పెద్దిరెడ్డిపై దుష్ప్రచారం.. పవన్‌కు నాగార్జున యాదవ్‌ కౌంటర్‌ | YSRCP Spokesperson Nagarjuna Yadav Strong Counter To Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పెద్దిరెడ్డిపై దుష్ప్రచారం.. పవన్‌కు నాగార్జున యాదవ్‌ కౌంటర్‌

Jul 5 2024 5:58 PM | Updated on Jul 5 2024 6:44 PM

YSRCP Spokesperson Nagarjuna Yadav Strong Counter To Pawan Kalyan

తాడేపల్లి: నేపాల్‌లో దొరికిన ఎర్ర చందనం వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉన్నట్లు డిప్యూటీ   సీఎం పవన్‌ కళ్యాణ్‌ చేస్తున్న ఆరోణలపై స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌.

‘నేపాల్‌లో దొరికిన ఎర్ర చందనం వెనుక పెద్దిరెడ్డి హస్తం ఉన్నట్లు దుష్ర్పచారం చేస్తున్నారు.  పెద్దిరెడ్డి కుటుంబంపై పవన్‌ ఆరోపణలు సరికాదు. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిల హయాంలోనే ఎర్రచందనం అక్రమ రవాణా జరిగింది. పదేళ్ల క్రితమే ఎర్రచందనం దొరికింది. నేపాల్‌, మలేషియాతో పాటు ఇతర దేశాల్లో దాదాపు 8 వేల టన్నుల ఎర్ర చందనం దొరికింది. వాటిని ఏపీకి తెప్పించేందుకు జగన్‌ సర్కారు ఎన్నోసార్లు కేంద్రానికి లేఖలు రాసింది.

కావాలంటే పవన్‌ ఆ శాఖలోనే ఉన్న లెటర్లను చదువుకోవాలి. పవన్‌కి కేంద్రంలో పలుకుబడి ఉందని చెప్పుకుంటున్నారు కదా?. మరి ఆయా దేశాల్లో ఉన్న ఎర్రచందనాన్ని ఏపీకి తెప్పించాలి. దాన్ని వేలం వేస్తే వచ్చే డబ్బు రాష్ట్రానికి ఉపయోగపడుతుంది’ అని  ధీటుగా బదులిచ్చారు నాగార్జున యాదవ్‌,.

పవన్ కళ్యాణ్ చెప్పిన నేపాల్ ఎర్ర చందనం కథ అసలు నిజాలు బయటపెట్టిన నాగార్జున యాదవ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement