సంతోష్, సుమంత్, మీనాక్షి గోస్వామి, కాలిపు మధు
సుమంత్, ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మహేంద్రగిరి వారాహి’. మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, ‘వెన్నెల’ కిషోర్, రాజీవ్ కనకాల, అలీ ఇతర పాత్రల్లో నటించారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో కాలిపు మధు, లక్ష్మణ్ నిర్మించారు. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా మీట్‌లో ఈ సినిమాను సెప్టెంబరు 11న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ–‘‘మహేంద్రగిరి వారాహి’ టీజర్‌ని హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.
ఈ సినిమాలో ఇంకా చాలా సర్‌ప్రైజ్‌లు, ట్విస్ట్‌లు, ఊహించని సన్నివేశాలు, ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయి’’ అని చెప్పారు. ‘‘వారాహి అమ్మవారి ఆశీస్సులతో పాటు ప్రేక్షకుల సపోర్ట్ మాపై ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు సంతోష్ జాగర్లపూడి. ‘‘సుమంత్‌గారు ఈ చిత్రం కోసం కష్టపడ్డారు’’ అన్నారు కాలిపు మధు.


