ప్రస్తుతం లోక్‌సభ ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్.. మరోవైపు సినిమాలు కూడా చేస్తోంది. అలా ఈ ఏడాది ఈమె నుంచి వచ్చిన మూవీ 'భారత భాగ్య విధాత'. 26/11 దాడుల నేపథ్య కథతో తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'ఉయిర్' తెలుగు రివ్యూ)
కంగనా రనౌత్ ప్రధాన పాత్ర చేసి ఓ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు మనోజ్ తపాడియా దర్శకుడు. 26/11 దాడులు జరిగినప్పుడు ముంబైలోని కామా ఆస్పత్రిలో అంజలి అనే నర్స్, 20 మంది గర్భిణిలని రక్షించింది. ఆమె జీవితకథ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తీశారు. జూన్ 12న థియేటర్లలో రిలీజైంది గానీ జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చే శుక్రవారం (ఆగస్టు 14) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.
26/11 టెర్రర్ ఎటాక్ సమయంలో ఆస్పత్రిలో రోగులని కాపాడిన గీతా మాధవ్ (కంగనా రనౌత్) అనే నర్స్ పోరాటం, ఆమె ధైర్యం, అలానే ఈమెకు తోడుగా మరికొందరు నర్సులు కూడా ఎలాంటి సాహసం చేశారు? చివరకు ఏమైందనేదే 'భారత భాగ్య విధాత' స్టోరీ.
ఇకపోతే ఓటీటీల్లో ఈ వారం బోలెడన్ని కొత్త సినిమాలు వచ్చేశాయి. వీటిలో లెనిన్, ఓ సుకుమారి, ఎమ్మార్పీ, హృదయం మురళి, వంద దేవుళ్లు, డార్క్ సీక్రెట్స్, వదంది 2, సఫేద్ సాగర్, ఉయిర్, మై వాపస్ ఆవుంగా లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ తెలుగు మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ సినిమా)
An untold story of ordinary nurses who stood with extraordinary courage on the darkest night of 26/11.
Some heroes were never seen. Their stories were never told.
Until now.
Bharat Bhhagya Viddhaata Trailer Out Now.#BharatBhhagyaViddhaata premieres on 14th Aug on Hindi Zee 5… pic.twitter.com/gq6b61Piet— ZEE5Official (@ZEE5India) August 7, 2026


