అమెరికా-ఇరాన్‌ యుద్దం.. క్రికెట్‌ సిరీస్‌ రద్దు | Pakistan Become The 1st Team To Suffer Over America-Iran War, England Cancelled Series Amid Security Concerns In Abu Dhabi | Sakshi
Sakshi News home page

అమెరికా-ఇరాన్‌ యుద్దం.. క్రికెట్‌ సిరీస్‌ రద్దు

Mar 1 2026 3:12 PM | Updated on Mar 1 2026 5:42 PM

Pakistan Become The 1st Team To Suffer America-Iran War, England Cancelled Series

అమెరికా-ఇరాన్ యుద్ద ప్రభావం క్రికెట్ ప్రపంచంపై కూడా పడింది. పాకిస్తాన్‌ షాహీన్స్‌తో (ఏ జట్టు) జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్‌ లయన్స్‌ (ఏ జట్టు) రద్దు చేసుకుంది. ఈ సిరీస్‌ యూఏఈలోని అబుదాబీ వేదికగా జరుగుతుంది. అబుదాబీ నగరం ప్రస్తుతం ఇరాన్‌ దాడులతో అట్టుడికిపోతుంది.

అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్‌ అమెరికా ఎయిర్‌బేస్‌ల్లో ఒకటైన అబుదాబీని టార్గెట్‌ చేసింది. శక్తివంతమైన బాలిస్టిక్ మిసైళ్లతో దాడులు చేస్తుంది. అక్కడే ఇంగ్లండ్‌ లయన్స్ జట్టు మరియు సపోర్ట్ స్టాఫ్ చిక్కుకుపోయారు. భారతకాలం ప్రకారం ఇవాళ (మార్చి 1) ఉదయం 11 గంటలకు ఇంగ్లండ్‌ లయన్స్‌-పాకిస్తాన్‌ షాహీన్స్‌ మధ్య రెండో వన్డే జరగాల్సి ఉండింది.

అయితే భద్రతా కారణాల వల్ల ఈ మ్యాచ్‌తో పాటు మిగతా సిరీస్‌ మొత్తాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది.“జట్టు భద్రత మా ప్రాధాన్యత. పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నాం” ఈసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇంగ్లండ్‌ కోచింగ్‌ బృందంలో ఆ దేశ దిగ్గజ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ సహా విధ్వంసకర వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టో ఉన్నట్లు తెలుస్తుంది.

కాగా, ఇంగ్లండ్‌ లయన్స్‌-పాకిస్తాన్‌ షాహీన్స్‌ మధ్య 3 టీ20లు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ అబుదాబీ వేదికగా షెడ్యూలైంది. ఈ మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌లో తొలుత టీ20లు జరగగా.. ఇంగ్లండ్‌ 3-0 తేడాతో ఆ సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 27న జరిగిన తొలి వన్డేలోనూ ఇంగ్లండే విజయం సాధించి, 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్‌లోని 3, 4, 5 వన్డేలు మార్చి 4, 6, 9 తేదీల్లో జరగాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement