మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హోబర్ట్ వేదికగా భారత్‌తో జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా మహిళల జట్టు అతి భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి టీమిండియా కెప్టెన్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఏకంగా 409 పరుగులు చేసింది.
కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్ అలైస్సా హీలీ (మిచెల్ స్టార్క్ భార్య) (98 బంతుల్లో 158; 27 ఫోర్లు, 2 సిక్సర్లు), వికెట్ కీపర్ బ్యాటర్ బెత్ మూనీ (84 బంతుల్లో 106 నాటౌట్; 10 ఫోర్లు, సిక్స్) విధ్వంసకర శతకాలతో విరుచుకుపడ్డారు.
జార్జియా వాల్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో నికోలా కేరీ (15 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) బ్యాట్ ఝులిపించింది. మిగతా ప్లేయర్లలో ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 14, అన్నాబెల్ సదర్‌ల్యాండ్ 23, ఆష్లే గార్డ్‌నర్ 4, తహ్లియా మెక్‌గ్రాత్ 2, జార్జియా వేర్హమ్ ఒక్క పరుగు చేశారు.
భారత బౌలర్లలో స్నేహ్ రాణా, శ్రీచరణి చెరో 2 వికెట్లు తీయగా.. రేణుకా ఠాకూర్, కశ్వీ గౌతమ్, దీప్తి శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు. రేణుకా, రాణా మినహా మిగతా ముగ్గురు భారత బౌలర్లను ఆసీస్ ప్లేయర్లు చెడుగుడు ఆడుకున్నారు. కశ్వీ గౌతమ్ 10 ఓవర్లలో 83, దీప్తి శర్మ 10 ఓవర్లలో 90 పరుగులు ఇవ్వగా.. శ్రీచరణి 10 ఓవర్లలో ఏకంగా 106 పరుగులు సమర్పించుకుంది. రేణుకా, రాణా తలో 10 ఓవర్లలో చెరో మెయిడిన్ వేసి 64, 66 పరుగులు ఇచ్చారు.
కాగా, ఆసీస్ ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే ఇదివరకే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆసీస్ తొలి రెండు వన్డేల్లో గెలవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగుతుంది. అంతకుముందు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మూడో వన్డే తర్వాత ఇరు జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ కూడా జరుగుతుంది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది.


