సాక్షి, తాడేపల్లి: కార్గిల్ అమర వీరులకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. విజయ దివస్ సందర్భంగా కార్గిల్ అమర వీరులను ఆయన స్మరించుకున్నారు.
‘‘వారి సంకల్పం, ధైర్యం, త్యాగంతో మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడారు. ఆ వీరుల అసాధారణ శౌర్యం తరతరాల పాటు అందరికీ స్ఫూర్తినిస్తుంది. మన సాయుధ దళాలకు నమస్కరిస్తూ.. మాతృభూమి సేవలో తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులకు నివాళులు. జైహింద్’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
On #KargilVijayDiwas, we pay our tribute to the brave soldiers whose unwavering resolve, unparalleled courage, and supreme sacrifice protected our nation’s sovereignty. Their extraordinary valor will forever inspire generations of Indians. We salute our Armed Forces and remember…
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 26, 2026


