పార్టీలో మూడు రకాల మత్తు పదార్థాలు | New angle in Rohit Reddy farmhouse drug party case | Sakshi
Sakshi News home page

పార్టీలో మూడు రకాల మత్తు పదార్థాలు

Mar 19 2026 5:38 AM | Updated on Mar 19 2026 5:38 AM

New angle in Rohit Reddy farmhouse drug party case

డ్రగ్స్‌ పార్టీ జరిగిన రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌

రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ పార్టీ కేసులో కొత్త కోణం 

సిట్‌ అధికారులతో సీపీ సుదీర్‌బాబు భేటీ

మొయినాబాద్‌/ శంషాబాద్‌ రూరల్‌: సంచలనం సృష్టించిన మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. డ్రగ్స్‌ కేసు నిగ్గు తేల్చడానికి ఏర్పాటైన సిట్‌ బృందం విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే బుధవారం పలు కీలక విషయాలను సేకరించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మున్సిపాలిటీలోని అజీజ్‌నగర్‌లో ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో నిందితులు మూడు రకాల డ్రగ్స్‌ వాడినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. 

కొకైన్, ఎండీఎంఏ, మెథోఇథిఫిన్‌ వినియోగించినట్లు తెలుసుకున్నారు. కౌశిక్‌ రవి సిమ్లాలోని ఓ గుర్తుతెలియని వ్యక్తి వద్ద రూ.15 వేలకు కొకైన్‌ కొనుగోలు చేసినట్లు పట్టుబడిన రోజే పోలీసులకు చెప్పాడు. సిట్‌ విచారణలో భాగంగా ఎండీఎంఏ, మెథోఇథిఫిన్‌ డ్రగ్స్‌ను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అభిషేక్‌ నుంచి రోహిత్‌రెడ్డి డ్రైవర్‌ శరత్‌ హైదరాబాద్‌లోని అప్పా జంక్షన్‌ వద్ద కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అభిషేక్‌ కొన్నేళ్లుగా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు, గతంలో అతనిపై ఓ కేసు నమోదైనట్లు సిట్‌ అధికారులు కనుగొన్నారు. 

కస్టడీపై తీర్పు రిజర్వు 
పార్టీలో రోహిత్‌రెడ్డి రెండు రకాల డ్రగ్స్‌ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అధిక కిక్కుకోసం ఖరీదైన మద్యంలో కొకైన్, మెథోఇథిఫిన్‌ కలుపుకొన్నారని, ఢిల్లీ వ్యాపారి నమిత్‌ శర్మ మూడు రకాల డ్రగ్స్‌ తీసుకున్నారని విచారణలో తేలింది. స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపిన నిందితులను మంగళవారం విచారించిన సిట్‌ అధికారులు డ్రగ్స్‌ మూలాలపైనే దృష్టి సారించారు. ఇందులో భాగంగానే పార్టీలో మూడు రకాల డ్రగ్స్‌ వాడిన విషయం తెలిసింది. జ్యుడీíÙయల్‌ రిమాండ్‌లో ఉన్న రోహిత్‌రెడ్డి, రితే‹Ùరెడ్డి, నమిత్‌ శర్మలను కస్టడీకి తీసుకుంటే అసలు విషయాలు బయటకొస్తాయని పోలీసులు భావిస్తున్నారు. వీరిని ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు రాజేంద్రనగర్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. ఇరువురి వాదనలను విన్న న్యాయస్థానం తీర్పును ఈ నెల 20కి రిజర్వ్‌ చేసింది.  

సీపీ సమావేశం: డ్రగ్స్‌ కేసు విచారణ చేపడుతున్న సిట్‌ అధికారుల బృందంతో ఫ్యూచర్‌ సిటీ కమిషనర్‌ సు«దీర్‌బాబు సమావేశమయ్యారు. శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు రంగాలకు చెందిన వ్యక్తులు డ్రగ్స్‌ పార్టీ నిర్వహించడానికి గల కారణాలను విచారణలో రాబట్టాలని సీపీ సూచించినట్లు తెలిసింది.   

Advertisement
 
Advertisement
Advertisement