breaking news
stress balls
-
అవును ఇది నిజమే.. వీటితో ఒత్తిడి అవుట్!
ఒత్తిడి నుంచి బయటపడటానికో, లేదంటే తగ్గించుకోవడానికో చాలామంది స్ట్రెస్ బాల్ కానీ, స్పిన్నర్ కానీ వాడుతుంటారు. ఇదే స్థానంలో జ్యువెలరీ చేరితే. అందానికి అందం.. ఒత్తిడి అవుట్. మానసిక ఆందోళన బయటకు కనిపించకుండా తగ్గించుకోవడానికి నేటి యువత ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంటోంది. అదే యాంటీ–యాంగ్జైటీ జ్యువెల్లరీ. దీనినే ఫిడ్జెట్ జ్యువెలరీగా కూడా పిలుస్తారు.స్పిన్నర్ల ఆధునిక, స్టైలిష్ రూపమే ఈ ఫిడ్జెట్ జ్యువెల్లరీ! రింగులు, చైన్లు, బ్రాస్లెట్ల రూపంలో లభించే ఈ ఆభరణాలు కేవలం అలంకారానికి మాత్రమే కాకుండా, మానసిక ప్రశాంతతను అందించే సాధనాలుగానూ ఉపయోగపడుతుండటంతో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. సాధారణ నగలకు భిన్నంగా, వీటిలో చిన్న΄ాటి కదలికలు ఉండేలా డిజైన్ చేస్తారు. ఈ ప్రత్యేకతే స్ట్రెస్ని తగ్గించడంలో తోడ్పడుతుంది.స్పిన్నర్ రింగ్స్: ఉంగరానికి పైన ఉండే సన్నని బ్యాండ్ లేదా పూసలు వేలితో తిప్పేలా ఉంటాయి. తీవ్ర ఆందోళనలో ఉన్నప్పుడు వేళ్లతో వాటిని తిప్పడం వల్ల మనస్సు క్షణాల్లో వేరే వైపు మళ్లుతుంది.బ్రీథింగ్ పెండెంట్లు: లాకెట్ లాంటి చిన్న ప్లాటినం లేదా స్టీల్ గొట్టాల డిజైన్తో వీటిని రూ΄÷ందిస్తారు. ఒత్తిడి పెరిగినప్పుడు సాధారణంగా ఊపిరి తీసుకుని, ఈ గొట్టం ద్వారా నెమ్మదిగా వదలడం వల్ల శరీరం వెంటనే ప్రశాంత స్థితికి చేరుకుంటుంది.అరోమాథెరపీ జ్యువెల్లరీ: నూనెలను పీల్చుకునే లావా స్టోన్స్ కలిగిన ఈ నగలు, సువాసనల ద్వారా మనసును ఆహ్లాదపరుస్తాయి. ఒకప్పుడు కేవలం అలంకారానికే పరిమితమైన ఆభరణాలు, నేడు మానసిక ఆరోగ్యానికి సైతం తోడ్పడుతుండటం విశేషం. ఇవి ప్లాస్టిక్ బొమ్మల వలే కాకుండా గోల్డ్, సిల్వర్, స్టెయిన్ లెస్ స్టీల్లో అత్యంత మినిమలిస్టిక్ డిజైన్లలో వస్తుండటంతో ఫ్యాషన్ ప్రేమికులనూ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. -
బీపీ... షుగరు... ట్రంపు!
ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక ప్రపంచానికి బీపీ, షుగర్, స్ట్రెస్ పట్టుకున్నాయి. ముఖ్యంగా అమెరికన్లకు! ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో, దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందోనని అమెరికన్లంతా ఆందోళనగా జీవితం గడుపుతున్నారు. అమెరికన్ శాస్త్రపరిశోధకులు కూడా బిక్కుబిక్కుమంటూ ల్యాబుల్లో కాలం గడుపుతున్నారు. ఈ పరిస్థితి గమనించిన యు.కె.రిసెర్చ్ కౌన్సిల్ అమెరికాలోని శాస్త్రవేత్తల కోసం ఆందోళనను తగ్గించే బంతులను (స్ట్రెస్ బాల్స్) తయారు చేసింది. ఆ బంతులపై ‘స్టే కామ్ అండ్ రిసెర్చ్’... ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి... అనే మెసేజ్ రాసి, రాణిగారి కిరీటాన్ని కూడా (రాయల్ క్రౌన్) ముద్రించింది. ఆ బంతులను గతవారం బోస్టన్లో జరిగిన శాస్త్ర పరిశోధకుల వార్షిక సమావేశానికి పంపి, తలా ఒక బంతి చేతిలో పెట్టించింది. వాటిని ఒత్తుకుంటూ కూర్చుంటే స్ట్రెస్ తగ్గుతుందట! లోకానికి ఏమిటీ కొత్త టెన్షన్ ట్రంప్ మహాశయా?!


