పాక్‌తో చర్చలు కేవలం పీఓకేపైనే.. | Kargil Vijay Diwas Nation Honors Bravehearts on 27th Anniversary | Sakshi
Sakshi News home page

పాక్‌తో చర్చలు కేవలం పీఓకేపైనే..

Jul 26 2026 10:30 AM | Updated on Jul 27 2026 5:12 AM

Kargil Vijay Diwas Nation Honors Bravehearts on 27th Anniversary

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ వ్యాఖ్య

ద్రాస్‌: ఉగ్రవాదాన్ని పాకిస్తాన్‌ తమ రాజ్య విధానంలో ఒక భాగంగా మార్చేసుకుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరోపించారు. పాకిస్తాన్‌ అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగమైన పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ అంశంపై తప్ప ఆ దేశంతో ఇతర అంశాలపై చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. ఆయన ఆదివారం లద్దాఖ్‌లోని ద్రాస్‌లో కార్గిల్‌ విజయ్‌ దివస్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్గిల్‌ యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లను నివాళులర్పించారు.

 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధంలో మన సైనికులు ఎన్నో త్యాగాలు చేశారని, శత్రుదేశాన్ని చిత్తుచిత్తుగా ఓడించారని చెప్పారు. నాటి యుద్ధంలో భారత్‌ సాధించిన విజయాన్ని భరతమాత కిరీటంలో పొదిగిన వజ్రంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ అభివరి్ణంచారు. ఉగ్రవాద భూతంతో భారత్‌ను బెదిరించడానికి ప్రయత్నించే వారి గతి ఏమవుతుందో ఆపరేషన్‌ సిందూర్‌ స్పష్టంగా చాటిచెప్పిందని పేర్కొన్నారు.    

జాతికి గర్వకారణం: ప్రధాని మోదీ 
కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని ప్రధాని మోదీ మన వీర జవాన్ల సేవలను స్మరించుకున్నారు. ‘అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా వారు ప్రదర్శించిన ధైర్యసాహసాలు ఎప్పటికీ మన జాతికి గర్వకారణంగా నిలిచిపోతాయి. వారి అచంచలమైన దేశభక్తి, విధి నిర్వహణలో అంకితభావం భావి తరాలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తాయి’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. మాతృభూమి రక్షణ కోసం వీరోచితంగా పోరాడి అసువులు బాసిన కార్గిల్‌ వీరులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం ఘనంగా నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement