ్రాంచైజీలకు కావాల్సింది 77 మంది కాగా... ఇటీవల ప్రపంచకప్‌తో పాటు పరిమిత ఓవర్ల ఆటలో మెరిపిస్తున్న న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్రపై కోట్లు కురిపించేందుకు ఫ్రాంచైజీలన్నీ సై అంటున్నాయి. దుబాయ్: వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్‌కు నేడు దుబాయ్‌లో ఆటగాళ్ల మినీ వేలం పాట నిర్వహిస్తున్నారు. ఈ లీగ్ చరిత్రలో తొలిసారి వేలం ప్రక్రియ విదేశీ గడ్డపై జరగనుంది. ఒక రోజు ముందు సోమవారం ఫ్రాంచైజీ యాజమాన్యాలతో మాక్ వేలం కూడా నిర్వహించారు. ఇక కోట్ల పందేరం, ఆటగాళ్లకు అందలం పలికేందుకు ఒకటోసారి, రెండోసారి అని సుత్తి బద్దలు కొట్టే ప్రక్రియే తరువాయి. 1,166 మంది నమోదు చేసుకుంటే... ఈ మినీ వేలం కోసం ఐసీసీ సభ్య, అనుబంధ దేశాలు, దేశవాళ్లీ ఆటగాళ్లు ఆసక్తి చూపారు. ఏకంగా 1,166 మంది ఐపీఎల్ వేలం కోసం నమోదు చేసుకుంటే... ఫ్రాంచైజీ జట్లతో సంప్రదింపుల అనంతరం లీగ్ పాలకమండలి 333 మంది ఆటగాళ్లతో తుది జాబితాను సిద్ధం చేసింది. ఇందులోనే ఇద్దరు అసోసియేట్ ప్లేయర్లు సహా 119 విదేశీ ఆటగాళ్లున్నారు. అయితే 10 ఫ్రాంచైజీలకు కావాల్సింది మాత్రం 77 మంది ఆటగాళ్లు. ఇందులో 30 ఖాళీలను విదేశీ ఆటగాళ్లతోనే భర్తీ చేసుకోవాల్సి ఉంది. అత్యధికంగా 12 ఖాళీలు కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో ఉన్నాయి. నలుగురు విదేశీ ఆటగాళ్లు సహా 12 మందిని కొనేందుకు కోల్‌కతా వద్ద రూ. 32.70 కోట్లు అందుబాటులో ఉన్నాయి. హాట్ కేక్... రచిన్? భారత్‌లో ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో డాషింగ్ బ్యాటర్‌గా రచిన్ రవీంద్ర అందరికంటా పడ్డాడు. ఆరంభంలో ఎదురుదాడికి దిగి న్యూజిలాండ్ విజయాలకు గట్టి పునాది వేసిన రచిన్ ఈ మినీ వేలంలో హాట్‌కేక్ కానున్నాడు. రూ.50 లక్షల కనీస ధరతో ఫ్రాంచైజీల్ని ఆకర్షిస్తున్నాడు. ఆసీస్ స్పీడ్‌స్టర్స్ స్టార్క్, కమిన్స్, బ్యాటర్ ట్రావి హెడ్, దక్షిణాఫ్రికా సంచలనం కొయెట్జీ, హసరంగ (శ్రీలంక) తదితర స్టార్ క్రికెటర్ల కోసం ఫ్రాంచైజీ యాజమాన్యాలు ఎగబడే అవకాశాలు న్నాయి. భారత్ నుంచి శార్దుల్ ఠాకూర్, హర్షల్ పటేల్, అన్క్యాప్డ్ ఆల్‌రౌండర్ల సెట్ నుంచి షారుఖ్ ఖాన్‌లపై రూ.కోట్లు కురిసే అవకాశముంది. వేలం కోసం ప్లేయర్ల ప్రత్యేకతను బట్టి 19 సెట్లుగా విభజించారు. అంటే బ్యాటర్, ఆల్‌రౌండర్, పేసర్, స్పిన్నర్, వికెట్ కీపర్, క్యాప్డ్, అన్క్యాప్డ్ ఇలా సెట్ల వారీగా వేలం ప్రక్రియ జరుగుతుంది. -
మాక్స్వెల్ అత్యంత చెత్త రికార్డు.. టీ20 చరిత్రలోనే
గౌహతి వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఆసీస్ విజయంలో ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో మాక్సీ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. భారత బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో మాక్స్వెల్ విరుచుకుపడ్డాడు. ప్రసిద్ద్ కృష్ణ వేసిన ఆఖరి ఓవర్లో ఆసీస్ విజయానికి 21 పరుగులు అవసరమవ్వగా.. మాక్సీ బౌండరీల వర్షం కురిపించి జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 48 బంతులు ఎదుర్కొన్న మాక్స్వెల్ 8 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 104 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. మాక్సీ అత్యంత చెత్త రికార్డు.. బ్యాటింగ్‌లో దుమ్మురేపిన మాక్స్వెల్.. బౌలింగ్‌లో మాత్రం అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన మాక్స్వెల్ ఏకంగా 30 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులిచ్చిన ఆస్ట్రేలియా బౌలర్‌గా మాక్స్వెల్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ చెత్త రికార్డు ఆసీస్ దిగ్గజ బౌలర్ బ్రెట్ లీ పేరిట ఉండేది. 2009లో వెస్టిండీస్‌తో జరిగిన టీ20లో బ్రెట్‌లీ ఒకే ఓవర్లో 27 పరుగులు సమర్పించుకున్నాడు. తాజా మ్యాచ్‌తో బ్రెట్‌లీ చెత్త రికార్డును మాక్స్వెల్ తన పేరిట లిఖించుకున్నాడు. -
IND VS AUS 2nd T20: చరిత్ర సృష్టించిన టీమిండియా.. పాక్‌తో సమానంగా..!
పొట్టి క్రికెట్లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో నిన్న (నవంబర్ 26) జరిగిన రెండో టీ20లో విజయం సాధించడం ద్వారా పాక్‌తో సమానంగా టీ20ల్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. టీ20ల్లో పాక్ 226 మ్యాచ్‌ల్లో 135 విజయాలు సాధించగా.. నిన్నటి మ్యాచ్‌లో గెలుపుతో భారత్ ఈ రికార్డును సమం చేసింది. పాక్ 226 మ్యాచ్‌ల్లో ఈ ఘనతను సాధిస్తే, భారత్ 211 మ్యాచ్‌ల్లోనే 135 విజయాల మార్కును అందుకుంది. పొట్టి క్రికెట్లో 100 విజయాల మార్కును భారత్, పాక్‌లతో పాటు న్యూజిలాండ్ జట్టు మాత్రమే అందుకోగలిగింది. కివీస్ జట్టు 200 టీ20ల్లో 102 విజయాలు నమోదు చేసింది. సౌతాఫ్రికా (171 మ్యాచ్‌ల్లో 95 విజయాలు), ఆస్ట్రేలియా (179 మ్యాచ్‌ల్లో 94 విజయాలు), ఇంగ్లండ్ (177 మ్యాచ్‌ల్లో 92 విజయాలు) జట్లు భారత్, పాక్, కివీస్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే, తిరువనంతపురం వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి (25 బంతుల్లో 53; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రుతురాజ్ (43 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ (10 బంతుల్లో 19; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (9 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (2 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 236 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఆదిలో కాస్త పోరాడినప్పటికీ.. ఆతర్వాత భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో భిష్ణోయ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 3 వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్, అర్షదీప్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
ఇకపై క్రికెట్లో కొత్త రూల్.. అతిక్రమిస్తే తప్పదు భారీ మూల్యం
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈ ఏడాది డిసెంబర్ నుంచి పురుషుల వన్డే, టీ20 క్రికెట్లో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టనుంది. "స్టాప్ క్లాక్" పేరుతో ఉండే ఈ నిబంధనను వచ్చే ఏడాది (2024) ఏప్రిల్ వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఐసీసీ వెల్లడించింది. స్టాప్ క్లాక్ నిబంధన ఏంటంటే.. ఐసీసీ కొత్తగా ఓవర్‌కు ఓవర్‌కు మధ్య 60 సెకెన్ల నిర్దిష్ట సమయాన్ని గ్యాప్ టైమ్‌గా ఫిక్స్ చేసింది. బౌలింగ్ జట్టు ఈ సమయంలోపే మరుసటి ఓవర్ వేసేందుకు బౌలర్‌ను దించాలి. రెండుసార్లు నిర్దిష్ట వ్యవధి దాటితే మన్నిస్తారు. మూడోసారి ఆలస్యమైతే మాత్రం బౌలింగ్ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీగా విధిస్తారు. ఈ పరుగులు బ్యాటింగ్ టీమ్ స్కోర్‌కు యాడ్ అవుతాయి. ఫీల్డ్ అంపైర్లు స్టాప్ క్లాక్‌తో ఈ సమయాన్ని నిర్ధారిస్తారు. అహ్మదాబాద్‌లో నిన్న (నవంబర్ 21) జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో స్టాప్ క్లాక్ నిబంధన అమలుపై నిర్ణయం తీసుకున్నారు. -
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పెను సంచలనం.. 400కు పైగా స్కోర్ నమోదు
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. అర్జెంటీనా మహిళల జట్టు టీ20ల్లో అత్యధిక టీమ్ స్కోర్‌ను నమోదు చేసింది. చిలీతో నిన్న జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా రికార్డు స్థాయిలో 427 పరుగులు (వికెట్ నష్టానికి) చేసింది. పొట్టి క్రికెట్లో ఇదే అత్యధిక టీమ్ స్కోర్‌గా (పురుషులు, మహిళలు) చరిత్రకెక్కింది. గతంలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు బెహ్రయిన్ మహిళల జట్టు పేరిట ఉండేది. ఆ జట్టు 2022లో సౌదీ అరేబియాపై 318 పరుగులు చేసింది. తాజాగా ఈ రికార్డును అర్జెంటీనా బద్దలుకొట్టింది. పురుషుల క్రికెట్ విషయానికొస్తే.. అత్యధిక స్కోర్ రికార్డు నేపాల్ పేరిట ఉంది. తాజాగా జరిగిన ఏషియన్ గేమ్స్‌లో నేపాల్ టీమ్ 314 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. ఇద్దరు భారీ సెంచరీలు.. అంతర్జాతీయ టీ20ల్లో తొలిసారి అంతర్జాతీయ టీ20ల్లో తొలిసారి ఓ రేర్ ఫీట్ నమోదైంది. ఓ ఇన్నింగ్స్‌లో తొలిసారి రెండు సెంచరీలు నమోదయ్యాయి. చిలీతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా మహిళా క్రికెటర్లు లూసియా టేలర్ (84 బంతుల్లో 169; 27 ఫోర్లు), అల్బెర్టీనా గలాన్ (84 బంతుల్లో 145 నాటౌట్; 23 ఫోర్లు) భారీ శతకాలు బాదారు. వీరితో పాటు మరియా (16 బంతుల్లో 40 నాటౌట్; 7 ఫోర్లు) కూడా రాణించడంతో అర్జెంటీనా వికెట్ నష్టానికి 427 పరుగులు చేసింది. ఇంత భారీ స్కోర్ చేసినా అర్జెంటీనా ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం విశేషం. Argentina Women have registered the highest total in T20Is (Men's or Women's) with 427/1 against Chile Women and also secured an easy win against them. This surpasses the previous record of 318/1 set by Bahrain Women against Saudi Arabia Women. pic.twitter.com/BjxwpW3V9x — CricTracker (@Cricketracker) October 14, 2023 టీ20ల్లో ఐదుసార్లు.. అంతర్జాతీయ టీ20ల్లో ఓ ఇన్నింగ్స్‌లో 2 సెంచరీలు నమోదవ్వడం ఇదే తొలిసారి అయితే టీ20ల్లో మాత్రం ఈ ఫీట్ ఐదుసార్లు నమోదైంది. 2011లో మిడిల్సెక్స్తో జరిగిన మ్యాచ్‌లో గ్లోసెస్టర్‌షైర్ ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు తొలిసారి నమోదయ్యాయి. ఆతర్వాత 2016 ఐపీఎల్లో ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి సెంచరీలు చేశారు. ఆతర్వాత బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో, 2019 ఐపీఎల్లో (సన్‌రైజర్స్ ఆటగాళ్లు బెయిర్‌స్టో (114), డేవిడ్ వార్నర్ (100 నాటౌట్)), 2022లో బల్గేరియాపై ఇద్దరు చెక్ రిపబ్లిక్ ప్లేయర్లు ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేశారు. ఎక్స్‌ట్రాలు 73 పరుగులు.. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో చిలీ బౌలర్లు రికార్డు స్థాయిలో 73 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో సమర్పించుకున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో ఎక్స్‌ట్రాల రూపంలో ఇన్ని పరుగులు రావడం ఇదే తొలిసారి. టీ20ల్లో అతి భారీ విజయం.. అర్జెంటీనా మహిళల జట్టు అంతర్జాతీయ టీ20ల్లో అతి భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అర్జెంటీనా 427 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన చిలీ 63 పరుగులకే ఆలౌటై, 364 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చిలీ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. ఇద్దరు సున్నా స్కోర్లకే పరిమితమయ్యారు. కేవలం ఒక్కరు (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. చిలీ ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రాలే (29) అత్యధిక స్కోర్ కావడం విశేషం. చిలీ ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు రనౌట్లు కావడం మరో విశేషం. -
క్రికెట్ ప్రేమికులకు శుభవార్త.. ఇకపై.. ‘ఒలింపిక్స్’లో కూడా.. గ్రీన్ సిగ్నల్
Cricket's Inclusion In 2028 Los Angeles Games: క్రికెట్ ప్రేమికులకు శుభవార్త..! విశ్వ క్రీడల్లో క్రికెటర్లను చూడాలన్న అభిమానుల కల 2028లో తీరనుంది. ఇప్పటికే ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను చేర్చిన విషయం తెలిసిందే. తాజాగా.. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్‌ను చేర్చడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి ఐఓసీ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఈ విషయం గురించి ఏఓసీ అధ్యక్షుడు థామస్ బాష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ చేర్చాలన్న నిర్వాహకుల ప్రతిపాదనకు కమిటీ అంగీకారం తెలిపినట్లు ప్రకటించారు. 2028 ఒలింపిక్స్‌లో కొత్తగా చేర్చనున్న ఐదు క్రీడాంశాల్లో కూడా క్రికెట్ కూడా ఉందని వెల్లడించారు. ఆ ఐదు క్రీడల్లో ఒకటిగా క్రికెట్ కూడా కాగా ఒలింపిక్స్‌లో అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్(నాన్- కాంటాక్ట్ అమెరికన్ ఫుట్‌బాల్), స్క్వాష్, లాక్రోస్‌లతో పాటు క్రికెట్ కూడా చేర్చనున్నారు. కాగా అక్టోబరు 15 నుంచి 17 వరకు ముంబైలో ఐఓసీ సమావేశ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే ఐఓసీ సభ్యులు ముంబైకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్ రెండో రోజున థామస్ బాష్ ఈ మేరకు ప్రకటన చేశారు. తొలి అడుగు.. పసిడి పతకాలతో చరిత్ర ఇక ఇటీవల ఆసియా క్రీడలు-2023 సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి తొలిసారి క్రికెట్ జట్లను చైనాకు పంపిన విషయం తెలిసిందే. హోంగ్జూలో టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నమెంట్లో భారత మహిళల, పురుష జట్లు స్వర్ణ పతకాలు సాధించాయి. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో మహిళా జట్టు, రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని టీమిండియా ద్వితీయ శ్రేణి జట్లు ఆసియా క్రీడల్లో అడుగుపెట్టిన ఎడిషన్‌లోనే గోల్డ్ మెడల్స్ గెలిచి చరిత్ర సృష్టించాయి. కాగా క్రికెట్‌కు భారత్‌లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఒలింపిక్స్‌లో ఈ క్రీడను చేర్చడం ద్వారా నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్రసార హక్కుల రూపంలో ఆర్జించే అవకాశం ఉంది. చదవండి: WC 2011లో నేనే కెప్టెన్ అయి ఉంటే అతడిని తప్పక తీసుకునేవాడిని.. కానీ! -
టీ20ల్లో నేపాల్ బౌలర్ అత్యుత్తమ గణాంకాలు
ఏషియన్ గేమ్స్ మెన్స్ క్రికెట్ రికార్డులకు అడ్డాగా మారింది. ఈ పోటీల్లో పాల్గొంటున్న అన్ని జట్ల ఆటగాళ్లు ప్రతి మ్యాచ్‌లో ఏదో ఒక రికార్డు బద్దలు కొడుతూనే ఉన్నారు. ముఖ్యంగా నేపాల్ జట్టు ప్రస్తుత ఏషియన్ గేమ్స్‌లో రికార్డుల రారాజుగా మారింది. మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఆటగాళ్లు టీ20ల్లో ఫాస్టెస్ట్ హండ్రెడ్, ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డులతో పాటు పలు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టారు. తాజాగా మాల్దీవ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు బౌలర్ అభానష్ బొహారా టీ20ల్లో ఏడో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను 3.4 ఓవర్లలో 11 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో నేపాల్ తరఫున ఇవే అత్యుత్తమ గణాంకాలు. ఈ విభాగానికి సంబంధించి మలేషియా బౌలర్ శ్యాజ్రుల్ ఇద్రుస్ పేరిట అత్యుత్తమ గణాంకాలు ఉన్నాయి. ఇదే ఏడాది చైనాతో జరిగిన మ్యాచ్‌లో ఇద్రుస్ 4 ఓవర్లలో 8 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఏ బౌలర్ ఇద్రుస్కు ముందు 7 వికెట్లు తీయలేదు. ఇదిలా ఉంటే, ఏషియన్ గేమ్స్‌లో మాల్దీవ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ 138 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేయగా.. మాల్దీవ్స్ 19.4 ఓవర్లలో 74 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. నేపాల్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ పౌడెల్ 27 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 52 పరుగులు చేయగా.. గత మ్యాచ్‌లో టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నమోదు చేసిన కుషాల్ మల్లా మరో విధ్వంసకర ఇన్నింగ్స్ (20 బంతుల్లో 47 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడాడు. మాల్దీవ్స్ బౌలర్లలో నజ్వాన్ ఇస్మాయిల్ (4-0-17-3) ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన మాల్దీవ్స్ అభినాశ్ బొహార ధాటికి 74 పరుగులకు కుప్పకూలింది. మాల్దీవ్స్ ఇన్నింగ్స్‌లో ఘనీ (36) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ పోటీల్లో భారత్ మ్యాచ్ అక్టోబర్ 3న జరుగనుంది. -
ప్రపంచ రికార్డులు కొల్లగొట్టిన టీ20 మ్యాచ్.. ఓ వినూత్న రికార్డు నమోదు
ఏషియన్ గేమ్స్‌లో పురుషుల క్రికెట్‌కు తొలిసారి ప్రాతినిథ్యం లభించిన విషయం తెలిసిందే. ఈ క్రీడలకు ఎవరూ ఊహించని విధంగా అదిరిపోయే ఆరంభం లభించింది. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ టీ20 రికార్డులను తిరగరాసింది. మంగోలియాపై రికార్డు స్థాయిలో 273 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన నేపాల్.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక టీమ్ స్కోర్‌తో (314/3) పాటు పరుగుల పరంగా భారీ విజయం (273), ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (26).. బౌండరీలు, సిక్సర్ల రూపంలో అత్యధిక పరుగులు (14 ఫోర్లు, 26 సిక్సర్లు కలిపి మొత్తంగా 212 పరుగులు), ఫాస్టెస్ట్ ఫిఫి (దీపేంద్ర సింగ్-9 బంతుల్లో), ఫాస్టెస్ట్ హండ్రెడ్ (కుషాల్ మల్లా-34 బంతుల్లో), మూడో వికెట్‌కు అత్యధిక పార్ట్నర్షిప్ (193 పరుగులు), అత్యధిక స్ట్రయిక్‌రేట్ (దీపేంద్ర సింగ్- 520 (10 బంతుల్లో 52 పరుగులు) ఇలా పలు ప్రపంచ రికార్డులను కొల్లగొట్టింది. Dipendra Singh Airee's fastest ever fifty in T20i history: 6,6,6,6,6,2,6,6,6. - A memorable day for Nepal cricket!pic.twitter.com/ih9cvYehCi — Mufaddal Vohra (@mufaddal_vohra) September 27, 2023 పై పేర్కొన్న రికార్డులతో ఈ మ్యాచ్‌లో మరో వినూత్న రికార్డు కూడా నమోదైంది. మంగోలియా చేసిన 41 పరుగుల స్కోర్‌లో ఎక్స్‌ట్రాలే (23 పరుగులు, 16 వైడ్లు, 5 లెగ్ బైలు, 2 నోబాల్స్) టాప్ స్కోర్ కావడం. ఓ జట్టు స్కోర్‌లో 50 శాతానికి పైగా పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో రావడం టీ20 చరిత్రలో ఇదే మొదటిసారి. మంగోలియా స్కోర్‌లో 56 శాతం పరుగులు ఎక్సట్రాల రూపంలో వచ్చాయి. ఎక్స్‌ట్రాల తర్వాత మంగోలియన్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్ దవాసురెన్ జమ్యసురెన్ (10) చేశాడు. ఇతనొక్కడే మంగోలియా ఇన్నింగ్స్‌లో రెండంకెల స్కోర్ చేశాడు. మిగిలిన 10 బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. నేపాల్ బౌలర్లు కరణ్, అభినాశ్, సందీప్ లామిచ్చెన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. సోంపాల్, కుశాల్ భుర్టెల్, దీపేంద్ర సింగ్ తలో వికెట్ దక్కించకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఓపెనర్లు కుషాల్ భుర్టెల్ (19), ఆసిఫ్ షేక్ (16) విఫలం కాగా.. కుషాల్ మల్లా (50 బంతుల్లో 137 నాటౌట్; 8 ఫోర్లు, 12 సిక్సర్లు), దీపేంద్ర సింగ్ (10 బంతుల్లో 52 నాటౌట్; 8 సిక్సర్లు), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (27 బంతుల్లో 61; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి చరిత్రపుటల్లో చిరకాలం మిగిలుండిపోయే పలు రికార్డులను తమ పేరిట లిఖించుకున్నారు. -
పరుగుల సునామీ.. ఏకంగా 8 సిక్సర్లు.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. యువీ రికార్డు బ్రేక్
Dipendra Singh Fastest T20I 50: నేపాల్ ఆల్‌రౌండర్ దీపేంద్ర సింగ్ ఆరీ పరుగుల సునామీ సృష్టించాడు. మంగోలియాతో మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను చిత్తు చేశాడు. కేవలం 9 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించి చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేరిట(ఇంగ్లండ్ మీద 12 బంతుల్లో) ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఆసియా క్రీడలు -2023లో భాగంగా మెన్స్ క్రికెట్ ఈవెంట్లో నేపాల్- మంగోలియా మధ్య తొలి మ్యాచ్ జరిగింది. చైనాలోని హోంగ్జూలో జరిగిన ఈ మ్యాచ్‌లో దీపేంద్ర సింగ్ ఈ మేర సుడిగాలి అర్ధ శతకంతో మెరిశాడు. ఐదోస్థానంలో బ్యాటింగ్ దిగిన ఈ ఆల్‌రౌండర్ 10 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో ఎదుర్కొన్న తొలి ఆరు బంతుల్లోనే వరుసగా ఆరు సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గానూ చరిత్రకెక్కాడు. రెండు ఫార్మాట్లలో అద్భుత సెంచరీలు కాగా 23 ఏళ్ల దీపేంద్ర సింగ్ ఆరీ 2018లో నేపాల్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 52 వన్డేలు, 38 టీ20లు ఆడిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఆయా ఫార్మాట్లలో వరుసగా 889, 991 పరుగులు సాధించాడు. అదే విధంగా ఈ రైట్ ఆర్మ్ మీడియం పేసర్ ఖాతాలో వన్డేల్లో 36, టీ20లలో 21 వికెట్లు ఉన్నాయి. ఇక అంతర్జాతీయ వన్డేల్లో ఈ రైట్ హ్యాండ్‌బ్యాటర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 105, టీ20లలో 110 కావడం విశేషం. సంచలనాలు సృష్టించిన నేపాల్ జట్టు ఇక టీ20 చరిత్రలో బుధవారం(సెప్టెంబరు 27) సంచలన రికార్డులు నమోదయ్యాయి. ఆసియా క్రీడలు- 2023 మెన్స్ క్రికెట్ ఈవెంట్లో మంగోలియాతో మ్యాచ్‌లో నేపాల్ పలు అరుదైన ఘనతలు సాధించి చరిత్రకెక్కింది. టీ20 ఫార్మాట్లో 314 పరుగులతో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. అంతేకాదు మంగోలియాను 41 పరుగులకే ఆలౌట్ చేసి 273 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించింది. చదవండి: 34 బంతుల్లోనే సెంచరీ.. రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్ రికార్డు బద్దలు -
314 పరుగులు.. టీ20 చరిత్రలో నేపాల్ సంచలనం! ప్రపంచ రికార్డులు బద్దలు
Asian Games Mens T20I 2023- Nepal vs Mongolia: ఆసియా క్రీడలు-2023లో మెన్స్ క్రికెట్ ఈవెంట్‌కు తెరలేచింది. చైనాలోని హోంగ్జూలో నేపాల్- మంగోలియాతో బుధవారం తొలి టీ20 మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన మంగోలియా నేపాల్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు కుశాల్ భుర్తేల్ 19, వికెట్ కీపర్ ఆసిఫ్ షేక్ 16 పరుగులకే అవుట్ కావడంతో ఆరంభంలోనే నేపాల్‌కు భారీ షాక్ తగిలింది. అయితే, వన్‌డౌన్‌లో కుశాల్ మల్లా దిగగానే సీన్ రివర్స్ అయింది. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సిక్సర్ల వర్షం కురిపిస్తూ మంగోలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫాస్టెస్ట్ సెంచరీ 34 బంతుల్లోనే శతకం బాదిన అతడు.. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 137 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడేల్ 27 బంతుల్లోనే 61 పరుగులు సాధించాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన దీపేంద్ర సింగ్ ఆరీ 10 బంతుల్లో 8 సిక్సర్ల సాయంతో ఏకంగా 52 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. కుశాల్, దీపేంద్ర ఆఖరి వరకు అజేయంగా నిలవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన నేపాల్ 314 పరుగులు స్కోరు చేసింది. ప్రపంచ రికార్డులు బద్దలు తద్వారా పొట్టి ఫార్మాట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా నేపాల్ చరిత్ర సృష్టించింది. తద్వారా అఫ్గనిస్తాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. 2019లో ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో అఫ్గన్ 3 వికెట్లు నష్టపోయి 278 పరుగులు చేసింది. సిక్సర్ల జట్టుగా ఇక ఈ చరిత్రాత్మక ఇన్నింగ్స్‌తో మరో అరుదైన ఘనత కూడా ఖాతాలో వేసుకుంది నేపాల్ క్రికెట్ జట్టు. టీ20 ఫార్మాట్ హిస్టరీలో సింగిల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమ్‌గా నిలిచింది. నేపాల్ బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో ఏకంగా 26 సిక్స్‌లు బాదగా.. గతంలో అఫ్గనిస్తాన్ ఐర్లాండ్ మీద 22 సిక్స్‌లు కొట్టింది. సంచలన విజయం మంగోలియా 41 పరుగులకే ఆలౌట్ కావడంతో నేపాల్ ఏకంగా 273 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టీ20 ఫార్మాట్లో ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. చదవండి: పసికూనపై ఇంగ్లండ్ ప్రతాపం.. ఫిలిప్ సాల్ట్ విధ్వంసం.. 28 బంతుల్లోనే..! -
34 బంతుల్లోనే సెంచరీ.. రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్ రికార్డు బద్దలు
Asian Games Mens T20I 2023 - Nepal vs Mongolia: ఆసియా క్రీడలు-2023లో నేపాల్ క్రికెటర్ కుశాల్ మల్లా సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 34 బంతుల్లోనే శతకం సాధించి చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో తక్కువ బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. తద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సౌతాఫ్రికా స్టార్ డేవిడ్ మిల్లర్(35 బాల్స్ సెంచరీ) పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. మంగోలియాతో మ్యాచ్ సందర్భంగా చైనా వేదికగా బుధవారం ఈ ఫీట్ నమోదు చేశాడు. మెన్స్ క్రికెట్ ఈవెంట్ మొదలు కాగా ఆసియా క్రీడల్లో భాగంగా బుధవారం నేపాల్, మంగోలియా హొంగ్జూలోని పిన్ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్‌లో పోటీకి దిగాయి. గ్రూప్-ఏలో భాగమైన ఈ జట్ల మధ్య పోరుతో మెన్స్ టీ20 క్రికెట్ ఈవెంట్‌కు తెరలేచింది. టాస్ గెలిచిన మంగోలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నేపాల్ ఓపెనర్లు విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన కుశాల్ మల్లా 50 బంతుల్లో 137, ఐదో స్థానంలో వచ్చిన దీపేంద్ర సింగ్ ఆరీ 10 బంతుల్లో 52 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి నేపాల్ 314 పరుగులు చేసింది. చదవండి: పసికూనపై ఇంగ్లండ్ ప్రతాపం.. ఫిలిప్ సాల్ట్ విధ్వంసం.. 28 బంతుల్లోనే..! -
క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్
విండీస్‌తో నిన్న (ఆగస్ట్ 14) జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో టీమిండియా హార్డ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. 50 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్‌లో 3 సిక్సర్లు బాదిన సూర్యకుమార్.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌ను అధిగమించాడు. 50 టీ20 ఇన్నింగ్స్‌ల తర్వాత స్కై ఖాతాలో 104 సిక్సర్లు ఉండగా.. గేల్ పేరిట 103 సిక్సర్లు ఉన్నాయి. ఈ జాబితాలో విండీస్ ఆటగాడు ఎవిన్ లెవిస్ 111 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. లెవిస్, స్కై, గేల్ల తర్వాత కివీస్ కొలిన్ మున్రో (92), ఆరోన్ ఫించ్ (79) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. 50 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ స్కై నాలుగో స్థానంలో ఉన్నాడు. విండీస్‌తో ఐదో టీ20లో 45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసిన సూర్యకుమార్.. 50 ఇన్నింగ్స్‌ల అనంతరం 1841 పరుగులు చేసి ఈ విభాగంలో విరాట్ కోహ్లి (1943), బాబర్ ఆజమ్ (1942), మహ్మద్ రిజ్వాన్ (1888) తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో స్కై తర్వాత కేఎల్ రాహుల్ (1751) ఐదో స్థానంలో ఉన్నాడు. మ్యాచ్ విషయానికొస్తే.. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన ఫ్లోరిడా పిచ్‌పై బ్యాటర్ల నిర్లక్ష్యం, పసలేని బౌలింగ్ కారణంగా భారత్ ఐదో టీ20లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తిలక్ వర్మ (18 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్ (45 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ల సాయంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రొమారియో షెఫర్డ్ (4/31) భారత్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలిచింది. బ్రాండన్ కింగ్ (55 బంతుల్లో 85 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), నికోలస్ పూరన్ (35 బంతుల్లో 47; 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగారు. ఫలితంగా భారత్ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను (2-3) కూడా కోల్పోయింది. ఈ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత్.. టీ20 సిరీస్‌ను తృటిలో చేజార్చుకుంది. -
IND VS WI 5th T20: చెత్త రికార్డు మూటగట్టుకున్న చహల్
టీమిండియాతో నిన్న (ఆగస్ట్ 13) జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో విండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో విండీస్ 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమై మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను విండీస్‌కు అప్పగించింది. బ్యాటింగ్‌లో సూర్యకుమార్ (61) మినహా అందరూ చేతులెత్తేయగా.. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ (4-0-18-0) మినహా భారత బౌలర్ల ప్రదర్శన అత్యంత దారుణంగా ఉండింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓవరాక్షన్ బౌలింగ్‌తో 3 ఓవర్లలో 32 పరుగులు సమర్పించుకోగా.. అర్షదీప్ 2 ఓవర్లలో 20 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో అత్యంత పేలవమైన ప్రదర్శన కనబర్చిన ఘనత టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌కు దక్కింది. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన చహల్ ఏకంగా 51 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో ప్రత్యర్ధులు 5 సిక్సర్లు బాదారు. ఈ చెత్త గణాంకాలు నమోదు చేసే క్రమంలో చహల్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాధించుకున్న బౌలర్‌గా న్యూజిలాండ్ స్పిన్నర్ ఐష్ సోధి సరసన చేరాడు. సోధి తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో 129 సిక్సర్లు సమర్పించుకోగా.. చహల్ ఈ మ్యాచ్‌లో అతని రికార్డును సమం చేశాడు. ఈ విభాగంలో సోధి, చహల్ తర్వాత ఆదిల్ రషీద్ (119) ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన పిచ్‌పై బ్యాటర్ల నిర్లక్ష్యం, పసలేని బౌలింగ్ కారణంగా భారత్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తిలక్ వర్మ (18 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్ (45 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రొమారియో షెఫర్డ్ (4/31) భారత్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలిచింది. బ్రాండన్ కింగ్ (55 బంతుల్లో 85 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), నికోలస్ పూరన్ (35 బంతుల్లో 47; 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగారు. ఈ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత్.. టీ20 సిరీస్‌ను కోల్పోయింది. -
లంక ప్రీమియర్ లీగ్‌లో సెంచరీ.. చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్
లంక ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా గాలే టైటాన్స్‌తో ఇవాళ (ఆగస్ట్ 7) జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (59 బంతుల్లో 104; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) పొట్టి క్రికెట్లో (అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని లీగ్‌లు) అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ ఫార్మాట్లో 10 శతకాలు బాదిన రెండో బ్యాటర్ రికార్డుల్లోకెక్కాడు. Maiden LPL century for Babar Azam 👏 📸: Fan Code pic.twitter.com/S0KaiJmuAh — CricTracker (@Cricketracker) August 7, 2023 బాబర్‌కు ముందు విధ్వంకర వీరుడు, విండీస్ యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. గేల్ తన 463 మ్యాచ్‌ల టీ20 కెరీర్లో ఏకంగా 22 శతకాలు బాది ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 2005 నుంచి 2022 వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని టీ20 లీగ్‌ల్లో పాల్గొన్న గేల్ 22 సెంచరీలతో పాటు 88 హాఫ్‌సెంచరీలు బాది 14562 పరుగులు చేశాడు. Kasun Rajitha ends Babar Azam's masterclass. Colombo Strikers need a miracle to win the game. pic.twitter.com/btIUW54X9p — CricTracker (@Cricketracker) August 7, 2023 ఇందులో గేల్ 2013 ఐపీఎల్లో పూణే వారియర్స్‌పై చేసిన 175 నాటౌట్ (66 బంతుల్లో) అత్యధికంగా ఉంది. గేల్ తర్వాతి స్థానంలో ఉన్న బాబర్ 2012 నుంచి నేటి వరకు 264 టీ20లు ఆడి 10 సెంచరీలు 77 హాఫ్ సెంచరీల సాయంతో 9412 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో గేల్, బాబర్‌ల తర్వాత క్లింగర్ (206 మ్యాచ్‌ల్లో 5960 పరుగులు, 8 సెంచరీలు), డేవిడ్ వార్నర్ (11695 పరుగులు, 8 సెంచరీలు), విరాట్ కోహ్లి (11965, 8), ఆరోన్ ఫించ్ (11392, 8) తొలి ఆరు స్థానాల్లో ఉన్నారు. Meet the duo with over ten or more centuries each in T20s🥶 pic.twitter.com/Wnkl8cn2SV — CricTracker (@Cricketracker) August 7, 2023 మ్యాచ్ విషయానికొస్తే.. గాలే టైటాన్స్‌తో ఇవాళ (ఆగస్ట్ 7) జరిగిన మ్యాచ్‌లో కొలొంబో స్టయికర్స్ ఆటగాడు విశ్వరూపం ప్రదర్శించాడు. మెరుపు శతకంతో విధ్వంసం సృష్టించాడు. భారీ ఛేదనలో (189) పూనకాలు వచ్చినట్లు ఊగిపోయిన పాక్ కెప్టెన్.. ప్రత్యర్ధి బౌలర్లను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోశాడు. కేవలం 57 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ఫలితంగా కొలొంబో స్ట్రయికర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. -
ఛాన్స్‌లు ఇవ్వరంటారు.. ఇస్తే ఇలా ఆడుతావా? ఏంటి సంజూ ఇది?
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకోలేకపోతున్నాడు. వెస్టిండీస్‌తో జరగుతున్న టీ20 సిరీస్‌లో సంజూ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. విండీస్‌తో తొలి టీ20లో 12 పరుగులు చేసి విఫలమైన శాంసన్.. ఇప్పుడు రెండో టీ20లో కూడా అదే ఆటతీరును కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో 7 పరుగులు చేసిన సంజూ.. అకిల్ హోస్సేన్ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్‌కు చేరాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చి విఫలమైన శాంసన్‌పై సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది. భారత జట్టులో చోటు కోసం యువ ఆటగాళ్ల నుంచి తీవ్ర పోటీ ఉన్న సమయంలో శాంసన్ ఇటువంటి పేలవ ప్రదర్శన చేయడం సరికాదని పలువరు అభిప్రాయపడుతున్నారు. సంజూ ఇదే ఆట తీరును కనబరిస్తే జట్టులో చోటు కష్టమే అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. చదవండి: అస్సలు ఊహించలేదు.. అతడే మా కొంపముంచాడు! కొంచెం బాధ్యతగా ఆడాలి: హార్దిక్ కాగా మరి కొంతమంది "జట్టులో చోటు ఇవ్వడం లేదని బీసీసీఐను ట్రోలు చేశారు.. ఛాన్స్ ఇస్తే ఏమి చేశాడంటూ" కామెంట్లు పెడుతున్నారు. కాగా ఐపీఎల్లో 3800పైగా పరుగులు చేసిన సంజూ.. అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం పెద్దగా రాణించలేకపోతున్నాడు. ఇప్పటివరకు తన కెరీర్లో 19 టీ20 మ్యాచ్‌లు ఆడిన శాంసన్ 18.62 సగటుతో కేవలం 320 పరుగులు మాత్రమే చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది. టీ20ల్లొ శాంసన్ ఫామ్ ఎలా ఉందో.. అతడి గణాంకాలు చూస్తే మనకు తెలుస్తోంది. కాగా రెండో టీ20లో 2వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. చదవండి: World Cup 2023: ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడిపై వేటు! యువ ఆటగాళ్లు ఎంట్రీ -
క్రికెట్లో సంచలనం.. ఒకే ఓవర్లో 7 సిక్స్‌లు, 48 పరుగులు! వీడియో వైరల్
టీ20 క్రికెట్లో ఆఫ్గాన్ బ్యాటర్ సెదిఖుల్లా అటల్ సంచలనం సృష్టించాడు. ఒకే ఓవర్లో ఏకంగా 7 సిక్సర్లతో 42 పరుగులు రాబట్టి రికార్డులకెక్కాడు. ఆఫ్గానిస్తాన్ వేదికగా జరుగుతున్న కాబూల్ ప్రీమియర్ లీగ్ ఈ సంచలనానికి వేదికైంది. ఈ లీగ్‌లో షహీన్ హంటర్స్‌కు అటల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం అబాసిన్ డిఫెండర్‌తో జరిగిన మ్యాచ్‌లో అటల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హంటర్స్ ఇన్నింగ్స్ 19 ఓవర్లో వేసిన అమీర్ జజాయ్ బౌలింగ్‌లో అటల్ ఈ విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్లో జజాయ్ మొదటి బంతిని నోబాల్ వేయగా అటల్ సిక్స్‌గా మలిచాడు. ఆ తర్వాత బంతి వైడ్ ఫోరు గా వెళ్ళింది. దీనితో బంతి పడకుండానే 12 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత వేసిన 6 బంతులను అటల్ సిక్సర్లుగా మలిచాడు. దీంతో ఆ ఓవర్లో మొత్తం 48 పరుగులు వచ్చాయి. ఓవరాల్‌గా ఆ ఓవర్లో 7 సిక్సర్లు, 1 నోబాల్, 1 వైడ్ అండ్ ఫోర్ వచ్చాయి. ఓవరాల్‌గా అటల్ 56 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 118 పరుగులు చేశాడు. కాగా టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో 7 సిక్సర్లు బాదడం ఇదే తొలి సారి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జజాయ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా షాహిన్ హంటర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. 214 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అబాసిన్ డిఫెండర్స్ 18.3 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక సెదీఖుల్లా అటల్ అఫ్గానిస్థాన్ తరఫున ఏకైక టీ20 మ్యాచ్ ఆడాడు. ఈ ఏడాది మార్చిలో పాకిస్తాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. రుత్‌రాజ్ కూడా.. కాగా ఒకే ఓవర్లో 7 సిక్సర్ల కొట్టిన ఘనత అంతుకుముందు భారత యువ ఆటగాడు రుత్‌రాజ్ గైక్వాడ్ కూడా సాధించాడు. కానీ అది 50 ఓవర్ల ఫార్మాట్లో కావడం గమనార్హం. గతేడాది జయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఉత్తర ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్‌లో రుత్‌రాజ్ గైక్వాడ్ వరుసగా 7 సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు. మహారాష్ట్ర బౌలర్ శివసింగ్ వేసిన ఓవర్ లో రుతురాజ్ 7 సిక్సులు బాదాడు. తొలి ఆరు బంతులను సిక్సర్లగా మలిచిన రుతు.. ఆ ఓవర్ లో పడిన నోబాల్ ను స్టాండ్స్ లోకి పంపించాడు. 48 runs from 1 over. @Sediq_Atal26 is now in the cricketing history books. Equalled Rituraj Gaikwad's 7 sixes in an over. Poor Amir Zazai, almost escaped a heartache. This 💯 must open the doors of international cricket & leagues for Atal. 🇦🇫 #FutureStar #WorldRecord #SevenSixes pic.twitter.com/Ntt0lkZVUm — Cricket Afghanistan (@AFG_Sports) July 29, 2023 చదవండి: చాలా బాధగా ఉంది.. మా ఓటమికి కారణం అదే! అతడొక అద్భుతం: హార్దిక్ -
అంతర్జాతీయ టీ20ల్లో మహాద్భుతం.. ఓ బౌలర్‌కు 7 వికెట్లు, అన్ని క్లీన్‌బౌల్డ్‌లే..!
అంతర్జాతీయ టీ20ల్లో మహాద్భుతం చోటు చేసుకుంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ ఆసియా క్వాలిఫయర్-బి పోటీల్లో భాగంగా చైనాతో ఇవాళ (జులై 26) జరిగిన మ్యాచ్‌లో మలేసియా బౌలర్ శ్యాజ్రుల్ ఇద్రుస్ (4-1-8-7) ఏకంగా 7 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఇద్రుస్ పడగొట్టిన 7 వికెట్లు క్లీన్‌బౌల్డ్‌లే కావడం విశేషం. అంతర్జాతీయ టీ20ల్లో ఏ బౌలర్ ఇప్పటివరకు 7 వికెట్ల ఘనత సాధించలేదు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో ఓ మొయిడిన్ వేసి 8 పరుగులకు 7 వికెట్లు పడగొట్టిన ఇద్రుస్.. టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన 32 ఏళ్ల ఇద్రుస్.. తన స్వింగ్ మాయాజాలంతో పేట్రేగిపోవడంతో చైనా 11.2 ఓవర్లలో 23 పరుగులకే కుప్పకూలింది. ఇద్రుస్తో పాటు పవన్‌దీప్ సింగ్ (4-0-9-2), విజయ్ ఉన్ని (1.2-1-1-1) కూడా రాణించారు. చైనా ఇన్నింగ్స్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోగా.. ఏకంగా ఆరుగురు డకౌట్లయ్యారు. చైనా ఇన్నింగ్స్‌లో వై గులే చేసిన 7 పరుగులే అత్యధికం. అనంతరం 24 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా 4.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్వల్ప ఛేదనలో మలేసియా బ్యాటర్లు సైతం ఆరంభంలో తడబడ్డారు. ఓపెనర్లిద్దరూ డకౌట్లు అయ్యారు. వన్‌డౌన్ బ్యాటర్ షార్వీన్ సురేంద్రన్ (4 నాటౌట్), విరన్‌దీప్ సింగ్ (19 నాటౌట్) మలేసియాను విజయతీరాలకు చేర్చారు. చైనా బౌలర్లలో టియాన్ సెన్క్వన్, కెప్టెన్ వాంగ్ కీ తలో వికెట్ పడగొట్టారు. అంతర్జాతీయ టీ20ల్లో టాప్ 10 అత్యుత్తమ గణాంకాలు.. శ్యాజ్రుల్ ఇద్రుస్ (మలేసియా) (4-1-8-7) పీటర్ అహో (నైజీరియా) (3.4-1-5-6) దీపక్ చాహర్ (భారత్) (3.2-0-7-6) నక్రాని (ఉగాండ) (4-1-7-6) అజంతా మెండిస్ (శ్రీలంక) (4-2-8-6) జెజె స్మిట్ (నమీబియా) (4-1-10-6) అజంతా మెండిస్ (శ్రీలంక) (4-1-16-6) ఓబెడ్ మెక్కాయ్ (వెస్టిండీస్) (4-1-17-6) లాంగట్ (కెన్యా) (4-1-17-6) ఫెన్నెల్ (అర్జెంటీనా) (4-0-18-6) -
టీ20ల్లో బట్లర్ జమానా.. ఉతికి ఆరేస్తున్న ఇంగ్లండ్ కెప్టెన్, అత్యంత అరుదైన జాబితాలో చోటు
టీ20ల్లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ జమానా నడుస్తుంది. ఇటీవలకాలంలో పొట్టి ఫార్మాట్లో బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు తాజాగా ఓ అరుదైన క్లబ్లో చేరి రికార్డు సృష్టించాడు. టీ20ల్లో 10000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. టీ20 బ్లాస్ట్ 2023లో భాగంగా బట్లర్ ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. డెర్బీషైర్‌తో నిన్న (జూన్ 23) జరిగిన మ్యాచ్‌లో లాంకాషైర్ తరఫున బరిలోకి దిగిన బట్లర్.. 39 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బట్లర్ 10000 పరుగుల ల్యాండ్ మార్క్‌ను రీచ్ అయ్యాడు. టీ20 కెరీర్లో మొత్తం 372 మ్యాచ్‌లు ఆడిన బట్లర్.. 34.16 సగటున, 144.70 స్ట్రయిక్ రేట్‌తో 6 శతకాలు, 21 హాఫ్ సెంచరీల సాయంతో 10080 పరుగులు చేశాడు. The crowning moment 🙌 pic.twitter.com/bTAyzxz0dS — Vitality Blast (@VitalityBlast) June 23, 2023 టీ20ల్లో 10000 పరుగులు పూర్తి చేసుకున్న తొమ్మిదో ఆటగాడు.. టీ20 ఫార్మాట్లో 10000 పరుగులు సాధించిన తొమ్మిదో ఆటగాడిగా బట్లర్ రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (14562) అగ్రస్థానంలో ఉండగా.. షోయబ్ మాలిక్ (12528), కీరన్ పోలార్డ్ (12175), విరాట్ కోహ్లి (11965), డేవిడ్ వార్నర్ (11695), ఆరోన్ ఫించ్ (11392), అలెక్స్ హేల్స్ (11214), రోహిత్ శర్మ (11035) వరుసగా 2 నుంచి 8 స్థానాల్లో నిలిచారు. Jos Buttler becomes the 9th batter to complete 10,000 runs in T20. 😍#Cricket #JosButtler #England pic.twitter.com/XQ7uIwWTMH — Sportskeeda (@Sportskeeda) June 24, 2023 ఇంగ్లండ్ తరఫున రెండో ఆటగాడు.. టీ20ల్లో ఇంగ్లండ్ తరఫున 10000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా బట్లర్ రికార్డుల్లోకెక్కాడు. బట్లర్‌కు ముందు అలెక్స్ హేల్స్ (11214) ఈ ఘనత సాధించాడు. బట్లర్ తర్వాత జేమ్స్ విన్స్ (9343) టీ20ల్లో 10000 పరుగులకు చేరువలో ఉన్నాడు. Can we have 12 for that one, @VitalityBlast? 💥@liaml4893 clears a maximum over the new development! 👷♂️ Watch LIVE on #LancsTV! 💻➡️ https://t.co/mClaOSvXZ6 ⚡ #LightningStrikes pic.twitter.com/HZ1NdKIiOW — Lancashire Lightning (@lancscricket) June 23, 2023 రోహిత్ శర్మ కంటే వేగంగా.. జోస్ బట్లర్ టీ20ల్లో రోహిత్ శర్మ కంటే వేగంగా 10000 పరుగుల మార్క్‌ను రీచ్ అయ్యాడు. రోహిత్‌కు ఈ ఘనత సాధించేందుకు 362 ఇన్నింగ్స్‌లు అవసరమైతే.. బట్లర్ కేవలం 350 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అధిగమించాడు. ఓవరాల్‌గా విరాట్ కోహ్లి ఈ ఘనతను వేగంగా అధిగమించాడు. విరాట్ కేవలం 285 ఇన్నింగ్స్‌ల్లో 10000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. బట్లర్ వీరవిహారంతో లాంకాషైర్ ఘన విజయం.. డెర్బీషైర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో బట్లర్ వీరవిహారం చేయడంతో లాంకాషైర్ 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బట్లర్‌కు జతగా లవింగ్‌స్టోన్ (30 బంతుల్లో 47 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), వెల్స్ (4 బంతుల్లో 13; 2 సిక్సర్లు) రాణించడంతో లాంకాషైర్ 15 ఓవర్లలో (వర్షం కారణంగా కుదించారు) 4 వికెట్ల నష్టానికి 177 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో తడబడిన డెర్బీషైర్ 15 ఓవర్లలో 150 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. -
#RileeRossouw: అచ్చొచ్చిన స్థానం.. మించినోడు లేడు
ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రిలీ రొసౌ తొలిసారి తన బ్యాటింగ్ పవరేంటో చూపించాడు. బుధవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు బౌలర్లను చీల్చిచెండాడిన రొసౌ ఐపీఎల్లో తొలి అర్థశతకం సాధించాడు. కేవలం 37 బంతుల్లోనే ఆరు ఫోర్లు, 6 సిక్సర్లతో 82 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. అతని ధాటికి ఈ సీజన్లో ఢిల్లీ తొలిసారి 200 పరుగుల మార్క్‌ను అందుకుంది. ఇక టి20 క్రికెట్లో రిలీ రొసౌకు మూడోస్థానం బాగా అచ్చొచ్చింది. నెంబర్-3లో బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతీసారి రొసౌ పరుగులు విధ్వంసం సృష్టించాడు. ఇప్పటివరకు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 109 ఇన్నింగ్స్‌లు ఆడి 3731 పరుగులు చేశాడు. 159.71 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన రొసౌ ఖతాలో ఐదు సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉండడం విశేషం. ఇక టి20 క్రికెట్లో నెంబర్-3లో బ్యాటింగ్‌కు వచ్చి ఇన్ని శతకాలు, అత్యధిక స్ట్రైక్‌రేట్ కలిగిన బ్యాటర్లో రొసౌ మినహా ఒక్కరు లేకపోవడం గమనార్హం. 𝑭𝒆𝒕𝒄𝒉 𝒕𝒉𝒂𝒕 🚀 Rossouw bringing that Protea power in #PBKSvDC 🔥#IPLonJioCinema #EveryGameMatters #IPL2023 | @DelhiCapitals pic.twitter.com/fTVTPSAVkw — JioCinema (@JioCinema) May 17, 2023 చదవండి: అరుదైన ఘనత.. కోహ్లి,రైనా, ధావన్ సరసన -
హార్దిక్ పాండ్యా విషయంలో రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్లో ఆడుతూ బిజీగా ఉన్నాడు. గతేడాది గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్స్‌గా నిలిపి కెప్టెన్‌గా పేరు సంపాదించిన హార్దిక్ అదే టెంపోను ఈసారి కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఈ సీజన్లోనూ వరుస విజయాలతో గుజరాత్‌ను పాయింట్ల పట్టికలో మరోసారి టాప్‌లో ఉంచాడు. మరి పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి టైటిల్ కొడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ జట్టుకు దూరమైనప్పుడల్లా పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియాకు స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తూ తన సత్తా ఏంటో చాటుతున్నాడు. ముఖ్యంగా టి20 ఫార్మాట్లో హార్దిక్ కెప్టెన్సీలో టీమిండియా దూసుకెళ్తోంది. గతేడాది టి20 వరల్డ్ కప్ సెమీస్‌లో భారత్ పరాజయం చెందినప్పటి నుంచి హార్దిక్ పొట్టి ఫార్మాట్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో టి20లకు హార్దిక్‌ను రెగ్యులర్ కెప్టెన్ చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. "హార్దిక్ పాండ్యా ఇప్పటికే టి20ల్లో భారత స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఫిట్‌గా ఉన్నంత కాలం అతడే కెప్టెన్‌గా కొనసాగాలి. సెలక్టర్లు కూడా ఇదే విషయం ఆలోచిస్తున్నారనుకుంటా. ప్రస్తుతం యువకుల్లో చాల మంది ప్రతిభావంతులున్నారు. కాబట్టి కొత్త జట్టును తీసుకురావచ్చు. ఐపీఎల్లో సత్తా చాటుతున్న యువ ప్రతిభావంతులను చూస్తున్నారు. కాబట్టి బీసీసీఐ 2007లో అనుసరించిన మార్గంలోనే వెళ్తుందని అనుకుంటున్నా. అప్పుడు కూడా యువకులకు అవకాశం కల్పించారు. పాండ్యా ప్రతిభ కలిగిన ఆటగాడు. అతడి ఐడియాలు విభిన్నంగా ఉంటాయి. ఐపీఎల్లో కెప్టెన్‌గా వ్యవహరిస్తూ ఇతర ఆటగాళ్లను కూడా గమనిస్తున్నాడు. "అక్టోబరు-నవంబరులో జరగనున్న ఐసీసీ ఈవెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న తరుణంలో అతడు టెస్టు జట్టులో లేనందుకు అతడిపై ఎలాంటి వర్క్ లోడ్ ఉండదు. ఈ రోజుల్లో ఆటగాళ్లు మూడు ఫార్మాట్లు ఆడట్లేదు. టెస్టు సిరీస్ సమయంలో అతడికి ఓ నెల విశ్రాంతి దొరుకుతుంది" అని పేర్కొన్నాడు. చదవండి: సిక్సర్ల విషయంలో రోహిత్ అరుదైన రికార్డు -
ఒక్క ఓవర్లో 46 పరుగులు.. క్రికెట్ చరిత్రలో తొలిసారి
క్రికెట్లో ఒక్క ఓవర్లో సాధారణంగా అత్యధికంగా ఎన్నిపరుగులు వస్తాయంటే టక్కున వచ్చే సమాధానం 36. అది కూడా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదితే ఈ ఫీట్ నమోదవుతుంది. ఒకవేళ మరో నోబాల్.. లేదా వైడ్ వెళితే కొన్ని పరుగులు జత అవుతాయి. అది కూడా అరుదుగా జరుగుతుంది. అందుకే 36 పరుగులే ఇప్పటివరకు చాలాసార్లు అత్యధికంగా ఉంది. కానీ ఒక్క ఓవర్లో 46 పరుగులు వచ్చాయంటే మీరు నమ్ముతారా.. అంత లేదు అని తేల్చేస్తాం. కానీ ఒక్క ఓవర్లో 46 పరుగులు బాదిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. ఊహించుకోవడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అరుదైన దృశ్యం.. కువైట్ వేదికగా జరిగిన కేసీసీ ఫ్రెండ్స్ మొబైల్ టి20 ఛాంపియన్స్ ట్రోఫీ 2023లో ఇది జరిగింది. ఎన్‌సీఎమ్ ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ టాలీ సీసీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్బుతం ఆవిష్కృతమైంది. ఎన్‌సీఎమ్ బ్యాటర్ వాసు.. టాలీ సీసీ బౌలర్ హర్మన్ ఓవర్‌ను చితకబాది 46 పరుగులు రాబట్టాడు. తొలి బంతిని నోబాల్ వేయగా సిక్సర్ బాదాడు. దీంతో ఏడు పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ఫ్రీహిట్‌కు నాలుగు పరుగులు బైస్ రూపంలో వచ్చాయి. ఒక్క బంతి కరెక్ట్ వేయగా 11 పరుగులు వచ్చాయి. ఆ తర్వాతి ఐదు బంతులను ఐదు సిక్సర్లు కొట్టగా ఇందులో ఒక నోబ్ సహా మొత్తం 31 పరుగులు వచ్చాయి. దీంతో ఐదు బంతుల్లో స్కోరు 42గా మారింది. ఇక ఆఖరి బంతిని బౌండరీ రావడంతో అలా ఆరు బంతుల్లో 46 పరుగులు వచ్చాయి. క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో 46 పరుగులు రావడం ఇదే తొలిసారి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వన్డేల్లో 36.. టెస్టుల్లో 35.. టి30ల్లో 36.. ఐపీఎల్లో 37.. ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు వన్డేల్లో ఒక్క ఓవర్లో 36 పరుగులు అత్యధికంగా ఉంది. 2006లో సౌతాఫ్రికా ఓపెనర్ గిబ్స్ నెదర్లాండ్స్‌పై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదగా.. 2021లో అమెరికా బ్యాటర్ జస్కరన్ మల్హోత్రా పపువా న్యూ గినియాపై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది 36 పరుగులు రాబట్టాడు. ఇక టెస్టుల్లో 2022లో ఇంగ్లండ్‌పై టీమిండియా బౌలర్ బుమ్రా కొట్టిన 35 పరుగులు ఇప్పటివరకు ఒక్క ఓవర్లో అత్యధికంగా ఉంది. ఇక టి20ల్లో ఒక్క ఓవర్లో అత్యధిక పరుగులు రెండుసార్లు నమోదయ్యాయి. తొలిసారి 2007లో యువరాజ్ ఇంగ్లండ్‌పై 36 పరుగులు(ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు), 2021లో విండీస్ హిట్టర్ పొలార్డ్ శ్రీలంకపై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది 36 పరుగులు రాబట్టాడు. ఇక ఐపీఎల్లో ఒక్క ఓవర్లో అత్యధిక పరుగులు 37గా ఉంది. తొలిసారి 2011లో ఆర్సీబీతో మ్యాచ్‌లో కొచ్చి టస్కర్స్ బౌలర్ పి. పరమేశ్వరన్ ఒక్క ఓవర్లో 37 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత 2021లో ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ సీఎస్కేతో మ్యాచ్‌లో ఒక్క ఓవర్లో 37 పరుగులు ఇచ్చుకోవడం గమనార్హం. Getting 46 runs in an over is not possible right? Right? Wrong! Watch this absolute bonkers over now. . .#KCCT20 pic.twitter.com/PFRRivh0Ae — FanCode (@FanCode) May 3, 2023 చదవండి: గమనించారా.. మ్యాచ్‌తో పాటు పాత పగను కూడా! -
#ViratKohli: అరుదైన ఘనత.. టి20 చరిత్రలో తొలి ఆటగాడిగా
ఆర్సీబీ తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. టి20 చరిత్రలో ఒకే స్టేడియం వేదికగా 3వేల పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా బుధవారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. ఆర్సీబీకి హోంగ్రౌండ్ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోహ్లి మూడువేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతోపాటు మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటంటే.. ఐపీఎల్లో కేకేఆర్‌పై అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా కోహ్లి నిలిచాడు. కేకేఆర్‌పై ఇప్పటివరకు కోహ్లి 858 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ 1075 పరుగులతో తొలి స్థానంలో ఉండగా.. 1040 పరుగులతో రోహిత్ శర్మ రెండో స్థానంలో, 858 పరుగులతో కోహ్లి మూడో స్థానంలో, 850 పరుగులతో శిఖర్ ధావన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. King Kohli stamping his authority on #RCBvKKR #TATAIPL #IPLonJioCinema #IPL2023 | @imVkohli pic.twitter.com/pNmi5kdQaA — JioCinema (@JioCinema) April 26, 2023 Virat Kohli completed 3000 runs in Chinnaswamy in the T20 format. First player in history to score 3000 runs in a single venue in T20 pic.twitter.com/856KrGv46P — Johns. (@CricCrazyJohns) April 26, 2023 చదవండి: చెత్త ఫీల్డింగ్‌తో మూడు లైఫ్‌లు.. సిక్సర్లతో రికార్డులకెక్కాడు Virat Kohli: చరిత్రకెక్కిన కోహ్లి.. 580 రోజుల తర్వాత -
అరుదైన ఫీట్.. టీమిండియా తరపున తొమ్మిదో బౌలర్‌గా
సీఎస్కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టి20 క్రికెట్లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కెప్టెన్ సంజూ శాంసన్‌ను ఔట్ చేయడం ద్వారా జడ్డూ టి20ల్లో 200వ వికెట్(అంతర్జాతీయం సహా అన్ని మ్యాచ్‌లు కలిపి) సాధించాడు. అంతకముందే దేవదత్ పడిక్కల్‌ను ఔట్ చేసిన జడేజా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడం విశేషం. ఈ క్రమంలో టీమిండియా తరపున టి20 క్రికెట్లో 200 వికెట్లు పడగొట్టిన తొమ్మిదో బౌలర్‌గా జడేజా రికార్డులకెక్కాడు. కాగా ఈ 200 వికెట్లలో ఐపీఎల్ నుంచే జడేజాకు 139 వికెట్లు ఉండడం విశేషం. సీఎస్కే తరపున 100 వికెట్లు పడగొట్టిన బౌలర్లలో డ్వేన్ బ్రావో తర్వాత జడేజా మాత్రమే. ఇక అంతర్జాతీయంగా 51 టి20 మ్యాచ్‌లు ఆడిన జడేజా 61 వికెట్లు పడగొట్టాడు. Welcome to Jadeja Rescue Services - for two wickets, dial 8️⃣ 🤘#CSKvRR #TATAIPL #IPLonJioCinema | @ChennaiIPL @imjadeja pic.twitter.com/vqBQCQ6sgZ — JioCinema (@JioCinema) April 12, 2023 చదవండి: శాంసన్.. ప్లీజ్ ఇలాంటి రికార్డులు మనకొద్దు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
తిరుమల శ్రీవారి సేవలో మహిళా క్రికెటర్ ప్రణవి చంద్ర
సాక్షి, తిరుపతి: మహిళా క్రికెటర్ ప్రణవి చంద్ర తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కోచ్ చాముండేశ్వరినాథ్‌తోతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. అదే విధంగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. కాగా హైదరాబాద్ క్రికెట్ టీమ్‌కు ఆడుతున్న ప్రణవి చంద్ర మాట్లాడుతూ.. టీ20 క్రికెట్ లీగ్‌ల ద్వారా కొత్త వాళ్లకు మంచి అవకాశాలు వస్తాయన్నారు. ప్రతిభ నిరూపించుకుంటే.. అంతర్జాతీయ క్రికెటర్‌టగా ఎదగడానికి ఉపయోగపడుతుందని ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్‌గా రాణిస్తున్న ప్రణవి చంద్ర పేర్కొన్నారు. చదవండి: సూర్య కాదు.. ఆ ఆసీస్ బ్యాటర్ వల్లేనన్న ఆజం ఖాన్! ‘స్కై’తో నీకు పోలికేంటి? NZ Vs Eng: మరీ ఇలా కూడా అవుట్ అవుతారా? వాళ్లు అంతలా కష్టపడితే.. నీకేమో ఇంత బద్ధకమా? -
సూర్య కాదు.. అతడే నాకు స్ఫూర్తి! నిజమే.. నీకు ‘స్కై’తో పోలికేంటి?
Pakistan Super League, 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఇటీవల వార్తల్లో నిలిచాడు వికెట్ కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్. ఇస్లామాబాద్ యునైటెడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. క్వెటా గ్లాడియేటర్స్‌తో మ్యాచ్‌లో పరుగుల సునామీ సృష్టించాడు. 24 ఏళ్ల ఈ రైట్ హ్యాండర్.. 42 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 97 పరుగులు సాధించాడు. తన తండ్రి మొయిన్ ఖాన్ హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న గ్లాడియేటర్స్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించేలా ఎదురైన ఘోర పరాభవానికి కారణమయ్యాడు. ఫిబ్రవరి 24 నాటి మ్యాచ్‌లో ఇస్లామాబాద్ 220 పరుగుల భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తుపాన్ ఇన్నింగ్స్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు ఆజం ఖాన్. ఈ క్రమంలో అతడిని టీమిండియాస్టార్, టీ20 వరల్డ్ నంబర్ 1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌తో పోలుస్తూ ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో సూర్యతో పోలికపై ఆజం ఖాన్ మాత్రం భిన్నంగా స్పందించాడు. తనకు ఆస్ట్రేలియా బ్యాటర్ టిమ్ డేవిడ్ ఆదర్శమని, అతడి ఆట తీరుతో స్ఫూర్తిపొందానని చెప్పుకొచ్చాడు. సూర్య కాదు.. టిమ్ డేవిడ్.. ఎందుకంటే ఇందుకు గల కారణం వెల్లడిస్తూ.. ‘‘బ్యాటింగ్ ఆర్డర్లో నా స్థానం ఏమిటో చెప్పాల్సిన పనిలేదు. 40కి నాలుగు వికెట్లు పడిన సందర్భాల్లో బ్యాటింగ్‌కు వెళ్లి మ్యాచ్ ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ విషయంలో నేను టిమ్ డేవిడ్‌ను చూసి చాలా నేర్చుకుంటున్నా. అతడు భారీ షాట్లు ఆడతాడు. తన పాత్రను చక్కగా పోషిస్తాడు. జట్టుకు ఏం కావాలో అదే చేస్తాడు. నేను కూడా తనలాగే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాను కదా! అయితే, సూర్యకుమార్ మాత్రం ఎక్కువగా వన్‌డౌన్‌లో వస్తాడు. టాపార్డర్‌లో ఆడటానికి నా బ్యాటింగ్ పొజిషన్‌కు తేడా ఉంటుంది కదా!’’ అని ఆజం ఖాన్ పాక్‌టీవీతో పేర్కొన్నాడు. నిజమే నీకు సూర్యతో పోలికేంటి? ఇక ఆజం ఖాన్ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘నిజం చెప్పావు ఆజం ఖాన్! అయినా.. సూర్యతో నీకు పోలికేంటి? ఒక్క ఇన్నింగ్స్‌తో అందరూ చాలా ఊహించేసుకుంటున్నారు. సూర్య నంబర్ 1గా ఎదగడానికి ఎంతలా కష్టపడ్డాడో.. ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడో అతడి ఆట తీరు గమనిస్తే మీకు తెలుస్తుంది’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆజం ఖాన్ 2021లో ఇంగ్లండ్‌తో టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. ఇప్పటి వరకు మొత్తంగా 3 టీ20లు ఆడి కేవలం ఆరు పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 5. అయితే, పాకిస్తాన్ సూపర్‌లీగ్‌లో మాత్రం రాణిస్తున్నాడు. చదవండి: NZ Vs Eng: మరీ ఇలా కూడా అవుట్ అవుతారా? వాళ్లు అంతలా కష్టపడితే.. నీకేమో ఇంత బద్ధకమా? Shaheen Afridi: తొలి బంతికి బ్యాట్ రెండు ముక్కలైంది.. రెండో బంతికి వికెట్ ఎగిరిపడింది Asif aur Azam ka kamaal 🪄 Just stand and admire. #SabSitarayHumaray l #HBLPSL8 l #QGvIU pic.twitter.com/6zrlpJpM7Z — PakistanSuperLeague (@thePSLt20) February 24, 2023 -
ఆర్సీబీ కెప్టెన్‌గా స్మృతి మంధాన
వచ్చే నెలలో ముంబైలో జరిగే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో పాల్గొనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధానను నియమించారు. భారత జట్టు వైస్ కెప్టెన్ అయిన స్మృతిపై ఇటీవల జరిగిన వేలం కార్యక్రమంలో ఆర్సీబీ రూ. 3 కోట్ల 40 లక్షలు వెచ్చించి జట్టులోకి తీసుకుంది. స్మృతికి ఆర్సీబీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పురుషుల ఐపీఎల్ టోర్నీలో ఆర్సీబీ కెప్టెన్‌గా ఉన్న డు ప్లెసిస్, మాజీ సారథి విరాట్ కోహ్లి ట్విటర్లో ప్రకటించడం విశేషం. -
రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్
Aaron Finch Retirement: కెప్టెన్‌గా ఆస్ట్రేలియాకు తొలి టీ20 వరల్డ్‌కప్ అందించిన స్టార్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఇదివరకే టెస్ట్, వన్డేలకు గుడ్‌బై చెప్పిన ఫించ్.. పొట్టి ఫార్మాట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటన విడుదల చేశాడు. 2024 టీ20 ప్రపంచకప్ వరకు కెరీర్‌ను కొనసాగించలేనని తెలిసే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు ఫించ్ వెల్లడించాడు. కెరీర్ ఆసాంతం తనకు మద్దతుగా నిలిచిన క్రికెట్ ఆస్ట్రేలియాకు, సహచరులకు, సహాయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు. కెరీర్ ఎత్తుపల్లాల్లో తనకు అండగా నిలిచిన కుటుంబానికి, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. 2015 వన్డే ప్రపంచకప్, 2021లో టీ20 ప్రపంచకప్ గెలవడం తనకు చిరకాలం గుర్తుండిపోతుందని రిటైర్మెంట్ ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా, ఫించ్ సారధ్యంలో ఆసీస్ 2021 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా తరఫున 5 టెస్ట్‌లు, 146 వన్డేలు, 103 టీ20లు ఆడిన ఫించ్.. 17 వన్డే సెంచరీలు, 2 టీ20 సెంచరీలు, 2 టెస్ట్ ఫిఫ్టీలు, 30 వన్డే ఫిఫ్టీలు, 19 టీ20 ఫిఫ్టీల సాయంతో 278 టెస్ట్ పరుగులు, 5406 వన్డే పరుగులు, 3120 టీ20 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు (172) ఫించ్ పేరిటే ఉంది. ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సమయంలో ఫించ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఫించ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ దేశవాలీ, క్లబ్, ఇతరత్రా లీగ్‌లకు అందుబాటులో ఉంటాడు. భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. -
వన్డేల్లో హిట్.. టీ20ల్లో ఫట్! గిల్‌కు ఏమైంది?
Shubman Gill In T20Is: టెస్టు, వన్డేల్లో అదరగొడుతున్న టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ .. టీ20ల్లో మాత్రం తనదైన మార్క్ చూపించడంలో విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఐదు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన గిల్ 15.2 సగటుతో కేవలం 72 పరుగులు మాత్రమే సాధించాడు. అందులో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 46 పరుగులు. గతేడాది ఆఖర్లో శ్రీలంకపై టీ20ల్లో గిల్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. మారని తీరు తొలి మ్యాచ్‌లోనే శుబ్‌మన్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ నిరాశపరిచాడు. ఇక తాజాగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టులో భాగంగా ఉన్న గిల్ అదే తీరును కొనసాగిస్తున్నాడు. సెట్ అవ్వడు! ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 2 మ్యాచ్‌లు ఆడిన గిల్ కేవలం 18 పరుగులు చేశాడు. రాంఛీ వేదికగా జరిగిన తొలి టీ20లో 7 పరుగులు చేసిన శుబ్‌మన్.. లక్నోలో జరిగిన రెండో టీ20లో 11 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో గిల్ కేవలం టెస్టులకు, వన్డేలకు మాత్రమే సెట్ అవుతాడని, టీ20లకు సరిపోడని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. పృథ్వీ షాను తీసుకురండి మరి కొంత మంది టీ20ల్లో గిల్ స్థానంలో మరో యువ ఓపెనర్ పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇక అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మూడో టీ20కు గిల్‌ను పక్కన పెట్టే అవకాశం ఉంది. అతడి స్థానంలో పృథ్వీ షా తుది జట్టులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా న్యూజిలాండ్ భారత మధ్య కీలకమైన మూడో టీ20 ఫిబ్రవరి1న జరగనుంది. చదవండి: ENG vs SA 2nd ODI: ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం.. సిరీస్ సొంతం -
అభిమానులనుద్దేశించి సూర్యకుమార్ ఎమోషనల్ పోస్టు
టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ బుధవారం ఐసీసీ మెన్స్ టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. గతేడాది అత్యద్భుత ప్రదర్శన కనబరిచినందుకుగానూ సూర్యకు ఈ అవార్డు లభించింది. 2022లో ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్య.. 31 మ్యాచ్‌లు ఆడి 187.43 స్ట్రైక్‌రేటుతో 1164 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, తొమ్మిది అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే తనకు అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేసిన సూర్యకుమార్ తన ఆనందాన్ని అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ''ఇది నమ్మశక్యంగా లేదు. నేను ఐసీసీ మెన్స్ టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికవుతానని ఊహించలేదు. కానీ నా ప్రదర్శనతోనే అవార్డు రావడం సంతోషం కలిగించింది. ఇన్నాళ్లు మీరిచ్చిన ప్రోత్సాహం, మద్దతుకు మీకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. నా జర్నీలో భాగమైన ప్రతీ ఒక్కరికి ఈ అవార్డు అంకితం. నా కోచ్, ఫ్యామిలీ, స్నేహితులు, జట్టు సభ్యులు.. ప్రియమైన అభిమానులు మీరంతా నన్ను నడిపిస్తున్న డ్రైవింగ్ ఫోర్స్. గతేడాది మీ నుంచి ఆశీర్వాదాలు అందుకోవడంతో పాటు కొన్ని మరిచిపోలేని అనుభూతులు సంపాదించాను. అందులో టి20 క్రికెట్లో దేశం తరపున తొలి శతకం బాదడం మంచి ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఏడాది చివర్లో కొన్ని విలువైన పాఠాలు నేర్చుకున్నా. అందులో అతి ముఖ్యమైనది ఏంటంటే.. కష్టపడేతత్వం, నిజాయితీ. 2022 ఏడాది ఇచ్చిన ఆనందాన్ని నెమరువేసుకుంటూ మరో ఏడాదిలోకి అడుగుపెట్టా. ఈ ఏడాది కూడా నా ఆటతీరుతో మరింత సాధించాలనుకుంటున్నా. అందుకు మీ మద్దతు అవసరం. సరే మరి ఇక మైదానంలో కలుద్దాం'' అంటూ పేర్కొన్నాడు. 𝙏𝙝𝙖𝙣𝙠𝙛𝙪𝙡. 𝙂𝙧𝙖𝙩𝙚𝙛𝙪𝙡. 𝘽𝙡𝙚𝙨𝙨𝙚𝙙. ♥️ pic.twitter.com/eV4n2r5pyG — Surya Kumar Yadav (@surya_14kumar) January 25, 2023 చదవండి: ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా టీమిండియా స్టార్ -
రషీద్ ఖాన్ అరుదైన ఘనత.. టీ20ల్లో 500 వికెట్లు
పొట్టి ఫార్మాట్లో ఆఫ్ఘనిస్తాన్ సారధి, ఈ తరంలో ప్రపంచంలోనే మేటి స్పిన్నర్‌గా పేరొందిన రషీద్ ఖాన్ ఓ అరుదైన ఘనతను సాధించాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ జట్టుకు సారధ్యం వహిస్తున్న ఇతను.. నిన్న (జనవరి 23) ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (4-0-16-3) 3 వికెట్లు పడగొట్టడం ద్వారా టీ20 ఫార్మాట్లో (ఓవరాల్‌గా) 500 వికెట్ల మైలురాయిని చేరుకున్న రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 24 ఏళ్ల రషీద్ ఖాన్.. ఈ ఫీట్‌ను 371 టీ20 మ్యాచ్‌ల్లో సాధించాడు. The moment he reached 500 wickets 💙#MICTvPC #MICapeTown #OneFamily @rashidkhan_19 pic.twitter.com/MzWTMdqC5D — MI Cape Town (@MICapeTown) January 23, 2023 పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన రికార్డు విండీస్ వెటరన్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో పేరిట ఉంది. బ్రావో.. 500 వికెట్ల మైలరాయిని చేరుకునేందుకు 458 మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం ఈ విండీస్ వీరుడి ఖాతాలో 614 వికెట్లు ఉన్నాయి. రషీద్ అత్యంత పిన్న వయసులో, అతి తక్కువ మ్యాచ్‌ల్లో ఈ ఫీట్‌ను సాధించడంతో మున్ముందు 1000, 1500 వికెట్లు సునయాసంగా సాధిస్తాడని క్రికెట్ ఫాలోవర్స్ అభిప్రాయపడుతున్నారు. రషీద్ ప్రస్తుతం ఐపీఎల్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అన్ని టీ20 లీగ్‌ల్లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్, జోఫ్రా ఆర్చర్ (3/37), ఓడియన్ స్మిత్ (2/27) బంతితో రాణించినప్పటికీ.. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌లో చేతులెత్తేయడంతో 52 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ప్రిటోరియా క్యాపిటల్స్ తరఫున విల్ జాక్స్ (62) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఎంఐ కేప్‌టౌన్ తరఫున బేబీ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ (46) ఓ మోస్తరుగా రాణించాడు. ప్రిటోరియా బౌలర్లలో వేన్ పార్నెల్, అన్రిచ్ నోర్జే తలో 3 వికెట్లు పడగొట్టగా.. ఆదిల్ రషీద్ 2, ఈథన్ బోష్, విల్ జాక్స్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. -
చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు సొంతం
ICC T20 Rankings: టీమిండియా డాషింగ్ బ్యాటర్, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ టీ20 క్రికెట్లో భారత్ తరఫున ఎవరికీ సాధ్యం కాని అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో 908 రేటింగ్ పాయింట్స్ సాధించి, పొట్టి ఫార్మాట్లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్న స్కై.. 900 అంతకంటే ఎక్కువ రేటింగ్ పాయింట్స్ సాధించిన మొట్టమొదటి భారత ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో 45 బంతుల్లోనే విధ్వంసకర శతకం బాదిన సూర్యకుమార్.. తొలిసారి 900 రేటింగ్ పాయింట్స్ మార్కును తాకి, టీ20 ర్యాంకింగ్స్‌లో ఎవరికీ అంతనంత ఎత్తుకు దూసుకెళ్లాడు. టీ20 ర్యాంకింగ్స్ చరిత్రలో గతంలో డేవిడ్ మలాన్, ఆరోన్ ఫించ్‌లు మాత్రమే 900 రేటింగ్ పాయింట్స్‌ను సాధించగా.. తాజాగా స్కై వీరిద్దరి సరసన చేరాడు. తాజా ర్యాంకింగ్స్‌లో స్కై తర్వాత అల్లంత దూరాన పాకిస్తాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. రిజ్వాన్.. 836 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత డెవాన్ కాన్వే, బాబర్ ఆజమ్, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మలాన్, గ్లెన్ ఫిలిప్స్, రిలీ రొస్సో, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్ వరుసగా 3 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి 631 రేటింగ్ పాయింట్స్‌తో 13వ ప్లేస్‌లో నిలిచాడు. టాప్-20లో టీమిండియా తరఫున స్కై, విరాట్లు మాత్రమే ఉన్నారు. కాగా, లంకపై మూడో టీ20లో మెరుపు శతకం బాదిన సూర్యకుమార్‌కు అదే జట్టుతో జరిగిన తొలి వన్డేలో చోటు దక్కకపోవడం విశేషం. ఇప్పటివరకు 45 టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్య.. 46.41 సగటున 180.34 స్ట్రయిక్ రేట్‌తో 1578 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే టీమిండియా తరఫున 16 వన్డేలు ఆడిన స్కై.. 32 సగటున, 100.5 స్ట్రయిక్ రేట్‌తో 384 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. -
టీ20ల్లో కోహ్లి, రోహిత్‌ల శకం ముగిసినట్లే..!
పుణే: వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కోసం జట్టును తీర్చిదిద్దే పనిలో ఉన్నామని, కుర్రాళ్ల ప్రదర్శన విషయంలో కాస్త సహనం ప్రదర్శించాలని భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. యువ ఆటగాళ్లకు మరింత అనుభవం కావాలని అతను అభిప్రాయం వ్యక్తం చేశాడు. గురువారం శ్రీలంక చేతిలో 16 పరుగుల తేడాతో భారత్ ఓడిన తర్వాత ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు. ‘భారత జట్టులోని కుర్రాళ్లలో మంచి ప్రతిభ ఉంది. అయితే ఇంకా నేర్చుకునే దశలో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో ఆడుతూ ఉంటేనే నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అందుకే వారి విషయంలో మనం కాస్త ఓపిక ప్రదర్శించాలి. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కోసమే ఈ టీమ్‌ను సిద్ధం చేస్తున్నాం. వరల్డ్ కప్ సెమీ ఫైనల్ ఆడిన టీమ్‌తో పోలిస్తే జట్టులో చాలా మారింది. ముగ్గురు, నలుగురు మాత్రమే ప్రస్తుత తుది జట్టులో ఉన్నారు’ అని ద్రవిడ్ చెప్పాడు. ఈ వ్యాఖ్యతో టీ20 క్రికెట్లో కోహ్లి, రోహిత్ శర్మవంటి సీనియర్ల ఆట ముగిసిందని ద్రవిడ్ పరోక్షంగా చెప్పినట్లయింది. ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్‌పైనే అందరి దృష్టీ ఉంటుంది కాబట్టి కొత్త కుర్రాళ్లకు టి20ల్లో అవకాశం ఇచ్చేందుకు ఇదే సరైన సమయంగా ద్రవిడ్ భావిస్తున్నాడు. ‘వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్, వన్డే వరల్డ్ కప్‌ల గురించి అంతా ఆలోచిస్తున్నారు. అందుకే ఈ ఫార్మాట్లో కొత్తవారికి అవకాశాలు అవసరం. వారికి తగినన్ని మ్యాచ్‌లు ఇచ్చి అండగా నిలవడం అవసరం. కుర్రాళ్లు ఉన్న టీమ్‌లకు ఇలాంటి మ్యాచ్‌లలో ఓటములు సహజమని అర్థం చేసుకోవాలి’ అని ద్రవిడ్ స్పష్టం చేశాడు. -
అద్భుత ప్రదర్శన.. ప్రతిష్టాత్మక అవార్డు రేసులో స్మృతి మంధాన
ICC T20 Cricketer Of The Year Award: మహిళల విభాగంలో గతేడాది ‘టి20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు నామినేట్ అయిన భారత ఓపెనర్ స్మృతి మంధాన ఈ ఏడాదీ రేసులో నిలిచింది. తాజా 2022 తుది జాబితాలో నిదా దార్ (పాకిస్తాన్), సోఫీ డివైన్ (న్యూజిలాండ్), తాహ్లియా మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా)లతో స్మృతి పోటీ పడుతుంది. ఈ ఏడాది స్మృతి 23 బంతుల్లో ఫిఫ్టీ సాధించడంతో వేగవంతమైన అర్ధసెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా ఘనత వహించింది. ఈ సీజన్లోనూ తన జోరును కొనసాగించిన ఆమె ఈ ఫార్మాట్ కెరీర్లో 2500 పరుగుల్ని పూర్తి చేసుకుంది. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్, టి20 ఆసియా కప్ ఈవెంట్లలోనూ మెరుపులు మెరిపించింది. ఇటీవల ఆస్ట్రేలియా అమ్మాయిలతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో సూపర్ ఓవర్ విజయాన్ని అందించింది. ముందుగా 188 పరుగుల లక్ష్యఛేదనలో మంధాన (49 బంతుల్లో 79) మెరుపు ఆరంభం వల్లే ఆసీస్ 187 స్కోరును భారత్ సమం చేయగలిగింది. సూపర్ ఓవర్లోనూ కీలకమైన 13 (4, 6, 3) పరుగుల వల్లే భారత్ 20/1 స్కోరు చేసింది. తర్వాత ఆసీస్ 16/1 స్కోరుకే పరిమితమైంది. ఇక పురుషుల టీ20 క్రికెట్ విభాగంలో డాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఈ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో నిలిచాడు. చదవండి: Rest in Power- ‘King’ Pele: అల్విదా కింగ్.. పీలే రాకముందు అసలు ఫుట్‌బాల్ అంటే కేవలం.. Rishabh Pant: క్రికెటర్ రిషభ్ పంత్‌కు ఘోర ప్రమాదం.. తీవ్ర గాయాలు ICC Award: టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో సూర్య -
కోహ్లి తప్పుకున్నాడు సరే.. రోహిత్, రాహుల్ సంగతేంటి?
టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి.. కొంతకాలం టి20 క్రికెట్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంకతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు కోహ్లి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు బీసీసీఐ వర్గం ఒక ప్రకటనలో తెలిపింది. టి20లకు దూరంగా ఉండనున్న కోహ్లి వన్డేలు, టెస్టులకు మాత్రం అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడని తెలిపారు. ఇది కోహ్లి తనకు తానుగా తీసుకున్న నిర్ణయమని.. ఎవరి బలవంతం లేదని స్పష్టం చేశారు. ఈ లెక్కన ఐపీఎల్ 2023 ప్రారంభమయ్యే వరకు కోహ్లి టి20లు ఆడడని అర్థమవుతుంది. ఐపీఎల్‌కు ముందు టీమిండియా ఆరు టి20 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ఇదే విషయమై బీసీసీఐ అధికారి ఒకరు స్పందించారు. "అవును, టి20లకు అందుబాటులో ఉండనని కోహ్లి చెప్పాడు. వన్డే సిరీస్‌కు అతడు తిరిగి వస్తాడు. అయితే టి20ల నుంచి కొన్నాళ్లపాటు బ్రేక్ తీసుకుంటున్నాడా అన్న విషయం మాత్రం ఇంకా తెలియదు. అయితే ముఖ్యమైన సిరీస్‌లకు మాత్రం అతని పేరును పరిశీలనలో ఉంటుంది. రోహిత్ విషయానికి వస్తే అతని గాయంపై తొందరపడదలచుకోలేదు. అతడు ఫిట్‌గా ఉన్నాడా లేదా రానున్న రోజుల్లో నిర్ణయిస్తాం. అతడు బ్యాటింగ్ చేస్తున్నాడు కానీ రిస్క్ తీసుకోలేం" అని వెల్లడించారు. ఇక టి20 వరల్డ్‌కప్‌లో టీమిండియా వైఫల్యం తర్వాత సీనియర్లను పొట్టి ఫార్మాట్ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చాయి. అయితే ఈ ఏడాది జరిగిన టి20 వరల్డ్‌కప్‌లో టీమిండియా తరపున టాప్ స్కోరర్ విరాట్ కోహ్లియే కావడం విశేషం. మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికి కోహ్లి టి20ల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయంపై మిశ్రమ స్పందన వచ్చింది. ఫాంలో ఉన్న కోహ్లినే పొట్టి ఫార్మాట్ నుంచి బ్రేక్ తీసుకోవాలని చూస్తుంటే.. అసలు ఫామ్‌లో లేని కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లు కూడా తమకు తాముగా తప్పుకుంటే బాగుంటదని చాలా మంది అభిమానులు అభిప్రాయపడ్డారు. శ్రీలంకతో జరగబోయే మూడు టీ20ల సిరీస్‌కు కోహ్లి దూరం కానున్నాడు. మళ్లీ అదే టీమ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు మాత్రం తిరిగి రానున్నాడు. కోహ్లితోపాటు రాహుల్, రోహిత్ కూడా టి20 సిరీస్ వరకు బ్రేక్‌నిచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే గాయపడిన రోహిత్ శర్మ జనవరి 10 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించాలని చూస్తున్నాడు. శ్రీలంకతో సిరీస్ కోసం జట్టు ఎంపిక బుధవారం జరిగే అవకాశం ఉంది. ఇక శ్రీలంకతో టి20 సిరీస్ జనవరి 3న ముంబైలో మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జనవరి 5న పుణెలో రెండో టీ20, జనవరి 7న రాజ్‌కోట్‌లో మూడో టీ20 జరుగుతాయి. ఆ తర్వాత జనవరి 10, 12, 15 తేదీల్లో గువాహటి, కోల్‌కతా, త్రివేండ్రంలలో మూడు వన్డేలు జరుగుతాయి. చదవండి: దెబ్బ అదుర్స్.. ఒక్క ఇన్నింగ్స్‌తో అన్నింటికి చెక్ ఘోర అవమానం.. బోరుమన్న రమీజ్ రాజా -
సూర్యకుమార్ యాదవ్.. ఈ ఏడాది టీ20ల్లో ప్రకంపనలు సృష్టించిన డైనమైట్
Year Ender 2022: పొట్టి క్రికెట్లో మునుపెన్నడూ లభించని మజా 2022లో దొరికిందనడం అతిశయోక్తి కాదు. టీ20 ఫార్మాట్లో ఈ ఏడాది జరిగిన అన్ని మ్యాచ్‌లు క్రికెట్ ప్రేమికుల ఊహలకు మించిన కనువిందు కలిగించాయని అనడం కాదనలేని సత్యం. ముఖ్యంగా ఈ ఏడాది చివర్లో జరిగిన ఆసియా కప్, టీ20 వరల్డ్‌కప్ టోర్నీలు ప్రేక్షకులను తారా స్థాయిలో రంజింపజేశాయి. నరాలు తెగే ఉత్కంఠ నడుమ హోరాహోరీగా సాగిన ఈ సమరాల్లో సహజంగానే బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగింది. పొట్టి ఫార్మాట్లో బౌలర్లపై ఆనవాయితీగా కొనసాగుతున్న బ్యాటర్ల ఆధిపత్యం ఈ ఏడాది మరింత పెరిగిందనే చెప్పాలి. దాదాపు అన్ని దేశాలకు చెందిన కీలక ఆటగాళ్లు.. తమ విధ్వంసకర బ్యాటింగ్ విన్యాసాలతో పూనకాలు వచ్చినట్లు ఊగిపోయారు. వీరి ధాటికి బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఈ ఏడాది బౌలర్ల పాలిట సింహస్వప్నంలా నిలిచిన బ్యాటర్ల జాబితాలో టీమిండియా విధ్వంసకర ఆటగాడు, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ముందువరుసలో ఉన్నాడు. స్కై.. ఈ ఏడాది టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లో పూనకం వచ్చిన వాడిలా ఊగిపోయి ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మైదానం నలుమూలలా షాట్లు ఆడి మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ బిరుదుకు న్యాయం చేశాడు. ఈ ఏడాది టీ20ల్లో స్కై ఆడిన కొన్ని షాట్లు చూసి విశ్లేషకులు నివ్వెరపోయారు. స్కై.. తొలి 360 డిగ్రీస్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్‌కు ఏమాత్రం తీసిపోడని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ఏడాది మొత్తం 31 టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్.. 46.56 సగటున, 187.43 స్ట్రయిక్ రేట్‌తో 1164 పరుగులు సాధించాడు. ఇందులో 2 శతకాలు, 9 అర్ధశతకాలు ఉన్నాయి. 32 ఏళ్ల సూర్యకుమార్ ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగుల (1164) వీరుడిగా, అత్యధిక సిక్సర్లు (98) బాదిన ధీరుడిగా కొనసాగుతున్నాడు. ఓవరాల్‌గా 42 టీ20లు ఆడిన స్కై.. 44 సగటున, 181 స్ట్రయిక్ రేట్‌తో 1408 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా సూర్య టీ20 కెరీర్లో 2 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ గణాంకాలే కాకుండా సూర్య ఈ ఏడాది టీ20ల్లో ఎన్నో రికార్డులు, మరెన్నో రివార్డులు, అంతకుమించిన అవార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. జట్టులోకి వచ్చిన అనతికాలంలోనే (2021లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ) ఆకాశమంత ఎత్తు ఎదిగిన సూర్యకుమార్.. ఈ ఏడాది టీమిండియాకు లభించిన ఆణిముత్యమని యావత్ క్రీడాప్రపంచం వేనోళ్లతో కొనియాడుతుంది. ఈ ఏడాది టీ20ల్లో సూర్యకుమార్ గణాంకాలు.. - వెస్టిండీస్‌తో 7 టీ20లు ఆడిన స్కై.. 179.25 స్ట్రయిక్ రేట్‌తో 242 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. - శ్రీలంకతో ఒక టీ20 ఆడిన స్కై.. 117.24 స్ట్రయిక్ రేట్‌తో 34 పరుగులు చేశాడు. - సౌతాఫ్రికాతో 4 టీ20లు ఆడిన స్కై.. 185.14 స్ట్రయిక్ రేట్‌తో 187 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. - ఐర్లాండ్‌తో 2 టీ20లు ఆడిన స్కై.. 250 స్ట్రయిక్ రేట్‌తో 15 పరుగులు చేశాడు. - ఇంగ్లండ్‌తో 4 టీ20లు ఆడిన స్కై.. 180.14 స్ట్రయిక్ రేట్‌తో 185 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉంది. - ఆస్ట్రేలియాతో 3 టీ20లు ఆడిన స్కై.. 185.48 స్ట్రయిక్ రేట్‌తో 115 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధసెంచరీ ఉంది. - న్యూజిలాండ్‌తో 2 టీ20లు ఆడిన స్కై.. 124 పరుగులు చేశాడు. ఇందులో ఓ విధ్వంసకర సెంచరీ ఉంది. - బంగ్లాదేశ్‌తో ఒక టీ20 ఆడిన స్కై.. 185.50 స్ట్రయిక్ రేట్‌తో 30 పరుగులు చేశాడు. - ఆఫ్ఘనిస్తాన్‌తో ఒక టీ20 ఆడిన స్కై.. 300 స్ట్రయిక్ రేట్‌తో 6 పరుగులు చేశాడు. - హాంగ్‌కాంగ్‌తో ఒక టీ20 ఆడిన స్కై.. 261.53 స్ట్రయిక్ రేట్‌తో 63 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధసెంచరీ ఉంది. - నెదర్లాండ్స్‌తో ఒక టీ20 ఆడిన స్కై.. 204 స్ట్రయిక్ రేట్‌తో 51 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధసెంచరీ ఉంది. - పాకిస్తాన్‌తో 3 టీ20లు ఆడిన స్కై.. 123.91 స్ట్రయిక్ రేట్‌తో 46 పరుగులు చేశాడు. - జింబాబ్వేతో ఓ టీ20 ఆడిన స్కై.. 244 స్ట్రయిక్ రేట్‌తో 61 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధసెంచరీ ఉంది. టీ20 వరల్డ్‌కప్-2022లో సూర్యకుమార్.. - 6 మ్యాచ్‌లు ఆడిన స్కై.. 189.68 స్ట్రయిక్ రేట్‌తో 239 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. సూర్య.. ఈ మెగా టోర్నీలో మూడో అత్యధిక రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసియా కప్-2022లో సూర్యకుమార్.. - 5 మ్యాచ్‌లు ఆడిన స్కై.. 163.52 స్ట్రయిక్ రేట్‌తో 139 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. ఈ గణాంకాలతో పాటు సూర్యకుమార్ టీ20 ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అనతి కాలంతో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా సూర్యకుమార్ రికార్డుల్లోకెక్కాడు. -
రానున్న పదేళ్లలో టీ20 క్రికెట్లో పంత్‌దే హవా: భారత మాజీ బ్యాటర్
Rishabh Pant- T20 Cricket: టీమిండియా యువ బ్యాటర్ రిషభ్ పంత్‌ను ఉద్దేశించి మాజీ వికెట్ కీపర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పొట్టి ఫార్మాట్లో రానున్న పదేళ్లలో భారత జట్టులో అతడు కీలక ఆటగాడిగా ఎదుగుతాడని అభిప్రాయపడ్డాడు. టాపార్డర్‌లో పంత్‌ను ఆడిస్తే ఉపయోగకరంగా ఉంటుందని.. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా అతడి సొంతమని వ్యాఖ్యానించాడు. డీకే రాకతో పక్కకు పంత్! కాగా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ పునరాగమనం నేపథ్యంలో ఇటీవలి కాలంలో ముఖ్యంగా ప్రపంచకప్-2022 టోర్నీలో పంత్‌కు అవకాశాలు సన్నగిల్లాయి. అనువజ్ఞుడైన డీకే వైపు మొగ్గు చూపిన యాజమాన్యం పంత్‌ను కాదని అతడికి వరుస అవకాశాలు ఇచ్చింది. కేవలం తొమ్మిది పరుగులే ఈ క్రమంలో ఐసీసీ ఈవెంట్లో కేవలం రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కించుకున్న రిషభ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో మూడు పరుగులు, ఇంగ్లండ్‌తో రెండో సెమీ ఫైనల్లో 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో పంత్ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీ20 జట్టుకు పంత్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి కీలక ఆటగాళ్ల గైర్హాజరీ నేపథ్యంలో యువ జట్టు కివీస్‌తో పోటీ పడనుంది. రానున్న పదేళ్లలో అతడిదే హవా! ఈ నేపథ్యంలో స్పోర్ట్స్‌కీడాతో ముచ్చటించిన రాబిన్ ఊతప్ప టీ20లలో పంత్ భవిష్యత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రిషభ్ పంత్ ఓపెనర్‌గా రావాలి. పంత్ టాపార్డర్‌లోనే మెరుగ్గా రాణించగలడు. టీ20 క్రికెట్లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరచగలడు. తను మ్యాచ్ విన్నర్. గేమ్ చేంజర్. ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించగల సత్తా ఉన్నవాడు. రానున్న పదేళ్లలో భారత టీ20 జట్టులో అతడు అత్యంత కీలక ప్లేయర్‌గా ఎదుగుతాడు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఎడతెరిపి లేని వర్షం కారణంగా భారత్- న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన తొలి టీ20 రద్దైంది. చదవండి: Naseem Shah: అన్న అడుగు పడింది.. ఇప్పుడు తమ్ముడి వంతు ఐపీఎల్లో కప్ సాధిస్తే.. టీమిండియా కెప్టెన్ చేయాలా? ఇదెక్కడి రూల్! అలా అయితే.. -
వికెట్ల ముందే ఆడాలని రూల్ లేదు.. అందుకే వెనకాల
సాధారణంగా క్రికెట్లో ఏ బ్యాటర్ అయినా సరే క్రీజులోకి వస్తే వికెట్ల ముందు నిలబడి స్ట్రైక్ తీసుకోవడం ఆనవాయితీ. అయితే వికెట్ల ముందు నిలబడే ఆడాలని ఎక్కడా రూల్ లేదు. వికెట్ల వెనకాల వెళ్లి కూడా బ్యాటింగ్ చేయొచ్చు. కానీ అలా చేస్తే బాగోదు గనుక ఎవరు ఆ పని చేయరు. అయితే తాజాగా మాత్రం ఇండియన్ క్లబ్ క్రికెట్లో మ్యాచ్‌లో ఒక బ్యాటర్ స్టంప్స్ వెనకాల నిలబడ్డాడు. బౌలర్ బంతి విడుదల చేయగానే వికెట్ల ముందుకొచ్చి ఎక్స్ట్రా కవర్స్ మీదుగా భారీ సిక్సర్ సందించాడు. అతను కొట్టిన సిక్సర్ హైలైట్ అనుకుంటే.. అతను బ్యాటింగ్ చేసిన తీరు ఇంకా హైలైట్‌గా నిలిచింది. అయితే ఇలా బ్యాటింగ్ చేయడంలో ఎలాంటి రూల్స్ లేవు కానీ.. ఒకవేళ ప్రత్యర్థి జట్టు తమ వికెట్ కీపర్‌ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నట్లు అంపైర్‌కు అప్పీల్ చేస్తే మాత్రం సదరు బ్యాటర్‌ను ఔట్‌గా పరిగణించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రత్యర్థి జట్టు ఎలాంటి అప్పీల్ చేయకపోవడంతో పరుగులు రావడంతో పాటు బ్యాటర్ హైలైట్‌గా మారాడు. pic.twitter.com/GQaM7T1Ogh — Out Of Context Cricket (@GemsOfCricket) November 4, 2022 2005లో అక్తర్ బౌలింగ్‌లో బ్రాడ్ హడిన్ ఇలాగే.. ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి ఘటన ఇప్పటివరకు పెద్దగా చోటుచేసుకోలేదు. అయితే 2005-06లో పాకిస్తాన్ ఆస్ట్రేలియాలో పర్యటించింది. ఆస్ట్రేలియా-ఏతో పాక్ అడిలైడ్ వేదికగా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఫ్రీ హిట్‌ను అప్పుడప్పుడే అమల్లోకి తెచ్చారు. ఆ మ్యాచ్‌లో తొలి ఓవర్ పాక్ తరపున రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ వేయగా.. ఆస్ట్రేలియా-ఏ ఇన్నింగ్స్‌ను బ్రాడ్ హడిన్, జేమ్స్ హోప్స్‌లు ప్రారంభించారు. అయితే అక్తర్ నోబాల్ వేయడంతో అంపైర్ ఫ్రీహిట్ ఇచ్చాడు. ఫ్రీహిట్ అంటే కేవలం రనౌట్ తప్ప ఎలా ఔట్ అయినా పరిగణించరు. ఈ రూల్‌ను అడ్వాంటేజ్ తీసుకున్న బ్రాడ్ హడిన్.. అక్తర్ 155 కిమీ వేగంతో వేసిన డెలివరీ ఆడేందుకు వికెట్ల వెనకాలకు వెళ్లి బ్యాటింగ్ చేశాడు. మిడ్ వికెట్ మీదుగా షాట్ ఆడి రెండు పరుగులు సాధించాడు. అయితే అక్తర్ మరోసారి నోబాల్ వేయడంతో ఫ్రీహిట్ అలాగే ఉండిపోయింది. దీంతో తర్వాత బంతిని అక్తర్ స్ట్రెయిట్ స్లో డెలివరీ వేశాడు. ఈసారి కూడా హడిన్ వికెట్ల వెనకాల వెళ్లి బ్యాటింగ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్‌ను తాకడంలో విఫలం కావడంతో వికెట్లను గిరాటేసింది. అయితే ఫ్రీహిట్ అమల్లో ఉండడంతో హడిన్ ఔట్ కాకపోవడంతో బై రూపంలో మరో రన్ వచ్చింది. అప్పట్లో హడిన్ చర్య సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. చదవండి: Aus Vs Afg: అఫ్గన్‌తో కీలక మ్యాచ్.. ఆసీస్ స్కోరు ఎంతంటే మహ్మద్ నవాజ్ రనౌటా లేక ఎల్బీనా? -
పొట్టి క్రికెట్లో ప్రపంచ రికార్డు.. ఒకే మ్యాచ్‌లో ఏకంగా 501 పరుగులు..!
టీ20 క్రికెట్లో అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) టీ20 ఛాలెంజ్ లీగ్ ఈ ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. పొట్టి క్రికెట్లో ఒక్క మ్యాచ్‌లోనే కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 501 పరుగులు నమోదయ్యాయి. టీ20 క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్‌లో ఈ స్థాయిలో పరుగులు నమోదు కావడం ఇదే తొలిసారి. సీఎస్ఏ టీ20 ఛాలెంజ్ లీగ్‌లో భాగంగా టైటాన్స్-నైట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 501 పరుగులు సాధించాయి. గతంలో టీ20 ఫార్మాట్లో అత్యధిక స్కోర్ (ఇరు జట్ల స్కోర్లు కలిపి) 497 పరుగులుగా ఉండింది. 2016లో సూపర్ స్మాష్ లీగ్‌లో భాగంగా సెంట్రల్ డిస్ట్రిక్స్-ఒటాగో మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి ఈ స్కోర్ సాధించాయి. ఇక, అంతర్జాతీయ క్రికెట్లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగుల రికార్డు 2016లో భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నమోదైంది. ఆ మ్యాచ్‌లో ఏకంగా 489 పరుగులు నమోదయ్యాయి. #CSAT20Challenge@Titans_Cricket claim a comfortable 41-run victory over @KnightsCricket in a game that broke the world record for the highest match aggregate in a T20 game - 5⃣0⃣1⃣ 🤯 🗒️ Ball by ball https://t.co/QxPLEjNMQg 📺 SuperSport 208#BePartOfIt #SummerOfCricket pic.twitter.com/yu4wsSfwxH — DomesticCSA (@DomesticCSA) October 31, 2022 ఇదిలా ఉంటే, సీఎస్ఏ లీగ్‌లో భాగంగా నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్.. డెవాల్డ్ బ్రెవిస్ (57 బంతుల్లో 162; 13 ఫోర్లు, 13 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఛేదనలో నైట్స్ సైతం అదే రేంజ్లో రెచ్చిపోయి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసి, లక్ష్యానికి 41 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా 36 సిక్సర్లు నమోదయ్యాయి. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు నమోదైన మ్యాచ్‌ల జాబితాలో ఈ మ్యాచ్ మూడో స్థానంలో నిలిచింది. That record-breaking innings 🤯#CSAT20Challenge #BePartOfIt #SummerOfCricket pic.twitter.com/C7KLkPBHzD — DomesticCSA (@DomesticCSA) November 1, 2022 -
Syed Mushtaq Ali Trophy: ఓటమితో ఆంధ్ర ముగింపు
ఇండోర్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ ట్రోఫీ టి20 క్రికెట్ టోర్నీని ఆంధ్ర జట్టు ఓటమితో ముగించింది. శనివారం జరిగిన గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర 11 పరుగుల తేడాతో బరోడా చేతిలో ఓడిపోయింది. ఏడు జట్లున్న గ్రూప్ ‘డి’లో ఆంధ్ర రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. మరో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దాంతో ఆంధ్ర 12 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయింది. బరోడాతో జరిగిన మ్యాచ్‌లో 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది. కరణ్ షిండే (26 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రికీ భుయ్ (26 బంతుల్లో 37; 6 ఫోర్లు) రాణించారు. అంతకుముందు బరోడా 20 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు సాధించింది. ఐదు గ్రూపుల్లో ‘టాపర్’గా నిలిచిన ముంబై, పంజాబ్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, బెంగాల్ నేరుగా క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించాయి. మూడు ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో గెలిచిన మరో మూడు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుతాయి. -
61 పరుగులు చేస్తేనే.. బాబర్ ఆజంకు అంత సీన్ లేదు!
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంకు టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టే చాన్స్ వచ్చింది. ఇంగ్లండ్‌తో ఇవాళ జరగనున్న నాలుగో టి20లో బాబర్ ఆజం మరో 61 పరుగులు చేస్తే టి20 క్రికెట్లో 3వేల పరుగుల మైలురాయిని అందుకోనున్నాడు. బాబర్ ఇప్పటివరకు 79 ఇన్నింగ్స్‌ల్లో 2939 పరుగులు చేశాడు. మరొక 61 పరుగులు చేస్తే 80 ఇన్నింగ్స్‌ల్లో 3వేల మార్క్‌ను అందుకుంటాడు. ఇక కోహ్లి టి20 క్రికెట్లో 3వేల పరుగుల మార్క్‌ను అందుకోవడానికి 81 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఒకవేళ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో బాబర్ 61 పరుగులు చేస్తే గనుక ఒక్క ఇన్నింగ్స్ తక్కువ తేడాతో కోహ్లిని అధిగమించే అవకాశం ఉంది. ఇటీవలే అతని బ్యాటింగ్ అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికి.. తాజాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రెండో టి20లో ఏకంగా సెంచరీ బాది జట్టును గెలిపించి తిరిగి ఫామ్‌లోకి వచ్చినట్టే కనిపిస్తున్నాడు. అయితే టీమిండియా అభిమానులు మాత్రం బాబర్ ఆజంను ట్రోల్ చేశారు. 61 పరుగులు చేస్తే కదా.. కోహ్లిని అధిగమిస్తాడు.. బాబర్ ఆజంకు అంత సీన్ లేదు. ఈ మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే వెనుదిరుగుతాడు.. అంతగా కావాలంటే కోహ్లితో సమానంగా నిలవాలి లేదంటే అతని కంటే ఒక ఇన్నింగ్స్ ఎక్కువ ఆడి 3వేల పరుగుల మార్క్‌ను అందుకోవాలి అంటూ కామెంట్ చేశారు. ఈ సంగతి పక్కనబెడితే విరాట్ కోహ్లి, బాబర్ ఆజంలు.. ఇద్దరూ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రతిభ కలిగిన బ్యాటర్లు. పైగా ఇద్దరూ క్రికెట్‌ను ఎంతగానో అభిమానించే భారత్, పాకిస్థాన్ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బాబర్ కంటే చాలా ముందే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కోహ్లి రికార్డుల మీద రికార్డులు నమోదు చేశాడు. ఆ తర్వాత క్రికెట్లోకి వచ్చిన బాబర్ అజామ్ కోహ్లి రికార్డులకు చెక్ పెట్టుకుంటూ వస్తున్నాడు. కానీ సెంచరీల విషయంలో మాత్రం కోహ్లి రికార్డును బాబర్ ఆజం సహా ఎవరు బ్రేక్ చేయలేకపోతున్నారు. చదవండి: కోహ్లికి పోటీగా రోహిత్ కటౌట్.. తగ్గేదేలే అంటున్న అభిమానులు -
సిక్సర్ల విషయంలో రోహిత్ శర్మ సరికొత్త రికార్డు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సర్ల విషయంలో సరికొత్త రికార్డు నమోదు చేశాడు. టి20 క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. శుక్రవారం నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20లో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే టి20ల్లో అత్యధికి సిక్సర్ల రికార్డును రోహిత్ తన పేరిట లిఖించుకున్నాడు. మ్యాచ్‌లో నాలుగు సిక్సర్లు బాదిన రోహిత్.. ఓవరాల్‌గా 176 సిక్సర్లతో తొలి స్థానంలో ఉన్నాడు. ఇక న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ 172 సిక్సర్లతో రెండో స్థానంలో ఉండగా.. క్రిస్ గేల్ 124 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక విరాట్ కోహ్లి 104 సిక్సర్లతో టీమిండియా తరపున టి20ల్లో వంద సిక్సర్లు కొట్టిన రెండో బ్యాటర్‌గా ఉన్నాడు. మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం వల్ల 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్ (20 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు. ఓపెనర్, కెప్టెన్ ఫించ్ (15 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు. అనంతరం భారత్ 7.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (20 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఆటతో గెలిపించాడు. జంపాకు 3 వికెట్లు దక్కాయి. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి టి20 ఆదివారం హైదరాబాద్‌లో జరుగుతుంది. చదవండి: బుమ్రా యార్కర్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్ ఫిదా -
Ind Vs Aus: అరుదైన ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో రోహిత్ శర్మ!
India Vs Australia T20 Series 2022- Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్లో సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన పదిహేనేళ్ల అంతర్జాతీయ కెరీర్లో హిట్‌మ్యాన్ ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్లో 3620 పరుగులు సాధించాడు. నాలుగు శతకాలు.. 28 హాఫ్ సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక టీ20లలో హిట్‌మ్యాన్ అత్యధిక స్కోరు 118. అదే విధంగా ఈ ఫార్మాట్లో ఇంటర్నేషనల్ క్రికెట్లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు 323 ఫోర్లు, 171 సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆరంభం నేపథ్యంలో టీమిండియా సారథి అరుదైన ప్రపంచ రికార్డు ముంగిట నిలిచాడు. రెండు సిక్సర్లు కొట్టాడంటే! మొహాలీ వేదికగా మంగళవారం(సెప్టెంబరు 20) భారత్- ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మొదలుకానుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఒక్క సిక్స్ కొడితే.. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ రికార్డును సరిచేస్తాడు. రెండు సిక్సర్లు గనుక బాదితే గప్టిల్‌ను అధిగమించి అంతర్జాతీయ క్రికెట్లో పొట్టి ఫార్మాట్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఇక గప్టిల్ ఇప్పటి వరకు 121 అంతర్జాతీయ టీ20లు ఆడి 172 సిక్స్‌లు కొట్టాడు. రోహిత్ శర్మ 171 సిక్సర్లతో అతడి తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. వీరి తర్వాత.. వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్‌గేల్ 124, ఇంగ్లండ్ మాజీ సారథి ఇయాన్ మోర్గాన్ 120, ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ 117 సిక్సర్లతో టాప్-5లో కొనసాగుతున్నారు. చదవండి: T20 WC 2022: పంత్ ఆ స్థానానికి సరిపోడు! అతడిని ఆడించకపోవడమే మంచిది: భారత మాజీ ఓపెనర్ CSA 2022 Auction- Kavya Maran: ఆ వేలంలో హైలెట్‌గా కావ్య.. ఎంఐతో పోటీపడి! యువ హిట్టర్ కోసం భారీ ధర! -
టి20లకు కొత్త ‘మెరుపు’
ముంబై: టి20లు ఎక్కడ జరిగినా దానికున్న క్రేజే వేరు. భారత్‌లో అయితే మరీనూ! అందుకే పొట్టి ఆటకు మరో ‘మెరుపు’ జత చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గట్టి ప్రయత్నమే చేస్తోంది. విశేష ఆదరణ చూరగొన్న టి20 క్రికెట్ ప్రాచుర్యాన్ని మరింత పెంచాలని సరికొత్త ప్రయోగానికి బీసీసీఐ సిద్ధమైంది. ఇందులో భాగంగా ‘టాక్టికల్ సబ్‌స్టిట్యూట్’ను ప్రవేశ పెట్టనుంది. ముందుగా దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో అమలు చేసి... అందులో విజయవంతమైతే వెంటనే వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌లోనూ కొత్త సొబగుతో సరికొత్త ‘షో’కు శ్రీకారం చుట్టాలని బీసీసీఐ భావిస్తోంది. అక్టోబర్ 11 నుంచి జరిగే ముస్తాక్ అలీ టోర్నీలో ‘టాక్టికల్ సబ్‌స్టిట్యూట్’ నిబంధన తీసుకొస్తున్నట్లు బోర్డు ఇది వరకే అనుబంధ రాష్ట్ర సంఘాలకు సమాచారం ఇచ్చింది. ఏంటీ ఇంపాక్ట్ ప్లేయర్ కథ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ కొత్తేం కాదు. ఆటగాడు గాయపడితే సబ్‌స్టిట్యూట్‌ను ఎప్పటి నుంచో ఆడిస్తున్నారు. కానీ బ్యాటింగ్, బౌలింగ్ చేసేందుకు వీల్లేదు. ఫీల్డింగ్‌కే పరిమితం! తలకు గాయమైన సందర్భంలో కన్కషన్ అయితే మాత్రం బ్యాటింగ్, లేదా బౌలింగ్ చేసే వెసులుబాటు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌కు ఉంది. అయితే ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ భిన్నమైంది. టాస్కు ముందు తుది జట్టుకు అదనంగా నలుగురు ఆటగాళ్ల జాబితా ఇస్తారు. ఇందులో ఒకరు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా పూర్తిస్థాయి ఆటగాడి హక్కులతో ఆడతాడు. 14వ ఓవర్ పూర్తయ్యేలోపు తుది 11 మందిలో ఒకరిస్థానంలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ను బరిలోకి దింపొచ్చు. ఇది గేమ్ చేంజర్ కాగలదని బీసీసీఐ భావిస్తోంది. ఈ తరహా నిబంధన బిగ్‌బాష్ లీగ్‌లో కొన్ని షరతులతో ఉంది. అప్పట్లో... వన్డేల్లో! క్రికెట్లో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ ప్రయోగం కొత్తేం కాదు. 17 ఏళ్ల క్రితం వన్డేల్లో సబ్‌స్టిట్యూట్ ఆటగాడిని ఆడించారు. ఐసీసీ 2005లో ప్రవేశపెట్టిన నిబంధన ప్రకారం టాస్కు ముందు 12వ ఆటగాడిగా ఆ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌ను జట్లు ప్రకటించేవి. తుది జట్లకు ఆడించేవి. కారణాలేవైనా 2006 ఏడాది తర్వాత ఈ నిబంధనను ఎత్తేశారు. -
టీ20లకు గుడ్‌బై చెప్పిన స్టార్ క్రికెటర్
పొట్టి క్రికెట్ నుంచి సీనియర్లు వరుసగా వైదొలుగుతుండటంతో ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చ లేక వరుస పరాజయాల బాట పట్టిన బంగ్లాదేశ్‌కు తాజాగా మరో షాక్ తగిలింది. ఆ జట్టు మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్, స్టార్ వికెట్‌కీపర్ ముష్ఫికర్ రహీం.. పొట్టి క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఆదివారం ట్విటర్ వేదికగా ప్రకటన విడుదల చేశాడు. టెస్ట్‌లు, వన్డేలపై ఫోకస్ పెట్టేందుకు టీ20ల నుంచి వైదొలుగుతున్నట్లు రహీం వెల్లడించాడు. అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకున్నా.. ఫ్రాంచైజీ క్రికెట్‌కు మాత్రం అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. I would like to announce my retirement from T20 INTERNATIONALS and focus on Test and ODI formats of the game. I will be available to play franchise leagues when the opportunity arrives. Looking forward to proudly represent my nation in the two formats-MR15 — Mushfiqur Rahim (@mushfiqur15) September 4, 2022 రహీం.. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో బ్యాటింగ్, వికెట్‌కీపింగ్ విభాగాల్లో పేలవ ప్రదర్శన (1, 4 పరుగులు) కనబర్చి జట్టు పరాజయాలకు పరోక్ష కారణంగా నిలిచాడు. శ్రీలంకతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో కీలక సమయంలో క్యాచ్‌ను జారవిడిచి తన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడానికి కారణమయ్యాడు. కాగా, తమ కంటే చిన్న జట్ల చేతుల్లో కూడా వరుస పరాజయాలు ఎదుర్కొంటూ ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ ఈ ఏడాది ఇది రెండో షాక్ అని చెప్పాలి. ఇదే ఏడాది జులైలో సీనియర్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ టీ20లకు గుడ్‌బై చెప్పి తొలి షాకివ్వగా.. తాజాగా ముష్ఫికర్ బంగ్లాను మరో దెబ్బేశాడు. 35 ఏళ్ల ముష్ఫికర్.. బంగ్లా తరఫున 82 టెస్ట్‌ల్లో 9 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీల సాయంతో 5235 పరుగులు, 236 వన్డేల్లో 8 సెంచరీలు, 42 హాఫ్ సెంచరీల సాయంతో 6774 పరుగులు, 102 టీ20ల్లో 115 స్ట్రయిక్ రేట్‌తో 6 హాఫ్ సెంచరీ సాయంతో 1500 పరుగులు సాధించాడు. వికెట్‌కీపింగ్‌లో రహీం అన్ని ఫార్మాట్లలో కలిపి 449 మందిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. చదవండి: 'ఆసియా కప్‌లా లేదు.. బెస్ట్ ఆఫ్ త్రీ ఆడుతున్నట్లుంది' -
Asia Cup 2022: కచ్చితంగా టీమిండియా ట్రోఫీ గెలవగలదు: పాక్ మాజీ కెప్టెన్
Asia Cup 2022 Winner Prediction: ఆసియా కప్-2022 ట్రోఫీ సాధించగల సత్తా టీమిండియాకు ఉందా అన్న ప్రశ్నపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ సరదాగా స్పందించాడు. కచ్చితంగా భారత్ ట్రోఫీ గెలవగలదన్న అతడు.. వాళ్లకేమైనా విటమిన్లు తక్కువయ్యాయా అంటూ చమత్కరించాడు. టీమిండియా బెంచ్ పటిష్టంగా ఉందన్న ఉద్దేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఆగష్టు 27 నుంచి ఈ మెగా ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఆసియా కప్ ట్రోఫీ కోసం భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ తలపడనున్నాయి. ఇక ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఇప్పటికే ఏడు సార్లు విజేతగా నిలిచిన టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో ఈసారి కప్‌ను లిఫ్ట్ చేయగల సత్తా భారత్‌కు ఉందా అంటూ సల్మాన్ బట్కు సోషల్ మీడియా వేదికగా ప్రశ్న ఎదురైంది. కచ్చితంగా వాళ్లు గెలవగలరు! ఇందుకు స్పందించిన ఈ పాకిస్తాన్ మాజీ కెప్టెన్.. ‘‘కచ్చితంగా వాళ్లు గెలవగలరు. వాళ్లకేమైనా విటమిన్లు తక్కువయ్యాయా? గత కొన్ని రోజులుగా ఇండియా అద్భుతంగా ఆడుతోంది. వాళ్లకు చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. కాబట్టి వారినే చాలా మంది ఫేవరెట్లుగా పేర్కొంటున్నారు’’ అని అన్నాడు. ఇక ఇతర జట్ల విజయావకాశాల గురించి మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ జట్టు తనదైన రోజు చెలరేగి ఎవరినైనా ఓడించగలదని అందరికీ తెలుసు. టీ20 ఫార్మాట్లో మెరుగైన భాగస్వామ్యాలే కీలకం. అయితే, ఆరోజు పరిస్థితి ఎలా ఉందన్న అంశం మీదే గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. అఫ్గనిస్తాన్‌ను కూడా తక్కువగా అంచనా వేయలేం. ఇక బంగ్లాదేశ్ విషయానికొస్తే.. వాళ్లు ఒక్కోసారి బాగానే ఆడతారు. మరికొన్ని సార్లు మాత్రం పేలవ ప్రదర్శన కనబరుస్తారు’’ అని సల్మాన్ బట్ పేర్కొన్నాడు. కాగా ఆసియా కప్-2022లో భాగంగా ఆగష్టు 28న భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. టీ20 ప్రపంచకప్-2021లో పాక్ చేతిలో ఎదురైన ఘోర ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. చదవండి: Hasin Jahan: ఇండియా పేరు మార్చండి.. ప్రధాని మోదీకి క్రికెటర్ షమీ ‘భార్య’ అభ్యర్ధన Rishabh Pant- Urvashi Rautela: మరీ అంత స్ట్రెస్ తీసుకోకు: బాలీవుడ్ హీరోయిన్‌కు పంత్ మరో కౌంటర్! Asia Cup 2022 : కోహ్లి ఫామ్‌లోకి వస్తే అంతే సంగతులు.. పాకిస్తాన్‌కు ఆ దేశ మాజీ కెప్టెన్ వార్నింగ్! -
WI Vs NZ: రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన గప్టిల్.. మరోసారి ప్రపంచ నంబర్ 1గా!
న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును గప్టిల్ బద్దలు కొట్టాడు. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా మూడో టీ20 సందర్భంగా ఈ ఫీట్ నమోదు చేశాడు. కాగా విండీస్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పర్యాటక కివీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన గప్టిల్ 13 బంతుల్లో 15 పరుగులు సాధించాడు. తద్వారా అంతర్జాతీయ టీ20లలో 3497 పరుగుల మార్కును అందుకున్నాడు. దీంతో పురుషుల టీ20 క్రికెట్లో ప్రస్తుతం టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా గప్టిల్- రోహిత్ శర్మ మధ్య నెంబర్ 1 స్థానం కోసం పోటీ కొనసాగుతూనే ఉంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(41) మినహా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో కివీస్ 145 పరుగులకే పరిమితమైంది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య వెస్టిండీస్.. ఓపెనర్లు బ్రాండన్ కింగ్(53), బ్రూక్స్(56 నాటౌట్) విజృంభించడంతో జయకేతనం ఎగురవేసింది. 19 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 150 పరుగులు సాధించింది. తద్వారా 8 వికెట్ల తేడాతో గెలిచి మూడు టీ20ల సిరీస్‌లో క్లీన్‌స్వీప్ గండం నుంచి తప్పించుకుంది. ఇక మొదటి రెండు మ్యాచ్‌లలో న్యూజిలాండ్ వరుసగా 13, 90 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగుల జాబితాలో టాప్-5లో ఉన్న పురుష క్రికెటర్లు 1.మార్టిన్ గప్టిల్(న్యూజిలాండ్)- 3497 2.రోహిత్ శర్మ(ఇండియా)- 3487 3.విరాట్ కోహ్లి(ఇండియా)- 3308 4.పాల్ స్టిర్లింగ్(ఐర్లాండ్)- 2975 5.ఆరోన్ ఫించ్(ఆస్ట్రేలియా)- 2855 చదవండి: Hasin Jahan: ఇండియా పేరు మార్చండి.. ప్రధాని మోదీకి క్రికెటర్ షమీ ‘భార్య’ అభ్యర్ధన Rishabh Pant- Urvashi Rautela: మరీ అంత స్ట్రెస్ తీసుకోకు: బాలీవుడ్ హీరోయిన్‌కు పంత్ మరో కౌంటర్! Martin Guptill to the top! The @BLACKCAPS opener goes to No.1, though there is an Asia Cup around the corner for two batters in the chasing pack 🏏 More on Guptill's record and #WIvNZ: https://t.co/aws5Z9q9hL pic.twitter.com/cTijVVXjPY — ICC (@ICC) August 15, 2022 -
600 వికెట్లతో ప్రపంచ రికార్డు.. టి20 క్రికెట్లో తొలి బౌలర్‌గా
వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో టి20 క్రికెట్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. టి20 క్రికెట్లో 600 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా బ్రావో చరిత్ర సృష్టించాడు. హెండ్రెండ్ టోర్నమెంట్లో భాగంగా బ్రావో ఈ ఫీట్ అందుకున్నాడు. హండ్రెడ్‌లో నార్తన్ సూపర్‌చార్జర్స్‌కు ఆడుతున్న బ్రావో.. ఓవల్ ఇన్విసిబుల్స్తో మ్యాచ్‌లో సామ్ కరన్‌ను ఔట్ చేయడం ద్వారా టి20ల్లో 600వ వికెట్ మార్క్‌ను అందుకున్నాడు. సామ్ కరన్‌ను ఔట్ చేయగానే బ్రావో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరున్న బ్రావో టి20ల్లో 516 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత అందుకున్నాడు. కాగా మ్యాచ్‌లో ఓవరాల్‌గా 20 బంతులేసి 29 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. కాగా బ్రావో తర్వాత అఫ్గనిస్తాన్‌కు చెందిన రషీద్ ఖాన్ 466 వికెట్లు, విండీస్‌కు చెందిన స్పిన్నర్ సునీల్ నరైన్ 457 వికెట్లతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక వెస్టిండీస్ క్రికెట్లో 2004 నుంచి 2021 కాలంలో కీలక ఆల్‌రౌండర్‌గా వెలుగొందాడు. 2012, 2016 టి20 ప్రపంచకప్‌లు విండీస్ గెలవడంలో బ్రావో పాత్ర కీలకం. ఓవరాల్‌గా విండీస్ తరపున 40 టెస్టులు, 164 వన్డేలు, 91 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2018లో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన బ్రావో టి20 ప్రపంచకప్ 2020 దృశ్యా తన టి20లకు అందుబాటులో ఉంటానని చెప్పి రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత టి20 ప్రపంచకప్‌లో భాగంగా 2021.. నవంబర్ 6న.. ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన నార్తన్ సూపర్ చార్జర్స్ 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆడమ్ లిత్ 33 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 79 పరుగులు సాధించాడు. లిత్ మినహా మిగతావారిలో పెద్దగా ఎవరు రాణించలేదు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఓవల్ ఇన్విసిబుల్స్ 97 బంతుల్లోనే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సామ కరన్ 39 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జోర్డాన్ కాక్స్ 29 బంతుల్లో 48 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లో టామ్ కరన్ 7 బంతుల్లో 18 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. 6️⃣0️⃣0️⃣ T20 wickets for DJ Bravo! 🎉 He becomes the first to yet another milestone - no other player has yet reached 500! 🙌 pic.twitter.com/ZRBMhoFKHK — ESPNcricinfo (@ESPNcricinfo) August 11, 2022 చదవండి: చరిత్ర సృష్టించిన కీరన్ పొలార్డ్.. ఎవరికి అందనంత ఎత్తులో Slow deliveries 🤝 Bravo! Spectacular bowling from the superstar @DJBravo47. Watch all the action from The Hundred LIVE, exclusively on #FanCode 👉https://t.co/3GLSe3BlEE@thehundred#TheHundred #TheHundredonFanCode pic.twitter.com/BRNYIenclH — FanCode (@FanCode) August 12, 2022 -
చరిత్ర సృష్టించిన కీరన్ పొలార్డ్.. ఎవరికి అందనంత ఎత్తులో
వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ టి20 క్రికెట్లో అరుదైన ఫీట్ అందుకున్నాడు. టి20ల్లో 600వ మ్యాచ్ ఆడిన తొలి క్రికెటర్‌గా పొలార్డ్ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం హండ్రెడ్ టోర్నమెంట్లో ఆడుతున్న ఈ హిట్టర్ లండన్ స్పిరిట్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సోమవారం మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో మ్యాచ్‌లో పొలార్డ్ ఈ ఘనత అందుకున్నాడు. కాగా తన 600 వ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో పొలార్డ్ 11 బంతుల్లో 34 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్, నాలుగు భారీ సిక్సర్లు ఉన్నాయి. ఇక టి20ల్లో సక్సెస్ అయిన బ్యాట్స్మెన్లలో పొలార్డ్ ఒకడిగా నిలిచాడు. 600 మ్యాచ్‌ల్లో 31.34 సగటుతో 11, 723 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ ఉండగా.. 56 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక బౌలింగ్‌లో 309 వికెట్లు పడగొట్టిన పొలార్డ్ అత్యుత్తమ బౌలింగ్ 4/15 గా ఉంది. దాదాపు 15 ఏళ్ల నుంచి టి20లు ఆడుతున్న పొలార్డ్ వెస్టిండీస్‌తో పాటు ఎన్నో జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. దేశవాలీలో ట్రినిడాడ్ అండ్ టొబాగొ, కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, బీబీఎల్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్, బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో డాకా గ్లాడియేటర్స్, డాకా డైనమిటీస్, పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో కరాచీ కింగ్స్, ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జాల్మికి ప్రాతినిధ్యం వహించాడు. పొలార్డ్ తర్వాత టి20 క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జాబితాలో డ్వేన్ బ్రావో(543 మ్యాచ్‌లు), షోయబ్ మాలిక్(472 మ్యాచ్‌లు), క్రిస్ గేల్(463 మ్యాచ్‌లు), రవి బొపారా(426 మ్యాచ్‌లు) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పొలార్డ్ హిట్టింగ్తో లండన్ స్పిరిట్స్ 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగుల భారీ స్కోరు చేసింది. పొలార్డ్‌తో పాటు కెప్టెన్ ఇయాన్ మెర్గాన్(37 పరుగులు), ఓపెనర్ జాక్ క్రాలీ(41 పరుగులు) చేశారు. ఆ తర్వాత మాంచెస్టర్ ఒరిజినల్స్ జోర్డాన్ థాంప్సన్(4/15) ధాటికి 108 పరుగులకే కుప్పకూలింది. దీంతో లండన్ స్పిరిట్స్ 52 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. చదవండి: Asia Cup 2022: పాక్ ప్రత్యర్ధిగా వందో టీ20 ఆడేందుకు సిద్ధంగా ఉన్న కోహ్లి బంగ్లాదేశ్‌కు మరోసారి ఊహించని షాక్.. వన్డే సిరీస్ జింబాబ్వే సొంతం! -
CWG 2022: స్మృతి మంధాన అరుదైన రికార్డు! రోహిత్ శర్మ తర్వాత ఆమే!
Commonwealth Games 2022: భారత మహిళా బ్యాటర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. టీ20 ఫార్మాట్లో భారత్ తరఫున ఓపెనర్‌గా అత్యధిక పరుగులు(2004) చేసిన రెండో క్రికెటర్‌గా నిలిచింది. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందు వరుసలో ఉన్నాడు. పొట్టి ఫార్మాట్లో హిట్‌మ్యాన్ ఇప్పటి వరకు భారత ఓపెనర్‌గా 96 ఇన్నింగ్స్‌లో 2973 పరుగులు చేశాడు. ఇక 79 ఇన్నింగ్స్‌లో 2 వేల పరుగుల మార్కును అందుకున్న మంధాన.. రోహిత్ తర్వాతి స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా బార్బడోస్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో 5 పరుగులు చేసి పెవిలియన్ చేరిన స్మృతి మంధాన.. 2004 పరుగులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్, మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, కేఎల్ రాహుల్‌లను మంధాన అధిగమించింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. భారత బౌలర్లు చెలరేగడంతో 62 పరుగులకే బార్బడోస్ కథ ముగిసింది. ఏకంగా వంద పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది. కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించే దిశగా హర్మన్‌ప్రీత్‌కౌర్ బృందం పయనిస్తోంది. కాగా స్మృతి మంధాన 2013లో పరిమిత ఓవర్ల క్రికెట్లో.. ఆ మరుసటి ఏడాది టెస్టుల్లో అరంగేట్రం చేసింది. టీమిండియా తరఫున ఓపెనర్లుగా టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 వీరే! 1. రోహిత్ శర్మ-2973 పరుగులు 2. స్మృతి మంధాన- 2004 పరుగులు 3. శిఖర్ ధావన్- 1759 పరుగులు 4. మిథాలీ రాజ్- 1407 పరుగులు 5. కేఎల్ రాహుల్-1392 పరుగులు చదవండి: Asia Cup 2022: ఆసియా కప్‌లో భారత్, పాక్‌లు మూడుసార్లు ఎదురెదురు పడే అవకాశం..! -
Commonwealth Games 2022: భారత్ ధనాధన్
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్ టి20 క్రికెట్ ఈవెంట్లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో దాయాది పాకిస్తాన్‌ను కంగు తినిపించింది. తద్వారా సెమీఫైనల్ రేసులో నిలిచింది. గ్రూప్ ‘ఎ’లో ఆదివారం జరిగిన ఈ పోరులో భారత్ 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మొదట పాకిస్తాన్ మహిళల జట్టు 18 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. మునీబా అలీ (30 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. రాధ యాదవ్, స్నేహ్ రాణా చెరో 2 వికెట్లు తీశారు. రేణుక, మేఘన సింగ్, షఫాలీ వర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ 11.4 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసి గెలిచింది. స్మృతి మంధాన (42 బంతుల్లో 63 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), షఫాలీ వర్మ (9 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్), సబ్బినేని మేఘన (14; 2 ఫోర్లు) ధాటిగా ఆడి భారత విజయాన్ని ఖాయం చేశారు. బుధవారం బార్బడోస్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ తలపడుతుంది. -
18 ఏళ్ల వయసులో అదిరిపోయే రికార్డులు.. ఎవరీ క్రికెటర్?
ఫ్రాన్స్ టీనేజ్ క్రికెటర్ గుస్తవ్ మెకియోన్ 18 ఏళ్ల వయసులోనే టి20 క్రికెట్లో సంచలనాలు నమోదు చేస్తున్నాడు. మూడు రోజుల కిందట టి20 క్రికెట్లో సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కిన గుస్తవ్ మెకియోన్ తాజాగా మరో శతకం అందుకున్నాడు. టి20 క్రికెట్లో వరుసగా రెండు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా గుస్తవ్ మెకియోన్ నిలిచాడు. యూరోప్ టి20 వరల్డ్‌కప్ 2024 సబ్-రీజినల్స్‌లో భాగంగా గ్రూఫ్-బిలో నార్వేతో జరిగిన మ్యాచ్‌లో గుస్తవ్ 53 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 101 పరుగులు సాధించాడు. అతనికి ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. అంతకముందు ఆదివారం(జూన్ 24న) స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో 61 బంతుల్లోనే తొలి శతకం మార్క్‌ను అందుకున్నాడు. ఇదే వరల్డ్‌కప్‌లో చెక్ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌తో టి20 క్రికెట్లో అరంగేట్రం చేసిన గుస్తవ్ ఆరంభమ్యాచ్‌లోనే 54 బంతుల్లో 76 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే గుస్తవ్ మరో అరుదైన ఫీట్ సాధించాడు. వరుసగా తొలి మూడు టి20 మ్యాచ్‌లు కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ చరిత్ర సృష్టించాడు. వరుసగా తొలి మూడు టి20ల్లో 76, 109, 101 పరుగులు.. మొత్తంగా 26 పరుగులు సాధించి గుస్తవ్ తొలి స్థానంలో ఉన్నాడు. ఇక పోర్చుగల్‌కు చెందిన క్రికెటర్ అజర్ అదానీ 227 పరుగులతో రెండో స్థానంలో.. చెక్ రిపబ్లిక్కు చెందిన సబావున్ దావీజీ 208 పరుగులతో మూడో స్థానంలో.. నేపాల్ క్రికెటర్ కుషాల్ బుర్తెల్ 185 పరుగులతో నాలుగో స్థానం.. పాకిస్తాన్‌కు చెందిన ముక్తార్ అహ్మద్ 182 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఫ్రాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఇక్కడ విచిత్రమేంటంటే గుస్తవ్ మెకియోన్ ఒక్కడే 101 పరుగులు చేయగా.. తర్వాత జట్టులో అత్యధిక స్కోరు 15 మాత్రమే. అనంతరం బ్యాటింగ్ చేసిన నార్వే 19.2 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. సెంచరీతో చెలరేగిన గుస్తవ్ బౌలింగ్‌లోనూ అదరగొట్టాడు. నాలుగు ఓవర్లు వేసి 27 పరుగులిచ్చి మూడు వికెట్లతో గుస్తవ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించిన దక్షిణాఫ్రికా యువ ఆటగాడు.. ఫుల్ జోష్‌లో ముంబై! Martin Guptill: రోహిత్ శర్మ రికార్డు బద్దలు.. కివీస్ తరపున తొలి ఆటగాడిగా -
రోహిత్ శర్మ రికార్డు బద్దలు.. కివీస్ తరపున తొలి ఆటగాడిగా
న్యూజిలాండ్ సీనియర్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ టి20 క్రికెట్ కొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టి20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. బుధవారం స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో గప్టిల్ 31 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ(3379 పరుగులు) రికార్డును బద్దలు కొట్టి 3399 పరుగులతో టాప్ స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 128 మ్యాచ్‌ల్లో 3379 పరుగులు చేయగా.. ఇందులో నాలుగు సెంచరీలు, 26 అర్థసెంచరీలు సాధించాడు. ఇక మార్టిన్ గప్టిల్ 116 మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు, 20 అర్థ సెంచరీలతో 3399 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో రోహిత్ ఉండగా.. మూడో స్థానంలో టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి(3308 పరుగులు), ఐర్లాండ్‌కు చెందిన పాల్ స్టిర్లింగ్(2894 పరుగులు) నాలుగో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్(2855 పరుగులు) ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా కివీస్ తరపున టి20ల్లో మూడువేల పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి ఆటగాడు మార్టిన్ గప్టిల్. ఇంతకముందు మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్(2140 పరుగులు) మాత్రమే ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే స్కాట్లాండ్పై కివీస్ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఫిన్ అలెన్(56 బంతుల్లో 101, 8 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీతో విధ్వంసం చేయగా.. గప్టిల్ 40, నీషమ్ 30 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్కాట్లాండ్ బ్యాటర్స్‌లో గాలమ్ మెక్లీడ్ 33, క్రిస్ గ్రీవ్స్ 31 పరుగులు చేశారు. చదవండి: Shubman Gill: సెంచరీ మిస్ అయినా దిగ్గజాల సరసన చోటు -
మూడు గంటల్లోనే ఫలితం.. ఏడు గంటలు ఎవరు ఆడుతారు?
టి20 క్రికెట్ రాకముందు వన్డే క్రికెట్‌కు యమా క్రేజ్ ఉండేది. రోజులో దాదాపు ఎనిమిది గంటలు సాగే మ్యాచ్ అయినా ఆసక్తికరంగా ఉండేంది. ఎందుకంటే అప్పటికి షార్ట్ ఫార్మాట్ పెద్దగా పరిచయం లేదు. ట్రయాంగులర్, ఐదు, ఏడు వన్డేల సిరీస్‌లు ఇలా చాలానే జరిగేవి. అప్పట్లో ఆయా జట్లు కూడా వన్డే సిరీస్‌లు ఆడడానికి ఉత్సాహం చూపించేవి. అందుకు తగ్గట్లుగానే ఐసీసీ కూడా ప్రణాళికలు రచించేది. కాల క్రమంలో పొట్టి ఫార్మాట్(టి20 క్రికెట్) బలంగా తయారవడం.. వన్డేల ప్రాధాన్యతను తగ్గించింది. మూడు గంటల్లో ముగిసేపోయే మ్యాచ్‌లు.. ఆటగాళ్లకు రెస్ట్ దొరికే సమయం ఎక్కువగా ఉండేది. వెరసి టి20లపై ఆటగాళ్లకు మోజు పెరిగిపోయింది. దీంతో టి20లు ఆడేందుకు వన్డే క్రికెట్‌కు దూరంగా ఉండడమే లేక రిటైర్మెంట్ ఇవ్వడమో జరుగుతుంది. ఇటీవలీ కాలంలో వన్డే క్రికెట్‌పై ఈ చర్చ మరింత ఎక్కువయింది. వన్డే క్రికెట్‌ను ఆపేస్తే మంచిదని కొందరు అభిప్రాయపడితే.. 50 ఓవర్ల నుంచి 40 ఓవర్లకు కుదించి వన్డే మ్యాచ్‌లను రూపొందించాలని రవిశాస్త్రి లాంటి క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. వన్డే క్రికెట్‌కు పూర్వ వైభవం రావాలంటే మల్టీ సిరీస్‌లు.. ట్రయాంగులర్ సిరీస్‌లు ఎక్కువగా ఆడిస్తే మంచిదంటూ మరికొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కూడా వన్డే క్రికెట్‌పై స్పందించాడు. ''మేం వన్డే మ్యాచ్‌లు ఆడే సమయానికి టెస్టులు తక్కువగా ఉన్నప్పటికి సమానంగా ఆడేవాళ్లం. కానీ సంప్రదాయ క్రికెట్‌తో వన్డే క్రికెట్‌ను ఎప్పుడూ పోల్చలేం. కానీ టి20 ఫార్మాట్ వచ్చాకా వన్డే క్రికెట్‌పై అందరికి ఆసక్తి తగ్గిపోయింది. ఒక టి20 మ్యాచ్‌లో మూడు గంటల్లోనే ఫలితం వస్తుంది.. అదే వన్డే మ్యాచ్ అయితే కనీసం ఏడు గంటలు ఆడాలి. ఏ ఆటగాడైనా ఫలితం తొందరగా వస్తున్న దానిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు. ప్రస్తుతం జరుగుతుంది అదే. మూడు గంటల్లో ఫలితం వస్తుంటే.. ఏడు గంటలు ఎవరు ఆడతారు చెప్పండి. వన్డే క్రికెట్‌ను సరికొత్తగా డిజైన్ చేయాలి లేదంటే త్వరలోనే కనుమరుగయ్యే అవకాశం ఉంది'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: వన్డే క్రికెట్ చచ్చిపోతుంది.. ఈ మార్పు చేయండి..! పంత్ మాటను లెక్కచేయని ధోని.. నవ్వుకున్న రోహిత్, సూర్యకుమార్ -
టి20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ క్రికెటర్
స్కాట్లాండ్ సీనియర్ ఆటగాడు కైల్ కోయెట్జర్ గురువారం అంతర్జాతీయ టి20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. మూడు వారాల క్రితమే కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్న కోయెట్జర్.. తాజాగా టి20లకు గుడ్‌బై చెబుతూ నిర్ణయం తీసుకున్నాడు. ఫ్యామిలీతో మరింత సమయం గడపడంతో పాటు కోచింగ్ కెరీర్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టేందుకే టి20ల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. కాగా టి20లకు గుడ్‌బై చెప్పిన కోయెట్జర్ వన్డేలకు మాత్రం అందుబాటులో ఉండనున్నాడు. 2008లో అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేసిన కైల్ కోయెట్జర్ 70 మ్యాచ్‌లాడి 1495 పరుగులు సాధించాడు. స్కాట్లాండ్ తరపున స్టార్ బ్యాటర్‌గా పేరు పొందిన కోయెట్జర్కు టి20ల్లో కెరీర్ బెస్ట్ స్కోరు 89 పరుగులు కాగా.. అతని ఖాతాలో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లో 76 మ్యాచ్‌ల్లో 2,915 పరుగుల సాధించిన కోయెట్జర్ ఖాతాలో 5 సెంచరీలు, 20 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో కోయెట్జర్ అత్యధిక స్కోరు 156 పరుగులు. ఇక డిసెంబర్ 2020న కైల్ కోయెట్జర్ ఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్ అవార్డును గెలుచుకున్నాడు. ఇక కోయెట్జర్ టి20లకు గుడ్‌బై చెప్పిన రోజునే న్యూజిలాండ్‌తో తలపడనున్న జట్టును స్కాట్లాండ్ ప్రకటించింది. రిచీ బెరింగ్టన్ నాయకత్వంలో 18 మందితో కూడిన జట్టును టి20లతో పాటు వన్డే మ్యాచ్‌కు ప్రకటించింది. న్యూజిలాండ్‌తో స్కాట్లాండ్.. జూలై 27, 29 తేదీల్లో రెండు టి20లు, జూలై 31న ఒక వన్డే మ్యాచ్ ఆడనుంది. మైకెల్ జోన్స్, ఒలివర్ హారిస్, కరఎయిన వల్లాస్లు జట్టులోకి ఎంట్రీ ఇవ్వగా.. కైల్ కొయెట్జర్ న్యూజిలాండ్‌తో ఆడనున్న ఒకే ఒక్క వన్డేకు ఎంపికయ్యాడు. న్యూజిలాండ్‌తో ఆడనున్న స్కాట్లాండ్ జట్టు: రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), మాథ్యూ క్రాస్ (వికెట్ కీపర్), కైల్ కోయెట్జర్ (వన్డేకు మాత్రమే), అలీ ఎవాన్స్, క్రిస్ గ్రీవ్స్, ఆలివర్ హెయిర్స్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, కాలమ్ మెక్లియోడ్, గావిన్ మెయిన్, క్రిస్ మక్‌బ్రైడ్, యాడ్, నీల్, సఫ్యాన్ షరీఫ్, క్రిస్ సోల్, హంజా తాహిర్, క్రెయిగ్ వాలెస్, మార్క్ వాట్ చదవండి: BCCI Case: గంగూలీ, జై షా పదవుల వ్యవహారం.. అమికస్ క్యూరీగా మణిందర్ సింగ్ Football Match: తారాస్థాయికి గొడవ.. కొట్టుకున్న ఆటగాళ్లు -
విజయానికి 9 పరుగులు.. కనివినీ ఎరుగని హైడ్రామా
ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు.. చేతిలో ఆరు వికెట్లు.. ఈ దశలో ఎవరైనా సరే ఈజీగా విజయం సాధిస్తుందని అనుకుంటారు. కానీ ఇది టి20 మ్యాచ్. మరుక్షణం ఏం జరుగుతుందన్నది ఎవరు ఊహించలేరు. ఒక బంతికి రన్ తీస్తే.. మరుసటి బంతికి వికెట్ పడడం.. ఆ తర్వాత బౌండరీ.. మరోసారి వికెట్.. ఇలా ఆఖరి ఓవర్ ఒక థ్రిల్లర్‌ను తలపించింది. ఈ ఘటన విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో సోమర్సెట్, సర్రీ మధ్య మ్యాచ్‌లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. టామ్ బాండన్ 39, గోల్డ్‌వార్తి 27, లామోన్బీ 21 పరుగులు చేశారు. అనంతరం 145 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సర్రీ ఇన్నింగ్స్ 19వ ఓవర్ వరకు సజావుగానే సాగింది. 19 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఇక ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. పీటర్ సిడిల్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతికి సింగిల్ వచ్చింది. రెండో బంతికి 14 పరుగులు చేసిన జోర్డాన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇక క్రీజులోకి వచ్చిన నికో రీఫర్ మూడో బంతిని బౌండరీ తరలించాడు. విజయానికి మూడు బంతుల్లో నాలుగు పరుగులు అవసరమైన దశలో రెండు వరుస బంతుల్లో సర్రీ రెండు వికెట్లు కోల్పోయింది. ఇక ఆఖరి బంతికి ఫోర్ అవసరం కాగా.. కాన్ మెకర్ బౌండరీ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అలా కనివినీ ఎరుగని హైడ్రామాలో సర్రీ విజేతగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 9️⃣ runs to win from the final over... What happens next is just 🤯#Blast22 pic.twitter.com/PMI0HXMdw9 — Vitality Blast (@VitalityBlast) June 21, 2022 చదవండి: కరోనా బారిన పడ్డా.. కోహ్లి చేసింది కరెక్టేనా! -
అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డును తిరగరాసిన ఆఫ్ఘాన్ బౌలర్
జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో ఆఫ్ఘాన్ యువ బౌలర్ నూర్ అహ్మద్ చరిత్ర తిరగరాశాడు. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన 17 ఏళ్ల నూర్ అరంగేట్రం మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శనతో (4/10) జట్టును విజయపథంలో నడిపించడంతో పాటు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ అయిన నూర్ 17 ఏళ్ల 162 రోజుల్లో ఈ ఘనత సాధించగా.. ఆఫ్ఘాన్కే చెందిన రహ్మానుల్లా గుర్భాజ్ 17 ఏళ్ల 354 రోజుల్లో, పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ అమీర్ 18 ఏళ్ల 84 రోజుల్లో అంతర్జాతీయ టీ20ల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నారు. ఇదిలా ఉంటే, ఆతిధ్య జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో నూర్, అష్రాఫ్ (2/13) చెలరేగడంతో పర్యాటక ఆఫ్ఘానిస్థాన్ 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘానిస్థాన్ 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేయగా.. ఛేదనలో జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. అంతకుముందు జింబాబ్వేతో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కూడా ఆఫ్ఘానిస్థాన్ 3-0 తేడాతో వైట్‌వాష్ చేసింది. చదవండి: మరో శతకం దిశగా దూసుకెళ్తున్న క్రీడా మంత్రి -
టీ20ల్లో చరిత్ర సృష్టించిన శ్రీలంక.. తొలి జట్టుగా..!
పల్లెకెలె వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన అఖరి టీ20లో శ్రీలంక సంచలన విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక క్రమంగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది.17 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోరు 118/6. విజయానికి చివరి 3 ఓవర్లలో 59 పరుగులు కావల్సిన నేపథ్యంలో.. శ్రీలంక కెప్టెన్ దసున్ షనక (25 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో తమ జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. వరుసగా 3 ఓవర్లలో 22, 18, 19 పరుగులు రాబట్టిన లంక 4 వికెట్ల తేడాతో గెలిపొందింది. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంక సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20ల్లో అఖరి మూడు ఓవర్లో అత్యధిక పరుగులు ఛేజ్ చేసిన తొలి జట్టుగా శ్రీలంక నిలిచింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులు చేసింది. వార్నర్ (39; 6 ఫోర్లు), స్టొయినిస్ (38; 3 ఫోర్లు, 1 సిక్స్), స్మిత్ (37 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. చదవండి: IND vs SA: 'అతడొక యంగ్ కెప్టెన్.. రానున్న మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణిస్తాడు' Highlights of last 3 overs#Shanaka#SLvAUS#AUSvsSL https://t.co/YlidfL0Qyp pic.twitter.com/2hPuNfNoTE — Ankit Chaudhary (@Ankit_Sihag_) June 12, 2022 -
విజేత రైల్వేస్
సూరత్: దేశవాళీ మహిళల జాతీయ సీనియర్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఇండియన్ రైల్వేస్ జట్టు మరోసారి సత్తా చాటుకుంది. భారత స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన సారథ్యంలోని మహారాష్ట్ర జట్టుతో బుధవారం జరిగిన ఫైనల్లో స్నేహ్ రాణా కెప్టెన్సీలోని ఇండియన్ రైల్వేస్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రైల్వేస్ జట్టు ఈ టైటిల్‌ను సాధించడం ఇది పదోసారి కావడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మహారాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 160 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన 56 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 84 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచింది. రైల్వేస్ బౌలర్ స్వాగతిక 33 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. అనంతరం రైల్వేస్ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసి విజయం సాధించింది. రైల్వేస్‌కు ఆడుతున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన మరోసారి అదరగొట్టింది. ఓపెనర్ మేఘన 32 బంతుల్లో 9 ఫోర్లతో 52 పరుగులు... మరో బ్యాటర్ హేమలత 41 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 65 పరుగులు సాధించి రైల్వేస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. రైల్వేస్‌కు ఆడుతున్న ఆంధ్రప్రదేశ్‌కే చెందిన అంజలి శర్వాణి 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. -
'టెస్టు క్రికెట్ చనిపోయే దశకు వచ్చింది'
టెస్టు క్రికెట్‌పై టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటితరం క్రికెటర్లు టి20 క్రికెట్ ఆడడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారని.. దీనివల్ల టెస్టు క్రికెట్ చనిపోయే దశలో ఉందంటూ పేర్కొన్నాడు. హోమ్ ఆఫ్ హీరోస్ షోలో యువరాజ్ సింగ్ పాల్గొన్నాడు. ''టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుంది. ప్రజలు టి20 క్రికెట్ ఎక్కువగా చూడాలనుకుంటున్నారు, టి20 ఫార్మాట్లో ఆడటం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. దీంతో ఆటగాళ్లు వన్డేల కంటే టి20లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. ఒక్కరోజు టి20 ఆడితే రూ.50 లక్షలు వస్తున్నప్పుడు.. ఐదు రోజుల క్రికెట్ ఆడి రూ. 5 లక్షల ఎందుకు తీసుకోవాలనుకుంటారు. అన్క్యాప్డ్ ప్లేయర్లు సైతం ఐపీఎల్ లాంటి టోర్నీల్లో ఒక్క సీజన్ కోసం రూ.7 నుంచి రూ.10 కోట్ల వరకు అందుకుంటున్నారు. దీంతో వన్డేలకు కూడా ఆదరణ తగ్గుతోంది. టి20 ఫార్మాట్‌కు అలవాటు పడ్డాకా 50 ఓవర్ల మ్యాచ్ కూడా టెస్ట్ మ్యాచ్‌లాగే అనిపిస్తోంది. అందుకే టీ20లదే క్రికెట్ భవిష్యత్తు అని చెప్పొచ్చు. ఇక ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో టీమిండియా విఫలం కావడానికి మిడిలార్డర్ ప్రధాన కారణం. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఇది స్పష్టంగా కనిపించింది. ఆ వరల్డ్‌కప్‌కు జట్టును సరిగ్గా ప్లాన్ చేయలేదు. కేవలం 5,6 వన్డేలు ఆడిన విజయ్ శంకర్‌ను 4వ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చారు. విజయ్ శంకర్ గాయపడడంతో అతని స్థానాన్ని రిషబ్ పంత్‌తో భర్తీ చేశారు. అప్పటికే మంచి అనుభవం ఉన్న రాయుడుకు మాత్రం అవకాశం కల్పించలేదు. 2003ప్రపంచకప్ జట్టులో నేను ఆడినప్పుడు.. నాతో పాటు మహమ్మద్ కైఫ్, దినేష్ మోంగియా అప్పటికే 50 వన్డేలు ఆడి కొంత అనుభవాన్ని గడించాము. టీమిండియా 2011లో ప్రపంచకప్ గెలిచినప్పుడు, అప్పటి జట్టులో మేమందరం ఒక ఫిక్స్డ్ బ్యాటింగ్ పొజిషన్ కలిగి ఉన్నాం. అందుకే 28 సంవత్సరాల తర్వాత కప్‌ను గెలిచాం.'' అని చెప్పుకొచ్చాడు. చదవండి: Wriddhiman Saha: సాహాను బెదిరించిన జర్నలిస్టుకు భారీ షాకిచ్చిన బీసీసీఐ.. ఇకపై.. -
'నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం'.. అంటే ఇదేనేమో!
క్రికెట్లో ఫన్నీ ఘటనలు చూస్తూనే ఉంటాం. ఫీల్డర్ క్యాచ్ జారవిడవడం.. రనౌట్ మిస్ చేయడం.. సమన్వయలోపంతో మిస్ ఫీల్డ్ చేయడం జరుగుతూనే ఉంటాయి. అయితే ఇవన్నీ ఒక్క బంతికే జరగడం మాత్రం అరుదు. అలాంటిదే ఈసీఎస్ పోర్చుగల్ టి20 లీగ్‌లో చోటుచేసుకుంది. టోర్నీలో భాగంగా కోయింబ్రా నైట్స్, ఫ్రెండ్షిప్ సీసీ మధ్య 21వ లీగ్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన కోయింబ్రా నైట్స్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఫ్రెండ్షిప్ సీసీ జట్టు కాస్త నెమ్మదిగానే బ్యాటింగ్ చేసింది. కాగా చివరి ఓవర్లో పెద్ద హైడ్రామా చోటుచేసుకుంది. క్రీజులో ఉన్న సీసీ బ్యాటర్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే క్యాచ్ అందుకునే ప్రయత్నంలో ఫీల్డర్ తప్పిదం చేశాడు. బంతి ఎక్కడ పడుతుందో అంచనా వేయలేక చతికిలపడ్డాడు. వెంటనే తేరుకొని నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు త్రో విసిరాడు. క్యాచ్ పోతే పోయింది రనౌట్ అయ్యే అవకాశం వచ్చింది అని అనుకునేలోపే అది కూడా చేజారిపోయింది. ఫీల్డర్ వేసిన వేగానికి బంతి ఎక్కడ ఆగలేదు. నేరుగా థర్డ్‌మన్ దిశగా పరిగెత్తింది. అక్కడ ఇద్దరు ఫీల్డర్లు ఉండడంతో రెండు పరుగులు మాత్రమే వస్తాయిలే అని అనుకుంటాం. ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. బంతిని ఎవరో ఒకరు అందుకుంటారులే అని మనం అనుకుంటే ఇద్దరు వదిలేశారు.. ఇంకేముందు బంతి నేరుగా బౌండరీలైన్ దాటింది. దీంతో ఒక్క బంతికే సిక్సర్ రూపంలో కాకుండా ఆటగాళ్ల తప్పిదంతో ఆరు పరుగులు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం అంటే ఇదేనంటూ'' క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. చదవండి: Prithvi Shaw: ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన పృథ్వీ షా.. ఐదేళ్ల ఐపీఎల్ శాలరీకి సమానం! Just when you think you've seen it all... 😂 via @EuropeanCricket pic.twitter.com/6qAQ6q8dH0 — That’s so Village (@ThatsSoVillage) May 2, 2022 -
కేఎల్ రాహుల్ కొత్త రికార్డు.. టీమిండియా తరపున అత్యంత వేగంగా
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టి20ల్లో టీమిండియా తరపున కొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2022లో ఆర్సీబీతో మ్యాచ్‌లో రాహుల్ 24 బంతుల్లో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. తద్వారా టి20 క్రికెట్లో ఆరువేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. టీమిండియా తరపున ఈ ఘనత సాధించిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. అయితే 6వేల పరుగుల మార్క్‌ను అత్యంత వేగంగా అందుకున్న తొలి టీమిండియా ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. రాహుల్ ఆరువేల పరుగుల మార్క్‌ను అందుకోవడానికి 179 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే కోహ్లిని(184 ఇన్నింగ్స్‌లు) అధిగమించాడు. రాహుల్, కోహ్లి తర్వాతి స్థానంలో శిఖర్ ధావన్(213 ఇన్నింగ్స్‌లు) మూడో స్థానంలో ఉండగా.. సురేశ్ రైనా(217 ఇన్నింగ్స్‌లు) నాలుగు, రోహిత్ శర్మ(218 ఇన్నింగ్స్‌లు) ఐదో స్థానంలో ఉన్నాడు, ఇక ఓవరాల్‌గా టి20 క్రికెట్లో అత్యంత వేగంగా ఆరువేల పరుగుల మార్క్‌ను అందుకున్న ఆల్‌టైమ్ జాబితాలో కేఎల్ రాహుల్ మూడో స్థానంలో నిలిచాడు. రాహుల్ కంటే ముందు క్రిస్ గేల్(162 ఇన్నింగ్స్‌లు), పాక్ కెప్టెన్ బాబర్ ఆజం(165 ఇన్నింగ్స్‌లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక అంతర్జాతీయ టి20 క్రికెట్లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లి(3,296 పరుగులు), రోహిత్ శర్మ(3,313 పరుగులు) తర్వాతి స్థానంలో రాహుల్(1831 పరుగులతో) మూడో స్థానంలో నిలిచాడు. చదవండి: IPL 2022-KL Rahul: ఐపీఎల్ నిబంధన ఉల్లంఘన.. కేఎల్ రాహుల్‌కు భారీ జరిమానా LSG vs RCB: అంపైర్ వైడ్ ఇచ్చుంటే లక్నో మ్యాచ్ గెలిచేదేమో! -
రోహిత్ శర్మ కొత్త చరిత్ర.. టీమిండియా నుంచి రెండో ఆటగాడిగా
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ టి20 క్రికెట్లో మరో మైలురాయిని అందుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 26 పరుగులు చేసిన రోహిత్.. టి20ల్లో 10వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. కాగా ఈ రికార్డు సాధించిన ఏడో బ్యాట్స్‌మన్‌గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు రోహిత్ 373 మ్యాచ్‌ల్లో 10003 పరుగులు సాధించాడు. కాగా టీమిండియా నుంచి విరాట్ కోహ్లి మాత్రమే టి20 క్రికెట్లో 10వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. తాజాగా రోహిత్ ఈ ఫీట్ సాధించిన రెండో టీమిండియా క్రికెటర్‌గా నిలిచాడు. ఇక తొలి స్థానంలో విండీస్ విధ్వంసకర యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 463 మ్యాచ్‌ల్లో 14562 పరుగులతో టీ20ల్లో టాప్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు. పాక్ వెటరన్ ప్లేయర్ షోయబ్ మాలిక్ (472 మ్యాచ్‌ల్లో 11698 పరుగులు), విండీస్ స్టార్ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ (582 మ్యాచ్‌ల్లో 11430 పరుగులు), ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ (347 మ్యాచుల్లో 10444 పరుగులు), టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (328 మ్యాచుల్లో 10326 పరుగులు), ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (10308 పరుగులు) వరుసగా రెండు నుంచి ఆరు స్థానాల్లో కొనసాగుతున్నారు. తాజాగా రోహిత్ శర్మ(10003 పరుగులతో) ఏడో స్థానంలో ఉన్నాడు. ఇక పంజాబ్‌తో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 28 పరుగులు చేసి ఔటయ్యాడు. -
ఆరు బంతుల్లో ఆరు వికెట్లు.. క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్
క్రికెట్లో హ్యాట్రిక్ తీయడం గొప్ప.. నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు అరుదైన ఫీట్.. మరి ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీస్తే అద్భుతం అనాల్సిందే. అందుకే అద్భుతాలు అరుదుగా జరుగుతాయంటారు.. మరి ఆ అద్బుతాన్ని సాధించింది ఎవరంటే మలేషియా క్లబ్ ఎలెవెన్‌కు చెందిన వీరన్‌దీప్ సింగ్ అనే బౌలర్. నిజానికి వీరన్‌దీప్ సింగ్ తీసింది ఐదు బంతుల్లో ఐదు వికెట్లు.. ఇక ఆరో వికెట్ రనౌట్ రూపంలో వచ్చింది. వీరన్‌దీప్ సింగ్ ఐదు వికెట్ల క్లబ్లో జాయిన్ అయినప్పటికి ఆరు బంతుల్లో ఆరు వికెట్లు సాధించడమనేది గొప్ప విషయం. నేపాల్ ప్రొ కప్ టి20 చాంపియన్‌షిప్‌లో భాగంగా మలేషియా క్లబ్ ఎలెవెన్ వర్సెస్ పుష్ స్పోర్ట్స్ ఢిల్లీ మధ్య జరిగింది. వీరన్‌దీప్ సింగ్ బౌలింగ్‌కు రాకముందు పుష్ స్పోర్ట్స్ ఢిల్లీ స్కోరు 131-3.. అతని ఓవర్ పూర్తయ్యేసరికి 132-9గా మారిపోయింది. ఓవర్ తొలి బంతిని వైడ్ వేశాడు. ఆ తర్వాత రెండో బంతికి రనౌట్.. ఆ తర్వాత మిగిలిన ఐదు బంతుల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇందులోనే వీరన్‌దీప్ సింగ్ హ్యట్రిక్ నమోదు చేయడం విశేషం. హ్యాట్రిక్ సాధించిన తర్వాత వీరన్ షాహిద్ అఫ్రిది సెలబ్రేషన్‌ను గుర్తు చేశాడు. మొత్తానికి వీరన్‌దీప్ సింగ్ రెండు ఓవర్లు వేసి 8 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి బెస్ట్ ప్రదర్శన నమోదు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇంతకముందు ఆస్ట్రేలియాకు చెందిన అలెడ్ క్యారీ క్లబ్ క్రికెట్లో ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీశాడు. ఇందులో మొదటి వికెట్ స్లిప్ క్యాచ్, తర్వాతి రెండు వికెట్లు క్యాచ్, ఎల్బీ రూపంలో.. ఇక చివరి మూడు వికెట్లు క్లీన్‌బౌల్డ్ రూపంలో సాధించాడు. 2⃣0⃣th Over 6⃣ Balls 6⃣ Wickets 4⃣ in 4⃣ from the final 4 for the bowler 1⃣ Run Out Unbelievable stuff from @Viran23 for the @MalaysiaCricket XI here in Bhairahawa, Nepal! Surely the first time in Cricket History there's been 6 Wickets in 6 Balls!?? pic.twitter.com/pVIsdlyEwt — Andrew Leonard (@CricketBadge) April 12, 2022 -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ప్రపంచంలో తొలి ఆటగాడిగా
టీ20ల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ధర్మశాల వేదికగా శ్రీలంక జరిగిన మూడో టీ20లో ఆడిన రోహిత్.. తన అంతర్జాతీయ టీ20 కేరిర్‌లో 125 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. పాకిస్తాన్ తరపున 124 టీ20 మ్యాచ్‌లు ఆడి తొలి స్ధానంలో ఉన్న షోయాబ్ మాలిక్ రికార్డును రోహిత్ ఆధిగమించాడు. ఇక 124 మ్యాచ్‌లతో మాలిక్ రెండో స్ధానంలో ఉండగా, పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ 119 మ్యాచ్‌లుతో మూడో స్ధానంలో ఉన్నాడు. ఇక 100కు పైగా టీ20లు ఆడిన టీమిండియా ఆటగాళ్ల విషయానికొస్తే.. ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడు శర్మ మాత్రమే. రోహిత్ తరువాత 98 మ్యాచ్‌లతో భారత మాజీ కెప్టెన్ ఎంస్ ధోని ఉండగా, 97 మ్యాచ్‌లతో విరాట్ కోహ్లి రెండో స్ధానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ షనకా(74) తప్ప మిగితా ఎవరూ రాణించలేదు. ఇక 147 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 16.5 ఓవర్లలోనే చేధించింది. టీమిండయా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ మరో సారి చెలరేగి ఆడాడు. 45 బంతుల్లో 73 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. చదవండి: Women’s World Cup 2022: ఫామ్‌లో లేదన్నారు... సెంచరీతో చెలరేగింది -
టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2021 ఎవరంటే..!
Mohammad Rizwan Named T20 Cricketer Of The Year: 2021వ సంవత్సరానికి గాను ఐసీసీ ప్రకటించిన ఉత్తమ టీ20 క్రికెటర్ అవార్డుకు పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఐసీసీ ఆదివారం ప్రకటించింది. గతేడాది పొట్టి ఫార్మాట్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన రిజ్వాన్.. 29 మ్యాచ్‌ల్లో 73.66 సగటున 1326 పరుగులు బాదాడు. అతని స్ట్రయిక్ రేట్ 134.89గా ఉంది. బ్యాటింగ్‌లో మెరుపులతో పాటు వికెట్‌కీపింగ్‌లోనూ సత్తా చాటిన రిజ్వాన్.. గతేడాది పాక్ సాధించిన విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. Sheer Consistency, indomitable spirit and some breathtaking knocks 🔥 2021 was memorable for Mohammad Rizwan 👊 More 👉 https://t.co/9guq9xKOod pic.twitter.com/6VZo7aaRIA — ICC (@ICC) January 23, 2022 టీ20 ప్రపంచకప్ 2021లో మూడో అత్యధిక రన్ స్కోరర్‌గా నిలిచిన అతను.. తన జట్టు సెమీస్ చేరేందుకు తోడ్పడ్డాడు. కెరీర్లో ఇప్పటివరకు 19 టెస్ట్‌లు, 41 వన్డేలు, 55 టీ20లు ఆడిన రిజ్వాన్.. 3500కు పైగా పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, గతేడాది అసోసియేట్ దేశాల అత్యుత్తమ టీ20 క్రికెటర్ అవార్డును ఒమన్‌కు చెందిన జీషన్ మక్సూద్ గెలుచుకున్నాడు. ఒమన్ జట్టును సమర్ధవంతంగా నడిపించడంతో పాటు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించినందుకు గాను మక్సూద్ను ఈ అవార్డు వరించింది. చదవండి: ICC Award: ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ ఘనత.. టేక్ ఏ బౌ అన్న ఐసీసీ -
క్రిస్ గేల్‌కు ఘోర అవమానం..!
Chris Gayle: విండీస్ విధ్వంసకర యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌కు ఘోర అవమానం జరిగింది. సొంతగడ్డపై టీ20లకు వీడ్కోలు పలకాలనుకున్న తన ఆకాంక్షను ఆ దేశ క్రికెట్ బోర్డు బేఖాతరు చేసింది. త్వరలో ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరగనున్న టీ20 సిరీస్‌ల కోసం ఎంపిక చేసిన విండీస్ జట్టులో చోటు కల్పించకుండా అతన్ని అవమానపర్చింది. ఇప్పటికే వన్డేలు, టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పిన గేల్.. తన సొంత మైదానమైన సబీనా పార్క్‌లో తన చివరి టీ20 మ్యాచ్ ఆడి క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెబుతానని గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. విండీస్ క్రికెట్ బోర్డు తాజా నిర్ణయంతో గేల్.. తన సమీప భవిష్యత్తులో టీ20లు ఆడే అవకాశం లేదు. దీంతో అతను టీ20 రిటైర్మెంట్ అంశంపై పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విండీస్.. జనవరి 16న ఐర్లాండ్‌తో ఏకైక టీ20, ఆతర్వాత జనవరి 22 నుండి 30 వరకు ఇంగ్లండ్‌తో 5 టీ20లు ఆడనుంది. ఇదిలా ఉంటే, గేల్ తన టీ20 కెరీర్లో మొత్తం 452 మ్యాచ్‌ల్లో 145.4 స్ట్రైక్‌రేట్‌తో 14,321 పరుగులు సాధించి, ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పొట్టి క్రికెట్లో గేల్ 87 హాఫ్ సెంచరీలు, 22 సెంచరీలు బాదాడు. చదవండి: కోహ్లి-రోహిత్‌ల మధ్య విభేదాలా..? అలాంటి వార్తలు విని నవ్వుకునేవాడిని..! -
'మెన్స్ టి20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్'.. టీమిండియా నుంచి ఒక్కరు లేరు!
ఐసీసీ మెన్స్ టి20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు సంబంధించి ఐసీసీ బుధవారం నలుగురు ఆటగాళ్లను నామినేట్ చేసింది. ఈ జాబితాలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్, శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగా, ఆస్ట్రేలియా చిచ్చరపిడుగు మిచెల్ మార్ష్, పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌లు ఉన్నారు. ►ఇంగ్లండ్‌కు చెందిన జోస్ బట్లర్ ఈ ఏడాది టి20 క్రికెట్లో అద్భుత ఫామ్ కనబరిచాడు. ఈ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మన్ 589 పరుగులు సాధించాడు. ఇటీవలే జరిగిన టి20 ప్రపంచకప్ 2021లో 269 పరుగులతో దుమ్మురేపాడు. ►ఆస్ట్రేలియా చిచ్చరపిడుగు మిచెల్ మార్ష్ పేరు చెప్పగానే.. 2021 టి20 ప్రపంచకప్ ఫైనల్ గుర్తురాక మానదు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 50 బంతుల్లో 77 పరుగులు చేసి ఆసీస్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఓవరాల్‌గా మార్ష్ ఈ ఏడాది టి20 క్రికెట్లో 627 పరుగులు సాధించాడు. ►పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్.. టి 20 క్రికెట్లో ఓపెనర్‌గా దుమ్మురేపాడు. ఒక్క ఏడాదిలో టి20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రిజ్వాన్ రికార్డు అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది టి20 క్రికెట్లో పాకిస్తాన్ తరపున 1326 పరుగులు చేశాడు. ఇక టి20 ప్రపంచకప్ 2021లో రిజ్వాన్ 281 పరుగులు సాధించడం విశేషం. ►శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగా టి20 ప్రపంచకప్ 2021లో హ్యాట్రిక్ నమోదు చేశాడు. అంతేకాదు ఈ ఏడాది టి20 క్రికెట్లో 36 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ తనదైన పాత్ర పోషించాడు. -
ఆరోన్ ఫించ్ సరికొత్త రికార్డు.. టి20 చరిత్రలో ఆరో బ్యాటర్‌గా
ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ టి20 క్రికెట్లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టి20ల్లో 10వేల పరుగులు పూర్తి చేసిన ఆరో బ్యాటర్‌గా ఫించ్ రికార్డు సృష్టించాడు. బిగ్‌బాష్ లీగ్ 2021లో భాగంగా మెల్బోర్న్ రెనేగేడ్స్‌కు ఆడుతున్న ఫించ్ పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగులు చేయడం ద్వారా ఈ రికార్డు సాధించాడు. కాగా ఫించ్ కంటే ముందు క్రిస్ గేల్, విరాట్ కోహ్లి, డేవిడ్ వార్నర్, కీరన్ పొలార్డ్, షోయబ్ మాలిక్‌లు ఉన్నారు. కాగా ఫించ్ టి20ల్లో 10వేల పరుగుల మైలురాయిని చేరుకోవడానికి 327 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. చదవండి: BBL 2021: మా బంతి పోయింది.. కనబడితే ఇచ్చేయండి! ఇక విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ 285 ఇన్నింగ్స్‌లు.. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి 299 ఇన్నింగ్స్‌లు.. ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ 303 ఇన్నింగ్స్‌లు.. పాకిస్తాన్ వెటరన్ ఆటగాడు షోయబ్ మాలిక్ 368 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. అయితే కీరన్ పొలార్డ్‌కు మాత్రం టి20ల్లో 10వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి 450 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. చదవండి: Short Run: ఏకంగా 5 పరుగుల పెనాల్టీ విధించిన అంపైర్ -
కోహ్లిని ఔట్ చేయడం నా కల: వరల్డ్ టీ20 నెం1 బౌలర్
Wanindu Hasaranga s BIG dream, says get Virat Kohlis wicket: ప్రపంచ క్రికెట్లో చాలా మంది బౌలర్లు భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి వికెట్ ఒక్క సారైనా సాధించాలని కలలు కంటుంటారు. ఈ లిస్ట్‌లో వరల్డ్ టీ20 నెం1 బౌలర్ వనిందు హసరంగా కూడా ఉన్నాడు. విరాట్ కోహ్లి వికెట్ పడగొట్టడం తన కల అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హసరంగా పేర్కొన్నాడు. అతడు ఐపీఎల్ 2021లో ఆర్సీబీ తరుపున ఆడిన సంగతి తెలిసిందే. అయితే ప్రాక్టీస్ చేసే సమయంలో కూడా విరాట్ వికెట్ సాధించలేక పోయాను అని హసరంగా తెలిపాడు. కోహ్లి తర్వాత పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం కూడా తన లిస్ట్‌లో ఉన్నారు. "'నా అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లి వికెట్ పడగొట్టడం నా కల. అదే విధంగా బాబర్ ఆజం, గ్లెన్ మాక్స్‌వెల్‌ల వికెట్లను కూడా తీయాలనుకుంటున్నాను. నేను బౌలింగ్ చేస్తున్నప్పుడు.. ఎప్పుడూ వికెట్లు తీయడానికి ప్రయత్నిస్తాను. నేను జాతీయ జట్టుకు ఆడినప్పుడు.. జట్టు విజయం కోసం నా వంతు కృషి చేయడానికి ప్రయత్నిస్తాను. నేను ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొను, నా పని నేను పూర్తి చేస్తాను మురళీధరన్ ,హెరాత్‌ల ను ఆదర్శంగా తీసుకున్నాను. కానీ ఏ రోజు తదుపరి మురళీధరన్ లేదా తదుపరి హెరాత్ అవ్వాలనుకోలేదు. నేను నాలానే ఉండాలి అనుకుంటున్నాను" అని పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన హసరంగా 16 వికెట్లు పడగొట్టాడు. చదవండి: Virat Kholi: బలమైన జట్టును తయారు చేయడం కష్టం.. కానీ నాశనం చేయడం ఈజీ కదా! -
SMAT 2021 Winner Tamil Nadu: తమిళనాడు తడాఖా.. మూడోసారి
Syed Mushtaq Ali Trophy 2021 Final: Tamil Nadu Won Their 3rd Syed Mushtaq Ali Trophy Title: దేశవాళీ టి20 క్రికెట్లో తమిళనాడు జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. సోమవారం ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో తమిళనాడు జట్టు టైటిల్ నిలబెట్టుకుంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన తమిళనాడు ఫైనల్లో నాలుగు వికెట్ల తేడాతో కర్ణాటక జట్టును ఓడించింది. తద్వారా 2019 ఫైనల్ పోరులో కర్ణాటక చేతిలో ఒక పరుగు తేడాతో ఎదురైన ఓటమికి ఈ గెలుపుతో తమిళనాడు ప్రతీకారం తీర్చుకుంది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు సరిగ్గా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసి గెలిచింది. షారుఖ్ ఖాన్ (15 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు), సాయికిశోర్ (3 బంతుల్లో 6 నాటౌట్; 1 ఫోర్) తమిళనాడు గెలుపులో కీలకపాత్ర పోషించారు. తమిళనాడు విజయానికి చివరి ఓవర్లో 16 పరుగులు అవసరమయ్యాయి. కర్ణాటక బౌలర్ ప్రతీక్ జైన్ ఆఖరి ఓవర్ వేసేందుకు వచ్చాడు. తొలి బంతికి సాయికిశోర్ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత ప్రతీక్ రెండు వైడ్లు వేయడంతోపాటు ఐదు పరుగులు ఇచ్చాడు. దాంతో తమిళనాడు విజయసమీకరణం ఆఖరి బంతికి ఐదు పరుగులుగా మారింది. ప్రతీక్ వేసిన ఆఖరి బంతిని షారుఖ్ ఖాన్ డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా సిక్సర్‌గా మలిచి తమిళనాడుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు సాధించింది. ఓపెనర్ రోహన్ కదమ్ ‘డకౌట్’ కాగా... మనీశ్ పాండే (15 బంతుల్లో 13; 2 ఫోర్లు), కరుణ్ నాయర్ (14 బంతుల్లో 18; 2 ఫోర్లు) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. చివర్లో అభినవ్ మనోహర్ (37 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రవీణ్ దూబే (25 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్), సుచిత్ (7 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో కర్ణాటక స్కోరు 150 పరుగులు దాటింది. తమిళనాడు బౌలర్లలో సాయికిశోర్ (3/12) రాణించాడు. 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తమిళనాడు ఒకదశలో 17.1 ఓవర్లలో 116 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. గెలుపు కోసం 17 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన దశలో షారుఖ్ సూపర్ ఇన్నింగ్స్‌తో తమ జట్టును గెలిపించాడు. ► ముస్తాక్ అలీ ట్రోఫీని అత్యధికంగా మూడుసార్లు గెలిచిన జట్టుగా తమిళనాడు గుర్తింపు పొందింది. 2006–07 సీజన్లో, 2020– 2021 సీజన్లోనూ తమిళనాడు చాంపియన్‌గా నిలిచింది. బరోడా, గుజరాత్, కర్ణాటక జట్లు రెండుసార్లు చొప్పున ముస్తాక్ అలీ ట్రోఫీని సాధించాయి. ► గుర్తింపు పొందిన టి20 క్రికెట్ టోర్నీ ఫైనల్లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి టైటిల్ సాధించిన రెండో జట్టు తమిళనాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన 2018 నిదాహాస్ ట్రోఫీ ఫైనల్లో దినేశ్ కార్తీక్ చివరి బంతికి సిక్స్ కొట్టి భారత్‌ను గెలిపించాడు. Sensational Shahrukh! 💪 💪 Sit back & relive this @shahrukh_35 blitz which powered Tamil Nadu to #SyedMushtaqAliT20 title triumph. 🏆 👏 #TNvKAR #Final Watch his knock 🎥 ⬇️https://t.co/6wa9fwKkzu pic.twitter.com/evxBiUdETk — BCCI Domestic (@BCCIdomestic) November 22, 2021 -
రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. కోహ్లిని దాటేశాడు..
Rohit Sharma breaks Virat Kohlis record with most fifty plus scores in T20 Internationals: టీ20 క్రికెట్లో రోహిత్ శర్మ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సార్లు 50కుపైగా పరుగులు చేసిన ఆటగాడిగా హిట్‌మ్యాన్ నిలిచాడు. ఈడెన్ గార్డన్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో 56 పరుగులు చేసిన రోహిత్ ఈ ఘనత సాధించాడు. అంతకముందు టీ20ల్లో విరాట్ కోహ్లి 29 సార్లు యాభైకు పైగా పరుగులు చేయగా, తాజాగా రోహిత్ 30 సార్లు సాధించి అతడి రికార్డును అధిగమించాడు. రోహిత్ 119 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. రెండో స్ధానంలో కోహ్లి ఉండగా, మూడో స్థానంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నవంబర్21న న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. చదవండి: Viral Video: సోధి సింగిల్ హ్యాండ్ స్టన్నింగ్ క్యాచ్.. రోహిత్ శర్మ షాక్