తండ్రులకు మచ్చ తెస్తున్న తనయులు... | TDP MP Putta Mahesh Kumar Tested Positive in Drugs | Sakshi
Sakshi News home page

తండ్రులకు మచ్చ తెస్తున్న తనయులు...

Mar 16 2026 8:01 AM | Updated on Mar 16 2026 9:00 AM

TDP MP Putta Mahesh Kumar Tested Positive in Drugs

నాడు డ్రగ్స్‌ కేసులో ఎమ్మెల్యే ఆది తనయుడు సుదీర్‌రెడ్డి 

తాజాగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ తనయుడు మహేష్‌ యాదవ్‌  

 హైదరాబాద్‌ కేంద్రంగా డ్రగ్స్‌ వ్యవహారంలో తలమునకలు  

తీవ్ర చర్చనీయాంశంగా మారిన వ్యవహారం

సాక్షి ప్రతినిధి, కడప: ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆ ఇద్దరు భాగస్వామ్య ఎమ్మెల్యేలు. ఆయా నియోజకవర్గాల్లో వారు శాసిస్తున్నా, తనయులు చట్టాలకు లోబడి మసలుకోవడంలో కట్టడి చేయలేకపోయారు. నిషేధిత మత్తు పదార్థాలు సేవిస్తూ పోలీసులకు పట్టుబడడంతో అభాసుపాలవుతున్నారు. ఫలితంగా ఆయా ఎమ్మెల్యేలకు ‘సన్‌’స్ట్రోక్‌ తప్పడం లేదు. వారే మైదుకూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు సుధాకర్‌యాదవ్, ఆదినారాయణరెడ్డి. సరిగ్గా రెండున్నర్ర నెలల వ్యవధిలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యే తనయులు ఇద్దరూ డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు పట్టబడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పైగా పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కుమారుడు మహేష్‌ యాదవ్‌ ఎంపీ కావడం గమనార్హం.  

 ⇒ జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తనయుడు సు«దీర్‌రెడ్డి ఈ ఏడాది జనవరి 3న డ్రగ్స్‌ కేసులో హైదరాబాద్‌ నార్శింగ్‌ పోలీసులకు చిక్కారు. పరీక్షలు నిర్వహించిన పోలీసులు డ్రగ్స్‌ పాజిటివ్‌ రావడంతో అదుపులోకి తీసుకున్నారు. ఆపై డ్రగ్‌ ఆడిక్షన్‌ సెంటర్‌కు అప్పగించారు. అప్పట్లో ఈవార్త  తెలుగు రాష్ట్రాల్లో  తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ తనయుడు ఏలూరు పార్లమెంటు సభ్యుడు మహేష్‌యాదవ్‌ ఈగల్‌ టీమ్‌ పోలీసులకు పట్టుబడ్డారు. తెలంగాణ మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి ఫామ్‌ హౌస్‌లో అనూహ్యంగా శనివారం రాత్రి పోలీసులకు చిక్కారు. 

 ⇒ మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్‌యాదవ్‌ తనయుడు మహేశ్‌యాదవ్‌ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు అల్లుడు కావడంతో ఏలూరు లోక్‌సభ టీడీపీ అభ్యరి్థత్వం దక్కింది. ఆపై ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికయ్యారు. ఏలూరు ఎంపీగా ప్రాతినిథ్యం వహిçస్తున్నారు. తాజాగా డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు చిక్కడం తెలుగురాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

స్థాయి పెరిగినా వ్యక్తిత్వ లోపం... 
ఎమ్మెల్యే కొడుకు.. ఆపై ఎంపీ హోదా.. ఉన్నతంగా వ్యవహరించాల్సింది పోయి ఇలా డ్రగ్స్‌ కేసులో దొరకడంపై ప్రజలు తూర్పారబడుతున్నారు. స్థాయి..హోదా పెరిగినా  తన బుద్దిని బహిర్గతం చేసుకున్నారని విశ్లేషకులు దెప్పిపొడుస్తున్నారు. కాంట్రాక్టర్‌గా హైదరాబాద్‌లో స్థిరపడినప్పటికీ ప్రజాజీవితంతో ముడిపడి ఉన్నప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఇవేవి లెక్క చేయకుండా ఏకంగా డ్రగ్స్‌ వ్యవహారంలో దొరికిపోవడంతో జిల్లాలో నవ్వులపాలయ్యారు. 

2014 ఎన్నికల ముందు కూడా మహేష్‌యాదవ్‌ బ్రహ్మంగారిమఠం మండలానికి చెందిన వారి సామాజిక వర్గానికే చెందిన ఓ నేతను ఇష్టానుసారంగా దూషించారు. కులంపేరుతో రెచ్చగొట్టే చర్యలకు దిగారు. ఇదంతా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. దాంతో అంతో ఇంతో మద్దతుగా నిలిచిన నేతలు సైతం రాత్రికి రాత్రే దూరమయ్యేలా మహేష్‌ యాదవ్‌ వ్యవహారశైలి కని్పంచింది. ఆ ఎన్నికలల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఓటమికి అది కూడా ఓ ప్రధాన కారణంగా నిలిచిందని పలువురు వెల్లడిస్తున్నారు. అప్పట్లో ప్రత్యక్ష రాజకీయాల్లో క్రీయాశీలకంగా లేరని సర్దిచెప్పుకున్నా, తాజాగా డ్రగ్స్‌ వ్యవహారంలో పట్టుబడడంతో తన బుద్ధి పోనిచ్చుకోలేదని పలువురు నిలదీస్తున్నారు.

 తండ్రులకు మచ్చ తెస్తున్న తనయులు... 
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తనయుడు సు«దీర్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్‌యాదవ్‌ తనయుడు మహేష్‌యాదవ్‌ డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడి వారి తండ్రులకు మచ్చ తీసుకొచ్చారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఈవ్యవహారంలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న మహేష్‌యాదవ్‌ మరింతగా చెడ్డపేరు మూటగట్టుకున్నారు. రక్త నమూనాలో డ్రగ్స్‌ శాంపిల్స్‌ పాజిటివ్‌ లభించినా పార్లమెంటు సభ్యుడు కావడంతో స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపినట్లు సమాచారం. గడిచిన ఐదు నెలల క్రితం సైబర్‌ నేరస్తుల వలలో చిక్కుకున్న ఎమ్మెల్యే సుధాకర్‌యాదవ్‌కు తాజాగా ‘సన్‌’స్ట్రోక్‌ భారీగా తగిలింది.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement