భావోద్వేగాల తీరం | theeram movie title song launch event | Sakshi
Sakshi News home page

భావోద్వేగాల తీరం

Jul 28 2026 2:45 AM | Updated on Jul 28 2026 2:45 AM

theeram movie title song launch event

ప్రభు, హరిప్రియ

ప్రభు, హరిప్రియ జంటగా వంశీ మునగాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తీరం’. వైశాలి, నిరుడి శ్రీనివాస్, సంధ్య, కిట్టయ్య, శిరీష ఇతర పాత్రలు పోషించారు. శ్రీ భవానీ క్రియేషన్స్ పై ఉపేందర్‌ గంగావెల్లి రూపొందిన ఈ మూవీ పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. సాధ్విక్‌ సన్స్  సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘తీరం..’ అంటూ సాగే టైటిల్‌ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు.

‘పుష్ప’ ఫేమ్‌ నటుడు జగదీష్, ఫన్‌ బకెట్‌ మహేష్‌ విట్ట, నటుడు రాజ్‌కుమార్‌ కసిరెడ్డి, దర్శకుడు ప్రసాద్, నటులు సద్దాం, కుమానన్‌ ముఖ్య అతిథులుగా హాజరై, సాంగ్‌ను ఆవిష్కరించారు. ‘‘భావోద్వేగ భరితమైన కథతో ‘తీరం’ రూపొందింది’’ అన్నారు వంశీ మునగాల. ‘‘మా సినిమా రిలీజ్‌ డేట్‌ని త్వరలోనే  ప్రకటిస్తాం’’ అన్నారు ఉపేందర్‌ గంగవెల్లి. సంగీత దర్శకుడు సాధ్విక్‌ సన్స్ , కో–డైరెక్టర్, క్రియేటివ్‌ హెడ్‌–ఎడిటర్‌ విజయ్‌ శెట్టి మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement