'బిగ్‌బాస్' ఫేమ్ వర్షిణి అరెస్ట్ | Bigg Boss Tamil Varshini Venkat Arrest | Sakshi
Sakshi News home page

Varshini Venkat: షార్ట్ ఫిల్మ్ తీద్దామని.. రూ.5 లక్షలు దోచేసి

Sep 24 2026 8:31 AM | Updated on Sep 24 2026 8:31 AM

Bigg Boss Tamil Varshini Venkat Arrest

రెండేళ్ల క్రితం తమిళంలో బిగ్‌బాస్ షోలో పాల్గొన్న నటి వర్షిణి వెంకట్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. యువకుడిని బెదిరించి నగదు, సెల్‌ఫోన్ దోచుకున్న కేసు దీనికి కారణం. షార్ట్ ఫిల్మ్ తీసేందుకు పెట్టుబడి పెట్టాలని చెప్పి తనని మోసం చేసిందని ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అయితే తన దగ్గర తీసుకున్న డబ్బు తిరిగివ్వాలని అడగ్గా.. గత నెల 22న తనని పిలిపించుకుని దాడి చేశారని.. అలానే రెండు సెల్‌ఫోన్లు, రూ.50 వేల నగదు లాక్కున్నట్లు చెప్పాడు. తర్వాత ఫోన్ చేసి బెదిరించి మరో రూ.5 లక్షల తీసుకున్నట్లు పేర్కొన్నాడు.

అడిగినట్లు రూ.27 లక్షలు ఇవ్వకపోతే అబద్ధపు కేసు పెడతానని వర్షిణి బెదిరించినట్లు సదరు యువకుడు ఫిర్యాదులో రాసుకొచ్చాడు. ఇదే విషయమై వర్షిణితో పాటు సంజయ్ తదితరులు నలుగురిపై కేసు నమోదు చేశారు. వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు. వర్షిణి కెరీర్ విషయానికొస్తే లారా, సొట్ట సొట్ట ననైతు మూవీస్ చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement