సాక్షి,న్యూఢిల్లీ: సీజేపీ ఆందోళనల నేపథ్యంలోఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీమానా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందించారు. అలాగే తన లేఖ కాపీని మంత్రి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. అయితే ధర్మేంద్ర రాజీనామాకు దారితీసిన పరిస్థితులతో పాటు, 2018లో లైంగిక వేధింపుల ఆరోపణలతో అప్పటి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీనామా అంశం ఇపుడు నెట్టింట హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు దేశ వ్యతిరేక శక్తుల చేతిలోకి వెళ్లకుండా చూడటం, జాతీయ ఐక్యతను కాపాడటం తన బాధ్యత. భారతీయ విద్యార్థుల భవిష్యత్తు సుదీర్ఘ న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదని, వారు ప్రశాంతంగా తమ చదువులపై, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే గౌరవ ప్రధానమంత్రికి తన రాజీనామా లేఖను సమర్పించాను అని ధర్మేంద్ర ప్రధాన్ తన లేఖలో పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ హయాంలో ఒక మంత్రి ప్రజల లేదా విపక్షాల నిరసనల కారణంగా రాజీనామా చేయడం అత్యంత అరుదైన పరిణామం. గత చరిత్రను పరిశీలిస్తే, 2018 తరువాత అప్పటి కేంద్ర సహాయ మంత్రి ఎమ్‌జే అక్బర్ తన పదవికి రాజీనామా చేశారు.
ఇదీ చదవండి: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నెక్ట్స్ విద్యాశాఖ మంత్రి ఎవరు?
2018 ఎమ్‌జే అక్బర్
మోదీ హయాంలో వివాదాలు ఎదురైనప్పటికీ మంత్రులు రాజీనామా చేయరని, ప్రభుత్వం అహంకారంతో వ్యవహరిస్తుందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. అయితే #MeToo ఉద్యమంలో పలువురు మహిళా జర్నలిస్టులు లైంగిక వేధింపుల ఆరోపణలతో 2018లో కేంద్ర సహాయమంత్రిగా ఎమ్‌జే అక్బర్ రాజీనామా చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చిన అక్బర్, "ఆరోపణలు వైరల్ ఫీవర్‌లా మారాయి" అని వ్యాఖ్యానించారు. అయితే, వ్యక్తిగత హోదాలో కోర్టులో న్యాయపోరాటం చేసేందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు.
కాగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఉద్యమానికి, పరీక్షల వ్యవస్థలో సంస్కరణల కోసం జరుగుతున్న పోరాటానికి ఒక మైలురాయిగా నిలిచింది ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP), విద్యార్థి సంఘాలు చేపట్టిన సుదీర్ఘ నిరసనలకు ఈ రాజీనామా ఒక పెద్ద విజయంగా భావిస్తున్నారు.


