టైగర్‌ రిజర్వులో తీవ్రగాయాలతో పులి మృతి | injured tigress found in pilibhit tiger reserve dies during treatment | Sakshi
Sakshi News home page

టైగర్‌ రిజర్వులో తీవ్రగాయాలతో పులి మృతి

Jul 27 2026 1:30 AM | Updated on Jul 27 2026 1:30 AM

injured tigress found in pilibhit tiger reserve dies during treatment

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పిలిభిత్ ,షాజహాన్‌పూర్ జిల్లాలపిలిభిత్ టైగర్ రిజర్వ్‌లో  తీవ్రంగా గాయపడిన ఐదేళ్ల పులి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ వివరాలని టైగర్‌ రిజర్వ్‌లోని అటవీ శాఖ అధికారి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

పీటీఆర్ డిప్యూటీ డైరెక్టర్, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (DFO) మనీష్ సింగ్ మాట్లాడుతూ.. శనివారం రాత్రి పులి మృతి చెందిందని తెలిసింది. దానిని పోస్ట్ మార్టం నివేదిక కోసం మృతదేహాన్ని బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కి పంపాం. మరణానికి గల అసలు కారణం పోస్ట్‌మార్టం నివేదిక అందిన తర్వాతే నిర్ధారించబడుతుంది"  అని అన్నారు.

ప్రాథమికంగా తెలిసిన సమాచారం ప్రకారం మరో పులితో జరిగిన భూభాగ వివాదం బెబ్బులి గాయపడి ఉండవచ్చని తెలిపారు. గత శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అటవీశాఖ అధికారులు రొటీన్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ పులి గాయపడినట్లు గుర్తించారు. ఈ జంతువుకు చికిత్స చేయడానికి దక్ష గంగ్వార్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన పశువైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే వైద్యులు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ  పులిప్రాణాలు దక్కలేదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement