బోల్డ్ సీన్స్ చేశానని.. చాలా సింపుల్‌గా అడుగుతున్నారు: రాధికా ఆప్టే | bollywood actress Radhika apte Reveals shocking truth behind scenes | Sakshi
Sakshi News home page

Radhika apte: 'నగ్నంగా నటించానని.. ఇప్పుడదే అడుగుతున్నారు'

Sep 19 2026 8:03 PM | Updated on Sep 19 2026 8:06 PM

bollywood actress Radhika apte Reveals shocking truth behind scenes

తెలుగులో బాలయ్య సరసన మెప్పించిన బ్యూటీ రాధికా ఆప్టే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది. ఇటీవలే లస్ట్ స్టోరీస్-3 వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది. గతంలో బోల్డ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం అలాంటి పాత్రలు చేయడం లేదని అంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ నటి.. బోల్డ్ సీన్స్‌ ఎంపిక, కథకు అవసరాలపై మాట్లాడింది. 

కొందరు కథకు అవసరం లేకపోయినా తనతో ముద్దు సీన్లు చేయించేందుకు యత్నించారని రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్ చేసింది. గతంలో తాను చేసిన బోల్డ్ పాత్రల వల్ల అలానే చేస్తానని అడిగారని గుర్తు చేసుకుంది. తనను కేవలం లోదుస్తులతో ఓ యాక్షన్ సన్నివేశంలో నటించాలని కూడా కోరారని రాధికా తెలిపింది. కొందరైతే ఓ 15 సెకన్లు ఏదో అలా ముద్దు సీన్ కవర్ చేసేయండి చాలా సింపుల్‌గా అడుగుతున్నారని చెప్పుకొచ్చింది. ఆ సీన్ చేయడానికి అంగీకరించలేదని వెల్లడించింది. అయితే ఆ సీన్ నన్ను చేయమని అడిగిన వ్యక్తి పేరు చెబితే మీరంతా ఆశ్చర్యపోతారని పేర్కొంది.

రాధికా మాట్లాడుతూ..' నా కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నగ్నంగా నటించా. కానీ అదంతా అప్పుడు చేశా. అది చూసే నన్ను సులభంగా ఓకే చెబుతుందిలే అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయా. అలాంటి సీన్స్  చేయడం లేదు. తానే చేసే మూవీలో బోల్డ్ సీన్స్ చేయడానికి కారణం చెప్పాలని అడుగుతున్నానని' పేర్కొంది. కాగా.. రాధికా ఆప్టే నటించిన లస్ట్ స్టోరీస్-3 ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement