మరో ‘నీట్‌’ విద్యార్థిని బలవన్మరణం | Medical Aspirant Dies By Suicide in Maharashtra | Sakshi
Sakshi News home page

మరో ‘నీట్‌’ విద్యార్థిని బలవన్మరణం

Jul 27 2026 11:08 AM | Updated on Jul 27 2026 12:02 PM

Medical Aspirant Dies By Suicide in Maharashtra

అహిల్యానగర్: మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లా కర్జాత్ తాలూకా జలాల్‌పూర్ గ్రామానికి చెందిన 19 సంవత్సరాల ‘నీట్’ అభ్యర్థి అంకిత సంగాలే ఆత్మహత్య చేసుకున్నారు. ‘నీట్ రీ టెస్ట్‌’లో తక్కువ మార్కులు రావడంతో తీవ్ర మనస్తాపానికిలోనై, ఆమె తన స్టడీ రూమ్‌లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు.

ఈ పరీక్షలో అంకిత 166 మార్కులు సాధించారు. ఆశించిన మార్కులు రాకపోవడంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పేపర్ లీక్ వివాదం కారణంగా రీ టెస్ట్ నిర్వహించడానికి ముందు జరిగిన పరీక్షలో ఆమె మెరుగైన మార్కులు సాధించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన స్థలంలో నీట్ స్కోర్ గురించిన ప్రస్తావన ఉన్న సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కర్జాత్ పోలీస్ స్టేషన్‌లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఎన్సీపీ (ఎస్పీ) నేతలు  ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని, ధైర్యంగా ఎదుర్కొని పోరాడాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ‘నీట్’ కారణంగా ఇద్దరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్దారు.

ఇది కూడా చదవండి: ‘జంతర్ మంతర్’ లవ్‌ స్టోరీ.. తలకు గాయంతో వివాహం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement