అవును ఇది నిజమే.. వీటితో ఒత్తిడి అవుట్‌! | Anti-Anxiety Jewelry, Why Fidget Rings And Bracelets Are Becoming The Latest Stress Relief Trend | Sakshi
Sakshi News home page

అవును ఇది నిజమే.. వీటితో ఒత్తిడి అవుట్‌!

Jul 25 2026 9:25 AM | Updated on Jul 25 2026 10:02 AM

Health And Lifestyle Story On Relieving Anxiety With Anti Anxiety Jewelry

హెల్త్‌

త్తిడి నుంచి బయటపడటానికో, లేదంటే తగ్గించుకోవడానికో చాలామంది స్ట్రెస్‌ బాల్‌ కానీ, స్పిన్నర్‌ కానీ వాడుతుంటారు. ఇదే స్థానంలో జ్యువెలరీ చేరితే. అందానికి అందం..  ఒత్తిడి అవుట్‌. మానసిక ఆందోళన బయటకు కనిపించకుండా తగ్గించుకోవడానికి నేటి యువత  ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంటోంది. అదే యాంటీ–యాంగ్జైటీ జ్యువెల్లరీ. దీనినే ఫిడ్జెట్‌ జ్యువెలరీగా కూడా పిలుస్తారు.

స్పిన్నర్ల ఆధునిక, స్టైలిష్‌ రూపమే ఈ ఫిడ్జెట్‌ జ్యువెల్లరీ! రింగులు, చైన్లు, బ్రాస్‌లెట్ల రూపంలో లభించే ఈ ఆభరణాలు కేవలం అలంకారానికి మాత్రమే కాకుండా, మానసిక ప్రశాంతతను అందించే సాధనాలుగానూ ఉపయోగపడుతుండటంతో విపరీతంగా ట్రెండ్‌ అవుతున్నాయి. సాధారణ నగలకు భిన్నంగా, వీటిలో చిన్న΄ాటి కదలికలు ఉండేలా డిజైన్‌ చేస్తారు. ఈ ప్రత్యేకతే స్ట్రెస్‌ని తగ్గించడంలో తోడ్పడుతుంది.

స్పిన్నర్‌ రింగ్స్‌: ఉంగరానికి పైన ఉండే సన్నని బ్యాండ్‌ లేదా పూసలు వేలితో తిప్పేలా ఉంటాయి. తీవ్ర ఆందోళనలో ఉన్నప్పుడు వేళ్లతో వాటిని తిప్పడం వల్ల మనస్సు క్షణాల్లో వేరే వైపు మళ్లుతుంది.

బ్రీథింగ్‌ పెండెంట్లు: లాకెట్‌ లాంటి చిన్న ప్లాటినం లేదా స్టీల్‌ గొట్టాల డిజైన్‌తో వీటిని రూ΄÷ందిస్తారు. ఒత్తిడి పెరిగినప్పుడు సాధారణంగా ఊపిరి తీసుకుని, ఈ గొట్టం ద్వారా నెమ్మదిగా వదలడం వల్ల శరీరం వెంటనే ప్రశాంత స్థితికి చేరుకుంటుంది.

అరోమాథెరపీ జ్యువెల్లరీ: నూనెలను పీల్చుకునే లావా స్టోన్స్‌ కలిగిన ఈ నగలు, సువాసనల ద్వారా మనసును ఆహ్లాదపరుస్తాయి. ఒకప్పుడు కేవలం అలంకారానికే పరిమితమైన ఆభరణాలు, నేడు మానసిక ఆరోగ్యానికి సైతం తోడ్పడుతుండటం విశేషం. ఇవి ప్లాస్టిక్‌ బొమ్మల వలే కాకుండా గోల్డ్, సిల్వర్, స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌లో అత్యంత మినిమలిస్టిక్‌ డిజైన్లలో వస్తుండటంతో ఫ్యాషన్‌ ప్రేమికులనూ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement