ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క ఫిఫ్టి కూడా లేదు.. ఈ "గిల్‌" మనకు అవసరమా..? | IND Vs ZIM 3rd T20: Shubman Gill In Worst Form In T20Is, Gill Scores In Last 10 T20 Innings | Sakshi
Sakshi News home page

ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క ఫిఫ్టి కూడా లేదు.. ఈ "గిల్‌" మనకు అవసరమా..?

Published Tue, Jul 9 2024 5:49 PM | Last Updated on Tue, Jul 9 2024 6:12 PM

IND VS ZIM 3rd T20: Shubman Gill In Worst Form In T20Is

టీ20 వరల్డ్‌కప్‌ విజయానంతరం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి శుభ్‌మన్‌ గిల్‌ నేతృత్వంలోని కుర్ర జట్టును జింబాబ్వే పర్యటనకు పంపారు. ఈ పర్యటనను భారత్‌ ఘోర ఓటమితో ప్రారంభించి, ఆతర్వాతి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో సమంగా నిలిచింది.

రెండో టీ20లో అంతా బాగుంది అనుకున్నా, ఒక్క విషయం మాత్రం టీమిండియాను తెగ కలవరపెడుతుంది. కెప్టెన్‌ గిల్‌ పేలవ ఫామ్‌ అభిమానులతో పాటు యాజమాన్యాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. గిల్‌ గత 10 టీ20 ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒకే ఒక హాఫ్‌ సెంచరీ చేసి తన టీ20 కెరీర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టుకున్నాడు. గిల్‌ ఆడిన గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో అయితే కనీసం ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా లేదు.

ఈ పేలవ ఫామ్‌ కారణంగానే అతను టీ20 వరల్డ్‌కప్‌ జట్టుకు కూడా ఎంపిక కాలేదు. గిల్‌.. జింబాబ్వే పర్యటనలో అయినా ఫామ్‌లో వస్తాడని యాజమాన్యం అతన్ని ఈ టూర్‌కు ఎంపిక​ చేసింది. 

గిల్‌ ఇదే పేలవ ఫామ్‌ను కొనసాగిస్తే భవిష్యత్తులో టీ20 జట్టు నుంచి కనుమరుగవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. జింబాబ్వే పర్యటనలో తదుపరి మ్యాచ్‌ల్లో రాణించకపోతే టీ20 జట్టు నుంచి శాశ్వతంగా తప్పించడం ఖాయమని వారు అభిప్రాయపడుతున్నారు. సోషల్‌మీడియాలో గిల్‌ విపరీతమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. ఈ గిల్‌ మనకు అవసరమా అని టీమిండియా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

రేసులో నిలబడగలడా..?
రోహిత్‌, కోహ్లి టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించినా ఓపెనింగ్‌ స్థానం కోసం చాలామంది రేసులో ఉన్నారు. రెండో టీ20లో సెంచరీతో విరుచుకుపడిన అభిషేక్‌ శర్మ కొత్తగా శుభ్‌మన్‌ గిల్‌కు పోటీగా వచ్చాడు. ఇప్పటికే యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ రేసులో ఉన్నారు. వీరందరి నుంచి పోటీని తట్టుకుని గిల్‌ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి.

గత 10 టీ20 ఇన్నింగ్స్‌ల్లో గిల్‌ స్కోర్లు..

జింబాబ్వేతో రెండో టీ20- 2 (4)
జింబాబ్వేతో తొలి టీ20- 31 (29)
ఆఫ్ఘనిస్తాన్‌తో తొలి టీ20- 23 (12)
సౌతాఫ్రికాతో మూడో టీ20- 12 (6)
సౌతాఫ్రికాతో రెండో టీ20- 0 (2)
వెస్టిండీస్‌తో ఐదో టీ20- 9 (9)
వెస్టిండీస్‌తో నాలుగో టీ20- 77 (47)
వెస్టిండీస్‌తో మూడో టీ20- 6 (11)
వెస్టిండీస్‌తో రెండో టీ20- 7 (9)
వెస్టిండీస్‌తో తొలి టీ20- 3 (9)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement