Drugs Case
-
పొంతన లేని సమాధానాలు!
మొయినాబాద్: ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఆరో రోజు ఆదివారం సిట్ విచారణ జరిగింది. స్టేషన్ బెయిల్ పొందిన వారిలో ఏడుగురు నిందితులు విచారణకు హాజరయ్యారు. వారిని వేర్వేరుగా విచారించారు. విచారణలో కొందరు నిందితులు పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో వారిని పదేపదే విచారించి అసలు విషయాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా డ్రగ్స్ సరఫరా, పెడ్లర్లపై దృష్టి సారించిన సిట్ అధికారులు ఆ కోణంలోనే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, అతని తమ్ముడు రితేష్‌రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్ వ్యాపారి నమిత్ శర్మను కస్టడీకి తీసుకొని విచారిస్తే కీలక విషయాలు బయటకొస్తాయని.. కేసు దర్యాప్తు వేగవంతంగా ముందుకు వెళ్తుందని పోలీసులు భావిస్తున్నారు.కస్టడీ పిటిషన్‌పై నేడు తీర్పుడ్రగ్స్ పార్టీ కేసులో ప్రధాన నిందితులు పైలెట్ రోహిత్‌రెడ్డి, రితేష్‌రెడ్డి, నమిత్‌శర్మ కస్టడీ పిటిషన్‌పై రాజేంద్రనగర్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. నిందితులను ఏడు రోజులు పోలీసు కస్టడీకి అనుమతివ్వాలని పోలీసులు పిటిషన్ వేయడంతో కోర్టులో వాదనలు జరిగాయి. కోర్టుకు వరుస సెలవులు ఉండటంతో కస్టడీ పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసింది. -
సిట్‌కు చిక్కిన డ్రగ్ పెడ్లర్
మొయినాబాద్, శంషాబాద్ రూరల్: ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు సిట్ అధికారులకు చిక్కాడు. మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి డ్రైవర్‌కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్, డ్రగ్ పెడ్లర్ అభిషేక్‌సింగ్‌ను శనివారం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ కోసం డ్రగ్స్ సరఫరా చేసినట్లు తేలింది. ఇతని ద్వారా డ్రగ్స్ మూలాలను గుర్తించడంపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. అభిషేక్ నుంచి రోహిత్‌రెడ్డి బృందం సుమారు 24 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. లింక్‌లపై ఆరా.. అభిషేక్‌సింగ్ పోలీసులకు చిక్కడంతో అతని నుంచి డ్రగ్స్ ఎవరెవరు, ఎప్పుడెప్పుడు కొనుగోలు చేశారనే కోణంలో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇతనితో కొనుగోలుదారులు జరిపిన ఆర్థిక లావాదేవీలు, ఫోన్ చాటింగ్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 11 మందిపై కేసు నమోదు చేయగా.. రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, నమిత్‌శర్మ జైలుకు వెళ్లారు. మిగతా వారిలో టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌తో పాటు మరో ఏడుగురికి బెయిల్ మంజూరైంది. మహేశ్‌కుమార్ మినహా.. మిగిలిన వారంతా ఐదు రోజులుగా శంషాబాద్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరవుతున్నారు. కేసు దర్యాప్తుపై ఫ్యూచర్ సిటీ కమిషనర్ సు«దీర్‌బాబు ఎప్పటికప్పుడు కీలకమైన సూచనలు చేస్తున్నారు. ఆయన నిందితులను నేరుగా విచారించి పలు విషయాలు తెలుసుకుంటున్నారు. రిమాండ్‌లో ఉన్న ముగ్గురిని కస్టడీకి తీసుకుంటే ఈ కేసులో పురోగతి సాధించవచ్చని సిట్ అధికారులు భావిస్తున్నారు. కస్టడీ పిటిషన్‌పై తీర్పు సోమవారం వెలువడే అవకాశం ఉందని చెపుతున్నారు. పోలీస్ పహారాలో ఫామ్‌హౌస్.. వివాదాలకు కేంద్ర బిందువైన మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో పోలీస్ పహారా కొనసాగుతోంది. ఈ నెల 14న ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. డ్రగ్స్ పార్టీని భగ్నం చేసేందుకు ఈగల్ టీం, స్థానిక పోలీసులు వెళ్లడంతో నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం విచారణకు సిట్ ఏర్పాటు చేసింది. పార్టీలో పాల్గొన్న నిందితులకు చెందిన ఆరు లగ్జరీ కార్లు ఫామ్‌హౌస్‌లోనే ఉన్నాయి. ఆ రోజు నుంచి పోలీసులు ఫామ్‌హౌస్‌లో పహారా కాస్తూ.. బయటి వ్యక్తులను లోనికి రానివ్వడంలేదు. మరోవైపు అసైన్డ్ భూమిలో ఉన్న ఫామ్‌హౌస్‌ను సీజ్ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే భూ రికార్డులను పరిశీలించిన అధికారులు న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. అనుమతులు లేకుండా రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో చేపట్టిన నిర్మాణాలను కూల్చడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
-
మెయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్‌ను సిట్ అదుపులోకి తీసుకుంది. రోహిత్ పార్టీకి అభిషేక్ సింగ్ డ్రగ్స్ సరఫరా చేయగా.. అభిషేక్ నుంచి రోహిత్‌రెడ్డి డ్రైవర్ శరత్ డ్రగ్స్ కొన్నారు. రోహిత్‌కు 24 సార్లు అభిషేక్ డ్రగ్స్ సరఫరా చేశారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్ద రోహిత్ డ్రైవర్ శరత్ కొనుగోలు చేశారు. అభిషేక్ సింగ్సెల్ఫోన్ డేటాను సిట్ బృందం విశ్లేషిస్తోంది. అభిషేక్ సింగ్ నుండి ఎవరెవరూ డ్రగ్స్ తీసుకున్నారు? అనే విషయంపై సిట్ కూపీ లాగుతోంది.కాగా, డ్రగ్స్ కేసు నిగ్గు తేల్చడానికి ఏర్పాటైన సిట్ బృందం విచారణను వేగవంతం చేసింది. పలు కీలక విషయాలను సేకరిస్తోంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలోని అజీజ్‌నగర్‌లో ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో నిందితులు మూడు రకాల డ్రగ్స్ వాడినట్లు సిట్ అధికారులు గుర్తించారు. -
కొనసాగుతున్న సిట్ విచారణ
మొయినాబాద్/శంషాబాద్ రూరల్: ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. నాలుగో రోజు శుక్రవారం శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌లో సిట్ అధికారులు నిందితులను విచారించారు. స్టేషన్ బెయిల్ పొందినవారిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌యాదవ్ మినహా మిగిలిన ఏడుగురు అర్జున్‌రెడ్డి, కౌశిక్ రవి, శరత్‌కుమార్, విజయ కృష్ణ, రమేష్, శ్రావణ్‌కుమార్, ప్రియాంకరెడ్డి విచారణకు హాజరయ్యారు.సిట్ అధికారులు ఒక్కొక్కరిని వేర్వేరుగా విచారించి వారి నుంచి డ్రగ్స్‌కు సంబంధించిన వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్ లోక్‌సభ సమావేశాలు ఉన్నందున వచ్చే నెల 4 వరకు విచారణకు హాజరు కాకుండా మినహాయింపు తీసుకున్నారు. ఎంపీతోపాటు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మలను కస్టడీకి తీసుకొని విచారిస్తేనే ఈ కేసులో అసలు విషయాలు బయటకొస్తాయని ఓ పోలీసు అధికారి తెలిపారు. శంషాబాద్‌కు సీపీ సు«దీర్బాబుడ్రగ్స్ కేసు విచారణను ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్‌బాబు పరిశీలించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన శంషాబాద్ పీఎస్‌కు చేరుకొని సిట్ అధికారులతో చర్చించారు. డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుంచి జరుగుతోంది. పెడ్లర్లు ఎక్కడి నుంచి తెచ్చి ఎవరికి విక్రయిస్తున్నారనే విషయాలను రాబట్టాలని సూచించారు. ఈ వివరాలు తెలిస్తేనే డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేయొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరోసారి వాయిదా.. డ్రగ్స్ పార్టీలో గన్ ఫైరింగ్ చేసి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, అతని తమ్ముడు రితీష్‌రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్ వ్యాపారి నమిత్ శర్మలను ఏడు రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని పోలీసులు ఈ నెల 17న రాజేంద్రనగర్ కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. దీనిపై 18న కోర్టులో వాదనలు జరిగాయి. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును 20కి వాయిదా వేసింది. 20న శుక్రవారం కోర్టుకు సెలవు ఉండటంతో తీర్పు సోమవారానికి వాయిదా పడింది.పాత రికార్డుల పరిశీలనవివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌ను సీజ్ చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఫాంహౌస్ భూమికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కోరినట్టు తెలిసింది. రెవెన్యూ అధికారులు సైతం ఫాంహౌస్ భూమికి సంబంధించిన రికార్డుల దుమ్ము దులుపుతున్నారు. అజీజ్‌నగర్ సర్వేనంబర్ 177/33లోని 2.20 ఎకరాల్లో రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్ ఉంది. 2006లో రోహిత్‌రెడ్డి తండ్రి విఠల్‌రెడ్డి పేరుతో ఈ భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇది అసైన్డ్ భూమి కావడంతో రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ అసైని అంతంగారి జంగయ్య పేరే వస్తోంది.అసైన్డ్ భూమి ఎలా రిజి్రస్టేషన్ జరిగింది ? అసలు పాత రికార్డుల్లో ఎవరి పేర్లు ఉన్నాయనే విషయాలను తెలుసుకునేందుకు రెవెన్యూ అధికారులు పాత దస్త్రాలను పరిశీలిస్తున్నారు. ఫామ్‌హౌస్‌ను సీజ్ చేయాల్సి వస్తే న్యాయపరమైన చిక్కులు రాకుండా పాత రికార్డులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఫామ్‌హౌస్‌ను సీజ్ చేయాల్సి వస్తే అసైన్డ్ భూముల్లో ఉన్న మిగతా ఫామ్‌హౌస్‌లు, కబ్జాదారులపైనా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనిని కూడా దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ అధికారులు అసైన్డ్ భూముల్లో ఉన్న ఫామ్‌హౌస్‌లు, నిర్మాణాలు, కబ్జాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. -
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్
-
పార్టీలో మూడు రకాల మత్తు పదార్థాలు
మొయినాబాద్/ శంషాబాద్ రూరల్: సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. డ్రగ్స్ కేసు నిగ్గు తేల్చడానికి ఏర్పాటైన సిట్ బృందం విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే బుధవారం పలు కీలక విషయాలను సేకరించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలోని అజీజ్‌నగర్‌లో ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో నిందితులు మూడు రకాల డ్రగ్స్ వాడినట్లు సిట్ అధికారులు గుర్తించారు. కొకైన్, ఎండీఎంఏ, మెథోఇథిఫిన్ వినియోగించినట్లు తెలుసుకున్నారు. కౌశిక్ రవి సిమ్లాలోని ఓ గుర్తుతెలియని వ్యక్తి వద్ద రూ.15 వేలకు కొకైన్ కొనుగోలు చేసినట్లు పట్టుబడిన రోజే పోలీసులకు చెప్పాడు. సిట్ విచారణలో భాగంగా ఎండీఎంఏ, మెథోఇథిఫిన్ డ్రగ్స్‌ను సాఫ్ట్వేర్ ఉద్యోగి అభిషేక్ నుంచి రోహిత్‌రెడ్డి డ్రైవర్ శరత్ హైదరాబాద్‌లోని అప్పా జంక్షన్ వద్ద కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అభిషేక్ కొన్నేళ్లుగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు, గతంలో అతనిపై ఓ కేసు నమోదైనట్లు సిట్ అధికారులు కనుగొన్నారు. కస్టడీపై తీర్పు రిజర్వు పార్టీలో రోహిత్‌రెడ్డి రెండు రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అధిక కిక్కుకోసం ఖరీదైన మద్యంలో కొకైన్, మెథోఇథిఫిన్ కలుపుకొన్నారని, ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మ మూడు రకాల డ్రగ్స్ తీసుకున్నారని విచారణలో తేలింది. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిన నిందితులను మంగళవారం విచారించిన సిట్ అధికారులు డ్రగ్స్ మూలాలపైనే దృష్టి సారించారు. ఇందులో భాగంగానే పార్టీలో మూడు రకాల డ్రగ్స్ వాడిన విషయం తెలిసింది. జ్యుడీíÙయల్ రిమాండ్‌లో ఉన్న రోహిత్‌రెడ్డి, రితే‹Ùరెడ్డి, నమిత్ శర్మలను కస్టడీకి తీసుకుంటే అసలు విషయాలు బయటకొస్తాయని పోలీసులు భావిస్తున్నారు. వీరిని ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇరువురి వాదనలను విన్న న్యాయస్థానం తీర్పును ఈ నెల 20కి రిజర్వ్ చేసింది. సీపీ సమావేశం: డ్రగ్స్ కేసు విచారణ చేపడుతున్న సిట్ అధికారుల బృందంతో ఫ్యూచర్ సిటీ కమిషనర్ సు«దీర్‌బాబు సమావేశమయ్యారు. శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు రంగాలకు చెందిన వ్యక్తులు డ్రగ్స్ పార్టీ నిర్వహించడానికి గల కారణాలను విచారణలో రాబట్టాలని సీపీ సూచించినట్లు తెలిసింది. -
నిబంధనల ప్రకారమే బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తొలిసారిగా స్పందించారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశామని చెప్పారు. ఎంపీ పుట్టా మహేశ్‌తో పాటు ఇతర నిందితులకు స్టేషన్ బెయిల్ లభించడం నిబంధనల ప్రకారం జరిగిందే తప్ప అందులో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని అన్నారు. బుధవారం పార్లమెంటు ఆవరణలో ఆయన మీడియాతో ముచ్చటించారు. ‘మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కొందరు స్టేషన్ బెయిల్ పొందారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారు తాము బాధితులమని చెబుతున్నారు. ఈ కేసుల్లో బాధితులుగా ఉన్నవారికి స్టేషన్ బెయిల్ పొందే అవకాశం చట్టరీత్యా ఉంటుంది. ఇందులో ప్రభుత్వం గానీ, మరెవరు గానీ చేసేదేమీ లేదు..’అని ముఖ్యమంత్రి అన్నారు. కేసును పక్కదారి పట్టనివ్వకుండా పూర్తిస్థాయిలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకే ప్రతేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశామని చెప్పారు. ముందస్తు ముచ్చటే లేదు... తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని సీఎం తోసిపుచ్చారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే అంటే 2029లోనే జరుగుతాయని స్పష్టం చేశారు. ‘2028లో ఎన్నికలు జరుగుతాయని వస్తున్న వార్తల్లో నిజం లేదు. కేంద్ర ప్రభుత్వం ముందుగా జాతీయ జనగణన పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాతే దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ మొదలవుతుంది. ఇవన్నీ జరగడానికి సమయం పడుతుంది..’రేవంత్ వివరించారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరగాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు సీఎం తెలిపారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని, అది మంచి పరిణామమని సీఎం వ్యాఖ్యానించారు. రాహుల్, ప్రియాంకతో భేటీలు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాం«దీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాం«దీతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. పార్టీ తరఫున ఇటీవల రాజ్యసభకు ఎంపికైన వేం నరేందర్‌రెడ్డిని వారికి పరిచయం చేశారు. కాగా వేం నరేందర్‌రెడ్డిని రాహుల్, ప్రియాంక అభినందించారు. రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం కల్పించినందుకు రాహుల్, ప్రియాంకలకు వేం నరేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి, ఎంపీలు మల్లు రవి, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురామిరెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ నేత రోహిణ్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ మాజీ మంత్రి రోజాకు పలకరింపు పార్లమెంటు ఆవరణలో వైఎస్సార్సీపీకి చెందిన ఏపీ మాజీ మంత్రి రోజాను ముఖ్యమంత్రి పలకరించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసేందుకు వైఎస్సార్సీపీ ఎంపీలతో కలిసి రోజా పార్లమెంటుకు వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ఎదురుకావడంతో ఒకరినొకరు మర్యాద పూర్వకంగా పలకరించుకున్నారు. -
మోదీకి బాబు బెదిరింపు.. జాతీయ స్థాయిలో ఏపీ పరువు తీసిన ఎంపీ పుట్టా మహేష్
-
డ్రగ్స్ కేసు.. సిట్ అంటేనే కూర్చోవడం: బీజేపీ సెటైర్లు
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సెటైరికల్ కామెంట్స్ చేశారు. డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సిట్ వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. సిట్ అంటేనే కూర్చోవడం అంటూ ఎద్దేవా చేశారు. నాయకులే డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం బాధాకరం అని వ్యాఖ్యానించారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలిస్తామని రేవంత్ చెప్పినవన్నీ ఉత్త మాటలే అలా జరిగితే.. ఫాంహౌస్‌కు డ్రగ్స్ ఎలా వచ్చాయి. నాయకులే డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం బాధాకరం. స్కూలు పిల్లలకు కూడా డ్రగ్స్ సరఫరా అవుతోంది. డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సిట్ వల్ల ఒరిగేదేమీ లేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరిగిందో ఇక్కడా అదే జరుగుతుంది. సిట్‌తో జరిగేదేమీ ఉండదు. డ్రగ్స్, ల్యాండ్, లిక్కర్ దందాలన్నీ కాంగ్రెస్ కనుసన్నల్లో సాగుతోందిఆర్ఎస్ఎస్ ని నిషేధించాలని కాంగ్రెస్ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. భారత నిఘా విభాగం ‘రా’ను కూడా నిషేధించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. చండూరులో కాంగ్రెస్ దుండగులు బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేశారు. ఆస్పత్రిలో చికిత్స అందించకుండా కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. తెలంగాణలో దారుణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. నల్లగొండలో ప్రజాస్వామ్యం లేదు. రాచరిక పాలన కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిపై పోలీసులు చేయి చేసుకున్నారు.పెద్దపల్లి, మంచిర్యాలలో పోలీసుల బలంతో బీజేపీని అణిచివేసే ప్రయత్నం జరుగుతోంది. బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేస్తే ఓ చిన్న కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకులు స్వార్థం కోసమే పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నారు. తెలంగాణలో గూండా రాజ్యం నడుస్తోంది. బీజేపీ కార్యకర్తలపై దాడి చేస్తే తిరగబడతాం అని హెచ్చరించారు. అలాగే, తెలంగాణలో కరెంట్ కోతలు విపరీతంగా ఉన్నాయి. కరెంట్ సరఫరా పూర్తి స్థాయిలో కొనసాగించాలి. పంటలు కూడా ఎండిపోతున్నాయి అని వ్యాఖ్యలు చేశారు. -
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్
-
తప్పు జరిగింది..! టీడీపీ ఎంపీ పుట్టా వీడియో
-
కోడిని కోస్తే జైల్.. కొకైన్ పీలిస్తే బెయిల్
-
ఫామ్‌హౌస్ డ్రగ్స్‌పై సిట్
సాక్షి, హైదరాబాద్/మొయినాబాద్/శంషాబాద్ రూరల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒక ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సహా పలువురు హైప్రొఫైల్ వ్యక్తులు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడటంతో ఈ కేసు దర్యాప్తును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. 9 మంది అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తూ డీజీపీ బి.శివధర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుదీర్‌బాబు పర్యవేక్షణలో ఈ బృందం పనిచేయనుంది. చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతం నేతృత్వంలో దర్యాప్తు చేయనుంది. మూడు నెలల్లో చార్జిషీట్ దాఖలు చేయాలని డీజీపీ ఆదేశించారు. సిట్ దర్యాప్తు సమయంలో కేసు మూలాలను పరిశీలించడంతోపాటు, నేరం జరగడానికి సంబంధించిన అన్ని అంశాలనూ విచారించాలని డీజీపీ పేర్కొన్నారు. పుట్టా మహేశ్, రోహిత్‌రెడ్డి ఈ పార్టీ ఎందుకు పెట్టారు? రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌లో ఒక భారీ డీల్ గురించే మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఏపీలోని ఏలూరుకు చెందిన టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్, వారి మిత్రులు కలిసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దుబాయ్‌లో రియల్ఎస్టేట్ లావాదేవీలపైనా డ్రగ్పార్టీ మీటింగ్‌లో చర్చించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో పలు రాష్ట్రాల వ్యాపారులు, రాజకీయ నాయకులు ఉండటం.. ఏకంగా పోలీసులను బెదిరించేందుకు కాల్పులకు తెగబడటంతో వారంతా ఏదో పెద్ద డీల్ గురించే చర్చలు చేస్తున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. రియల్ఎస్టేట్, ఆర్థిక లావాదేవీలు వీరి మధ్య ఉన్నాయని, సెటిల్మెంట్లలోనూ కలిసి పనిచేస్తున్నారని తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఫామ్‌హౌస్‌లో కొంతకాలంగా జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై సిట్ దర్యాప్తు చేయనుంది. ప్రధానంగా ఫామ్‌హౌస్ కేంద్రంగా రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న వీకెండ్ పార్టీలు, వాటికి హాజరవుతున్న హైప్రొఫైల్ వ్యక్తులు సహా రోహిత్ డ్రగ్స్ నెట్‌వర్క్‌పై వివరాలు సేకరించనుంది. కేసు విచారణలో రాబట్టాల్సిన కీలక విషయాలపై సిట్ అధికారులు శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌లో సమావేశమయ్యారు. ఈ కేసు మూలాలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి.. డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చారు.. డ్రగ్స్ పార్టీ ఎందుకు నిర్వహించారు.. పార్టీ తరువాత వీరంతా ఏం చేయాలనుకున్నారు.. వంటి కీలక విషయాలను విచారణలో రాబట్టాలని చర్చించినట్లు తెలిసింది. దీంతోపాటు పోలీసులపై కాల్పులకు దిగిన ఢిల్లీకి చెందిన నమిత్ శర్మపై సిట్ ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది. ఆయన చేసే వ్యాపారాలు ఏంటి? రోహిత్ రెడ్డితో ఆయనకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి. గతంలో వీరంతా ఎప్పుడైనా కలిశారా..? వీరి మధ్య ఇప్పటివరకు ఏమైనా రియల్ఎస్టేట్ వ్యాపారం జరిగిందా? ఇలా పలు కోణాల్లో సిట్ వివరాలు రాబట్టే అవకాశం ఉంది. ఫాంహౌస్ సీజ్! పోలీసులు ఇప్పటికే చంచల్‌గూడ జైలు రిమాండ్‌లో ఉన్న రోహిత్‌రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ మినహా మిగతా 8 మంది నిందితులను మంగళవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్లో విచారించారు. అయితే ఈ విచారణకు ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌తోపాటు మరో నలుగురు నిందితులు హాజరు కాలేదు. పుట్టా మహేశ్ తరఫున న్యాయవాది విచారణకు హాజరైనట్లు తెలిసింది. నమిత్‌శర్మకు సంబంధించిన వివరాలతోపాటు పార్టీలో డ్రగ్స్ వినియోగం, కాల్పులకు గల కారణాలపై ఆరా తీశారు. ఈ వివరాలతో సిట్ బృందం బుధవారం నుంచి దర్యాప్తు ప్రారంభించనుంది. ఏపీకి చెందిన పుట్టా మహేశ్, ఢిల్లీకి చెందిన నమిత్‌శర్మ సహా పలు రాష్ట్రాలతో లింకులు ఉండటంతో ఆయా రాష్ట్రాల్లోనూ సిట్ దర్యాప్తు చేయనుంది. కాగా, రోహిత్‌రెడ్డి, రితేష్‌రెడ్డి, నమిత్ శర్మలను ఏడు రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. పోలీసులపై కాల్పులు జరిపిన గన్ లైసెన్స్‌ను రద్దు చేయాలని సిట్ అధికారులు ఫ్యూచర్ సిటీ కమిషనర్ సు«దీర్‌బాబుకు లేఖ రాశారు. మరోవైపు అసైన్డ్ భూమిలో ఉన్న రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ను సీజ్ చేయాలని సిట్ అధికారులు రెవెన్యూ అధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది. -
LIVE: నో యాక్షన్..? జగన్ సంచలన కామెంట్స్...
-
పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో దొరికినవెంటనే.. అనిత ఫోన్ చేసి...
-
బీసీ, ఎస్సీ నేతలపైనే బాబు ప్రతాపం
సాక్షి, అమరావతి: అడ్డగోలు వ్యవహారాలు నడుపుతూ దొరికిపోయిన టీడీపీ నేతలపై చర్యల విషయంలో సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరి పట్ల ఆపార్టీ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎస్సీ, బీసీ నేతలైతే వెంటనే చర్యలు తీసుకోవడం.. సొంత సామాజికవర్గం నేతల విషయంలో మౌనముద్ర దాల్చడం ఏంటని మండిపడుతున్నారు. తాజాగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ హైదరాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ కేసులో చిక్కడంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని షోకాజ్ నోటీసు జారీ చేశారు. అదే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలలపై ఎంత దుమారం రేగినా కిక్కురుమనకపోవడాన్ని పలువురు యాదవ సామాజిక వర్గ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు సొంత సామాజికవర్గం నేత కావడంతోనే బీఆర్ నాయుడు పవిత్రమైన టీటీడీ చైర్మన్‌గా ఉండి రాసలీలలు నడుపుతున్నా పట్టించుకోకుండా వదిలేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజానీకంలోనూ ఇదే చర్చ జరుగుతోంది. కనీసం టీటీడీకి ఉన్న పవిత్రతను దృష్టిలో ఉంచుకుని అయినా బీఆర్ నాయుడిపై చర్యలు తీసుకుంటే బాగుండేదని తటస్థులు సైతం పేర్కొంటున్నారు. బీఆర్ నాయుడు రాజీనామా చేయాల్సిందేనని, ఆయన ఒక్క క్షణం టీటీడీ చైర్మన్‌గా కొనసాగినా పదవికి కళంకమేనని సోషల్ మీడియాలో సైతం చర్చ సాగుతోంది. ఈ వ్యవహారంతో టీటీడీ ప్రతిష్టకు భంగం వాటిల్లినా చంద్రబాబు నోరు మెదపలేదు. కనీసం ఆయన్ను వివరణ కూడా అడగకుండా.. ఎవరు ఎటు పోయినా.. రాష్ట్రం ఏమైనా.. టీటీడీ భ్రష్టు పట్టిపోయినా ఫర్వాలేదనే రీతిలో బీఆర్ నాయుడిని కొనసాగిస్తున్నారు. బీఆర్ నాయుడు తీరుపై కూటమి నేతల్లోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆయన వల్ల అందరం ఇరుకునపడ్డామని, ఇంకా అందలం ఎక్కించడం ఏమిటనే అసహనం దాదాపు అందరిలోనూ కనిపించింది. అయినా సరే.. సొంత సామాజికవర్గం కావడం, అందులోనూ తనకు డప్పు కొట్టడంలో రికార్డులు బద్దలుకొట్టిన ఒక టీవీ ఛానల్‌కు బీఆర్ నాయుడు యజమాని కావడంతో చంద్రబాబు చేష్టలుడిగిపోయారనే విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. పుట్టాకు షోకాజ్ డ్రామా.. డ్రగ్స్ కేసులో దొరికిపోయిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో తాను సీరియస్ అయినట్లు చంద్రబాబు లీకులు ఇచ్చారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, వెంటనే వివరణ ఇవ్వాలని ఆయనకు షోకాజ్ నోటీసుల డ్రామాకు తెర తీశారు. వాస్తవానికి పుట్టా మహేష్ పై వెంటనే సస్పెన్షన్ వేటు వేయాల్సి ఉన్నా సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి అల్లుడు, మరో సీనియర్ నేత సుధాకర్ యాదవ్‌కుమారుడు కావడంతో షోకాజ్ నోటీసు ఇచ్చి ఊరుకున్నారు. కనీసం నామమాత్రంగా తీసుకున్న ఇలాంటి చర్యలైనా బీఆర్ నాయుడి విషయంలో ఎందుకు తీసుకోలేకపోయారనే ప్రశ్నకు చంద్రబాబు వైపు నుంచి సమాధానం లేకుండా పోయింది. కోనేటి ఆదిమూలం సస్పెన్షన్ గతేడాది సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలల వీడియో బయటకు రావడంతో ఆయనపై ఆగమేఘాల మీద సస్పెన్షన్ వేటు వేశారు. అప్పటి నుంచి ఆయన పార్టీ లోనే ఉన్నా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడంలేదు. దళిత నేత కావడంతో ఆయనపై సీరియస్ యాక్షన్ తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పుట్టా మహేష్ బీసీ కావడంతో షోకాజ్ నోటీసు ఇచ్చి డ్రామా నడిపారు. కానీ బీఆర్ నాయుడు తన సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో చంద్రబాబు ఆయన్ను కనీసం వివరణ కూడా అడగలేదు. ఎస్సీ నేతలపై ఒంటి కాలిపై లేస్తున్న చంద్రబాబు.. బీసీలైతే ఓ మాదిరిగా స్పందిస్తున్నట్లు టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అదే సొంత సామాజికవర్గం నేతలైతే ఎంత పెద్ద తప్పు చేసినా కనీసం పట్టించుకోనని తేల్చేసినట్లు ఈ మూడు ఉదంతాల ద్వారా తేటతెల్లమైందని పేర్కొంటున్నారు. -
‘బాబూ.. ఎంపీ మహేష్ తాట తీస్తావా?.. కేవలం డైలాగులేనా?’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ లోక్‌సభ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌పై చర్యలు తీసుకోకపోవడంపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికితే, పట్టుబడితే హాట్‌లైన్ రాజకీయాలతో బెయిల్ ఇప్పించడమే కాకుండా, షోకాజ్ నోటీసు పేరిట డ్రామా చేస్తారా? అని ప్రశ్నించింది. కోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి.. డ్రగ్స్ తీసుకునే వారిని వదిలేస్తారా? అంటూ ఘాటు విమర్శలు చేసింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..‘కోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, రాజకీయ కక్షలతో అమయాకులను రోడ్ల మీద పరేడ్ చేయించడమే కాకుండా, జైళ్లకు పంపిన మీరు, మీ పార్టీకి చెందిన లోక్‌సభ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికితే, పార్లమెంటు చరిత్రలో ఒక ఎంపీ ఇలా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే హాట్‌లైన్ రాజకీయాలతో బెయిల్ ఇప్పించడమే కాకుండా, షోకాజ్ నోటీసు పేరిట డ్రామా చేస్తారా?. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, హోం మంత్రి అనిత.. మీరు అనుసరించే చట్టం, న్యాయం, ధర్మం ఇదేనా? ఇలా చేసి సమాజానికి, యువతకు తప్పుడు సందేశం ఇస్తున్న మాట వాస్తవం కాదా?. హైదరాబాద్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పాల్గొన్నారన్నది వాస్తవం కాదా? ఆధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారన్నది వాస్తవం కాదా? డ్రగ్ నిర్ధారణ పరీక్షలను తారుమారు చేయడానికి యూరిన్ శాంపిల్స్‌లో భాగంగా యూరిన్ బదులు నీరు ఇచ్చారన్న ఆరోపణ కూడా ఉంది. చివరకు కొకైన్ తీసుకున్నట్టుగా రక్త పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. ఇన్ని పక్కా ఆధారాలతో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తిని ఎంపీ పదవికి రాజీనామా చేయించాల్సింది పోయి, తేలుకుట్టిన సామెత మాదిరిగా మౌనం దాల్చడం, పైగా పలుకుబడిని ఉపయోగించి, బెయిల్ మీద తీసుకురావడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. డ్రగ్స్ వ్యవహారాల్లో, మహిళలపై నేరాల విషయంలో ఎవరైనా తప్పులు చేస్తే తాటతీస్తా అని పదేపదే చెప్తున్న మాటలు కేవలం డైలాగులు మాత్రమేనని, చేతల్లో శూన్యమని, మీ అసలు రంగు ఇదేనని మరోసారి రుజువు అయ్యింది.కూటమికి చెందిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా మీకే స్వయంగా ఫిర్యాదు చేసినా కమిటీల పేరుతో ఇంకా ఇంకా డ్రామా చేస్తూనే ఉన్నారు.టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళమీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే, పంచాయతీ చేశారు తప్ప నో యాక్షన్.KGBV మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌మీద కూడా నో యాక్షన్. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీద కూడా నో యాక్షన్.మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పీఏ మీద నో యాక్షన్.ఇక ప్రస్తుత టీటీడీ ఛైర్మన్, ఒక మహిళను మోసం చేసి, వీడియో, ఫొటోలతో అడ్డంగా దొరికిపోయినా నో యాక్షన్. తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలు నేరుగా మీకే లేఖ రాసినా టీటీడీ చైర్మన్‌లాంటి పోస్టులో పెట్టారు.కమిటీల విచారణ, షోకాజ్ నోటీసుల పేరిట చేస్తున్న డ్రామాలు ఇకనైనా కట్టిపెట్టి, డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎంపీ చేత తక్షణమే రాజీనామా చేయించడంతోపాటు, వీళ్లందరి మీద చర్యలు తీసుకోండి. లేకపోతే మీ పార్టీని ప్రజలు క్షమించరు’ అంటూ ఘాటు విమర్శలు చేసింది. 🚨 #TDPDrugMafiaకోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, రాజకీయ కక్షలతో అమయాకులను రోడ్ల మీద పరేడ్ చేయించడమే కాకుండా, జైళ్లకు పంపిన మీరు, మీ పార్టీకి చెందిన లోక్‌సభ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికితే, పార్లమెంటు చరిత్రలో ఒక ఎంపీ ఇలా డ్రగ్స్… pic.twitter.com/uzpnXwd562— YSR Congress Party (@YSRCParty) March 16, 2026 -
టీడీపీ ఎంపీ చీకటి బాగోతం.. మౌనంగా చంద్రబాబు, ఎల్లో మీడియా
-
తండ్రులకు మచ్చ తెస్తున్న తనయులు...
సాక్షి ప్రతినిధి, కడప: ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆ ఇద్దరు భాగస్వామ్య ఎమ్మెల్యేలు. ఆయా నియోజకవర్గాల్లో వారు శాసిస్తున్నా, తనయులు చట్టాలకు లోబడి మసలుకోవడంలో కట్టడి చేయలేకపోయారు. నిషేధిత మత్తు పదార్థాలు సేవిస్తూ పోలీసులకు పట్టుబడడంతో అభాసుపాలవుతున్నారు. ఫలితంగా ఆయా ఎమ్మెల్యేలకు ‘సన్’స్ట్రోక్ తప్పడం లేదు. వారే మైదుకూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు సుధాకర్‌యాదవ్, ఆదినారాయణరెడ్డి. సరిగ్గా రెండున్నర్ర నెలల వ్యవధిలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యే తనయులు ఇద్దరూ డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టబడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పైగా పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు మహేష్ యాదవ్ ఎంపీ కావడం గమనార్హం. ⇒ జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తనయుడు సు«దీర్‌రెడ్డి ఈ ఏడాది జనవరి 3న డ్రగ్స్ కేసులో హైదరాబాద్ నార్శింగ్ పోలీసులకు చిక్కారు. పరీక్షలు నిర్వహించిన పోలీసులు డ్రగ్స్ పాజిటివ్ రావడంతో అదుపులోకి తీసుకున్నారు. ఆపై డ్రగ్ ఆడిక్షన్ సెంటర్‌కు అప్పగించారు. అప్పట్లో ఈవార్త తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ తనయుడు ఏలూరు పార్లమెంటు సభ్యుడు మహేష్‌యాదవ్ ఈగల్ టీమ్ పోలీసులకు పట్టుబడ్డారు. తెలంగాణ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఫామ్ హౌస్‌లో అనూహ్యంగా శనివారం రాత్రి పోలీసులకు చిక్కారు. ⇒ మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్‌యాదవ్ తనయుడు మహేశ్‌యాదవ్ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు అల్లుడు కావడంతో ఏలూరు లోక్‌సభ టీడీపీ అభ్యరి్థత్వం దక్కింది. ఆపై ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికయ్యారు. ఏలూరు ఎంపీగా ప్రాతినిథ్యం వహిçస్తున్నారు. తాజాగా డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కడం తెలుగురాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.స్థాయి పెరిగినా వ్యక్తిత్వ లోపం... ఎమ్మెల్యే కొడుకు.. ఆపై ఎంపీ హోదా.. ఉన్నతంగా వ్యవహరించాల్సింది పోయి ఇలా డ్రగ్స్ కేసులో దొరకడంపై ప్రజలు తూర్పారబడుతున్నారు. స్థాయి..హోదా పెరిగినా తన బుద్దిని బహిర్గతం చేసుకున్నారని విశ్లేషకులు దెప్పిపొడుస్తున్నారు. కాంట్రాక్టర్‌గా హైదరాబాద్‌లో స్థిరపడినప్పటికీ ప్రజాజీవితంతో ముడిపడి ఉన్నప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఇవేవి లెక్క చేయకుండా ఏకంగా డ్రగ్స్ వ్యవహారంలో దొరికిపోవడంతో జిల్లాలో నవ్వులపాలయ్యారు. 2014 ఎన్నికల ముందు కూడా మహేష్‌యాదవ్ బ్రహ్మంగారిమఠం మండలానికి చెందిన వారి సామాజిక వర్గానికే చెందిన ఓ నేతను ఇష్టానుసారంగా దూషించారు. కులంపేరుతో రెచ్చగొట్టే చర్యలకు దిగారు. ఇదంతా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దాంతో అంతో ఇంతో మద్దతుగా నిలిచిన నేతలు సైతం రాత్రికి రాత్రే దూరమయ్యేలా మహేష్ యాదవ్ వ్యవహారశైలి కని్పంచింది. ఆ ఎన్నికలల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ ఓటమికి అది కూడా ఓ ప్రధాన కారణంగా నిలిచిందని పలువురు వెల్లడిస్తున్నారు. అప్పట్లో ప్రత్యక్ష రాజకీయాల్లో క్రీయాశీలకంగా లేరని సర్దిచెప్పుకున్నా, తాజాగా డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడడంతో తన బుద్ధి పోనిచ్చుకోలేదని పలువురు నిలదీస్తున్నారు. తండ్రులకు మచ్చ తెస్తున్న తనయులు... జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తనయుడు సు«దీర్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్‌యాదవ్ తనయుడు మహేష్‌యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడి వారి తండ్రులకు మచ్చ తీసుకొచ్చారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఈవ్యవహారంలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న మహేష్‌యాదవ్ మరింతగా చెడ్డపేరు మూటగట్టుకున్నారు. రక్త నమూనాలో డ్రగ్స్ శాంపిల్స్ పాజిటివ్ లభించినా పార్లమెంటు సభ్యుడు కావడంతో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపినట్లు సమాచారం. గడిచిన ఐదు నెలల క్రితం సైబర్ నేరస్తుల వలలో చిక్కుకున్న ఎమ్మెల్యే సుధాకర్‌యాదవ్‌కు తాజాగా ‘సన్’స్ట్రోక్ భారీగా తగిలింది. -
ఏపీ పరువు తీసిన ఏలూరు ఎంపీ.. TDP గుట్టురట్టు..
-
నేను తప్పు చేయలేదు.. అడ్డంగా దొరికి బుకాయింపు
-
తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ గుట్టు రట్టు... డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్‌గా నిర్ధారణ
-
చిన్న పార్టీ కాదు.. పెద్ద డ్రగ్స్ మాఫియా
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగింది చిన్న పార్టీ కాదని, అదో పెద్ద డ్రగ్స్ మాఫియా అని, బడా రాకెట్ నడుస్తోందని తాండూరు ఎమ్మెల్యే బి.మనోహర్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ యువతను చెడగొట్టడానికి ఈ డ్రగ్స్ మాఫియా పనిచేస్తోందని విమర్శించారు. ఈ ముఠా వెనుక ఉన్న వారిని ఈగల్ టీం బయటకు లాగుతుందని, త్వరలోనే ఈ రాకెట్లో ఉన్న వారి పేర్లు బయటకు వస్తాయని అన్నారు. ఆదివారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.పదేళ్ల పాటు ఆడిందే ఆట పాడిందే పాటగా బీఆర్ఎస్ నేతలు వ్యవహరించారని, ఇప్పుడు తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వ్యవహారం సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉందని మనోహర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన వెనుక నిలబడినందుకు తాండూరు ప్రజలు తలదించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. తెలంగాణలో డ్రగ్స్ మాఫియాను కూకటివేళ్లతో పెకిలించేలా అందరూ సహకరించాలని, రోహిత్‌రెడ్డి వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్ వద్ద దిష్టిబోమ్మల దహనం కేటీఆర్‌తోనే తెలంగాణలోనే డ్రగ్స్ కల్చర్ వచ్చిందని రోహిత్‌రెడ్డి వ్యవహారంతో మరోమారు రుజువైందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్రావు అన్నారు. ఆదివారం ఉదయం గాంధీభవన్ ఎదుట కేటీఆర్ దిష్టిబోమ్మను దహనం చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. ఈ ఘటనపై కేటీఆర్ స్పందించాలని, ఇప్పటికైనా తన తప్పును ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి నేతృత్వంలో ఆదివారం సాయంత్రం గాం«దీభవన్ ఎదుట కేటీఆర్, పైలెట్ రోహిత్‌రెడ్డిల దిష్టిబోమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుర్రం శ్యాంచరణ్‌రెడ్డి, ఎర్రమల్ల రాంరెడ్డి, జిల్లా అధ్యక్షుడు హరిధర్ తదితరులు పాల్గొన్నారు. -
‘పచ్చ’ మత్తు.. జనం చిత్తు
సాక్షి, అమరావతి: ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ తీసుకుని దొరికి పోవడంతో ఆ పార్టీ పరువు బజారున పడింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గంజాయి, డ్రగ్స్, నకిలీ మద్యానికి రాష్ట్రం కేరాఫ్‌గా మారిందని ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్, గంజాయి మాఫియా చెలరేగిపోతోందని, పచ్చ పార్టీ నేతలు మత్తుకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని నెటిజన్లు సోషల్ మీడియాలో కడిగి పారేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడి బాగోతాన్ని గుర్తు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు అండ్ కో కానీ, ఎల్లో మీడియా కానీ నోరు మెదపడం లేదని ఎత్తి చూపుతున్నారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్, గంజాయి దందా బయటపడినా వాటి మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటున్నాయి. దేశంలో ఎక్కడ డ్రగ్స్ పార్టీని పోలీసులు ఛేదించినా టీడీపీ కూటమి పెద్దలే చిక్కుతున్నారు. టీడీపీ కూటమి ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులే డ్రగ్స్ మత్తులో జోగుతూ దొరుకుతున్నారు. ఎందుకంటే డ్రగ్స్ దందా సాగిస్తున్నదే టీడీపీ పెద్దలు కావడంతో.. హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో డ్రగ్స్ పార్టీల్లో వాళ్లే ప్రధాన భూమిక పోషిస్తున్నారు. టీడీపీ కూటమి ప్రజా ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు ఉంటే చాలు.. డ్రగ్స్ దర్జాగా ఫాం హౌస్‌లకు నడచి వస్తాయన్నది బహిరంగ రహస్యంగా మారింది. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ సేవిస్తూ హైదరాబాద్ పోలీసులకు చిక్కడంతో ఆ విషయం మరోసారి నిరూపితమైంది. టీడీపీ కూటమి పెద్దల కనుసన్నల్లో సాగుతున్న డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం మాఫియా రాష్ట్రాన్ని కొల్లగొడుతోంది. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా యావత్ దేశంలో బరితెగించి దందా సాగిస్తోంది. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడతామని 2024 ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ కీలక నేతల కుటుంబాలే ప్రాంతాల వారీగా డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం దందాను పర్యవేక్షిస్తుండటంతో పోలీసు శాఖ చోద్యం చూస్తూండిపోవాల్సి వస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవస్థీకృతమైన డ్రగ్స్, గంజాయి, నకిలీ మద్యం మాఫియా రాష్ట్రాన్ని అమాంతం కబళించేస్తోంది. డ్రగ్స్: డోర్ డెలివరీ ⇒ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోంది. ఏకంగా కొరియర్ సర్వీసులతో డోర్ డెలివరీ చేసే డ్రగ్స్ దందా రాష్ట్రంలో వేళ్లూనుకుంటోంది. యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ దందాకు రాష్ట్రం అడ్డాగా మారిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న డ్రగ్ డీలర్లు తమ దందాకు ఆంధ్రప్రదేశ్నే ప్రధాన మార్కెట్‌గా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ⇒ కొన్ని నెలల క్రితం ఢిల్లీ నుంచి నూజివీడు మీదుగా విజయవాడకు తరలిస్తున్న ఎండీఎంఏ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం రాష్ట్రంలో డ్రగ్స్ దందా తీవ్రతకు ఓ నిదర్శనం మాత్రమే. ఆ ఉదంతం రాష్ట్రంలో డ్రగ్స్ దందాలో కేవలం గొరంతేనని.. వాస్తవానికి రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న డ్రగ్స్ దందా కొండంత ఉందని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. దేశంలో ప్రధాన నగరాలే కేంద్రంగా విస్తరించిన డ్రగ్స్ మాఫియా, రాష్ట్రంలో మాత్రం ఊరూరా విస్తరిస్తోంది. ఢిల్లీ, ముంబై, అమృత్సర్ తదితర నగరాల్లోని డ్రగ్స్ మాఫియా ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుంటున్న డ్రగ్స్‌ను మార్కెట్ చేయడానికి ఏపీనే గమ్యస్థానంగా ఎంచుకుంది. ⇒ వివిధ రూపాల్లోని ఎండీఎంఏ డ్రగ్స్‌ను రాష్ట్రంలోకి యథేచ్ఛగా తరలిస్తున్నారు. అందుకోసం విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కర్నూలు, కాకినాడ వంటి ప్రధాన నగరాలతోపాటు హిందూపూర్, నంద్యాల, నూజివీడు, ఏలూరు, జగ్గయ్యపేట, భీమవరం, రాజమహేంద్రవరం, విజయనగరం వంటి దాదాపు 50 పట్టణాల్లో కూడా డ్రగ్స్ మాఫియా ఏజెంట్ల వ్యవస్థను నెలకొల్పింది. ఢిల్లీ, ముంబై తదితర నగరాల నుంచి స్థానిక ఏజెంట్లకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. ఇందుకోసం కొరియర్ సర్వీసులను వాడుకుంటున్నాయి. ⇒ ఏజెంట్లు అందుకున్న డ్రగ్స్‌ను చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి డ్రగ్స్ వెండర్స్ (విక్రేతలు)కు అందిస్తున్నారు. ఆ వెండర్స్ వాటిని గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తూ యువతను మత్తులో ముంచుతున్నారు. డ్రగ్స్ మాఫియా రాష్ట్రంలోని విద్యా సంస్థలనే తమ దందాకు కేంద్రంగా చేసుకుంది. ఏజెంట్ల ద్వారా డ్రగ్స్ పొందిన వెండర్స్ విద్యా సంస్థల ప్రాంగణాలకు సమీపంలోనే వాటిని విక్రయిస్తున్నారు. అందుకోసం ఉన్నత విద్యా సంస్థల సమీపంలోనే బడ్డీ కొట్టులు, స్ట్రీట్ వెండర్స్ రూపంలో డ్రగ్స్ విక్రయాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. సిగరెట్లు, చాక్లెట్లు, చూయింగ్ గమ్, పౌడర్ రూపంలో విక్రయిస్తున్నారు. విజయవాడలోని ఉన్నత విద్యా సంస్థల ప్రాంగణాల సమీపంలో విక్రయించేందుకే ఢిల్లీ నుంచి కొరియర్ సర్వీసు ద్వారా నూజివీడు మీదుగా డ్రగ్స్ తరలించడమే అందుకు తాజా నిదర్శనం. కేసుల నమోదు గోరంత.. స్మగ్లింగ్ కొండంత ⇒ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి దందా యథేచ్ఛగా సాగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. నామ మాత్రంగా కేసులు నమోదు చేస్తూ కనికట్టు చేసేందుకు యత్నిస్తున్నారు. రాష్ట్రంలో సాగుతున్న డ్రగ్స్ దందాతో పోలిస్తే నమోదు చేస్తున్న కేసులు 10% మాత్రమేనని పోలీసు వర్గాలే చెబుతుండటం గమనార్హం. ⇒ 2024లో రాష్ట్రంలో 1,600 ఎన్డీపీఎస్ (నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్) కేసులు నమోదయ్యాయి. 2025లో 1,836 కేసులు నమోదు చేసి 46,011 కేజీల గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. వాస్తవానికి రాష్ట్రం మీదుగా సాగుతున్న డ్రగ్స్ దందా.. ఇందుకు పదుల రెట్లు అధికంగా ఉంటుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మత్తుకు బ్రాండ్ అంబాసిడర్లు పచ్చ బాబులే డ్రగ్స్, గంజాయి దందా సాగించడమే కాదు.. టీడీపీ కూటమి కీలక నేతల కుటుంబ సభ్యులు డ్రగ్స్ మత్తులో మజా చేస్తూ హల్చల్ చేస్తున్నారు. తాజాగా ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ హైదరాబాద్‌లో డ్రగ్స్ తీసుకొని అడ్డంగా దొరికారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుదీర్ రెడ్డి డ్రగ్స్ మత్తులో జోగుతూ పోలీసులకు చిక్కారు. గత ఏడాది భీమవరం ఎమ్మెల్యే పి.రామాంజనేయులు కుమారుడు కూడా హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసులో చిక్కారని జాతీయ మీడియాలో ప్రముఖంగా ప్రచురితం కావడం గమనార్హం.చోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం⇒ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన కార్యాచరణ చేపట్టలేదు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆపరేషన్ పరివర్తన్‌ను రెండు దశల్లో సమర్థవంతంగా అమలు చేసింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్)ను ఏర్పాటు చేసి పటిష్ట కార్యాచరణ చేపట్టింది. ⇒ రాష్ట్రంలో ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో దశాబ్దాలుగా సాగిస్తున్న గంజాయి సాగును కూకటివేళ్లతో పెకలించింది. ఏకంగా 11,500 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేసింది. గిరిజనులను ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహించింది. అందుకోసం రూ.500 కోట్లతో ప్రత్యేక పథకాన్ని అమలు చేసింది. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి డ్రగ్స్ అక్రమ రవాణాను సమర్థవంతంగా కట్టడి చేసింది. సెబ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి విస్లృతంగా తనిఖీలు చేసి అక్రమ రవాణాను అడ్డుకుంది. ⇒ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థ డ్రగ్స్‌పై పట్టు వదిలేసింది. కక్షపూరితంగా సెబ్‌ను రద్దు చేసింది. కొత్తగా ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పినప్పటికీ ఆ వ్యవస్థకు ఎలాంటి మౌలిక వసతులు సమకూర్చలేదు. విస్తృత అధికారాలు కల్పించలేదు. ప్రధానంగా ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రంగా డ్రగ్స్ దందాకు టీడీపీ సీనియర్ నేత కుటుంబం అండదండలు ఉండటంతో ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే ఉదాసీనంగా ఉంటోందన్న విషయం స్పష్టమైంది. ప్రభుత్వ ఉద్దేశం స్పష్టం కావడంతో పోలీసు శాఖ చోద్యం చూస్తోంది.కబళిస్తున్న నకిలీ మద్యం ⇒ ఐదేళ్లలో రూ.25 వేల కోట్ల దందానే లక్ష్యం ⇒ డ్రగ్స్ దందాతోపాటు టీడీపీ కూటమి పెద్దలు రాష్ట్రంలో నకిలీ, కల్తీ మద్యం రాకెట్‌ను వ్యవస్థీకృతం చేశారు. ఏకంగా కుటీర పరిశ్రమ స్థాయిలో ఊరూవాడా యూనిట్లను ఏర్పాటు చేసి నకిలీ మద్యం ఏరులై పారిస్తున్నారు. తొలి ఏడాదే రూ.5 వేల కోట్ల మేర మద్యం దందాకు పాల్పడ్డారు. ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పచ్చ మాఫియా చెలరేగిపోతోంది. ⇒ అన్నమయ్య, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఎన్టీఆర్, అనకాపల్లి, తూర్పు గోదావరి జిల్లాల్లో బయటపడిన నకిలీ మద్యం తయారీ యూనిట్ల నిర్వాహకులు టీడీపీ నేతలే కావడంతో పచ్చ ముఠా బండారం బట్టబయలైంది. ఆ కేసుల్లో పాత్రధారులైన టీడీపీ చోటా నేతలను మాత్రమే ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. కానీ నకిలీ మద్యం రాకెట్ సూత్రధారులైన టీడీపీ పెద్దలపై ఈగ వాలనివ్వ లేదు. ⇒ టీడీపీ కీలక నేతలే ప్రాంతాల వారీగా నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు కాబట్టి.. రాష్ట్రంలో నకిలీ/కల్తీ మద్యం రాకెట్ దందాను టీడీపీ మద్యం సిండికేట్ వ్యవస్థీకృతం చేసింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల నుంచి రాష్ట్రంలోని మద్యం డిస్టిలరీల ద్వారా ‘ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (వాడుక భాషలో స్పిరిట్ అంటారు)ను అక్రమంగా కొనుగోలు చేస్తోంది. ⇒ రాష్ట్రంలో ఉన్న 20 మద్యం డిస్టిలరీలు టీడీపీ కీలక నేతల ఆ«దీనంలోనే ఉండటం సిండికేట్ దందాకు కలసివస్తోంది. అలా సేకరించిన స్పిరిట్‌ను అక్రమంగా కల్తీ మద్యం యూనిట్లకు తరలిస్తున్నారు. ఆ విధంగా భారీగా కొనుగోలు చేసిన స్పిరిట్‌తో నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. దాన్ని టీడీపీ సిండికేట్ నిర్వహిస్తున్న 4,346 మద్యం దుకాణాలు, దాదాపు 75 వేల బెల్ట్ దుకాణాలు, 540 బార్ల ద్వారా దర్జాగా విక్రయిస్తున్నారు. ఏసీ బ్లాక్, ఓల్డ్ అడ్మిరల్, ఎస్పీవై 999 తదితర బ్రాండెడ్ మద్యంగా నమ్మబలుకుతూ కల్తీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. -
టీడీపీ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్/మొయినాబాద్: హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ వద్ద ఫాంహౌస్‌లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన వారికి జరిపిన పరీక్షల్లో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్టు ఈగల్ అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ తీసుకోలేదని బుకాయిస్తూ టీడీపీ ఎంపీ పుట్టా యూరిన్‌లో నీళ్లు కలిపి తొలుత ఎత్తులు వేసినా తుదకు అవి పారలేదు. ఈగల్ అధికారులు రక్త నమూనా పరీక్షలు చేయించడంతో ఆయన అడ్డంగా బుక్కయ్యారు. అజీజ్‌నగర్ సమీపంలో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి చెందిన ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు అందిన పక్కా సమాచారంతో ఈగల్ టీం, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు సంయుక్తంగా శనివారం రాత్రి సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సోదాలకు సంబంధించి ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్) డైరెక్టర్ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎన్డీపీఎస్ యాక్ట్ నిబంధనల ప్రకారం డ్రగ్ పాజిటివ్ వచ్చినా, గన్ ఫైరింగ్‌తో సంబంధం ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, అతని సోదరుడు రితేష్‌రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్ వ్యాపారి నమిత్ శర్మలను మాత్రమే పోలీసులు ఆదివారం రాజేంద్రనగర్ కోర్టు జడ్జి నివాసానికి తీసుకెళ్లి ఆయన ముందు ప్రవేశపెట్టగా, ఆయన వారికి రిమాండ్ విధించారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌తోపాటు మరో ఏడుగురికి పోలీసులే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఈ కేసు నుంచి ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌ను తప్పించేందుకు పోలీసులపై తీవ్ర ఒత్తిడి వచ్చినట్లు తెలిసింది. అందుకే డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినా, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగిందంటే.. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఫాం హౌస్‌లో శనివారం కొందరు పార్టీ చేసుకుంటున్నారని, అందులో డ్రగ్స్ కూడా వాడుతున్నట్టు ఈగల్ టీం అధికారులకు సమాచారం అందింది. వారు ఫ్యూచర్ సిటీ ఎస్ఓటీ, స్థానిక పోలీసు సిబ్బందితో కలిసి శనివారం రాత్రి 10 గంటకు ఆ ఫాం హౌస్ వద్దకు సోదాల కోసం వెళ్లారు. అదే సమయంలో తుపాకీ కాల్పుల శబ్దం రావడంతో పోలీసులు హుటాహుటిన లోపలికి వెళ్లి చూశారు. ఫాం హౌస్‌లోని స్విమ్మింగ్ పూల్ సమీపంలో సోఫాల్లో కొంత మంది కూర్చుని మద్యం సేవిస్తుండగా, వాష్‌రూం దగ్గర ఉన్న వ్యక్తి నమిత్ శర్మ చేతిలో 0.32 జర్మన్ డ్ రివాల్వర్, అతడి పక్కన ఉన్న సిల్వరి శరత్‌కుమార్ చేతుల్లో ఖాళీ బుల్లెట్ కేస్లు గుర్తించారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఫాంహౌస్‌లో సోదాలు జరపగా మరో తొమ్మిది మంది మద్యం, ఇతర మత్తు పదార్థాలు తీసుకుటున్నట్టు గుర్తించారు. 0.26 గ్రాముల కొకైన్ పట్టుబడింది. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి పీఏ/డ్రైవర్ సిల్వరి శరత్ కుమార్ కొకైన్‌ను అందరికీ పంచి, మిగిలిన రెండు ప్యాకెట్లు తన జేబులో పెట్టుకోవడంతో అది పోలీసులకు దొరికింది. దీన్ని తన యజమాని రోహిత్‌రెడ్డి స్నేహితుడు కౌశిక్ రవి తెచ్చాడని తెలిపాడు. తాను వ్యాపార పర్యటనలో సిమ్లాకు వెళ్లినప్పుడు తెలియని వ్యక్తి నుంచి కొకైన్‌ను కొన్నానని, దానిని ఈ పార్టీకి తీసుకువచ్చినట్టు కౌశిక్ రవి కూడా అంగీకరించాడు. రాత్రి నెగెటివ్.. ఉదయానికి పాజిటివ్ సోదాల అనంతరం పోలీసులు పార్టీలో పాల్గొన్న 11 మందికీ డ్రగ్ టెస్ట్ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. తొలుత టెస్ట్‌కు శాంపిల్ ఇచ్చేందుకు ఎంపీ మహేశ్‌కుమార్ అంగీకరించలేదని, పోలీసులతో వాగ్వాదానికి దిగినట్టు తెలిసింది. పోలీసులు, ఈగల్ అధికారులు టెస్ట్ చేయాల్సిందేనని స్పష్టం చేయడంతో వెనక్కి తగ్గిన ఆయన కొత్త ఎత్తులు వేసినట్టు సమాచారం. టెస్ట్ కోసం యూరిన్ శాంపిల్ ఇవ్వాలని కోరగా, పుట్టా మహేష్ యూరిన్‌కు బదులు వాటర్ ఇవ్వడంతో తాత్కాలికంగా శనివారం రాత్రి చేసిన టెస్ట్‌లో నెగెటివ్ వచ్చింది. దీన్ని అదనుగా చూపుతూ తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినట్టు సమాచారం. అయితే, నిబంధనల మేరకు డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన వారందరికీ రక్త పరీక్షలు తప్పనిసరి అని చెప్పడంతో ఎర్రగడ్డ ప్రభుత్వ ఆస్పత్రిలో మరోసారి 11 మంది రక్త నమూనాలు తీసుకుని పరీక్ష చేయించారు. దీంతో ఎంపీ మహేశ్ కుమార్ రక్త నమూనా పరీక్షలో డ్రగ్ పాజిటివ్‌గా తేలింది. పెద్ద ఎత్తున మద్యం సీసాలూ లభ్యం కింగ్ ఫినిష్డ్ ఆల్ట్రా 330 ఎంఎల్ 48 సీసాలు, రెండు డాన్జులియో 700 ఎంఎల్ సీసాలు, రాయల్ సెల్యూట్ 21 ఏళ్ల మద్యం లీటర్ సీసా ఒకటి, చివాస్ 18 ఏళ్ల మద్యం సీసాలు 2, బెలివడెరీ వోడ్కా 700 ఎంఎల్ రెండు సీసాలు పట్టుబడ్డాయి. ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు ఫాంహౌస్ డ్రగ్ పార్టీకి సంబంధించి మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ ఎస్సై నయాముద్దీన్ ఫిర్యాదు మేరకు నిందితులపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఆదివారం క్రైం నంబర్ 150/2026 కింద కేసు నమోదైంది. డ్రగ్స్ వినియోగం, మారణాయుధాల వాడకం, నేరానికి ప్రేరేపించారనే కారణంతో ఎన్డీపీఎస్ యాక్ట్‌లోని సెక్షన్ 8 (సీ), 22(ఏ), 27, 29 ఆరŠమ్స్ యాక్ట్‌లోని సెక్షన్ 25(1–బి)(ఏ), సెక్షన్ 30, తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్‌లోని సెక్షన్ 34 (ఏ), బీఎన్ఎస్ సెక్షన్ 109,131 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీళ్లంతా ఎందుకు కలిశారు? మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఫాం హౌస్ పార్టీలో పలు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా ఒకచోట చేరడంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. వ్యాపార లావాదేవీలతోపాటు వీరి మధ్య ఆర్థిక సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. ముఖ్యమైన డీల్ విషయమై చర్చించేందుకే వీరంతా స్నేహ పూర్వకంగా శనివారం రాత్రి పార్టీ ఏర్పాటు చేసుకున్నారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పట్టుబడిన వారిలో స్థానిక రాజకీయ నాయకుడు రోహిత్‌రెడ్డి, అతడి సోదరుడు రితేశ్‌రెడ్డి, టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌లు ఉండడం, వీరితోపాటు బిజినెస్‌లో ఉన్న మోరవినేని రమేశ్, వరమచనేని శ్రవణ్‌కుమార్, నల్లపనేని విజయ్ కృష్ణ, అర్జున్‌రెడ్డి, అడ్వొకేట్ రవి ఉన్నారు. ఏ డీల్ కోసం భేటీ అయ్యారన్నది దర్యాప్తులో తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు. టీడీపీ ఎంపీ సహా ఆరుగురికి పాజిటివ్ : ఈగల్ ఎస్పీ గిరిధర్ ‘మొయినాబాద్‌లోని ఒక ఫామ్ హౌజ్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు శనివారం మాకు పక్కా సమాచారం అందింది. మా ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులతో కలిసి ఫామ్‌హౌజ్‌పై రైడ్ చేసేందుకు వెళ్లాం. అక్కడికి వెళ్లిన సమయంలో మాకు అక్కడ గన్ కాల్చినట్టు శబ్దం వినిపించింది. వెంటనే మా అధికారులు, సిబ్బంది పరుగెత్తుకుని ఫాం హౌస్‌లోకి వెళ్లి గన్ పట్టుకున్న వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నాం. అతడు ఆకాశం వైపు గన్ ఎక్కుపెట్టి కాల్చినట్టు నిర్ధారణ అయ్యింది. అతడి పక్కన ఉన్న వ్యక్తి దగ్గర ఉపయోగించిన నాలుగు క్యాట్రిజెస్ స్వాదీనం చేసుకున్నాం. ముందుగా కస్టడీలోకి తీసుకున్న ఇద్దరితోపాటు ఆ ఫాంహౌస్ పార్టీలో పాల్గొన్న ఒక మహిళ సహా తొమ్మిది మందికి వెంటనే డ్రగ్స్ టెస్ట్ చేశాం. అందులో తొలుత ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీఓ 4 ప్రకారం.. పట్టుబడిన వారందరికీ ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త నమూనాలు తీసుకుని పరీక్ష చేయించగా.. ఆరుగురికి డ్రగ్ పాజిటివ్‌గా తేలింది. పాజిటివ్ వచ్చిన వారిలో ఎంపీ పట్టా మహేశ్ కుమార్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, అతడి సోదరుడు రితేశ్‌రెడ్డి, నమిత్‌శర్మ, తిరువీధుల అర్జున్‌రెడ్డి, కౌశిక్ రవి ఉన్నారు. నెగిటివ్ వచ్చిన వారిలో మొరవినేని రమేశ్, వరమచనేని శ్రవణ్‌కుమార్, నల్లపనేని విజయకృష్ణ, సిలివేరి శరత్‌కుమార్, ఆర్.ప్రియాంకరెడ్డి ఉన్నారు. మాకున్న సమాచారం ప్రకారం పార్టీ మధ్యాహ్నం 3 గంటలకు మొదలైంది. కొందరు కొందరుగా యాడ్ అవుతూ వచ్చారు. ఇలా మొత్తం 11 మంది వచ్చిన సమయంలో మేం అదుపులోకి తీసుకున్నాం. వెపన్ కాల్చిన వ్యక్తిని జైపూర్‌కు చెందిన నమిత్ శర్మగా గుర్తించాం. రితేశ్‌రెడ్డి పేరిట ఆ తుపాకీ లైసెన్స్ ఉన్నట్టు అతను తెలిపాడు. అతడు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది. అతడు ఎందుకు వచ్చాడన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ పార్టీని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి తన ఫాంహౌస్‌లో ఏర్పాటు చేశారు’అని ఆదివారం ఈగల్ ఎస్పీ గిరిధర్ మీడియాకు తెలిపారు. రెండు గ్రాముల కొకైన్‌ను పార్టీ కోసం తీసుకురాగా.. ఒక గ్రామ్ వరకు కొకైన్‌ను ఫాం హౌస్‌లో గుర్తించామని, పట్టుబడిన డ్రగ్ కచ్చితంగా ఏంటనేది ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాతే నిర్ధారణ అవుతుందని చెప్పారు. ముగ్గురికి రిమాండ్.. మిగతా వారికి స్టేషన్ బెయిల్ ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిని పక్కన పెట్టి.. కేవలం గన్ ఫైరింగ్‌తో సంబంధం ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, అతని సోదరుడు రితేష్‌రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్ వ్యాపారి నమిత్ శర్మను మాత్రమే పోలీసులు రిమాండ్ చేశారు. నిందితుల్లో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్‌తోపాటు మరో ఏడుగురికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. కాగా, ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ చేయడంలో పోలీసులు తాత్సారం చేసినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి ఘటన జరిగితే ఆదివారం మధ్యాహ్నం వరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. శనివారం రాత్రి పట్టుబడిన 11 మందిని తొలుత శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మొయినాబాద్ పీఎస్‌లో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత రిమాండ్ రిపోర్టు తయారు చేసి దాన్ని శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచే ముగ్గురిని రిమాండ్‌కు తరలించి, మిగిలిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. నిందితులు మీడియా కంట పడకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. -
మొయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసులో పైలెట్ రోహిత్‌రెడ్డికి రిమాండ్
సాక్షి, హైదరాబాద్/మొయినాబాద్: మొయినాబాద్ ఫార్మ్ హౌస్‌లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. మెజిస్ట్రేట్ తీర్పు ప్రకారం.. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, రితేష్ రెడ్డి, నితిన్ శర్మలకు 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు దాడి చేసిన సమయంలో నితిన్ శర్మ గన్‌తో కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో అర్మ్స్ ఆక్ట్ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు పంపారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనతో డ్రగ్స్ కేసు మరింత సంచలనంగా మారింది. దీనిపై పూర్తి వివరాలు అధికారులు వెల్లడించనున్నారు. -
డ్రగ్స్ కేసు వివాదం: టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ బుకాయింపు
సాక్షి, విజయవాడ: ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసు మరోసారి చర్చనీయాంశమైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం రక్త పరీక్షల్లో మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయ్యింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఎంపీ మహేష్ యాదవ్ ఖండిస్తూ నేను ఎలాంటి తప్పు చేయలేదు, మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని వీడియో విడుదల చేశారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన తర్వాత స్టేషన్ బెయిల్ పై విడుదలైన మహేష్, వీడియోలో తన నిర్దోషిత్వాన్ని వాదించుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. తెలంగాణ పోలీసులు మాత్రం స్పష్టంగా మహేష్ డ్రగ్స్ తీసుకున్నట్టు ప్రకటించారు. దాంతో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. సోషల్ మీడియాలో ఆయన వీడియోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫాంహౌస్‌లో టీడీపీ నేత, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ విషయం తెలిసిందే. అయినప్పటికీ, షోకాజ్ నోటీసుతో సరిపెట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పుట్టా మహేష్‌ను టీడీపీ ఆదేశించింది. డ్రగ్స్ ఘటనపై పుట్టా మహేష్ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోపు లిఖితపూర్వక వివరణ ఇవాలని కోరారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు. పుట్టా మహేష్‌ను టీడీపీ నుంచి సస్పెండ్ చేసి, ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని సర్వత్రా డిమాండ్ వస్తోంది. అయినప్పటికీ డ్యామేజ్ కంట్రోల్ కోసం షోకాజ్ నోటీసులతో సరిపెట్టారు చంద్రబాబు. అరవ శ్రీధర్, కోనేటి ఆదిమూలం తరహాలోనే నోటీసుల డ్రామా వేస్తున్నారు. గలీజ్ కూటమి ఎమ్మెల్యేలపై ఇప్పటికీ చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోలేదు. దేశంలోనే డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ ఏకైక ఎంపీ పుట్టా మహేష్. -
ఇంత నోరేసుకొని అరవడం కాదు.. అనితను ఏకిపారేసిన రాచమల్లు
-
పుట్టా మహేష్ డ్రగ్స్ కేసు.. తండ్రి కొడుకులకి ఇచ్చిపడేసిన కన్నబాబు
-
నువ్వు ఎంపీనా? డ్రగ్స్ డీలరా? టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ పై విజయ్ రాజు ఫైర్
-
డ్రగ్స్ కేసు నుండి తప్పించేందుకు రంగంలోకి పెద్ద తలకాయలు
-
టీడీపీ ఎంపీ డ్రగ్స్ కేసుపై పోలీసుల షాకింగ్ నిజాలు
-
సిమ్లా నుంచి కొకైన్.. డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ
-
టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీ.. ఎంపీ పుట్టా మహేష్ పై సీరియస్
-
కేసు బయటకు రాకూడదంటూ తెలంగాణ పోలీసులకు బెదిరింపు..?
-
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ.. పోలీసులపై ఒత్తిడి మొదలైందా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో భారీగా డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు అందిన పక్కా సమాచారం మేరకు ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించారు. వీఐపీలతో పాటు ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. అయితే, పుట్టా మహేష్‌ను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. పుట్టా మహేష్‌ను తప్పించడానికి పెద్ద తలకాయలు రంగంలోకి దిగినట్లు తెలిసింది. ‘‘హైదరాబాద్ పోలీసులపై అప్పడే ఒత్తిడి మొదలైందా?. పుట్టా మహేష్‌ను తప్పించడానికి రాజకీయ, ఆర్థిక బలాలు ఉపయోగిస్తున్నారా?. పుట్టా మహేష్‌ను కాసేపట్లో కోర్టులో హాజరుపరుస్తారా?. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన ఆరుగురిపై పోలీసుల నెక్ట్స్ ఎలా ఉండబోతుంది’’ అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ పాజిటివ్‌గా తేలిందని ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. నిన్న రాత్రి 7.30 సమయంలో మాకు సమాచారం అందింది. డ్రగ్స్ పార్టీ సమాచారం తెలుసుకునే అక్కడికి వెళ్లాం. 11మందికి టెస్టులు చేశాం.. ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. మేం లోపలికి వెళ్లేటప్పుడే గన్ ఫైర్ సౌండ్స్ వచ్చాయి. సిమ్లా నుంచి కొకైన్ తీసుకొచ్చినట్టు గుర్తించాం. ఎంపీ అయినా.. ఎమ్మెల్యే అయినా డ్రగ్స్ తీసుకుంటే చర్యలు తప్పవు’’ అని ఎస్పీ స్పష్టం చేశారు. -
డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్
-
డ్రగ్స్ కేసులో ప్రముఖ నటి అరెస్ట్.. అసిస్టెంట్ డైరెక్టర్ కూడా..!
గతంలో డ్రగ్స్ మహమ్మారి టాలీవుడ్‌ను ఇండస్ట్రీని కుదిపేసింది. ఎంతో సినీ ప్రముఖులు సైతం విచారణ ఎదుర్కొన్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా చెన్నైలో మలయాళ నటి అంజు కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. మలయాళ, తమిళ చిత్రాల్లో నటించిన ఆమెను డ్రగ్స్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సినీ రంగంలో ఈ డ్రగ్స్ దందా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.చెన్నై నగరంలో డ్రగ్స్ సరఫరా జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పోలీసులు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విఘ్నేశ్వరన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు ఇచ్చిన సమాచారంతో వెంకటేశ్ అనే మరో వ్యక్తితో పాటు నటి అంజు కృష్ణ, అసిస్టెంట్ డైరెక్టర్ విన్సీ నివేతను కూడా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 9 మొబైల్ ఫోన్లు, ఒక కారును సీజ్ చేశారు.కాగా.. కేరళలోని త్రిసూర్‌కు చెందిన అంజు కృష్ణ మోడలింగ్‌తో తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత మలయాళం, తమిళ సినిమాల్లో నటించింది. జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించిన 'ఆరో' (Aaro) సినిమాతో ఆమె గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా మలయాళంలో 'సుమేశ్ రమేశ్', ఆకాశం కడన్'లాంటి చిత్రాల్లో నటించింది. తమిళంలో 'వెల్లిమలై' అనే చిత్రంలో మెరిసింది. తాజాగా అంజు కృష్ణ డ్రగ్స్ కేసులో దొరకడం అభిమానులను షాకింగ్‌కు గురి చేస్తోంది. -
డ్రగ్స్ కేసులో 'నవదీప్'.. ఫైనల్ తీర్పు వెల్లడించిన హైకోర్టు
టాలీవుడ్లో సంచలనం క్రియేట్ చేసిన డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌కు రిలీఫ్ దక్కింది. అతనికి మాదకద్రవ్యాల ముఠాతో సంబంధం ఉన్నట్టు సుమారు మూడేళ్ల క్రితం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.. అయితే, తాజాగా నవదీప్‌పై నమోదైన డ్రగ్స్ కేసును హైకోర్టు కొట్టివేసింది. నవదీప్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని న్యాయవాది వెంకట సిద్ధార్థ్ చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించి తీర్పు వెళ్లడించింది. కేవలం ఎఫ్ఐఆర్లో మాత్రమే నవదీప్ పేరును చేర్చారని ఆయన పేర్కొన్నారు.మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసులు 12మందిని అరెస్టు చేశారు. నవదీప్‌ను కూడా విచారించేందుకు పోలీసులు నోటీసులు పంపారు. మాదక ద్రవ్యాలు విక్రయించే రాంచందర్‌తో నవదీప్‌కు పరిచయాలు ఉన్నాయని నార్కోటిక్ పోలీసులు ఆధారాలు సేకరించారు. దీంతో అతన్ని 39వ నిందితుడిగా చేర్చారు. అయితే, ఈ కేసులో నవదీప్‌కు వ్యతిరేఖంగా పోలీసులు సరైన ఆధారాలు సేకరించలేదు. దీంతో తాజాగా ఈ కేసును హైకోర్టు కొట్టివేసింది. -
డ్రగ్స్ కేసులో జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి
-
నీతులు చెప్పే ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డీ.. ఇప్పుడేమంటావ్!
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి కుమారుడే డ్రగ్స్ కేసులో పట్టుబడటం సిగ్గు చేటని, గంజాయి, డ్రగ్స్‌ను పెంచి పోషిస్తున్నది కూటమి నేతలేనన్న విషయం ఈ ఘటనతో తేటతెల్లమైందని వైఎస్సార్సీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నిద్రలేచింది మొదలు ప్రవచనకర్తలా ఆదినారాయణరెడ్డి నీతులు చెబుతుంటారు. కానీ.. ఆయన కుమారుడు సుధీర్‌రెడ్డి ఇంట్లోనే డ్రగ్స్ తీసుకుంటూ తెలంగాణ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇప్పుడేమంటావ్ ఆదినారాయణరెడ్డీ. ఇప్పటికైనా వాస్తవాలు ఒప్పుకుంటావా?గంజాయి, డ్రగ్స్‌ను పెంచి పోషిస్తున్నది మీ కూటమి నేతలేనని?తండ్రీకొడుకులు పరువు తీశారు ‘ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సాగిస్తున్న అరాచకాలు అన్నీఇన్నీ కావు. కడప జిల్లాలో ఎక్కడ రౌడీయిజం జరిగిగా అక్కడ ఆదినారాయణరెడ్డి ఉంటారు. గంజాయి, డ్రగ్స్‌ను అలవాటు చేసి రౌడీలను పెంచిపోషిస్తున్నారు. చివరకు ఎమ్మెల్యే కొడుకు అవే డ్రగ్స్‌కు అలవాటుపడి తెలంగాణ పోలీసులకు దొరికిపోయాడు. తండ్రీ కొడుకులు కలిసి ఇటు రాష్ట్రం పరువుతోపాటు వైఎస్సార్ కడప జిల్లా పరువును బజారుకు ఈడ్చారని కడప జిల్లా ప్రజలు అంటున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే డ్రగ్స్‌ను అరికడతామని గొప్పగా చెప్పిన పాలకులు చివరకు రాష్ట్రాన్ని డ్రగ్స్ గుప్పిట్లోకి నెట్టేశారు.రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం 260 శాతం పెరిగిందని డీజీపీ చెప్పడం ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. సాక్షాత్తు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడే డ్రగ్స్ కేసులో పట్టుబడటం చూస్తే కూటమి పాలన ఎంత దారుణంగా ఉందో స్పష్టంగా తెలుస్తోంది. గంజాయి నిర్మూలన కోసం నాటి వైఎస్ జగన్ సర్కార్ పెద్ద యుద్ధమే చేసింది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం డ్రగ్స్ మత్తులో కూరుకుపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరం. బాబు పాలనలో హాస్టళ్లు నిర్వీర్యంచంద్రబాబు పాలనలో సంక్షేమ హాస్టళ్లు నిర్వీర్యం అయ్యాయని విడదల రజిని మండిపడ్డారు. చంద్రబాబు నిర్లక్ష్యంతో 46 మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఆహారం, తాగునీరు కలుషితం కావడం, పారిశుద్ధ్యం క్షీణించడం వల్లే విద్యార్థుల వరుస మరణాలు సంభవిస్తున్నాయన్నారు. హాస్టళ్లలో మరణ మృదంగం మోగటానికి కారణం పాలనా వైఫల్యం కాదా.. దీనికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
‘కూటమి నేతలు డ్రగ్స్ పార్టీలు చేసుకుంటున్నారా?’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం డ్రగ్స్ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్. ఏపీ నేతలకు విదేశాల నుండి డ్రగ్స్ ఎలా దొరుకుతోంది? అని ప్రశ్నించారు. కూటమి నేతలు ఎవరెవరు విదేశాలకు వెళ్తున్నారో? డ్రగ్స్ పార్టీలో పాల్గొంటున్నారో తేల్చాలి అని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘డ్రగ్స్ మాఫియా చేతుల్లోకి కూటమి ప్రభుత్వం వెళ్లిపోయింది. నెల్లూరులో డ్రగ్స్ మాఫియా పెంచలయ్య అనే వ్యక్తిని హత్య చేసింది. హైదరాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్‌తో దొరికారు. విదేశాల నుండి డ్రగ్స్ ఏపీ నేతలకు ఎలా దొరుకుతోంది?. డ్రగ్స్ మీద అవగాహన కల్పించామని హోంమంత్రి అనిత చెప్తున్నారు. మరి మీ కూటమి నేతలు డ్రగ్స్ తీసుకుంటూ ఎలా దొరికారు?ఒకప్పుడు ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనేవారు. ఇప్పుడు ఏపీ అంటే అడ్డా ఫర్ పెడ్లర్స్ అనే పేరు తెచ్చిపెట్టారు. కూటమి నేతలు ఎవరెవరు విదేశాలకు వెళ్తున్నారో? డ్రగ్స్ పార్టీలో పాల్గొంటున్నారో తేల్చాలి. దీనిపై కేంద్ర ప్రభుత్వమో, ఇంటర్ పోలో విచారణ జరపాలి. గంజాయి, డ్రగ్స్ మాఫియా నుండి ఏపీని కాపాడాలి. సుధీర్ రెడ్డితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారో విచారణ చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
గతంలో రెండుసార్లు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ సుధీర్‌రెడ్డి
-
బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్/వైఎస్సార్: వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని(Sudheer Reddy) తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డి.. హైదరాబాద్‌లో డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. దీంతో, నార్సింగి పోలీసులు.. సుధీర్ రెడ్డికి డ్రగ్స్ టెస్టు చేయడంతో పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో శనివారం ఈగల్ టీమ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో తన ఇంట్లోనే డ్రగ్స్(గంజాయి) సేవిస్తున్న కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. దీంతో, సుధీర్‌కు డ్రగ్స్ టెస్టులు చేయగా పాజిటివ్‌గా తేలింది. అనంతరం, సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి.. డీఅడిక్షన్ సెంటర్‌కు పంపించారు. ఈ క్రమంలో సుధీర్‌తో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇక, గతంలో కూడా సుధీర్ రెడ్డి రెండు సార్లు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడటం గమనార్హం. ఇదిలా ఉండగా.. సుధీర్ రెడ్డి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు ఆరోపణలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. డ్రగ్స్ కేసు నుంచి తప్పించేలా ఏపీ ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. -
పరారీలో 'రకుల్ ప్రీత్ సింగ్' సోదరుడు
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నరంలో రోజు రోజుకు డ్రగ్స్ వినియోగం పెరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (HNEW), మాసబ్ ట్యాంక్ పోలీసులు కలిసి చేసిన ఆపరేషన్‌లో డ్రగ్స్ సబ్-పేడ్లర్లను అరెస్ట్ చేశారు. అయితే, తాజాగా మాసబ్‌ట్యాంక్ పోలీసులు మరోసారి తెలంగాణ ‘ఈగల్ టీం’తో నిర్వహించిన దాడుల్లో భారీగా కొకైన్‌తో పాటు ప్రమాదకరమైన 43గ్రాముల ఎండిఎంఏ (MDMA) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు జరిపిన ఈ ఆపరేషన్‌లో ట్రూప్ బజార్‌కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ పేడ్లర్లను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారికి రెగ్యులర్ కస్టమర్ల లిస్ట్‌లో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నాడని తేలింది. వీరి నుంచి అతను రెగ్యులరర్గా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, విషయం తెలుసుకున్న అమన్ ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో కూడా అతను సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారని తెలుస్తోంది. -
రోజుకు 500 కాల్స్.. తలనొప్పిపడలేక వీడియో చేశా: హేమ
సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమపై గతేడాది డ్రగ్స్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో హేమ జైలుకు కూడా వెళ్లి వచ్చింది. ఇటీవల కర్ణాటక హైకోర్టు ఆ కేసును పూర్తిగా కొట్టివేసింది. అయితే తనపై కేసు నమోదైనప్పుడు మీడియాలో చాలా వార్తలు వచ్చాయని.. అదే కేసును కొట్టివేసినప్పుడు మాత్రం తక్కువమంది మాత్రమే రాశారని హేమ అసహనం వ్యక్తం చేసింది. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమ ఈ కేసుపై స్పందిస్తూ.. డ్రగ్స్ తీసుకున్నట్లు తనపై ఆరోపణలు చేయడం ఎంతగానో బాధించిందన్నారు.‘నేను డ్రగ్స్ తీసుకున్నానని చెప్పడం వందశాతం అబద్దం. కానీ బర్త్‌డే పార్టీకి వెళ్లింది నిజం. నా తమ్ముడి లాంటి వ్యక్తి పుట్టినరోజు పార్టీకి పిలిస్తే వెళ్లాను. అక్కడ నేను డ్రగ్స్ తీసుకోలేదు. ఆ పార్టీకి అందరూ ఫ్యామిలీతో వచ్చారు. అది రేవ్ పార్టీ కాదు.. వందశాతం బర్త్‌డే పార్టీనే. నేను పార్టీ నుంచి వచ్చిన తర్వాత అక్కడ డ్రగ్స్ దొరికింది. కానీ మీడియా మొత్తం రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన హేమ రాసేసింది. ఇది చూసి నాకు తెలిసివాళ్లంతా ఫోన్ చేసి ఆరా తీశారు. ఆ సమయంలో నాకు రోజుకు 500 పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. అందరికి సమాధానం చెప్పాను. ఇక ఫోన్ కాల్స్ వల్ల వచ్చే తలనొప్పి భరించలేక.. ఓ వీడియో తీసి పెట్టాను. దాన్ని కూడా కొంతమంది తప్పుగా ప్రచారం చేశారు’ అని హేమ ఆవేదన వ్యక్తం చేసింది. -
డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేసిన మన ఈగల్ టీం
సాక్షి, న్యూఢిల్లీ: సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది అన్నట్లు ఉంది ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల తీరు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా ఆటలను కట్టడి చేసిన తెలంగాణ ఈగల్ టీం పోలీసులు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ వాడే వాళ్లకు, దేశం నలుమూలల నుంచి తెలంగాణకు డ్రగ్స్‌ను సరఫరా చేసే వారికి దేశ రాజధాని వేదికగా భయం పుట్టించారు. నెలల పాటు నిద్రాహారాలు లేకుండా కష్టపడి కేసు ను ఛేదించిన మన పోలీసుల క్రెడిట్‌ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ చోరీ చేస్తోంది. కంటిపై కునుకులేదు: దేశం నలుమూలల నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా అవుతున్న విషయాన్ని గుర్తించిన తెలంగాణ ఈగల్ టీం.. దీనిని అరికట్టేందుకు నడుం బిగించింది. ఇందుకోసం 105 మంది పోలీసులను ఫీల్డ్‌లో పెట్టింది. మూడు నెలల పాటు ఢిల్లీతోపాటు యూపీలోని నోయిడాను జల్లెడ పట్టింది. ఒక్కో ఫోన్ నంబర్, ఒక్కో బ్యాంకు ఖాతా ఆధారంగా డ్రగ్ సరఫరా ముఠా జాడను కనుగొంది. వారు డ్రగ్స్ ఎలా సరఫరా చేస్తున్నారో చూసేందుకు పగలు రాత్రీ అహర్నిశలు కష్టపడింది. ఢిల్లీ, నోయిడా వీధుల్లో మారువేషంలో రెక్కీ నిర్వహించింది. ఈగల్ డైరెక్టర్ సైతం పురవీధుల్లో తిరిగారు. అన్నీ నిర్ధారించుకున్న తర్వాత ఆపరేషన్‌ను ప్రారంభించారు. దీంతో కొద్దిరోజుల క్రితం ఈ డ్రగ్ ముఠా ఆటకు చెక్ పెట్టారు. ఇంత కష్టపడిన వీరికి మాత్రం ఏవిధమైన ప్రతిఫలం దక్కలేదని చెప్పడంలో సందేహం లేదు.ఈగల్ క్రెడిట్ చోరీస్థానికంగా ఆపరేషన్ చేస్తున్నందుకు ఈగల్ టీం ఢిల్లీ క్రైం బ్రాంచ్ సాయం కోరింది. వీరి పర్యవేక్షణ, సహాయ, సహకారాలతో ఆపరేషన్ చేసింది. ఈ ఆపరేషన్‌లో 50 మందికి పైగా అదుపులోకి తీసుకోగా.. రూ.12 కోట్ల విలువైన డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇదంతా తమవల్లే సాధ్యమైందని, తాము లేకపోతే ఇంతపెద్ద నెట్‌వర్క్‌ను చేధించడం కష్టమయ్యేదంటూ ఢిల్లీ పోలీసులు గొప్పలు చెప్పుకుంటున్నారు. మీడియా సమావేశంలో ఈగల్ టీం ఎస్పీ సీతారామ్ ఈ ఆపరేషన్‌ను వివరిస్తున్న సమయంలో తెలుగు మీడియా కొన్ని ప్రశ్నలు వేయగా.. ఆయన సమాధానం చెబుతున్నారు. ఇదే సమయంలో పక్కనే ఉన్న ఢిల్లీ క్రైం బ్రాంచ్ జాయింట్ సీపీ సురేంద్ర కుమార్ సీటులో నుంచి పదేపదే పైకి లేవడంతో.. సీతారామ్ సమాధానాలు చెప్పలేక ఇబ్బంది పడ్డారు. ఈగల్ టీం కష్టాన్ని చెప్పుకోనివ్వకపోవడం మరింత నిరాశ, నిస్పృహలకు దారితీస్తోంది. ఎంతో కాలంగా ఢిల్లీలో డ్రగ్ దందా నడుస్తుంటే పట్టుకోలేని స్థానిక పోలీసులు తెలంగాణ పోలీసులు వచ్చి రెక్కీ వేసి, తమకు సహకరించాలని ఆపరేషన్‌లో వెంటపెట్టుకున్నారు. ఇంత చేసినా క్రెడిట్‌ను ఈగల్ టీంకు ఇవ్వకుండా వాళ్లే కొట్టేయాలని భావించడం తీవ్ర నిరాశకు గురిచేస్తోందని మన పోలీసులు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. -
డ్రగ్స్ కేసులో నటులు శ్రీకాంత్, కృష్ణలకు నోటీసులు
మత్తుపదార్థాల కేసులో కోలీవుడ్ నటులు శ్రీరామ్(శ్రీకాంత్), కృష్ణ బెయిల్‌పై ఇప్పటికే విడుదలయ్యారు. అయితే, తాజాగా వారిద్దరికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీచేసింది. ఈ ఏడాది జూన్‌లో మొదట ప్రదీప్‌కుమార్ అనే వ్యక్తి వద్ద మాదక ద్రవ్యాలు దొరికాయి. అతన్ని విచారిస్తే గనా దేశానికి చెందిన జాన్ అనే వ్యక్తి సరఫరా చేశాడని తేలడంతో వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే ఇదే కేసులో అన్నాడీఎంకే మాజీ నేత ప్రశాంత్‌తో పాటు సినీనటులు శ్రీరామ్, కృష్ణ మొదలైన వారిని అరెస్టు చేశారు. అయితే, పోలీసుల విచారణలో తమ తప్పును అంగీకరించిన శ్రీరామ్, కృష్ణ బెయిల్ కోసం చెన్నై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం కోర్టులో పిటిషన్ దాఖలు చేసి కోర్టు సూచనతో విడుదలయ్యారు. కానీ, తాజాగా ప్రత్యేక కోర్టు అనుమతితో పుళల్ జైల్లో ఉన్న ప్రశాంత్, జవహర్, ప్రదీప్‌కుమార్‌లను ఈడీ అధికారులు దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 28న నటుడు శ్రీరామ్, 29న నటుడు కృష్ణ విచారణకు రావాలని ఈడీ అధికారులు సమన్లు పంపారు.తప్పు చేశాను.. నా బిడ్డను చూసుకోవాలి డ్రగ్స్ ఉపయోగించి తప్పు చేశానని కోర్టులోనే శ్రీరామ్ ఇప్పటికే ఒప్పుకున్నారు. అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్ తనకు మత్తుపదార్థాలను అలవాటు చేసినట్లు పోలీసుల విచారణలో శ్రీరామ్ తెలిపారు. ఆయన నిర్మాతగా తెరకెక్కించిన ‘తీంగిరై’ అనే సినిమాలో నటించానని, ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి తనకు రూ.10 లక్షలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో డబ్బు అడిగినప్పుడల్లా ఆయన కొకైన్ ఇచ్చేవారని పేర్కొన్నారు. రెండుసార్లు వాడిన తర్వాత మూడోసారి తానే అడిగే పరిస్థితి ఏర్పడిందని పోలీసులకు శ్రీరామ్ వెల్లడించారు. అయితే, తప్పు చేశానని ఆయన ఒప్పుకున్నారు. తన కుమారుడిని చూసుకోవాల్సి ఉందని అందుకు బెయిల్ మంజూరు చేయాలని శ్రీరామ్ కోరారు. దీంతో కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్లు అప్పట్లో న్యాయస్థానం పేర్కొంది. -
శంషాబాద్: 12 కోట్ల విదేశీ గంజాయి పట్టివేత
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయిని అధికారులు పట్టుకున్నారు. దాని విలువ రూ.12 కోట్లుగా అంచనా వేస్తున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన భారతీయ మహిళ దీనిని రవాణా చేస్తూ పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) హైదరాబాద్ జోన్ అధికారులు సమాచారం ఆధారంగా.. దుబాయ్ నుంచి వచ్చిన భారతీయ మహిళా ప్రయాణికురాలిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె బ్యాగేజీ నుంచి 6 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి లభించింది. అయితే తన మరొక లగేజ్ తప్పిపోయిందని ఆమె ఫిర్యాదు చేయగా.. అది ఇవాళ హైదరాబాద్‌కి చేరింది. అందులోనూ మరో 6 కేజీల గంజాయి బయటపడింది. డీఆర్ఐ అధికారులు సీజ్ చేసిన ఆ మొత్తం 12 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి విలువ రూ.12 కోట్ల దాకా ఉండొచ్చని చెబుతున్నారు. దీంతో ఆ ప్రయాణికురాలిని ఎన్డీపీఎస్ చట్టం-1985 కింద అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.హైడ్రోపోనిక్ గంజాయి అంటే.. హైడ్రోపోనిక్ గంజాయి అనేది మట్టి లేకుండా ప్రత్యేక ప్రయోగశాలల్లో పెంచే గంజాయి రకం. ద్రవరూప పోషకాలు నేరుగా మొక్కల వేళ్లకు అందిస్తారు. కృత్రిమ ఉష్ణోగ్రత, వెలుతురు నియంత్రణతో మొక్కలు వేగంగా పెరుగుతాయి. ఇది సాధారణ గంజాయితో పోలిస్తే మత్తు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే THC (టెట్రాహైడ్రోకెన్నబినోల్) శాతం ఎక్కువగా ఉండటంతో, ఇది కొకైన్‌తో సమానమైన మత్తు కలిగిస్తుంది. హైడ్రోపోనిక్ గంజాయి విదేశాల నుంచి.. ప్రధానంగా థాయ్‌లాండ్ నుంచి అక్రమంగా భారత్‌కు రవాణా అవుతుంటుంది. కొన్ని దేశాల్లో గంజాయి సాగుపై నిషేధం లేకపోవడం వల్ల స్మగ్లింగ్ ముఠాలు దీన్ని ఆసరాగా తీసుకుంటున్నాయి. ఈ గంజాయి ధర ఒక్క కిలోకు రూ. కోటి వరకు పలుకుతోంది. మహిళలను క్యారియర్లుగా ఉపయోగించి గంజాయిని రవాణా చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలోనే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల రూ.53 కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది.శిక్ష ఏంటంటే..హైడ్రోపోనిక్ గంజాయి ఒక నిషేధిత మత్తు పదార్థం. దీని అక్రమ రవాణా, నిల్వ, విక్రయానికి భారతదేశంలో కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఈ నేరం ఎన్డీపీఎస్ చట్టం 1985 (Narcotic Drugs and Psychotropic Substances Act) ప్రకారం శిక్షించబడతారు. ఈ చట్టం కింద బెయిల్ పొందడం చాలా కష్టం. నేరం తీవ్రతను బట్టి కోర్టు విచారణ జరుగుతుంది.గంజాయి రవాణా, విక్రయానికి.. 10–20 సంవత్సరాల జైలు + రూ. 1–2 లక్షల జరిమానా విధిస్తారు. మళ్లీ అదే నేరం చేస్తే గనుక.. 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదంటే జీవిత ఖైదూ విధించవచ్చు. -
రూ. 12 వేల కోట్ల డ్రగ్స్ సీజ్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం శివారులో కొంతకాలంగా భారీ స్థాయిలో సాగుతున్న డ్రగ్స్ తయారీ రాకెట్ గుట్టురట్టయింది. రసాయన కర్మాగారం మాటున డ్రగ్ మాఫియా నడుపుతున్న డ్రగ్స్ ఫ్యాక్టరీపై మహారాష్ట్ర క్రైం బ్రాంచి పోలీసుశాఖ మెరుపుదాడి చేసింది. ఏకంగా రూ. 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ తయారీ ముడిపదార్థాలను స్వాధీనం చేసుకుంది. చర్లపల్లి పారిశ్రామికవాడలోని నవోదయ కాలనీలో ఉన్న వాగ్దేవి ల్యాబ్స్ కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం సోదాలు చేపట్టి 5.968 కిలోల నిషేధిత మెఫిడ్రోన్ (ఎండీ) మాదకద్రవ్యంతోపాటు 35,500 లీటర్ల ఇతర రసాయనాలు, 19 పెట్టెల్లోని 950 కిలోల మిౖథెలిన్ డైక్లోరైడ్ (ఎండీసీ) పొడి, ఎండీ తయారీకి వాడే ఇతర రసాయనాలను పట్టుకుంది. అలాగే వాగ్దేవి ల్యాబ్స్ నిర్వాహకుడు శ్రీనివాస్ విజయ్ వోలేటి, అతనితో కలిసి పనిచేస్తున్న తానాజీ పండరినాథ్ పటా్వరీలను అరెస్టు చేసింది. ఈ మేరకు మహారాష్ట్రకు చెందిన మిరా–భయందర్, వసాయ్–విరార్ (ఎంబీవీవీ) పోలీసు కమిషనరేట్ సీపీ నికేత్ కౌషిక్ శనివారం స్థానిక మీడియాకు వెల్లడించారు. నెల రోజులుగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్‌లో చర్లపల్లిలో పట్టుబడిన ఇద్దరితో సహా మొత్తం 13 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల్లో ఒక బంగ్లాదేశీ యువతి సైతం ఉన్నట్లు చెప్పారు. నిందితుల నుంచి 27 మొబైల్ ఫోన్లు, మూడు కార్లు, ఒక టూవీలర్ స్వా«దీనం చేసుకున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా డ్రగ్స్ నెట్‌వర్క్‌కు, అంతర్జాతీ యంగా డ్రగ్ నెట్‌వర్క్‌లకు సైతం హైదరాబాద్ శివారులో తయారయ్యే ఎండీ డ్రగ్ సరఫరా అవుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామన్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. ముంబైలో లింకులతో..హైదరాబాద్‌లో వెలుగులోకి.. ఈ కేసును థానే జిల్లాలోని ఎంబీవీవీ పోలీసులు చిన్న లింక్ ద్వారా వెలుగులోకి తెచ్చారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మిరా రోడ్ ఈస్ట్‌లోని నివసించే బంగ్లాదేశీ యువతి ఫాతిమా మురాద్õÙక్ అలియాస్ మొల్లా (23) మెఫిడ్రోన్ (ఎండీ) డ్రగ్‌ను విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఆగస్టు 8న కాశీమిరా బస్టాప్ దగ్గర ఫాతిమాను అదుపులోకి తీసుకొని ఆమె నుంచి 105 గ్రాముల ఎండీ డ్రగ్‌ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఈ డ్రగ్‌ను తాను హైదరాబాద్ నుంచి కొన్నట్లు నిందితురాలు పేర్కొనడంతో ఆమె ఇచ్చిన సమాచారం ప్రకారం డ్రగ్ నెట్‌వర్క్‌లోని మరో 10 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకున్న అక్కడి పోలీసులు.. హైదరాబాద్ శివారులోని చర్లపల్లి ప్రాంతంలో ఉన్న ఒక ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారవుతున్నట్లు నిర్ధారణకు వచ్చి ఆపరేషన్ చేపట్టారు. కెమికల్ ఫ్యాక్టరీ ముసుగులో డ్రగ్స్ తయారీ దందా.. భారీగా డ్రగ్స్ తయారీ దందాకు తెరతీసిన శ్రీనివాస్ విజయ్ వోలేటికి రెండు కంపెనీలు ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. వాటిల్లో వాగ్దేవి ల్యాబ్‌ను నవోదయ కాలనీలో 2020లో ప్రారంభించారు. కోవిడ్ సంబంధిత మందులు ఇందులో తయారవుతున్నాయి. అలాగే 2015లో నాచారంలో వాగ్దేవి ఇన్నోసైన్స్ పేరిట ఆర్ అండ్ డీ సంస్థను ఏర్పాటు చేశారు. అయితే కెమికల్ ఫ్యాక్టరీ పేరిట బయటికి చూపుతూ లోపల డగ్స్ తయారీ దందాకు నిర్వాహకులు తెరతీసినట్లు తెలిసింది. కట్టెల లోడ్ వాహనాల్లో.. కట్టెల లోడ్ వాహనాల్లో ముడి సరుకుతోపాటు తయారు చేసిన డ్రగ్స్‌ను శ్రీనివాస్ విజయ్ వోలేటి తరలించే వాడని సమాచారం. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం గోడౌన్ కోసమని చర్లపల్లి, నవోదయనగర్ ప్లాట్ యజమానిని సంప్రదించి అద్దెకు తీసుకొని వాగ్దేవి ల్యాబ్‌ను ప్రారంభించారు. కంపెనీలో ఎప్పుడూ ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు మినహా మరెవరు కనిపించే వారు కాదని.. ఉదయమంతా గేటు మూసేసి ఉండేదని చుట్టుపక్కల కంపెనీల వారు పేర్కొన్నారు. రాత్రిళ్లు డ్రమ్ముల్లో రసాయనాలు, కట్టెల లోడ్ల వాహనాలు వచ్చేవని చెప్పారు. అప్పుడప్పుడూ ఘాటైన వాసనలు వచ్చినా రసాయన సంస్థలో ఇది మామూలే కదా అనుకునేవారమని చెప్పుకొచ్చారు. కాగా, స్థల యజమానికి ఏడాదిగా అద్దె కూడా చెల్లించట్లేదని తెలిసింది. -
మహీంద్ర యూనివర్శిటీ డ్రగ్స్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
-
మట్టిగాజులు.. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు.. డ్రగ్స్ కేసులో సంచలనాలు
సాక్షి, హైదరాబాద్: మహీంద్రా యూనివర్సిటీ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌కు అక్రమంగా కొరియర్ల ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మధ్యలో హెరాయిన్ ప్యాకెట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మట్టి గాజుల మాటున కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. 10 కొరియర్ సంస్థల నుండి రెండేళ్లలో రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్ తరలించినట్టు పోలీసులు గుర్తించారు.కొరియర్ ద్వారా గుట్టుచప్పుడు కాకుండా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు గం జాయి రవాణా చేస్తున్న ఓ ముఠా గుట్టును ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్) టీం రట్టు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థులకు ఈ గంజాయి చేరవేస్తున్నట్టు ఆధారాలు లభించాయి.జీడిమెట్లలోని సూరారంలో శివాలయం కాలనీలో నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ డ్రగ్ రాకెట్లో కీలకంగా పనిచే స్తున్న నలుగురిని అరెస్టు చేసి.. 1.15 కిలోల గంజాయి, 47 గ్రాముల ఓజీ వీడ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్న 50 మంది మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థులను ఈగల్ టీం గుర్తించింది. ఓ నైజీరియన్ తన నెట్వర్క్ ద్వారా ఢిల్లీ, బీదర్ నుంచి పలు కంపెనీల పేరిట కొరియర్ ద్వారా డ్రగ్స్‌ను హైదరాబాద్ కు చేరవేడయంతో పాటు స్థానికంగా ఉన్న పెడ్లర్ల ద్వారా మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థులకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు.ఈ ఆపరేషన్‌లో మణిపూర్‌కు చెందిన నెవెల్ టాంగ్ బ్రామ్తో పాటు అంబటి గణేశ్, బూసా శివకుమార్, మహ్మద్ అషర్ జావేద్ ఖాన్‌ను అరెస్టు చేశారు. యూనివర్సిటీకి చెందిన 14 మం ది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. మల్నాడు రెస్టారెంట్ కేసులో లింకులతో.. మల్నాడు రెస్టారెంట్ కేసు విచారణ సందర్భంగా తెరపైకి వచ్చిన శ్రీమారుతి కొరియర్స్ ఫ్రాంచైజీ రాజేష్ ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థ పేరిట రెండు పార్సిళ్లు డీటీడీసీ కొరియర్ సంస్థ ద్వారా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు పంపినట్టు ఈగల్ అధికారులు గుర్తించారు. ఆ పార్సిళ్లపై ఉన్న మొబైల్ నంబర్లు భారతీయ మొబైల్ నంబర్లుగానే ఉన్నా.. నైజీరియా నుంచి నిక్ అనే వ్యక్తి వాడుతున్నట్లు తేలింది. -
డ్రగ్స్ కలకలంపై మహీంద్రా వర్సిటీ వీసీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: బాచుపల్లి మహీంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. వర్సిటీ విద్యార్థుల నుంచి కిలోకిపైగా గంజాయి, 47 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు స్టూడెంట్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ పరిణామంపై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. యజులు మెదురి తాజాగా స్పందించారు.మహేంద్రా యూనివర్సిటీలో క్రమశిక్షణ, నిజాయితీ, చట్టాలను గౌరవించే విధంగా అత్యున్నత ప్రమాణాలను పాటిస్తామని తెలిపారాయన. ఇటీవల నగరవ్యాప్తంగా జరుగుతున్న మత్తు పదార్థాలకు సంబంధించిన దర్యాప్తులో కొంతమంది విద్యార్థుల పేర్లు రావడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్నారు. ‘‘మత్తు పదార్థాల వినియోగం, పంపిణీ చేయడాన్ని ఖండిస్తున్నాం. మహీంద్రా యూనివర్సిటీలో చట్టాన్ని ఉల్లంఘించే లేదంటే విద్యార్థుల శ్రేయస్సును హానిచేసే ఏ చర్యలనైనా ఉపేక్షించేది లేదు. .. నియమాలను ఉల్లంఘించిన వారు దోషులుగా తేలితే, విశ్వవిద్యాలయ నిబంధనలు, చట్టప్రకారం కఠినమైన శిక్షలు తప్పవు’’ అని హెచ్చరించారు. ఈ క్రమంలో 50 మందిని పోలీసులు విచారించారన్న కథనాలను ఆయన కొట్టిపారేశారు. డ్రగ్స్ ఆరోపణలతో 50 మంది విద్యార్థులను పోలీసులు ప్రశ్నించిన మాట వాస్తవమేనని, అందులో ఏడుగురు మాత్రమే మహీంద్రా వర్సిటీకి చెందిన వాళ్లు ఉన్నారని స్పష్టత ఇచ్చారాయన. ప్రతి విద్యార్థి అభివృద్ధి చెందేలా సురక్షితమైన, నిబద్ధతతో కూడిన క్యాంపస్ వాతావరణాన్ని కొనసాగించేందుకు మహీంద్రా యూనివర్సిటీ తరఫున మేము కృషి చేస్తున్నాం. ఒక ఉన్నత విద్యాసంస్థగా మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు, చట్టపరమైన బాధ్యతలపై విద్యార్థులకు అవగాహన కల్పించే విధానాలు, కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తాం. విద్యార్థులు బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకుని, మహేంద్రా యూనివర్సిటీ విలువలను కాపాడాలి అని విజ్ఞప్తి చేశారాయన. -
డ్రగ్ పార్టీపై పోలీసుల దాడి.. మాజీ మంత్రి అల్లుడు అరెస్ట్
పూణే: మహారాష్ట్రలోని పూణే పోలీసులు ఆదివారం ఉదయం ఓ అపార్టుమెంట్లో జరుగుతున్న డ్రగ్ పార్టీ గుట్టురట్టు చేశారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాలతో పాటు హుక్కాలు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే కుమార్తె రోహిణి భర్త ప్రాంజల్ ఖెవల్కర్ సహా పలువురు పట్టుబడ్డారు.రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఖరాడీ ప్రాంతంలోని స్టూడియో అపార్టుమెంట్‌పై తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో దాడి చేశామని డీసీపీ(క్రైం) నిఖిల్ పింగ్లే చెప్పారు. ఈ సందర్భంగా చేపట్టిన సోదాల్లో 2.7 గ్రాముల కొకైన్, 70 గ్రాముల గంజాయి, హుకా సామగ్రి, మద్యం దొరికాయన్నారు. పట్టుబడిన వారిపై నార్కోటిక్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్డీపీఎస్)చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వీరందరికీ వైద్య పరీక్షలు చేయించామని, నివేదికలు అందాల్సి ఉందన్నారు.ఎన్సీపీ(ఎస్పీ)నేత అయిన ఏక్నాథ్ షిండే ఈ పరిణామంపై మీడియా ఎదుట స్పందించారు. పోలీసుల దాడి వెనుక రాజకీయ కారణాలున్నాయా అనే విషయం తేల్చేందుకు క్షుణ్నంగా దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్సీపీ(ఎస్పీ) మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా రోహిణీ ఖడ్సే వ్యవహరిస్తున్నారు. ఘటనపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు. కాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి ఈ దాడి ఒక హెచ్చరిక వంటిదంటూ శివసేన(యూబీటీ) నేత సుష్మా అంధారె వ్యాఖ్యానించారు. प्रांजल खेवलकरांच्या रेव्ह पार्टीवर धाडीचा व्हिडिओ आला बाहेर, काय घडलं?#LokmatNews #MaharashtraNews #pranjalkhewalkar #raveparty #Policecase #MarathiNews pic.twitter.com/AufI7xJx0I— Lokmat (@lokmat) July 27, 2025 -
మల్నాడు డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పురోగతి
-
‘డ్రగ్’ల్బాజీ సూత్రధారుల సంగతేంటి!
సాక్షి, విశాఖపట్నం: కూటమి నేతల అండదండలతో డ్రగ్స్ కల్చర్ విశాఖ మహా నగరంలోకి ప్రవేశించేసింది. ఎన్నికల ముందు కంటైనర్‌లో రూ.వేల కోట్ల డ్రగ్స్ విశాఖకు వచ్చాయంటూ లేనిపోని ఆరోపణలు చేసిన కూటమి నేతలు.. ఇప్పుడు ఏకంగా విశాఖ నగరాన్నే డ్రగ్స్‌కి అడ్డాగా మార్చేశారు. ఎలాగోలా వలపన్ని పట్టుకున్న పోలీసులు డ్రగ్ రాకెట్‌ను ఛేదించేందుకు ప్రయత్నిస్తుంటే.. నేరుగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలోనే తిష్టవేసి కేసు ముందుకెళ్లకుండా టీడీపీ పెద్దలు నిలువరిస్తున్నారు. ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకురావడం వెనుక ఉన్న అసలైన సూత్రధారుల్ని వదిలేసి.. పాత్రధారులతోనే కేసు దర్యాప్తును ముగించేస్తున్నారు. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు ఆర్థిక లావాదేవీలు చక్కబెట్టే ఓ బడా నేత కుమారుడు ఇందులో ఉండటంతో టీడీపీకి చెందిన ఓ ఎంపీ, ఎమ్మె ల్యే దగ్గరుండి కేసు వ్యవహారాల్ని నడిపిస్తున్నారు. అసలేం జరిగిందంటే..? ఢిల్లీ నుంచి విమానంలో దక్షిణాఫ్రికాకు చెందిన థామస్ అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకొస్తున్నారంటూ నగర పోలీసులకు సెంట్రల్ ఏజెన్సీల నుంచి సమాచారం వచ్చింది. ఆ వ్యక్తి కస్టమ్స్‌కి చిక్కకుండా 25 గ్రాముల కొకైన్‌ని పుస్తకాల మధ్యలో పెట్టి తీసుకొచ్చేశాడు. ఎయిర్‌పోర్టులో పట్టుకుంటే డ్రగ్స్ ఎవరి కోసం తీసుకొచ్చారన్నది తెలియదన్న ఉద్దేశంతో ఈగల్ బృందం సదరు విదేశీయుడిని ఫాలో అవుతూ వచ్చింది. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో అతడు అక్షయ్‌కుమార్ అలియాస్ మున్నాను కలిసి డ్రగ్స్ ఇస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తి ఫోన్‌తో పాటు మున్నా ఫోన్‌ని స్వాదీనం చేసుకున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. మున్నాను విచారించి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒకరు వైద్యుడు కాగా, మరొకరు కూటమి నాయకుడి కుమారుడు, ఇంకొకరు ఉత్తరాంధ్ర కూటమి నేతల ఆరి్థక లావాదేవీలు చూసే బడా నేత కుమారుడు. ఈ ముగ్గుర్నీ పట్టుకోగానే.. టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ నేరుగా పోలీసులకు ఫోన్‌చేసి వెంటనే వారిని విడిచి పెట్టాలని.. వారిపై ఎలాంటి కేసులు ఉండకూడదనీ.. తమకు కావల్సిన వ్యక్తులంటూ హుకుం జారీ చేశారు. పోలీసులపై తీవ్ర ఒత్తిడి రావడంతో కేవలం ఇద్దర్ని మాత్రమే అరెస్ట్ చేశామంటూ తొలిరోజు ప్రెస్మీట్లో సీపీ వెల్లడించారు. మొత్తం ఐదుగుర్ని అదుపులోకి తీసుకొని ఇద్దర్ని మాత్రమే అరెస్ట్ ఎందుకు చూపిస్తున్నారని మీడియా ప్రశ్నించగా.. మిగిలిన ముగ్గురు అనుమానితులు మాత్రమేననీ, నిందితులు కాదని సమాధానమిచ్చి తప్పించుకోవాలని చూశారు. కూటమి నేతల హస్తం ఉన్నట్టు అన్ని ఆధారాలున్నా.. టీడీపీ నేతలు పోలీసుల చేతులు కట్టేసి దర్యాప్తును తుంగలో తొక్కేస్తున్నారు. సూత్రధారుల్ని విడిచిపెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. లోతుగా దర్యాప్తు చేయడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలొస్తున్నాయి. హోంమంత్రి స్పందించరేం? ప్రతి విషయంలో హడావుడి చేసే హోంమంత్రి అనిత సోమవారం సాయంత్రం నగరంలో పోలీసుల కార్యక్రమానికి హాజరైనా డ్రగ్స్ కేసుపై పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. దీంతో కూటమి నేతల హస్తం ఉందనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. సీపీ కార్యాలయంలోనే ఓ ఎమ్మెల్యే తిష్ట! ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా.. టీడీపీ ఎమ్మెల్యే ఒకరు సీపీ కార్యాలయానికి నేరుగా వచ్చేసినట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురూ తమకు బాగా కావాల్సినవారని, ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు నమోదు చెయ్యొద్దంటూ అక్కడే ఉండి వ్యవహారం నడిపించారు. అప్పటికే ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నట్టు మీడియాలో వార్తలు రావడంతో ఏం చేయాలో పాలుపోక కూటమి పార్టీలకు సంబంధం లేని.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వైద్యుడిని అరెస్ట్ చేసినట్టు చూపించారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు కూటమి పార్టీ నేత, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సీఈవో.. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మున్నాతో అతడికి సత్సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో అతడి పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
విశాఖ డ్రగ్స్ కేసులో కూటమి నేతలకు లింకులు
-
విశాఖ డ్రగ్స్ కేసులో కూటమి నేతలకు లింకులు
-
విశాఖ డ్రగ్స్ కేసులో మరో అరెస్ట్
-
ఇండస్ట్రీలో డ్రగ్స్ ఎప్పుడూ ఉండేదే.. త్వరలోనే నిజాలు బయటపడతాయ్
చెన్నై: కోలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. డ్రగ్స్ కేసులో అరెస్టయిన శ్రీరామ్.. తనకు మాదక ద్రవ్యాల అలవాటు ఉన్నట్లు అంగీకరించాడు. మరో తమిళ నటుడు కృష్ణ కూడా ఈ డ్రగ్స్ వాడినట్లు సమాచారం అందించడంతో పోలీసులు ఆ నటుడిని వెతికే పనిలో పడ్డారు. ఈ వ్యవహారంపై తమిళ హీరో విజయ్ ఆంటోని (Vijay Antony) స్పందించాడు.విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మార్గన్. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో హీరో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడటం కొత్తేమీ కాదు. ఇక్కడ చాలాఏళ్లుగా ఈ సమస్య ఉంది. డ్రగ్స్ కేసులో శ్రీకాంత్ (టాలీవుడ్లో శ్రీరామ్) జైల్లో ఉన్నాడు. పూర్తి విచారణ తర్వాత నిజాలు బయటకు వస్తాయి అన్నాడు. మార్గన్ మూవీ జూన్ 27న విడుదల కానుంది.చదవండి: దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోం : నటుడు సత్యరాజ్ -
డ్రగ్స్ కేసు : అజ్ఞాతంలోకి నటుడు కృష్ణ!
మాదక ద్రవ్యాల వ్యవహారం కోలీవుడ్‌లో విశ్వరూపం దాల్చుతోందనిపిస్తోంది. డ్రగ్స్ ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెద్దగానే ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేపట్టారు. దీని కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే నటుడు శ్రీరామ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా మరో తమిళ నటుడు కృష్ణ కూడా మాదక ద్రవ్యాలను వాడినట్లు సమచారం అందడంతో పోలీసులు ఆయన్ని విచారించాలని నిర్ణయించారు. దీంతో ప్రస్తుతం కేరళలో షూటింగ్లో పాల్గొంటున్న నటుడు కృష్ణను విచారించడానికి పోలీసులు కేరళకు వెళ్లారు. అయితే కృష్ణ మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. తమిళ ఇండస్ట్రీలోని అనేక యువ దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లతో కృష్ణకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే టాలీవుడ్ నటులతోనూ కృష్ణకు పరిచయాలు ఉన్నాయి. దీంతో అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ ఈ డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. మరి ఈ మాదక ద్రవ్యాల కేసులో ఇంకెందరి పేర్లు బయటకు వస్తాయో చూడాలి. -
డ్రగ్స్ కేసులో హీరో శ్రీరామ్
-
డ్రగ్స్ కేసులో హీరో శ్రీరామ్ అరెస్ట్
చెన్నై: డ్రగ్స్ కేసులో సినీ హీరో శ్రీరామ్ (Sriram) అలియాస్ శ్రీకాంత్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. AIADMK మాజీ నేత నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆరోపణలున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్టయిన వారు ఇచ్చిన సమాచారంతో నటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని నుంగంబాక్కం స్టేషన్‌కు తరలించి సుమారు రెండు గంటలుగా విచారిస్తున్నారు. నటుడికి వైద్యపరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది.అసలేం జరిగింది?చెన్నైలోని ఓ బార్లో ఏఐఏడీఎమ్‌కే మాజీ నేత ప్రసాద్ తాగి గొడవకు దిగాడు. పోలీసులు అతడిచి అరెస్టు చేసి విచారించగా డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. హీరో శ్రీరామ్ కోసం ప్రదీప్ అనే వ్యక్తి తన దగ్గర కొకైన్ కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. ప్రదీప్‌కు 40 సార్లు డ్రగ్స్ అమ్మినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో శ్రీరామ్‌ను అదుపులోకి తీసుకుని పరీక్షలు చేయగా డ్రగ్స్ వాడినట్లు తేలిందని వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై హీరో శ్రీరామ్ స్పందించాల్సి ఉంది.శ్రీరామ్ సినీజర్నీ..శ్రీరామ్.. రోజా కూటం అనే తమిళ చిత్రంతో హీరోగా ప్రయాణం ప్రారంభించాడు. తెలుగులో ఒకరికి ఒకరు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, పోలీస్ పోలీస్, దడ, నిప్పు, లై, 10th క్లాస్ డైరీస్,స్నేహితులు(డబ్బింగ్ మూవీ), పిండం, రావణాసుర.. ఇలా అనేక సినిమాలు చేశాడు. చదవండి: ఈ మూవీ నవ్విస్తుంది, ఏడిపిస్తుంది.. చప్పట్లు కొట్టేలా చేస్తుంది -
Birthday Party: పరీక్షల్లో పలువురికి గంజాయి పాజిటివ్
-
మంగ్లీ బర్త్‌డే పార్టీలో గంజాయి కలకలం
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ప్రముఖ సింగర్ మంగ్లీ(Singer Mangli) బర్త్‌డే పార్టీలో గంజాయి సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. బర్త్ డే సందర్భంగా మంగ్లీ నిన్న(జూన్ 10)హైదరాబాద్ సమీపంలోని చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో మందు పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా సరఫరా చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. రిసార్ట్‌పై దాడి చేసి విదేశీ మద్యం సీజ్ చేశారు. అలాగే పార్టీకి హాజరైన 48 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. 9 మందికి గంజాయి పాజిటివ్‌గా తేలిందని పోలీసులు తెలిపారు. సింగర్‌తో పాటు రిసార్ట్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఫోక్ సాంగ్స్‌తో ఫేమస్ అయిన మంగ్లీ. ఆ ఫేంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తనదైన స్టైల్లో పాటలు ఆలపిస్తూ..తక్కువ సమయంలోనే స్టార్ సింగర్‌గా ఎదిగింది. బన్నీ, ఎన్టీఆర్, మహేశ్ బాబుతో పాటు పలువురు స్టార్ హీరోల సినిమాలకు ఆమె పాటలు పాడింది. -
కూకట్పల్లి డ్రగ్స్ కేసులో ఇద్దరు ఏపీ పోలీసుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి డ్రగ్స్ కేసులో ఇద్దరు ఏపీ పోలీసులు అరెస్ట్ అయ్యారు. తిరుపతిలో టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ గుణ శేఖర్‌ను కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. గుణశేఖర్‌తో పాటు హెడ్ కానిస్టేబుల్ రామచంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎఫీడ్రిన్ డ్రగ్‌ను కానిస్టేబుల్ గుణశేఖర్‌కు ఎవరు సప్లై చేస్తున్నారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.ఎఫీడ్రిన్లో కొకైన్ కలిపి డ్రగ్స్ విక్రయాలపై కూకట్పల్లి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే రిమాండ్‌లో ఉన్న ఐదుగురు నిందితులను కస్టడీకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టనున్నారు. -
నటీ నటుల కోసం రూమ్స్, డ్రగ్స్.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
డ్రగ్స్ వినియోగం ఆరోపణలతో మలయాళ చిత్రపరిశ్రమ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడి నటుడు షైన్ టామ్ చాకోతో పాటు జింఖానా సినిమా దర్శకుడు ఖలీద్ రెహ్మాన్ ఈ కేసులో అరెస్టై బయటకు వచ్చారు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా నిర్మాత సాండ్రా థామస్(Sandra Thomas) మాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ వాడడం కోసం సినిమా సెట్లో ప్రత్యేకమైన గదులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ స్పాట్సే ఇప్పుడు డ్రగ్స్ అడ్డాగా మారిపోయానని, ఈ విషయం చాలా మందికి తెలిసినా..తెలియనట్లుగా ఉంటున్నారని మండిపడ్డారు.‘గత ఐదారేళ్ల క్రితమే మాలీవుడ్‌లో డ్రక్స్ వాడకం ఎక్కువైంది. దీనిని అరికట్టేందుకు అప్పుడు అసోసియేషన్ ఒక నిర్ణయం తీసుకుని ఉండాల్సింది. కానీ ఆ పని చేయలేదు. ఇప్పుడు సినిమా సెట్స్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అక్కడ ఏం జరుగుతుంది? అనేది అందరికి తెలిసినా.. ఎవరూ మాట్లాడలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆయా నటీనటులతో సినిమాలు చేయాలనుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డ్రగ్స్ అలవాటు చేసుకున్నారు. డ్రగ్స్ వాడకం కోసమే ప్రత్యేక బడ్జెట్, గదులను కేటాయిస్తున్నారు. ఈ విషయాలన్ని అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(అమ్మ) సభ్యులకు తెలియదా? సెట్స్‌కి వెళితే డ్రగ్స్ దొరుకుతుందని తెలియదా? తెలిసినా వారు పట్టించుకోవడం లేదు’ అని ఆమె ఆరోపించారు.సాండ్రా థామస్ విషయానికొస్తే.. మలయాళంలో నటిగా కెరీర్‌ని ఆరంభించిన ఆమె..ఇప్పుడు నిర్మాతగానూ రాణిస్తోంది. ‘ఫ్రైడే’, ‘ఫిలిప్స్ అండ్ ది మంకీ పెన్’, ‘ఆడు’ సినిమాలతో నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. -
మల్కన్‌గిరి కేంద్రంగా గంజాయి ప్రాసెసింగ్
సాక్షి, హైదరాబాద్: ఒడిశాలోని మల్కన్‌గిరి కేంద్రంగా కొన్ని ముఠాలు గంజాయి ప్రాసెసింగ్ చేస్తున్నట్టు ఎక్సైజ్‌శాఖ కీలక ఆధారాలు సేకరించింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో పండిస్తున్న గంజాయి అంతా మల్కన్‌గిరి అటవీ ప్రాంతానికి తరలిస్తున్న ముఠాలు.. అక్కడే ఎండబెట్టి, ప్రత్యేక పద్ధతుల్లో ప్రాసెస్ చేస్తున్నట్టు ఆధారాలు లభించాయి. మల్కనగిరి నుంచి గంజాయిని హైదరాబాద్‌కు రవాణా చేస్తున్న ఓ ముఠాను అరెస్టు చేయగా, అసలు విషయం వెలుగుచూసింది. ⇒ ఉప్పల్ హెచ్‌సీఎల్ మల్లాపూర్‌లో జరిపిన సోదాల్లో ఎక్సైజ్ సిబ్బందికి చిక్కిన నిందితులు వివేక్‌రెడ్డి, మధుకిరణ్‌ల ఫోన్లలో ఈ మేరకు కీలక వీడియోలు లభించాయి. వీటిల్లో టన్నుల కొద్ది గంజాయిని కుప్పగా పోసి కొందరు వాటిని ప్యాకింగ్ చేస్తూ..గంజాయి రవాణా గురించి మాట్లాడుకుంటున్నట్టు ఉంది. గంజాయి ముఠా కార్యకలాపాలను క్షణ్ణంగా వివరించే ఇలాంటి వీడియోలు దర్యాప్తు బృందాలకు చిక్కడం ఇదే తొలిసారి అని మల్కాజ్గిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రాసెసింగ్ నుంచి ప్యాకింగ్ దాకాఅటవీ ప్రాంతంలో సేకరించిన గంజాయిని ఎండబెట్టిన తర్వాత అంతా ఒక్కచోటకు తెస్తారు. కుప్పలుగా పోసి..దానిని కిలోల చొప్పున అవసరం మేరకు ఎన్ని కిలోల ప్యాకెట్లు కావాలంటే అంత బరువు తూచి ఒక కవర్లో పెడతారు. ఈ కవర్లను చతురస్రాకార డబ్బాల్లో కూర్చి వీలైనంత వరకు ముద్దగా మార్చుతున్నారు. ఆ తర్వాత ఆ చతురస్రాకార బాక్స్‌ల్లోని గంజాయిని ప్రెసింగ్ రాడ్ కింద పెట్టి పదిమంది తిప్పుతూ వీలైనంత మేరకు తక్కువ పరిమాణంలో కనిపించేలా ముద్దలా అయ్యేలా చేస్తున్నారు. దీనిపై ప్లాస్టర్‌తో సీల్ చేస్తున్నారు.ఇలా చేయడం వల్ల బరువు ఎక్కువగా ఉన్నా..ప్యాకెట్ సైజు కుదించబడడంతోపాటు, గంజాయి రవాణా సమయంలో వాసన రాకుండా చేస్తున్నారు. దీన్ని దళారులు, గంజాయి ముఠాలతో డీల్ చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా భద్రాచలం, రాజమండ్రి మార్గాల్లో రోడ్డు మార్గంలో, లేదంటే ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి రైలు మార్గంలో దేశంలోని పలు పట్టణాలు, ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాయి. రూ.53 లక్షల విలువైన గంజాయి సీజ్ మల్లాపూర్‌లోని హెచ్‌సీఎల్ ప్రాంతంలోని ఓ గోదాంలో 106 కిలోల గంజాయిని ఎక్సైజ్‌శాఖ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.53 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆబ్కారీ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్, మల్కాజ్గిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్‌కుమార్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కేసులో గంజాయి సరఫరా ముఠాకు చెందిన దగ్గుమల్లి మధు కిరణ్ , కట్ల వివేక్‌రెడ్డిలను అరెస్టు చేయగా, ఏ–1 మల్కన్‌గిరి జిల్లాకు చెందిన రాంబాబు పరారీలో ఉన్నట్టు తెలిపారు. -
డ్రగ్స్‌కు బానిసైన డాక్టర్ నమ్రత.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
సాక్షి, శేరిలింగంపల్లి: ప్రజలకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు చెప్పాల్సిన వైద్యురాలు తప్పుడు మార్గంలో వెళ్లింది. డ్రగ్స్‌కు బానిసగా మారిన సదరు వైద్యురాలు.. నిషేధిత కొకైన్ డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు చిక్కింది. దీంతో, ఆమెను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 53 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని షేక్ పేటలో ఏపీఏహెచ్‌సీ కాలనీకి చెందిన డాక్టర్ చిగురుపాటి నమ్రత (34) సిటీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే, కొన్నేళ్లుగా ఆమె డ్రగ్స్ తీసుకుంటూ.. మత్తు పదార్థాలకు బానిసగా మారిపోయారు. ఈ క్రమంలో ముంబైలో నివాసం ఉండే వాన్స్ టక్కర్‌ను వాట్సాప్ ద్వారా సంప్రదించి, రూ.5 లక్షల కొకైన్ డ్రగ్స్ ఆర్డర్ చేసింది. డబ్బును మొత్తం ఆన్ లైన్ ద్వారా పంపించింది.అనంతరం, టక్కర్ తన వద్ద డెలివరీ బాయ్‌గా పనిచేసే బాలకృష్ణ రాంప్యార్ రామ్(38)కు డ్రగ్స్ ఇచ్చి నగరానికి పంపించాడు. రాయదుర్గంలో నమ్రతను కలిసిన రాంప్యార్ రామ్ డ్రగ్స్ ను అందజేస్తుండగా, పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డ్రగ్స్ ఇస్తున్న సమయంలో వారిద్దరిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి 53 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన మహిళా డాక్టర్, ఒమేగా హాస్పిటల్ సీఈవో చిగురుపాటి నమ్రత ముంబైకి చెందిన వంశ్ టక్కర్ అనే స్మగ్లర్ నుంచి కొకైన్ కొనుగోలు చేస్తూ.. తన నివాసం షేక్‌పేట్‌లోని అపర్ణ వన్ అపార్ట్మెంట్లో దొరికిన చిగురుపాటి నమ్రతవంశ్ టక్కర్‌కు… pic.twitter.com/A03UqI0JvZ— Telugu Scribe (@TeluguScribe) May 10, 2025Credit: Telugu Scribe -
డ్రగ్స్ కేసు.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అరెస్ట్
డ్రగ్స్ కేసుల వల్ల మలయాళ చిత్రసీమ హాట్ టాపిక్ అవుతోంది. కొన్నిరోజుల క్రితం ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకో.. డ్రగ్స్ వాడుతున్నాడని తేలడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై కాసేపటికే బెయిల్ పై రిలీజయ్యాడు. వారం క్రితం ఇద్దరు మలయాళ దర్శకుల్ని ఇదే తరహా కేసులో అరెస్ట్ చేశారు. (ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!)ఇప్పుడు ఈ కేసులో మరో అప్డేట్. అరెస్ట్ అయిన సదరు దర్శకులు ఖలీద్ రెహ్మాన్, అష్రఫ్ హమ్జాతో పాటు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ సమీర్ తాహిర్ ని కూడా సోమవారం నాడు ఇదే డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లతో ఇతడికి సంబంధం ఉందనే ఆరోపణలతోపాటు ఇతడు అద్దెకు తీసుకున్న అపార్ట్ మెంట్ లో వీళ్లు ఉండటం దీనికి కారణం.అయితే తాను అద్దెకు తీసుకున్న అపార్ట్ మెంట్ లో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే విషయం తనకు తెలియదని సమీర్ తాహిర్.. పోలీసులతో చెప్పుకొచ్చాడు. అయినా సరే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్స్ యాక్ట్ ప్రకారం ఇతడిపై కేసు నమోదు చేశారు. కానీ కాసేపటికే ఇతడు కూడా బెయిల్ పై బయటకొచ్చాడు.(ఇదీ చదవండి: చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ 'ఎమ్మెల్యే'!) -
దసరా నటుడు అరెస్ట్
మలయాళ ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకో డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణలో పాల్గొన్నాడు. కొద్దిరోజుల క్రితం కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారం రావడంతో పోలీసులు రైడ్ నిర్వహించారు. పోలీసుల రాకను గుర్తించిన షైన్ టామ్ చాకో అక్కడినుంచి పరారైనట్లు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. మూడో అంతస్తు నుంచి దూకి అక్కడి నుంచి ఆయన పారిపోయాడు. ఆ విజువల్స్ ఆధారంగా ఆయనకు నోటీసులు ఇచ్చారు. తాజాగా పోలీసు విచారణకు తన న్యాయవాదితో హాజరయ్యారు. ఎర్నాకుళం నార్త్ పోలీస్‌స్టేషన్‌కు ఆయన వచ్చారు. విచారణ అనంతరం పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కాగా షైన్ టామ్ చాకో డ్రగ్స్ తీసుకుంటారని గతంలోనే పలుమార్లు వార్తలు వచ్చాయి. రీసెంట్గా మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నటి విన్సీ సోనీ అలోషియన్ కూడా ఆయనపై పదునైన విమర్శలు చేసింది. సినిమా సెట్లోనే ఆయన డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పింది. ఆ సమయంలో తన పట్ల చాలా అభ్యంతరకరంగా ఆయన వ్యవహరించారని ఆమె చెప్పింది. దసరా మూవీతో తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలన్‌గా ప్రేక్షకులను మెప్పించారు. గతేడాది విడుదలైన టాలీవుడ్ మూవీ దేవరలోనూ కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలోనూ కనిపించారు. గతంలో ఓ డ్రగ్స్ కేసులో ఆయన నిర్దోషిగా బయటపడిన సంగతి తెలిసిందే. 2015లో అతనిపై నమోదైన కేసులో షైన్ టామ్ చాకో కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. గతంలో వీరంతా కొకైన్ సేవించారని పోలీసులు కేసు నమోదు చేశారు. -
మంగళగిరిలో డ్రగ్స్, గంజాయి
మంగళగిరి: ఇటీవల అమరావతి పరిధిలో డ్రగ్స్ అమ్మకాలు పెరిగిపోయాయి. మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైన కొకైన్ వంటి డ్రగ్స్‌ను సైతం యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. గంజాయి అయితే అన్నిచోట్లా విచ్చలవిడిగా అమ్ముతున్నారు. తాజాగా శుక్రవారం రాత్రి మంగళగిరిలో కొకైన్, గంజాయి విక్రయిస్తున్న యువకులను అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. ఇటీవల మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం సమీపంలోనే ఒక మహిళ దారుణ హత్యకు గురికాగా... ఇప్పుడు అక్కడికి కొద్ది దూరంలోనే ఏకంగా డ్రగ్స్ విక్రయిస్తూ యువకులు దొరకడంతో అమరావతి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. నలుగురి అరెస్ట్... విజయవాడ కృష్ణలంకకు చెందిన నందం నిఖిల్, రాణిగారితోటకు చెందిన బొట్ల కాశీవర్ధన్ అనే యువకులు శుక్రవారం రాత్రి మంగళగిరిలోని ఎర్రబాలెం డిలైట్ డాబా సెంటర్ వద్ద కొకైన్, గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా... మంగళగిరి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని 8.71 గ్రాముల కొకైన్, 1,200 గ్రాముల గంజాయి, బైక్‌ను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు.వారిని విచారించగా, తమకు కృష్ణలంకకు చెందిన పెండ్యాల సాయికుమార్, గుంటూరు జిల్లా కుంచనపల్లికి చెందిన గొర్ల గిరీష్‌రెడ్డిలు కొకైన్, గంజాయి విక్రయిస్తారని చెప్పారు. సాయికుమార్, గిరీష్రెడ్డిలను కూడా అరెస్ట్ చేసి విచారించగా..వారికి విజయవాడకు చెందిన సొహైల్, శామీర్లు కొకైన్ గంజాయి విక్రయిస్తారని తెలిపారు. పరారీలో ఉన్న సొహైల్, శామీర్ల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఈగల్’ విభాగం ఐజీ ఏకే రవికృష్ణ శనివారం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో నిందితులను విచారించారు. -
ఇన్‌స్టా క్వీన్.. ఉద్యోగం ఊడింది
సోషల్ మీడియాలో ఇన్‌స్టా క్వీన్(Insta Queen)గా పేరున్న సీనియర్ కానిస్టేబుల్ అమన్‌దీప్ కౌర్‌ను పంజాబ్ పోలీస్ శాఖ ఉద్యోగం నుంచి తొలగించింది. అంతేకాదు.. ఇంతకాలం ఆమె విలాసాలకు కారణం ఏంటన్న గుట్టు కూడా ఎట్టకేలకు వీడింది. పంజాబ్‌లో మాదకద్రవ్యాల కట్టడికి అక్కడి ఆప్ ప్రభుత్వం యుధ్ నాశేయన్ విరుధ్ డ్రైవ్ చేపట్టింది. ఈ క్రమంలో పక్కా సమాచారంతో.. బాదల్ ఫ్లైఓవర్ వైపు వేగంగా వెళ్తున్న ఓ వాహనాన్ని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అందులో మరో వ్యక్తితో పాటు అమన్‌దీప్ కౌర్(Amandeep Kaur) కూడా ఉండగా.. వాళ్ల వద్ద 17 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో.. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రాథమిక చర్యల కింద మాన్సా పీఎస్ నుంచి బథిండా పోలీస్ లైన్స్‌కు ఎటాచ్ చేశారు. View this post on Instagram A post shared by Kaur deep (@police_kaurdeep) అయితే.. దర్యాప్తులో డ్రగ్స్ రవాణాలో ఆమె పాత్ర ఉందని తేలడంతో గురువారం డిస్మిస్ చేస్తూ పంజాబ్ పోలీస్ శాఖ ఉత్తర్వులు వెలువరించింది. police_kaurdeep పేరిట ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఉంది. థార్ కారులో కూర్చుని.. ఖరీదైన వాచీలను ధరించి పాటలు పాడుతూ ఐఫోన్లలో రీల్స్ చేస్తూ వస్తోంది. ఫాలోవర్స్ తక్కువే అయినా ఆమె ఇచ్చే బిల్డప్లకు ఇన్‌స్టా క్వీన్‌గా ఆమెకు ఓ పేరు అయితే ముద్రపడింది. అయితే.. View this post on Instagram A post shared by Kaur deep (@police_kaurdeep) అమన్‌దీప్ కౌర్ ఇంతకు ముందు కూడా వార్తల్లోకి ఎక్కారు. గుర్మీత్ కౌర్ అనే మహిళ ఆమెపై గతంలో సంచలన ఆరోపణలు చేసింది. అమన్‌దీప్ దగ్గర రూ.2 కోట్ల విలువైన బంగ్లా.. లక్షలు విలువ చేసే ఖరీదైన వాచీలు, కార్లు ఉన్నాయని ఆరోపించింది. ఆంబులెన్స్ డ్రైవర్ అయిన తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఆ ఆంబులెన్స్‌లోనే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తోందని ఫేస్బుక్లో ఆరోపిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అయితే అప్పట్లో ఆ ఆరోపణలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆమెకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరెవరికి రవాణా చేశారు? అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. -
37 కిలోలు, రూ.75 కోట్లు!
న్యూఢిల్లీ/బనశంకరి: కర్నాటక పోలీసులు 37 కిలోల ఎండీఎంఏ (మెథిలీన్ డయాక్సీ మెథాంఫెటమైన్) అనే సింథటిక్ డ్రగ్‌ను పట్టుకున్నారు. దీని విలువ రూ.75 కోట్లని మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ ఆదివారం మీడియాకు తెలిపారు. గత సెప్టెంబరులో మంగళూరులో హైదర్ అలీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 15 గ్రాముల ఎండీఎంఏ స్వాదీనం చేసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో బెంగళూరులో ఓ నైజీరియా దేశస్తున్ని పట్టుకోగా రూ.6 కోట్ల విలువైన ఎండీఎంఏ దొరికింది.ఇది అంతర్జాతీయ డ్రగ్స్ దందా అని, ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల ద్వారా అక్రమ రవాణా జరుగుతోందని గుర్తించారు. మంగళూరు పోలీసులు బాంబా ఫాంట్ (31), అబిగైల్ అడోనిస్(30) అనే దక్షిణాఫ్రికన్లను అరెస్ట్ చేసి ట్రాలీ బ్యాగుల్లో దాచిన 37 కిలోల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. ఎండీఎంఏను మోల్లీ, ఎక్స్టసీ అని పలు పేర్లతో పిలుస్తారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఇంఫాల్, గౌహతి జోన్లలో రూ.88 కోట్ల విలువైన మెథాంఫెటమైన్ డ్రగ్ టాబ్లెట్లను పట్టుకున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.ఇందుకు సంబంధించి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా సభ్యులైన నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారని ఆదివారం ‘ఎక్స్’లో వెల్లడించారు. ‘‘ఎన్సీబీ ఇంఫాల్ జోన్ అధికారులు ఈ నెల 13న లిలాంగ్ ప్రాంతంలో ఓ ట్రక్కులో సోదాలు జరిపి టూల్‌బాక్స్‌లో దాచిన 102.39 కిలోల మెథాంఫెటమైన్ ట్యాబ్లెట్లను పట్టుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అసోం సరిహద్దుల్లో ఓ వాహనం స్పేర్ టైర్లో దాచిన 7.48 కిలోల మెథాంఫెటమైన్ టాబ్లెట్లను పట్టుకున్నారు’’ అని తెలిపారు. -
'కబాలి' నిర్మాత కే.పీ చౌదరి ఆత్మహత్య.. కారణం ఇదే
సౌత్ ఇండియా ప్రముఖ నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి (కే.పీ చౌదరి) ఆత్మహత్య చేసుకున్నాడు. ‘కబాలి’ తెలుగు వర్షన్‌కు నిర్మాతగా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే, గతేడాదిలో డ్రగ్స్ కేసులో సైబరాబాద్ పోలీసులు ఆయన్ను పట్టుకున్నారు. దీంతో చిత్ర పరిశ్రమలో కూడా తీవ్రమైన అలజడి నెలకొంది. ఆ సమయంలో టాలీవుడ్‌కు చెందిన పలువురి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. 2016లో సినిమా రంగంలోకి వచ్చిన కేపీ చౌదరి కబాలి చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ క్రమంలో సర్ధార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలను ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశారు.డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కే.పీ చౌదరి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాడని, అప్పులు ఇచ్చిన వారి నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. మూడున్నరేళ్ల పాటు సినీమా రంగంలో ఉన్నాడు. ఇందులో నష్టాలు రావడంతో డ్రగ్స్ సరఫరాను ఆయన ఎంచుకున్నారు. గోవాలో ఓహెచ్ఎం పబ్‌ను ప్రారంభించిన కేపీ చౌదరీ సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఆధారాలు లభించాయి. హైదరాబాద్ నుంచి గోవా వచ్చే స్నేహితులు, సెలెబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేశారు.అయితే, పబ్బులో నష్టాలు రావడంతో హైదరాబాద్ తిరిగొచ్చారు. ఆయన స్వస్థలం ఖమ్మం జిల్లా బొనకల్ మండలంగా గతంలో పోలీసులు తెలిపారు. బీటెక్ చదివిన చౌదరి గతంలో పూణె ఏరోనాటికల్‌లో డైరెక్టర్ ఆపరేషన్స్‌గా పనిచేశారు. సినీ ప్రముఖలతో సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరికి సంబంధాలు ఉన్నాయి. గోవాలో నైజీరియన్లతో ఉన్న పరిచయాలతో డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుపడ్డాడు. -
హేమ డ్రగ్స్ కేసుపై కర్ణాటక హైకోర్టు స్టే
-
విశాఖ డ్రగ్స్ కేసుపై పచ్చ మంద కిక్కురు మనదేం?
నిజం నిలకడ మీద కానీ తెలియదంటారు. రాజకీయ నాయకులు కొంతమందికి ఈ విషయం బాగా తెలిసినట్టు ఉంది. ఈ ధైర్యంతోనే వాళ్లు వదంతులు, అసత్యాలు, అర్ధ సత్యాలు ప్రచారం చేసి సఫలం అవుతుంటారు. ఎక్కువసార్లు జరిగేది ఇదే. అబద్ధాలు వ్యాప్తి చేయడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సరితూగ గలిగే వాళ్లు ఇంకొకరు ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనతోనే పోటీపడుతున్నారు. ఏ ఘటనలోనైనా తమవారి తప్పుందని తెలిస్తే దాన్ని వెంటనే ప్రత్యర్దిపైకి నెట్టేయడం వీరి శైలి. అనుకూల మీడియా ఒకటి వీరికి అండగా నిలుస్తోది. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండనే చందమీ పచ్చ మీడియా. వందల అబద్దాలు వ్యాప్తి చేయడంలో వీరిదో రికార్డు. వ్యక్తిగా చంద్రబాబు నాయుడు అబద్దాల విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారా అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీని కూడా ఆయన అసత్యాల ప్రచారంలో ఎక్కడా వెనుకబడకుండా తీర్చిదిద్దినట్లున్నారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం 2024 ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఓడరేవులో ఒక నౌకలో మాదక ద్రవ్యాలు వచ్చాయన్న వార్త వచ్చింది. ఒక ప్రైవేట్ కంపెనీ బ్రెజిల్ నుంచి వీటిని దిగుమతి చేసుకుందన్న ఆరోపణలపై సీబీఐ విచారణ చేపట్టింది కూడా. ఈ వార్త వచ్చిందో లేదో.. టీడీపీ వెంటనే రంగంలో దిగిపోయింది ఆ డ్రగ్స్ వైసీపీ వారివేనని ప్రచారం మొదలుపెట్టింది. దీనిపై టీడీపీ చేసిన ట్వీట్లు చూస్తే... ఇంత నీచంగా కూడా ప్రచారం చేయవచ్చా? అనిపించకతప్పదు. వైసీపీ పేరును వక్రీకరిస్తూ ‘యువజన కొకైన్ పార్టీ’ రాసింది. అక్కడితో ఆగలేదు. అప్పటి ముఖ్యమంత్రి జగన్, ఆయన సమీప బంధువులు వైఎస్ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, సోషల్ మీడియా ఇన్ఛార్జీ సజ్జల భార్గవ రెడ్డిల ఫోటోలు పెట్టి మరీ దుష్ప్రచారం చేసింది. ‘‘దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా తాడేపల్లి ప్యాలెస్ లింకులే బయటపడుతున్నాయి’’ అని, ‘‘నాడు తాలిబన్ టు తాడేపల్లి. 2021 విజయవాడలో రూ.21 వేల కోట్ల హెరాయిన్, నేడు బ్రెజిల్ తాడేపల్లి.. 2024విశాఖలో రూ.1.60 లక్ష కోట్ల కొకెన్’’ అంటూ ఆరోపించింది. అసత్యాలు ప్రచారం చేసింది. ఇదంతా అవాస్తవమని టీడీపీకి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లకు కూడా తెలుసు. రాజకీయం కోసం ఏమైనా చేయాలన్నది వారి థియరీ. ఎన్ని అబద్దాలైనా ఆడవచ్చన్నది వారి అభిమతం. అదే ప్రకారం వారితోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి వాటిని ఎల్లో మీడియాగా మార్చేసి, ఎలాంటి నీతి,విలువలు లేకుండా తెలుగుదేశం పక్షాన పని చేయించారు. పచ్చి అబద్దాలైనా, ఏమో నిజం ఉందేమో! అన్నట్లుగా వీరు కథలు ఇచ్చేస్తుంటారు. ఇవి చాలవన్నట్లుగా సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తుంటారు.ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా వీరి ట్రెండ్ ఇదే. విశాఖ డ్రగ్స్ పై చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు కూడా పోటీ పడి అబద్దపు ప్రసంగాలు చేశారు. పవన్ కళ్యాణ్ దక్షిణ అమెరికాలోని కొలంబియా నుంచి విశాఖకు హెరాయిన్ వచ్చిందని ఉపన్యాసం చేస్తే, బ్రెజిల్ నుంచి డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ వచ్చాయని చంద్రబాబు ఆరోపించారు. జగన్ హయాంలో రాష్ట్రం డ్రగ్స్ అడ్డాగా మారిందని చెప్పేశారు. తీరా సీబీఐ విచారణలో తేలింది ఏమిటంటే సంబంధిత కంటైనర్‌లో డ్రగ్స్ లేవని!! దీనిపై టీడీపీ ఎల్లో మీడియా కానీ, సోషల్ మీడియా కానీ కిక్కురుమంటే ఒట్టు. ఇక్కడ మరో సంగతి చెప్పుకోవాలి. సీబీఐ కూడా ఎన్నికలకు ముందు మౌనం పాటించి, ఎన్నికలైన ఆరు నెలలకు తాపీగా విశాఖ పోర్టులోకి వచ్చింది డ్రగ్స్ కాదని తెలిపింది. ఈ విషయంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అప్పట్లో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అండగా నిలిచి ఒక ప్లాన్ ప్రకారం ఇలాంటి కుట్రలు చేసి ఉండవచ్చన్న డౌట్ చాలా మందిలో ఉంది. అదే క్రమంలో సీబీఐ కూడా పని చేసిందేమో అన్న అనుమానం వస్తుంది. ఇప్పుడు వాస్తవం వెలుగులోకి వచ్చాక అయినా, ఇంత నీచమైన ఆరోపణలు చేశాం కదా..వాటిని ఉపసంహరించుకుంటున్నాం..అని కూటమి నేతలు ఎక్కడా చెప్పరు.అప్పట్లో ఈ కంటైనర్ ను దిగుమతి చేసుకున్న సంస్థ టీడీపీకి సంబంధించిన వారిదని వార్తలు వచ్చాయి. దాన్ని తోసిపుచ్చడానికి ఆ కంపెనీ యజమాని సోదరుడు వైసీపీ వాడంటూ మరో వాదనను టీడీపీ మీడియా వారు తెరపైకి తెచ్చారు. అంతేకాదు. సీబీఐ కోరిక మేరకు వారికి సహకరించడానికి అక్కడకు రాష్ట్ర పోలీసు అధికారులు వెళ్లారు. వెంటనే ఎల్లో మీడియా డ్రగ్స్ కేసును మేనేజ్ చేయడానికే వెళ్లారని కల్పిత కథనాలు వండేశారు. ఇలా ఒకటి కాదు.. ఎన్నో విషయాలలో అబద్దపు ప్రచారం చేశారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వారిపై పెడుతున్న కేసులను పరిగణనలోకి తీసుకుంటే, ఆ రోజుల్లో టీడీపీ, జనసేనలు చేసిన దారుణమైన అసత్యాలపై ఎంత తీవ్రమైన కేసులు పెట్టి ఉండాలో! కాని అప్పట్లో అలా చేయలేదు. మరీ అడ్డగోలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఎవరిపైన అయినా ఒకటి, అరా కేసులు పెడితే, వెంటనే మీడియాపై దాడి అంటూ విపరీతమైన ప్రచారం చేసేవారు. అదే ఇప్పుడు వైఎస్సార్సీపీ సోషల్ మీడియాపై జరుగుతున్న దాడిని సమర్థిస్తూ, వారిని సైకోలుగా చిత్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియా ఘోరమైన పోస్టులు పెట్టిందని వైసీపీ వారు ఆధార సహితంగా పోలీసులకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు తాము కోర్టులలో ప్రైవేటు కేసులు వేస్తున్నామని చెప్పారు. రాజకీయాలలో అసత్యాలే ప్రామాణికంగా పని చేసుకుంటూ రాజకీయ నేతలు వెళితే సమాజం కూడా అలాగే తయారవుతుంది. ప్రస్తుతం ఏపీలో సమాజం అటువైపు పయనిస్తోందా? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ కథ క్లోజ్.. విశాఖపట్నానికి వచ్చిన నౌకలో డ్రగ్స్ లేవని నిర్ధారించిన సీబీఐ... అప్పట్లో ఓటర్లను మోసగించడానికి టీడీపీ అండ్ కో దుష్ప్రచారం
-
1,319 కిలోల బంగారం, 8,223 కిలోల డ్రగ్స్ స్వాధీనం!
దేశంలోకి విభిన్న మార్గాల ద్వారా అక్రమంగా రవాణా చేయాలని చూసిన 7,348.68 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. 2023-24లో స్వాధీనం చేసుకున్న వస్తువులకు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) వివరాలు వెల్లడించింది. 67వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నివేదిక విడుదల చేసింది. బంగారంతోపాటు వెండి, డ్రగ్స్, విలువైన లోహాలను దేశంలోకి అక్రమంగా రవాణా చేయడానికి స్మగ్లర్లు తరచు వినూత్న మార్గాలను ఉపయోగిస్తున్నారని తెలిపింది.2023-24 లెక్కల ప్రకారం డీఆర్ఐ తెలిపిన వివరాల కింది విధంగా ఉన్నాయి.8,223.61 కిలోల మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించి 109 కేసులు నమోదయ్యాయి.రూ.974.78 కోట్ల విలువ చేసే 107.31 కిలోల కొకైన్రూ.365 కోట్ల విలువ చేసే 48.74 కిలోల హెరాయిన్రూ.275 కోట్ల విలువ చేసే 136 కిలోల మెథాంఫెటమైన్236 కిలోల మెఫెడ్రోన్రూ.21 కోట్ల విలువ చేసే 7,348.68 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ పేర్కొంది.విమాన మార్గం ద్వారా కొకైన్ అక్రమ రవాణా పెరుగుతోంది. కొకైన్కు సంబంధించి 2022-23లో 21 కేసుల నమోదవ్వగా 2023-24లో అది 47కు పెరిగింది.ముఖ్యంగా దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి కొకైన్ సరఫరా అధికమవుతోంది.కస్టమ్స్ అధికారులకు సహకరిస్తూ..గతంలో కంటే బంగారం అక్రమ తరలింపు ఈసారి పెరిగిందని అధికారులు తెలిపారు. 2023-24లో డీఆర్ఐ 1,319 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. అందులో భూమార్గం 55 శాతం, వాయుమార్గం 36 శాతం కట్టడి చేసినట్లు చెప్పింది. డీఆర్ఐ అధికారులు కస్టమ్స్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ విభాగం అదనంగా 4,869.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: మూడేళ్లలో రూ.8.3 లక్షల కోట్లకు క్రీడారంగం!స్మగ్లింగ్ కోసం సిండికేట్లు‘ప్రధానంగా మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్ నుంచి ఇండియాకు వచ్చే సరిహద్దు మార్గాల్లో నిత్యం తనిఖీ నిర్వహించి బంగారం స్మగ్లింగ్‌ను కట్టడి చేస్తున్నాం. ఇటీవల కొన్ని ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాల్లోని విమానాశ్రయాలు స్మగ్లింగ్ కార్యకలాపాలకు కీలక ప్రదేశాలుగా మారాయి. ఇండియాలో బంగారం స్మగ్లింగ్ కోసం సిండికేట్లను నియమించుకుంటున్నారు. విదేశీ పౌరులు, విదేశాలకు వెళ్లొస్తున్న కుటుంబాలు, ఇతర వ్యక్తులు ఇందులో భాగమవుతున్నారు. చాలాచోట్ల విమానాశ్రయాల్లో పని చేస్తున్న సిబ్బంది కూడా అక్రమ రవాణాలో సహకరిస్తున్నారు’ అని డీఆర్ఐ నివేదిక తెలిపింది. -
ప్రచారం పీక్ దర్యాప్తు వీక్
సాక్షి, హైదరాబాద్: గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వ పెద్దలు పదేపదే సూచిస్తున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించట్లేదు. మత్తుపదార్థాలను కట్టడి చేస్తున్నామంటూ అధికారులు భారీగా ప్రచారం చేస్తుండగా కేసుల దర్యాప్తు పేల వంగా సాగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో చాలా వరకు వీగిపోవడమే అందుకు నిదర్శనం. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్‌బీ) ఇటీవల విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు నమోదైన 226 కేసులకుగాను కేవలం 39 కేసుల్లోనే శిక్షలు ఖరారయ్యాయి. అంటే ఆయా కేసుల్లో నేర నిరూపణ 17 శాతంగానే ఉంది. ఇక ఎక్సైజ్ శాఖ అధికారులు ఎన్డీపీఎస్ చట్టం కింద గత పదేళ్లలో నమోదు చేసిన కేసుల్లో నేర నిరూపణ అత్యంత తక్కువగా 0.85 శాతంగా ఉన్నట్లు ఆ శాఖ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఆధారాల సేకరణలో లోపాలే శాపాలై.. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసుల నమోదు, మత్తుపదార్థాల స్వాధీనం, కోర్టుకు ఆధారాల సమర్పణ తదితర అంశాల్లో దర్యాప్తు అధికారులు చేస్తున్న కొన్ని పొరపాట్ల వల్లే ఎక్కువగా కేసులు వీగిపోతున్నాయి. చాలా వరకు ఎన్డీపీఎస్ కేసులు కనీసం విచారణ దశకు కూడా రాకుండానే సాంకేతిక కారణాలతో కోర్టులు కొట్టేస్తున్న సందర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. గంజాయి, డ్రగ్స్ సరఫరా సమాచారం అందాక దర్యాప్తు అధికారులు తన పై అధికారికి సమాచారం ఇవ్వడంతోపాటు వారి నుంచి లిఖితపూర్వకంగా ఆదేశాలు తీసుకోవాలి. ఆ తర్వాత తనిఖీ చేసేందుకు వెళ్లే సమయంలో ఇద్దరు పంచ్ విట్నెస్లను వెంట తీసుకెళ్లాలి. అందులో కనీసం ఒక్కరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉండాలి. ఆ తర్వాత ఎవరి వద్ద తనిఖీ చేయడానికి వెళ్లారో ఆ వ్యక్తికి సదరు అధికారులు ఆప్షన్ ఫాం ఇవ్వాల్సి ఉంటుంది. దాని ప్రకారం..దర్యాప్తు అధికారులను అవతలి వ్యక్తులు తనిఖీ చేయవచ్చు (అధికారులే మత్తుపదార్థాలను తెచ్చి పెట్టారన్న సందేహాలకు తావు లేకుండా). ఆపై తనిఖీలను అధికారులు ప్రారంభించాలి. నూతన చట్టాల ప్రకారం ఈ వ్యవహారాన్ని వీడియో తీయాలి. సాంకేతిక అంశాల్లో జాగ్రత్తలు తీసుకోకపోయినా.. కొన్నిసార్లు పంచ్ విట్నెస్లు అందుబాటులో లేక అందుబాటులో ఉన్న వారితోనే పంచనామా చేయడం.. వారు సాక్ష్యం చెప్పడంలో తడబడటం వంటి కారణాలతో కేసులు నిలబడట్లేదు. సోదాల్లో దొరికిన మత్తుపదార్థాల నమూనాల సేకరణ, వాటికి సంఖ్య కేటాయింపు సైతం ఈ కేసుల్లో కీలకంకాగా అందులోనూ దర్యాప్తు అధికారులకు అవగాహన లేక కేసులు నిలబడట్లేదు.శిక్షలు పెంచేలా శిక్షణపై దృష్టి.. ఈ నేపథ్యంలో ఎన్డీపీఎస్ కేసుల దర్యాప్తు పక్కాగా జరిగేలా చూడటంతోపాటు ఆధారాల సేకరణపై టీజీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు శిక్షణా తరగతుల నిర్వహణపై దృష్టిపెట్టారు. టీజీఏఎన్‌బీ ఆధ్వర్యంలో పోలీ స్, ఎక్సైజ్, ప్రాసిక్యూషన్, రైల్వే శాఖ అధికారులకు సైతం ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 22,654 సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు టీజీఏఎన్‌బీ అధికారులుతెలిపారు. -
గుజరాత్ తీరంలో 700 కిలోల డ్రగ్స్ స్వాధీనం
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని పోర్బందర్ తీరంలో 700 కిలోల మాదక ద్రవ్యాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు శుక్రవారం స్వా«దీనం చేసుకున్నారు. ఈ మెథాంఫెటామైన్ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.3,500 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. అలాగే 8 మంది ఇరాన్ జాతీయులను అరెస్టు చేశారు. విదేశాల నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ వస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో ‘సాగర్ మంథన్–4’ అనే కోడ్నేమ్లో ఎన్సీబీ, భారత నావికాదళం, గుజరాత్ పోలీసు శాఖకు చెందిన యాంటీ–టెర్రరిస్టు స్క్వాడ్(ఏటీఎస్) సిబ్బంది జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు. గుజరాత్ తీరంలో భారత ప్రాదేశిక జలాల్లో ప్రవేశించిన రిజిస్టర్ కాని ఓ పడవను అడ్డుకున్నారు. అందులో తనిఖీ చేయగా 700 కిలోల డ్రగ్స్ లభించాయి. పడవలో ఉన్న 8 మంది ఇరాన్ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లేవు. భారీ ఎత్తున డ్రగ్స్ స్వా«దీనం చేసుకున్న అధికారులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభినందించారు. ‘మాదక ద్రవ్యాల రహిత భారత్’ తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. డ్రగ్స్ రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 3,500 కిలోల డ్రగ్స్‌ను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. మూడు కేసుల్లో 11 మంది ఇరాన్ పౌరులను, 14 మంది పాకిస్తాన్ పౌరులను అరెస్టు చేశారు. వారంతా ప్రస్తుతం ఇండియా జైళ్లలో ఉన్నారు. ఢిల్లీలో 80 కిలోల కొకైన్ స్వాధీనం దేశ రాజధాని ఢిల్లీలో రూ.900 కోట్ల విలువైన 80 కిలోల కొకైన్‌ను ఎన్సీబీ శుక్రవారం స్వా«దీనం చేసుకుంది. ఓ కొరియర్ సెంటర్లో ఆ డ్రగ్స్ లభించినట్లు అధికారులు చెప్పారు. -
భారీగా డ్రగ్స్ పట్టివేత.. తిహార్ జైలు వార్డెన్‌తో సహా నలుగురి అరెస్ట్
లక్నో:ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ), ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందం చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. నోయిడాలోని మెక్సికన్ డ్రగ్ కార్టెల్ నిర్వహిస్తున్న మెథాంఫేటమిన్ తయారీ ల్యాబ్‌లో వందల కోట్ల విలువైన 95 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఈ డ్రగ్స్ తయారీ ల్యాబ్‌ను తిహార్ జైలు వార్డెన్, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త, ముంబై కెమిస్ట్ రహస్యంగా నిర్వహిస్తున్నట్లు తేలింది. భారత్‌తోపాటు విదేశాలకు డ్రగ్స్ సరాఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది.ఈ ల్యాబ్‌లో దేశీయ వినియోగానికి, అంతర్జాతీయ ఎగుమతుల కోసం సింథటిక్ డ్రగ్స్‌ను తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా డ్రగ్స్ తయారీ చేపడుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఘన, ద్రవ రూపాల్లో ఉన్న సుమారు 95కిలోల మెథాంపేటమిన్(డ్రగ్స్), వివిధ రసాయనాలు, ఆధునాతన తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. మూడురోజల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది.ఈ ఫ్యాక్టరీలో ముంబయికి చెందిన కెమిస్ట్ మాదక ద్రవ్యాలను తయారు చేయగా.. వాటి నాణ్యతను ఢిల్లీలో ఉండే మెక్సికన్ ముఠా సభ్యుడు పరీక్షించేవాడని ఎన్సీబీ తెలిపింది. ల్యాబ్‌లో పట్టుబడిన ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్తను గతంలో కూడా ఒక ఎన్డీపీఎస్ కేసులో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది. ఆ సమయంలో అతడిని తిహార్ జైల్లో ఉంచగా.. అక్కడ వార్డెన్‌తో పరిచయం పెంచుకొని అతడిని కూడా ఈ మత్తు వ్యాపారంలోకి దించాడు. -
హైదరాబాద్ లో సింథటిక్ డ్రగ్స్
-
మీడియా ముసుగు.. డ్రగ్స్ మాఫియా చేసే వారికి టీటీడీ ఛైర్మన్ పదవులా?: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా? అని కూటమి సర్కార్‌ను వైఎస్సార్సీపీ ప్రశ్నించింది. ఈ క్రమంలో డ్రగ్స్ దందాలో కేసులకు సంబంధించి సాక్ష్యాలను, కీలక విషయాలను వెల్లడించింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..‘మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా?. గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్‌గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్ ఛానల్ అధినేత.. సాక్ష్యాలివిగో!’ అంటూ వివరాలను వెల్లడించింది.💣 Exposed 💣మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా? గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్‌గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్ ఛానల్ అధినేత.. సాక్ష్యాలివిగో!#YellowMediaDrugsMafia pic.twitter.com/1TDPqGtjsS— YSR Congress Party (@YSRCParty) October 24, 2024 💣 Truth Bomb 💣దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు.. గుట్టు చప్పుడు కాకుండా 13 ఏళ్ల నుంచి తెలుగు రాష్ట్రాల్ని భ్రష్టుపట్టిస్తున్న ఎల్లో డ్రగ్స్ మాఫియా#YellowMediaDrugsMafia pic.twitter.com/Ye7WqRehBY— YSR Congress Party (@YSRCParty) October 24, 2024 గత కొన్నేళ్లుగా 15 మందితో వందలాది డ్రగ్స్ సంబంధిత చర్చలు.. ఇలాంటి వాడికి టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెడితే.. తిరుమల పవిత్రతని కాపాడతాడా?#YellowMediaDrugsMafia pic.twitter.com/zzMtTBPZMn— YSR Congress Party (@YSRCParty) October 24, 2024అయితే, రాష్ట్ర పోలీసు విభాగం కొన్నాళ్లుగా మాదకద్రవ్యాల క్రయ విక్రయాలను తీవ్రంగా పరిగణిస్తోంది. ఒకప్పుడు ఏదైనా కేసులో దొరికిన డ్రగ్ పెడ్లర్ వద్దే దర్యాప్తు, విచారణ ఆగిపోయేది. తద్వారా మాదకద్రవ్యాల దందాకు కళ్లెం పడట్లేదని భావించిన పోలీసు విభాగం కొత్త పంథా అనుసరించడం మొదలెట్టింది. డ్రగ్స్ విక్రేతలు, ఖరీదు చేసే వారితో పాటు అనుమానితులకు సంబంధించిన ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. దీనికోసం ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం సైతం సమకూర్చుకుంది.ఏదైనా ఓ కేసులో డ్రగ్ సప్లయర్, పెడ్లర్, కన్జ్యూమర్లతో పాటు వీరితో సంబంధాలు కలిగి ఉన్న వారి వివరాలను ఆద్యంతం పరిశీలిస్తోంది. ఆయా వివరాలతో ప్రత్యేకంగా డేటాబేస్ సైతం రూపొందిస్తోంది. దాన్ని కేంద్రం ఆ«దీనంలోని క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్వర్క్ అండ్ ట్రాకింగ్ సిస్టంతో (సీసీటీఎన్ఎస్) అనుసంధానించింది. ఓ కేసు దర్యాప్తులో దొరికిన తీగ పోలీసు విభాగం కొన్నాళ్ల క్రితం అదుపులోకి తీసుకున్న ఓ డ్రగ్ వినియోగదారుడికి సంబంధించిన కాల్‌డేటాలో సదరు మీడియా సంస్థ అధినేత వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వినియోగదారుడితో ఈయన సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో పోలీసులు మరికొంత లోతుగా ఆరా తీశారు.దీంతో ఆయనకు ఈ డ్రగ్ వినియోగదారుడితో పాటు మరో రెండు కేసుల్లో ప్రమేయం ఉన్న 14 మందితో సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీరిలో డ్రగ్స్ వినియోగదారులతో పాటు ఆ కేసుల్లో అనుమానితులు సైతం ఉన్నారు. కొందరితో చాలా కాలంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు గుర్తించారని తెలిసింది. ఈ జాబితాలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాళ్లు సైతం ఉండటం గమనార్హం. కదలికలపై కన్ను డ్రగ్స్ దందా చేస్తున్న వారితో సంబంధాలు కలిగి ఉండటంతో పాటు మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన వారిలో ప్రముఖులు కూడా ఉంటున్నారు. ఉన్నత కుటుంబాల్లో ఈ జాఢ్యం ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తోంది. ఈ వర్గాల్లో పెరిగిన డిమాండ్‌తోనే సింథటిక్ డ్రగ్స్ దందా జోరందుకుంటోంది.ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే పోలీసులు ఇటీవలి కాలంలో ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఓ మీడియా సంస్థ అధినేతకే మాదకద్రవ్యాల వినియోగదారుడు, ఆ కేసుల్లో అనుమానితులతో సంబంధాలు ఉన్నట్టుగా తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయనతో పాటు ఆ జాబితాలోని వారిపై నిఘా ఉంచడంతో పాటు వారి కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. 2011 నుంచి సంబంధాలు మీడియా ఛానల్ అధినేతకు, మాదకద్రవ్యాల కేసుల్లో అనుమానితులు, వినియోగదారులుగా ఉన్న వారి మధ్య జరిగిన సంప్రదింపులు భారీ స్థాయిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 15 మందితో 2,500 కాల్స్ ఉన్నట్లు తెలిసింది. వీటిలో అత్యధికం ఇన్కమింగ్ కాల్స్ కాగా ఎస్సెమ్మెస్‌ల్లో మాత్రం ఎక్కువగా ఔట్ గోయింగ్ ఉన్నాయి. వీరిలో కొందరితో ఆయన 2011 నుంచి సంబంధాలు కలిగి ఉండటం గమనార్హం. వారి మధ్య వందల నిమిషాల సేపు సంప్రదింపులు జరిగాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారితోనూ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు ఉండటంతో పోలీసు విభాగం అప్రమత్తమైంది. -
రూ. 1,800 కోట్ల విలువైన భారీ డ్రగ్స్ పట్టివేత
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భోపాల్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీ నుంచి సుమారు 1,814 కోట్ల విలువైన భారీ డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటీఎస్), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), ఢిల్లీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్, వాటి తయారికి ఉపయోగించే ముడిసరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారని గుజరాత్ హోం సహాయ మంత్రి హర్ష్ సంఘవి ఆదివారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.Kudos to Gujarat ATS and NCB (Ops), Delhi, for a massive win in the fight against drugs!Recently, they raided a factory in Bhopal and seized MD and materials used to manufacture MD, with a staggering total value of ₹1814 crores!This achievement showcases the tireless efforts… pic.twitter.com/BANCZJDSsA— Harsh Sanghavi (@sanghaviharsh) October 6, 2024‘‘డ్రగ్స్‌పై పోరాటంలో భారీ విజయం సాధించిన గుజరాత్ ఏటీఎస్ , ఎన్సీబీ, ఢిల్లీ అధికారులకు అభినందనలు.వీరు భోపాల్‌లోని ఒక ఫ్యాక్టరీపై దాడి చేసి, ఎండీ, ఎండీ డ్రగ్స్ తయారీకి ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ మొత్తం విలువ రూ. 1814 కోట్లు ఉంటుందని అంచనా. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దుర్వినియోగాన్ని ఎదుర్కోవడంలో లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయి. సమాజ ఆరోగ్యం, భద్రతను కాపాడటంలో వారి ప్రయత్నం చాలా కీలకం. చట్టాన్ని అమలు చేసే సంస్థల అంకితభావం నిజంగా అభినందయం. భారతదేశాన్ని సురక్షితమైన, ఆరోగ్యకరమైన దేశంగా మార్చే వారి మిషన్‌కు మద్దతునిస్తూనే ఉందాం’’ అని అన్నారు.చదవండి: ఆపరేషన్ తోడేలు సక్సెస్.. ఊపిరి పీల్చుకున్న గ్రామస్థులు -
డ్రగ్స్ డబ్బుతో కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది: మోదీ
ముంబై:ఇటీవల ఢిల్లీలో పట్టుబడ్డ రూ. 500 కోట్ల విలువైన డ్రగ్స్ కేసు రాజకీయ మలుపు తిరుగుతోంది. డ్రగ్స్‌వ్యవహారంలో కాంగ్రెస్ నేతగా ఆరోపిస్తున్న తుషార్ గోయల్ అరెస్ట్ కావడమే అందుకు ప్రధాన కారణంగా మారింది. దీంతో డ్రగ్స్ కేసు కాస్తా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పొలిటికల్ ఫైట్‌గా మారింది. తాజాగా ఈ కేసును ప్రస్తావిస్తూ.. ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిప్పులు చెరిగారు.దేశంలోని యువతను కాంగ్రెస్.. మాదక ద్రవ్యాల వాడకం వైపు నెట్టేస్తోందని మండిపడ్డారు. దీని ద్వారా వచ్చే డబ్బును ఎన్నికల్లో గెలిచేందుకు ఉపయోగించాలని పార్టీ భావిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని మహారాష్ట్ర వాషిమ్ జిల్లాలో వివిధ ప్రాజెక్ట్‌లు ప్రారంభించిన మోదీ ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. ‘ఢిల్లీలో వేల కోట్ల విలువైన డ్రగ్స్ దొరికాయి. ఈ డ్రగ్స్ రాకెట్లో ప్రధాన నిందితుడు కాంగ్రెస్ నేత. యువతను డ్రగ్స్ వైపు నెట్టాలని, ఆ డబ్బుతో ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని కాంగ్రెస్ భావిస్తోంది’ అని దుయ్యబట్టారు.కాంగ్రెస్ పార్టీని అర్బన్ నక్సల్స్ ముఠా నడుపుతోందని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రమాదకరమైన ఎజెండాను ఓడించేందుకు ప్రజలు ఏకం కావాలని ఆయన కోరారు. ‘మనమంతా ఏకమైతే, దేశాన్ని విభజించాలనే వారి ఎజెండా విఫలమవుతుందని కాంగ్రెస్ భయపడుతోంది. భారతదేశం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని వ్యక్తులతో కాంగ్రెస్ ఎంత సన్నిహితంగా ఉంటోందో ప్రజలు అందరూ చూడగలరు* అని ఆయన పేర్కొన్నారు.చదవండి: Haryana: అభ్యర్థి చొక్కా చించిన మాజీ ఎమ్మెల్యేకాగా అక్టోబర్ 2న దక్షిణ ఢిల్లీలోని మహిపాల్‌పూర్‌లోని ఒక గోడౌన్లో ఢిల్లీ పోలీసులు దాడులు చేసి 560 కిలోగ్రాముల కొకైన్, 40 కిలోగ్రాముల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. 5,620 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడిగా కాంగ్రెస్‌తో సంబంధాలున్న తుషార్ గోయల్‌ను గుర్తించారు. అయితే గోయల్‌తో ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ ఖండించగా.. అతను గతంలో 2022 వరకు ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్‌కు ఆర్టీఐ సెల్ ఛైర్మన్‌గా పనిచేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తేలిసింది. -
ఢిల్లీలో డ్రగ్స్.. రూ. 2,000 కోట్ల కొకైన్ స్వాధీనం
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దాదాపు 2వేల కోట్ల విలువైన 565 కిలోల కొకైన్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. ఢిల్లీలో డ్రగ్స్ కలకలం చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలో బుధవారం మధ్యాహ్నం పోలీసులు 565 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ దాదాపు రూ.2000కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ భారీ కొకైన్ రవాణా వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ సిండికేట్ హస్తం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అయితే, ఇటీవలే ఢిల్లీలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు ఆప్ఘన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో వారి వద్ద నుంచి 400 గ్రాముల హెరాయిన్, 160 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, వారిద్దరినీ విచారించగా.. తాజా మాదకద్రవ్యాల బండారం బయటపడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు డ్రగ్స్ విషయంలో మరింత అప్రతమయ్యారు. Delhi Police busted an international drug syndicate and seized more than 560 kgs of cocaine. 4 people arrested. The cocaine is worth more than Rs 2000 Crores in the international market. Narco-terror angle being investigated: Delhi Police Special Cell— ANI (@ANI) October 2, 2024ఇది కూడా చదవండి: రాజస్థాన్‌లో హై అలర్ట్.. రైల్వేస్టేషన్లకు బాంబు బెదిరింపులు -
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు అరెస్ట్
డ్రగ్స్ కేసు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు చర్చనీయాంశమవుతూనే ఉంటుంది. కొన్నిరోజుల క్రితం బెంగళూరులో రేవ్ పార్టీలో నటి హేమ దొరికింది. ఈమెని పోలీసులు అరెస్ట్ చేసి కొన్నిరోజులు జైల్లో కూడా ఉంచారు. ఈమె కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు తేల్చారు. గతంలో పలుమార్లు ఇండస్ట్రీలో డ్రగ్స్ విషయమై ఎప్పటికప్పుడు కేసులు నడిచాయి. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటుడు అభిషేక్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)కేసు ఏంటి?ఐతే, నేను, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కాళిదాసు తదితర సినిమాల్లో నటించిన అభిషేక్.. 2012 డిసెంబరులో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. శ్రీనివాసులు అనే వ్యక్తితో కలిసి కారులో వెళ్తున్న సమయంలో పోలీసులు చెక్ చేయగా 10 ప్యాకెట్ల కొకైన్ దొరికింది. దీంతో అరెస్ట్ చేశారు. ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. అప్పట్లోనే బెయిల్ వచ్చింది కానీ బయటకొచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి గోవాకు మకాం మార్చాడు. రెస్టారెంట్ బిజినెస్ మొదలుపెట్టారు.అంతా బాగానే ఉంది కానీ డ్రగ్స్ కేసులో కోర్టు విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన తెలంగాణ న్యాబ్ పోలీసులు.. గోవాలో అభిషేక్‌ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇతడి స్వస్థలం ఉత్తరప్రదేశ్. కానీ తెలుగు సినిమాల్లో నటుడిగా బాగా ఫేమస్ అయ్యాడు.(ఇదీ చదవండి: హీరో పునీత్‌కు గుడి కట్టిన వీరాభిమాని) -
మరో 35 వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇస్తాం
-
దయచేసి ఆ ఒక్క తప్పు చేయకండి!
-
మీ దగ్గరికే వస్తా టెస్టులు చేయించండి.. హేమ కొత్త వీడియో
నటి హేమ మరో వీడియో రిలీజ్ చేసింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తన వైపు ఎలాంటి తప్పు లేదని, కావాలంటే టెస్టులు కూడా చేయించుకోవడానికి సిద్ధమని మీడియాకి రిక్వెస్ట్ చేసింది. దాదాపు ఆరు నిమిషాల వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆవేదన అంతా బయటపెట్టింది.హేమ కొత్త వీడియోకొన్నాళ్ల క్రితం బెంగళూరులోని రేవ్ పార్టీలో హేమ దొరికింది. కానీ ఆ టైంలో తాను వేరే చోట ఉన్నానని బుకాయించడానికి ప్రయత్నించింది. అయితే హేమ అప్పుడు పార్టీలో పాల్గొందని, డ్రగ్స్ కూడా తీసుకుందని పోలీసులు తేల్చారు. కొన్ని ఫొటోలు రిలీజ్ చేశారు. ఆ తర్వాత హేమని అరెస్ట్ చేసి కొన్నాళ్లు జైల్లో ఉంచారు. బెయిల్‌పై బయటకు వచ్చిన ఈమెపై ఈ మధ్య మరోసారి డ్రగ్స్ పాజిటివ్ వార్తలొచ్చాయి. ఇప్పుడు వాటిపై స్పందిస్తూ హేమ కొత్త వీడియో రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్.. ఆ మూడు కాస్త స్పెషల్)హేమ ఏం చెప్పింది?'గతంలో నాకు పాజిటివ్ వచ్చిందని మీడియా వాళ్లు ఏదైతే ప్రచారం చేశారో.. అదే పాత న్యూస్‌ని తీసుకొచ్చి మళ్లీ టెలికాస్ట్ చేస్తున్నారు. ఛార్జీషీట్ ఇంకా నేనే చూడలేదు. నా చేతికే రాలేదు. అలాంటిది మీ చేతికి ఎలా వచ్చింది? మీరు ఇలాంటి న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. నేను మీ దగ్గరికే వస్తాను. టెస్టులు చేయించండి. ఒకవేళ పాజిటివ్ వస్తే ఏ శిక్ష వేసినా భరిస్తాను. ఆ శిక్షని అనుభవిస్తాను. నెగిటివ్ వస్తే మీ పెద్దలందరూ కలిసి ఏం చేస్తారో మీరే నిర్ణయం తీసుకోండి''ఈ న్యూస్ వల్ల మా అమ్మకి యాంగ్జైటీ వచ్చింది. నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించాం. అలానే పరువు కోసం నేను చచ్చిపోతా. నా కుటుంబం తలదించుకునే పని ఈ రోజు వరకు చేయలేదు. ఇండస్ట్రీ నా వల్ల తలదించుకునే పని ఏ రోజు చేయలేదు. ఏ రోజు కూడా చేయను. గతంలో చేయలేదు. భవిష్యత్తులో చేయను కూడా. ఎక్కడికి రమ్మన్నా వస్తాను నేను రెడీ. నాకు టెస్టులు చేయించండి' అని హేమ దాదాపు 6 నిమిషాల వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న హీరో సిద్దార్థ్- హీరోయిన్ అదితీ రావ్ హైదరీ) View this post on Instagram A post shared by KOLLA HEMA (@hemakolla1211) -
8.5 కోట్ల విలువ చేసే డ్రగ్స్ పట్టివేత
-
8.5 కోట్ల విలువ చేసే డ్రగ్స్ పట్టివేత.. యువతకు సీపీ వార్నింగ్..
-
సినీ నటి హేమపై 'మా' సస్పెన్షన్ ఎత్తివేత
సినీ నటి హేమకు ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) శుభవార్త చెప్పింది. ఆమెపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసినట్లు మా ప్రకటించింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమెకు బెయిల్ కూడా రావడం జరిగింది. ఈ వివాదంలో చిక్కుకున్న హైమపై నైతికంగా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు చర్యలు తీసుకున్నారు. మా నుంచి ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని వారు ఆ సమయంలో తొలగించారు. అయితే, హేమకు నిర్వహించిన రక్త పరీక్షలలో నెగటివ్ వచ్చిందని అందుకు సంబంధించిన రిపోర్టులను కూడా ఆమె సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఆపై కోర్టు కూడా ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో హేమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు తాజాగా ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ప్రకటించింది. అయితే, మీడియాతో సెన్సిటివ్ విషయాల గురించి మాట్లాడవద్దని హేమకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సూచించింది. -
బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. కొత్త వీడియోతో నటి హేమ
కొన్నాళ్ల క్రితం బెంగళూరులోని రేవ్ పార్టీలో హేమ, పోలీసులకు పట్టుబడటం చర్చనీయాంశమైంది. దాదాపు 86 మంది ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు తేల్చారు. ఇందులో హేమ కూడా ఒకరని చెప్పిన పోలీసులు.. రెండుసార్లు నోటీసులు పంపించారు. ఎంతకీ రాకపోవడంతో అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. తర్వాత బెయిల్‌పై బయటకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా హేమ మరో వీడియో తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి రీమేక్ సినిమా.. ఎనిమిదేళ్ల తర్వాత తెలుగులో)బెంగళూరు రేవ్ పార్టీ విషయమై మాట్లాడుతూ.. తాను బహిరంగంగా ఎలాంటి పరీక్షలు చేయించుకోవడానికైనా సిద్ధమని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ కోసమే ఈ వీడియో చేశానని చెప్పింది. అలానే తాను చేయించుకున్న డ్రగ్ టెస్ట్ రిపోర్ట్స్‌ని వీడియోలో షేర్ చేసింది.మరి హేమ షేర్ చేసిన తాజా వీడియో బట్టి చూస్తే.. పోలీసులకు ఛాలెంజ్ చేసినట్లే అనిపిస్తోంది. ఎందుకంటే ఈమె డ్రగ్స్ తీసుకుందని పోలీసులు తేలిస్తే.. ఇప్పుడేమో హేమ తాను ఎలాంటి టెస్ట్‌లకైనా రెడీ అయిన వీడియో పెట్టింది. మరి ఈ కేసులో తర్వాత ఏం జరుగుతుందోనని నెటిజన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.(ఇదీ చదవండి: హీరోయిన్ జాన్వీకి డబ్బులివ్వబోయిన అభిమాని) View this post on Instagram A post shared by KOLLA HEMA (@hemakolla1211) -
కోటి రూపాయల డ్రగ్స్ సీజ్..
-
డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్
-
హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ రాకెట్ అరెస్ట్ 11 కోట్ల డ్రగ్స్ సీజ్
-
నార్సింగి డ్రగ్స్ కేసులో వీఐపీలు!
సాక్షి, హైదరాబాద్: నార్సింగి డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నైజీరియా డ్రగ్ పెడ్లర్ల నుంచి మరో 30 మంది ప్రముఖులు డ్రగ్స్ తీసుకొని వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఆఫ్రికా దేశాల నుంచి మాదక ద్రవ్యాలను గోవా, ముంబై, ఢిల్లీ మీదుగా డ్రగ్స్ తరలించి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ముఠాను నార్సింగి, తెలంగాణ నార్కోటిక్ బ్యూరో (టీజీ న్యాబ్) పోలీసులు ఈనెల 16న పట్టుకున్న సంగతి తెలిసిందే. నిందితుల నుంచి రూ.కోట్లు విలువ చేసే 199 గ్రాముల కొకైన్‌ను స్వా«దీనం చేసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నైజీరియన్ పెడ్లర్లు అనౌహా బ్లెస్సింగ్, అజీజ్ నోహీమ్ అడేషోలాలతో పాటు బెంగళూరుకు చెందిన అల్లం సత్యవెంకట గౌతమ్, బోరబండకు చెందిన సానబోయిన వరుణ్ కుమార్, కొరియోగ్రాఫర్ మహ్మద్ మహబూబ్ షరీఫ్‌లను అరెస్టు చేశారు. సెల్ఫోన్లలో డేటాతో.. అరెస్టు సమయంలో నిందితుల సెల్ఫోన్లు, ఇతరత్రా ఎల్రక్టానిక్ ఉపకరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులోని వాట్సాప్ చాట్స్, సందేశాలు, బ్యాంకు లావాదేవీలను పోలీసులు విశ్లేషించారు. దీంతో మరో 30 మంది వీఐపీల పేర్లు బయటికి వచ్చాయి. వీరంతా హైదరాబాద్, బెంగళూరు నగరాలకు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధులు, వ్యాపారస్తులుగా గుర్తించారు. దీంతో వీరందరికీ నోటీసులు ఇచ్చి, విచారించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. అమన్‌తో సహా మరో 20 మంది.. డ్రగ్ పెడ్లర్ల నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన మరో 20 మంది మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసి సేవిస్తున్నట్లు పోలీసులు గతంలోనే గుర్తించారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురికి డ్రగ్స్ సేవించినట్లు పాజిటివ్ వచి్చంది. దీంతో నిందితులను రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచారు. ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్ ప్రీత్‌సింగ్‌తో పాటు ఫిల్మ్‌నగర్‌కు చెందిన కిషన్ రాఠీ, బంజారాహిల్స్‌కు చెందిన అని, గచి్చ»ౌలికి చెందిన ఆలుగడ్డల రోహిత్, గండిపేటకు చెందిన శ్రీచరణ్, బంజారాహిల్స్‌కు చెందిన ప్రసాద్, ఫిల్మ్‌నగర్‌కు చెందిన హృతిక్ కుమార్, పంజగుట్టకు చెందిన నిఖిల్ దావన్, గచి్చబౌలికి చెందిన మధురాజు, రఘు, కనుమూరి కృష్ణంరాజు, వెంకట సత్యనారాయణ డ్రగ్స్ వినియోగిస్తున్నవారిలో ఉన్నారు. నైజీరియా నుంచి డ్రగ్స్‌ను సరఫరా చేసిన ప్రధాన సూత్రధారులు ఎబుకా సుజీ, ఫ్రాంక్లిన్‌లు ఇంకా పరారీలోనే ఉన్నారు. బండ్లగూడ నుంచే చెల్లింపులు.. డ్రగ్స్ కింగ్‌పిన్ ఎబుకా సుజీ నుంచి బ్లెస్సింగ్‌కు డ్రగ్స్ సరఫరా జరుగుతుంది. ఈమె విమానాలు, రైళ్లు, బస్సులో ప్రయాణం చేస్తూ హైదరాబాద్‌కు డ్రగ్స్‌ను రవాణా చేస్తోంది. ఇప్పటివరకు బ్లెస్సింగ్ 20 సార్లు నగరానికి మాదక ద్రవ్యాలను తీసుకొచ్చింది. ఈమె నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి గౌతమ్ అనే డ్రగ్ పెడ్లర్ వీటిని ఏపీలో రాజమహేంద్రవరం, ప్రకాశం జిల్లాల్లో వినియోగదారులకు విక్రయిస్తున్నాడు. ఇందుకుగాను గౌతమ్‌కు నైజీరియన్ నుంచి 9 నెలల్లో రూ.10 లక్షల కమీషన్ అందిందని, బండ్లగూడలోని లుంబినీ కమ్యూనికేషన్స్ ద్వారా నగదు చెల్లింపులు జరిగినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. -
నార్సింగి కేసులో కీలక మలుపు.. 50 మంది సెలబ్రిటీల గుర్తింపు!
హైదరాబాద్, సాక్షి: నార్సింగి డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో మరికొందరు ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాళ్లందరికీ నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని భావిస్తున్నారు. ఈ కేసులో ప్రముఖ నటి రకుల్ ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్ సైతం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. నార్సింగి డ్రగ్స్ కేసులో అమన్ సహా పలువురిని జులై 15వ తేదీన జాయింట్ ఆపరేషన్‌తో అరెస్ట్ చేశారు. వాళ్లు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ టైంలో 19 మంది ప్రముఖులకు పోలీసులు నోటీసులు పంపించారు. తాజాగా.. నిందితులు మరో 30 మంది సెలబ్రిటీల పేర్లు వెల్లడించారు. ఇందులో ప్రముఖ కంపెనీల యాజమానులు సైతం ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ కేసులో సెలబ్రిటీల సంఖ్య 50కి చేరినట్లయ్యింది. -
బాబు.. విశాఖలో బ్రెజిల్ డ్రగ్స్ కంటైనర్ కేసు సంగతేంటి?: మాజీ మంత్రి బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల సమయంలో విశాఖపోర్టుకు అక్రమంగా బ్రెజిల్ నుంచి వచ్చిన మాదకద్రవ్యాలతో కూడిన కంటెయినర్ కేసు ఏమైందో ప్రభుత్వం విచారణ చేపట్టాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. సుమారు 25 కిలోల చొప్పున వేయి బ్యాగులను కంటెయినర్లో మాదకద్రవ్యాలతో కూడి సరుకు విశాఖ పోర్టుకు రాగా... కేంద్ర దర్యాప్తుసంస్ధ సీబీఐతో పాటు ఇంటర్‌పోల్ పట్టుకున్న విషయాన్ని బొత్స గుర్తుచేశారు.గతంలో మేం అధికారంలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వమే చేసిందని.... ఆరోపణలు కూడా చేశారని... అధికార పక్షంతో పాటు విపక్షంలో ఉన్నవారు కూడా వీటిపై పరస్పర ఆరోపణలు చేసుకున్నారన్నారు. ఈ వ్యవహరంలో భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి బంధువులకు చెందిన సంధ్యా ఆక్వా ఎక్ట్స్పోర్ట్ లిమిటెడ్ సంస్ధ దిగుమతి చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చిన విషయాన్ని బొత్స గుర్తుచేశారు.ఈ మొత్తం వ్యవహారంపై ఒకవైపు అధికారులు విచారణ చేపట్టడంతో పాటు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో ఉత్తరాంధ్రాకు చెందిన ఎంపీలు దీనిపై పార్లమెంట్లో ప్రశ్నించాలని ఆయన డిమాండ్ చేసారు. రూ.25వేల కోట్లకు సంబంధించిన వ్యవహారంపై వాస్తవాలు ఏమిటి? ఇందులో ఎవరిపాత్ర ఉంది? నిందితులను ఎందుకు ఉపేక్షిస్తున్నారో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ విచారణలో ఆ ఆరోపణలు వాస్తవం కాకపోతే విశాఖపట్నం క్లీన్ ఇమేజ్ నిలబడుతుందన్నారు.దేశంలో ఎక్కువగా డ్రగ్స్ దిగుమతి అయిన చరిత్ర గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఉన్న పోర్టులకు ఉంద తప్ప.. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఎప్పుడూ ఇలాంచి ఘటనలు జరగలేదన్నారు. దీన్ని రాజకీయ కోణంలో చూడరాదన్నారు. విశాఖలో తొలిసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు... అధికార పార్టీకి చిత్తశుద్ధి ఉంటే స్ధానికనాయకత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని, పార్లమంటు సభ్యులైతే పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తి విచారణకు డిమాండ్ చేయాలని సూచించారు. ఈ విషయంలో ఏ పార్టీ మీద బురదజల్లడం లేదని... నిజంగా ఇక్కడి ప్రజాప్రతినిధులు విశాఖపట్నంతో పాటు రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా మాదకద్రవ్యాల దిగుమతిపై సమగ్రమైన విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.మరోవైపు ఎన్నికలు అయిన దగ్గర నుంచి భూఆక్రమణలు జరిగాయని కొందరు, మరికొందరైతే దసపల్లా భూముల గురించి దోపిడీకి గురయ్యాయంటూ వార్తలు వచ్చిన విషయాన్ని బొత్స ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన విశాఖపట్నంలో గతంలో హుద్‌హుద్ తుఫాను తర్వాత వచ్చిన భూకుంభకోణాన్ని ప్రస్తావించారు. హుథ్‌హుథ్ తుఫాను వచ్చిన తర్వాత ఆ రోజు ఉన్న అధికార తెలుగుదేశం పార్టీలో ఉన్నవారే భూ కుంభకోణంపై పరస్పర ఆరోపణలు చేసుకోగా.. అప్పటి టీడీపీ ప్రభుత్వం దానిపై సిట్ ఏర్పాటు చేసి ఏడాది పాటు దర్యాప్తు చేశారన్నారు. ఆ తర్వాత అనేకరకాల పరిణామాలు చోటుచేసుకుని.. దర్యాప్తునకు సంబంధించిన టెర్మ్స్ ఆఫ్ కండిషన్స్ మార్పు చేసి 2004 నుంచి కూడా విశాఖపట్నం ప్రాంతంలో జరిగిన భూ ఆక్రమణలు గురించి కూడా దర్యాప్తు చేయాలని నిర్ణయించారని తెలిపారు. అంటే 2004 నుంచి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రులగా మేం ఉన్న నేపధ్యంలో ఆ అంశాన్ని కూడా తెరపైకి తెచ్చారన్నారు.అయితే ఇప్పుడు విశాఖలో భూఆక్రమణలు అంశం మరలా తెరపైకివచ్చిన నేపధ్యంలో.. నిజంగా చిత్తశుద్ధి ఉంటే గతంలో నియమించిన సిట్ దర్యాప్తును మరలా కొనసాగించాలన్నారు. అలా చేస్తే ఎవరు తప్పు చేశారో తేలిపోతుందని.. అప్పుడే ఉత్తరాంధ్రా ప్రజలకు దొర ఎవరో, దొంగెవరో తెలుస్తుందని బొత్స స్పష్టం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం దేనిమీదైనా విచారణ చేసుకోవచ్చన్నారు. అప్పుడు ఈ సందిగ్దతకు తావులేకుండా తప్పుచేసినవాళ్లెవరో తేలిపోతుందన్నారు. ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కాబట్టి... విచారణకు ఆదేశించుకోవచ్చన్నారు. తప్పుచేసినవారు దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తారని.. లేని పక్షంలో ఒకవేళ తప్పుడు అభియోగాలైతే కోర్చుల్లో తేల్చుకుంటారని స్పష్టం చేసారు. అలా కాకుండా పదే పదే మీడియా ముందుకు వచ్చి భూముల కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేయడం ద్వారా ప్రజల్లో అపోహలు సృష్టించడం సరికాదన్నారు. -
నార్సింగి డ్రగ్స్ కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు
సాక్షి, హైదరాబాద్: నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మొత్తం 20 మంది నిందితులు కాగా, వారిలో ఏడుగురు పెడ్లర్లు, 13 మంది కన్యుమర్లు.. ఏ 10గా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్‌ను పోలీసులు చేర్చారు.నైజీరియా-ఢిల్లీ-హైదరాబాద్-ఏపీ లోని పలు ప్రాంతాలకు డ్రగ్స్‌ను చేరవేస్తున్నారు. ఎబుకా, బ్లెస్సింగ్, ఫ్రాంక్లిన్, అజీజ్, గౌతం, వరుణ్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. వరుణ్, గౌతం, షరీఫ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ దందా సాగుతోంది. పెడ్లర్లను ఆర్థికంగా ఆదుకుంటున్న నైజీరియన్లు.. వారికి కావాల్సిన డబ్బును అరేంజ్ చేసి డ్రగ్ సరఫరాకు ప్రోత్సహిస్తున్నారు. డ్రగ్స్ సరఫరాకు కింగ్‌పిన్‌గా నైజీరియాకు చెందిన ఎబుకాగా పోలీసులు పేర్కొన్నారు. ఎబుకా నుండి బ్లెస్సింగ్ అనే మరో నైజీరియన్ ద్వారా ఇండియాలోని రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు 20 సార్లు హైదరాబాద్‌లో డ్రగ్స్ సప్లై చేసినట్టు బ్లెస్సింగ్ అంగీకరించాడు. గౌతమ్ అనే డ్రగ్ పెడ్లర్ ద్వారా రాజమండ్రి, హైదరాబాద్, ప్రకాశం జిల్లాకు డ్రగ్స్ చేరుతున్నాయి.9 నెలల్లో 10 లక్షల రూపాయలను కమిషన్ రూపంలో డ్రగ్ పేడ్లర్ గౌతంకు నైజీరియన్ ముట్టచెప్పాడు. బండ్లగూడలో ఉన్న లుంబిని కమ్యూనికేషన్స్ ద్వారా డబ్బులు చెల్లించారు. వరుణ్ నుండి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, గచ్చిబౌలిలోని కస్టమర్లకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. తన స్నేహితురాలి పేరును తన పేరుగా బ్లెస్సింగ్ మార్చుకుంది. తండ్రి బస్సు డ్రైవర్ కావడంతో ఆర్థిక సమస్యలు కారణంగా ఇంటర్ వరకు చదువుకున్నాడు. 2017లో ఫేస్ బుక్‌లో బ్లెస్సింగ్ అనే మహిళతో పరిచయం అయ్యింది. బెంగుళూరు వచ్చి బ్లెస్సింగ్ అనే స్నేహితురాలి బట్టల దుకాణంలో ఒనుహా పని చేశాడు. -
డ్రగ్స్ కేసులో కీలక మలుపు గుర్తించిన ఏడు పబ్బులు, రకుల్ తమ్ముని పాత్ర..
-
డ్రగ్స్ కేసులో 18 మందికి రిమాండ్
మణికొండ: నైజీరియా నుంచి గోవా, ముంబై, ఢిల్లీల మీదుగా డ్రగ్స్ తరలించి హైదరాబాద్‌లో విక్రయిస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న 18 మంది సభ్యుల ముఠాను నార్సింగి, రాజేంద్రనగర్ డివిజన్ ఎస్ఓటీ, మాదకద్రవ్యాల నిరోధక శాఖల పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలించారు. సోమవారం వారిని నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్, విశాల్‌నగర్ కాలనీలోని జెనాబ్ ఫోర్ట్ వ్యూ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 202లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిందితుల నుంచి రూ.2 కోట్ల విలువ చేసే 199.10 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోగా, మంగళవారం గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. డ్రగ్స్ కొనుగోలు చేసిన 13 మందిలో ఆరుగురికి పాజిటివ్ అని వచి్చంది. అనంతరం నిందితులను రాజేంద్రనగర్‌లోని కోర్టులో హాజరుపరిచారు. డ్రగ్స్ సరఫరా దారులు వీరే... డ్రగ్స్ కేసులో ఏ1గా అనౌహ బ్లెస్సింగ్ అనే మహిళ, ఏ2గా నిజాం కళాశాలలో బీకాం ఫైనలియర్ చదువుతున్న అజీజ్ నోహీమ్ అడేషోలా, ఏ3గా బెంగుళూరుకు చెందిన అల్లం సత్యవెంకట గౌతమ్, ఏ4గా బోరబండకు చెందిన సానబోయిన వరుణ్‌కుమార్, ఏ5గా ఈవెంట్ కొరియోగ్రాఫర్ మహ్మద్ మహబూబ్ షరీఫ్ ఉన్నారని, వీరంతా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కాగా, సినీహీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్‌సింగ్, ఫిల్మ్‌నగర్‌కు చెందిన కిషన్ రాఠీ, బంజారాహిల్స్‌కు చెందిన అని, గచి్చబౌలికి చెందిన యశ్వంత్ గాడె, జూబ్లీహిల్స్‌కు చెందిన ఆలుగడ్డల రోహిత్, గండిపేటకు చెందిన శ్రీచరణ్, బంజారాహిల్స్‌కు చెందిన ప్రసాద్, ఫిల్మ్‌నగర్‌కు చెందిన హృతిక్కుమార్, పంజగుట్టకు చెందిన నిఖిల్ ధావన్, గచి్చ»ౌలికి చెందిన మధురాజు, రఘు, కనుమూరి కృష్ణంరాజు, వెంకట సత్యనారాయణ డ్రగ్స్ వినియోగిస్తున్నవారిలో ఉన్నారని తెలిపారు. వీరి పేర్లను ఏ6 నుంచి ఏ18 వరకు కేసులో పొందుపరిచారు. వీరి నుంచి 10 సెల్ ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలు, ఓ పాస్‌పోర్టును సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. -
కోర్టు బోనులో రకుల్ తమ్ముడు..
-
సాక్షి చేతిలో డ్రగ్స్ కేసు FIR 18 మందిలో రకుల్ తమ్ముడి పేరు
-
Hyderabad Drugs case: నాడు రకుల్... నేడు అమన్!
సాక్షి, సిటీబ్యూరో: టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గతంలో డ్రగ్స్ విక్రయం, వినియోగం ఆరోపణలపై అనేక మంది సినీ రంగానికి చెందిన వాళ్లు అరెస్టు అయ్యారు. కొన్నేళ్ల క్రితం ప్రముఖ నటి రకుల్ ప్రీత్‌సింగ్‌పై ఈ తరహా ఆరోపణలే రాగా...తాజాగా సోమవారం ఆమె సోదరుడు అమన్‌ప్రీత్ సింగ్ డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు తేలడంతో అరెస్టు అయ్యాడు. ఇతడు మాదకద్రవ్యాలు ఖరీదు చేసిన పెడ్లర్స్ ముఠాలో అనేక మందిపై గతంలోనూ కేసులు ఉన్నట్లు రాజేంద్రనగర్ పోలీసులు ప్రకటించారు. పలువురిపై గతంలోనూ కేసులు...సోమవారం చిక్కిన ఐదుగురు డ్రగ్ పెడ్లర్స్‌లో కొందరిపై గతంలోనూ కేసులు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రధాన సూత్రధారి అయిన డివైన్ ఎబుక సుజీపై వివిధ నగరాల్లో ఏడు డ్రగ్ కేసులు ఉన్నాయి. ఇతడికి ప్రధాన ఏజెంట్‌గా ఉన్న అనోహ బ్లెస్సింగ్‌పై 2019లో ధూల్‌పేట ఎకై ్సజ్ పోలీసులు ఇలాంటి కేసే నమోదు చేశారు. పెడ్లర్స్లోఒకడైన నిజాం కాలేజీ విద్యార్థి అజీజ్ నోహీమ్ అడెషోలా (నైజీరియన్) గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో చదివాడు. అప్పట్లో ఫీజు చెల్లించడం కోసం నకిలీ డీడీ తయారు చేసి ఇచ్చి అరెస్టు అయ్యాడు. ఈ కేసులో కింది కోర్టు శిక్ష వేయగా.. ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేశాడు. అల్లం సత్య వెంకట గౌతమ్‌పై కేపీహెచ్‌బీ ఠాణాలో మహిళను వేధించిన కేసు, వరుణ్ కుమార్‌పై బండ్లగూడకు చెందిన ఈవెంట్స్ కొరియోగ్రాఫర్ మహ్మద్ మెహబూబ్ షరీఫ్‌లకు పంపిణీ చేస్తోంది. వరుణ్ కుమార్‌పై కేపీహెచ్బీలో, షరీఫ్‌పై జూబ్లీహిల్స్, మాదాపూర్‌ల్లో కేసులు ఉన్నాయి.రకుల్ వ్యవహారం ఇలా...నగరానికి చెందిన అనేక మంది ప్రముఖులు, సినీ రంగానికి చెందిన వారికి డ్రగ్స్ సరఫరా చేసిన కెల్విన్‌తో సహా మరికొందరిని ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 2017 జూలై 2న అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన కేసులు దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు విభాగం (సిట్) అప్పట్లో 10 మంది సినీ ప్రముఖులతో పాటు అనేక మందికి నోటీసులు ఇచ్చి విచారించింది. ఆ జాబితాలో లేని రకుల్ పేరు ఆ తర్వాత చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో వెలుగులోకి వచ్చింది. 2020లో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వ్యవహారంలో డ్రగ్స్ కోణం వెలుగులోకి రావడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు మరో కేసు నమోదు చేశారు. ఇందులో సుశాంత్ సింగ్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిని అరెస్టు చేశారు. ఈమె విచారణతో పాటు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్‌సింగ్ తదితరులకు సమన్లు జారీ చేశారు. అదే ఏడాది సెప్టెంబర్ 25న ముంబైలో ఎన్సీబీ విచారణకు రకుల్ హాజరయ్యారు. 2021 సెప్టెంబర్‌లో హైదరాబాద్ ఈడీ అధికారులు రకుల్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించారు.కొకై న్ వినియోగదారుడిగా చిక్కిన అమన్...టీజీఏఎన్‌బీ, సైబరాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు సోమవారం చేపట్టిన ఆపరేషన్‌లో నైజీరియన్లు డివైన్ ఎబుక సుజీ, ఫ్రాంక్లిన్ సూత్రధారులుగా ఉన్న డ్రగ్ నెట్‌వర్క్‌ను ఛేదించారు. ఈ ఇద్దరూ పరారీలో ఉండగా...అనోహ బ్లెస్సింగ్, అజీజ్, గౌతమ్, వరుణ్, షరీఫ్‌లను అరెస్టు చేసి 199 గ్రాముల కొకై న్ స్వాధీనం చేసుకున్నారు. వీరి విచారణ నేపథ్యంలో అమన్‌ప్రీత్ సింగ్‌తో పాటు కిషన్ రాఠి, అనికాంత్, యశ్వంత్, రోహిత్, శ్రీ చరణ్, ప్రసాద్, హేమంత్, నిఖిల్, మధు, రఘు, కృష్ణం రాజు, వెంకట్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీళ్లు క్రమం తప్పకుండా తమ వద్ద నుంచి కొకై న్ ఖరీదు చేసి వినియోగిస్తున్నట్లు నిందితులు బయటపెట్టారు. దీంతో గాలించిన సైబరాబాద్ పోలీసులు అమన్ ప్రీత్ సింగ్‌తో సహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. తమ వద్ద ఉన్న కిట్ ద్వారా మూత్ర పరీక్ష చేయగా..వీళ్లు తరచు కొకై న్ వాడుతున్నట్లు రిపోర్టు వచ్చింది. దీంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించిన పోలీసులు వీరిని డ్రగ్స్ వినియోగదారులుగా చేర్చి అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వినియోగదారుల్లోనూ సినీ, వ్యాపార ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. -
డ్రగ్స్ కేసులో రకుల్ సోదరుడు అమన్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్‌బీ), సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ), రాజేంద్రనగర్ పోలీసులు చేపట్టిన ఉమ్మడి ఆపరేషన్‌లో ఐదుగురు డ్రగ్ పెడ్లర్స్ చిక్కారు. వీరి విచారణలో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు, టాలీవుడ్ నటుడు అమన్ ప్రీత్ సింగ్ సహా 13 మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిలో అమన్ సహా ఐదుగురిని పరీక్షించగా, వారు డ్రగ్స్ వినియోగించినట్లు తేలింది. దీంతో ఈ ఐదుగురినీ నిందితులుగా చేర్చి అరెస్టు చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ పేర్కొన్నారు. డ్రగ్ పెడ్లర్స్‌లో కొందరు స్థానికులూ ఉన్నారని, పరారీలో ఉన్న ఇద్దరు ప్రధాన సూత్రధారుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఆయన ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. విదేశాల నుంచి తెప్పించి... నైజీరియాకు చెందిన డివైన్ ఎబుక సుజీ, ఫ్రాంక్లిన్‌లు బిజినెస్, స్టడీ వీసాలపై హైదరాబాద్‌కు వచ్చారు. కొన్నాళ్లు నగరంలోని పారామౌంట్‌కాలనీలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఢిల్లీలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. విదేశాల నుంచి కొకైన్ సహా వివిధ రకాలైన డ్రగ్స్ ఖరీదు చేస్తున్న వీళ్లు తమ ఏజెంట్ల ద్వారా దేశవ్యాప్తంగా అనేక మంది పెడ్లర్స్‌కు సరఫరా చేస్తున్నారు. నైజీరియా నుంచి వచ్చి బెంగళూరులో హోమ్ సర్వీస్ పని చేస్తున్న అనోహ బ్లెస్సింగ్ వీరికి ప్రధాన ఏజెంట్‌గా ఉంది. ఈమె హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, గోవాల్లో ఉన్న పెడ్లర్స్, సెల్లర్స్‌కు మాదకద్రవ్యాలు సరఫరా చేసింది. ఏడాదిన్నర కాలంలో 20 సార్లు నగరానికి మాదకద్రవ్యాలు తెచ్చింది. డ్రగ్స్‌ను హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకుని, విమానాలు, రైళ్లలో తిరుగుతూ సప్లై చేస్తుంటుంది. ఈ డ్రగ్స్‌ను నిజాం కాలేజీ విద్యార్ధిగా ఉన్న నైజీరియన్ అజీజ్ నోహీమ్ అడెషోలా, బెంగళూరులో ఉంటూ ఓ కంపెనీకి లీడ్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న విశాఖ వాసి అల్లం సత్య వెంకట గౌతమ్, అమలాపురం నుంచి వచ్చి నగరంలో నివసిస్తున్న కారు డ్రైవర్ సనబోయిన వరుణ్ కుమార్, బండ్లగూడకు చెందిన ఈవెంట్స్ కొరియోగ్రాఫర్ మహ్మద్ మెహబూబ్ షరీఫ్‌లకు పంపిణీ చేస్తోంది. వీళ్లు తమ వినియోగదారులకు వీటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గ్రాముకు రూ.500 కమీషన్ 2018 నుంచి ఈ దందాలో ఉన్న అనోహ ఆఫ్రికా నుంచి జోయినా గోమెస్ పేరుతో నకిలీ పాస్‌పోర్టు తీసుకుని వినియోగిస్తోంది. తరచూ బెంగళూరు–హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తున్న గౌతమ్... అనోహ ద్వారా అందుకున్న డ్రగ్స్‌ను పెడ్లర్స్‌కు సరఫరా చేస్తున్నాడు. ఒక్కో గ్రాముకు రూ.500 చొప్పున కమీషన్ తీసుకుంటూ డెలివరీ ఇస్తున్నాడు. ఇటీవలే ఇద్దరు నైజీరియన్లు ఇతడి బ్యాంకు ఖాతాలోకి రూ.13.24 లక్షల కమీషన్‌ను ట్రాన్స్ఫర్ చేశారు. ఇతడు ఐదు నెలల క్రితమే ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఆమె బ్యాంకు ఖాతాలోకీ రూ.2.5 లక్షల కమీషన్ డిపాజిట్ చేయించాడు. ఇతడు గత ఏడు నెలల్లో 2.6 కేజీల కొకైన్ క్రయవిక్రయాలు చేసినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. వరుణ్ కుమార్‌కు తన వినియోగదారుడైన మధు ద్వారా గౌతమ్‌తో పరిచయం ఏర్పడింది. అలా ఈ దందాలోకి వచ్చిన ఇతడు నైజీరియన్ల నుంచి గ్రాము రూ.8 వేలకు ఖరీదు చేసి, రూ.12 వేలకు విక్రయిస్తున్నాడు. ఇలా ఆరు నెలల కాలంలో రూ.7 లక్షల వరకు ఆర్జించాడు. నగరంలో 13 మంది... వీరి దందాపై టీజీఏఎన్‌బీ అధికారులకు సమాచారం అందింది. దీంతో సోమవారం హైదర్షాకోట్లోని ఓ అపార్ట్‌మెంట్‌పై దాడి చేశారు. అక్కడ ఎబుక, ఫ్రాంక్లిన్ మినహా మిగిలిన ఐదుగురూ చిక్కారు. వీరి నుంచి 199 గ్రాముల కొకైన్, వాహనాలు, సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. ఈ పెడ్లర్స్ విచారణలో 13 మంది నగరవాసులు తమ నుంచి తరచూ డ్రగ్స్ ఖరీదు చేసి వినియోగిస్తున్నట్లు బయటపెట్టారు. వీరిలో బంజారాహిల్స్‌కు చెందిన బిల్డర్ అనికేత్ రెడ్డి, కన్స్ట్రక్షన్ వ్యాపారి ప్రసాద్, సినీ నటుడు అమన్‌ప్రీత్ సింగ్, మాదాపూర్ వాసి మధుసూదన్, పంజగుట్టకు చెందిన నిఖిల్ దావన్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు డ్రగ్ టెస్ట్ చేయగా... కొకైన్ వాడుతున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వీరిని అరెస్టు చేసిన అధికారులు పరారీలో ఉన్న సూత్రధారుల కోసం గాలిస్తున్నారు. డ్రగ్స్‌పై సమాచారం తెలిస్తే 8712671111కు తెలపాలని కోరారు. ఎబుక, ఫ్రాంక్లిన్ సమాచారం అందిస్తే రూ.2 లక్షల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. కాగా, సూత్రధారులిద్దరూ నైజీరియా పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్‌కు డ్రగ్స్ పాజిటివ్: పోలీసులు
సాక్షి, హైదరాబాద్: వీఐపీలే టార్గెట్‌గా హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడినట్లు పేర్కొన్నారు. సోమవారం హైదర్షాకోట్లో దాడులు చేశామని, ఇద్దరు నైజీరియన్లు సహా డ్రగ్స్ అమ్ముతున్న అయిదుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితుల నుంచి 199 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 2 పాస్‌పోర్టులు, 10 సెల్ఫోన్లు, 2 బైక్‌లు సీజ్ చేసినట్లు వెల్లడించారు.డ్రగ్స్‌ను నైజీరియన్ మహిళ అనోహ బ్లెస్సింగ్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె ఫేక్ పాస్పోర్టుతో నైజీరియా నుంచి హైదరాబాద్ వచ్చినట్లు చెప్పారు. 2019 నుంచి ఆమె డ్రగ్స్ సరాఫరా చేస్తోందని తెలిపారు. ముంబై, గోవా, బెంగళూరు ద్వారా ఆరు నెలల్లో 2.6 కిలోల కొకైన్‌ను హైదరాబాద్‌కు నైజీరియన్ మహిళా తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఈ ఆరు నెలల్లో 30 మంది వీఐపీ కస్టమర్లకు కొకైన్ సరాఫరా చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు.డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు. అమన్ ప్రీత్ సింగ్‌తోపాటు డ్రగ్స్ తీసుకున్న కిషన్ రాటి, అంకిత్, యశ్వంత్, రోహిత్, శ్రీ చరణ్, ప్రసాద్ ,హేమంత్, నిఖిల్ దావన్, మధు, రఘు కృష్ణంరాజు వెంకట్.. మరో అరుగురుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అంకిత్, అమన్ ప్రీత్ సింగ్, ప్రసాద్, నిఖిల్ ధావన్ సహా మరో ఇద్దరిపై కేసు నమోదు చేశామని తెలిపారు.ఇక డ్రగ్స్ సరాఫరా చేసిన అనోహా బ్లెస్సింగ్, నిజాం కాలేజీ విద్యార్థి అబీజ్ నోహం, బెంగళూరు లీడ్ కన్సల్టెన్సీ సీఈవో అల్లం సత్య వెంకట గౌతమ్, టాలీవుడ్ కొరియోగ్రాఫర్ మహ్మద్ మహబూబ్ షరీఫ్, సానబోయిన వరుణ్ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సత్య వెంకట గౌతమ్‌పై గతంలో కూడా కేసులు ఉన్నాయని చెప్పారు.డ్రగ్స్ గ్యాంగ్‌కు చెందిన కీలక సూత్రధాని ఏబుక సుజి పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఏబుక సుజిపై రూ. 2 లక్షల రివార్డు ఉందని తెలిపారు. డ్రగ్స్ తీసుకుంటున్న అయిదుగురు నుంచి శాంపిల్స్ తీసుకోగా.. అయిదుగురికి కూడా కొకైన్ పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. అమన్ ప్రీత్ సింగ్‌ను పరీక్షిస్తే.. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. అమన్ ప్రీత్ సింగ్‌ను డ్రగ్స్ వినియోగదారుడిగా పరిగణిస్తున్నామని.. పెడ్లర్‌గా ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదని అన్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం డ్రగ్స్ వినియోగదారుడైనా నిందితుడేనని తెలిపారు. -
24 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ
-
డ్రగ్స్ కేసులో సంజనకు ఊరట
యశవంతపుర: మత్తు పదార్థాలను సేవించిన కేసులో నటి సంజనా గల్రానితో పాటు వ్యాపారవేత్తలు శివప్రకాశ్, ఆదిత్య మోహన్ అగర్వాల్‌పై దాఖలైన కేసును హైకోర్టు కొట్టేసింది. దీంతో నటికి పెద్ద ఊరట కలిగింది. తమపై దాఖలైన డ్రగ్స్ కేసును రద్దు చేయాలని కోరుతూ వీరు గతంలో పిటిషన్లు దాఖలు చేశారు. న్యాయమూర్తి హేమంత్ చందన గౌడర్ ధర్మాసనం కేసును విచారించింది. సంజనపై బెంగళూరు పోలీసులు 2020 ఏప్రిల్, సెప్టెంబర్‌లో కేసులు నమోదు చేశారు. 2015, 2018, 2019లోను వీరు డ్రగ్స్ సేవించారంటూ అక్రమంగా కేసులు నమోదు చేశారని వారి తరఫున వకీలు వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి వారిపై కేసులను రద్దు చేశారు. -
డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం
-
డ్రగ్స్ ఉచ్చులో డీజే సిద్ధార్థ్
-
హేమను ఒక్కరోజు విచారించండి చాలు: కోర్టు
బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమను విచారించేందుకు బెంగళూరు నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) పోలీసులకు అనుమతి లభించింది. బెంగళూరు నగర శివార్లలో ఇటీవల జరిగిన రేవ్‌పార్టీలో హేమ మాదక ద్రవ్యాలను తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఆమె రక్తనమూనాలను సేకరించి వైద్య పరీక్షకు పంపించగా మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు రిపోర్ట్ వచ్చింది.సీసీబీ పోలీసులు పలుమార్లు నోటీసులు పంపగా ఎట్టకేలకు హేమ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆనేకల్ న్యాయస్థానం ముందు ఆమెను పోలీసులు హాజరుపరిచారు. హేమను విచారించేందుకు మూడురోజుల కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోర్టును కోరారు. అయితే, న్యాయస్థానం మాత్రం 24 గంటల పాటు ఆమెను విచారిస్తే చాలని తెలిపింది. ఆపై గురువారం సాయంత్రం ఐదుగంటలకు మళ్లీ కోర్టులో హాజరు పరచాలని పోలీసులకు సూచించింది. -
హేమ సభ్యత్వం రద్దు చేసే యోచనలో ‘మా’?
మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. టాలీవుడ్ నటి హేమ మా సభ్యత్వం సస్పెండ్ చేయడానికి అభిప్రాయాలను కోరినట్లు తెలుస్తోంది. మా అసోసియేషన్ గ్రూప్‌లో మంచు విష్ణు ఇప్పటికే సందేశం పంపించారు. ఆమె సభ్యత్వం సస్పెండ్‌కు సంబంధించిన సభ్యుల అభిప్రాయాలు సేకరించారు. అయితే హేమను సస్పెండ్ చేయాల్సిందిగా సభ్యులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. దీంతో హేమకు క్లీన్ చిట్ వచ్చేంతవరకు సస్పెండ్ చేయాలని మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ క్లీన్ చిట్ రాకపోతే మాత్రం శాశ్వతంగా రద్దు చేసే ఆస్కారం లేకపోలేదు. మా నిర్ణయం ఏంటన్నది రేపు మధ్యాహ్నం అధికారికంగా అధ్యక్షుడు మంచు విష్ణు వెల్లడించనున్నారు. కాగా.. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ దొరికిపోయారు. వైద్య పరీక్షల్లోనూ ఆమెకు పాజిటివ్‌గా తేలింది. ఇటీవలే ఆమెను అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
తప్పు చేయకపోవడానికి మేమేం దేవుళ్లం కాదు.. హేమ మరో వీడియో
ఈ మధ్య కాలంలో డ్రగ్స్ కేసు మరోసారి టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నటి హేమ ఇందులో ఉండటంతో అందరూ ఈ విషయమై తెగ మాట్లాడుకున్నారు. అయితే బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణకి హాజరు కావాలని హేమకు పోలీసులు నోటీసులు పంపించారు. సోమవారమే దీనికి హాజరు కావాల్సి ఉండగా, తాను జ్వరంతో బాధపడుతున్నానని చెప్పి డుమ్మా కొట్టింది. మరోవైపు ఈమెకు సంబంధించిన లేటెస్ట్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్)వీడియోలో ఏముందంటే?'మనమేం దేవుళ్లం కాదు. ఒకవేళ తప్పు చేసినా, పొరపాటు జరిగినా సారీ చెప్పొచ్చు. అప్పుడు మనం చాలా ఫ్రెష్‌గా ఉంటాం. అలానే అబద్దం చెబితే దాన్ని కవర్ చేయడానికి 100 అబద్దాలు ఆడాలి. అందుకని 99.9 శాతం అబద్దాలు ఆడకుండా ఉంటే బెటర్. అందుకని నేను చాలా హ్యాపీగా ఉన్నానని' హేమ చెబుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఇదంతా కూడా డ్రగ్స్ కేసు గురించేనని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.కేసు సంగతేంటి?మే 19న బెంగళూరులోని ఓ ఫామ్ హౌసులో రేవ్ పార్టీ నిర్వహించారు. పోలీసులు రైడ్ చేసి దాదాపు 103 మంది బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. వీళ్లలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు రిపోర్ట్స్‌లో తేలింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఈ క్రమంలోనే పోలీసులు నోటీసులు జారీ చేయగా, తాను రాలేకపోతున్నానని మరికొంత సమయం కావాలని లేఖ రాసింది. కానీ దీన్ని పోలీసులు పరిగణలోకి తీసుకోకుండా మరోసారి నోటీసులు జారీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆరేళ్ల తర్వాత తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్) -
డ్రగ్స్ కేసులో షారుఖ్ కుమారుడికి క్లీన్ చిట్ ఇచ్చిన అధికారి సంచలన నిర్ణయం
డ్రగ్స్ కేసులో చిక్కుకున్న బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) సంజయ్ సింగ్ ఇప్పుడు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. తాజాగా వెలువడిన ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 2021 నుంచి ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న సంజయ్ సింగ్, ఆర్యన్ ఖాన్ నిందితుడిగా ఉన్న డ్రగ్స్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించారు. ఒడిశా కేడర్‌కు చెందిన 1996 బ్యాచ్ IPS అధికారిగా ఆయన ప్రయాణం కొనసాగింది. 2008 నుంచి 2015 వరకు సీబీఐలో కూడా ఆయన పనిచేశారు. దేశంలోని అత్యంత క్లిష్టమైన కేసులలో ఆయన భాగమై పూర్తిచేసిన ట్రాక్ రికార్డ్ ఆయనకు ఉంది. తన స్వచ్ఛంద పదవీ విరమణపై సంజయ్ సింగ్ మీడియాతో స్పందిస్తూ.. 'ఫిబ్రవరి 29న స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకోవాలని అభ్యర్థించాను. నా అభ్యర్థనను ఆమోదించడానికి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇదే విషయాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా తెలిపింది. దాని ప్రకారం ఈరోజు నా అప్పీల్ ఆమోదించబడింది. ఏప్రిల్ 30 నా కెరీర్‌కి చివరి రోజు అని నాకు ఇప్పటికే సమాచారం వచ్చింది. గత మూడు నెలలుగా నోటీసు పరేడ్‌లో నేను రిలాక్స్‌గా ఉన్నాను. అని ఆయన చెప్పారు. రెండేళ్ల క్రితం ముంబై తీరంలోని ఒక విహార నౌకలో సంపన్నులు, సెలబ్రిటీల పిల్లలంతా కలిసి పాల్గొన్న విందుపై ఎన్సీబీ బృందం దాడి చేసి ఆర్యన్‌తోపాటు సుమారు 20 మందిని అరెస్టు చేసింది. అతను డ్రగ్స్ సేవిస్తుండగా పట్టుకున్నామనీ, అతగాడి ఫోన్లోని వివరాల ఆధారంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల సిండికేట్‌తో అతనికున్న సంబంధాలు వెల్లడయ్యాయనీ ఎన్సీబీ ముందుగా ప్రకటించింది. ఆ సమయంలో షారుఖ్‌తో పాటు ఆర్యన్ కూడా సోషల్‌మీడియా ద్వారా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో ఆర్యన్ ఎలాంటి తప్పు చేయలేదని గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన రూ. 20,000 కోట్ల విలువైన డ్రగ్స్‌నుంచి దృష్టి మళ్లించడానికే ఆర్యన్ ఉదంతాన్ని తెరపైకి తెచ్చారన్న వాదనలూ వినిపించాయి. కానీ ముంబై జోన్లో అప్పటి ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఈ కేసును దర్యాప్తు చేశారు. కావాలనే కేసును తప్పుదారి పట్టిస్తున్నట్లు వాదనలు రావడంతో ఈ కేసు నుంచి ఆయన్ను తప్పించారు. తర్వాత ఇదే కేసును డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) సంజయ్ సింగ్‌కు అప్పగించారు. 28 రోజుల పాటు జైల్లో ఉన్న ఆర్యన్ కేసును ఆయన ఛాలెంజ్‌గా తీసుకుని విచారణ కొనసాగించారు. మే 2022లో సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్లో, ఆర్యన్ ఖాన్‌తో సహా ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఆరుగురికి ఎన్‌సిబి క్లీన్ చిట్ ఇచ్చింది. మిగిలిన 14 మందిని నిందితులుగా గుర్తించింది. అలా సంజయ్ సింగ్ నేతృత్వంలో ఆర్యన్‌కు క్లీన్ చిట్ దక్కింది. -
ఆ ఆరోపణలతో నాకు సంబంధం లేదు: నటుడు
దర్శకుడు, నటుడు అమీర్ ఇటీవల పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయిన సినీ నిర్మాత జాఫర్ సాధిక్తో దర్శకుడు అమీర్‌కు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో మంగళవారం నాడు ఎన్సీబీ, ఈడీ అధికారులు అమీర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సంఘటన కోలీవుడ్‌లో తీవ్ర కలకలానికి దారి తీసింది. కాగా బుధవారం మధురైలో జరిగిన రంజాన్ కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ మీడియాతో మాట్లాడుతూ.. తనపై వస్తున్న ఆరోపణలకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన ఇంట్లో అధికారులు 11 గంటలపాటు సోదాలు నిర్వహించిన విషయం నిజమేనన్నారు. అయితే ఈ సోదాల్లో ఎలాంటి ఆధారాలు లభించాయన్నది వారే చెప్పాలన్నారు. ఈ వ్యవహారంలో తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు. అలాగే తనను లక్ష్యంగా చేసుకుని విచారణ జరుపుతున్నారా? అన్న ప్రశ్నకు తన వద్ద సమాధానం లేదన్నారు. అయితే ఈ విషయమై ఒక రోజు కచ్చితంగా వివరంగా మాట్లాడతానన్నారు. ఈ వ్యవహారం గురించి తాను ఒక నెలరోజులుగా మాట్లాడలేని పరిస్థితి అని.. ఆ దేవుడు చూసుకుంటాడనే మౌనంగా రోజులు గడిపానన్నారు. చదవండి: మీకు నచ్చకపోతే అలా చేస్తారా?.. ట్రోల్స్‌పై మండిపడ్డ నటి! -
HYD: బర్త్‌డే పార్టీలో డ్రగ్స్.. గంజాయితో మరో బ్యాచ్
హైదరాబాద్, సాక్షి: నగరంలో మరోసారి మాదకద్రవ్యాల ముఠాల గుట్టు రట్టు అయ్యింది. పుట్టినరోజు పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తూ పట్టుబడ్డారు పలువురు. విద్యార్థులే లక్ష్యంగా.. గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి మరీ కేటుగాళ్లు ఈ దందా నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సనత్‌నగర్‌లో డ్రగ్స్ పార్టీ సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్వోటీ(Special Operation Team) బృందం దాడులు జరిపింది. ఈ తనిఖీల్లో MDMA(methylenedioxy-methylamphetamine)తో పట్టుబడ్డారు యువకులు. మొత్తం 4 గ్రాముల MDMA, 5 గ్రాముల గంజాయి తో పాటు OCB ప్లేవర్స్ డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది ఎస్ఓటీ బృందం. ఈ దాడులకు సంబంధించి ఐదుగురు యువకుల్ని అరెస్ట్ చేసింది. మరోవైపు.. మేడ్చెల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలో గంజాయి బ్యాచ్‌ను పోలీసులు పట్టుకున్నారు. రూ. 33,750 విలువ గల 1.35కేజీల గంజాయి సీజ్ చేశారు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బుల సంపాదన ఆశతో గంజాయి దందా నడిపిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో.. ఒడిషాకు చెందిన ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు మేడ్చెల్ ఎస్వోటీ పోలీసులు. వీళ్లంతా నగరంలో సెంట్రింగ్ వర్క్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
తెలంగాణ యూనివర్సిటీ చరిత్రలో మరో మచ్చ..
నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ చరిత్రలో మరో మచ్చ చోటు చేసుకుంది. గతంలో తెయూ వీసీగా పనిచేసిన ప్రొఫెసర్ రవీందర్‌గుప్తా లంచం తీసుకుంటూ అవినీతి కేసులో పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ యూనివర్సిటీ పేరు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. దేశంలోనే పదవిలో ఉన్న యూనివర్సిటీ వీసీ ఒకరు అవినీతి కేసులో అరెస్ట్ అయి జైలుకెళ్లడం అదే మొదటిసారి. ప్రస్తుతం తెయూ ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.శ్రీనివాస్ నిషేధిత డ్రగ్స్ (మాదకద్రవ్యాల) తయారీ కేసులో పోలీసుల చేతిలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం వర్సిటీ చరిత్రలో మరో మచ్చగా మారింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.శ్రీనివాస్ 2014లో తెయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. 2018లో వర్సిటీ అనుబంధంగా ఉన్న భిక్కనూర్ సౌత్ క్యాంపస్‌కు బదిలీ అయ్యారు. వర్సిటీ ఉద్యోగులకు లీన్ (డిప్యుటేషన్) పీరియడ్ కింద వర్సిటీ అనుమతితో ఐదేళ్లకు ఒక సంవత్సరం ఇతర సంస్థల్లోకి వెళ్లి పని చేసే అవకాశం కల్పిస్తారు. అయితే ఉద్యోగంలో చేరిన నాలుగేళ్లకే నాటి వీసీని ప్రసన్నం చేసుకుని శ్రీనివాస్ లీన్‌పై వెళ్లారు. ఇలా ఏకంగా నిబంధనలకు విరుద్ధంగా ఆరేళ్ల పాటు శ్రీనివాస్ లీన్‌పై వెళ్లారు. ప్రతి రెండేళ్లకోసారి వీసీలను మచ్చిక చేసుకుని లీన్ పొడిగింప జేసుకున్నారు. ఈ విషయాన్ని 2021లో గుర్తించిన వర్సిటీ పాలకమండలి సభ్యులు 53వ ఈసీ సమావేశంలో డిప్యుటేషన్‌పై ఉన్న వర్సిటీ ఉద్యోగులు వెంటనే లీన్ రద్దు చేసుకుని వర్సిటీలో తిరిగి చేరాలని 2021 లో తీర్మానం చేశారు. అయితే ఏ ఒక్కరూ పాలకమండలి ఆదేశాలను పాటించలేదు. వర్సిటీ ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. దీంతో లీన్‌పై వెళ్లిన వారు అలాగే ఉండిపోయారు. వర్సిటీ ఉన్నతాధికారులు నోటీసులపై నోటీసులు ఇవ్వడంతో ఎట్టకేలకు శ్రీనివాస్ నాలుగు నెలల క్రితం యూనివర్సిటీకి వచ్చారు. తాను తిరిగి విధుల్లో చేరతానని చెప్పగా తొలుత రిజిస్ట్రార్ యాదగిరి అంగీకరించలేదు. దీంతో శ్రీనివాస్ రిజిస్ట్రార్‌తో తీవ్రంగా గొడవ పడ్డాడు. చివరకు రిజిస్ట్రార్ అతడిని మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. సౌత్ క్యాంపస్‌లో తిరిగి విధుల్లో చేరిన శ్రీనివాస్ బయోమెట్రిక్ హాజరును పట్టించుకోకుండా కేవలం రిజిస్టర్లో సంతకాలు మాత్రమే చేసి వేతనం తీసుకుంటున్నారు. బయోమెట్రిక్ విషయమై వర్సిటీ ఉన్నతాధికారులు ఎన్నిసార్లు చెప్పినా ఏమాత్రం ఖాతరు చేయకుండా నిర్లక్ష్యంగా ఉండేవారని ఇతర అధ్యాపకులు చెప్పడం గమనార్హం. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ చట్ట వ్యతిరేకంగా నిషేదిత డ్రగ్స్ తయారు చేస్తూ గత నెల 22న శ్రీనివాస్ అరెస్ట్ అయిన విషయం మూడు రోజుల క్రితం వర్సిటీ రిజిస్ట్రార్ దృష్టికి రావడంతో శ్రీనివాస్ మార్చి నెల వేతనాన్ని నిలిపివేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా కేసులో అరెస్ట్ అయిన 48 గంటల్లో విధుల్లో నుంచి సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయమై రిజిస్ట్రార్ యాదగిరిని సంప్రదించగా ఇంకా తనకు పోలీసుల ఎఫ్ఐఆర్ కాపీ అందలేదని న్యాయసలహా మేరకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మెడికెమ్ ల్యాబ్.. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ శివారులో మెడికెమ్ ల్యాబ్ అనే సంస్థలో శ్రీనివాస్ మేనేజింగ్ పార్ట్నర్గా కొనసాగుతున్నారు. ఈ ల్యాబ్‌లో ఖరీదైన ఫార్మా డ్రగ్స్‌ను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ఫార్మా కంపెనీలు సిండికేట్‌గా మారి ఇలా నిషేదిత డ్రగ్స్‌ను తయారు చేసి ఇతరదేశాలకు ఎగుమతులు, దిగుమతులు చేస్తుంటారు. కొన్ని కంపెనీలు అప్పుడప్పుడు పట్టుబడినప్పటికీ ఇందులో వచ్చే ఆదాయం వల్ల చాలా కంపెనీలు వీటిని ఇల్లీగల్‌గా కొనసాగిస్తుంటాయి. అయితే ఇలా హైదరాబాద్‌లో నిషేదిత డ్రగ్స్ తయారీ చేస్తూ పట్టుబడటం, అరెస్ట్ అయిన వారిలో తెయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండటం సంచలనంగా మారింది. నిషేదిత డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయడాన్ని ముందుగా ఇంటర్‌పోల్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. శ్రీనివాస్‌ను ఏకంగా ఇంటర్‌పోల్ పోలీసుల సాయంతో హైదరాబాద్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ), రాష్ట్ర ఎకై ్సజ్ పోలీస్ అధికారులు గత నెల 22న అరెస్ట్ చేశారు. వర్సిటీ అధ్యాపకులు ప్రభుత్వం అనుమతించిన ఫార్మా ఉత్పత్తులపై పరిశోధనలు చేయాల్సి ఉండగా ఇలా నిషేదిత డ్రగ్స్‌ను ఉత్పత్తి చేస్తూ పట్టుబడటం సిగ్గు చేటని వర్సిటీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఇవి చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్.. ఎమ్మెల్యేల కొనుగోలుకు లింక్.. -
రాడిసన్ డ్రగ్స్ కేసు: వీఐపీలకు షాక్.. పోలీసుల సరికొత్త ప్రయోగం!
సాక్షి, హైదరాబాద్: రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాడిసన్ హోటల్లో పార్టీకి వెళ్లిన వారిలో డ్రగ్స్ ఆనవాళ్లను గుర్తించేందుకు తెలంగాణ పోలీసులు సరికొత్త ప్రయోగానికి ప్లాన్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా క్రోమోటోగ్రఫీ పరీక్ష చేసేందుకు రెడీ అయ్యారు పోలీసులు. వివరాల ప్రకారం.. రాడిసన్ హోటల్లో డ్రగ్స్ వాడిన వారిని గుర్తించేందుకు పోలీసులు క్రోమోటగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం పోలీసులు కూకట్పల్లి కోర్టు అనుమతి కోరారు. అయితే, కోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు అనుమతిస్తే ఆరోజు రాడిసన్‌కు వెళ్లిన వారిలో డ్రగ్స్ ఎవరు తీసుకున్నారో గుర్తించే అవకాశం ఉంటుంది. ఇక, ఫిబ్రవరి 24వ తేదీన రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరిగింది. ఈ పార్టీకి మొత్తం 14 మంది హాజరైనట్టు పోలీసులు గుర్తించారు. కాగా, వీరికి డ్రగ్స్ టెస్టులు చేయగా కేవలం ముగ్గురికి మాత్రమే పాజిటివ్‌గా తేలింది. అయితే, వీరిలో సెలబెట్రీలు పార్టీ జరిగిన రోజు నుంచి ఎక్కువ సమయం తీసుకుని డ్రగ్స్ టెస్టు కోసం విచారణకు హాజరయ్యారు. దీంతో, వారి నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు కనపించలేదు. ఈ నేపథ్యంలోనే రాడిసన్‌కి వచ్చిన వారిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. వారి శరీరాల్లో డ్రగ్స్‌ను గుర్తించేందుకు క్రోమోటోగ్రఫీ నిర్వహించాలని పోలీసులు ప్లాన్ చేశారు. ఇక, క్రోమోటోగ్రఫీ పరీక్షలు నిర్వహించడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా.. రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీలో పాలు పంచుకున్న పది మంది వీఐపీలపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఇద్దరు అమ్మాయిలతో పాటు మొత్తం 9 మందిపై కేసులు నమోదైంది. వ్యాపారవేత్తలు గజ్జల వివేకానంద్, అబ్బాస్, కేదార్, సందీప్‌లు.. సెల్రబిటీ శ్వేతతో పాటు లిశి, నీల్‌పైనా కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. అలాగే.. డ్రగ్స్ సేవించిన నిర్భయతో పాటు రఘు చరణ్‌పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అబ్బాస్ దగ్గర వివేకానంద డ్రగ్స్ కొనుగోలు చేసి.. తన స్నేహితులతో పార్టీ చేసుకున్నట్లు తేలింది. వీళ్లంతా కొకైన్ పేపర్లో చుట్టి డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొని ఉంది. అంతేకాదు.. ఈ డ్రగ్స్ పార్టీలో మరికొంత మంది ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక, ఈ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ కూడా ఉన్నారు. -
ప్యాకేజింగ్‌లోనే డ్రగ్స్ కలిశాయా?
-
విశాఖ డ్రగ్స్: అంతర్జాతీయ లింకులపై సీబీఐ ఆరా.. బ్రెజిల్‌కు స్పెషల్ టీంలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ డ్రగ్స్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. డ్రగ్ డీల్ వెనుక అంతర్జాతీయ లింకులపై ఆరా తీస్తోంది. ప్రత్యేక విచారణ బృందాలు బ్రెజిల్ వెళ్లనున్నాయి. డ్రగ్ డీల్ వెనుక అంతర్జాతీయ లింకులు ఛేదించే దిశగా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. డ్రై ఈస్ట్ సప్లయ్ చేసిన ఐసీసీ బ్రెజిల్ సంస్థలో కీలక ఆధారాలు లభిస్తాయని సీబీఐ అంచనా వేస్తోంది. ఇప్పటికే సంధ్య ఆక్వా ప్రతినిధుల కాల్ డేటా, ఈ మెయిల్స్, వాట్స్ అప్ చాటింగ్స్ ద్వారా కొంత మేర సమాచారం లభించింది. నార్కోటిక్స్ పరీక్షల నివేదికల కోసం దర్యాప్తు బృందం ఎదురు చూస్తోంది. సంచలనం రేకెత్తిచిన కేసులో డ్రగ్స్ నిర్ధారణ కోసం వివిధ ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే మెటీరియల్, డాక్యుమెంటరీ ఆధారాలను సీబీఐ సేకరించింది. సంధ్య ఆక్వా ప్రతినిధుల కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టింది. కాగా, తమ సంస్థ తీసుకొచ్చిన డ్రైఈస్ట్లో డ్రగ్స్ ఎలా వచ్చాయో తమకు తెలియదని సంధ్యా ఆక్వా సంస్థ చెబుతోంది. ఇటీవల మరికొన్ని బ్యాగుల్ని పరీక్షించగా.. 70 శాతం డ్రైఈస్ట్ బ్యాగుల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో.. సంధ్యా ఆక్వా యాజమాన్యాన్ని సీబీఐ విచారిస్తోంది. ఎప్పటి నుంచి వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు. బ్రెజిల్ నుంచి ఫీడ్‌ని ఎప్పుడు బుక్ చేశారు.. అక్కడి నుంచి తెప్పించుకోడానికి గల కారణాలేంటి.. విశాఖ పోర్ట్‌నే ఎందుకు ఎంచుకున్నారు. ఇంత భారీగా తెప్పించుకున్న సరుకును నిర్ణీత వ్యవధిలో ఎలా విక్రయిస్తారు? తదితర విషయాలపై ప్రశ్నించినట్లు సమాచారం. సంధ్య ఆక్వా యాజమాన్యం కాల్ డేటా, విశాఖ పోర్టులో కస్టమ్స్ కార్యకలాపాలపై కూడా సీబీఐ ఫోకస పెట్టింది. డ్రగ్ కంటైనర్ తనిఖీలకు వచ్చిన సీబీఐకి తొలుత ఆశించిన సహకారం లభించలేదని సమాచారం. పోర్ట్ నుంచి సీఎఫ్‌ఎస్‌కు వెళ్లే కంటైనర్ల తనిఖీలకు అనుసరించే విధానంపై సీబీఐ ఆరా తీస్తోంది. -
డ్రగ్స్ కేసులో దొరికింది టిడిపి వాళ్లే కావడంతో ఫ్రస్ట్రేషన్ లో బాబు
-
యువతను చిత్తు చేస్తున్న మత్తు
-
బాబు 'బాదరాయణ బంధాన్ని' కొల్లగొట్టిన ఆపరేషన్.. 'గరుడ'
రాజకీయాలలో ఒక ధీరి ఉంటుంది. తాము ఏ తప్పు అయినా చేయదలిస్తే, లేదా తప్పు చేస్తే, ముందుగా దానిని ఎదుటివారిపై నెట్టేయడం. ఎదుటివారేదో ఘోరం చేస్తున్నారని ప్రచారం చేసి, చల్లగా తన పనికానీచ్చుకోవడం. తాను దొంగతనం చేసి దొరికిపోతున్నామని అనుకుంటే ‘కావు, కావు’ మని.. వైరి పక్షంపై ఆరోపణలు గుప్పించడం. ఇలాంటి దిక్కుమాలిన వ్యూహాలలో తెలుగుదేశం పార్టీ ఆరితేరింది. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు కైవసం చేసుకున్న తర్వాత ఈ ధోరణితోనే ఆయన కథ నడిపించారు. దానికి ఈనాడు రామోజీరావు వంటివారు బాకా ఊదుతూ తానా అంటే తందానా అనేలా రెడీగా ఉంటారు. దాంతో ఆయన ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగిపోయింది. కానీ అన్నిసార్లు ఇది సాద్యపడదు కదా! అందులోను సోషల్ మీడియా విస్తారంగా వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు ఇలాంటి ట్రిక్కులు ఎన్ని పన్నినా ఇట్టే దొరికిపోతున్నారు. ఆయన కుమారుడు లోకేష్ కూడా ఇలాగే తయారయ్యారు. విశాఖపట్నంలోని పోర్టుకు బ్రెజిల్ నుంచి మాదకద్రవ్యాలతో కూడిన కంటైనర్ వచ్చిన ఉదంతంలో టీడీపీకి బూమ్ రాంగ్ అయిందని చెప్పాలి. ఇలాంటి డ్రగ్స్ విషయాలలో రాజకీయాలకు అతీతంగా అంతా ప్రవర్తించాలి. కానీ పద్నాలుగేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబే ఎదుటివారి మీద బురద చల్లి రాజకీయ లబ్ది పొందాలని చూడడం ద్వారా మొత్తం సమస్యను డైవర్ట్ చేయడానికి ప్రయత్నించినట్లు అనిపిస్తుంది. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే చంద్రబాబు, లోకేష్‌లకు ముందుగానే అసలు వాస్తవం తెలిసి ఉండాలన్న భావన కలుగుతుంది. తమ పార్టీకి చెందినవారే ఈ కేసులో దొరికిపోయేలా ఉన్నారని అర్దం అయి ఉండాలి. తమకు సంబంధించిన వారి బంధువులు పట్టుబడుతున్నారని కనిపెట్టి ఉండాలి. అందుకే విశాఖలో ఒక పక్క సీబీఐ సోదాలు జరిపి పరిశోధన చేస్తుంటే.. లోకేష్ దీనిపై ట్వీట్ చేస్తూ వైఎస్సార్సీపీపై ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు సైతం విశాఖ డ్రగ్స్ కాపిటల్ అయిపోయిందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. వైఎస్సార్సీపీ నేతలు అసలు విషయం తెలుసుకుని ఖండన ఇచ్చేలోగానే వీరు తమ భజంత్రీలైన ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి గ్రూపు మీడియా సంస్థల ద్వారా వారి ట్వీట్లలో పేర్కొన్న అంశాలను ప్రచారంలో పెట్టేశారు. పైగా పత్రికలలో ఏమి రాశారు. సీబీఐ డ్రగ్స్‌ను వెలికి తీసి పరిశీలిస్తుంటే, స్థానిక పోలీసులు ఆటంకం సృష్టించే యత్నం చేశారని కూడా వీరు తేల్చేశారు. కానీ వీరు ఎక్కడా అది ఫలానా వారి కంపెనీ ఇది అని, వారి చిరునామా ఇది అని, వారికి ఫలానా వారితో సంబంధాలు ఉన్నాయని రాయకుండా జాగ్రత్తపడ్డారు. పైగా వైఎస్సార్సీపీ పెద్దలే డ్రగ్స్ తెప్పించారన్నంత నీచంగా కూడా టీడీపీ ప్రచారానికి దిగింది. దాంతో వైఎస్సార్సీపీ మేలుకుని మొత్తం విషయం రాబట్టి ఆశ్చర్యపోవలసి వచ్చింది. 'సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ సంస్థ కూనం కోటయ్య చౌదరి, వీరభద్రరావులకు చెందిందని వెల్లడైంది. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కుటుంబానికి వీరికి సంబంధాలు ఉన్నాయని, పలువురు టీడీపీ నేతలతో వీరికి బాదరాయణ బంధం ఉందని' వైఎస్సార్సీపీ నేతలు చిట్టా విప్పారు. దాంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. డ్రగ్స్ వంటి సమస్యలను రాజకీయ కోణంలో చూడకూడదు. సమాజానికి ఇది పెనుభూతం వంటిది. సీబీఐ వారు ఇంటర్ పోల్ సాయంతో ఇంత పెద్ద డ్రగ్ రాకెట్‌ను ఆపరేషన్ గరుడ పేరుతో కనిపెట్టినందుకు వారిని అభినందించాలి. బ్రెజిల్ నుంచి వచ్చినవి డ్రగ్స్ అని నిర్ధారణ చేసుకున్న తర్వాత సీబీఐ కంపెనీని యజమానులను, ఆ కంపెనీ అధికారులను అదుపులోకి తీసుకోవచ్చు. లేదా అదుపులోకి తీసుకోకుండానే విచారణ జరపవచ్చు. మొత్తం మీద డ్రగ్స్ మూలాలు ఎక్కడ నుంచి వచ్చాయో, ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ సరఫరాకు ఆర్డర్ ఇచ్చింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం సీబీఐ చేస్తుంది. కానీ ఇది ఎన్నికల సమయం కావడంతో టీడీపీ అధికంగా కంగారు పడుతోంది. 'ఈ కంపెనీ తమ సామాజికవర్గం వారిది కావడం, కంపెనీ యజమానులలో కొందరికి గత చరిత్ర అంత క్లీన్‌గా లేకపోవడం వల్ల ఆ బురద అంతా తమపై వచ్చి పడుతుందేమోనన్న కంగారులో చంద్రబాబు, లోకేష్‌లు తొందరపడి పిచ్చి ట్వీట్లు చేసి వైఎస్సార్సీపీపై ఆరోపణలు గుప్పించారు'. లోకేష్ అయితే ఒక అడుగు ముందుకు వేసి కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డికి లింక్ పెట్టి ట్వీట్ చేశారు. అంతిమంగా అదేదో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికు సంబంధించిందేమో అన్న చందంగా అనుమానం క్రియేట్ చేయడానికి యత్నించారు. ఇక రామోజీరావు రంగంలో దిగి డ్రగ్స్ తెప్పించారన్న అభియోగాలను ఎదుర్కుంటున్న వారిని రక్షించడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లుగా ఉంది. శనివారం నాటి పత్రికలో అంతా అనుమానాస్పదమే అన్న శీర్షికతో ఒక ప్రధాన కథనాన్ని వండి వార్చారు. అందులో ఎంత సేపు సీబీఐ డ్రగ్స్ గురించి దర్యాప్తు చేస్తుంటే, దానిని ఏపీ పోలీసులు అడ్డుకునే యత్నం చేశారని దుర్మార్గపు ప్రచారం చేసింది. పోలీసులు అలా చేశారంటే వైఎస్సార్సీపీ పెద్దల పాత్ర లేకుండా ఉంటుందా అని దిక్కుమాలిన రాతలు రాసింది. అసలు రాయవలసింది ఏమిటి..? ఆ కంపెనీ ఎవరిది? గతంలో కూడా ఇలా చెప్పిన సరుకు కాకుండా వేరే డ్రగ్స్ లేదా ఇతర అభ్యంతరకర పదార్దాలు ఏవైనా తీసుకువచ్చేవారా? ఆ కంపెనీ ముఖ్యుల మూలాలు ఏమిటి? వారు ఎలా ఆ స్థాయికి వచ్చి ఆక్వా కంపెనీ పెట్టారు? రాష్ట్ర ప్రభుత్వం ఈ కంపెనీపై ఎప్పుడైనా ఏదైనా కేసు పెట్టిందా? మొదలైన అంశాలపై వార్తలు రాయకుండా రామోజీ ఎంతసేపు సీబీఐ అధికారులను ఏపీ పోలీసులు అడ్డుకునే యత్నం చేశారన్నదానిని ఫోకస్ చేయడానికి యత్నించింది. దీనిపై విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్.. ఎక్కడా ఎవరూ ఆటంకం కలిగించలేదని, సీబీఐ కోరితేనే డాగ్ స్క్వాడ్ పంపించామని, ఈ ప్రక్రియలో కొంత జాప్యం అయిందని.. సీబీఐ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారని, సీబీఐ అధికారులను కూడా మీడియా సమాచారం కోరవచ్చని.. స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఈనాడు మీడియా ఈ రకమైన దుర్మార్గపు ప్రచారం చేసిందంటే వారి దుష్ట ఆలోచన ఎలా ఉందో తెలుసుకోవచ్చు. పోనీ ఏపీ పోలీసులు కావాలని జాప్యం చేశారని అనుకుందాం. దానివల్ల వారికి వచ్చే లాభం ఏమిటి? అయినా సీబీఐ తన పని తాను చేసుకుపోయింది కదా? ఆ విషయం రాయకుండా, ఆ స్కామ్ మూలలు తవ్వకుండా ఈనాడు మీడియా అబద్దపు కథనాలు ఇస్తోందంటే వారు ఎంత నీచంగా మారారో అర్ధం చేసుకోవచ్చు. ఈ కథనంలో ఎక్కడా ఆ కంపెనీకి సంబంధించిన 'వీరభధ్రరావు, కోటయ్య చౌదరి' తదితరుల గురించి ఒక్క ముక్క రాసినట్లు కనిపించలేదు. పైగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో వీరభద్రరావు సోదరుడు పూర్ణచంద్రరావు దిగిన ఫోటోను ప్రముఖంగా ప్రచురించింది. తీరా చూస్తే ఆయన తన సోదరుడి వ్యాపారాలతో తనకు సంబంధం లేదని, తాను వ్యవసాయం చేసుకుంటున్నానని, స్థానిక రాజకీయాలలో వైఎస్సార్సీపీని అభిమానిస్తానని చెప్పారు. విశేషం ఏమిటంటే అసలు ఆ కంపెనీతోకానీ, ఆ డ్రగ్స్‌తో కానీ ఏ మాత్రం సంబందం లేని పూర్ణచంద్రరావు ఫోటో వేసిన టీడీపీ మీడియా అసలు కంపెనీ నడిపే వారి పోటోలు వేయలేదు. వారి వివరాలు ఇవ్వలేదు. దీంతో వైఎస్సార్‌సీపీవారు ఏకంగా చంద్రబాబు, లోకేష్‌లకు సంబంధించినవారే ఈ డ్రగ్స్ స్కామ్ లో ఉన్నారని ఆరోపిస్తూ సీఈఓ కి ఫిర్యాదు చేసింది. చిత్రం ఏమిటంటే.. "ప్రతి చిన్న విషయాన్ని ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేసే తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో బురద చల్లుడు తప్ప ఫిర్యాదు చేయలేదు." దీనిని బట్టి టీడీపీకి సంబంధించినవారి బండారం బటపడుతుందని ఈ డ్రామా ఆడారని అనుకోవాలి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఈనాడు రామోజీరావు ఈ ఘటనపై రాస్తున్న కథనాల వెనుక కులభావన, విశాఖపై ద్వేష భావన వెదచల్లడం, టీడీపీ దొరికిపోకుండా కాపాడడం, ఒకవేళ నిందితులు తనకు తెలిసినవారైతే వారిని రక్షించడం.. లక్ష్యాలతో ఈ వార్తలు ఇచ్చినట్లు అభిప్రాయం కలుగుతుంది. విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధాని చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినప్పటి నుంచి ఆ నగరంపై ఈనాడు రామోజీరావు విషం చిమ్ముతూనే ఉన్నారు. అలాగే కమ్మ కులంలో ఇలా అక్రమాలకు పాల్పడుతున్న వారిని వెనుకేసుకు వస్తున్నారన్న దరిద్రపు ఆరోపణకు కూడా ఆయన ఆస్కారం ఇవ్వడం దురదీష్టకరం. ఈ మద్యకాలంలో హైదరాబాద్‌లో పట్టుబడినన్ని డ్రగ్స్ మరే నగరంలోను దొరకలేదు. అయినా ఈనాడు మీడియా మాత్రం ఎక్కడా వాటికి ఎక్కువ ప్రచారం ఇవ్వదు. పైగా గతంలో బీఆర్ఎస్కు, ఇప్పుడు కాంగ్రెస్‌కు వత్తాసు పలకడానికి పోటీ పడుతోంది. గుజరాత్‌లోని ముంద్ర పోర్టు ద్వారా దేశంలోకి వచ్చినన్ని డ్రగ్స్ మరెక్కడ బహిర్గతం కాలేదు. గుజరాత్లో డ్రగ్స్ సమస్యపైకానీ, పంజాబ్‌కు పాకిస్తాన్ నుంచి వచ్చే మత్తు పదార్దాల గురించికానీ ఎన్నడూ బీజేపీ తదితర పార్టీలపై వార్తలు రాయని ఈనాడు మీడియా ఏపీపై మాత్రం నీచంగా రాస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి యత్నిస్తోంది. తంలో చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో చేసిన స్కామ్‌లను సమర్థించే దుస్థితిలో రామోజీరావు ఉన్నారు. సింగపూర్‌కు చెందిన మాజీ మంత్రి ఈశ్వరన్‌ను ఏపీకి తీసుకు వచ్చి వేల కోట్ల భూములను కట్టబెట్టిన చంద్రబాబును ఎన్నడూ తప్పు పట్టలేదు. ఇప్పుడు అదే ఈశ్వరన్ అవినీతి కేసులో చిక్కి మంత్రి పదవి కోల్పోయారు. అయినా ఒక్క ముక్క రాయదు. అమరావతిలోనే ఏదో ఆస్పత్రి పెడతారంటూ వంద ఎకరాల భూమి పొందిన బీడీ శెట్టి అనే వ్యాపారిని దుబాయిలో అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. వీరికి, చంద్రబాబుకు ఉన్న సంబంధ బాంధవ్యాలేమిటో ఒక్క అక్షరం కూడా రాయని దౌర్భాగ్య స్థితిలో ఈనాడు మీడియా ఉంది. అంతెందుకు చంద్రబాబుపై మనీ లాండరింగ్ ఆరోపణలు రావడం, దుబాయిలో ఆయన అక్రమంగా డబ్బు పొందారని ఆరోపణలు రావడం వంటివాటిపై పరిశోధన కథనాలు రాయకపోగా, ఆయనను సమర్దిస్తూ వార్తలు ఇస్తుంటారు. ఇదంతా ఈనాడు రామోజీ స్వార్ధ వ్యాపార ప్రయోజనాలకే అన్న సంగతి అందరికి తెలిసిపోయింది. ఇంకో సంగతి కూడా చెప్పాలి. 'ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఒంగోలు వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవ అరెస్టు అయ్యారు. అప్పట్లో వీరిద్దరిపైన వెంటాడుతూ వార్తలు రాసిన ఈనాడు, ప్రస్తుతం వారిద్దరూ తెలుగుదేశంలో చేరగానే తేలుకుట్టిన దొంగలాగా నోరు మూసుకుని కూర్చుంది.' అంటే దీనిని బట్టి ఏమి అర్ధం అవుతుంది. తనకు నచ్చకపోయినా, తన ప్రయోజనాలకు భిన్నంగా ఉన్నారనుకున్న వారిపై ఉన్నవి, లేనివి అభూతకల్పనలు రాసి బ్లాక్ మెయిల్ చేయడం, వారిలో ఎవరైనా లొంగిపోతే రామోజీ కామ్ అయిపోవడం జరుగుతుందని అనిపించడం లేదా! చివరికి రామోజీ కులతత్వవాదిగా మిగిలిపోయి అప్రతిష్టపాలవుతరని నేనైతే గతంలో ఎన్నడూ ఊహించలేదు. ఏం చేస్తాం.. రామోజీ లాంటి వారు ఈ వయసులో తమ ప్రతిష్ట పెంచుకోకపోగా, ఇలా దిగజారుతున్నారంటే వారికి ఏదో భయం పట్టుకున్నదన్నమాటే కదా! – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
సంధ్య ఆక్వా డ్రగ్స్ కేసు: సీబీఐ మరో కీలక నిర్ణయం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ డ్రగ్స్ కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలో నలుగురు ప్రతినిధులకు సీబీఐ నోటీసులు పంపించింది. వివరాల ప్రకారం.. విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డ్రగ్స్ కేసుపై సీబీఐ విచారణను వేగవంతం చేసింది. కేసు విచారణలో భాగంగా సీబీఐ తాజాగా సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలో నలుగురు ప్రతినిధులకు నోటీసులు ఇచ్చింది. కంపెనీకి సంబంధించి పూర్తి స్థాయిలో డేటా కావాలని నోటీసుల్లో సీబీఐ పేర్కొంది. ఇదే సమయంలో ఏపీలో పలువురు ఆక్వా బిజినెస్ ప్రతినిధులను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. పెద్ద మొత్తంలో ఈస్ట్ ఆర్డర్ చేసుకోవడంలో ఆంతర్యమేంటనే దానిపై ప్రశ్నలు సంధించనున్నట్టు సమాచారం. మరోవైపు.. సీబీఐ అడిగిన ప్రశ్నలకు సంధ్య ఆక్వా ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ‘సంధ్యా’ యాజమాన్యంపై ప్రశ్నల వర్షం తమ సంస్థ తీసుకొచ్చిన డ్రైఈస్ట్లో డ్రగ్స్ ఎలా వచ్చాయో తమకు తెలియదని సంధ్యా ఆక్వా సంస్థ చెబుతోంది. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ఇటీవల మరికొన్ని బ్యాగుల్ని పరీక్షించగా.. 70 శాతం డ్రైఈస్ట్ బ్యాగుల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో.. సంధ్యా ఆక్వా యాజమాన్యాన్ని సీబీఐ విచారిస్తోంది. ఎప్పటి నుంచి వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు. బ్రెజిల్ నుంచి ఫీడ్‌ని ఎప్పుడు బుక్ చేశారు.. అక్కడి నుంచి తెప్పించుకోడానికి గల కారణాలేంటి.. విశాఖ పోర్ట్‌నే ఎందుకు ఎంచుకున్నారు. ఇంత భారీగా తెప్పించుకున్న సరుకును నిర్ణీత వ్యవధిలో ఎలా విక్రయిస్తారు? తదితర విషయాలపై ప్రశ్నించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. సంధ్య ఆక్వా యాజమాన్యం కాల్ డేటాపై సీబీఐ దృష్టి సారించింది. అలాగే, విశాఖ పోర్టులో కస్టమ్స్ కార్యకలాపాలపై కూడా ఫోకస్ పెట్టింది. డ్రగ్ కంటైనర్ తనిఖీలకు వచ్చిన సీబీఐకి తొలుత ఆశించిన సహకారం లభించలేదని సమాచారం. పోర్ట్ నుంచి సీఎఫ్‌ఎస్‌కు వెళ్లే కంటైనర్ల తనిఖీలకు అనుసరించే విధానంపై సీబీఐ ఆరా తీస్తోంది. కస్టమ్స్ పనితీరులో లోపాలు నిర్ధారణ జరిగితే ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది. -
ఆక్వా కంపెనీ యాజమాన్యం కాల్ డేటాపై సీబీఐ దృష్టి
-
విశాఖ డ్రగ్స్ కేసు: అనుమానాస్పదంగా సంధ్య ఆక్వా బస్సు
సాక్షి, విశాఖపట్నం: సంధ్య ఆక్వా యాజమాన్యం కాల్ డేటాపై సీబీఐ దృష్టి సారించింది. అలాగే, విశాఖ పోర్టులో కస్టమ్స్ కార్యకలాపాలపై కూడా ఫోకస్ పెట్టింది. డ్రగ్ కంటైనర్ తనిఖీలకు వచ్చిన సీబీఐకి తొలుత ఆశించిన సహకారం లభించలేదని సమాచారం. పోర్ట్ నుంచి సీఎఫ్‌ఎస్‌కు వెళ్లే కంటైనర్ల తనిఖీలకు అనుసరించే విధానంపై సీబీఐ ఆరా తీస్తోంది. కస్టమ్స్ పనితీరులో లోపాలు నిర్ధారణ జరిగితే ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది. ఇటీవల పెద్ద ఎత్తున నగరంలో ఈ-సిగరెట్స్ పట్టుబడ్డాయి. పకడ్బందీ సమాచారంతో టాయిస్ షాపుల్లో వున్న నిషేధిత సిగరెట్టను విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ-సిగరెట్లు కూడా పోర్టు నుంచే బయటకు వచ్చినట్టు అనుమానం. కస్టమ్స్ పరిధిని దాటి నిషేధిత సిగరెట్లు బయటకు రావడం, ఇప్పుడు డ్రగ్ కంటైనర్ పట్టుబడటంతో అనుమానాలు బలపడుతున్నాయి. అనుమానాస్పదంగా సంధ్య ఆక్వా టెక్స్ బస్సు కాకినాడ: మూలపేట ఎస్ఈజడ్ కాలనీలో అనుమానాస్పదంగా సంధ్య ఆక్వాటెక్స్కు చెందిన బస్సు పార్కింగ్ చేసి ఉండటంతో యు.కొత్తపల్లి పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. రెండు రోజుల క్రితం సీబీఐ సోదాల సమయంలో పరిశ్రమ నుంచి బయటకు వచ్చిన బస్సులో ఆఫీస్ ఫైల్స్, కంప్యూటర్ మదర్‌బోర్డు గుర్తించారు. బస్సు బ్రేక్ డౌన్ అయ్యిందని డ్రైవర్ చెబుతున్నాడు. -
విశాఖ డ్రగ్స్ కేసులో CBI దూకుడు
-
విశాఖపట్నం డ్రగ్స్ వ్యవహారంలో చంద్రబాబు-దగ్గుబాటి కుటుంబాల పాత్ర బహిర్గతం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
విశాఖ డ్రగ్స్ కేసులో CBI దూకుడు
-
"వైజాగ్ డ్రగ్స్ మాఫియా.."అందరూ ఆయన బంధువులే
-
డ్రగ్స్ కేసులో మరో టీడీపీ నేత హస్తం
-
డ్రై ఈస్ట్ లో డ్రగ్స్..సీబీఐ విచారణలో సంచలన విషయాలు
-
విశాఖ డ్రగ్ మాఫియా..అందరూ రామోజీ బంధువులే
-
విశాఖ డ్రగ్స్ కేసు: సీబీఐ విచారణలో సంచలన విషయాలు..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ కేసులో సీబీఐ దూకుడు పెచ్చింది. ఈ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో సంచలన సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులోనూ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ పాత్ర ఉన్నట్టు సీబీఐ గుర్తించింది. వివరాల ప్రకారం.. విశాఖ పోర్టు డ్రగ్స్ కేసుపై సీబీఐ దృష్టిసారించింది. ఈ క్రమంలో సంధ్యా ఆక్వాకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలోనూ సంధ్యా ఆక్వా పాత్ర ఉన్నట్టు సీబీఐ గుర్తించింది. అలాగే, లిక్కర్ స్కాంకు పాల్పడిన సిండికేట్‌లో సంధ్యా ఆక్వా భారీగా పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. దీంతో.. మద్యం, డ్రగ్స్ మాఫియా గుట్టును చేధించే పనిలో సీబీఐ దూకుడు పెంచింది. ఇక, పది మంది సీబీఐ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో కాకినాడలోని సంధ్యా ఆక్వా కంపెనీలో సోదాలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు ఆ కంపెనీని పరిశీలించారు. ఇదే సమయంలో కంటైనర్లలో మెటీరియల్‌కు సంబంధించి మరిన్ని శాంపిల్స్‌ను విశాఖలో పరిశీలించగా ఫలితాల్లో పాజిటివ్‌గా తేలింది. ఇది కూడా చదవండి: విశాఖ డ్రగ్స్ కేసు: చంద్రబాబు ఇంగితం లేని మాటలు -
స్నిఫర్ డాగ్స్ అడిగారు.. పంపాం
విశాఖ సిటీ: డ్రగ్స్ కంటైనర్ కేసు దర్యాప్తు తమ పరిధిలో లేదని విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ.రవిశంకర్ స్పష్టం చేశారు. ఆ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందని, ఇందులో జిల్లా అధికారులకు ఎటువంటి సంబంధం లేదన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐ ఎఫ్ఐఆర్ రిపోర్ట్‌లో పొందుపరచిన సాంకేతిక పదజాలాన్ని కొందరు తప్పుగా అన్వయించుకున్నారని చెప్పారు. రాజకీయ ఒత్తిళ్లతో జిల్లా అధికారులు ఆలస్యంగా రావడంతో దర్యాప్తులో జాప్యం జరిగినట్లు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారన్నారు. తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పోలీస్ శాఖ ఎన్నికల కమిషన్ పరిధిలో పని చేస్తోందని వివరించారు. ‘బ్రెజిల్ నుంచి రవాణా నౌక ద్వారా డ్రగ్స్ కంటైనర్ విశాఖ పోర్టుకు వస్తున్నట్లు ఇంటర్‌పోల్ ఇచ్చిన సమాచారంతో సీబీఐ అధికారులు విశాఖ చేరుకున్నారు. ఆ కంటైనర్‌ను విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ (వీసీటీపీఎల్)లో జేఎం భక్షి అనే ప్రైవేట్ సంస్థ ఆదీనంలో ఉన్న ప్రాంతంలో అన్లోడ్ చేశారు. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో డెలివరీ అయిన కంటైనర్‌లో డ్రగ్స్ ఉన్నట్లు సీబీఐకు సమాచారం అందడంతో ఆనవాళ్లు గుర్తించేందుకు స్నిఫర్ డాగ్స్ కావాలని పోలీస్ శాఖను కోరారు. కొంతసేపటి తరువాత వాటిని వెనక్కు పంపించారు. నేను కూడా అక్కడ నుంచి వెళ్లిపోయా. ఆ తరువాత కస్టమ్స్, సీబీఐ అధికారులు కంటైనర్‌లో ఉన్న వాటిని పరీక్షించారు. ఈ తనిఖీలతో విశాఖ పోలీసులకు, అధికారులకు సంబంధం లేనందున ఎవరూ పాల్గొనలేదు. తప్పుగా అర్థం చేసుకున్నారు.. కంటైనర్‌లో డ్రగ్స్ తెరిచినప్పటి నుంచి ఆనవాళ్ల పరీక్ష పూర్తయ్యే వరకు ప్రతి అంశాన్ని రికార్డ్ చేసేందుకు సీబీఐ అధికారులు ఓ ప్రైవేటు వీడియోగ్రాఫర్‌ను వెంట తెచ్చుకున్నారు. కంటైనర్‌ను తెరిచే సమయంలో వీసీటీపీఎల్తోపాటు ప్రైవేటు సంస్థ సిబ్బంది, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. వీడియో రికార్డింగ్‌కు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నందున వారిని అక్కడి నుంచి పంపించారు. ఇలా వృథా అయిన సమయాన్ని స్థానిక అధికారులు గుమిగూడటం కారణంగా ప్రొసీడింగ్స్‌లో జాప్యం జరిగినట్లు ఎఫ్ఐఆర్లో సీబీఐ అధికారులు పేర్కొన్నారు. వీసీటీపీఎల్, ప్రైవేటు సంస్థ అధికారులు రావడాన్ని సీబీఐ ప్రస్తావిస్తే దాన్ని జిల్లా అధికారులకు ముడిపెట్టడం సరికాదు. ఈ విషయంపై సీబీఐ అధికారులతో మాట్లాడి స్పష్టత తీసుకున్నాం. సీబీఐ అధికారులు వినియోగించిన టెక్నికల్ పదాలను తప్పుగా అర్థం చేసుకొని సంబంధం లేని అధికారులపై ఆరోపణలు చేయడం సరికాదు.’ అని సీపీ చెప్పారు. స్మగ్లింగ్ ముఠాలపై ఉక్కుపాదం ‘గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. పోలీసులతో పాటు ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసి రాష్ట్రంలో డ్రగ్స్ నిరోధానికి చర్యలు చేపట్టింది. విశాఖపట్నంలో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేశాం. ప్రత్యేక బృందాలతో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా శాటిలైట్ చిత్రాలను సేకరించి గంజాయి తోటలను ధ్వంసం చేశాం. ప్రసుత్తం విశాఖపట్నంలో గంజాయి లేదా ఇతర డ్రగ్స్ లేవు. ఒడిశా, మల్కన్‌గిరి, జైపూర్, కోరాపుట్ లాంటి ప్రాంతాల నుంచి రవాణా జరుగుతోంది. విశాఖపట్నంలో అన్ని రకాల రవాణా సదుపాయాలు ఉండడంతో ఇతర రాష్ట్రాల గంజాయి, మాదక ద్రవ్యాల స్మగ్లర్లు జిల్లాను ట్రాన్సిట్ కేంద్రంగా వినియోగించుకుంటున్నారు. వీరిపై గట్టి నిఘా పెట్టి అంతర్రాష్ట గంజాయి ముఠాలను అరెస్టు చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి విశాఖపట్నం మీదుగా మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్న ముఠాలను అరెస్టు చేస్తుంటే నగరం గంజాయికి కేంద్రంగా మారిందని దు్రష్పచారం చేయడం సరికాదు.’ అని పోలీస్ కమిషనర్ రవిశంకర్ వివరించారు. -
చంద్రబాబు సతీమణి పై చర్యలు తీసుకోవాలని కోరాం
-
హైదరాబాద్ లో రూ.9కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
-
వైజాగ్ డ్రగ్స్ కేసు చంద్రబాబు కథ అడ్డం తిరిగింది
-
విశాఖ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. డ్రగ్స్ కేసులో వీరభద్రరావు, కోటయ్య చౌదరిని సీబీఐ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. 140 శాంపిల్స్‌ను సీబీఐ మేజిస్ట్రేట్ ఎదుట మరోసారి పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఐ అధికారుల బృందంతో పాటు డీఐజీ విశాల్ గున్ని మరోసారి పోర్టులో కంటైనర్‌ని పరిశీలించారు. విదేశాల నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన నౌకలో భారీ స్థాయిలో డ్రగ్స్‌ను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఈ స్మగ్లింగ్ దందా వెనుక టీడీపీ నేతల పాత్ర ఉందనే విషయం బట్టబయలైంది. తీగ లాగితే డొంక కదిలినట్లు ఇందులో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబ, వ్యాపార సంబంధాలూ బయటపడ్డాయి. ఇంటర్‌పోల్ సమాచారంతో ఆపరేషన్ గరుడలో భాగంగా ఎవరికీ అనుమానం రాకుండా డ్రై ఈస్ట్‌తో కలిపి బ్యాగుల్లో ప్యాక్ చేసిన ఈ డ్రగ్స్ కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్‌లో 25 కేజీల చొప్పున 1000 బ్యాగ్‌లు.. మొత్తంగా 25 వేల కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్ట్‌తో మిక్స్ అయిన డ్రగ్స్ ఉండటంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఇదీ చదవండి: విశాఖ పోర్టులో దొరికిన 25వేల కిలోల డ్రగ్స్.. 'కేరాఫ్ కోటయ్య చౌదరి' -
విశాఖ డ్రగ్స్.. చంద్రబాబు, లోకేష్‌లపై విచారణ జరపాలి
సాక్షి, విజయవాడ: ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్ మీనాను వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. సీఈవోతో పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు, మనోహర్ రెడ్డి, నారాయణ మూర్తి భేటీ అయ్యారు. వైజాగ్ డ్రగ్ రాకెట్లో చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి, టీడీపీ నేతల కుటుంబ సభ్యుల పాత్రపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అసాంఘిక శక్తులను ప్రోత్సహించడానికి టీడీపీ నేతలు ఈ డ్రగ్స్‌ని తెప్పించే ప్రయత్నం చేసారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు అవాస్తవాలతో వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై చేసిన ట్వీట్‌పైన చర్యలు తీసుకోవాలని సీఈవోకి ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. లోతుగా విచారణ జరపాలని సీఈవోకు ఫిర్యాదు చేశామని.. విచారణ జరిపి వీటిని అరికట్టాలని కోరామని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. విశాఖ సంఘటనతో భారతదేశం ఉలిక్కిపడింది. 25 వేల కిలోల మత్తు పదార్థాలను సీబీఐ పట్టుకుంది. ఆ డ్రగ్స్ లావాదేవీలు జరిపిన సంస్థలు ఎవరో తెలకుండానే చంద్రబాబు మా పార్టీ పై విషం చిమ్మాడు. సీబీఐ నోరు విప్పకుండానే చంద్రబాబు బయటకొచ్చాడు. చంద్రబాబు మరిది, వదినకి చుట్టాలే డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నారు. చంద్రబాబు వదిన చుట్టాలు, పిల్లలే ఈ కంపెనీతో సంబంధాలు ఉన్నవాళ్లే. చంద్రబాబు ఓటు కోసం డ్రగ్స్ పంచేందుకు తెచ్చారేమో అన్న అనుమానం ఉంది. దీనిలో చంద్రబాబు, లోకేష్‌లపై విచారణ జరపాలని కోరాం’’ అని పేర్ని నాని పేర్కొన్నారు. ‘‘గతంలో ఐదేళ్ల కిందట సింగపూర్ మంత్రిని తెచ్చాడు. ఆ సింగపూర్ మంత్రి జైల్లో ఉన్నాడు. చంద్రబాబుకి ఇతర దేశాల్లోని మాఫియాలతో అంటకాగిన చరిత్ర ఉంది. చంద్రబాబు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతాడు. ఓట్ల కోసం టీడీపీ డ్రగ్స్ పంచకుండా అడ్డుకోవాలని ఈసీని కోరాం. దీనిపై చర్యలు తీసుకుంటామని సీఈఓ చెప్పారు. చంద్రబాబు ట్వీట్‌పై కూడా ఫిర్యాదు చేసాం. తప్పుడు ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకోవాలని ఈసీ నిబంధనలు ఉన్నాయి. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. ప్రలోభ పెట్టేందుకు చెక్కులు పంచిపెట్టారు. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారో కోరాం. దానిపై జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తామని అన్నారు. ఈనాడు పత్రికపై విషంతో వార్తలు రాశారు. ఈనాడు నిరాధార ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాం’’ అని పేర్ని నాని తెలిపారు. ఇదీ చదవండి: విశాఖ డ్రగ్స్.. చంద్రబాబు ఇంగితం లేని మాటలు: సజ్జల -
నారా, నందమూరి ఫ్యామిలీ వాళ్లే డ్రగ్స్ కేసులో నిందితులు
-
విశాఖ డ్రగ్ కేసు..నిజ నిజాలు..
-
విశాఖ డ్రగ్స్.. చంద్రబాబు ఇంగితం లేని మాటలు: సజ్జల
సాక్షి, గుంటూరు: విశాఖ డ్రగ్స్ విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. డ్రగ్స్ విషయంలో బీజేపీ, టీడీపీ నేతల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేసిన సజ్జల.. తప్పించుకోవడానికే ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని అన్నారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘విశాఖ పోర్టులో సీబీఐ డ్రగ్స్‌ను సీజ్ చేసింది. పురంధేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలు ఉన్నాయి. టీడీపీ నేతలు కావాలనే మాపై ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు. వ్యవస్థల మీద గౌరవం లేని వ్యక్తి చంద్రబాబు. వీధి స్తాయి మనస్తతత్వం చంద్రబాబుది. తప్పుడు చేయడం టీడీపీకి అలవాటుగా మారింది. గత ప్రభుత్వ హయాంలో గంజాయి, డ్రగ్స్‌పై తూతు మంత్రంగా దాడుల చేశారు. డ్రగ్స్ నిందితులకు టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయి. తప్పు చేసి రివర్స్‌లో మాపైనే ఆరోపణలు చేస్తున్నారు. తప్పించుకోవడానికే మాపై నిందలు వేస్తున్నారు. .. మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని చంద్రబాబు కలలు కంటున్నారు. వైఎస్సార్సీపీకి జనాల్లో విపరీతమైన ఆదరణ ఉంది. అది తట్టుకోలేకపోతున్నారు. వాళ్లకు చెప్పుకోవడానికి ఏమీ లేక ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. డ్రగ్స్ విషయంలో నిజాలు నిగ్గు తేల్చాలని సీబీఐకి లేఖ రాస్తాం. ఎన్నికల మిషన్ కూడా డ్రగ్స్‌పై దృష్టి పెట్టాలని కోరతాం. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి పబ్బం గడుపుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది’’ అని సజ్జల మండిపడ్డారు. సజ్జల ప్రెస్మీట్లో ముఖ్యాంశాలు డ్రగ్స్ కేసులో దొంగే దొంగా దొంగా అన్నట్టుగా టీడీపీ ఆరోపణలు చేస్తోంది ఏ మాట్లాడుతున్నాం అనే ఇంగితం ఉండాలి కదా చంద్రబాబూ?: టీడీపీ వారి అరుపులే నిజాలైపోతే..ఆ పార్టీ చెప్పే అబద్ధాలన్నీ కూడా నిజాలైపోతాయి. గాల్లోంచి తీసి కల్పితాలను కూడా నిజాలుగా వారు చిత్రీకరించగలరు. గుమ్మడికాయ దొంగెవరూ భుజాలు తడుముకుంటున్న చందాన దొంగే దొంగ దొంగ అని అరుచుకుంటూ వెళ్తున్నారు. వైజాగ్ డ్రగ్స్ కేసు సినీ ఫక్కీలో పట్టుబడింది. సీబీఐ దాన్ని పట్టికుంది. ఓ వైపు విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ వారి పైత్యం విపరీతంగా మారిపోతోంది. నేరుగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పుకునే లోకేశ్‌లు కూడా ట్వీట్లు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. అసలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు. మళ్లీ ముఖ్యమంత్రి కావాలని తాపత్రయపడుతున్నాడు. మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనే ఇంగితం ఉండాలి కదా? జరిగిన విషయంలో వాస్తవాలు ఏంటి? అనేది అంత అనుభవం ఉన్న వ్యక్తి ఆలోచించుకోవాలి కదా? భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నారు. అది దేశంలోకి వచ్చి ఉంటే భయంకరంగా ఉండేది. పట్టుకోవడం ఓ పెద్ద రిలీఫ్. వీళ్లు అరిచే అరుపులు చూస్తుంటే వీళ్లే దాని వెనుక ఉన్నారేమో అనే అనుమానం కలుగుతోంది. పోనీ ఆ కంపెనీ చరిత్ర తీస్తే అంతా వారి కుటుంబాలకు దగ్గరగా ఉండే బంధువులు. సాక్షాత్తు పురందేశ్వరి కొడుకు కూడా వారి కంపెనీల్లో భాగస్వామిగా ఉన్నారు. ఆమె వియ్యంకుడు కూడా ఆ కంపెనీలో పార్టనర్‌గా ఉన్నారు. వాళ్లు ప్రమోట్ చేసిన కంపెనీ నుంచి తర్వాత డివైడ్ అయ్యారు. ఇలాంటి నేపథ్యంలో మేం ఆరోపణ చేస్తే వాళ్లు సంజాయిషీ ఇచ్చుకోవాల్సింది పోయి ఉల్టా మాపై ఆరోపణలు చేస్తున్నారు. కచ్చితంగా టీడీపీ వారి ప్రమేయం ఉందని మా అనుమానం: ఎన్నికలకు వెళ్తున్న సమయంలో మాపై బండ వేసి లబ్ధిపొందాలని చూస్తున్నారు. మేం దానికి సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితి వస్తోంది. ఒక్క ఈ విషయమే కాదు..ప్రతి ఒక్క దాంట్లో ఇలానే అర్ధం లేని ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. దీనిలో కచ్చితంగా టీడీపీకి సంబందించిన వారి ప్రమోయం ఉందని మేం బలంగా అనుమానిస్తున్నాం. వాళ్ల ఉలికిపాటు చూస్తుంటే, దాన్ని తెచ్చి ప్రభుత్వంపై, వైఎస్సార్సీపీపై నింద వేయాలని చూస్తుంటే వీళ్లు తప్పించుకోడానికే నింద వేస్తున్నారని అనిపిస్తోంది. కచ్చితంగా దీని వెనుక చంద్రబాబు, ఆయన కొడుకు, ఆయన వదిన పురందేశ్వరి, వారి గ్యాంగ్ ఉన్నాయని మేం అనుమానిస్తున్నాం. విచారణలో ఈ కోణం కూడా చూడాలని మేం సీబీఐకి పిటిషన్ పెడుతున్నాం. ఈ దిశలో కూడా విచారణ జరగాలని కోరుతున్నాం. గంజాయి, డ్రగ్స్ క్యాపిటల్ అంటూ వీళ్లు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. గతంలో గంజాయి పండించి..టీడీపీ నాయకులే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని వందల కోట్లు సంపాదిస్తున్నారన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి సాగును ధ్వంసం చేయడమే కాకుండా ప్రత్యామ్నాయ జీవనోపాధి కూడా చూపించాం. దానిపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆపరేషన్ పరివర్తన కార్యక్రమాన్ని మెచ్చుకుంది. ఎస్ఈబీ పెట్టిన తర్వాత 12వేల ఎకరాల్లో సాగును ధ్వసం చేశారు. ఇప్పుడు డ్రగ్ ఇంపోర్ట్ చేసుకున్న కంపెనీ తప్పుడు పనులు చేస్తే చర్యలు తీసుకుంది కూడా జగన్ గారి ప్రభుత్వమే. డ్రగ్స్ వాడకాన్ని తగ్గించడానికి, సాగు లేకుండా చేయడానికి మేం కన్‌స్ట్రక్టివ్‌గా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మేం చేపట్టిన చర్యలను మెచ్చుకోకపోగా..చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మాపై ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల్లో చెప్పుకోడానికి ఏమీ లేదు కాబట్టి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. థర్డ్ గ్రేడ్ కంటే హీనమైన వ్యక్తి లోకేశ్: ఈ డ్రగ్స్ కేసులో ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు రాతలపై కూడా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేస్తున్నాం. థర్డ్ గ్రేడ్ కంటే హీనమైన స్థాయిలో లోకేశ్ ఉన్నాడు. ఎందుకు ట్వీట్ చేస్తున్నాడో, ఏం చేస్తున్నాడో కూడా అతనికి అర్ధం కావడం లేదు. మోకాలికి బట్టతలకు సంబంధం కట్టి ఎక్కడో బ్రెజిల్ దేశంతో సంబంధం కడుతున్నాడు. ఎప్పుడో బ్రెజిల్ అధ్యక్షుడు గెలిచాడని విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తే దాన్ని పట్టుకొచ్చి ఈ కేసుకు అంటగడుతున్నారు. ఈ డ్రగ్స్ కేసులో ఎవరెవరూ ఉండే అవకాశం ఉంది అని చూస్తే సహజంగానే దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులే కనిపిస్తున్నారు. వీళ్లతో కలిసి ఎప్పుడూ తిరిగే వ్యక్తులు, ఆ కంపెనీ వారితో ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇది సహజంగానే వారిపైనే పడుతుంది. అలాంటి ఆలోచనలు చేసే లక్షణం కూడా చంద్రబాబుకు ఉంది కాబట్టి వారిపైనే అనుమానం. అందుకే ఉల్టా మాపైనే ఆరోపణలు చేస్తున్నారు. ఈ జన్మలో చంద్రబాబు, లోకేశ్‌లకు ప్రజలు అవకాశం ఇవ్వరని తెలిసి, ఆ ప్రస్టేషన్లో ఇలాంటి తప్పుడు, చౌకబారు ఆరోపణలు చేస్తున్నారు. జగన్ గారు ఎప్పుడూ ఇలాంటి వాస్తవ విరుద్ధ కామెంట్స్ చేయలేదు: మేము పాజిటివ్ ఎజెండాతో వెళ్తున్నారు. జగన్ గారు ఇలాంటి వాస్తవ విరుద్ధ మాటలు మాట్లాడటం ఏనాడైనా చూశారా? ఒక పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా, ఇంతకు ముందు ప్రతిపక్ష నాయకుడిగానైనా ఇలాంటి ఆధారాలు లేని కామెంట్స్ చేశారా? ఆయనైనా, సాక్షి పత్రికైనా ఎప్పుడూ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయలేదు. కానీ తండ్రీ కొడుకులు ముందుండి అబద్ధాలను వండి సామాజిక మాద్యమాల్లో ప్రచారం చేస్తారు. ఇలాంటివి వేల కొద్దీ కనిపిస్తాయి. అవే అబద్ధాలను ఆ పత్రికలు వార్తలుగా వండి వారుస్తున్నాయి. అదే కోణంలో గంజాయి, ఇసుక లాంటి ఆరోపణలన్నీ చేస్తున్నారు. వాళ్లకు చెప్పుకోడానికి ఏమీ లేదు. మేం చెప్పుకోడానికి చాలా ఉన్నాయి. సిద్ధం సభలు చూసినా, ఇంకే సభలు చూసినా మేం చేసినవి చెప్పుకుంటున్నాం. రాజకీయ పార్టీగా మేం చేసిన పనులు చెప్పాలి. కానీ థర్డ్ గ్రేడ్‌గా వ్యక్తిత్వ హననం చేసే అవాస్తవాలను ప్రచారం చేయడం రాజకీయం కాదు. అది రాజకీయం కాదని ప్రజలు 2019లో వారిని రిజెక్ట్ చేశారు. ఇచ్చిన హామీలను కూడా రెండో సారి చెప్పుకోవడం లేదు. అలా చెప్తే గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని జనం అడుగుతారని భయం. ఈ మధ్య పొద్దున లేవగానే ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లి లేని పోని ఫిర్యాదులు చేయడం రివాజుగా మారింది. ఆ అబద్ధపు ఫిర్యాదులను ఆ పత్రికలు బ్యానర్ స్టోరీలు రాస్తూ ప్రచారం చేస్తున్నారు. ఆ కూటమి సింగిల్ డిజిట్‌కు పరిమితం కాబోతోంది: ఈ ఎన్నికలో చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌లు సింగిల్ డిజిట్‌కి పరిమితం కాబోతున్నారు. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ఓటమి తర్వాత ఇలాంటి అబద్ధపు ఆరోపణలు చూపి మేం ఓడిపోయాం అని చెప్పుకోడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. డ్రగ్స్ కేసుకు సబంధించి ప్రెస్‌కౌన్సిల్, సీబీఐతో పాటు అన్ని సంస్థలకూ మా పిటిషన్లు వెళ్తాయి. ముందు ఇది తేలాలి. దీని వెనుక బలమైన ఆధారాలతో చంద్రబాబు, ఆయన వదిన కుటుంబం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. ఎన్నికల కమిషన్ కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరతాం. ఇదే సమయంలో మా పాజిటివ్ ఎజెండాతో మేం ముందుకు వెళ్తాం. వాళ్లలా అడ్డదారుల్లో బయట పడాలని ప్రయత్నం చేయడం మాకు ఏనాడూ అలవాటు లేదు. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి పబ్బం గడుపుకోవాలని చూసే వారి ఆటలు సాగనివ్వం. ఒక సెంట్రల్ ఎజెన్సీ వచ్చిన తర్వాత లోకల్ పోలీసులకు ఇన్ఫాం చేస్తారు. దానికి సంబంధించి ఈ రోజు విశాఖ సీపీ కూడా వివరణ ఇచ్చారు. ఈనాడు రాతలకు తలాతోక ఉందా?: ఈ రోజు ఈనాడు పత్రికలో రాసిన రాతలకు తలా తోక ఉందా? రామోజీరావు ప్రజల సొమ్ముతో మార్గదర్శితో అవినీతి రాజ్యం నడిపి దందా చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి గంగవెర్రులెత్తిపోయి ఏ రాస్తున్నారో తెలియకుండా రాస్తున్నాడు. చంద్రబాబు స్కిల్ స్కాం కూడా జగన్ గారే చేశారనే అంటాడేమో? వైజాగ్‌లో వైఎస్సార్సీపీ నేత అడ్డుకోవాలని చూశారు అంటాడు. ఎవరో పేరు రాయవచ్చుగా. ఆధారాలు చూపించవచ్చుగా? ఆధారాలు లేకుండా ఎలా నోటికొచ్చినట్లు రాస్తాడు? పోలీసులు అడ్డుపడ్డారని రాశాడు. అది ఎక్కడో రాయవచ్చుగా? ఒక పత్రికగా వార్త రాసేటప్పుడు ఇలాంటి రాతలు రాయడం విడ్డూరం. సాక్షాత్తు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అలాంటి కామెంట్స్ చేస్తారా? వ్యవస్థలపైనే గౌరవం లేని వ్యక్తి చంద్రబాబు. తాను ప్రతిపక్షంలో ఉంటే లోకమంతా చండాలంగా ఉందంటాడు. తను రూలింగ్‌లో ఉంటే అంతా బాగుంది అంటాడు. ఇతని మాదిరిగా పంచాయితీలు చేసే లక్షణం జగన్ గారికి లేదు. వీధి స్థాయి మనస్థత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు. అదే అందరికీ ఉందన్నట్లు చూపాలని చూస్తాడు. జగన్ గారు అలాంటి వ్యక్తి కాదు. ప్రభుత్వంలో ఉన్నా వ్యవస్థలు వాటి అవి చేసుకుని పోవాలని కోరుకుంటారు. ఒక వేళ ఎవరన్నా ఇలా చేశారని అంటున్నప్పుడు ఆధారాలు చూపాలి. నోరుంది కదా, పేపర్ ఉంది కదా..జనంలోకి అబద్ధాలు పంపితే నమ్మే కాలం కాదిది. మీరు ఏది రాస్తే అది జనం నమ్ముతారనుకుంటే పొరపాటే. ఆ ఇంగితం రామోజీ, రాధాకృష్ణ, చంద్రబాబులకు ఉండాలని కోరుకుంటున్నా -
నిజాలు తెలుసుకోకుండా వార్తలు రాస్తున్నారు..
-
సీబీఐ వాళ్లు పిలిస్తేనే పోర్టుకు వెళ్ళాం
-
విశాఖ డ్రగ్స్ కేసు:‘వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు రాయవద్దు’
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ సీపీ రవిశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటర్‌పోల్ సమాచారంతో సీబీఐ విశాఖకు వచ్చిందని చెప్పుకొచ్చారు. సీబీఐ పిలిస్తేనే పోలీసులు అక్కడికి వెళ్లినట్టు తెలిపారు. ఇదే సమయంలో తమపై ఎలాంటి పొలిటికల్ ఒత్తిడిలేదని స్పష్టం చేశారు. కాగా, రవిశంకర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘ఈ డ్రగ్స్ కేసు అంతా సీబీఐ పర్యవేక్షిస్తోంది. సీబీఐ నుంచి మాకు కాల్ వచ్చింది. వారు డాగ్ స్క్వాడ్ కావాలని మమ్మల్ని అడిగారు. తర్వాత డాగ్ స్క్వాడ్ వద్దని చెప్పారు. కేవలం డాగ్ స్క్వాడ్ కోసమే స్థానిక పోలీసులు వెళ్లారు. సీబీఐ విన్నపం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లారు. విశాఖ పోర్టు మా పరిధిలో ఉండదు. మేము కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో పనిచేస్తున్నాం. విధి నిర్వహణలో మమ్మల్ని ఎవరూ ఒత్తిడి చేయలేరు. ఏపీ పోలీసులపై సీబీఐ ఎలాంటి ఆరోపణలు చేయలేదు. మా పరిధిలోలేని ప్రైవేటు పోర్టుకు కస్టమ్స్ అధికారులు పిలిస్తేనే వెళ్లాం. వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు రాయడం మంచిది కాదు. కావాలని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి వదంతులు సృష్టిస్తున్నారువిశాఖ డ్రగ్స్ వ్యవహారాన్ని సీబీఐ చూస్తోంది. విశాఖ చాలా సేఫ్ సిటి. లోకల్ అధికారుల వల్ల లేటు అయ్యిందని చెప్పడం టెక్నికల్ టెర్మినాలజీ మాత్రమే. మేము (NDPS) ఎన్డీపీఎస్ యాక్ట్ సాయంతో డ్రగ్స్ నేరస్తులపై ఉక్కుపాదం మోపుతున్నాం. విశాఖను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేస్తున్నాం. గత ఐదేళ్ల కాలంలో డ్రగ్స్‌ను కట్టడి చేస్తున్నాం. గంజా స్మగ్లింగ్‌ను అడ్డుకున్నాం’ అని కామెంట్స్ చేశారు.


