T20 WC 2026: విండీస్‌తో డూ ఆర్‌ డై మ్యాచ్‌.. టీమిండియా ఇదే..! | T20 WC 2026 IND Vs WI: Team India Won The Toss And Choose To Bowl, Check Out Final Squad Details | Sakshi
Sakshi News home page

T20 WC 2026: విండీస్‌తో డూ ఆర్‌ డై మ్యాచ్‌.. టీమిండియా ఇదే..!

Mar 1 2026 6:40 PM | Updated on Mar 1 2026 8:56 PM

T20 WC 2026 IND VS WI: team india won the toss and choose to bowl

టీ20 ప్రపంచకప్‌ 2026లో ఇవాళ (మార్చి 1) డూ ఆర్‌ డై మ్యాచ్‌ జరుగుతుంది. కోల్‌కతా వేదికగా జరుగనున్న  ఈ సూపర్‌-8 మ్యాచ్‌లో భారత్‌, వెస్టిండీస్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్‌-1 నుంచి సెమీస్‌కు చేరుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

అత్యంత ​కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్‌లో జింబాబ్వేపై ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. మరోవైపు ఈ మ్యాచ్‌ కోసం వెస్టిండీస్‌ ఓ మార్పు చేసింది. బ్రాండన్‌ కింగ్‌ స్థానంలో అకీల్‌ హొసేన్‌  తుది జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు..
భారత్‌: సంజూ శాంసన్ (WK), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్

వెస్టిండీస్‌: షాయ్ హోప్ (c & wk), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్‌, అకీల్ హోసేన్, గుడకేష్ మోటీ, షమర్ జోసెఫ్

 

Advertisement
 
Advertisement
Advertisement