breaking news
Georgia Voll
-
‘ఆమెతో నా భార్యకు వివాహేతర సంబంధం’
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, మహిళా జట్టు వైస్ కెప్టెన్ ఆష్లే గార్డ్నర్పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఆష్లేకు సహచర క్రికెటర్‌తో వివాహేతర సంబంధం ఉందని.. ఆమె భాగస్వామి మోనికా రైట్ ఆరోపించింది. కాగా ఆష్లే గార్డ్నర్- మోనికా రైట్ 2020లో డేటింగ్ యాప్ ద్వారా పరిచయమ్యారు.పెళ్లైన కొన్ని నెలలకేదాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ అమ్మాయిలు.. 2025, ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు. అత్యంత సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా ఆష్లే- మోనికా వివాహ వేడుక జరిగింది. అయితే, పెళ్లైన కొన్ని నెలలకే వీరి మధ్య విభేదాలు వచ్చాయని.. అప్పటి నుంచి వీరు విడివిడిగా ఉంటున్నారని డెయిలీ మెయిల్ కథనం ప్రచురించింది.ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 సందర్భంగా ఆష్లేను చూడటానికి మెనికా ఇండియాకు రాగా.. ఆష్లే ఆమెతో సరిగ్గా మాట్లాడలేదని పేర్కొంది. ఈ క్రమంలోనే తన వెడ్డింగ్ రింగ్‌ను కూడా ఆష్లే పక్కనపెట్టిందని వేరేవారి ద్వారా మెనికాకు తెలిసిందని సదరు కథనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో మోనికా రైట్ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించింది.నా భార్యకు ఈమెతోనే సంబంధం ఉందిడెయిలీ మెయిల్ కథనాన్ని అసంబద్ధమైనదిగా పేర్కొంటూనే.. షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఆసీస్ యువ ఓపెనర్ జార్జియా వోల్ ఫొటోను షేర్ చేసిన మోనికా.. ‘‘నా భార్యకు ఈమెతోనే సంబంధం ఉంది. ఈమె కోసమే నన్ను మోసం చేసింది’’ అని పేర్కొంది. కాగా ఇటీవల ముగిసిన మహిళల టీ20 ప్రపంచకప్-2026లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.రికార్డు స్థాయిలో ఏకంగా ఏడోసారి కంగారూ జట్టు ఈ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇందులో ఆష్లే గార్డ్నర్ది కీలక పాత్ర. ఇక ఈ టోర్నీతోనే తొలిసారి ప్రపంచకప్ ఆడిన జార్జియా వోల్ సైతం మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందంటూ ఆష్లే పార్ట్నర్ మోనికా ఆరోపించడం వైరల్‌గా మారింది. కాగా పెళ్లైన కొన్నాళ్ల తర్వాత పిల్లల విషయంలో నిర్ణయం తీసుకునే క్రమంలోనే ఆష్లే- మోనికా మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇక మోనికా ఆరోపణలపై ఇటు ఆష్లే గానీ.. అటుక్రికెట్ ఆస్ట్రేలియా గానీ స్పందించలేదు.??😭😭 pic.twitter.com/vTNgL0SLLH— Shailesh (@shailesh18_) July 13, 2026 -
శతక్కొట్టిన జార్జియా వోల్.. సిరీస్ క్లీన్‌స్వీప్
వెస్టిండీస్ పర్యటనలో ఆస్ట్రేలియా మహిళల జట్టు శుభారంభం చేసింది. వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం కింగ్స్టౌన్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 40 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. జార్జియా వోల్ (53 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) శతకంతో మెరిసింది. చివర్లో నికోలా కేరీ (24 నాటౌట్), సోఫీ మొలినెక్స్ (25) రాణించారు. అయితే ఆసీస్ చేసిన స్కోరులో సగం పరుగులు జార్జియావే ఉండడం విశేషం. కాగా జార్జియా వోల్‌కు ఇదే తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ కావడం విశేషం.వెస్టిండీస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ 3 వికెట్లు తీయగా, జాజ్రా క్లాక్స్టన్ 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ వర్షం అంతరాయం కలిగించే సమయానికి 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (30 నాటౌట్), డియాండ్రా దొతిన్ (11 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో ఎలీస్పెర్రీ, మేగన్ స్కాట్,లూసీ హామిల్టన్ తలా ఒక వికెట్ తీశారు. అయితే వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేసి డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఆస్ట్రేలియాను విజేతగా ప్రకటించారు. సెంచరీతో విధ్వంసం సృష్టించిన జార్జియా వోల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకోగా, అలానా కింగ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచింది. ఇరుజట్ల మధ్య తొలి వన్డే శుక్రవారం జరగనుంది.చదవండి: IPL 2026: ‘పరాగ్‌కు అంత సీన్ లేదు’ -
IND vs AUS: టీమిండియాను చిత్తు చేసిన ఆసీస్
ఆస్ట్రేలియా పర్యటనను ఘనంగా ఆరంభించిన భారత మహిళా క్రికెట్ జట్టు అదే జోరు కొనసాగించలేకపోయింది. టీ20 సిరీస్‌లో ఆతిథ్య జట్టుపై 2-1తో ఆధిపత్యం కనబరిచిన హర్మన్ సేన.. వన్డే సిరీస్‌లో మాత్రం మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను ఆసీస్‌కు సమర్పించుకుంది.తొలుత బ్యాటింగ్‌మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో గెలిచిన ఆస్ట్రేలియా.. రెండో వన్డేలోనూ భారత్‌ను ఓడించింది. హోబర్ట్ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ప్రతీకా రావల్ (52), స్మృతి మంధాన (31) శుభారంభం అందించగా.. జెమీమా రోడ్రిగ్స్ (11) మాత్రం విఫలమైంది.హర్మన్‌ప్రీత్ కౌర్ అర్ద శతకంకెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అర్ద శతకం (54)తో రాణించగా.. రిచా ఘోష్ (22), కశ్వీ గౌతం (25) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 251 పరుగులు మేర మెరుగైన స్కోరు సాధించింది. ఆసీస్ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్, అలనా కింగ్, ఆష్లే గార్డ్నర్ రెండేసి వికెట్లు కూల్చగా.. మేగన్ షట్, నికోలా క్యారీ ఒక్కో వికెట్ పడగొట్టారు.ఇక లక్ష్య ఛేదనలో ఆసీస్ ఆరంభంలో తడబడినా.. 36.1 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. టాపార్డర్‌లో కెప్టెన్ అలిసా హేలీ (6) విఫలం కాగా.. మరో ఓపెనర్ ఫోబే లిచిఫీల్డ్, వన్‌డౌన్ బ్యాటర్ జార్జియా వోల్ అదరగొట్టారు.Georgia Voll had us all nervous on 99 😅 She's got her second ODI ton 👏 #AUSvIND pic.twitter.com/eP41Tfx5Qp— cricket.com.au (@cricketcomau) February 27, 2026జార్జియా శతకంతో..లిచిఫీల్డ్ 62 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్ బాది 80 పరుగులు చేయగా.. జార్జియా శతక్కొట్టింది. మొత్తంగా 82 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 101 పరుగులు సాధించింది. మిగిలిన వారిలో బెత్ మూనీ 31 పరుగులు చేయగా.. అనాబెల్ (10) విఫలమైంది.అయితే, ఆష్లే గార్డ్నర్ 19 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టు గెలుపును ఖరారు చేసింది. భారత బౌలర్లలో కశ్వీ గౌతం, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీయగా.. క్రాంతి గాడ్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక భారత్- ఆసీస్ మధ్య నామమాత్రపు మూడో వన్డే ఆదివారం జరుగుతుంది. ఇందుకు హోబర్ట్ వేదిక. తదుపరి ఇరుజట్లు ఏకైక టెస్టు ఆడతాయి.చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్


