breaking news
Lust Stories 3
-
ఇంటిమేట్ సీన్ వల్ల గుమ్మం దాటలేకపోయా.. నరకం అనుభవించా
బోల్డ్ పాత్రలు, బోల్డ్ కామెంట్స్‌తో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే బ్యూటీ రాధిక ఆప్టే. లెజెండ్, లయన్ తదితర తెలుగు సినిమాల్లోనూ హీరోయిన్ చేసిన ఈమె.. తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైంది. రీసెంట్ టైంలో ఈమె 'లస్ట్ స్టోరీస్ 3' సిరీస్‌లో నటించింది. దీని ప్రమోషన్లలో భాగంగా తనకు గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. తన ఇంటిమేట్ సీన్ లీకైన కారణంగా నరకం అనుభవించానని చెప్పుకొచ్చింది.'ఓసారి నేను నటించిన ఇంటిమేట్ సీన్ లీక్ కావడంతో నాలుగురోజుల పాటు ఇంటి గుమ్మం దాటలేకపోయాను. ఇరుగుపొరుగు వాళ్లు నా వీడియో చూస్తున్నారని తెలిసి నరకం అనుభవించాను. నా కారు డ్రైవర్, ఇంటి వాచ్‌మన్ పదేపదే ఆ వీడియో చూశారు. నేను చేసిన సీన్ చూసిన బయటవాళ్లు ఎక్కడ నా ఇంటికి వచ్చేస్తారోనని భయపడ్డాను. ఆ అనుభవం భద్రత విషయంలో నన్ను భయపెట్టింది. ఈ వీడియోలో నటించిన టైంలో ఒంటరిగా నివసిస్తుండడంతో నా డ్రైవర్, నా వ్యక్తిగత సిబ్బందితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. వాళ్లకు ఫోన్ చేసి పరిస్థితి వివరించాను. ఆ క్లిప్ చూశారా? ఒకవేళ చూసినా మీరు నాతో కలిసి పనిచేయడానికి రెడీగా ఉంటేనే రండి అని చెప్పాను. నా పరిస్థితి అర్థం చేసుకున్న వాళ్లు నాకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు''అలానే ఓసారి యాక్షన్ సీన్ చేసేటప్పుడు షర్ట్ గుండీలు తీసి నటిస్తారా? అని నన్ను అడిగారు. యాక్షన్ సీక్వెన్స్‌లో శరీరాన్ని వేగంగా కదిలిస్తాం కాబట్టి కుదరదని చెప్పాను. అయినా సరే ఆ వ్యక్తి నన్ను వినిపించుకోకుండా కనీసం లో దుస్తులైన ధరించి ఆ సీన్ చేయమని ఒప్పించే ప్రయత్నం చేశాడు. నేను ఒప్పుకోలేదు. సినిమాని హిట్ చేయడం కోసం మహిళలని వారి పరిధి దాటేలా ఒత్తిడి చేయడం కరెక్టా?' అని రాధిక ఆప్టే ఆవేదన వ్యక్తం చేసింది. -
బోల్డ్ సీన్స్ చేశానని.. చాలా సింపుల్‌గా అడుగుతున్నారు: రాధికా ఆప్టే
తెలుగులో బాలయ్య సరసన మెప్పించిన బ్యూటీ రాధికా ఆప్టే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో సినిమాలు చేస్తోంది. ఇటీవలే లస్ట్ స్టోరీస్-3 వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది. గతంలో బోల్డ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం అలాంటి పాత్రలు చేయడం లేదని అంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ నటి.. బోల్డ్ సీన్స్ ఎంపిక, కథకు అవసరాలపై మాట్లాడింది. కొందరు కథకు అవసరం లేకపోయినా తనతో ముద్దు సీన్లు చేయించేందుకు యత్నించారని రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్ చేసింది. గతంలో తాను చేసిన బోల్డ్ పాత్రల వల్ల అలానే చేస్తానని అడిగారని గుర్తు చేసుకుంది. తనను కేవలం లోదుస్తులతో ఓ యాక్షన్ సన్నివేశంలో నటించాలని కూడా కోరారని రాధికా తెలిపింది. కొందరైతే ఓ 15 సెకన్లు ఏదో అలా ముద్దు సీన్ కవర్ చేసేయండి చాలా సింపుల్‌గా అడుగుతున్నారని చెప్పుకొచ్చింది. ఆ సీన్ చేయడానికి అంగీకరించలేదని వెల్లడించింది. అయితే ఆ సీన్ నన్ను చేయమని అడిగిన వ్యక్తి పేరు చెబితే మీరంతా ఆశ్చర్యపోతారని పేర్కొంది.రాధికా మాట్లాడుతూ..' నా కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నగ్నంగా నటించా. కానీ అదంతా అప్పుడు చేశా. అది చూసే నన్ను సులభంగా ఓకే చెబుతుందిలే అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయా. అలాంటి సీన్స్ చేయడం లేదు. తానే చేసే మూవీలో బోల్డ్ సీన్స్ చేయడానికి కారణం చెప్పాలని అడుగుతున్నానని' పేర్కొంది. కాగా.. రాధికా ఆప్టే నటించిన లస్ట్ స్టోరీస్-3 ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. -
ఓటీటీలో 'లస్ట్ స్టోరీస్ 3' స్ట్రీమింగ్.. అధికారిక ప్రకటన
ఓటీటీల్లో చాలామంది సినిమాలు చూస్తుంటారు. అదే టైంలో కొన్ని సిరీస్‌లు కూడా ప్రేక్షకుల్ని అలరించడంతో పాటు ఆశ్చర్యపరుస్తాయి. అలా దాదాపు ఎనిమిదేళ్ల క్రితం రిలీజై సెన్సేషన్ సృష్టించిన సిరీస్ 'లస్ట్ స్టోరీస్'. తర్వాత కాలంలో దీనికి రెండో పార్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు మూడో సీజన్ కూడా సిద్ధం చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసి ఓ వీడియోని విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)నెట్‌ఫ్లిక్స్ పాపులర్ ఆంథాలజీ ఫ్రాంచైజీ 'లస్ట్ స్టోరీస్' మూడో భాగాన్ని ఈనె 18 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సీజన్లో ఉండే నాలుగు కథలకు విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావు, శకున్ బాత్రా, విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించారు. ప్రేమ, ఆకర్షణ, సంబంధాలు, అణచివేసిన కోరికలు అనే అంశాల ఆధారంగా వీటిని తెరకెక్కించారు. ఈ సీజన్లో రాధికా ఆప్టే, కొంకణా సేన్ శర్మ, అదితి రావు హైదరీ, రాధికా మదన్, సనా థంపి, విజయ్ వర్మ, అభిషేక్ బెనర్జీ, సిద్ధార్థ్, అలీ ఫజల్, గుర్ఫతేహ్ పిర్జాదా తదితరులు ప్రధాన పాత్రలు చేశారు.‘లస్ట్ స్టోరీస్’ ఫ్రాంచైజీ 2018లో ప్రారంభమైంది. తొలి భాగంలోని స్టోరీలకు అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీ, కరణ్ జోహార్ దర్శకత్వం వహించారు. ఈ ఆంథాలజీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంతో పాటు ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్‌కు నామినేట్ అయింది. 2023లో ‘లస్ట్ స్టోరీస్ 2’ విడుదలైంది. ఇప్పుడు మూడో సీజన్ రానుంది.మరి ఇదెలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో 'బందర్' సినిమా.. తెలుగు రివ్యూ)I won’t tell this to y’all but I am too excitedddd 🤭❤️🔥 pic.twitter.com/7jQlq9MAXw— Netflix India (@NetflixIndia) September 5, 2026


