భారత క్రికెటర్ జైస్వాల్‌తో డేటింగ్? క్లాస్ పీకిన మృణాల్ | Mrunal Thakur Reacts On Dating Rumors With Yashasvi Jaiswal | Sakshi
Sakshi News home page

Mrunal Thakur: డేటింగ్ రూమర్స్.. మృణాల్ స్పందన ఇది

Aug 8 2026 5:02 PM | Updated on Aug 8 2026 5:10 PM

Mrunal Thakur Reacts On Dating Rumors With Yashasvi Jaiswal

సినిమా సెలబ్రిటీలకు సంబంధించి ఎప్పటికప్పుడు రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. అలా రీసెంట్ టైంలో హీరోయిన్ మృణాల్ ఠాకుర్ గురించి ఒకటి బయటకొచ్చింది. భారత యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్‌తో డేటింగ్‌లో ఉందని అన్నారు. ముంబైలోని ఓ కాఫీ షాప్‌లో జంటగా కనిపించారని పుకార్లు తెగ అల్లేశారు. ఇప్పుడు దీనిపై స్వయంగా మృణాల్ స్పందించింది. కామెంట్ పెట్టి క్లాస్ పీకింది.

(ఇదీ చదవండి: సినిమా మీద మేం చేసే ఆ ఖర్చంతా వేస్ట్: నిర్మాత నాగవంశీ)

తను-జైస్వాల్ వైరల్ వీడియోకు సంబంధించి ఓ ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ కనిపించగా.. దానికి మృణాల్ కామెంట్ పెట్టింది. ఒకేచోట కనిపించినంత మాత్రాన ఇద్దరి మధ్య సంబంధం ఉందని ఎలా భావిస్తారు? అలా ఎలా అనుకుంటారు? అని ప్రశ్నించింది.

'బ్రో రిలాక్స్.. మేమిద్దరం కలిసి ఎక్కడ కనిపించాం? మీరు ఇంత చదువుకున్నవాళ్లు కానీ ఇలాంటి పుకార్లను నిజమని ఎలా నమ్ముతున్నారు? దేశంలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. జెన్-జీ నుంచి కొంత నేర్చుకోండి. సరైన సమస్యలపై వీడియోలు చేయండి. అప్పుడు మరిన్ని వ్యూస్ వస్తాయి' అని మృణాల్ కామెంట్ చేసినట్లు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది రూమర్‌కి స్పందించినట్లు లేదు. చిన్నపాటి క్లాస్ పీకినట్లు ఉంది.

అయితే మృణాల్‌పై డేటింగ్ రూమర్స్ ఇదేం కొత్త కాదు. తమిళ హీరో ధనుష్‌తో డేటింగ్‌లో ఉందని, వాలంటైన్స్ డే నాడు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెగ మాట్లాడుకున్నారు. తీరా చూస్తే అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనని తేలిపోయింది. ఈ బ్యూటీ కెరీర్ విషయానికొస్తే.. ఈ ఏడాది ఈమె నుంచి మూడు సినిమాలొచ్చాయి. వాటిలో 'డెకాయిట్' అనే తెలుగు మూవీ ఉంది. త్వరలో 'పూజా మేరీ జాన్' అనే ఓటీటీ చిత్రంలో కనిపించనుంది.

(ఇదీ చదవండి: లోకేశ్ 'డిసి'.. విజయ్ దేవరకొండే చేయాలి కానీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement