ఆస్ట్రేలియా వైస్‌ కెప్టెన్‌పై మాజీ భార్య సంచలన ఆరోపణలు | Ashleigh Gardner ex wife demands cricketer be stripped of vice captaincy | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా వైస్‌ కెప్టెన్‌పై మాజీ భార్య సంచలన ఆరోపణలు

Aug 8 2026 5:59 PM | Updated on Aug 8 2026 6:11 PM

Ashleigh Gardner ex wife demands cricketer be stripped of vice captaincy

source: X

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు వైస్‌ కెప్టెన్‌ ఆష్లే గార్డ్నర్‌పై ఆమె మాజీ భార్య మోనికా రైట్ సంచలన ఆరోపణలు చేసింది. గార్డ్నర్‌ సహచర క్రికెటర్‌ జార్జియా వోల్‌తో సంబంధం పెట్టుకుందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో గార్డ్నర్‌ను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. 

ఈ వ్యవహారంపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించకపోవడాన్ని ప్రశ్నించింది. దేశానికి ప్రాతినిధ్యం వహించే ప్లేయర్లు ఆదర్శంగా ఉండాలని పేర్కొంది.

కాగా, వాల్‌ చేసిన ఆరోపణలను క్రికెట్‌ ఆస్ట్రేలియా వ్యక్తిగత అంశంగా పరిగణిస్తుంది. మరోవైపు  గార్డ్నర్‌కు ఆమె బిగ్‌బాష్‌ లీగ్‌ జట్టు సిడ్నీ సిక్సర్స్ మాత్రం మద్దతుగా నిలిచింది. గార్డ్నర్‌ను వచ్చే సీజన్‌లో కూడా కెప్టెన్‌గా కొనస్తామని తెలిపింది. గార్డ్నర్ గతేడాదే ఎలీస్ పెర్రీ స్థానంలో సిక్సర్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది.

పెళ్లైన కొన్ని నెలలకే..!
మోనికా రైట్, ఆష్లే గార్డ్నర్‌ 2025 ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని నెలలకే వీరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. కొద్ది రోజల కిందట గార్డ్నర్‌, రైట్‌ ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి కలిసి ఉన్న ఫొటోలను తొలగించారు. ప్రస్తుతం ఇద్దరూ విడాకుల ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement