భారత్ ఇప్పుడు తిరుగులేని శక్తి: ప్రధాని మోదీ | India Emerging as Trusted Global Defence Partner PM Modi's Mann Ki Baat | Sakshi
Sakshi News home page

భారత్ ఇప్పుడు తిరుగులేని శక్తి: ప్రధాని మోదీ

Jul 26 2026 12:01 PM | Updated on Jul 26 2026 12:12 PM

India Emerging as Trusted Global Defence Partner PM Modi's Mann Ki Baat

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 136వ ఎపిసోడ్‌ ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కార్గిల్ విజయ్ దివస్ ప్రాముఖ్యతను వివరిస్తూ, దేశ సైనికుల అసాధారణ ధైర్యసాహసాలు, త్యాగాలను కొనియాడారు. జూలై 14న ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ నుండి ప్రారంభమైన ‘శౌర్య విజయ్ యాత్ర’ ద్రాస్ లోని కార్గిల్ వార్ మెమోరియల్ వరకు సాగుతుందని తెలిపారు.

భారత రక్షణ రంగ తయారీ సామర్థ్యాలకు ప్రతీకగా ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌకను ఇటీవల నావికాదళంలో చేర్చినట్లు ప్రధాని వెల్లడించారు. ఈ ఆధునిక యుద్ధ నౌక పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారని, ఇందులో 75 శాతానికి పైగా స్వదేశీ పరికరాలనే వినియోగించినట్లు చెప్పారు. అలాగే లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్, కుషా క్షిపణి పరీక్షలు విజయవంతం కావడంపై డీఆర్డీఓను ప్రశంసించారు. ఇండోనేషియాతో బ్రహ్మోస్, అస్త్రా క్షిపణుల ఒప్పందం కుదిరిందని, రక్షణ రంగంలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతోందని పేర్కొన్నారు.

అంతర్జాతీయ వేదికలపై అద్భుత ప్రతిభ కనబరుస్తున్న భారతీయ అథ్లెట్లను ప్రధాని అభినందించారు. జపాన్ ఓపెన్ బాడ్మింటన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన పీవీ సింధును, లండన్ లోని లార్డ్స్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ విజయం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టును ప్రశంసించారు. కేరళలోని ఎర్నాకులం విద్యార్థుల సంస్కృత క్లబ్, ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన దేశపు తొలి రాకెట్ ‘విక్రమ్-1’ విజయవంతమైన ప్రయోగాన్ని కొనియాడారు. సైన్స్ ఒలింపియాడ్‌లలో విద్యార్థులు సాధించిన పతకాల గురించి ప్రస్తావించారు. కాశ్మీరీ సాంప్రదాయ చాపల తయారీ కళ ‘వాగు’ పునరుద్ధరణకు గులాబ్ హుస్సేన్, తన్జిలా చేస్తున్న కృషితో పాటు ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ జిల్లా మహిళలు తయారు చేస్తున్న ‘విదుర్ ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ’ విశేషాలను ప్రధాని వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement