‘ఆ గూండాలకు పోలీసులే రక్షణ కల్పించటం దుర్మార్గం’ | Nagarjuna Yadav Comments On TDP Goons Attacks | Sakshi
Sakshi News home page

‘ఆ గూండాలకు పోలీసులే రక్షణ కల్పించటం దుర్మార్గం’

Sep 22 2026 2:06 PM | Updated on Sep 22 2026 2:15 PM

Nagarjuna Yadav Comments On TDP Goons Attacks

సాక్షి, తాడేపల్లి: శాప్ కార్యాలయం ఎదుట ధర్నాతో ప్రభుత్వ కూసాలు కదిలాయని.. జెన్ జీ కదిలి వచ్చి నిరసనల్లో పాల్గొందని.. దీన్ని జీర్ణించుకోలేక ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాసిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ అన్నారు. మంగళవారం ఆయన మీడియా మాట్లాడుతూ.. చంద్రబాబు శిఖండి రాజకీయాలు చేయటం సిగ్గుచేటు. మా నిరసన కార్యక్రమంపై నాలుగు రోజుల క్రితమే పర్మిషన్ కోరాం.. కానీ మాకు పోటీగా కొందరు రౌడీ దళాన్ని ఎందుకు తెచ్చారు?’’ అంటూ నాగార్జున యాదవ్‌ ప్రశ్నించారు.

‘‘నారా లోకేష్ రౌడీ దళం మాపై దాడులు చేశారు. పోలీసుల చేతిల్లోని లాఠీలు లాక్కుని మాపై దాడి చేశారు. పోలీసుల తుపాకులు కూడా వారికి దొరికి ఉంటే మా పరిస్థితేంటి?. డీఎస్సీలోని అక్రమాలపై ప్రశ్నిస్తే లోకేష్ ఉత్తర కుమారుడిలా మాట్లాడుతున్నారు. మా ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పటం లేదు?. నిరసనలు తెలిపితే మాపై దాడులా?. మీ బ్యారికేడ్లు మా భావజాలాన్ని ఆపలేక పోయాయి.

..మీ అరెస్టులు మా ధైర్యాన్ని నిలవరించలేవు. డీఎస్సీ అక్రమాలపై సీబిఐ విచారణ జరపాల్సిందే. అప్పటిదాకా మా ఉద్యమం ఆగదు. శాప్ ఆఫీసు దగ్గరకు గురువుల ముసుగులో గూండాలు వచ్చారు. ఆ గూండాలకు పోలీసులే రక్షణ కల్పించటం దుర్మార్గం’’ అంటూ నాగార్జున యాదవ్‌ దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: రౌడీ దళాన్ని దించినా డీఎస్సీపై పోరు ఆగదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement