గుండెకు సొంత ‘మెదడు’.. సరికొత్త అధ్యయనంలో వెల్లడి! | Heart Has Its Own Mini Brain, Yale Scientists Discover Hidden Nerve Network Inside Human Organ, Check More Details Inside | Sakshi
Sakshi News home page

గుండెకు సొంత ‘మెదడు’.. సరికొత్త అధ్యయనంలో వెల్లడి!

Jul 25 2026 9:26 AM | Updated on Jul 25 2026 10:03 AM

Heart Has Its Own Brain Scientists Discover Hidden Nerve Network Inside Human Organ

మనిషి శరీరంలో అత్యంత కీలకమైన గుండె కేవలం మెదడు ఇచ్చే ఆదేశాల ప్రకారం మాత్రమే పనిచేయదని, దానికి సొంతంగా ఒక చిన్న నాడీ వ్యవస్థ (బ్రెయిన్) ఉంటుందని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో కనుగొన్నారు. అమెరికాలోని ప్రముఖ యేల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ సంచలన విషయాన్ని వెల్లడించారు. ఈ పరిశోధనా ఫలితాలు ప్రతిష్టాత్మక సైన్స్ జర్నల్ ‘సెల్’లో ప్రచురితమయ్యాయి.

సాధారణంగా గుండె అనేది మెదడు నుంచి వచ్చే సంకేతాలను స్వీకరించి పనిచేస్తుందని ఇప్పటివరకు భావిస్తుండేవారు. అయితే గుండె చుట్టూ ఉండే కొవ్వు కణజాలంలో ‘ఇంట్రిన్సిక్ కార్డియాక్ నెర్వస్ సిస్టమ్’ అనే ప్రత్యేకమైన నాడీ వ్యవస్థ ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. ఇది గుండె స్పందనలను స్థానికంగా నియంత్రించడంలో, తీవ్రమైన ఒత్తిడి సమయాల్లో ఆ అవయవాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ నాడీ వ్యవస్థలో ప్రధానంగా రెండు రకాల నరాల కణాలు (న్యూరాన్లు) ఉంటాయని పరిశోధకులు గుర్తించారు. వాటిలో ‘ఎన్‌పీవై’ (Npy+) న్యూరాన్లు గుండె వేగం మితిమీరకుండా నియంత్రిస్తాయని, ఈ కణాలు లేకపోతే గుండె ఆగిపోయే ప్రమాదం ఉందని తేలింది. ఇక రెండో రకమైన ‘డ్డాహ్1’ (Ddah1+) న్యూరాన్లు సాధారణ స్థితిలో నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ, శరీరం తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు గుండె సక్రమంగా పనిచేసేలా కాపాడటంలో అత్యంత కీలకమని నిరూపితమైంది. ఎలుకలపై జరిపిన ఈ ప్రయోగాల ఫలితాలు మానవులలో కూడా ఇదే రకమైన కణాలు ఉంటాయని సూచిస్తున్నాయి. ఈ సరికొత్త ఆవిష్కరణ భవిష్యత్తులో గుండె జబ్బుల చికిత్సకు నూతన మార్గాలను చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఆగస్టులో సూర్య, చంద్ర గ్రహణాలు.. భారత్‌పై ప్రభావం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement