వైఎస్సార్సీపీ నేతలపై పోలీసుల జులుం.. మాజీ కార్పొరేటర్‌ అరెస్ట్‌ | Police arrest former YSRCP corporator in Guntur | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ నేతలపై పోలీసుల జులుం.. మాజీ కార్పొరేటర్‌ అరెస్ట్‌

Sep 22 2026 4:59 PM | Updated on Sep 22 2026 5:09 PM

Police arrest former YSRCP corporator in Guntur

సాక్షి, గుంటూరు: డీఎస్సీ ఆందోళనల కారులపై కూటమి ప్రభుత్వ అరాచకాలు ఆగడం లేదు. తాజాగా వైఎస్సార్సీపీ నేత బ్రాడీపేట మాజీ కార్పొరేటర్ ఈచంపాటి ఆచారిని  పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్సీ పై జరిగిన అక్రమాలను నిరసిస్తూ శాప్ ఆఫీస్ వద్ద ధర్నాలో ఈచంపాటి ఆచారి పాల్గొన్నారు. దీంతో ఆయనను  అదుపులోకి తీసుకున్నారు.

శాప్‌ ఆఫీసువద్ద నిరసనలో పాల్గొన్న పాల్గొన్న వైఎస్సార్సీపీ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను వీడియోలు ఆధారంగా పోలీసులు గు ర్తిస్తున్నారు. అనంతరం ఆస్టేషన్‌ పరిధిలో  వారిని అరెస్ట్‌ చేస్తున్నారు. అదే విధంగా  అనేకమంది వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లకు వెళ్లి సోదాలు చేస్తూ  వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. డీఎస్సీ ధర్నాలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పై స్పెషల్ ఫోకస్ పెట్టి మరి వారిని జైలులో పెట్టే యత్నం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement