కేంద్రానికి మా సత్తా ఏంటో చూపించాం: సీజేపీ | CJP on Dharmendra Pradhan resigned from his post | Sakshi
Sakshi News home page

కేంద్రానికి మా సత్తా ఏంటో చూపించాం: సీజేపీ

Jul 25 2026 3:04 PM | Updated on Jul 25 2026 3:33 PM

CJP on Dharmendra Pradhan resigned from his post

న్యూఢిల్లీ: కేంద్ర విద్యా శాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ‍ప్రధాన్‌ రాజీనామా చేయడంతో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) సభ్యులు సంబరాలు చేసుకున్నారు. ప్రజాస‍్వామ్యం గెలిచింది సీజేపీ నేతలు అన్నారు. కేంద్రానికి తమ సత్తా ఏంటో చూపించామని తెలిపారు. 

జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి రాజీనామాకు తమ ఉద్యమమే కారణమని చెప్పుకున్నారు. "మేము ఇది సాధించాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు" అని దీప్కే వ్యాఖ్యానించారు. "ఈ రాజీనామా ఒక రుజువు.. మీరు భయపడకపోతే, ఈ ప్రభుత్వం ముందు తలవంచకపోతే, ఎవరి రాజీనామాను అయినా మనం సాధించగలం" అని ఆయన అన్నారు.

కేంద్ర మంత్రి రాజీనామాతో NEET-UG వివాదం రాజకీయ మలుపు తీసుకుంది. తదుపరి విద్యాశాఖ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్నది, అలాగే పరీక్షా వ్యవస్థలో ప్రభుత్వం చేపట్టనున్న సంస్కరణలపై దేశవ్యాప్తంగా విద్యార్థి వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement