ఆర్భాటాలు కాదు, లెక్కలు చెప్పు.. పవన్‌కు రాహుల్‌ రామకృష్ణ చురకలు! | Actor Rahul Ramakrishna Questions Pawan Kalyan Over RTI Transparency Posts Went Viral, Says Asking Questions Isn’t Anti-National | Sakshi
Sakshi News home page

గొప్పలు పక్కన పెట్టి లెక్కలు చెప్పు.. పవన్‌పై రాహుల్‌ రామకృష్ణ ప్రశ్నాస్త్రాలు

Jun 8 2026 10:31 AM | Updated on Jun 8 2026 11:12 AM

Rahul Ramakrishna Fires On Pawan Kalyan

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టాలీవుడ్‌ నటుల్లో రాహుల్‌ రామకృష్ణ ఒకరు. కేవలం సినిమా కబుర్లనే కాకుండా సమాజంలో చోటు​ చేసుకున్న పలు అంశాలపై తనదైన శైలీల్లో స్పందిస్తుంటాడు.  తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై ఈ కమెడియన్‌ ఎక్స్‌ వేదికగా ప్రశ్నాస్త్రాలు సంధించాడు.  మీ గొప్పలు పక్కన పెడితే రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌ కింద మీరు నిర్వహించే శాఖల్లోని సమాచారాన్ని వెల్లడిస్తున్నారా? అంటూ పవన్‌ని నిలదీస్తూ ఎక్స్‌లో వరుస పోస్టులు పెట్టాడు.

‘ PESA 1/70 చట్టం (ది పంచాయతీస్ ఎక్స్‌టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ యాక్ట్), గ్రామ సభ చట్టం అమలుకు సంబంధించిన ఫలితాలను దయచేసి అడిగి చూపించండి. అటవీకరణ కార్యక్రమాలు మీరు చేశారా? ఓ స్వతంత్ర సంస్థ కన్ఫర్మ్ చేసిన లెక్కల ప్రకారం అనుమానాస్పదంగా ఉన్నాయి. నేను దాఖలు చేసి గుర్తించిన ఫలితాలను అడుగుతున్నా.' అంటూ చివర్లో ‘జై తెలంగాణ’ అని ట్వీట్‌ చేశాడు.

ఆ తర్వాత మరో ట్వీట్‌లో ‘మీరు సాధారణంగా చేసే ఆర్భాటాలు పక్కన పెడితే..  మీరు నిర్వహించే ప్రతి శాఖలో సమాచార హక్కు చట్టంలోని క్రియాశీల సమాచారాన్ని బహిర్గతం చేయడానికి సంబంధించిన సెక్షన్ 4.1(బి)ని అమలు చేశారా సార్‌? నేను మీ అభిమానిగా అడుగుతున్నా.. ప్రశ్నలకు నిరంతరం సమాధానం చెప్పాలి. ప్రశ్నించినందుకు నేను దేశద్రోహిని కాదు’ అని రాహుల్‌ రామకృష్ణ తనదైన శైలీలో పవన్‌కు చురకలు అంటించాడు. 

కాగా,ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘తెలంగాణ మీ అయ్య జాగీరా ’ అంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ .. హైదరాబాద్‌లో తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ పెట్టేందుకు ప్రయత్నించగా.. తెలంగాణ పోలీసులు అనుమతించకపోవడంతో అదే రోజు ప్రెస్‌ మీట్‌ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మినహా తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. తెలంగాణ మేధావులు కూడా పవన్‌ వ్యాఖ్యలను తప్పుపట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement