బీపీ... షుగరు... ట్రంపు!
ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక ప్రపంచానికి బీపీ, షుగర్, స్ట్రెస్ పట్టుకున్నాయి.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక ప్రపంచానికి బీపీ, షుగర్, స్ట్రెస్ పట్టుకున్నాయి. ముఖ్యంగా అమెరికన్‌లకు! ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో, దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందోనని అమెరికన్‌లంతా ఆందోళనగా జీవితం గడుపుతున్నారు. అమెరికన్ శాస్త్రపరిశోధకులు కూడా బిక్కుబిక్కుమంటూ ల్యాబుల్లో కాలం గడుపుతున్నారు. ఈ పరిస్థితి గమనించిన యు.కె.రిసెర్చ్ కౌన్సిల్ అమెరికాలోని శాస్త్రవేత్తల కోసం ఆందోళనను తగ్గించే బంతులను (స్ట్రెస్ బాల్స్) తయారు చేసింది.
ఆ బంతులపై ‘స్టే కామ్ అండ్ రిసెర్చ్’... ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి... అనే మెసేజ్ రాసి, రాణిగారి కిరీటాన్ని కూడా (రాయల్ క్రౌన్) ముద్రించింది. ఆ బంతులను గతవారం బోస్టన్‌లో జరిగిన శాస్త్ర పరిశోధకుల వార్షిక సమావేశానికి పంపి, తలా ఒక బంతి చేతిలో పెట్టించింది. వాటిని ఒత్తుకుంటూ కూర్చుంటే స్ట్రెస్ తగ్గుతుందట! లోకానికి ఏమిటీ కొత్త టెన్షన్ ట్రంప్ మహాశయా?!


