breaking news
Nagarjuna Yadav
-
అమరావతి రైతులకు నీళ్లలో, స్మశానంలో ఇల్లు.. బాబు బండారం బయటపెట్టిన నాగార్జున యాదవ్
-
అప్పన్న ప్రసాదంలో నత్త... నాగార్జున యాదవ్ స్ట్రాంగ్ రియాక్షన్
-
‘ఆలయాలపై కూడా రెడ్‌బుక్ రాజ్యాంగమా?’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వంలో దేవుడికి కూడా వేధింపులు తప్పటం లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేవుడు, ఆలయాల మీద కూడా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. సింహాచలం ఆలయ ప్రసాదంలో నత్త వచ్చిందని చెబితే నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా?. ఇంతకంటే నీచమైన పని ఇంకోటి ఉంటుందా? అంటూ నాగార్జున యాదవ్ నిలదీశారు.‘‘ఇలాంటి నీచ రాజకీయాలను దేవుడు కూడా క్షమించడు. ఆలయాల పవిత్రతను దెబ్బ తీయవద్దు. సింహాచలం అప్పన్న ఆలయ ప్రసాదంలో నత్త రావటం ఆందోళనకు గురి చేసింది. ఇదే ఆలయంలో గోడ కూలి భక్తులు మరణించారు. ఇప్పుడు ప్రసాదంలో నత్త వచ్చింది. దీనిపై ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యమైన సమాధానం చెప్పి, బెదిరించారు. ఆ దంపతులు ఒక వీడియో పోస్టు చేస్తే వారిని టార్గెట్ చేశారు. ఆ జంటపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం దిగజారుడుతనానికి ఇదే నిదర్శనం..ప్రసాదంలో నత్త రావటానికి కారణాలపై విచారణ జరపకుండా భక్తులపై కేసులు పెడతారా?. చివరికి దేవుడి మీద కూడా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. దీనిని దేవుడు కూడా క్షమించరు. నీచ రాజకీయాలకు దేవుడ్ని వాడుకోవద్దు. చంద్రబాబుకు దైవ భక్తి ఉంటే భక్తులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి. కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని నాగార్జున యాదవ్ డిమాండ్ చేశారు. -
Nagarjuna Yadav: రియల్ ఎస్టేట్లకు బంపర్ ఆఫర్ ప్రభుత్వమే భూములు దొంగతనం
-
అల్లు అర్జున్ కు ఓ న్యాయం.. చంద్రబాబుకు ఓ న్యాయమా ?
-
ఆంధ్రా కిమ్ నారా లోకేష్
-
ఇంకా ఎంతమంది జనసైనికులు లోకేష్ దెబ్బకి బలవ్వాలో?
సాక్షి, తాడేపల్లి: ఏ అంటే ఎటాక్.. పీ అంటే ప్రాపగాండ.. వెరసి చంద్రబాబు, లోకేష్‌లు ఏపీ అర్థమే మార్చేశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. అనంతపురం కదిరి నియోజకవర్గ పరిధిలో జరిగిన ఘటన.. దానిని వైఎస్సార్సీపీకి ఆపాదించే ప్రయత్నంలో టీడీపీ అండ్ కో బోల్తాపడడంపై బుధవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఆంధ్రా కిమ్ నారా లోకేష్. ఆయన రెడ్ బుక్ మంత్రిగా మారారు. అనంతపురం జిల్లాలో జరిగిన కుటుంబ గొడవని రాజకీయంగా వాడుకున్నారు. అజయ్ దేవ అనే జనసేన కార్యకర్తకి వైఎస్సార్సీపీ ముద్ర వేసి పోలీసులతో కొట్టించారు. సినిమాలో చూపించినట్టు రోడ్డుపై నడిపించారు. అసలు అజయ్ దేవతో మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు.... అజయ్ దేవ జనసేన కార్యకర్త. అతని గ్రామానికే చెందిన జనసేన ఎంపీటీసి అమర్ వాస్తవాన్ని చెప్పాడు. బాధితురాలు, అజయ్ సొంత వదిన మరిదిలే. వారి కుటుంబాల మధ్య చాలాకాలంగా గొడవలు ఉన్నాయి. నారా లోకేష్ అన్యాయంగా జనసేన కార్యకర్తని కొట్టించారు. యోగి ఆదిత్య నాధ్ ట్రీట్మెంట్ ఇస్తానంటూ పవన్ చెప్పిన 24 గంటల్లోనే లోకేష్ జనసేన మీదనే అమలు చేశారు. ఇంకా ఎంతమంది జనసైనికులు లోకేష్ దెబ్బకి బలవ్వాలో?. పిచ్చోడి చేతిలో రాయిలాగ లోకేష్ చేతిలో పదవి ఉంది. దీని వలన రాష్ట్రానికే ప్రమాదం’’ అని నాగార్జున యాదవ్ అన్నారు. -
చంద్రబాబు రాజీనామా..!? ఈ టోకెన్లు ఎక్కడివి?
-
‘టీడీపీకి బలముంటే మా కార్పొరేటర్లను కిడ్నాప్ చేయటం ఎందుకు?’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు రాజకీయాలన్నీ హోటల్స్‌లో రహస్యంగా జరుగుతాయని.. పైరవీలు, ప్రలోభాలన్నీ అక్కడే చేయిస్తుంటారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నెల్లూరు కార్పొరేషన్ వ్యవహారాన్ని కూడా పాండిచ్చేరిలో హోటల్‌కు చేర్చారన్నారు. నెల్లూరు 54 డివిజన్లలో మొత్తం వైఎస్సార్సీపీనే గెలుపొందిందని.. అలాంటి చోట ఏమాత్రం బలం లేకున్నా ఎలా గెలవాలని చూస్తున్నారు?’’ అంటూ నాగార్జున యాదవ్ ప్రశ్నించారు.‘‘మా పార్టీ బీఫామ్ మీద గెలిచిన వారిని టీడీపీ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు దిగారు. రాజ్యాంగబద్దంగా అవిశ్వాస తీర్మానం మీద ఎన్నిక జరిగితే వైఎస్సార్సీపీనే గెలుస్తుంది. కిడ్నాప్‌లు చేయటానికి ఖాకీలను వాడుకుంటున్నారు. పోలీసులు ఖాకీ క్యాబ్ సర్వీసులుగా మారారు. కొందరు పోలీసులు బిఎన్ఎస్ చట్టాలు అంటే 'బాబు అన్యాయ సంహిత' చట్టాలుగా మార్చారు’’ అంటూ నాగార్జున యాదవ్ దుయ్యబట్టారు.‘‘టీడీపీకి బలం ఉంటే మా కార్పొరేటర్లను కిడ్నాప్ చేయటం ఎందుకు?. అవిశ్వాస తీర్మానంలో టీడీపీ నైతికంగా ఆల్రెడీ ఓడిపోయింది. అధికార బలం ఎల్లవేళలా పని చేయదు. చంద్రబాబు అనైతిక రాజకీయాలకు ప్రజలు చెక్ పెట్టే రోజు వస్తుంది’’ అని నాగార్జున యాదవ్ పేర్కొన్నారు. -
సింగపూర్, జపాన్, జర్మనీ ఎక్కడ.. అమరావతిని చూస్తే రక్తం మరిగిపోతుంది
-
కొమ్మినేని గారు నవ్వితేనే కేసు పెట్టారు.. అర్నాబ్ గోస్వామిని తలుచుకుంటేనే బాధేస్తుంది
-
చంద్రబాబుకు కొత్త పేరు పెట్టి ఏకిపారేసిన నాగార్జున యాదవ్
-
సీబీఎన్ అంటే చంద్రబాబు కాదు.. అర్థమిదే: నాగార్జున యాదవ్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో బీరు-బాబు-సర్కారు అన్నట్టుగా పరిస్థితి మారిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ చురకలు అంటించారు. ఎక్కడ పడితే అక్కడ మద్యం మాఫియా చెలరేగుతోందని.. యథేచ్ఛగా నకిలీ మద్యం తయారీ కేంద్రాలు వెలిశాయని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో పరిశ్రమలు రాలేదు గానీ మద్యం కుటీర పరిశ్రమలు భారీగా పెరిగాయన్నారు.‘‘ఎక్కడ చూసినా పర్మిట్ రూములు, వైన్లు, బార్లు, బెల్టు షాపులు కనిపిస్తున్నాయి. సీబీఎన్ అంటే చంద్రబాబు కాదు.. చీఫ్ బాట్లింగ్ నెట్వర్క్. ములకలచెరువులో పాలకాన్లలో కూడా నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారు. టీడీపీ నేత జయచంద్రారెడ్డి తన సొంతంగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. ఎక్సైజ్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలోనే నకిలీ మద్యం తయారు చేస్తున్నా పోలీసులు పట్టుకోలేదు. పాల వ్యాను జయచంద్రారెడ్డి అనుచరుడిదే అని తేలింది. భారీ స్కామ్‌కు కారకుడైన జయచంద్రారెడ్డిని ఇప్పటికీ అరెస్టు చేయలేదు?’’ అంటూ నాగార్జున యాదవ్ నిలదీశారు.‘‘అద్దేపల్లి జనార్థన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్లో జోగి రమేష్ పాత్ర ఉన్నట్టు చెప్పలేదు. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నకిలీ మద్యాన్ని పట్టించారని ఆయనపై అక్రమ కేసు పెట్టించారు. జోగి రమేష్‌కి, అద్దేపల్లి జనార్థన్ మధ్య ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ జనార్థన్‌తో తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించి అరెస్టు చేయించారు. కుట్ర పూరితంగానే బీసే నేత జోగి రమేష్ ని అరెస్టు చేశారు. చంద్రబాబు కనుసన్నల్లోనే నకిలీ మద్యం తయారీ. దీన్ని ప్రశ్నిస్తే మాపై అక్రమ కేసులు పెడుతున్నారు. అక్రమ కేసులు పెట్టి వేధించిన వారిని ఎవరినీ వదలేది. అధికారంలోకి వచ్చాక చట్టపరంగా విచారణ జరిపిస్తాం’’ అని నాగార్జున యాదవ్ తెలిపారు. -
చంద్రబాబు బెయిల్ క్యాన్సిల్! జైలుకు వెళ్లడం పక్కా
-
వారం రోజులు టైం ఇస్తున్న.. లోకేష్ కు నాగార్జున యాదవ్ వార్నింగ్
-
చంద్రబాబు చికిరి కుంభకోణం 13 సంతకాలు..
-
Nagarjuna: ప్రభుత్వ డబ్బుతో జల్సాలు చేస్తూ... ఉచితంగా జీతాలు తీసుకుంటున్నది మీ ముగ్గురు
-
తిరుమల లడ్డూ వివాదం.. పచ్చమీడియా అబద్దాలన్నీ బయటపెడతాం
-
నాగార్జున యాదవ్ పై పోలీసుల దౌర్జన్యం
-
KSR Live Show: బాబు కుట్ర భగ్నం.. ఇలా దొరికిపోయాను ఏంట్రా
-
లోకేష్ కు నాగార్జున యాదవ్ మాస్ వార్నింగ్..
-
చంద్రబాబు, లోకేష్ కు నాగార్జున యాదవ్ ఓపెన్ ఛాలెంజ్
-
బాబు పేపర్ లీకుల కుట్ర బయటపెట్టిన నాగార్జున యాదవ్
-
వాస్తవాలన్నీ త్వరలోనే బయట పడతాయి: నాగార్జున యాదవ్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో యథేచ్చగా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని... చివరికి డీజీ స్థాయి అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులను కూడా అరెస్టు చేశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జత్వానీ అనే మహిళతో అక్రమ ఫిర్యాదు చేయించి పీఎస్ఆర్ని అరెస్టు చేశారు. ఏపీపీఎస్సీలో అక్రమాలు అంటూ మరొక కేసు ఆయనపై పెట్టారు. డిజిటల్ మూల్యాంకనం చేయమని హైకోర్టు చెప్తేనే ఏపీపీఎస్సీ నిర్వహించింది. కానీ అక్రమంగా చేశారంటూ కేసులు పెట్టారు’’ అని నాగార్జున యాదవ్ పేర్కొన్నారు.‘‘వాస్తవాలన్నీ త్వరలోనే బయట పడతాయి. చంద్రబాబు 21 నోటిఫికేషన్లను సంబంధించి ఏమాత్రం ముందుకు తీసుకుపోవటం లేదు. ఇటీవల గ్రూపు-2 లో ఎన్ని అక్రమాలు చేశారో జనం చూశారు. వైఎస్ జగన్ హయాంలో ఒక్క పేపర్ కూడా లీక్ కాకుండా అన్ని నియామకాలు గొప్పగా జరిగాయంటూ కేంద్రమే మెచ్చుకుంది. చంద్రబాబు 1995లో సీఎం అవగానే టెన్త్ పేపర్లు లీక్ అయ్యాయి. 1997లో ఇంటర్ పరీక్ష పేపర్లు లీకే చేశారు. 2017 లో కూడా నారాయణ విద్యాసంస్థల కోసం ప్రశ్నాపత్రాల లీకేజీలు జరిగాయి. ఆ విషయాన్ని ఈనాడు పత్రికలో కూడా వార్తలు వచ్చాయి...పేపర్ల లీకేజీలో అప్పటి మంత్రి నారాయణ, గంటా శ్రీనివాసరావు పాత్ర ఉంది. అయినప్పటికీ వారిని చంద్రబాబు ఎందుకు అరెస్టు చేయలేదు?. 2022లో నారాయణ సంస్థల వారు ప్రశ్నాపత్రాల లీక్ చేయాలని చూస్తే జగన్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అంత పకడ్బందీగా జగన్ పాలనలో పరీక్షలను నిర్వహించారు. చంద్రబాబు హయాంలో మూడు లీకులు, ఆరు అక్రమాలు ఉంటాయి. చివరికి హాఫ్ ఇయర్లీ పరీక్షా పత్రాలు కూడా చంద్రబాబు హయాంలో లీకయ్యాయిజగన్ హయాంలో ఆరి నెలలోనే లక్షా యాభై వేల ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చి అక్రమాలు లేకుండా నియామకాలు చేశారు. జగన్‌ని ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు వ్యవహరించాలి. ఇకనైనా ఆరోపణలను కట్టిపెట్టి కక్షసాధింపు రాజకీయాలను మానుకోవాలి’’ అని నాగార్జున యాదవ్ హితవు పలికారు. -
Nagarjuna Yadav: రైతులపై పగ.. పెట్టుబడి సాయం జీరో, రైతు భరోసా జీరో
-
లక్ష ఎకరాలు అమరావతి రాజధానికా? లేక చంద్రబాబు రియల్ ఎస్టేట్ కా?
-
వైఎస్ జగన్ పై చంద్రబాబు, లోకేశ్ దుష్ప్రచారం చేస్తున్నారు
-
లోకేష్ తప్పుడు ప్రచారం మానుకో: నాగార్జున యాదవ్
సాక్షి, తాడేపల్లి: అసర్ సర్వేని తప్పుడు తక్కెడగా చేశారని.. లోకేష్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు పాలనలో విద్యారంగం అద్బుతంగా ఉన్నట్ఠు, జగన్ పాలనలో నాశనం అయినట్టు లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.ఇంగ్లీషు మీడియం చదువులు, సీబీఎస్ఈ చదువులు, ఐబీ సిలబస్ తెచ్చిన ఘనత జగన్‌ది. అలాంటి జగన్ ప్రాభవాన్ని మసకబార్చాలని లోకేష్ ప్రయత్నిస్తున్నారు. రూ.3872 కోట్లతో నాడు-నేడు కింద ఫస్ట్ ఫేజ్‌లోనే స్కూళ్లని జగన్ అభివృద్ధి చేశారు. మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం వంటి మౌలిక సదుపాయాలను జగన్ కల్పించారు. ఇప్పటికీ వెబ్ సైట్ లో ఆ వివరాలను చూసుకోవచ్చు’’ అని నాగార్జున యాదవ్ వివరించారు.వైఎస్. జగన్ హయాంలో విద్యారంగంలో మంచి మార్పులు వచ్చాయని.. కేంద్ర ప్రభుత్వ నివేదికల్లోనే తేలింది. చంద్రబాబు, జగన్ హయాంలను బేరీజు వేస్తూ ఎవరిని అడిగినా సమాధానం చెప్తారు. జరిగిన అభివృద్ది కళ్లెదుటే కనిపిస్తుంది. జగన్ ఐదేళ్ల పాలనలో నాడు-నేడు జరగలేదని లోకేష్ చెప్పగలరా?...స్కూళ్ల అభివృద్ధి జరగలేదని చెప్పించగలరా?. దేశం మొత్తం జగన్ చేసిన అభివృద్ధిని కొనియాడుతోంది. ఇతర రాష్ట్రాలు సైతం జగన్ బాటలో నడవాలని నిర్ణయించుకున్నాయి. అలాంటి విప్లవాత్మక మార్పులు తెచ్చిన జగన్‌పై తప్పుడు నివేదికలతో లోకేష్ మాట్లాడకూడదు’’ అంటూ నాగార్జున యాదవ్ హితవు పలికారు. -
రహస్య జీవోలిస్తూ పారదర్శక పాలనంటే ఎలా?
సాక్షి, అమరావతి: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రహస్య జీవోలపై నీతులు చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. అధికారంలోకి వచ్చాక పారదర్శకతకు పాడె కట్టేశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. ఆయన సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన ఏడు నెలల్లోనే 78 రహస్య జీవోలు విడుదల చేసి, పైకి మాత్రం పారదర్శక ప్రభుత్వం అని చెప్పుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయన నేతృత్వం వహించే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఒకేరోజు ఏకంగా 6 రహస్య జీవోలు ఇచ్చి ఆయనేమీ తక్కువ తినలేదని నిరూపించుకున్నాడని చెప్పారు.ఆ రహస్య జీవోలన్నీ కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పేవి, కన్సల్టెన్సీలకు బిల్లులు చెల్లించేవే అని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం ఆయనకు వెన్నుపోటుతో పెట్టిన విద్య అని, పవన్ సైతం అబద్ధాల్లో చంద్రబాబునే మించిపోయారని అన్నారు. తాము ఏ వివరాలను గోప్యంగా ఉంచబోమని, ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చని, ఇదే పారదర్శక పాలనకు సాక్ష్యమంటూ గత ఏడాది ఆగస్టు 30న ప్రకటించిన చంద్రబాబు, పవన్.. వాస్తవంలో అందుకు విరుద్ధంగా పనిచేస్తున్నారని వివరించారు.కీలకమైన రెవెన్యూ శాఖకు సంబంధించి 36, మున్సిపల్ శాఖలో 14, జనరల్ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి 4, ఆర్థిక శాఖకు చెందినవి 5, ఇరిగేషన్లో 6, హోంశాఖలో 4 జీవోలు రహస్యంగా ఇచ్చారని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోనూ ఒకే రోజు 6 రహస్య జీవోలిచ్చారని, ఇవన్నీ కీలకమైన జీవోలేనని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఆ జీవోలన్నీ బహిర్గతం చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని నాగార్జున యాదవ్ డిమాండ్ చేశారు. -
చంద్రబాబు దావోస్ టూర్ పై నాగార్జున యాదవ్ కామెంట్స్
-
సజ్జన్ జిందాల్‌కు క్షమాపణ చెప్పండి: Yanamala Nagarjuna Yadav
-
కూటమి సర్కార్.. పరిశ్రమలకు శాపం: నాగార్జున యాదవ్
సాక్షి, తాడేపల్లి: ఒక వైపు కూటమి నాయకులు, ఎమ్మెల్యేలే స్వయంగా బడా పారిశ్రామికవేత్తలను కమీషన్ల కోసం బెదిరిస్తూ.. మరోవైపు పెట్టుబడులు (Investments) పెట్టమని ప్రాధేయపడితే, వారెలా ముందుకొస్తారని వైఎస్సార్సీపీ(YSRCP) అధికార ప్రతినిధి నాగార్జునయాదవ్(Nagarjuna Yadav) సూటిగా ప్రశ్నించారు. పెట్టుబడుల ఆకర్షణ కోసమంటూ దావోస్ వెళ్లిన తండ్రీకొడుకులు పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సానుకూల పరిస్థితి ఉందా? అన్న విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. చంద్రబాబు తీరుతో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఆగిపోయిందన్న నాగార్జునయాదవ్.. రాష్ట్రం విడిచివెళ్లిన సజ్జన్ జిందాల్‌కు క్షమాపణ చెప్పి, ఆ రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు.ఏపీ ప్రతిష్టను దిగజార్చారు..దేశంలో పేరున్న పారిశ్రామిక వేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటేనే వణికిపోతున్నారు. కూటమి పార్టీల నాయకుల్లో కమీషన్ల కోసం కొందరు, రాజకీయ ఎత్తుగడలతో మరికొందరు ఏడు నెలల్లోనే రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో దావోస్ పర్యటనకు వెళ్లిన తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్.. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని పెట్టుబడుల ప్రవాహం వస్తుందని మోసపు మాటలతో మళ్లీ నమ్మించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు.రాష్ట్రం నుంచి తరిమేశారు..జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ రూ.3 లక్షల కోట్లతో మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థతో పాటు, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. వాస్తవానికి ఇదే కంపెనీ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ దాదాపు రెండేళ్ల క్రితం గత ప్రభుత్వ హయాంలో కడపలో రూ.8800 కోట్లతో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చి భూమి పూజ కూడా చేశారు. ఇంకా రాష్ట్రంలో సుమారు రూ.50,500 కోట్ల పెట్టుబడులకు 2022లో 6 ఒప్పందాలు కూడా చేసుకున్నారు. పెట్టుబడులతో ముందుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాల్సిన వ్యక్తిని సాదరంగా ఆహ్వానించకుండా చంద్రబాబు ప్రభుత్వం భయపెట్టి రాష్ట్రం నుంచి తరిమేసింది.కమీషన్ల కోసం బెదిరింపులుముంబైకి చెందిన కాదంబరి జెత్వాని అనే నటిని తీసుకొచ్చి ఆమెతో సజ్జన్ జిందాల్‌పై నిందారోపణలు చేసి, అక్రమ కేసులు బనాయించి దారుణంగా వేధించి రాష్ట్రం నుంచి పారిపోయేలా చేశారు. జిందాల్ మాత్రమే కాదు.. కూటమి ప్రభుత్వం కొలువు తీరాక పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. దాల్మియా గ్రూప్‌నకు చెందిన 11 లారీలను కూటమి నాయకులు కప్పం కట్టలేదని నాశనం చేశారు. మరో పెద్ద సంస్థ అదానీ పోర్టుకి ఎమ్మెల్యే సోమిరెడ్డి స్వయంగా కమీషన్ల కోసం వెళ్లి ఉద్యోగులను బెదిరించి వచ్చాడు. అందుకే ఇకనైనా కూటమి ప్రభుత్వం, ఆ పార్టీల పెద్దలు తమ వైఖరి మార్చుకోవాలి. రాష్ట్రం నుంచి పారిశ్రామికవేత్తలు తరలిపోకుండా చూడాలి.జిందాల్‌కు క్షమాపణలు చెప్పాలిఇంకా కూటమి ప్రభుత్వ తీరు కారణంగా వెళ్లిపోయిన పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్‌కు క్షమాపణలు చెప్పి రాష్ట్రానికి తిరిగి తీసుకురావాలని, గతంలో ప్రభుత్వంతో ఆయన కుదుర్చుకున్న 6 ఒప్పందాలకు సంబంధించిన రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా చూడాలని నాగార్జునయాదవ్ డిమాండ్ చేశారు. మొత్తం ఈ అస్తవ్యస్త పరిస్థితికి మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించాలని ఆయన తేల్చి చెప్పారు.ఇదీ చదవండి: ఏపీలో బడా నేతల కాలక్షేపం కబుర్లు! -
YSRCP నాగార్జున యాదవ్ అరెస్ట్..
-
నాగార్జున యాదవ్ అరెస్ట్
సాక్షి చిత్తూరు: వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను ఆదివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అర్థరాత్రి ఆయనను కుప్పం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నాగార్జునయాదవ్ ఓ టీవీ ఛానెల్ చర్చలో సీఎం చంద్రబాబు గురించి మాట్లాడినందుకు టీడీపీకి చెందిన ఓ వ్యక్తి కుప్పం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దానిపై అక్కడి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ, ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టులో వైఎస్సార్సీపీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం ఈనెల 25 వరకు అతన్ని అరెస్టు చేయరాదని ఆదేశించిన విషయం తెలిసిందే. నాగార్జున యదావ్పై 196(1), 351(2)BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.ఇంతలోనే బెంగళూరు నుంచి విజయవాడ వస్తుండగా ఆదివారం రాత్రి చిత్తూరు జిల్లా వికోట సమీపంలో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇది హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని, పోలీసులిచ్చిన 41ఏకి కూడా విరుద్ధంగా ఉందని వైఎస్సార్సీపీ తప్పుబడుతోంది. దీనిపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిపింది. -
రండి బాబు రండి.. ఇసుక ఫ్రీ..కానీ..!
-
పవన్ కళ్యాణ్ చెప్పిన నేపాల్ ఎర్ర చందనం కథ అసలు నిజాలు బయటపెట్టిన నాగార్జున యాదవ్
-
పెద్దిరెడ్డిపై దుష్ప్రచారం.. పవన్‌కు నాగార్జున యాదవ్ కౌంటర్
తాడేపల్లి: నేపాల్‌లో దొరికిన ఎర్ర చందనం వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉన్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోణలపై స్ట్రాంగ్ కౌంటరిచ్చారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్.‘నేపాల్‌లో దొరికిన ఎర్ర చందనం వెనుక పెద్దిరెడ్డి హస్తం ఉన్నట్లు దుష్ర్పచారం చేస్తున్నారు. పెద్దిరెడ్డి కుటుంబంపై పవన్ ఆరోపణలు సరికాదు. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిల హయాంలోనే ఎర్రచందనం అక్రమ రవాణా జరిగింది. పదేళ్ల క్రితమే ఎర్రచందనం దొరికింది. నేపాల్, మలేషియాతో పాటు ఇతర దేశాల్లో దాదాపు 8 వేల టన్నుల ఎర్ర చందనం దొరికింది. వాటిని ఏపీకి తెప్పించేందుకు జగన్ సర్కారు ఎన్నోసార్లు కేంద్రానికి లేఖలు రాసింది.కావాలంటే పవన్ ఆ శాఖలోనే ఉన్న లెటర్లను చదువుకోవాలి. పవన్‌కి కేంద్రంలో పలుకుబడి ఉందని చెప్పుకుంటున్నారు కదా?. మరి ఆయా దేశాల్లో ఉన్న ఎర్రచందనాన్ని ఏపీకి తెప్పించాలి. దాన్ని వేలం వేస్తే వచ్చే డబ్బు రాష్ట్రానికి ఉపయోగపడుతుంది’ అని ధీటుగా బదులిచ్చారు నాగార్జున యాదవ్,.


