IND vs AUS: టీమిండియాను చిత్తు చేసిన ఆసీస్‌ | IND W vs AUS W: Georgia Voll 100 Australia Beat India Won ODI series | Sakshi
Sakshi News home page

IND vs AUS: టీమిండియాను చిత్తు చేసిన ఆసీస్‌

Feb 27 2026 4:39 PM | Updated on Feb 27 2026 4:49 PM

IND W vs AUS W: Georgia Voll 100 Australia Beat India Won ODI series

ఆస్ట్రేలియా పర్యటనను ఘనంగా ఆరంభించిన భారత మహిళా క్రికెట్‌ జట్టు అదే జోరు కొనసాగించలేకపోయింది. టీ20 సిరీస్‌లో ఆతిథ్య జట్టుపై 2-1తో ఆధిపత్యం కనబరిచిన హర్మన్‌ సేన.. వన్డే సిరీస్‌లో మాత్రం మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను ఆసీస్‌కు సమర్పించుకుంది.

తొలుత బ్యాటింగ్‌
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో గెలిచిన ఆస్ట్రేలియా.. రెండో వన్డేలోనూ భారత్‌ను ఓడించింది. హోబర్ట్‌ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లు ప్రతీకా రావల్‌ (52), స్మృతి మంధాన (31) శుభారంభం అందించగా.. జెమీమా రోడ్రిగ్స్‌ (11) మాత్రం విఫలమైంది.

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అర్ద శతకం
కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అర్ద శతకం (54)తో రాణించగా.. రిచా ఘోష్‌ (22), కశ్వీ గౌతం (25) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో భారత్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 251 పరుగులు మేర మెరుగైన స్కోరు సాధించింది. ఆసీస్‌ బౌలర్లలో అనాబెల్‌ సదర్లాండ్‌, అలనా కింగ్‌, ఆష్లే గార్డ్‌నర్‌ రెండేసి వికెట్లు కూల్చగా.. మేగన్‌ షట్‌, నికోలా క్యారీ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

ఇక లక్ష్య ఛేదనలో ఆసీస్‌ ఆరంభంలో తడబడినా.. 36.1 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. టాపార్డర్‌లో కెప్టెన్‌ అలిసా హేలీ (6) విఫలం కాగా.. మరో ఓపెనర్‌ ఫోబే లిచిఫీల్డ్‌, వన్‌డౌన్‌ బ్యాటర్‌ జార్జియా వోల్‌ అదరగొట్టారు.

జార్జియా శతకంతో..
లిచిఫీల్డ్‌ 62 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్‌ బాది 80 పరుగులు చేయగా.. జార్జియా శతక్కొట్టింది. మొత్తంగా 82 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో 101 పరుగులు సాధించింది. మిగిలిన వారిలో బెత్‌ మూనీ 31 పరుగులు చేయగా.. అనాబెల్‌ (10) విఫలమైంది.

అయితే, ఆష్లే​ గార్డ్‌నర్‌ 19 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టు గెలుపును ఖరారు చేసింది. భారత బౌలర్లలో కశ్వీ గౌతం, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీయగా.. క్రాంతి గాడ్‌కు ఒక వికెట్‌ దక్కింది. ఇక భారత్‌- ఆసీస్‌ మధ్య నామమాత్రపు మూడో వన్డే ఆదివారం జరుగుతుంది. ఇందుకు హోబర్ట్‌ వేదిక. తదుపరి ఇరుజట్లు ఏకైక టెస్టు ఆడతాయి.

చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్‌ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement