ఇంటిమేట్ సీన్ వల్ల గుమ్మం దాటలేకపోయా.. నరకం అనుభవించా | Radhika Apte Recalls Nightmare After Intimate Scene Leak, Reveals How She Faced Pressure Over Bold Scenes | Sakshi
Sakshi News home page

Radhika Apte: నా కారు డ్రైవర్, వాచ్‌మన్ పదేపదే ఆ వీడియో చూశారు

Sep 24 2026 1:15 PM | Updated on Sep 24 2026 1:31 PM

Radhika Apte Reacts Intimate Issue With Watchman

బోల్డ్ పాత్రలు, బోల్డ్ కామెంట్స్‌తో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే బ్యూటీ రాధిక ఆప్టే. లెజెండ్, లయన్ తదితర తెలుగు సినిమాల్లోనూ హీరోయిన్‌ చేసిన ఈమె.. తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైంది. రీసెంట్ టైంలో ఈమె 'లస్ట్ స్టోరీస్ 3' సిరీస్‌లో నటించింది. దీని ప్రమోషన్లలో భాగంగా తనకు గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. తన ఇంటిమేట్ సీన్ లీకైన కారణంగా నరకం అనుభవించానని చెప్పుకొచ్చింది.

'ఓసారి నేను నటించిన ఇంటిమేట్ సీన్ లీక్ కావడంతో నాలుగురోజుల పాటు ఇంటి గుమ్మం దాటలేకపోయాను. ఇరుగుపొరుగు వాళ్లు నా వీడియో చూస్తున్నారని తెలిసి నరకం అనుభవించాను. నా కారు డ్రైవర్, ఇంటి వాచ్‌మన్ పదేపదే ఆ వీడియో చూశారు. నేను చేసిన సీన్ చూసిన బయటవాళ్లు ఎక్కడ నా ఇంటికి వచ్చేస్తారోనని భయపడ్డాను. ఆ అనుభవం భద్రత విషయంలో నన్ను భయపెట్టింది. ఈ వీడియోలో నటించిన టైంలో ఒంటరిగా నివసిస్తుండడంతో నా డ్రైవర్, నా వ్యక్తిగత సిబ్బందితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. వాళ్లకు ఫోన్ చేసి పరిస్థితి వివరించాను. ఆ క్లిప్ చూశారా? ఒకవేళ చూసినా మీరు నాతో కలిసి పనిచేయడానికి రెడీగా ఉంటేనే రండి అని చెప్పాను. నా పరిస్థితి అర్థం చేసుకున్న వాళ్లు నాకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు'

'అలానే ఓసారి యాక్షన్ సీన్ చేసేటప్పుడు షర్ట్ గుండీలు తీసి నటిస్తారా? అని నన్ను అడిగారు. యాక్షన్ సీక్వెన్స్‌లో శరీరాన్ని వేగంగా కదిలిస్తాం కాబట్టి కుదరదని చెప్పాను. అయినా సరే ఆ వ్యక్తి నన్ను వినిపించుకోకుండా కనీసం లో దుస్తులైన ధరించి ఆ సీన్ చేయమని ఒప్పించే ప్రయత్నం చేశాడు. నేను ఒప్పుకోలేదు. సినిమాని హిట్ చేయడం కోసం మహిళలని వారి పరిధి దాటేలా ఒత్తిడి చేయడం కరెక్టా?' అని రాధిక ఆప్టే ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement