సీజేపీ ప్రభంజనం ఇలా మొదలైంది.. ఇది ఇక ఆగదు | Cockroach Janata Party (CJP): The Complete Story – From Protest to Victory as Dharmendra Pradhan Resigns | Sakshi
Sakshi News home page

సీజేపీ ప్రభంజనం ఇలా మొదలైంది.. ఇది ఇక ఆగదు

Jul 25 2026 4:30 PM | Updated on Jul 25 2026 4:46 PM

CJP From Protest to Victory Dharmendra Pradhan Resigns
  • యువత చేతిలో సోషల్ మీడియా ఆయుధం

  • దేశాన్ని కుదిపేసిన సీజేపీ ఉద్యమం

  • బొద్దింకలు అంటూ ఎగతాళి.. 

  • అదే పేరుతో దేశాన్ని షేక్ చేసిన యువత

  • ప్రభుత్వానికి నిద్రలేకుండా చేసిన బొద్దింకలు

వ్యంగ్యంగా పుట్టింది... విప్లవంగా మారింది. ఒక పోస్టుతో మొదలైన ఉద్యమం లక్షలాది యువత గొంతుకగా నిలిచింది. జంతర్ మంతర్ నుంచి దేశమంతా ప్రతిఘటన జ్వాలలు రగిలించి, అధికారాన్ని ప్రశ్నించే యువశక్తికి ప్రతీకగా ఎదిగింది. కాక్రోచ్ జనతా పార్టీ... యువత ఆగ్రహాన్ని జాతీయ ఉద్యమంగా మలిచిన విప్లవ చరిత్రగా నిలిచింది.

‘‘నిరుద్యోగులు బొద్దింకలు’’.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్ చేసిన ఈ వ్యాఖ్య సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. ఆ వ్యాఖ్య వల్లే కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) పుట్టుకొచ్చింది. సుప్రీంకోర్టులో మే 15న సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి బెంచ్ జరిపిన విచారణ సమయంలో దేశ నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్నజీవులతో పోల్చారు. 

దీనిపై సీజేఐ సూర్యకాంత్ వివరణ ఇచ్చినప్పటికీ ఆ వ్యాఖ్యల ప్రభావం ఏ మాత్రమూ తగ్గలేదు. అప్పట్లో తన వ్యాఖ్యల గురించి సూర్యకాంత్‌ మాట్లాడుతూ... మీడియా తన వ్యాఖ్యలను తప్పుగా రిపోర్ట్ చేసిందని తెలిపారు. తాను నిరుద్యోగులను బొద్దింక‌లతో పోల్చలేదని, నకిలీ డిగ్రీలతో లాయర్ వృత్తి, మీడియా, సోషల్ మీడియా వంటి వాటిలోకి వచ్చిన వారిని తప్పుబట్టానని చెప్పారు. 

ఓ పనికిమాలిన కేసులో విచారణ జరుపుతున్న సమయంలో చేసిన మౌఖిక వ్యాఖ్యలను మీడియా తప్పుగా చూపించిందని ఆయన తెలిపారు. వృత్తిలో... ఉపాధి దొరకని బొద్దింకల్లాంటి యువకులు ఉన్నారని సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. అటువంటివారే సోషల్ మీడియా, ఆర్‌టీఐ ఉద్యమాల వైపు వెళ్తున్నారని తెలిపారు తన వ్యాఖ్యల భావాన్ని వక్రీకరించారని సూర్యకాంత్ పలుసార్లు తెలిపినప్పటికీ ఆయన కామెంట్లను యువత సీరియస్‌గా తీసుకుంది.

‘‘బొద్దింకలు’’ కామెంట్లతో కాక్రోచ్‌ పార్టీ ఆవిర్భావం 
కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) పుట్టుకే విచిత్రంగా జరిగింది. ఇది సాంప్రదాయ రాజకీయ పార్టీ కాదు. ఇది వ్యంగ్య (సటైరికల్) ఉద్యమంగా ప్రారంభమై, తర్వాత దేశవ్యాప్తంగా విద్యార్థుల ఉద్యమానికి ప్రతీకగా మారింది. దీని ఆవిర్భావం, పరిణామం, ప్రభావం ఇలా ఉన్నాయి. 2026లో వరుసగా వెలుగులోకి వచ్చిన నీట్ ప్రశ్నపత్రం లీకులు, పరీక్షల నిర్వహణపై ఆరోపణలు, నిరుద్యోగ యువతలో పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో కొందరు యువ కార్యకర్తలు, సామాజిక మాధ్యమాల సృష్టికర్తలు కలిసి ఒక వ్యంగ్య రాజకీయ వేదికను ప్రారంభించారు.

ప్రజలు రాజకీయ పార్టీలపై నమ్మకం కోల్పోయారని, అవినీతి వ్యవస్థను ఎద్దేవా చేయాలనే ఉద్దేశంతో "కాక్రోచ్‌ జనతా పార్టీ" అనే పేరు పెట్టారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత అణచివేత జరిగినా ఉద్యమం ఆగదనే సంకేతంగా కాక్రోచ్‌ అనే పేరును పెట్టారు.

సీజేపీని ఎవరు ప్రారంభించారు? 
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే. ఆయన 30 ఏళ్ల రాజకీయ కమ్యూనికేషన్ వ్యూహకర్త. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్‌లో చదువుతున్న సమయంలోనే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 2026 మే 16న ఆయన ఎక్స్‌లో కేవలం ఆరు పదాలతో ఒక పోస్టు చేశారు. "What if all cockroaches come together?" ("బొద్దింకలంతా ఒక్కటైతే?") ఆ పోస్టు కొద్ది గంటల్లోనే వైరల్ అయింది. అదే సీజేపీ ఉద్యమానికి బీజం వేసింది.

ఆ తర్వాత ఏం జరిగింది?
ఢిల్లీకి చెందిన యూట్యూబర్ మేఘనాథ్‌ ఎస్ ఆ పోస్టును చూసి, మరో స్నేహితుడితో కలిసి కృత్రిమ మేధ సాయంతో "కాక్రోచ్ జనతా పార్టీ" పేరుతో ఒక వ్యంగ్య వెబ్‌సైట్ రూపొందించారు. అది లక్షలాది మంది యువతకు ఒక వేదికగా మారింది.

ఎక్స్ ఖాతాలో ఎంతమంది చేరారు?
ప్రారంభ రోజుల్లోనే సీజేపీ ఎక్స్ ఖాతాకు మిలియన్ల మందికి పైగా చేరారు. అనంతరం ప్రభుత్వ చర్యలతో ఆ ఖాతాను భారత్‌లో నిలిపివేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మరింత భారీ స్పందన వచ్చింది. కొన్ని రోజుల్లోనే 22 మిలియన్ మంది అనుచరులు చేరారు. ఆ తర్వాత అది 25 మిలియన్లకు పెరిగింది.

ఉద్యమంలో ప్రముఖంగా కనిపించిన వ్యక్తులు..

  • అభిజీత్ దిప్కే – వ్యవస్థాపకుడు, జాతీయ కన్వీనర్.

  • సోనం వాంగ్‌చుక్ – ఉద్యమానికి మద్దతుగా నిరాహార దీక్ష చేసిన పర్యావరణ ఉద్యమకారుడు.

  • మేఘనాథ్‌ ఎస్ – ఉద్యమాన్ని ఆన్‌లైన్‌లో వ్యాపించడంలో కీలక పాత్ర పోషించిన యూట్యూబర్.

  • నకుల్ ధుల్ – నిరసనలకు సంబంధించిన వీడియోలతో వైరల్ అయిన కంటెంట్ సృష్టికర్త.

  • ఆయేషా ఖాన్ – ఉద్యమానికి మద్దతుగా ప్రచారం చేసిన యువ కార్యకర్త.

మొదట సామాజిక మాధ్యమాల్లో చిన్న ప్రచారంగా మొదలైన సీజేపీ ఉద్యమం కొన్ని రోజుల్లోనే వేలాది మంది విద్యార్థులను ఆకర్షించింది. నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌, విద్యార్థుల ఆత్మహత్యల సమస్యను సీజేపీ ఎత్తిచూపింది. దీనికి పరిష్కారం కోసం విద్యార్థులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరసన ప్రారంభించారు.

వారి ప్రధాన డిమాండ్లు

  • సీజేపీ తాజాగా డిమాండ్ల జాబితా 

  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి (పూర్తైంది)

  • ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి – పెండింగ్

  • నిరసనల్లో పాల్గొన్న ఏ విద్యార్థిపైనా చర్యలు తీసుకోకూడదు – పెండింగ్

  • ఆర్‌ఏఎఫ్, ఢిల్లీ పోలీసులు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి – పెండింగ్.


ఉద్యమంలో కీలక పరిణామాలు

  • జంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థులు చేరారు.

  • "చలో పార్లమెంట్" పిలుపుతో భారీ ర్యాలీ చేపట్టారు.

  • ఢిల్లీ పోలీసులు పలుమార్లు నిరసనకారులను అడ్డుకున్నారు.

  • లాఠీచార్జ్, వాటర్‌ కానన్‌ల ప్రయోగం జరిగింది.

  • వందలాది మంది అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

  • జంతర్ మంతర్ పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.

  • కొన్ని సమయాల్లో మెట్రో స్టేషన్లు మూసివేశారు.

  • కొన్ని సమయాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు 

  • ప్రముఖుల మద్దతు దక్కింది

ఉద్యమానికి ప్రముఖుల మద్దతు 

  • పర్యావరణ ఉద‍్యమకారుడు సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేపట్టారు

  • సామాజిక కార్యకర్త అన్నా హజారే మౌన ఆందోళన నిర్వహించారు.

  • పలువురు ప్రతిపక్ష నాయకులు సంఘీభావం తెలిపారు.

  • దేశ విదేశాల్లోని విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి.

  • అంతర్జాతీయంగానూ స్పందన వచ్చింది


పాక్‌లోనూ ఇలా..

  • భారత్‌లో జరుగుతున్న ఈ నిరసనలు పాకిస్థాన్ సహా పలు దేశాల్లో చర్చనీయాంశమయ్యాయి.

  • పాకిస్థాన్‌కు చెందిన కొందరు పాత్రికేయులు, కంటెంట్ సృష్టికర్తలు భారత విద్యార్థుల ఉద్యమాన్ని ప్రశంసిస్తూ వీడియోలు విడుదల చేశారు.

  • "భారత్‌లో యువత ఇలా పోరాడుతోంది... మన దేశంలో ఎందుకు జరగడం లేదు?" అనే చర్చ పాకిస్థాన్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.


సీజేపీ ఏం సాధించింది? 

  • నీట్ ప్రశ్నపత్రం లీకుల అంశం జాతీయ చర్చగా మారింది.

  • పరీక్షల పారదర్శకతపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.

  • విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.

  • విద్యా వ్యవస్థలో సంస్కరణలపై విస్తృత చర్చ జరిగింది.

  • ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాయి.

  • దేశవ్యాప్తంగా విద్యార్థుల ఐక్యత పెరిగింది.

  • విదేశీ మాధ్యమాలు కూడా ఈ ఉద్యమాన్ని ప్రస్తావించాయి.

  • ఉద్యమం కోరిన అన్ని డిమాండ్లు నెరవేరాయి

  • ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు

  • పరీక్షా సంస్కరణలు వంటి డిమాండ్లు నెరవేరుతున్నాయి

  • విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు 

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా 
చివరకు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయడంతో సీజేపీ తొలి ప్రధాన డిమాండ్ నెరవేరింది. విద్యార్థుల ఉద్యమం దేశవ్యాప్తంగా ఒత్తిడి తీసుకురావడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రాజీనామాను తమ పోరాటానికి తొలి విజయంగా సీజేపీ ప్రకటించింది. మిగిలిన డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమం కొనసాగుతుందని సీజేపీ స్పష్టం చేసింది.

సీజేపీ ఎందుకు ప్రత్యేకం?
సాధారణ రాజకీయ పార్టీలా కాకుండా, వ్యంగ్యాన్ని ఆయుధంగా తీసుకుని యువతను పెద్ద ఎత్తున ఒక వేదికపైకి తీసుకురావడం సీజేపీ ప్రత్యేకత. సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగిస్తూ, నిరసనలను సృజనాత్మకంగా నిర్వహించడం వల్ల ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో కూడా దృష్టిని ఆకర్షించింది. ఇటువంటి ఉద్యమాలకు సాధారణంగానే అంతు అనేది ఉండదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement