breaking news
Bravehearts
-
సియాచిన్ డే: అత్యంత ఎత్తయిన యుద్ధభూమిలో భారత్ విజయం
న్యూఢిల్లీ: ఈరోజు (ఏప్రిల్ 13) అమరవీరులకు భారత సైన్యం ఘన నివాళులు ఆర్పిస్తూ ‘సియాచిన్ డేను నిర్వహిస్తోంది. 1984లో సియాచిన్ మంచునదిపై సాధించిన విజయాన్ని భారత్ స్మరించుకుంటోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన (5,400 మీటర్ల పైన) యుద్ధభూమిలో జరిగిన పోరాటంలో భాగస్వామ్యం వహించిన వీరులను భారత సైన్యం సమున్నతంగా గౌరవిస్తోంది. సియాచిన్ గ్లేసియర్ (మంచునది) జమ్ముకశ్మీర్‌లో భారత్-పాక్ సరిహద్దులో ఉంది. 1984లో ఆపరేషన్ మేఘదూత పేరుతో భారత సైన్యం ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. నాడు -50°C ఉష్ణోగ్రత, ఆక్సిజన్ కొరత వంటి కఠినమైన వాతావరణంలో భారత సైనికులు పోరాటం సాగించారు. సియాచెన్ డే సందర్భంగా భారతసైన్యం వీర స్మారక కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. సియాచిన్ యుద్ధంలో మరణించిన సైనికులకు ఘనంగా నివాళులు అర్పిస్తుంది.సియాచిన్ డే నాడు వివిధ సైనిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. అత్యాధునిక శస్త్రాస్త్రాలు, హిమప్రదేశాల్లో యుద్ధ వ్యూహాలను ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. పలు కార్యక్రమాల్లో కమాండర్లు ప్రసంగిస్తారు. పస్తుతం సియాచిన్‌పై భారత్ పూర్తి నియంత్రణ కలిగి ఉంది. ఇక్కడి పనిచేసే సైనికులు ప్రత్యేక శిక్షణ పొందుతారు. అతిశీతల పరిస్థితుల్లో పోరాడేందుకు నిత్యం సిద్ధంగా ఉంటారు. సియాచిన్ డే అనేది భారత సైన్యం చూపిన ధైర్యం, త్యాగాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇది కూడా చదవండి: ఆలయంలో దౌర్జన్యం.. గేటు తీయలేదని పూజరిపై దాడి -
ట్రాఫిక్ ఎస్సై ధైర్యసాహసాలు.. ప్రశంసలు!
సాక్షి, విజయవాడ: ఓ ట్రాపిక్ ఎస్సై ధైర్యసాహసాలు ప్రదర్శించి.. చురుగ్గా స్పందించి ఓ మహిళ ప్రాణాలను కాపాడాడు. కృష్ణలంక సమీపంలోని బందరు కాల్వలో ఓ మహిళ అదుపుతప్పి పడిపోయింది. కాల్వలో కొట్టుకుపోతున్న ఆమెను గుర్తించి స్థానికులు కేకలు వేశారు. కాపాడాలని అర్థించారు. అటుగా వెళుతున్న ట్రాఫిక్ ఎస్సై అర్జునరావు దీనిని గుర్తించారు. కాల్వలో కొట్టుకుపోతున్న మహిళను చూసి వెనుకాముందు ఆలోచించకుండా కాల్వలోకి దూకేశారు. ఈదుకుంటూ వెళ్లి మహిళను ఓడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. దీంతో మహిళ ప్రాణాలతో బయటపడింది. సమయానుకూలంగా ధైర్యసాహసాలతో వ్యవహరించి.. కాల్వలో కొట్టుకుపోతున్న మహిళను కాపాడిన ట్రాఫిక్ ఎస్సై అర్జునరావుపై పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆయన సాహసాన్ని డీజీపీ గౌతం సవాంగ్ ప్రత్యేకంగా కొనియాడారు. మహిళను కాపాడడమే కాకుండా ప్రాధమిక చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన ఎస్సై అర్జునరావుకు అభినందనలు తెలిపారు. ఆయన పేరును ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ మెడల్‌కు నామినేట్ చేస్తున్నట్టు తెలిపారు.