జైలుపాలైన లాలూ ప్రసాద్ పెద్ద కుమారుడు! | Tej Pratap Yadav Sent to 14 Day Judicial Custody in Patna | Sakshi
Sakshi News home page

జైలుపాలైన లాలూ ప్రసాద్ పెద్ద కుమారుడు!

Jul 26 2026 9:23 AM | Updated on Jul 26 2026 9:25 AM

Tej Pratap Yadav Sent to 14 Day Judicial Custody in Patna

పట్నా: నీట్‌ పేపర్‌ లీకేజీ నిరసనల సమయంలో అరెస్టయిన జనశక్తి జనతాదళ్‌ (జేఎస్‌జేడీ) అధినేత తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌కు బిహార్‌లోని పట్నా కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. పట్నాలోని డాక్‌ బంగ్లా చౌరస్తా సమీపంలోని ఓ మాల్‌లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కుమారుడైన తేజ్‌ ప్రతాప్‌ను శనివారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేసి, దిఘా పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆయనను జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్‌ మంజూరు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను బెయిల్ సెంట్రల్ జైలుకు తరలించారు.

నీట్‌ పేపర్‌ లీకేజీ ఆరోపణలు, ఢిల్లీలో విద్యార్థి ఆందోళనకారులపై పోలీసుల లాఠీచార్జీని నిరసిస్తూ విపక్షాలు, పలు సంస్థలు తలపెట్టిన బిహార్‌ బంద్‌ సందర్భంగా శనివారం పాట్నాలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకారులు పట్నాలో పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. విద్యార్థుల నిరసనల నడుమ ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేశారు.

నీట్‌ పేపర్‌ లీక్‌పై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు తేజ్‌ ప్రతాప్‌ రామ్‌ గులామ్‌ చౌక్‌ వద్ద నిరసనల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీ మైదాన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అరెస్టు సమయంలో తేజ్‌ ప్రతాప్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల డిమాండ్‌లు న్యాయమైనవని, ప్రభుత్వం వాటిని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులు, యువత కోసం ప్రాణాలనైనా త్యాగం చేయడానికి తాను సిద్ధమని పేర్కొన్నారు. సోమవారం బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు ఆయన తరఫు న్యాయవాది జగన్నాథ్‌ సింగ్‌ తెలిపారు.

ఇది కూడా చదవండి: జంతర్‌ మంతర్‌లో భారీగా చెత్త.. తొలగిస్తున్న 500 మంది సిబ్బంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement