బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన ‘ఓహ్ మై డాగ్’ ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. అమిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జంతుప్రేమికులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. కుక్కలు, మనుషుల మధ్య అనుబంధాన్ని ప్రధానంగా చూపించారు. ఈ సినిమాకు మంచి స్పందన వస్తున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద తొలిరోజు బోల్తాకొట్టినట్లు కనిపిస్తోంది. సాక్‌నిల్క్(saknilk) ప్రకారం.. ఇండియాలో తొలి రోజు ‘ఓహ్ మై డాగ్’ సుమారు రూ.85లక్షల నెట్ వసూళ్లు సాధించింది. గ్రాస్ కలెక్షన్లు దాదాపు రూ.1.02 కోట్లుగా నమోదయ్యాయి. శుక్రవారం ఈ సినిమా 844 షోలను ప్రదర్శంచారు. తక్కువ సంఖ్యలో తెరలపై విడుదల కావడం కూడా ఈ వసూళ్లపై ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. వీకెండ్ కావడంతో వసూళ్లు పెరిగే అవకాశముంది.
ఈ సినిమాని కుక్కలు,వాటితో మనుషులకు ఏర్పడే అనుబంధమే ప్రధాన కథాంశంగా తెరకెక్కించారు దర్శకుడు అమిత్ రాయ్. గతంలో పంకజ్ త్రిపాఠితో ‘ ఓహ్ మై గాడ్’ గా ఇప్పుడు ‘ఓహ్ మై డాగ్’గా టైటిల్ మార్చి తెరకెక్కించారు. ఇక సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. సుమారు రూ.8 కోట్ల నుంచి రూ.25 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం.


