ఈ వారం ఓటీటీల్లో చాలా సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో లెనిన్, ఓ సుకుమారి, ఎమ్మార్పీ లాంటి తెలుగు చిత్రాలు ఉండగా హృదయం మురళి, వంద దేవుళ్లు, ఉయిర్, మై వాపస్ ఆవుంగా లాంటి డబ్బింగ్‌లు.. వదంది 2, ఆపరేషన్ సఫేద్ సాగర్ తదితర తెలుగు డబ్బింగ్ సిరీస్‌లు కూడా వచ్చాయి. ఇలా చూసేందుకు బోలెడన్ని ఉండగా మరో తెలుగు మూవీ నేరుగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది.
(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'ఉయిర్' తెలుగు రివ్యూ)
రాము, శివకృష్ణ, ప్రదీప్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'పంచనామా'. లెక్క ప్రకారం గత నెలలో థియేటర్లలో రిలీజ్ కావాలి. కానీ అది జరిగినట్లు లేదు. దీంతో తాజాగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. కాకపోతే అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ స్టోరీతో తీసిన ఈ మూవీకి జాన్ రమేశ్ దర్శకత్వం వహించాడు.
'పంచనామా' విషయానికొస్తే.. నగరంలో వరస హత్యలు జరుగుతాయి. ఇవి ఎవరు చేస్తున్నారో తెలీక పోలీసులు తలలు పట్టుకుంటారు. హంతకుడి గురించి ఒక్క క్లూ కూడా దొరకదు. దీంతో స్పెషల్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. ఇంతకీ ఈ హత్యలకు కారణం ఎవరు? పోలీసులు చివరకు నిందితుడిని పట్టుకున్నారా లేదా అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి కంగనా రనౌత్ థ్రిల్లర్ సినిమా.. అధికారిక ప్రకటన)


