7 సినిమాలు చేస్తున్నా.. రోజుకు ఎంత సంపాదిస్తానంటే? | Kumari Aunty Reveals Her Income Details, Acting Journey And Bigg Boss Opportunity In Latest Interview, Read Story Inside | Sakshi
Sakshi News home page

Kumari Aunty: ఫేమస్ కాకముందే నేను ఎక్కువ సంపాదించేదాన్ని

Sep 24 2026 10:01 AM | Updated on Sep 24 2026 10:32 AM

Kumari Aunty Income And Movies Details Latest Interview

'మీది మొత్తం 1000 అయింది. రెండు లివర్స్ ఎక్స్‌ట్రా' అనే ఒక్క మాటతో సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయిన కుమారి అంటీ.. ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా వచ్చిన ఫేమ్‌తో 'పాంచాలి పంఛభర్తృక' అనే సినిమాలోనూ నటించింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ, మరోవైపు బిజినెస్ చేసుకున్న ఈమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సంపాదన, యాక్టింగ్ కెరీర్, బిగ్‌బాస్ ఛాన్స్ గురించి చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: ‘ది ప్యారడైజ్‌’ మూవీ రివ్యూ)

'నేను హైదరాబాద్ రాకముందు ఊళ్లో మెషీన్ కుట్టేదాన్ని. పొలం పనులు చేసేదాన్ని. ఆరోజుల్లో రోజుకి రూ.50 ఇచ్చేవాళ్లు. ఏదైనా చేయాలని నా భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చి 2011లో ఈ బిజినెస్ మొదలుపెట్టాను. ఫేమస్ కాకముందే నేను ఎక్కువ గిరాకీ చేసేదాన్ని. 'మీది మొత్తం 1000 అయింది. రెండు లివర్స్ ఎక్స్‌ట్రా' అనే మాట వైరల్ అయిన తర్వాత మా హోటల్‌కి ఎ‍క్కువమంది జనాలు వచ్చారు. దీంతో మరికొందరు నా షాపు దగ్గరకు రావటానికి భయపడ్డారు. యూట్యూబ్ వల్ల నా హోటల్ గురించి జనాలకు బాగా తెలిసింది. కానీ సెలబ్రిటీలు ఏడెనిమిదేళ్ల ముందే వచ్చేవారు. సుడిగాలి సుధీర్ సినిమా షూటింగ్ మా హోటల్‌లోనే జరిగింది. మేమున్న ప్రాంతంలో ఏ మూవీ షూటింగ్ జరిగినా మ దగ్గర నుంచి ఫుడ్ తీసుకెళ్లేవాళ్లు'

'కరోనా కంటే ముందే నా హోటల్ ఫేమస్. నా దగ్గరకు వచ్చేవాళ్లు ఎక్కువగా నాన్ వెజ్ అడుగుతుంటారు. ఫేమస్ కాకముందు నా హోటల్‌కి 1500 మంది వరకు వచ్చేవాళ్లు. ఇప్పుడు 1000 మంది వరకు వస్తున్నారు. రోజుకి రూ.20 వేల కౌంటర్ సేల్ అవుతోంది. దానికి తగ్గట్లే ఖర్చులు కూడా ఉంటాయి. ఆదాయం ఎంతుందో ఖర్చులు కూడా దానికి తగ్గట్లే ఉన్నాయి. ప్రస్తుతం నేను ఏడు సినిమాల్లో నటిస్తున్నాను. అన్నీ చిన్న చిన్న పాత్రలే. గతేడాది నాకు బిగ్‌బాస్ షో నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కానీ అప్పుడు వెళ్లలేదు. ఈసారి అవకాశమొస్తే అస్సలు వదులుకోను' అని కుమారి ఆంటీ చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమాలో కేసీఆర్, ఎన్టీఆర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement